ఇంగ్లండ్ వికెట్‌కీపర్ జానీ బెయిర్ స్టో బ్యాడ్‌లక్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా మారాడు. లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో బెయిర్ స్టో ఔట్ ఎంత వివాదాస్పదంగా మారిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఓవర్ పూర్తయిందని భావించిన బెయిర్ స్టో క్రీజు బయటకు రాగా.. ఆసీస్ కీపర్ అలెక్స్ కేరీ బంతిని నేరుగా వికెట్ల మీదకు విసిరాడు. బంతి ఇంకా డెడ్ కాలేదని.. రూల్ ప్రకారం బెయిర్ స్టో ఔట్ అని అంపైర్ ప్రకటించాడు. దీంతో చేసేదేం లేక బెయిర్ స్టో పెవిలియన్ చేరాడు. అయితే ఈ ఔట్‌పై ఆ తర్వాత చాలా పెద్ద చర్చే జరిగింది.
సహచర బ్యాటర్ రూపంలో వెంటాడిన దురదృష్టం..
తాజాగా బెయిర్ స్టోను మరోసారి దురదృష్టం వెంటాడింది. అయితే ఈసారి ఔట్ రూపంలో కాదు.. సెంచరీ రూపంలో. సెంచరీ చేసే అవకాశమున్నా ఆ అదృష్టానికి నోచుకోలేకపోయాడు. కేవలం ఒక్క పరుగు దూరంలో సెంచరీకి దూరమయ్యాడు. మరి ఔట్ అయ్యాడా అంటే అదీ లేదు. తన సహచర బ్యాటర్ చివరి వికెట్‌గా వెనుదిరగడంతో బెయిర్ స్టో 99 పరుగులు నాటౌట్‌గా నిలవాల్సి వచ్చింది. దీన్నిబట్టి చూస్తే గాయంతో ఏడాదిన్నర పాటు ఆటకు దూరమైన బెయిర్ స్టో రీఎంట్రీ దగ్గరి నుంచి బ్యాడ్‌లక్ వెంటాడుతన్నట్లుగా అనిపిస్తోంది. ఒక్క పరుగుతో సెంచరీ మిస్ చేసుకున్నప్పటికి బెయిర్ స్టో తన ఇన్నింగ్స్‌తో ఇంగ్లండ్‌ను పటిష్ట స్థితిలో నిలిపాడు.
బెయిర్‌స్టో ఇన్నింగ్స్‌తో 592 పరుగులకి ఆలౌట్ అయిన ఇంగ్లండ్ ఆస్ట్రేలియాపై తొలి ఇన్నింగ్స్‌లో 273 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది. జాక్ క్రాలీ 189, మొయిన్ ఆలీ 54, జో రూట్ 84, హారీ బ్రూక్ 61, బెన్ స్టోక్స్ 51 పరుగులు చేసి ఔటయ్యారు. క్రిస్ వోక్స్,బ్రాడ్, అండర్సన్‌లతో మంచి భాగస్వామ్యాలు నెలకొల్పాడు. జానీ బెయిర్ స్టో సెంచరీకి ఒక్క పరుగు దూరంలో ఉన్న సమయంలో జేమ్స్ అండర్సన్‌ని కామెరూన్ గ్రీన్ అవుట్ చేయడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌కు తెరపడింది.
99 వద్ద నాటౌట్‌గా మిగిలిన ఏడో బ్యాటర్‌గా..
టెస్టు క్రికెట్ చరిత్రలో 99 పరుగుల వద్ద నాటౌట్‌గా మిగిలిన ఏడో క్రికెటర్‌గా జానీ బెయిర్‌స్టో నిలిచాడు. ఇంతకుముందు జోఫ్రె బాయ్‌కాట్, స్టీవ్ వా, అలెక్స్ టూడర్, షాన్ పోలాక్, ఆండ్రూ హాల్, మిస్బా వుల్ హక్‌లు 99 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు.
ఇక తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 317 పరుగులకు ఆలౌట్ అయ్యింది.మార్నస్ లబుషేన్ 51, మిచెల్ మార్ష్ 51, ట్రావిస్ హెడ్ 48, స్టీవ్ స్మిత్ 41, మిచెల్ స్టార్క్ 36, డేవిడ్ వార్నర్ 32, అలెక్స్ క్యారీ 20 పరుగులు చేసి సంయుక్తంగా రాణించారు. క్రిస్ వోక్స్ 5 వికెట్లు తీశాడు. 273 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియా మూడోరోజు ఆట ముగిసే సమయానికి 41 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసిది. క్రీజులో మార్నస్ లబుషేన్(44 బ్యాటింగ్), మిచెల్ మార్ష్ ఒక్క పరుగుతో ఉన్నారు. ఆసీస్ ఇంకా 162 పరుగులు వెనుకబడి ఉంది.
చదవండి: #Jadeja: ఔటయ్యింది ఒక బంతికి.. చూపించింది వేరే బంతిని
Comments
Please login to add a commentAdd a comment