రాజన్నా.. నిను మరువలేమన్నా
లావేరు: మండలంలోని అదపాక గ్రామంలో వైఎస్సార్‌సీపీ నాయకులు కార్యకర్తలు ఏర్పాటు చేసిన దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని వైఎస్ జయంతి సందర్బంగా మంగళవారం వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ ఆవిష్కరించారు. ముందుగా గ్రామంలో వైసీపీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు, డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ చేస్తానని ఎన్నికల్లో చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఆ మాటలు మరిచారని ఆయన విమర్శించారు. ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే మీసాల నీలకంఠంనాయుడు వైసీపీ ఎచ్చెర్ల సమన్వయకర్త గొర్లె కిరణ్‌కుమార్, రణస్థలం జెడ్పీటీసీ గొర్లె రాజగోపాల్, ఎచ్చెర్ల మార్కెట్ కమిటీ చైర్మన్ రొక్కం బాలక్రిష్ణ, రణస్థలం ఎఫ్‌ఎస్‌సీఎస్ అధ్యక్షడు బొంతు సూర్యనారాయణ పాల్గొన్నారు.
రాజన్న పాలనలోనే రాష్ట్రం సుబిక్షం : ధర్మాన ప్రసాదరావు
అరసవల్లి: వైఎస్ రాజశేఖరెడ్డి పాలనలోనే రాష్ట్రం ఎంతో సుబిక్షంగా ఉందని, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహనీయుడని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కొనియాడారు. మంగళవారం వైఎస్సార్ జయంతి సందర్బంగా వైఎస్సార్ కూడలిలో రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు నివాళులర్పించారు. కార్యక్రమంలో పార్టీ నేత రెడ్డి శాంతి, వైఎస్‌ఆర్‌సీపీ సీఈసీ సభ్యుడు అందవరపు సూరిబాబు, రాష్ట్ర పార్టీ మహిళా విభాగ సభ్యురాలు కామేశ్వరి, మాజీ మున్సిపల్ చైర్మన్‌లు అందవరపు వరం తదితరులు పాల్గొన్నారు.
పేదల అభివృద్ధికి కృషి చేసిన మహనీయుడు : ఎమ్మెల్యే కంబాల
రాజాం రూరల్: పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి నిరంతరం కృషి చేసిన మహనీయుడు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే కంబాల జోగులు అన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా పట్టణంలోని మాధవ బజార్ జంక్షన్‌లో వైఎస్‌ఆర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
వైఎస్సార్ లేని లోటు తీర్చలేనిది : ఎమ్మెల్యే కలమట
పాతపట్నం: ఆంధ్ర రాష్ట్రంలో గతంలో ఏ ముఖ్యమంత్రి అందించని సువర్ణ పాలన అందించిన ఘనత ఒక్క వైఎస్ రాజశేఖరరెడ్డికే దక్కుతుందని ఆయన లేని లోటు పూడ్చలేనిదని పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ అన్నారు. స్థానిక ఆసుపత్రి జంక్షన్ వద్ద రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. మండల కన్వీనర్ కొండాల అర్జునుడు, పార్టీ సీనియర్ నాయకులు గంగు వాసుదేవరావు, రేగేటి షణ్ముఖరావు, ఎరుకోల వెంకటరమణ, టి భుజంగరావు,జి లుట్టిబాబు, బంకి నరసయ్య, సిర్ల ప్రభాకరరావు, కొమరాపు రాము, బెన్న నాగేశ్వరరావు, బచ్చల వసంతరావు, నల్లి లక్ష్మణరావు, కనకల కర్రెన్న, ఇప్పిలి సింహాచలం, సిర్నిల్లి గురయ్య,రోణంకి లక్ష్మీపతి, శిష్టు తారకరామారావు, కొండాల ఎరకయ్య, అమర శ్రీరాములు, డకర సన్యాసి,ఎస్ గోవిందరాజులు,ఎస్ చిన్నయ్య, తేజ, జోగారావు, పాల్గొన్నారు.
రోగుల పళ్లు పంచిన ఎమ్మెల్యే కళావతి
పాలకొండ: పాలకొండ నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో జరిగిన వైఎస్సార్ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి పాల్గొన్నారు. పాలకొండ పట్టణం, మండలంతో పాటు వీరఘట్టం, భామిని, సీతంపేటలో వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పాలకొండ ఏరియా ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంచిపెట్టారు.