లార్డ్స్ వేదికగా ముగిసిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే విజయం కన్నా బెయిర్ స్టో ఔట్ వివాదాస్పదంగా మారింది. ఆసీస్ వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ చేసిన పని క్రీడాస్పూర్తికి విరుద్ధంగా ఉందంటూ విమర్శలు వచ్చాయి.
ఐదోరోజు ఆటలో లంచ్ విరామానికి ముందు గ్రీన్ వేసిన బంతిని ఆడకుండా కిందకు వంగిన బెయిర్‌స్టో ఆ తర్వాత సహచరుడు స్టోక్స్‌తో మాట్లాడేందుకు ముందుకు వెళ్లాడు. అదే సమయంలో బంతిని అందుకున్న కీపర్ క్యారీ అండర్‌ఆర్మ్ త్రోతో ముందుకు విసరగా అది స్టంప్స్‌ను తాకింది. ఆ సమయంలో బెయిర్‌స్టో క్రీజ్‌కు చాలా దూరం ఉండడంతో థర్డ్ అంపైర్ బెయిర్‌స్టోన్‌ను అవుట్‌గా ప్రకటించాడు. దాంతో ఇంగ్లండ్ బృందం ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యింది. ఆసీస్ తమ అప్పీల్‌ను కూడా వెనక్కి తీసుకునే ప్రయత్నం చేయకపోవడంతో బెయిర్‌స్టో మైదానం వీడాడు. దీంతో ఆస్ట్రేలియా ఆటగాళ్లపై స్టేడియంలోని ప్రేక్షకులు చీటర్స్ అంటూ దూషణల పర్వం మొదలుపెట్టారు.
అయితే బెయిర్ స్టో ఇదే లార్డ్స్ టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో మార్నస్ లబుషేన్‌ను ఇలాగే ఔట్ చేసే ప్రయత్నం చేసినట్లుగా తెలుస్తోంది. బంతి మిస్సయ్యి కీపర్ బెయిర్ స్టో చేతుల్లోకి వెళ్లినా లబుషేన్ క్రీజులోనే ఉన్నాడు. త్రో వేయాలన్న ఉద్దేశంతో బెయిర్ స్టో నేరుగా వికెట్ల వైపు విసిరాడు. అయితే లబుషేన్ క్రీజులోనే ఉండడంతో అది ఔట్‌గా పరిగణించలేదు. ఒకవేళ లబుషేన్ క్రీజు దాటి బయట ఉంటే అప్పుడు బెయిర్ స్టో అప్పీల్‌కు వెళ్లేవాడా లేక క్రీడాస్పూర్తి ప్రదర్శించేవాడా అంటే చెప్పలేని పరిస్థితి.
అంటే ఈ లెక్కన చూస్తే ఇంగ్లండ్ కీపర్ బెయిర్ స్టోనే తొలుత ఇది మొదలుపెట్టాడనిపిస్తుంది. ఆ సమయంలో అలెక్స్ క్యారీ గమనించాడేమో తెలియదు కానీ.. తనకు అవకాశం వచ్చినప్పుడు మాత్రం క్రీడాస్పూర్తిని పక్కకుబెట్టి బెయిర్ స్టోను ఔట్ చేశాడు. గెలుపు కోసం ప్రయత్నిస్తున్న ఏ జట్టైనా అలాగే చేస్తుందని.. ఆసీస్‌ను చీటర్స్ అని పిలుస్తున్నారు కానీ అదే స్థానంలో ఇంగ్లండ్ ఉండుంటే కూడా బహుశా అదే జరిగేదేమో అని కొంతమంది అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
England’s hypocrisy exposed as Bairstow tries to stump Labuschagne on Day 3… but of course Stokes would’ve called Marnus back (coughs… BS) #Ashes #ashes2023 #ashes23 pic.twitter.com/MwF0T42dWX
— Paul Kneeshaw (@Stick_Beetle) July 3, 2023
చదవండి: Ashes 2023: నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం.. వాళ్లు ఛీటర్స్! ఆస్ట్రేలియాకు ఇది అలవాటే
బెయిర్‌స్టో వివాదాస్పద స్టంపౌట్‌పై బెన్ స్టోక్స్.. అలాంటి గెలుపు మాకొద్దు..!
Comments
Please login to add a commentAdd a comment