Stuart Broad
-
T20 WC 2024: టీ20 వరల్డ్‌కప్‌లో అత్యంత చెత్త రికార్డు..
టీ20 వరల్డ్‌కప్-2024ను కెనడా ఓటమితో ప్రారంభించింది. ఈ మెగా టోర్నీలో భాగంగా టెక్సాస్ వేదికగా యునైటైడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో కెనడా ఓటమి పాలైంది. 195 పరుగుల లక్ష్యాన్ని కెనడా బౌలర్లు కాపాడుకోలేకపోయారు.అమెరికా జట్టు 17.4 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. అమెరికా మిడిలార్డర్ బ్యాటర్లు ఆండ్రీస్ గౌస్(65), ఆరోన్ జోన్స్(94 నాటౌట్) మెరుపు అర్ధ సెంచరీలతో తమ జట్టుకు అద్బుతమైన విజయాన్ని అందించారు.చెత్త రికార్డు..ఈ మ్యాచ్‌లో కెనడా ఫాస్ట్ బౌలర్ జెరెమీ గోర్డాన్ అత్యంత చెత్త రికార్డును నమోదు చేశాడు. జెరెమీ గోర్డాన్‌ను ఆండ్రీస్ గౌస్, ఆరోన్ జోన్స్ ఊచకోత కోశారు. తొలి స్పెల్‌లో రెండు ఓవర్లు వేసిన జోర్డాన్ అద్బుతంగా బౌలింగ్ చేసి కేవలం 11 పరుగులు మాత్రమే ఇచ్చాడు. కానీ రెండో స్పెల్‌లో మాత్రం జోర్డాన్ పూర్తిగా తేలిపోయాడు.యూఎస్ఎ ఇన్నింగ్స్ 14వ ఓవర్ వేసిన జోర్డాన్.. ఏకంగా 33 పరుగులు సమర్పించుకున్నాడు. ఆ ఓవర్లో జోర్డాన్ రెండు నో బాల్స్, రెండు వైడ్స్‌తో సహా 3 సిక్స్‌లు, రెండు బౌండరీలు ఇచ్చాడు. తద్వారా టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో ఒకే ఓవర్లో అత్యధిక పరుగులిచ్చిన రెండో బౌలర్‌గా గోర్డాన్ నిలిచాడు. ఇప్పటివరకు ఈ రికార్డు అఫ్గానిస్తాన్ బౌలర్ ఇజ్రాతుల్లా దౌలత్‌జాయ్ పేరిట ఉండేది.2012 పొట్టి ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌పై దౌలత్‌జాయ్ ఒకే ఓవర్లో 32 పరుగులిచ్చాడు. ఇక ఈ చెత్త రికార్డు సాధించిన జాబితాలో ఇంగ్లండ్ మాజీ పేసర్ స్టువర్ట్ బ్రాడ్.. అగ్రస్ధానంలో ఉన్నాడు. 2007 టీ20 ప్రపంచకప్‌లో బ్రాడ్ బౌలింగ్‌లో టీమిండియా దిగ్గజం యువరాజ్ సింగ్ వరుసగా 6 సిక్స్‌లు బాది 36 పరుగులు రాబట్టాడు. ఈ మ్యాచ్‌లో గోర్డాన్ మరో 4 పరుగులిచ్చి ఉంటే బ్రాడ్‌ను అధిగిమించేవాడు. -
RCB vs LSG: 'గ్రీన్‌ను పక్కన పెట్టండి.. వారిద్దరిని జట్టులోకి తీసుకోండి'
ఐపీఎల్-2024 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కీలక పోరుకు సిద్దమైంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా మంగళవారం చిన్నస్వామి స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది. అయితే ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడిన ఆర్సీబీ.. కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది. మిగితా మూడు మ్యాచ్‌ల్లో ఘోర ఓటములను చవిచూసింది. ఆర్సీబీ జట్టులో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి, దినేష్ కార్తీక్ మినహా మిగితా అందరూ దారుణంగా విఫలమవుతున్నారు. కెప్టెన్ డుప్లెసిస్, మాక్స్వెల్, గ్రీన్ వంటి స్టార్ ఆటగాళ్లు తమ స్దాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నారు. బౌలింగ్‌లో కూడా ఆర్సీబీ పూర్తిగా తేలిపోతోంది. మరి లక్నోతో మ్యాచ్‌లో ఆర్సీబీకి ఏ మెరకు రాణిస్తుందో వేచి చూడాలి. ఈ నేపథ్యంలో ఆర్సీబీని ఉద్దేశించి ఇంగ్లండ్ మాజీ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆర్సీబీ వంటి స్టార్డమ్ జట్టు ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ ట్రోఫీని గెలవకపోవడం తనకు ఆశ్చర్యంగా ఉందని బ్రాడ్ తెలిపాడు. ఆర్సీబీపై చాలా మందికి భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. అందుకు కారణం వారు ఒక్కసారి కూగా టైటిల్‌ను గెలవకపోవడం. తొలి సీజన్ నుంచి ఆర్సీబీ జట్టులో అద్బుతమైన ఆటగాళ్లు ఉన్నప్పటికి ట్రోఫీని ఎందుకు గెలవలేకపోయిందో నాకు అర్ధం కావడం లేదు. డివిలియర్స్, గేల్ వరల్డ్ క్లాస్ బ్యాటర్లు ఆర్సీబీకి ఆడారు. విరాట్ కోహ్లి ఇంకా ఆర్సీబీతోనే ఉన్నాడు.. ప్రతీ సీజన్లోనూ విరాట్ తన వంతు న్యాయం చేస్తూనే ఉన్నాడు. ఈ ఏడాది కూడా కోహ్లి అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అతడు టీ20 ప్రపంచకప్ జట్టులో కూడా ఉండాలని నేను కోరుకుంటున్నాను. కానీ ప్రస్తుత సీజన్లో విరాట్ మినహా మిగితా ఏ బ్యాటర్ కూడా తమ స్ధాయికి తగ్గట్టు ప్రదర్శన చేయలేకపోతున్నారు. మాక్స్వెల్, ఫాప్ డుప్లెసిస్ తిరిగి ఫామ్‌లోకి రావాల్సిన అవసరం చాలా ఉంది. నావరకు అయితే ఆర్సీబీ బౌలింగ్ పరంగా చాలా వీక్‌గా ఉంది. వారు ఇద్దరు ఓవర్సీస్ బౌలర్లతో బరిలోకి దిగాలని నేను భావిస్తున్నాను. తదుపరి మ్యాచ్‌లకు లెఫ్ట్ ఆర్మ్ స్వింగ్ బౌలర్ రీస్ టోప్లీ ,లాకీ ఫెర్గూసన్‌లను తీసుకువస్తే బాగుంటుంది. కెమరూన్ గ్రీన్, జోషఫ్‌ను కొన్ని మ్యాచ్‌లకు పక్కనపెట్టాల్సిన అవసరముందని స్టార్ స్పోర్ట్స్ షోలో బ్రాడ్ పేర్కొన్నాడు. -
వారెవ్వా.. ఇన్నాళ్లూ ఎక్కడ దాక్కున్నావు?: సౌతాఫ్రికా దిగ్గజం
ఐపీఎల్ తాజా సంచలనం మయాంక్ యాదవ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ ‘ఢిల్లీ ఎక్స్‌ప్రెస్’ స్పీడుకు మాజీ క్రికెటర్లు ఫిదా అవుతున్నారు. ఇంగ్లండ్ దిగ్గజ పేసర్ స్టువర్ట్ బ్రాడ్.. మయాంక్ పేస్ నైపుణ్యాలు అద్భుతమని కొనియాడాడు. వేగంగా బంతిని విసరడంతో పాటు లైన్ అండ్ లెంగ్త్‌పై కూడా మయాంక్ పూర్తి నియంత్రణ కలిగి ఉండటం ముచ్చటగొలుపుతోందని బ్రాడ్ హర్షం వ్యక్తం చేశాడు. అతడు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలవడం పట్ల సాటి ఫాస్ట్‌బౌలర్‌గా ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నాడు. అంతేగాకుండా త్వరలోనే మయాంక్ టీమిండియాలో ఎంట్రీ ఇవ్వడం ఖాయమని.. రానున్న టెస్టు సిరీస్‌లో అతడు గనుక ఆడితే.. జాగ్రత్తగా ఉండాలని స్టీవ్ స్మిత్‌కు ఇప్పటికే సందేశం పంపినట్లు బ్రాడ్ పేర్కొన్నాడు. మరోవైపు.. సౌతాఫ్రికా స్పీడ్‌గన్ డేల్ స్టెయిన్ సైతం మయాంక్ యాదవ్ సూపర్‌ఫాస్ట్ డెలివరీలు చూసి ఆశ్చర్యచకితుడయ్యాడు. ‘‘గంటకు 155.8 కిలో మీటర్ల వేగం. మయాంక్ యాదవ్.. ఇన్నాళ్లూ ఎక్కడ దాక్కున్నావు!’’ అంటూ ఎక్స్ వేదికగా మయాంక్‌ను అభినందించాడు. ఇక భారత మాజీ బ్యాటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ సైతం ఢిల్లీ ఎక్స్‌ప్రెస్ అంటూ అతడిపై ప్రశంలస వర్షం కురిపించాడు. 𝗦𝗽𝗲𝗲𝗱𝗼𝗺𝗲𝘁𝗲𝗿 goes 🔥 𝟭𝟱𝟱.𝟴 𝗸𝗺𝘀/𝗵𝗿 by Mayank Yadav 🥵 Relishing the raw and exciting pace of the debutant who now has 2️⃣ wickets to his name 🫡#PBKS require 71 from 36 delivers Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL |… pic.twitter.com/rELovBTYMz — IndianPremierLeague (@IPL) March 30, 2024 155,8 KPH Mayank Yadav where have you been hiding! — Dale Steyn (@DaleSteyn62) March 30, 2024 కాగా ఐపీఎల్-2024లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ తరఫున 21 ఏళ్ల మయాంక్ యాదవ్ శనివారం అరంగేట్రం చేశాడు. పంజాబ్ కింగ్స్‌తో తన తొలి మ్యాచ్ ఆడిన ఈ రైటార్మ్ పేసర్.. సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. గంటకు 155.8 కిలో మీటర్ల వేగంతో బంతులు సంధిస్తూ ఐపీఎల్ తాజా ఎడిషన్‌లో ఫాస్టెస్ట్ డెలివరీని నమోదు చేశాడు. తన నాలుగు ఓవర్ల బౌలింగ్ కోటాలో కేవలం 27 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. సొంతమైదానంలో పంజాబ్‌పై లక్నో విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. కాగా మయాంక్ యాదవ్ దేశవాళీ క్రికెట్లో సొంత జట్టు ఢిల్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్ పదిహేడో ఎడిషన్‌లో తొలి మ్యాచ్‌లో ఓడిన లక్నో సూపర్ జెయింట్స్.. తాజాగా పంజాబ్‌పై 21 పరుగుల తేడాతో గెలుపొందింది. తదుపరి మంగళవారం ఆర్సీబీతో తలపడనుంది. చదవండి: #Mayank Yadav: నేను ఆరాధించే ఫాస్ట్ బౌలర్ ఆ ఒక్కడే: నయా ‘స్పీడ్‌గన్’ -
#MIvsGT: సూపర్ టాలెంట్.. బుమ్రాకు మాత్రమే సాధ్యం! వీడియో
#MIvGT- JASPRIT BUMRAH Super Spell Video: గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అదరగొట్టాడు. మ్యాచ్ ఫలితం ఎలా ఉన్నా ఈ పేస్ గుర్రం నైపుణ్యాలకు అభిమానులతో పాటు దిగ్గజ బౌలర్లు సైతం ఫిదా అయ్యారు. 0,0,0,4,0,వికెట్,1,0,1,0,0,0,వికెట్,1,వికెట్,0,0,1,1లెగ్‌బై,1,2,1,1,1 - నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు(3/14). గుజరాత్ టైటాన్స్‌తో ఆదివారం నాటి మ్యాచ్‌లో బుమ్రా అద్భుత స్పెల్‌ను చాటిచెప్పే గణాంకాలు. Just Bumrah Things 🤷♂️@Jaspritbumrah93 on target in his first over 👏#GT reach 47/1 after 6 overs Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱 Match Updates ▶️ https://t.co/oPSjdbb1YT #TATAIPL | #GTvMI pic.twitter.com/Zt6vIEa0me — IndianPremierLeague (@IPL) March 24, 2024 ఈ నేపథ్యంలో బుమ్రా ఆట తీరును ప్రశంసిస్తూ ఇంగ్లండ్ దిగ్గజ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ హర్షం వ్యక్తం చేశాడు. ముఖ్యంగా సాహాను బౌల్డ్ చేయడాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘తన ట్రేడ్‌మార్క్ స్కిల్ ఇది. పేస్‌తో బ్యాటర్‌ను ముప్పుతిప్పలు పెట్టగల సత్తా అతడి సొంతం. అత్యద్భుతమైన నైపుణ్యాలు, ప్రతిభ అతడికి ఉన్నాయి. అందుకే వ్యూహాలను పక్కాగా అమలు చేసి ప్రతిసారి విజయవంతమవుతాడు’’ అని బ్రాడ్.. బుమ్రాను కొనియాడాడు. 1️⃣ brings 2️⃣ Three wickets in the match for @Jaspritbumrah93 👏 Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱 Match Updates ▶️ https://t.co/oPSjdbb1YT#TATIPL | #GTvMI | @mipaltan pic.twitter.com/XXH33C7Yq6 — IndianPremierLeague (@IPL) March 24, 2024 కాగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఆరంభంలోనే ఓపెనర్ వృద్ధిమాన్ సాహా(19) అద్భుత రీతిలో బౌల్డ్ చేసిన బుమ్రా.. అనంతరం సాయి సుదర్శన్(45), డేవిడ్ మిల్లర్(12) రూపంలో కీలక వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక అహ్మదాబాద్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబై.. గుజరాత్ విధించిన 169 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడింది. ఆఖరి వరకు పోరాడి ఆరు పరుగుల స్వల్ప తేడాతో పరాజయం పాలైంది. తద్వారా ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా తొలిసారి బరిలోకి దిగిన హార్దిక్ పాండ్యాకు చేదు అనుభవం ఎదురైంది. మరోవైపు.. గుజరాత్ సారథిగా శుబ్‌మన్ గిల్ మాత్రం తొలి మ్యాచ్‌లోనే విజయం అందుకున్నాడు. చదవండి: #HardikPandya: హత్తుకునేందుకు వచ్చిన హార్దిక్.. మండిపడ్డ రోహిత్! పక్కనే అంబానీ.. -
కోహ్లి లేడు.. పుజారా కెరీర్ ముగిసినట్లేనా? ఎందుకీ దుస్థితి?
India vs England, 4th Test Day 2: టీమిండియా నయా వాల్‌గా పేరొందిన ఛతేశ్వర్ పుజారాను ఉద్దేశించి ఇంగ్లండ్ మాజీ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పుజారా లాంటి బ్యాటర్ జట్టులో ఉండి ఉంటే బాగుండేదన్నాడు. అతడు గనుక తుదిజట్టులో ఉండి ఉంటే నాలుగో టెస్టులో భారత్‌కు ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదన్నాడు. కాగా ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా రెండు టెస్టుల్లో గెలిచిన టీమిండియా 2-1తో ముందంజలో ఉంది. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య రాంచి వేదికగా శుక్రవారం నాలుగో టెస్టు మొదలైంది. ఈ మ్యాచ్‌లో ఫలితం తేల్చి సిరీస్ కైవసం చేసుకోవాలని రోహిత్ సేన పట్టుదలగా బరిలోకి దిగింది. అయితే, తొలిరోజు అందుకు తగ్గట్లుగానే ప్రణాళికలు అమలు చేసినా.. జో రూట్ అద్భుత ఇన్నింగ్స్(122 నాటౌట్)తో ఇంగ్లండ్‌కు మంచి ఆరంభం అందించాడు. ఈ నేపథ్యంలో శనివారం నాటి రెండో రోజు ఆటలో 353 పరుగులకు ఇంగ్లండ్‌ను ఆలౌట్ చేసింది టీమిండియా. అయితే, ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. బ్యాటింగ్ మొదలుపెట్టిన రోహిత్ సేన 177 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ 73 పరుగులతో రాణించగా.. ఆట పూర్తయ్యే సరికి 219/7 (73) స్కోరు వద్ద నిలిచింది. ఇంగ్లండ్ స్పిన్నర్లు షోయబ్ బషీర్ 4, టామ్ హార్లే రెండు.. పేసర్ జేమ్స్ ఆండర్సన్ ఒక వికెట్ దక్కించుకున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం.. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ కంటే 134 పరుగులు వెనుకబడి ఉంది. ఈ నేపథ్యంలో దిగ్గజ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ ఆసక్తికర ట్వీట్‌తో ముందుకు వచ్చాడు. స్పిన్ బౌలింగ్ ఆడటంలో టీమిండియా బ్యాటర్ల వైఫల్యాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘అనుభవజ్ఞుడైన, వరల్డ్‌క్లాస్ బ్యాటర్ కోహ్లి లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ పరిణామంలో టీమిండియా బ్యాటింగ్ లైనప్‌లో పుజారాను తిరిగి తీసుకురావాలనే తలంపు వస్తోందా? లేదంటే అతడి అంతర్జాతీయ కెరీర్ పూర్తిగా ముగిసిపోయినట్లేనా? ఒకవేళ ఈరోజు అతడు గనుక జట్టుతో ఉండి ఉంటే కచ్చితంగా పట్టుదలగా నిలబడి.. ఆంకర్ ఇన్నింగ్స్ ఆడేవాడు’’ అని స్టువర్ట్ బ్రాడ్ అభిప్రాయపడ్డాడు. కాగా జాతీయ జట్టులో చోటు దక్కకపోవడంతో రంజీ ట్రోఫీ టోర్నీ బరిలో దిగిన సౌరాష్ట్ర బ్యాటర్ పుజారా.. ప్రస్తుతం తమిళనాడుతో క్వార్టర్ ఫైనల్ ఆడుతున్నాడు. చదవండి: Ind Vs Eng 4th Test: ‘ఛీ.. ఛీ.. చీటింగ్‌కు కూడా వెనుకాడరు’.. ఇలా ఉన్నారేంట్రా బాబూ! With the experience & world class talent of Kohli missing, would there have been temptation to bring back Pujara into this India batting line up? Or is his international career over? Feels like he could have brought some consistency and an anchor ⚓️ — Stuart Broad (@StuartBroad8) February 24, 2024 -
అవమానం లాంటిదే: కోహ్లి ఆడకపోవడంపై స్టువర్ట్ బ్రాడ్ వ్యాఖ్యలు
Ind vs Eng Test Series 2024- Virat Kohli: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి గురించి ఇంగ్లండ్ మాజీ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లి లేకుండానే భారత్- ఇంగ్లండ్ మధ్య టెస్టులు జరగడం ఒకరకంగా సిరీస్‌కే అవమానం లాంటిదని వ్యాఖ్యానించాడు. కాగా వ్యక్తిగత కారణాల దృష్ట్యా విరాట్ కోహ్లి స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టులకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలుత రెండు మ్యాచ్‌ల నుంచి వైదొలిగిన అతడు.. సెలవు పొడిగించాలని బీసీసీఐని కోరడంతో.. బోర్డు అందుకు అంగీకరించింది. మిగిలిన మూడు టెస్టులకూ దూరం ఈ క్రమంలో మిగిలిన మూడు టెస్టులకు కోహ్లి సెలక్షన్‌కు అందుబాటులో లేని కారణంగా అతడిని ఎంపిక చేయలేదని తెలిపింది. నిజానికి కోహ్లి మూడో టెస్టు నుంచైనా తిరిగి వస్తాడని అభిమానులు ఆశగా ఎదురుచూశారు. ఇంగ్లండ్‌తో సొంతగడ్డపై మ్యాచ్ అంటే కోహ్లికి పూనకాలే అని.. అలాంటిది ఈసారి మాత్రం తన ఆటను మిస్సవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే, అంతకంటే ఎక్కువగా వారిని బాధిస్తున్న అంశం మరొకటి ఉంది. కోహ్లి ఆడకపోవడం సిరీస్‌కే అవమానం లాంటిది కోహ్లి ఈ సిరీస్‌కు దూరం కావడానికి గల అసలు కారణం ఇంతవరకు తెలియకపోవడంతో.. ఈ రన్‌మెషీన్‌కు ఏమై ఉంటుందా అని సందిగ్దంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ నేపథ్యంలో స్టువర్ట్ బ్రాడ్ తాజాగా IANS(వార్తా సంస్థ)తో మాట్లాడుతూ కోహ్లి గైర్హాజరీపై స్పందించాడు. ‘‘కోహ్లి లేకుండానే ఈ సిరీస్ జరగడం సిరీస్‌కే ఓ అవమానం లాంటిది. కోహ్లి నాణ్యమైన నైపుణ్యాలు గల బ్యాటర్. ఆట పట్ల అతడి అంకిత భావం అమోఘం. అతడిలోని ఫైర్ ప్రత్యర్థులకూ మజాను అందిస్తుంది. అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి ఏదేమైనా కొన్ని సందర్భాల్లో వ్యక్తిగత విషయాలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. అయితే, కోహ్లి జట్టులో లేకపోవడం యువ ఆటగాళ్లకు గొప్ప వరం లాంటిది. అతడి గైర్హాజరీలో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మున్ముందు మరిన్ని ఛాన్స్‌లు పొందే అవకాశం ఉంటుంది’’ అని ఇంగ్లండ్ దిగ్గజ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ అభిప్రాయపడ్డాడు. కాగా ఇంగ్లండ్ తరఫున 167 టెస్టులాడిన బ్రాడ్ 604 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే.. తాజా సిరీస్‌లో తొలి టెస్టులో ఇంగ్లండ్ గెలవగా.. రెండో టెస్టులో టీమిండియా గెలుపొంది సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఇరుజట్ల మధ్య ఫిబ్రవరి 15 నుంచి మూడో మ్యాచ్ ఆరంభం కానుంది. చదవండి: Adudam Andhra: విశాఖలో ముగింపు వేడుకలు.. -
Eng Vs NZ: వాళ్లిద్దరు లేరు కదా! బట్లర్ రిప్లై ఇదే! వీడియో వైరల్
ICC Cricket World Cup 2023- England vs New Zealand: వన్డే ప్రపంచకప్-2023 ఆరంభ మ్యాచ్ నేపథ్యంలో ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్‌కు వింత ప్రశ్న ఎదురైంది. ఓ రిపోర్టర్ తిక్క ప్రశ్నతో అతడిని ఆశ్చర్యపరిచాడు. అయితే, బట్లర్ మాత్రం హుందాగా సమాధానమిచ్చి అభిమానుల మనసు గెలుచుకున్నాడు. కాగా డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్- గత ఎడిషన్ రన్నరప్ న్యజిలాండ్ మధ్య మ్యాచ్‌తో గురువారం ప్రపంచకప్ టోర్నకి తెరలేవనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఇందుకు వేదిక. ఈ నేపథ్యంలో మ్యాచ్‌కు ముందు మీడియాతో మాట్లాడిన జోస్ బట్లర్‌కు ఇంగ్లండ్ జట్టు కూర్పు గురించి ప్రశ్న ఎదురైంది. వాళ్లిద్దరు లేరు కదా! ఓ జర్నలిస్టు.. వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్, మరో ఫాస్ట్‌బౌలర్ స్టువర్డ్ బ్రాడ్ లేకుండా ఈ మెగా టోర్నీలో బట్లర్ బృందం ఎలా ఆడబోతుందని ప్రశ్నించారు. ఇందుకు బదులుగా.. ‘‘నాకు తెలిసి జిమ్మీ ఇంకా సెలక్షన్‌కు అందుబాటులోనే ఉన్నాడనే అనుకుంటున్నా. 2015 నుంచి అతడు ఒక్క వన్డే కూడా ఆడలేదు. ఇక స్టువర్ట్ బ్రాడ్ రిటైర్ అయ్యాడు. కాబట్టి దురదృష్టవశాత్తూ ఈ ఇద్దరు ఈసారి ప్రతిష్టాత్మక ఈవెంట్లో భాగం కావడం లేదు. అయితే, మా జట్టులో మెరుగైన నైపుణ్యాలు గల మరికొంత మంది ఫాస్ట్‌బౌలర్లు ఉన్నారు. నవ్వు ఆపుకొన్న బట్లర్ స్పిన్నర్లు కూడా అందుబాటులో ఉన్నారు. మా జట్టు సమతూకంగా ఉంది’’ అంటూ బట్లర్ నవ్వులు చిందించాడు. ప్రశ్న అడిగిన వ్యక్తి నవ్వులపాలు కాకుండా చూశాడు. కాగా ఆండర్సన్ టెస్టులపై దృష్టిపెట్టే క్రమంలో 2015లో తన చివరి వన్డే ఆడాడు. ఆ ఏడాది వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియాతో వెల్లింగ్టన్లో 50 ఓవర్ల ఫార్మాట్లో ఆఖరి మ్యాచ్ ఆడేశాడు. అయితే, 41 ఏళ్ల వయసులోనూ రెడ్‌బాల్ క్రికెట్ జట్టులో కీలక సభ్యుడు కావడం విశేషం. ఇదిలా ఉంటే.. స్టువర్ట్ బ్రాడ్ సైతం ఎక్కువగా టెస్టులు ఆడే క్రమంలో 2016లోనే వన్డేలకు దూరమయ్యాడు. ఇక ఇటీవలే అతడు ఆటకు పూర్తిగా వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజా ఐసీసీ టోర్నమెంట్లో సదరు రిపోర్టర్ వీళ్లిద్దరి ప్రస్తావన తీసుకురాగా.. బట్లర్ ఈ విధంగా స్పందించాడు. ఇక 2019లో తొలిసారి ఇంగ్లండ్‌కు వరల్డ్‌కప్ అందించిన ఇయాన్ మోర్గాన్ వారసత్వాన్ని నిలబెట్టేక్రమంలో.. టీ20 ప్రపంచకప్ విజేత బట్లర్ భారత్‌లో తన వ్యూహాలు ఎలా అమలు చేస్తాడో చూడాలి! చదవండి: WC 2023: వన్డేల్లో ఇదే చివరి ప్రపంచకప్? ఆ బద్దకస్తులు అంతే! మనోళ్లు మాత్రం.. A journalist asked Jos Buttler in the PC if the absence of Anderson and Broad will affect their pace bowling in the tournament?Just look at him,he was trying so hard not to laugh 😂😭.#CWC23 Video Credit: @ICC Facebook pic.twitter.com/1rdOjglfEd — Delhi Capitals Fan (@pantiyerfc) October 4, 2023 -
చరిత్ర మరచిపోలేని రికార్డుకు 16 ఏళ్లు..!
క్రికెట్ చరిత్రలో సెప్టెంబర్ 19కి ఓ ప్రత్యేకత ఉంది. 2007లో ఈ రోజున టీమిండియా డాషింగ్ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాది చరిత్ర సృష్టించాడు. ఆ మ్యాచ్‌లో యువీ చేసిన 12 బంతుల హాఫ్ సెంచరీ నేటికీ పొట్టి క్రికెట్లో ఫాస్టెప్ట్ హాఫ్ సెంచరీగా కొనసాగుతుంది. సౌతాఫ్రికాలో జరిగిన తొట్టతొలి టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో యువీ ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్‌ను ఉతికి 'ఆరే'శాడు. వరుసగా ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాది క్రికెట్ ప్రపంచం మొత్తం నివ్వెరపోయేలా చేశాడు. యువీ సిక్సర్ల సునామీకి ముందు ఇంగ్లండ్ ఆటగాడు ఆండ్రూ ఫ్లింటాఫ్ అతనితో అనవసర గొడవకు దిగాడు. దీని ప్రభావం బ్రాడ్‌పై పడింది. ఫ్లింటాఫ్‌పై కోపాన్ని యువీ బ్రాడ్‌పై చూపించాడు. యువీ.. బ్రాడ్ బౌలింగ్‌ను ఊచకోత కోశాడు. కేవలం 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి, నేటికీ చెక్కుచెదరని టీ20 ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డును తన పేరిట నమోదు చేసుకున్నాడు. Look out in the crowd! On this day in 2007, @YUVSTRONG12 made #T20WorldCup history, belting six sixes in an over 💥 pic.twitter.com/Bgo9FxFBq6 — ICC (@ICC) September 19, 2021 ఆ ఇన్నింగ్స్‌లో మొత్తం 16 బంతులు ఎదుర్కొన్న యువరాజ్ కేవలం 14 నిమిషాలు క్రీజ్‌లో ఉండి 7 సిక్సర్లు, 3 ఫోర్ల సాయంతో 58 పరుగులు చేసి, ఫ్లింటాఫ్ బౌలింగ్‌లోనే ఔటయ్యాడు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. యువీకి ముందు గంభీర్ (58), సెహ్వాగ్ (68) సైతం అర్ధసెంచరీలతో రాణించారు. అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసి, లక్ష్యానికి 19 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఫలితంగా భారత్ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత బౌలర్లలో ఇర్ఫాన్ పఠాన్ 3 వికెట్లు పడగొట్టగా.. ఆర్పీ సింగ్ 2, హర్భజన్ సింగ్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఇదే మ్యాచ్ ప్రస్తుత భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మకు టీ20ల్లో తొలి మ్యాచ్ కావడం విశేషం. ఈ మెగా టోర్నీ ఫైనల్లో భారత్.. పాక్‌ను మట్టికరిపించి తొట్టతొలి టీ20 ఛాంపియన్‌గా అవతరించిన విషయం తెలిసిందే. -
ఇంగ్లండ్ క్రికెట్లో మరో వికెట్ డౌన్.. నెల రోజుల వ్యవధిలో నాలుగో ఆటగాడు
ఇంగ్లండ్ క్రికెట్లో మరో వికెట్ పడింది. నెల రోజుల వ్యవధిలో నాలుగో ఆటగాడు రిటైర్మెంట్ ప్రకటించాడు. యాషెస్ సిరీస్-2023 సందర్భంగా తొలుత స్టువర్ట్ బ్రాడ్, ఆతర్వాత మొయిన్ అలీ, కొద్ది రోజుల గ్యాప్‌లో ఇంగ్లండ్ టీ20 వరల్డ్‌కప్ విన్నర్ అలెక్స్ హేల్స్, తాజాగా త్రీ టైమ్ యాషెస్ సిరీస్ విన్నర్, బ్రాడ్ సహచరుడు, ఫాస్ట్ బౌలర్ స్టీవెన్ ఫిన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 2010లో అంతర్జతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన ఫిన్.. 2017 వరకు ఇంగ్లండ్ తరఫున మూడు ఫార్మాట్లలో ఆడాడు. ఈ మధ్య కాలంలో అతను మూడు సార్లు యాషెస్ సిరీస్ విన్నింగ్ టీమ్‌లో సభ్యుడిగా ఉన్నాడు. గతకొంతకాలంగా మోకాలి గాయంతో బాధ పడుతున్న ఫిన్.. తప్పనిసరి పరిస్థితుల్లో క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. తన రిటైర్మెంట్ తక్షణమే అమల్లోకి వస్తుందని ఫిన్ ఓ స్టేట్మెంట్ ద్వారా వెల్లడించాడు. గత ఏడాది కాలంగా మోకాలి గాయం బాధిస్తుందని, గాయంతో పోరాటంలో తాను ఓడిపోయానని, తప్పనిసరి పరిస్థితుల్లో క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు గుడ్‌బై చెబుతున్నానని ఫిన్ తన స్టేట్మెంట్లో పేర్కొన్నాడు. 2005లో మిడిల్సెక్స్ తరఫున కెరీర్‌ను ప్రారంభించిన ఫిన్.. 2010-16 మధ్యలో ఇంగ్లండ్ తరఫున 36 టెస్ట్‌లు ఆడి 125 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 5 సార్లు ఐదు వికెట్ల ఘనత సాధించాడు. 2011లో వన్డే అరంగ్రేటం చేసిన ఫిన్ 69 వన్డేల్లో 102 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 2 సార్లు 5 వికెట్ల ఘనత సాధించాడు. 2011-15 మధ్యలో 21 టీ20 ఆడిన ఫిన్ 27 వికెట్లు పడగొట్టాడు. టెస్ట్‌ల్లో ఫిన్ ఓ హాఫ్ సెంచరీ కూడా చేశాడు. కౌంటీల్లో 2005 నుంచి 2022 వరకు మిడిల్‌సెక్స్‌కు ఆడిన ఫిన్.. ఆతర్వాత ససెక్స్‌ను మారాడు. ససెక్స్ తరఫున ఫిన్ కేవలం 19 మ్యాచ్‌లే ఆడాడు. ససెక్స్‌కు ఆడుతుండగానే మోకాలి గాయం బారిన పడిన 34 ఏళ్ల ఫిన్, కెరీర్‌ను కొనసాగించలేక రిటైర్మెంట్ ప్రకటించాడు. -
ఆస్తమాను అధిగమించి.. ప్రపంచ క్రికెట్లో రారాజుగా! 600 వికెట్లతో..
దాదాపు పదహారేళ్ల క్రితం... 21 ఏళ్ల కుర్రాడికి అది కేవలం ఎనిమిదో అంతర్జాతీయ మ్యాచ్. ఉరకలెత్తే ఉత్సాహం మినహా తగినంత అనుభవం లేదు. ప్రత్యర్థిని తక్కువగా అంచనా వేసి ఆ మ్యాచ్‌ను ఒక సాధారణ మ్యాచ్‌లాగే చూశాడు. కానీ మైదానంలో ఆ రోజు అతనికి జీవితకాలం మరచిపోలేని చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఒకటి కాదు, రెండు కాదు ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు! వేసిన ప్రతి బంతినీ భారత స్టార్ బ్యాటర్ యువరాజ్ సింగ్ సిక్సర్‌గా మలుస్తుంటే ఆ మొహం రంగులు మారుతూ వాడిపోయింది. ఆ దెబ్బ నుంచి మానసికంగా కోలుకునేందుకు చాలా సమయం పట్టింది. బ్రాడ్ పేరు చెప్పగానే ప్రపంచవ్యాప్తంగా సగటు క్రికెట్ అభిమానులందరికీ ఆ మ్యాచ్ మాత్రమే గుర్తుకొస్తుంది. ఎప్పటికీ ఆ కాళరాత్రి వెంటాడుతూ ఉంటే మరో ఆటగాడి కెరీర్ ఎన్ని ఆటుపోట్లకు గురయ్యేదో! కానీ స్టూ్టవర్ట్ బ్రాడ్ మాత్రం నిరాశ చెందలేదు. ఉవ్వెత్తున మళ్లీ పైకి లేచి, క్రికెట్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని సృష్టించుకున్నాడు. ఆరు సిక్సర్ల దెబ్బ నుంచి కోలుకొని టెస్టుల్లో ఆరు వందల వికెట్లు సాధించే వరకు తన ప్రస్థానాన్ని కొనసాగించాడు. ‘ఆ రోజు అలా జరగకుండా ఉండాల్సింది. సహజంగానే నేనూ చాలా బాధపడ్డాను. అయితే వాస్తవానికి అది నాకు మరో రూపంలో మేలు చేసింది. పట్టుదలగా నిలబడి పోరాడేందుకు కావాల్సిన ధైర్యాన్ని ఇచ్చి నన్ను మానసికంగా దృఢంగా మార్చింది. ఈ రోజు ఆ స్థాయికి చేరానంటే నాటి మ్యాచ్ కూడా కారణం. చాలా మంది క్రీడాకారుల జీవితాల్లో ఇలాంటి రోజులు ఉంటాయి. అయితే మీరు ఎంత తొందరగా దానిని వెనక్కి తోసి పైకి దూసుకుపోగలరనేది ముఖ్యం. తండ్రి క్రిస్ బ్రాడ్‌తో స్టువర్ట్ ఆటలో ఆనందించే రోజుల కంటే బాధపడే రోజులే ఎక్కువగా ఉంటాయి. వాటిని అధిగమించగలిగితే మీరు గొప్ప రోజులు చూస్తారనేది నా నమ్మకం. ఇది నా విషయంలో నిజమైంది’... రిటైర్మెంట్ ప్రకటన సందర్భంగా ‘ఆరు సిక్సర్ల’ మ్యాచ్‌ను గుర్తు చేసుకుంటూ బ్రాడ్ చేసిన వ్యాఖ్య ఇది. టెస్టు క్రికెట్లో అతను సాధించిన ఘనత ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బ్రాడ్ గణాంకాలు చూస్తే అతని గొప్పతనం ఏమిటో అర్థమవుతుంది. 17 ఏళ్ల కెరీర్లో 167 టెస్టు మ్యాచ్‌లు... 604 వికెట్లు...అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ఐదో స్థానంతో అతను ఇప్పుడు ఆటను సగర్వంగా ముగించాడు. బ్యాటర్ నుంచి బౌలర్‌గా... స్టూవర్ట్ తండ్రి క్రిస్ బ్రాడ్ ఇంగ్లండ్ మాజీ క్రికెటర్. జాతీయ జట్టుకు 25 టెస్టులు, 34 వన్డేల్లో ప్రాతినిధ్యం వహించాడు. అయితే తండ్రి కారణంగా అతనికేమీ క్రికెట్‌పై అమాంతం ఆసక్తి పెరగలేదు. చిన్నప్పటి నుంచి బ్రాడ్ హాకీని ఇష్టపడ్డాడు. వివిధ వయో విభాగాల్లో రాణిస్తూ లీసెస్టర్‌షైర్ టీమ్‌కు గోల్ కీపర్‌గా వ్యవహరించాడు. ఇంగ్లండ్ యువ జట్టు సెలక్షన్ ట్రయల్స్‌లో కూడా పాల్గొన్నాడు. అయితే ఆ తర్వాత తండ్రి ప్రోత్సాహం, ఇతర మిత్రుల కారణంగా క్రికెట్ వైపు మళ్లాడు. తండ్రిలాగే ఓపెనింగ్ బ్యాట్స్‌మన్‌గా స్కూల్, కాలేజీ దశలో రాణిస్తూ వచ్చిన అతను లీసెస్టర్‌షైర్ బెస్ట్ యంగ్ బ్యాట్స్‌మన్ అవార్డును గెలుచుకున్నాడు. అయితే ఇక్కడా అతని కెరీర్ మళ్లీ మలుపు తిరిగింది. అయితే కాలేజీలు మారుతూ వచ్చిన దశలో బ్యాటర్‌గా కంటే పేస్ బౌలర్‌గా మంచి ప్రతిభ ఉన్నట్లు కోచ్‌లు గుర్తించారు. ఒకే విభాగంలో దృష్టి పెడితే భవిష్యత్తు బాగుంటుందనే సూచనతో పూర్తిగా బౌలింగ్ వైపు మళ్లిన అతను చివరకు ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ బౌలర్లలో ఒకరిగా నిలవడం విశేషం. ఫ్యామిలీతో స్టువర్ట్ సీనియర్ స్థాయికి... ఇంగ్లండ్ యువ క్రికెట్ జట్టును లయన్స్ పేరుతో పిలుస్తారు. ఆ టీమ్‌లో స్థానం దక్కడం అంటే మున్ముందు సీనియర్ టీమ్‌కు సిద్ధమైనట్లే లెక్క. ఏజ్ గ్రూప్ క్రికెట్లో నిలకడైన ప్రదర్శనతో బ్రాడ్ ఆ అవకాశం చేజిక్కించుకున్నాడు. శ్రీలంక, వెస్టిండీస్ యువ జట్లతో జరిగిన సిరీస్‌లలో రాణించడంతో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు అతనిపై మరింత నమ్మకం ఉంచింది. భవిష్యత్తు కోసం ఎంపిక చేసే 25 మంది సభ్యుల డెవలప్మెంట్ గ్రూప్‌లో కూడా బ్రాడ్‌కు చోటు దక్కింది. జాతీయ క్రికెట్ అకాడమీలో ఈ బృందానికి శిక్షణ ఇస్తున్నప్పుడు బ్రాడ్ ప్రతిభతో పాటు అతను కష్టపడే తత్త్వం, బౌలింగ్‌లో ప్రత్యేకత సెలక్టర్లను ఆకర్షించాయి. ఫలితంగా 20 ఏళ్ల వయసులో తొలి ఇంగ్లండ్ జట్టు తరఫున అంతర్జాతీయ మ్యాచ్‌లో అరంగేట్రం (టి–20ల్లో) చేసే అవకాశం దక్కింది. ఆ తర్వాత వన్డేల్లోనూ అడుగు పెట్టగా, మరి కొద్ది రోజులకే టెస్టు అవకాశం కూడా వెతుక్కుంటూ రావడం మూడు ఫార్మాట్లలో ఇంగ్లండ్ రెగ్యులర్ ఆటగాడిగా బ్రాడ్ స్థాయి పెరిగింది. తండ్రితో బ్రాడ్ చిన్నప్పటి ఫోటో పదునైన పేసర్‌గా.... కెరీర్ ఆరంభంలో మొహంలో ఇంకా వీడని పసితనపు ఛాయలు, రంగుల జుట్టుతో అమాయకత్వం దాటని ఆటగాడిగా అతను కనిపించేవాడు. కానీ ఇంగ్లండ్ టెస్టు క్రికెట్లో చరిత్రలో అత్యంత భీకరమైన ఫాస్ట్బౌలర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకునేందుకు బ్రాడ్‌కు ఎక్కువ సమయం పట్టలేదు. బౌలింగ్ సత్తాతో పాటు మొండి పట్టుదల, ఒక్కసారిగా ప్రత్యర్థిపై ఆధిపత్యం మొదలైతే ఆగని అతని తత్త్వం బ్రాడ్‌ను ప్రత్యేకంగా మార్చాయి. కెరీర్లో 100వ టెస్టు ఆడే సమయానికే బ్రాడ్ ఒకే స్పెల్‌లో ఐదేసి వికెట్లు సాధించిన ఘనతను ఏడుసార్లు నమోదు చేశాడు. పాకిస్తాన్‌తో 3–0తో ఘన విజయంలో కీలక పాత్ర, విండీస్, న్యూజిలాండ్‌లపై లార్డ్స్‌లో ఏడేసి వికెట్ల ప్రదర్శన, దక్షిణాఫ్రికా గడ్డపై ఆరు వికెట్ల ఇన్నింగ్స్, మాంచెస్టర్‌లో భారత్‌ను 6 వికెట్లతో కుప్పకూల్చి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచిన సమరం... ఇలా బ్రాడ్ కెరీర్లో ఎన్నో చిరస్మరణీయ ఘట్టాలు ఉన్నాయి. అతని సహజ నాయకత్వ లక్షణాలు బ్రాడ్‌ను టి20ల్లో కెప్టెన్‌గా పనిచేసే అవకాశం కల్పించాయి. యాషెస్‌లో అద్భుతం... టెస్టు క్రికెట్లో యాషెస్ సిరీస్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగే ఈ చిరకాల సమరం ఇరు జట్లు ఆటగాళ్ల కెరీర్‌ను నిర్దేశిస్తుందనేది వాస్తవం. హీరోలుగా మారినా, జీరోలుగా మారినా ఈ సిరీస్‌తోనే సాధ్యం. ఇలాంటి సిరీస్‌లో బ్రాడ్ తన ప్రత్యేకత ప్రదర్శించాడు. ఎన్నో మ్యాచ్‌లను ఒంటిచేత్తో గెలిపించి యాషెస్‌లో తనకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్నాడు. 2009–2023 మధ్య కాలంలో 40 యాషెస్ టెస్టులు ఆడిన బ్రాడ్ 153 వికెట్లతో ఇంగ్లండ్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. 2009 ఓవల్‌లో 5 వికెట్లు, ఆ తర్వాత బ్రిస్బేన్, లీడ్స్, చెస్టర్ లీ స్ట్రీట్లలో ఆరేసి వికెట్లు...ఇలా యాషెస్‌లో మధుర జ్ఞాపకాలెన్నో. అయితే బ్రాడ్ కెరీర్లో అత్యుత్తమ క్షణం 2015 యాషెస్‌లో వచ్చింది. సొంత మైదానం ట్రెంట్‌బ్రిడ్జ్‌లో జరిగిన మ్యాచ్‌లో కేవలం 9.3 ఓవర్లలో 15 పరుగులే ఇచ్చి 8 ఆస్ట్రేలియా వికెట్లు పడగొట్టిన తీరుకు హ్యట్సాఫ్. ఆ స్పెల్‌లో ఒక్కో బంతి ఒక్కో అద్భుతం. ఆ సమయంలో బ్రాడ్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ అతని కెరీర్లో బెస్ట్ పోస్టర్‌గా నిలిచిపోయాయి. ఆస్తమాను అధిగమించి... బ్రాడ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి మరో కోణం కూడా దాగి ఉంది. 2015లో అతను బయటకు చెప్పే వరకు దీని గురించి ఎవరికీ తెలీదు. బ్రాంకో పల్మనరీ డిస్ప్లాజియా (అస్తమా) అనే శ్వాసకోస వ్యాధితో అతను చిన్నతనంలో బాధపడ్డాడు. మూడు నెలల ముందుగా ప్రీ మెచ్యూర్ బేబీగా పుట్టడంతో అతని ఊపిరితిత్తులో ఒకటి పూర్తిగా అభివృద్ధి చెందకపోవడమే దీనికి కారణం. అయితే మందులతో పాటు క్రమశిక్షణ, ఆహార నియమాలతో అతను దీనిని అధిగమించగలిగాడు. ఒక పేస్ బౌలర్ ఇలాంటి సమస్యను దాటి రావడం అరుదైన విషయం. పుట్టిన సమయంలో తన ప్రాణాలు కాపాడిన జాన్ పేరును తన పేరు మధ్యలో చేరుస్తూ స్టూవర్ట్ జాన్ బ్రాడ్‌గా మార్చుకొని అతను కృతజ్ఞత ప్రకటించడం విశేషం. -
ఇంగ్లండ్ దిగ్గజ బౌలర్‌కు నైట్‌హుడ్.. ఇకపై "సర్" స్టువర్ట్ బ్రాడ్‌గా..!
కొద్ది రోజుల కిందట క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఇంగ్లండ్ పేస్ బౌలింగ్ దిగ్గజం స్టువర్ట్ బ్రాడ్‌కు అత్యున్నత గౌరవం దక్కనున్నట్లు తెలుస్తోంది. ప్రపంచ క్రికెట్‌కు, ముఖ్యంగా ఇంగ్లండ్ క్రికెట్‌కు చేసిన సేవలకు గాను బ్రాడ్‌కు నైట్‌హుడ్ ఇవ్వాలని యూకే ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. ప్రముఖ ఆంగ్ల పత్రిక డైలీ మెయిల్ నివేదిక ప్రకారం.. యూకే ఎంపీలంతా బ్రాడ్‌కు నైట్‌హుడ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారట. క్రికెట్ అభిమానులు, సాధారణ ప్రజల నుంచి కూడా ఈ డిమాండ్ ఎక్కువగా వినిపిస్తుందట. బ్రాడ్ నైట్‌హుడ్‌కు అర్హుడని యూకే ఆల్ పార్టీ పార్లమెంటరీ గ్రూప్ కూడా తీర్మానించిందట. ఇందుకు ఆ దేశ ప్రధాని రిషి సునక్ కూడా సుముఖంగా ఉన్నాడట. ఈ విషయాలను డైలీ మెయిల్ ఓ కథనంలో పేర్కొంది. ఒకవేళ బ్రాడ్‌కు నైట్‌హుడ్ ఇస్తే.. అతని పేరుకు ముందు "సర్" వచ్చి చేరుతుంది. క్రికెట్లో అతి తక్కువ మందికి ఈ గౌరవం దక్కింది. సర్ బిరుదు తొలుత ఇంగ్లండ్ ఆటగాడు ఫ్రాన్సిస్ ఎడెన్ లేసీ (1895-1946)కి దక్కింది. ఆతర్వాత క్రికెట్ దిగ్గజం, ఆసీస్ ఆటగాడు డాన్ బ్రాడ్‌మన్, జాక్ హాబ్స్ (ఇంగ్లండ్), లెన్ హటన్ (ఇంగ్లండ్), రిచర్డ్ హ్యాడ్లీ (న్యూజిలాండ్), గ్యారీ సోబర్స్ (విండీస్), కర్ట్లీ ఆంబ్రోస్ (విండీస్), అలిస్టర్ కుక్ (ఇంగ్లండ్), ఆండ్రూ స్ట్రాస్ (ఇంగ్లండ్) వంటి పలువురు క్రికెట్ దిగ్గజాలు నైట్‌హుడ్ దక్కించుకున్నారు. భారత క్రికెటర్లలో విజయనగరం మహారాజ్కుమార్కు నైట్‌హుడ్ దక్కినప్పటికీ, అతనికి క్రికెటేతర కారణాల చేత ఈ గౌరవం దక్కింది. కాగా, ఇటీవల ముగిసిన యాషెస్ సిరీస్-2023 ఆఖరి టెస్ట్, మూడో రోజు ఆట సందర్భంగా స్టువర్ట్ బ్రాడ్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో ఇంగ్లండ్ తొలి 2 టెస్ట్‌లు ఓడిపోయి వెనుకపడినప్పటికీ, ఆతర్వాత అనూహ్యంగా పుంజుకుని 2-2తో డ్రా చేసుకుంది. ఈ సిరీస్‌లో ఇంగ్లండ్ విజయాల్లో బ్రాడ్ కీలకపాత్ర పోషించాడు. 22 వికెట్లతో సెకెండ్ లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. బ్రాడ్ అంతర్జాతీయ కెరీర్లో తానెదుర్కొన్న చివరి బంతిని సిక్సర్‌గా, తాను సంధించిన చివరి బంతిని వికెట్‌గా మలిచి ఈ ఘనత సాధించిన ఏకైక క్రికెటర్‌గా చరిత్ర పుటల్లోకెక్కాడు. ఓవరాల్‌గా బ్రాడ్ టెస్ట్‌ల్లో ఐదో అత్యధిక వికెట్ టేకర్‌గా (604), ఓవరాల్‌గా ఏడో అత్యధిక వికెట్ టేకర్‌గానూ (847) రికార్డుల్లో నిలిచాడు. -
చివరి బంతికి సిక్స్.. వికెట్ కూడా! వారెవ్వా బ్రాడీ! వీడియో వైరల్
40 రోజుల పాటు క్రికెట్ అభిమానులను అలరించిన యాషెస్ సిరీస్‌కు ఎండ్ కార్డ్ పడింది. లండన్ వేదికగా జరిగిన యాషెస్ ఐదో టెస్టులో ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్ 49 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్ 2-2తో సమమైంది. అయితే గత సిరీస్‌ను గెలిచిన ఆసీస్ వద్దే ‘యాషెస్’ ఉండిపోనుంది. ఇక ఆఖరి రోజు 384 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు ఓవర్‌నైట్ స్కోరు 135/0తో రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఆస్ట్రేలియా 94.4 ఓవర్లలో 334 పరుగుల వద్ద ఆలౌటైంది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో ఉస్మాన్ ఖ్వాజా(72), డేవిడ్ వార్నర్(60), స్టీవ్ స్మిత్(54) పరుగులతో రాణించినప్పటికీ.. ఓటమి మాత్రం తప్పలేదు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ నాలుగు వికెట్లతో అదరగొట్టగా.. మొయిన్ అలీ మూడు, బ్రాడ్ రెండు వికెట్లు సాధించారు. కెరీర్లో చివరి వికెట్ ఇక ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ తన టెస్టు కెరీర్‌కు చిరస్మణీయ ముగింపు పలికాడు. తన కెరీర్లో చివరి టెస్టు మ్యాచ్ ఆడిన బ్రాడ్.. రెండు కీలక వికెట్లు పడగొట్టి తమ జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. క్రీజులో పాతుకుపోయిన ఆసీస్ బ్యాటర్ అలెక్స్ క్యారీని ఔట్ చేసి.. చారిత్రత్మక యాషెస్ సిరీస్‌ను సమం చేశాడు. ఆస్ట్రేలియా ఆఖరి రెండు వికెట్లు కూడా బ్రాడ్ సాధించినవే కావడం గమానార్హం. కాగా బ్రాడ్ ఫేర్వెల్ మ్యాచ్ చూడటానికి అతడి కుటంబ సభ్యులు స్టేడియంకి వచ్చారు. బ్రాడ్ తన కెరీర్ చివరి వికెట్ సాధించిగానే.. స్టాండ్స్‌లో ఉన్న అతడి కుటంబ సభ్యులు ఆనందంలో మునిగి తెలిపోయారు. కాగా అంతకుముందు ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 80 ఓవర్లోఆఖరి బంతిని బ్రాడ్ అద్భుతమైన సిక్సర్ మలిచాడు. అదే అతడి కెరీర్లో చివరి బంతి కావడం గమానర్హం. అదే విధంగా బౌలింగ్‌లో కూడా ఆఖరి బంతిని వికెట్‌తోనే ముగించడం విశేషం. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రికార్డుల రారాజు.. కెరీర్లో 167 టెస్ట్‌లు, 121, వన్డేలు, 56 టీ20లు ఆడిన బ్రాడ్ ఎన్నో రికార్డులను నమోదు చేశాడు. టెస్ట్‌ల్లో అత్యధిక వికెట్లు (604) తీసిన బౌలర్ల జాబితాలో ఐదో స్థానంలో నిలిచిన బ్రాడ్ బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ పలు రికార్డులు నెలకొల్పాడు. టెస్ట్‌ల్లో బ్రాడ్ 244 ఇన్నింగ్స్‌లు ఆడి 3662 పరుగులు చేశాడు. ఇతని ఖాతాలో సెంచరీ (169), 13 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. చదవండి: ENG vs AUS: ఆఖరి మజిలీలో ఇంగ్లండ్‌దే విక్టరీ.. విజయంతో బ్రాడ్ విడ్కోలు A fairytale ending for a legend of the game. Broady, thank you ❤️ #EnglandCricket | #Ashes pic.twitter.com/RUC5vdKj7p — England Cricket (@englandcricket) July 31, 2023 -
ఒకే ఓవర్లో 6 సిక్సర్లు! రియల్ లెజెండ్ అంటూ బ్రాడ్‌పై యువీ ట్వీట్.. వైరల్
Yuvraj Singh Tweet On Stuart Broad Retirement: ‘‘టేక్ ఏ బో.. స్టువర్ట్ బ్రాడ్! టెస్టుల్లో అసాధారణ రీతిలో సాగింది నీ ప్రయాణం. అందుకు నా అభినందనలు. రెడ్ బాల్ క్రికెట్లో బ్యాటర్లను భయపెట్టే అత్యద్భుతమైన బౌలర్లలో ఒకడివి నువ్వు. నువ్వు.. రియల్ లెజెండ్. నీ సుదీర్ఘ ప్రయాణం సాఫీగా సాగడానికి ఆట పట్ల నీకున్న అంకితభావమే కారణం. సూపర్ ఇన్స్పైరింగ్. నీ జీవితంలోని తదుపరి దశకు గుడ్‌లక్ బ్రాడీ!!’’ అంటూ టీమిండియా దిగ్గజ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ భావోద్వేగపూరిత ట్వీట్ చేశాడు. 17 ఏళ్ల కెరీర్‌కు గుడ్‌బై ఇంగ్లండ్ వెటరన్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన నేపథ్యంలో అతడికి ట్విటర్ వేదికగా అభినందనలు తెలిపాడు. ఈ సందర్భంగా అతడితో ఉన్న అరుదైన ఫొటోను యువీ అభిమానులతో పంచుకున్నాడు. కాగా 17 ఏళ్ల కెరీర్‌కు స్వస్తి పలుకుతూ స్టువర్డ్ బ్రాడ్ ఇంటర్నేషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. పీడకలను మిగిల్చిన యువీ ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్-2023లో భాగంగా ఆస్ట్రేలియాతో ఓవల్‌లో జరుగుతున్న ఐదో టెస్టు తనకు చివరిదని పేర్కొన్నాడు. కాగా అంతర్జాతీయ టెస్టుల్లో 600 దాకా వికెట్లు తీసిన స్టువర్ట్ బ్రాడ్ 2016లోనే వన్డేలకు దూరమయ్యాడు. ఇక 2014లో ఇంగ్లండ్ తరఫున చివరి టీ20 ఆడిన బ్రాడ్‌కు.. యువరాజ్ సింగ్ ఓ పీడకలను మిగిల్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. అంతర్జాతీయ టీ20లలో 2006లో అడుగుపెట్టిన బ్రాడ్.. 2007లో పొట్టిఫార్మాట్లో జరిగిన మొట్టమొదటి ప్రపంచకప్ ఈవెంట్లో భాగమయ్యాడు. ఈ క్రమంలో టీమిండియాతో మ్యాచ్ అతడికి కోలుకోలేని షాకిచ్చింది. బ్రాడ్ బౌలింగ్‌లో ఒకే ఓవర్లో యువరాజ్ సింగ్ ఆరు సిక్సర్లు కొట్టి ప్రపంచ రికార్డు సాధించి అతడికి కాళరాత్రిని మిగిల్చాడు. అందుకే వైరల్‌గా యువీ ట్వీట్ ఈ నేపథ్యంలో యువరాజ్ సింగ్.. 37 ఏళ్ల స్టువర్ట్ బ్రాడ్‌ను ఉద్దేశించి ఈ మేరకు లెజెండ్ అంటూ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. కాగా తన ఇంటర్నేషనల్ కెరీర్లో బ్రాడ్ మూడు ఫార్మాట్లలో కలిపి 850 వికెట్ల దాకా పడగొట్టాడు. ఇంగ్లండ్ మేటి పేసర్లలో ఒకడిగా గుర్తింపు పొందాడు. చదవండి: పిచ్చి ప్రయోగాలకు చెక్.. జట్టులోకి జట్టులోకి వారిద్దరూ! 9 ఏళ్ల తర్వాత Take a bow @StuartBroad8 🙇🏻♂️ Congratulations on an incredible Test career 🏏👏 one of the finest and most feared red ball bowlers, and a real legend! Your journey and determination have been super inspiring. Good luck for the next leg Broady! 🙌🏻 pic.twitter.com/d5GRlAVFa3 — Yuvraj Singh (@YUVSTRONG12) July 30, 2023 -
పోతూ పోతూ రికార్డుల్లోకెక్కిన స్టువర్ట్ బ్రాడ్.. సిక్సర్‌తో..!
దిగ్గజ ఫాస్ట్ బౌలర్, ఇంగ్లండ్ ఆల్‌టైమ్ గ్రేట్ స్టువర్ట్ బ్రాడ్ తన కెరీర్లో చివరాఖరి మ్యాచ్‌లో ఓ రికార్డు నమోదు చేశాడు. 37 ఏళ్ల బ్రాడీ అంతర్జాతీయ కెరీర్లో తానెదుర్కొన్న ఆఖరి బంతిని సిక్సర్‌గా మలిచి రికార్డుల్లోకెక్కాడు. ఈ క్రమంలో బ్రాడ్ టెస్ట్‌ల్లో ఇంగ్లండ్ తరఫున అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో ఐదో స్థానానికి ఎగబాకాడు. కెరీర్లో 167 టెస్ట్‌లు ఆడిన బ్రాడ్ 55 సిక్సర్లు బాది బెన్ స్టోక్స్ (124), కెవిన్ పీటర్సన్ (81), ఆండ్రూ ఫ్లింటాఫ్ (78), ఇయాన్ బోథమ్ (67) తర్వాతి స్థానాల్లో నిలిచాడు. Most sixes for England in Tests: 124* - Ben Stokes 81 - K Pietersen 78 - A Flintoff 67 - I Botham 55 - Stuart Broad@StuartBroad8 ends his Test career with fifth-most sixes for Englandpic.twitter.com/xLrFzLqIcd — CricTracker (@Cricketracker) July 30, 2023 ఆఖరి టెస్ట్ కావడంతో బ్యాటింగ్‌కు దిగే ముందు ఆసీస్ ఆటగాళ్ల నుంచి గార్డ్ ఆఫ్ హానర్ అందుకున్న బ్రాడ్.. అభిమానుల కేరింతలు, చప్పట్ల ధ్వనుల మధ్య క్రీజ్‌లోకి వచ్చాడు. వచ్చీ రాగానే (నాలుగో రోజు తొలి ఓవర్ ఆఖరి బంతి) స్టార్క్ బౌలింగ్‌లో సిక్సర్ బాది స్టేడియంలో ఉన్నవారిని ఉర్రూతలూగించాడు. Australia wins hearts with their gesture.pic.twitter.com/5ewxALuy44 — CricTracker (@Cricketracker) July 30, 2023 అనంతరం మర్ఫీ వేసిన ఆ మరుసటి ఓవర్లో ఆండర్సన్ ఎల్బీడబ్ల్యూగా ఔట్ కావడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 395 పరుగుల వద్ద ముగిసింది. కెరీర్లో ఆఖరి ఇన్నింగ్స్‌లో బ్రాడ్ (8, సిక్స్) నాటౌట్‌గా మిగిలాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ సాధించిన స్వల్ప లీడ్‌ను తీసేస్తే ఆ జట్టు టార్గెట్ 384 పరుగులైంది. ఛేదనకు దిగిన ఆసీస్.. నాలుగో రోజు లంచ్ విరామం సమయానికి 24 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 75 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖ్వాజా (39), డేవిడ్ వార్నర్ (30) క్రీజ్‌లో ఉన్నారు. ఆసీస్ విజయానికి 309 పరుగులు, ఇంగ్లండ్ గెలుపుకు 10 వికెట్లు కావాలి. కాగా, కెరీర్లో 167 టెస్ట్‌లు, 121, వన్డేలు, 56 టీ20లు ఆడిన బ్రాడ్ ఎన్నో రికార్డులను కొల్లగొట్టాడు. టెస్ట్‌ల్లో అత్యధిక వికెట్లు (602) తీసిన బౌలర్ల జాబితాలో ఐదో స్థానంలో నిలిచిన బ్రాడ్ బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ పలు రికార్డులు నెలకొల్పాడు. టెస్ట్‌ల్లో బ్రాడ్ 244 ఇన్నింగ్స్‌లు ఆడి 3662 పరుగులు చేశాడు. ఇతని ఖాతాలో సెంచరీ (169), 13 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. -
స్టువర్ట్ బ్రాడ్‌కు జీవితాంతం గుర్తుండిపోయే క్షణాలు..
యాషెస్ సిరీస్ 2023 చివరి టెస్ట్ సందర్భంగా క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు సంచలన ప్రకటన చేసిన ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్‌కు తన కెరీర్లో చివరిసారి బ్యాటింగ్‌కు దిగిన సందర్భంగా ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఘనంగా మైదానంలోకి స్వాగతం పలికారు. నాలుగో రోజు ఆట ప్రారంభానికి ముందు బ్రాడ్.. తన చిరకాల సన్నిహితుడు ఆండర్సన్‌తో కలిసి బరిలోకి దిగుతుండగా, ఆసీస్ క్రికెటర్ల నుంచి బ్రాడ్ గార్డ్ ఆఫ్ హానర్ అందుకున్నాడు. Australia wins hearts with their gesture.pic.twitter.com/5ewxALuy44 — CricTracker (@Cricketracker) July 30, 2023 ఆసీస్ ఆటగాళ్లు ఇరువైపులా నిలబడి చప్పట్లతో బ్రాడ్‌ను మైదానంలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బ్రాడ్.. ఇవాళ (జులై 30) పుట్టినరోజు జరుపుకుంటున్న ఆండర్సన్‌ను కూడా తనతో పాటు మైదానంలోని అడుగుపెట్టాలని బలవంతం చేశాడు. అయితే ఇందుకు ఒప్పుకోని ఆండర్సన్, బ్రాడ్ ఒక్కడినే మైదానంలోకి సాగనంపాడు. Who's cutting onions? 🥺🥺pic.twitter.com/6wEoLEpp9Q — CricTracker (@Cricketracker) July 30, 2023 బ్రాడ్ మైదానంలోకి అడుగుపెడుతున్న సమయంలో ఆసీస్ ఆటగాళ్లతో పాటు స్టేడియంలో ఉన్నవారంతా లేచి నిలబడి చప్పట్లతో దిగ్గజ ఫాస్ట్ బౌలర్‌కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బ్రాడ్ భావోద్వేగానికి లోనైనట్లు కనిపించాడు. ఇంగ్లండ్ తరఫున సుదీర్ఘ టెస్ట్ కెరీర్ కలిగిన బ్రాడ్‌కు ఈ క్షణాలు చిరకాలం గుర్తుండిపోతాయి. అభిమానుల కేరింతలు, చప్పట్ల ధ్వనుల మధ్య క్రీజ్‌లోకి వచ్చిన బ్రాడ్.. వచ్చీ రాగానే (నాలుగో రోజు తొలి ఓవర్ ఆఖరి బంతి) స్టార్క్ బౌలింగ్‌లో సిక్సర్ బాది స్టేడియంలో ఉన్నవారిని ఉర్రూతలూగించాడు. అనంతరం మర్ఫీ వేసిన ఆ మరుసటి ఓవర్లో ఆండర్సన్ ఎల్బీడబ్ల్యూగా ఔట్ కావడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 395 పరుగుల వద్ద ముగిసింది. కెరీర్లో ఆఖరి ఇన్నింగ్స్‌లో బ్రాడ్ (8) నాటౌట్‌గా మిగిలాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ సాధించిన స్వల్ప లీడ్‌ను తీసేస్తే ఆ జట్టు టార్గెట్ 384 పరుగులైంది. అనంతరం ఛేదనకు దిగిన ఆసీస్.. నాలుగో రోజు లంచ్ విరామం సమయానికి 24 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 75 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖ్వాజా (39), డేవిడ్ వార్నర్ (30) క్రీజ్‌లో ఉన్నారు. ఆసీస్ విజయానికి 309 పరుగులు, ఇంగ్లండ్ గెలుపుకు 10 వికెట్లు కావాలి. -
ప్రీ మెచ్యూర్ బేబీ.. ఊపిరి తీసుకోవడమే కష్టం! అయినా క్రికెట్ ప్రపంచంలో రారాజు
ప్రపంచక్రికెట్లో మరో శకం ముగిసింది. ఇంగ్లండ్ దిగ్గజం, స్టార్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ అంతర్జాతీయ క్రికెట్‌కు క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్ ఆఖరి టెస్టు అనంతరం అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకున్నట్లు అతడు వెల్లడించాడు. 2006లో అంతర్జాతీయ క్రికెట్ ఆరంగ్రేటం చేసిన స్టువర్ట్ బ్రాడ్...తన 17 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో ఎన్నో మైలురాయిలను అందుకున్నాడు. అయితే ఒక సాధారణ స్ధాయి నుంచి ఇంగ్లండ్ లెజెండ్‌గా ఎదిగిన బ్రాడ్ నవ్వుల వెనుక గుండెలను పిండేసే వ్యథ దాగి ఉంది. ప్రీ మెచ్యూర్ బేబీ.. ఇంగ్లండ్ క్రికెట్ రారాజుగా ఎదిగిన బ్రాడ్ తన పుట్టకతోనే చావు అంచుల దాకా వెళ్లాడు. బ్రాడ్ ఒక ప్రీ మెచ్యూర్ బేబీ. తన తల్లికి నెలల నిండకముందే బ్రాడ్ జన్మించాడు. 12 వారాల ముందుగానే భూమిపైకి వచ్చాడు. అంటే వాళ్ల అమ్మ 6వ నెలలోనే అతడికి జన్మను ఇచ్చింది. బ్రాడ్ నాటింగ్‌హామ్‌లోని సిటీ హాస్పిటల్లో 24 జూన్ 1986న పుట్టాడు. బ్రాడ్ పుట్టినప్పుడు కేవలం 907 గ్రాములు. ఆ సమయంలో అతడు బ్రతుకుతాడని ఎవరూ ఊహించలేదు. అతడు ఊపిరి కూడా తీసుకోవడానికి కష్టపడేవాడు. దాదాపు నెల రోజుల పాటు ఇంక్యుబేటర్‌లోనే ఉంచారు. అయితే ఆఖరికి బ్రాడ్ మృత్యువును జయించాడు. కానీ అతడి ఊపిరితిత్తుల సమస్య మాత్రం పూర్తిగా నయం కాలేదు. అతడు ప్రీ మెచ్యూర్ బేబీ కావడంతో బ్రాడ్ ఊపిరితిత్తులు సరిగ్గా ఎదగలేదు. ఇప్పటికీ అతడు ఆస్తమాతో బాధపడుతున్నాడు. అతడు చాలా సందర్భాల్లో ఇన్హిల్లర్ వాడుతూ కన్పించేవాడు. బ్రాడ్‌కు చిన్నతనం నుంచే క్రీడలు అంటే చాలా ఇష్టం. అతడు శీతాకాలంలో ఫుట్‌బాల్, వేసవిలో క్రికెట్ ఆడేవాడు. కాగా అతడి తండ్రి క్రిస్ బ్రాడ్ కూడా ఇంగ్లండ్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఫస్ట్ క్లాస్ ఎంట్రీ బ్రాడ్ తన ఫాస్ట్ క్లాస్ కెరీర్‌ను 2005లో లీసెస్టర్‌షైర్ తరపున ప్రారంభించాడు. అనంతరం 2008లో నాటింగ్హామ్షైర్కు తన మకంను మార్చాడు. తన ఫస్ట్‌క్లాస్ కెరీర్లో 264 మ్యాచ్‌లు ఆడిన బ్రాడీ 948 వికెట్లు పడగొట్టాడు. అందులో 20 సార్లు పైగా 5 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లను సాధించాడు. 2006లో అరంగేట్రం.. స్టువర్ట్ బ్రాడ్ 2006లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. సోఫియా గార్డెన్స్ వేదికగా పాకిస్తాన్‌పై తన తొలి మ్యాచ్ బ్రాడ్ ఆడాడు. తన తొలి మ్యాచ్‌లో 3 ఓవర్లు బౌలింగ్ చేసిన బ్రాడ్..14 పరుగులిచ్చి 1 వికెట్ పడగొట్టాడు. అయితే ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. అదే ఏడాది పాకిస్తాన్‌పై టీ20 డెబ్యూ చేశాడు. తన అరంగేట్ర మ్యాచ్‌లోనే రెండు కీలక వికెట్టు పడగొట్టి సత్తా చాటాడు. ఆ తర్వాత 2007లో టెస్టు క్రికెట్లో కూడా బ్రాడ్ ఎంట్రీ ఇచ్చాడు. అయితే తన అరంగేట్రం నుంచి ఇంగ్లీష్ జట్టులో కీలక సభ్యునిగా కొనసాగుతూ వచ్చిన బ్రాడ్.. 2016లో వైట్‌బాల్ క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. తన చివరి వన్డే మ్యాచ్ 2016లో దక్షిణాఫ్రికాపై ఆడాడు. అప్పటి నుంచి 37 ఏళ్ల బ్రాడ్ కేవలం టెస్టుల్లో మాత్రమే కొనసాగుతూ వస్తున్నాడు. తన కెరీర్లో కొన్నాళ్ల పాటు ఇంగ్లండ్ క్రికెట్ జట్టు కెప్టెన్‌గా కూడా బ్రాడ్ వ్యవహరించాడు. రికార్డుల రారాజు.. 17 ఏళ్లు క్రికెట్ ప్రపంచాన్ని శాసించిన బ్రాడ్ ఎన్నో అరుదైన ఘనతలను తన పేరిట లిఖించుకున్నాడు. బ్రాడ్ తన కెరీర్లో ఇప్పటివరకు 166 టెస్టుల్లో 600 వికెట్లు సాధించాడు. అదే విధంగా 121 వన్డేల్లో 178 వికెట్లు తీశాడు. 56 టి20ల్లో 65 వికెట్లు సాధించాడు. స్టువర్ట్ బ్రాడ్, ఇంగ్లండ్ తరుపున అత్యధిక టెస్టులు ఆడిన రెండో క్రికెటర్‌గా ఉన్నాడు. జెమ్స్ అండర్సన్ 182 మ్యాచ్‌లతో అగ్ర స్ధానంలో ఉండగా.. బ్రాడ్ 166 టెస్టులతో రెండో స్ధానంలో కొనసాగుతున్నాడు. అదే విధంగా టెస్టుల్లో అత్యధిక వికెట్ల పడగొట్టిన ఫాస్ట్ బౌలర్ల జాబితాలో బ్రాడ్ 600 వికెట్లతో రెండో స్ధానంలో ఉన్నాడు. 60 పరుగులకే ఆలౌట్.. 2015 యాషెస్ సిరీస్‌లో స్టువర్ట్ బ్రాడ్ తన కెరీర్ బెస్ట్ గణాంకాలు నమోదు చేశాడు. ఈ సిరీస్‌లో కేవలం 15 పరుగులిచ్చి 8 వికెట్లు పడగొట్టాడు. బ్రాడ్ సంచలన స్పెల్ కారణంగా ఆస్ట్రేలియా ఆ ఇన్నింగ్స్‌లో 60 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఈ మ్యాచ్‌లో బ్రాడ్ బ్యాటింగ్‌లో కూడా రాణించాడు. రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 97 పరుగులు చేశాడు. ఫలితంగా ఇంగ్లండ్ కేవలం 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. టెస్టుల్లో సెంచరీ.. సాధరణంగా బాల్‌తో ప్రభావితం చూపే బ్రాడ్.. 2010లో లార్డ్స్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన టెస్టులో అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన కనబరిచాడు. 8 స్దానంలో బ్యాటింగ్‌కు వచ్చిన బ్రాడ్ 169 పరుగులతో అదరగొట్టాడు. ఓవరాల్‌గా తన టెస్టు కెరీర్లో ఓ సెంచరీ, 13 హాఫ్ సెంచరీలతో 3640 పరుగులు చేశాడు. డేవిడ్ వార్నర్‌కు చుక్కలే.. ఇక బ్రాడ్ తన టెస్టు కెరీర్లో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్‌కు చుక్కలు చూపిండాడు. గత కొన్ని ఏళ్ల నుంచి బ్రాడ్ బౌలింగ్‌ను ఎదుర్కొవడానికి వార్నర్ తీవ్ర ఇబ్బంది పడుతున్నాడు. బ్రాడ్ ఇప్పటి వరకు టెస్టుల్లో డేవిడ్ వార్నర్‌ని 17 సార్లు ఔట్ చేశాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో ఓ ప్లేయర్‌ని అత్యధిక సార్లు అవుట్ చేసిన బౌలర్‌గా బ్రాడ్ చరిత్ర సృష్టించాడు. అదొక కాలరాత్రి.. టీ20 ప్రపంచకప్-2007లో భాగంగా టీమిండియాతో జరిగిన మ్యాచ్ బ్రాడ్‌కు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. యువరాజ్ సింగ్, ఒకే ఓవర్లో 6 సిక్సర్లు బాది బ్రాడ్‌కు కలరాత్రిని మిగిల్చాడు. ఆండ్రూ ఫ్లింటాఫ్ చేసిన సెడ్జింగ్ కారణంగా యువీ సిక్సర్ల వర్షం కురిపించాడు. చదవండి: చాలా బాధగా ఉంది.. మా ఓటమికి కారణం అదే! అతడొక అద్భుతం: హార్దిక్ -
రిటైర్మెంట్తో షాకిచ్చిన స్టువర్ట్ బ్రాడ్
ఇంగ్లండ్ పేస్ బౌలర్ స్టువర్డ్ బ్రాడ్ 17 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్‌నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ప్రస్తుతం ఓవల్‌లో జరుగుతున్న మ్యాచే తనకు చివరి టెస్టు అని 37 ఏళ్ల బ్రాడ్ వెల్లడించాడు. యాషెస్‌లో చివరి టెస్టుకు ముందు 166 టెస్టుల్లో 27.68 సగటుతో 600 వికెట్లు తీసిన బ్రాడ్, అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. 2016లో చివరి వన్డే ఆడిన బ్రాడ్ అప్పటినుంచి ఒక్క టెస్టులకే పరిమితమయ్యాడు. ఈతరం టెస్టు క్రికెట్లో గొప్ప బౌలర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు స్టువర్ట్ బ్రాడ్. తన సహచర పేసర్ జేమ్స్ అండర్సన్‌తో పోటీ పడి మరీ వికెట్లు తీసే బ్రాడ్ అర్థంతరంగా రిటైర్మెంట్ ఇవ్వడం అభిమానులకు షాక్ కలిగించింది. ఇక స్టువర్ట్ బ్రాడ్ పేరు చెప్పగానే ముందుగా గుర్తుకు వచ్చేది యువరాజ్ సింగ్. 2007 టి20 వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో బ్రాడ్ బౌలింగ్‌లో యువీ ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాది అతనికి నిద్రలేని రాత్రులు మిగిల్చాడు. ఇప్పటికి బ్రాడ్ అనగానే ఆ ఆరు సిక్సర్లే కళ్లు ముందు కదలాడతాయి. అంతకముందు ఓవర్లో యువరాజ్‌తో ఆండ్రూ ఫ్లింటాఫ్ వైరం పెట్టుకున్నాడు. దీంతో యువరాజ్ కోపం ఆ తర్వాత బౌలింగ్‌కు వచ్చిన బ్రాడ్‌కు శాపంగా మారింది. ఓవరాల్‌గా స్టువర్ట్ బ్రాడ్ 167 టెస్టుల్లో 3656 పరుగులు.. 602 వికెట్లు, 121 వన్డేల్లో 529 పరుగులు.. 178 వికెట్లు, 56 టి20ల్లో 118 పరుగులు.. 65 వికెట్లు పడగొట్టాడు. ఇక 2014లో జరిగిన టి20 వరల్డ్‌కప్‌లో బ్రాడ్ ఇంగ్లండ్‌కు కెప్టెన్‌గానూ వ్యవహరించాడు. అయితే ఇంగ్లండ్‌ను సెమీస్ చేర్చడంలో బ్రాడ్ విఫలమయ్యాడు. BREAKING 🚨: Stuart Broad announces he will retire from cricket after the Ashes ends. pic.twitter.com/dNv8EZ0qnC — Sky Sports Cricket (@SkyCricket) July 29, 2023 Forever remembered for 𝘁𝗵𝗼𝘀𝗲 mesmerising spells, 𝘁𝗵𝗼𝘀𝗲 Ashes battles, 𝘁𝗵𝗼𝘀𝗲 602* wickets. Take a bow, Stuart Broad 👏#EnglandCricket | #Ashes pic.twitter.com/6WvdTW5AoA — England Cricket (@englandcricket) July 29, 2023 చదవండి: Ben Stokes: యాషెస్ చరిత్రలో తొలి బ్యాటర్‌గా రికార్డు; రోహిత్‌ను దాటలేకపోయాడు ధోనిని దొంగచాటుగా వీడియో తీసిన ఎయిర్ హోస్టెస్ -
చరిత్ర సృష్టించిన స్టువర్ట్ బ్రాడ్.. తొలి ఇంగ్లండ్ బౌలర్‌గా
ఇంగ్లండ్ సీనియర్ పేసర్ స్టువార్ట్ బ్రాడ్ అరుదైన ఫీట్ సాధించాడు. యాషెస్ చరిత్రలో ఆసీస్‌పై 150 వికెట్లు తీసిన మొదటి ఇంగ్లండ్ బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్ ఆఖరి టెస్టులో అతను ఈ మైలురాయిని అందుకున్నాడు. ఫామ్‌లో ఉన్న ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా(47) ఎల్బీగా ఔట్ చేయడం ద్వారా బ్రాడ్ ఈ ఘనత సాధించాడు. ఓవరాల్‌గా ఇంగ్లండ్ తరపున 166 టెస్టుల్లో 600 వికెట్లు, 121 వన్డేల్లో 178 వికెట్లు, 56 టి20ల్లో 65 వికెట్లు పడగొట్టాడు. ఈ దశాబ్దంలో టెస్టు క్రికెట్లో 600కు పైగా వికెట్లు తీసిన బౌలర్లలో బ్రాడ్ ఒకడిగా నిలిచాడు. ఇక అండర్సన్ తర్వాత టెస్టుల్లో ఇంగ్లండ్ తరపున అత్యధిక వికెట్లు తీసిన పేస్ బౌలర్‌గానూ బ్రాడ్ రికార్డులకెక్కాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో తడబడుతోంది. ఇంగ్లండ్‌ను తక్కువకు ఆలౌట్ చేశామన్న ఆనందం ఆసీస్ నిలబెట్టుకోలేకపోయింది. వరుస విరామాల్లో ఇంగ్లండ్ బౌలర్లు వికెట్లు తీస్తుండడంతో ఆసీస్ ప్రస్తుతం ఏడు వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ 64 పరుగులు.. అర్థసెంచరీతో రాణించగా.. కెప్టెన్ కమిన్స్ 16 పరుగులతో అతనికి సహకరిస్తున్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రాడ్, మార్క్‌వుడ్‌లు రెండు వికెట్లు తీయగా.. అండర్సన్, వోక్స్, జోరూట్ తలా ఒక వికెట్ తీశారు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో ఇంకా 57 పరుగుల దూరంలో ఉంది. చదవండి: Japan Open 2023: సెమీస్‌కు దూసుకెళ్లిన లక్ష్యసేన్.. సాత్విక్-చిరాగ్ జోడి ఓటమి -
అప్పుడు, ఇప్పుడు అతడే.. ఆండర్సన్, బ్రాడ్‌లకు ఒకడే లక్కీ హ్యాండ్..!
మాంచెస్టర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్ సిరీస్ నాలుగో టెస్ట్‌లో ఇంగ్లండ్ వెటరన్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ 600 వికెట్ల మైలురాయిని అందుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ట్రావిస్ హెడ్ (48) వికెట్ పడగొట్టడం ద్వారా బ్రాడ్ ఈ అత్యంత అరుదైన ఘనత సాధించాడు. క్రికెట్ చరిత్రలో బ్రాడ్ సహా కేవలం ఐదుగురు మాత్రమే టెస్ట్‌ల్లో 600 వికెట్ల మార్కును అందుకున్నారు. బ్రాడ్‌కు ముందు మురళీథరన్ (800), షేన్ వార్న్ (708), జేమ్స్ ఆండర్సన్ (688), అనిల్ కుంబ్లే (619) 600 వికెట్ల ల్యాండ్ మార్క్‌ను దాటారు. వీరిలో బ్రాడ్, అతని సహచరుడు ఆండర్సన్ మాత్రమే పేసర్లు కావడం విశేషం. కాగా, టెస్ట్‌ల్లో 600 వికెట్ల మార్కును దాటిన ఇద్దరు పేసర్ల విషయంలో ఓ కామన్ ఇష్యూ వెలుగులోకి వచ్చింది. అదేంటంటే.. ఆండర్సన్ 600వ వికెట్లో, బ్రాడ్ 600వ వికెట్లో వీరి సహచరుడు జో రూట్ పాత్ర ఉంది. ఆండర్సన్, బ్రాడ్‌లకు చిరకాలం గుర్తుండిపోయే ఈ సందర్భాల్లో రూట్ భాగమయ్యాడు. ఇద్దరి 600వ వికెట్ల క్యాచ్‌లను రూటే అందుకున్నాడు. Joe Root 🤝 Getting Anderson and Broad to 600 Test wickets#CricketTwitter #Ashes #ENGvAUS pic.twitter.com/LAjtRmbp1p — ESPNcricinfo (@ESPNcricinfo) July 20, 2023 ఆండర్సన్ 600వ వికెట్ పాక్ ఆటగాడు అజహర్ అలీ క్యాచ్‌ను, బ్రాడ్ 600వ వికెట్ ట్రవిస్ హెడ్ క్యాచ్‌ను రూటే పట్టుకున్నాడు. ఇక్కడ మరో విశేషమేమిటంటే, బ్రాడ్ తన 600వ వికెట్‌ను ఆండర్సన్ సొంత మైదానంలో అండర్సన్ ఎండ్ నుంచి బౌలింగ్ చేస్తూ సాధించాడు. ఈ విషయాన్ని బ్రాడ్ తొలి రోజు ఆట అనంతరం ప్రస్తావిస్తూ.. తన సహచరుడి ఎండ్ నుంచి బౌలింగ్ చేస్తూ ఈ అరుదైన ఘనత సాధించడం ఆనందంగా ఉందని అన్నాడు. ఇదిలా ఉంటే, నాలుగో టెస్ట్ తొలి రోజు ఇంగ్లండ్ పేసర్లు రాణించడంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 299 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ (51), లబుషేన్ (51) అర్ధ సెంచరీలు సాధించగా, హెడ్ (48), స్టీవ్ స్మిత్ (41) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ (4/52) ప్రత్యర్థిని దెబ్బ తీయగా, బ్రాడ్ 2 వికెట్లు పడగొట్టాడు. అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా.. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్‌ల్లో ఇంగ్లండ్ తరఫున అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ల జాబితాలో స్టువర్ట్ బ్రాడ్ (149) అగ్రస్థానానికి ఎగబాకాడు. ఈ మ్యాచ్‌కు ముందు ఈ రికార్డు ఇయాన్ బోథమ్ (148) పేరిట ఉండేది. ఈ జాబితాలో ఆండర్సన్ (115) నాలుగో స్థానంలో ఉన్నాడు. -
600 వికెట్ల క్లబ్లో.. టెస్టు క్రికెట్ చరిత్రలో నాలుగో బౌలర్‌గా
ఇంగ్లండ్‌తో జరుగుతున్న యాషెస్ సిరీస్ నాలుగో టెస్టులో తొలి రోజు బుధవారం ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తమ మొదటి ఇన్నింగ్స్‌లో 83 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 299 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ (51), లబుషేన్ (51) అర్ధ సెంచరీలు సాధించగా, హెడ్ (48), స్టీవ్ స్మిత్ (41) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ (4/52) ప్రత్యర్థిని దెబ్బ తీయగా, బ్రాడ్ 2 వికెట్లు పడగొట్టాడు. హెడ్‌ను అవుట్ చేయడం ద్వారా బ్రాడ్ టెస్టుల్లో 600 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. ఈ ఘనత సాధించిన నాలుగో బౌలర్‌గా నిలిచాడు. అత్యధిక వికెట్ల జాబితాలో మురళీధరన్ (800), షేన్ వార్న్ (708), అండర్సన్ (688) మాత్రమే బ్రాడ్కంటే ముందున్నారు. 𝗧𝗵𝗲 moment.#EnglandCricket | #Ashes https://t.co/lz2j0t9LN5 pic.twitter.com/9RxHutgLDC — England Cricket (@englandcricket) July 19, 2023 చదవండి: భారత్‌కు ఎదురుందా! #ChrisMartin: ధోనిని ముప్పుతిప్పలు పెట్టిన కివీస్ టాప్-3 బౌలర్, కట్‌చేస్తే.. ఇప్పుడు సూపర్ మార్కెట్లో -
నువ్వేం తండ్రివి? యువీ చితకబాదినపుడు ఎక్కడున్నావు? నీ స్థాయి మరచి..
The Ashes, 2023: ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ తండ్రి, ఐసీసీ మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్‌పై క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. వయసు పెరగగానే సరిపోదు.. కాస్త బుద్ధి కూడా ఉండాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో రిఫరీగా వ్యవహరిస్తూ ఓ ఆటగాడి పట్ల ఇలా ప్రవర్తించడం సరికాదంటూ హితవు పలుకుతున్నారు. ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్-2023 సీజన్లో ఇంగ్లండ్‌పై ఇప్పటికే రెండు విజయాలతో ఆస్ట్రేలియా పైచేయి సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో లీడ్స్ వేదికగా గురువారం మూడో టెస్టు ఆరంభమైంది. తమకు అత్యంత కీలకమైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆతిథ్య ఇంగ్లండ్.. తొలుత బౌలింగ్ ఎంచుకుంది. పదిహేడో సారి ఈ నేపథ్యంలో బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ అద్భుత సెంచరీ(118) కారణంగా మెరుగైన స్కోరు నమోదు చేయగలిగింది. 263 పరుగులకు తొలి ఇన్నింగ్స్ ముగించింది. ఇక ఈ మ్యాచ్‌లో ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్(4) స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో పదహారోసారి అవుటయ్యాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో(1)నూ అతడికే వికెట్ సమర్పించుకున్నాడు. కాగా టెస్టుల్లో బ్రాడ్ బౌలింగ్‌లో వార్నర్ అవుట్ కావడం ఇది పదిహేడోసారి. దీంతో వార్నర్‌ను ట్రోల్ చేస్తూ ఇంగ్లండ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో మీమ్స్‌తో రెచ్చిపోయారు. మీమ్‌ను రీషేర్ చేసిన క్రిస్ బ్రాడ్ ఇందులో భాగంగా ఓ నెటిజన్.. అమెరికన్ యానిమేటెడ్ సిట్కామ్ సిరీస్ ది సింప్సన్స్‌లోని బార్ట్ అనే క్యారెక్టర్‌ను వార్నర్ ముఖంతో మార్ఫింగ్ చేసి పెట్టాడు. స్టువర్ట్ బ్రాడ్ మళ్లీ నన్ను అవుట్ చేశాడు అని వార్నర్ బోర్డు మీద రాస్తున్నట్లుగా మీమ్ క్రియేట్ చేశాడు. ఒకే ఓవర్లో 6 సిక్సర్లను గుర్తుచేస్తూ ఈ మీమ్‌ను స్టువర్ట్ బ్రాడ్ తండ్రి క్రిస్ బ్రాడ్ రీషేర్ చేశాడు. ఇది చూసిన నెటిజన్లు.. ‘‘కొడుకు ప్రతిభ చూసి సంతోషపడటంలో తప్పులేదు. కానీ ఐసీసీ మ్యాచ్ రిఫరీ అయి ఉండి ఇలా దిగజారిపోవడం ఏమీ బాగాలేదు. వార్నర్‌ను మరీ అంతగా తీసిపారేయాల్సిన అవసరం లేదు. మీ నుంచి ఇది అస్సలు ఊహించలేదు’’ అని క్రిస్‌కు చురకలు అంటిస్తున్నారు. ఈ సందర్భంగా టీ20 ప్రపంచకప్-2007లో స్టువర్ట్ బ్రాడ్ ఓవర్లో టీమిండియా స్టార్ యువరాజ్ సింగ్ ఆరు సిక్సర్లు బాదిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. ‘‘యువీ బ్రాడ్ బౌలింగ్‌లో చితక్కొట్టినపుడు ఇలాంటి ట్వీట్లు చేయలేదు ఎందుకు?’’ అని సెటైర్లు వేస్తున్నారు. చదవండి: సినిమాను తలపించే ట్విస్టులు! కుటుంబాల మధ్య గొడవ.. సీక్రెట్‌గా ప్రేమా, పెళ్లి! ఆఖరికి Ind vs WI: కోహ్లి, రోహిత్ వాళ్లిద్దరి బౌలింగ్‌లో! వీడియో వైరల్ What a start! 🤩 Broad gets Warner for the... *Checks notes* ...Sixteenth time! 🤯 #EnglandCricket | #Ashes pic.twitter.com/WfSoa5XY1G — England Cricket (@englandcricket) July 6, 2023 Couldn’t have found a better partner to watch this together with after 15 years 👶 🏏 #15YearsOfSixSixes #ThisDayThatYear #Throwback #MotivationalMonday #GetUpAndDoItAgain #SixSixes #OnThisDay pic.twitter.com/jlU3RR0TmQ — Yuvraj Singh (@YUVSTRONG12) September 19, 2022 pic.twitter.com/76dG8lgOkv — Chris Broad (@ChrisBroad3) July 7, 2023 -
'బెయిర్ స్టో అమాయక చక్రవర్తి.. బ్రాడ్ కపట సూత్రధారి'
యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు ముగిసి రెండు రోజులు కావొస్తుంది. మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించినప్పటికి బెయిర్ స్టో ఔట్ వివాదం ఎక్కువగా హైలెట్ అయింది. ఈ వివాదం ఇప్పట్లో సమసిపోయేలా కనిపించడం లేదు. బెయిర్ స్టో ఔట్ విషయంలో కీలకపాత్ర పోషించిన అలెక్స్ కేరీ తాజాగా ఒక బ్రాడ్‌తో జరిగిన సంభాషణను రివీల్ చేశాడు. బ్రాడ్ అన్న ఒకే ఒక్క మాటను అలెక్స్ కేరీ పంచుకున్నాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం బ్రాడ్.. అలెక్స్ కేరీ వద్దకు వచ్చి ''క్రీడాస్పూర్తిని దిగజార్చారు.. మీరంతా ఎప్పటికీ గుర్తుండి పోతారు'' అని పేర్కొన్నాడు. దీనిపై అలెక్స్ కేరీ గట్టి కౌంటర్ ఇచ్చాడు. ''బెయిర్‌స్టో ఒక అమాయక చక్రవర్తి. బ్రాడ్ పెద్ద కపటనాటక సూత్రధారి. స్టువర్ట్ బ్రాడ్ నుంచి క్రీడా స్ఫూర్తి వంటి పదాలు వింటుంటే వింతగా ఉంది. వారి వికెట్ల కోసం అంపైర్లకు అప్పీల్ చేయాల్సిన అవసరం లేదని భావించే ఆటగాళ్లు ఇప్పుడు ఇలా చెప్పడం హాస్యాస్పదం. ఇంగ్లండ్ ఆటగాళ్లకు తమకొచ్చేసరికి రూల్స్ వేరేగా ఉంటాయి. అదే ప్రత్యర్థి విషయంలో మాత్రం క్రీడాస్ఫూర్తి గుర్తుకొస్తుంది'' అంటూ కామెంట్ చేశాడు. ఇక అభిమానులు మాత్రం ఈ సంఘటనను అంత త్వరగా మరిచిపోలేరనుకుంటా. గతంలో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌ల సందర్భంగా జరిగిన సంఘటనలను గుర్తుకు తెస్తూ పలు వీడియోలను రిలీజ్ చేశారు. అందులో భాగంగా 2013 యాషెస్ సిరీస్‌లో బ్రాడ్ క్యాచ్ ఔట్ అని స్పష్టంగా తెలిసినా మైదానం వీడేందుకు మొగ్గు చూపలేదు. అంపైర్స్ కాల్ కోసం వేచి చూశాడు. ఇప్పుడు ఆ వీడియో క్లిప్‌ను సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. చదవండి: 'ఎదుటోళ్లను విమర్శించే ముందు మీ కపటత్వం తెలుసుకోండి' మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు ఇంగ్లండ్‌కు భారీ షాక్.. సిరీస్ మొత్తానికి కీలక ప్లేయర్ దూరం -
నిప్పులు చెరుగుతున్న బ్రాడ్.. వరుస బంతుల్లో వార్నర్, లబూషేన్ ఔట్
యాషెస్ సిరీస్ తొలి టెస్ట్ రెండో రోజు ఆటలో ఇంగ్లండ్ వెటరన్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ నిప్పులు చెరుగుతున్నాడు. రెండో రోజు ఏడో ఓవర్లో వరుస బంతుల్లో డేవిడ్ వార్నర్ (9), మార్నస్ లబూషేన్ (0) వికెట్లు పడగొట్టిన బ్రాడ్.. ఆసీస్‌ను దారుణంగా దెబ్బకొట్టాడు. తొలుత వార్నర్‌ను అద్భుతమైన డెలివరీతో క్లీన్ బౌల్డ్ చేసిన అతను.. ఆతర్వాతి బంతికే లబూషేన్‌ను పెవిలియన్‌కు పంపాడు. Broad beats Warner again! 🐇pic.twitter.com/hiHb1BNcK6 — ESPNcricinfo (@ESPNcricinfo) June 17, 2023 వికెట్ల వెనుక బెయిర్‌స్టో సూపర్ క్యాచ్‌తో లబూషేన్ ఖేల్ ఖతం చేశాడు. ఫలితంగా ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 29 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. యాషెస్‌లో బ్రాడ్.. వార్నర్‌ను ఔట్ చేయడం ఇది 15వసారి కాగా.. టెస్ట్‌ల్లో లబూషేన్ గోల్డన్ డకౌట్ కావడం ఇదే తొలిసారి. First-ever golden duck for @marnus3cricket in Tests.pic.twitter.com/ROSAxQf7Da — CricTracker (@Cricketracker) June 17, 2023 కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తొలి రోజే ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి (393/8) సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. జో రూట్ (118 నాటౌట్) అద్భుతమైన శతకంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను నిర్మించగా.. జాక్ క్రాలే (61), బెయిర్‌స్టో (78) రాణించారు. ఆసీస్ బౌలర్లలో నాథన్ లయోన్ 4, హాజిల్‌వుడ్ 2, బోలండ్, గ్రీన్ తలో వికెట్ పడగొట్టారు. 18 ఓవర్లు ముగిసే సమయానికి ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 45 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖ్వాజా (24), స్టీవ్ స్మిత్ (9) క్రీజ్‌లో ఉన్నారు. ఆసీస్ కోల్పోయిన 2 వికెట్లు స్టువర్ట్ బ్రాడ్ ఖాతాలోకి వెళ్లాయి. చదవండి: తీరు మారని వార్నర్.. మరోసారి బ్రాడ్దే పైచేయి! వీడియో వైరల్ -
తీరు మారని వార్నర్.. మరోసారి బ్రాడ్దే పైచేయి! వీడియో వైరల్
టెస్టుల్లో ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరగుతున్న యాషెస్ తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 9 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. టీమిండియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో కూడా డేవిడ్ భాయ్ ఇదే తీరును కనబరిచాడు. తీరు మారని వార్నర్.. డేవిడ్ వార్నర్‌పై మరోసారి ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ పైచేయి సాధించాడు. అద్భుతమైన బంతితో వార్నర్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. టెస్టుల్లో వార్నర్‌ను బ్రాడ్ ఔట్ చేయడం 15వసారి కావడం గమనార్హం. టెస్టుల్లో ఓవరాల్‌గా బ్రాడ్ బౌలింగ్‌లో 734 బంతులు ఎదుర్కొన్న వార్నర్.. కేవలం 26.46 సగటుతో 397 పరుగులు మాత్రమే చేశాడు. ముఖ్యంగా ఇంగ్లడ్ గడ్డపై వార్నర్‌ను బ్రాడ్ ఎక్కువసార్లు ఔట్ చేశాడు. తన సొంత గడ్డపై 9 సార్లు వార్నర్‌ను పెవిలియన్‌కు పంపాడు. 2013 నుంచి టెస్టుల్లో వార్నర్‌కు బ్రాడ్ చుక్కలు చూపిస్తునే వస్తున్నాడు. క్రికెట్లో వార్నర్‌ను ఏ బౌలర్ కూడా ఇన్ని పర్యాయాలు ఔట్ చేయలేదు. వార్నర్‌ను బ్రాడ్ ఏకంగా నాలుగు సార్లు డకౌట్ చేశాడు. కాగా వార్నర్‌కు ఇదే ఆఖరి యాషెస్ సిరీస్. కనీసం ఈ సిరీస్‌లోనైనా బ్రాడ్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొవాలని అతడి అభిమానులు కోరుకుంటున్నారు. కాగా తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 16 ఓవర్లకు రెండు వికెట్లు కోల్పోయి 41 పరుగులు చేసింది. క్రీజులో ఉస్మాన్ ఖావాజా(22),స్టీవ్ స్మిత్(7) పరుగులతో ఉన్నారు. చదవండి: PAK vs SL: శ్రీలంకతో టెస్టు సిరీస్.. పాక్ జట్టు ప్రకటన!స్టార్ బౌలర్ వచ్చేశాడు Broad beats Warner again! 🐇pic.twitter.com/hiHb1BNcK6 — ESPNcricinfo (@ESPNcricinfo) June 17, 2023 -
ఐదు వికెట్లతో చెలరేగిన బ్రాడ్.. 172 పరుగులకే ఐర్లాండ్ ఆలౌట్
లండన్: ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌కు ముందు సన్నాహంగా ఐర్లాండ్‌తో ఆడుతున్న ఏకైక టెస్టులో ఇంగ్లండ్ తొలిరోజే అన్ని విభాగాల్లో శాసించింది. టాస్ నెగ్గిన ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ముందుగా తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఐర్లాండ్ 56.2 ఓవర్లలో 172 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ సీమర్ స్టువర్ట్ బ్రాడ్ (5/51) నిప్పులు చెరిగాడు. దీంతో టాపార్డర్‌లో జేమ్స్ (36; 5 ఫోర్లు), పీటర్ మూర్ (10; 2 ఫోర్లు), కెప్టెన్ బాల్బిర్నీ (0) సహా... టెక్టర్ (0), లోయర్ ఆర్డర్లో అడెర్ (14; 2 ఫోర్లు)లు బ్రాడ్ పేస్ పదునుకు తలవంచారు. 98 పరుగులకు 5 వికెట్లు కోల్పోగా... ఇందులో 4 వికెట్లు బ్రాడ్వే! ఐర్లాండ్ ఇన్నింగ్స్‌లో క్యాంఫర్ (33; 6 ఫోర్లు), పాల్ స్టిర్లింగ్ (30; 5 ఫోర్లు) కాసేపు ఇంగ్లండ్ బౌలింగ్‌కు ఎదురొడ్డి నిలిచారు. స్పిన్నర్ జాక్ లీచ్ 2, మాథ్యూ పాట్స్ 2 వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ ఆట నిలిచే సమయానికి 25 ఓవర్లలో వికెట్ నష్టానికి 152 పరుగులు చేసింది. ఓపెనర్లు క్రాలీ (56; 11 ఫోర్లు), డకెట్ (60 బ్యాటింగ్; 8 ఫోర్లు) 16.3 ఓవర్లలోనే వేగంగా 109 పరుగులు జోడించారు. క్రాలీని హ్యాండ్ అవుట్ చేయగా, డకెట్‌తో ఒలీ పోప్ (29 బ్యాటింగ్; 5 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ ఇంకా 20 పరుగుల దూరంలోనే ఉంది. చేతిలో 9 వికెట్లున్నాయి. చదవండి: Josh Tongue: ఇంగ్లండ్‌కు ఆడతాడని ఎప్పుడో పందెం కాసాడు.. ఇప్పుడు జాక్‌పాట్ కొట్టేశాడు The I̶a̶n̶ ̶B̶e̶l̶l̶ Ollie Pope cover drive... One of the most pleasing shots in cricket 😍 Get it on repeat 🔁 #EnglandCricket | #ENGvIRE pic.twitter.com/our07uvBgw — England Cricket (@englandcricket) June 1, 2023