యాషెస్ సిరీస్‌లో భాగంగా లీడ్స్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మూడోరోజు ఆటకు వరుణుడు అడ్డు పడ్డాడు. ఇప్పటికైతే ఆస్ట్రేలియా తన రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. ట్రెవిస్ హెడ్ 18, మిచెల్ మార్ష్ 17 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇక లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో బెయిర్ స్టో ఔట్ వివాదంతో ఆసీస్ కీపర్ అలెక్స్ కేరీ విలన్‌గా మారిపోయాడు. లీడ్స్ వేదికగా మొదలైన మూడో టెస్టులో ఇంగ్లండ్ అభిమానులు అలెక్స్ కేరీని టార్గెట్ చేస్తూ గేలి చేశారు''ఆడింది చాలు.. పెవిలియన్ వెళ్లు.. అంటూ షూ, చెప్పులు చూపించడం'' వైరల్‌గా మారింది.
ఇంగ్లీష్ మీడియాలో యాషెస్ విలన్‌గా ముద్ర పడిన అలెక్స్ కేరీ తన చర్యతో మరోసారి వార్తల్లో నిలిచాడు. లీడ్స్‌లోని ఒక కటింగ్‌షాపు ఓనర్‌కు డబ్బులు ఎగ్గొట్టాడు. దాంతో సదరు వ్యక్తి కేరీకి డెడ్‌లైన్ విధించాడు. విషయంలోకి వెళితే.. ఆడం మహమూద్ అనే బార్బర్ వద్ద కేరీ కటింగ్ చేసుకున్నాడు.అందుకు 30 యూరోలు అంటే.. మన కరెన్సీలో రూ.2,718 అయింది.
అయితే ఆసీస్ కీపర్ తన వద్ద అంత డబ్బు లేదని తప్పకుండా ఇచ్చేస్తానని ఆడంతో పేర్కొన్నాడు. కానీ ఇప్పటివరకు అతడికి పైసా కూడా ఇవ్వలేదు. దాంతో చిర్రెత్తుకొచ్చిన మహమూద్.. క్యారీకి డెడ్‌లైన్ విధించాడు. ఈ సోమవారం(జూలై 10)లోగా డబ్బులు ముడితే తాను సంతోషిస్తానని లేదంటే తన ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని తెలిపాడు. అయితే అలెక్స్ కేరీ ఏం చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment