ప్రమాదమా.. వివాదమా ?
లావేరు: మండలంలోని అదపాక జంక్షన్ వద్ద చిలకలపాలెం గ్రామానికి చెందిన ట్రాక్టర్ యజమాని, డ్రైవర్ అయిన చిలక బాలరాజు అనే యువకుడు అనుమానాస్పదస్థితిలో ట్రాక్టర్ టైరు కిందపడి మృతి చెంది ఉన్నాడు. దీనిపై రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. బాలరాజును ఎవరో కావాలనే హత్య చేసి ట్రాక్టర్ టైరు కింద పెట్టారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాలు పరిశీలిస్తే... అదపాక జంక్షన్ వద్ద గల ఇజ్జాడ శివ అనే రైతు పొలంలో చెరువు మట్టి ట్రాక్టర్లతో వేయడానికి మండలంలోని రొంపివలస గ్రామానికి చెందిన ఒక వ్యక్తి కాంట్రాక్టు తీసుకున్నాడు.
విజయనగరం జిల్లా చీపురుపల్లి, ఆ మండలంలోని కర్లాం, పంకుపాలెం గ్రామాలకు చెందిన ప్రొక్లెరుున్, ట్రాక్టర్‌లను అద్దెకు తీసుకుని మట్టిని తరలిస్తున్నాడు. ఇదే పని నిమిత్తం చిలక బాలరాజు కూడా ట్రాక్టర్‌తో మట్టి తరలించేందుకు సోమవారం రాత్రి వెళ్లాడు. మంగళవారం ఉదయూనికి బాలరాజు తన సొంత ట్రాక్టర్ చక్రం కిందే వికతజీవుడై ఉన్నాడు. ఈ విషయంపై పోలీసులకు సమాచారం అందడంతో మంగళవారం ఉదయం లావేరు ఎస్‌ఐ జి.అప్పారావు, శ్రీకాకుళం డీఎస్పీ శ్రీనివాసరావు, రణస్థలం సీఐ కె.అశోక్‌కుమార్‌లు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ట్రాక్టరు టైరు కింద పడి చనిపోయి వున్న బాలరాజు మృతదేహన్ని వారు పరిశీలించారు. క్లూస్‌టీం, డాగ్ స్క్వాడ్‌లను రప్పించి సంఘటనా స్థలంలో వివరాలను సేకరించారు. మృతదేహానికి శవ పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు.
మా కొడుకును హత్య చేశారు: తల్లిదండ్రులు
తన కుమారుడు ట్రాక్టరు టైరు కింద పడి చనిపోలేదని తోటి ట్రాక్టరు డ్రైవర్లు, ప్రొక్లయినర్ డ్రైవర్లు కలిసి హత్య చేశారని మృతుడు బాలరాజు తల్లి పైడితల్లి తండ్ని మధు, చిలకపాలెం మాజీ ఎంపీటీసీ అప్పలరాజుతో పాటు, మృతుని బంధువులు ఆరోపించారు. బాలరాజును అదపాక జంక్షన్‌లో మట్టి తోడేందుకు ట్రాక్టర్లు తేవద్దని మిగతా ట్రాక్టర్లు డ్రైవర్లు సోమవారం రాత్రి హెచ్చరించి గొడవ పడ్డారని వారే బాలరాజును చంపేశారని వారు ఆరోపించారు. ప్రొక్లయినర్‌కు రక్తపు మరకలు ఉన్నాయని, అవే బాలరాజును హత్యచేసినట్లు ఆధారాలుగా సరిపోతాయన్నారు. మంగళవారం తెల్లవారుజాము 4.20 సమయంలో బాలరాజు అదపాక జంక్షన్ వద్ద మట్టి పని అయిపోయిందని ఇంటికి వచ్చేస్తున్నానని అతనికి సోదరుడు వరసైన వెంకటేష్‌కు చెప్పాడని ఆ వెంటనే ఫోను చేయగా ఫోన్ రింగ్ అయినా బాలరాజు ఫోను లిఫ్ట్ చేయలేదని చెప్పారు. బాలరాజు ట్రాక్టరు టైరు కింద పడి చనిపోతే సెల్‌ఫోన్ చేతిలో ఎందుకు ఉంటుందని హత్య చేసి అనంతరం ట్రాక్టరు టైరు కింద చనిపోయినట్లు పెట్టేశారని వారు ఆరోపించారు.
అనుమానస్పద మృతిగా కేసు నమోదు
ఈ సంఘటనపై అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సంఘటన స్థలంలో ఎటువంటి ఆధారాలు లభించలేదని శ్రీకాకుళం డీఎస్పీ శ్రీనివాసరావు తెలి పారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తరువాత దాని ఆధారంగా కేసును దర్యాప్తు చేస్తామన్నా రు. మృతుని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యా దు మేరకు పోలీసులు ప్రొక్లయినర్ డ్రైవర్లు, మిగతా ట్రాక్టర్లు డ్రైవర్లు, సూపర్‌వైజర్‌తో పాటు, తొమ్మిది మందిని అదుపులోకి తీసుకొని లావేరు పోలీసుస్టేషన్‌లో విచారిస్తున్నారు.
పెద్ద దిక్కుగా ఉంటాడనుకుంటే...
కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉంటూ కుటుంబాన్ని పోషిస్తున్న బాలరాజు మతి చెందడంతో మా కుటుంబ పోషణ ఇక ఎవరు చూస్తారంటూ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించారు. తాము ఏం పాపం చేశామని ఒక్కగానొక్క కుమారుడును భగవంతుడు దూరం చేశాడంటూ తల్లిదండ్రులు బోరున విలపించారు. చిలకపాలెం గ్రామస్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చి బాలరాజు మతదేహన్ని చూసి కంటతడి పెట్టారు. తల్లిదండ్రులు రోధిస్తున్న తీరును చూసి అందరిని కంటతడి పెట్టించాయి. పదో తరగతి వరకు చదువుకున్న బాలరాజు తండ్రి మధు అనారోగ్యానికి గురి కావడంతో కుటుంబాన్ని పోషించేందుకు చదువును మధ్యలోనే ఆపేశాడు. ఇటీవలే ట్రాక్టర్‌ను కొనుగోలు చేసి దాని ద్వారా వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని పోషిస్తున్నాడు.