యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు ముగిసి రెండు రోజులు కావొస్తుంది. మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించినప్పటికి బెయిర్ స్టో ఔట్ వివాదం ఎక్కువగా హైలెట్ అయింది. ఈ వివాదం ఇప్పట్లో సమసిపోయేలా కనిపించడం లేదు. బెయిర్ స్టో ఔట్ విషయంలో కీలకపాత్ర పోషించిన అలెక్స్ కేరీ తాజాగా ఒక బ్రాడ్‌తో జరిగిన సంభాషణను రివీల్ చేశాడు. బ్రాడ్ అన్న ఒకే ఒక్క మాటను అలెక్స్ కేరీ పంచుకున్నాడు.
మ్యాచ్ ముగిసిన అనంతరం బ్రాడ్.. అలెక్స్ కేరీ వద్దకు వచ్చి ''క్రీడాస్పూర్తిని దిగజార్చారు.. మీరంతా ఎప్పటికీ గుర్తుండి పోతారు'' అని పేర్కొన్నాడు. దీనిపై అలెక్స్ కేరీ గట్టి కౌంటర్ ఇచ్చాడు. ''బెయిర్‌స్టో ఒక అమాయక చక్రవర్తి. బ్రాడ్ పెద్ద కపటనాటక సూత్రధారి. స్టువర్ట్ బ్రాడ్ నుంచి క్రీడా స్ఫూర్తి వంటి పదాలు వింటుంటే వింతగా ఉంది. వారి వికెట్ల కోసం అంపైర్లకు అప్పీల్ చేయాల్సిన అవసరం లేదని భావించే ఆటగాళ్లు ఇప్పుడు ఇలా చెప్పడం హాస్యాస్పదం. ఇంగ్లండ్ ఆటగాళ్లకు తమకొచ్చేసరికి రూల్స్ వేరేగా ఉంటాయి. అదే ప్రత్యర్థి విషయంలో మాత్రం క్రీడాస్ఫూర్తి గుర్తుకొస్తుంది'' అంటూ కామెంట్ చేశాడు.
ఇక అభిమానులు మాత్రం ఈ సంఘటనను అంత త్వరగా మరిచిపోలేరనుకుంటా. గతంలో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌ల సందర్భంగా జరిగిన సంఘటనలను గుర్తుకు తెస్తూ పలు వీడియోలను రిలీజ్ చేశారు. అందులో భాగంగా 2013 యాషెస్ సిరీస్‌లో బ్రాడ్ క్యాచ్ ఔట్ అని స్పష్టంగా తెలిసినా మైదానం వీడేందుకు మొగ్గు చూపలేదు. అంపైర్స్ కాల్ కోసం వేచి చూశాడు. ఇప్పుడు ఆ వీడియో క్లిప్‌ను సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
చదవండి: 'ఎదుటోళ్లను విమర్శించే ముందు మీ కపటత్వం తెలుసుకోండి'
మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు ఇంగ్లండ్‌కు భారీ షాక్.. సిరీస్ మొత్తానికి కీలక ప్లేయర్ దూరం
Comments
Please login to add a commentAdd a comment