విజిలెన్స్ అధికారులు తమ దూకుడును కొనసాగిస్తున్నారు. అక్రమంగా ఇసుకను తరలిస్తున్న నిందితులపై దృష్టిసారించారు. జాతీయ రహదారిపై అనధికారికంగా
లావేరు, న్యూస్‌లైన్: విజిలెన్స్ అధికారులు తమ దూకుడును కొనసాగిస్తున్నారు. అక్రమంగా ఇసుకను తరలిస్తున్న నిందితులపై దృష్టిసారించారు. జాతీయ రహదారిపై అనధికారికంగా లారీలు, ట్రాక్టర్లతో ఇసుకను తరలిస్తున్న వారిపై శనివారం విజిలెన్స్ సీఐ ఎల్.రేవతమ్మ తన సిబ్బందితో దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న అయిదు లారీలు, ఒక ట్రాక్టరును పట్టుకొని సీజ్ చేశారు. శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వైపు అనధికారికంగా లారీలతోనూ, ట్రాక్టర్లతోనూ ఇసుకను తరలిస్తున్న విషయం తెలుసుకున్న విజిలెన్స్ సీఐ రేవతమ్మ తన సిబ్బందితో శనివారం సుభద్రాపురం జంక్షన్ వద్ద తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అయిదు లారీలు, ఒక ట్రాక్టరు పట్టుబడ్డాయి. పట్టుబడ్డ వాహనాలను లావేరు పోలీసుస్టేషన్‌కు అప్పగించారు. అనంతరం అనధికారికంగా ఇసుకను తరలిస్తున్న లారీలకు ఆర్టీఎ అధికారులు, మైన్స్ అధికారులు జరిమానాలు విధించారు. శనివారం మండలంలో విజిలెన్స్ సీఐ ఇసుక అక్రమ తరలింపుపై దాడులు నిర్వహించడంతో అక్రమార్కులు ఆందోళన చెందారు.