స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ శుక్రవారం అర్థరాత్రి తన చివరి మ్యాచ్ ఆడిన సంగతి తెలిసిందే. తన చిరకాల మిత్రుడు రఫేల్ నాదల్‌తో కలిసి డబుల్స్ మ్యాచ్ ఆడిన ఫెదరర్.. ఓటమితో కెరీర్‌ను ముగించాడు. కాగా మ్యాచ్ అనంతరం కెరీర్‌కు గుడ్‌బై చెబుతూ రోజర్ ఫెదరర్ కన్నీటి పర్యంతం కాగా.. పక్కనే ఉన్న నాదల్ కూడా తట్టుకోలేక ఏడ్చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫెదరర్, నాదల్‌ను అభిమానులు ఇలా చూడలేకపోయారు. ''మ్యాచ్‌లో మాత్రమే ప్రత్యర్థులు.. బయట మంచి మిత్రులు.. వీరి బంధం విడదీయలేనిది'' అంటూ కామెంట్స్ చేశారు.
తాజాగా ఇంగ్లండ్ సీనియర్ క్రికెటర్ స్టువర్ట్ బ్రాడ్.. ఫెడరర్, నాదల్ కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశాడు. వారి ఫోటో పక్కన బ్రాడ్ తనతో పాటు అండర్సన్ ఫోటోను పెట్టాడు. ''2053లో అండర్సన్ రిటైర్ అయితే నేను కూడా ఇలానే ఏడుస్తానేమో'' అంటూ క్యాప్షన్ జత చేశాడు. ఇంగ్లండ్ స్టార్ బౌలర్లుగా వెలుగొందుతున్న బ్రాడ్, అండర్సన్ మంచి మిత్రలు. ఇద్దరు దాదాపు ఒకే సమయంలో కెరీర్‌ను ఆరంభించారు.టెస్టు క్రికెట్‌లో పేసర్ల విభాగంలో అత్యధిక వికెట్లు తీసిన లీడింగ్ బౌలర్‌గా అండర్సన్ కొనసాగుతుండగా.. అతని వెనకాలే స్టువర్ట్ బ్రాడ్ ఉన్నాడు.
కాగా బ్రాడ్ షేర్ చేసిన ఫోటోపై అభిమానులు స్పందించారు.''ఫెడ్డీ, నాదల్‌లు టెన్నిస్‌లో మంచి మిత్రులైతే... మీరు క్రికెట్‌లో చిరకాల మిత్రులు.. మీ బంధం కూడా శాశ్వతంగా సాగిపోవాలి అని కోరుకుంటున్నా'' అంటూ పేర్కొన్నారు.
చదవండి: ఓటమితో కెరీర్‌కు వీడ్కోలు.. ఫెదరర్, నాదల్ కన్నీటీ పర్యంతం
Comments
Please login to add a commentAdd a comment