saloon shop
-
విలన్‌గా మారిన ఆసీస్ కీపర్.. కటింగ్షాపులో డబ్బులు ఎగ్గొట్టి
యాషెస్ సిరీస్‌లో భాగంగా లీడ్స్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మూడోరోజు ఆటకు వరుణుడు అడ్డు పడ్డాడు. ఇప్పటికైతే ఆస్ట్రేలియా తన రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. ట్రెవిస్ హెడ్ 18, మిచెల్ మార్ష్ 17 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇక లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో బెయిర్ స్టో ఔట్ వివాదంతో ఆసీస్ కీపర్ అలెక్స్ కేరీ విలన్‌గా మారిపోయాడు. లీడ్స్ వేదికగా మొదలైన మూడో టెస్టులో ఇంగ్లండ్ అభిమానులు అలెక్స్ కేరీని టార్గెట్ చేస్తూ గేలి చేశారు''ఆడింది చాలు.. పెవిలియన్ వెళ్లు.. అంటూ షూ, చెప్పులు చూపించడం'' వైరల్‌గా మారింది. ఇంగ్లీష్ మీడియాలో యాషెస్ విలన్‌గా ముద్ర పడిన అలెక్స్ కేరీ తన చర్యతో మరోసారి వార్తల్లో నిలిచాడు. లీడ్స్‌లోని ఒక కటింగ్షాపు ఓనర్‌కు డబ్బులు ఎగ్గొట్టాడు. దాంతో సదరు వ్యక్తి కేరీకి డెడ్‌లైన్ విధించాడు. విషయంలోకి వెళితే.. ఆడం మహమూద్ అనే బార్బర్ వద్ద కేరీ కటింగ్ చేసుకున్నాడు.అందుకు 30 యూరోలు అంటే.. మన కరెన్సీలో రూ.2,718 అయింది. అయితే ఆసీస్ కీపర్ తన వద్ద అంత డబ్బు లేదని తప్పకుండా ఇచ్చేస్తానని ఆడంతో పేర్కొన్నాడు. కానీ ఇప్పటివరకు అతడికి పైసా కూడా ఇవ్వలేదు. దాంతో చిర్రెత్తుకొచ్చిన మహమూద్.. క్యారీకి డెడ్‌లైన్ విధించాడు. ఈ సోమవారం(జూలై 10)లోగా డబ్బులు ముడితే తాను సంతోషిస్తానని లేదంటే తన ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని తెలిపాడు. అయితే అలెక్స్ కేరీ ఏం చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది. చదవండి: IND Vs WI: అంతా కొత్త మొహాలే.. ఎవర్రా మీరంతా? -
కొంపముంచిన ఫైర్ హెయిర్ కట్... నిప్పుతో చెలగాటం వద్దు!
గుజరాత్: యువకులు రకరకాల హెయిర్ స్టైయిల్స్లో కటింగ్ చేయించుకునేందుకు ట్రై చేస్తుంటారు. అందులో భాగంగానే ఇటీవల ఫైర్ హెయిర్ కట్ స్టైయిల్ మంచి క్రేజీ స్టైయిల్‌గా మారింది. దీంతో యువత ఆ ట్రెండ్ స్టెయిల్నే ఫాలో అవుతున్నారు. అచ్చం అలానే ఒక యువకుడు ఆ స్టైయిల్లోనే జుట్టు కట్ చేయించుకుందామని బార్బర్ షాపు కెళ్లి భయానక చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నాడు. వివరాల్లోకెళ్తే...ఇటీవల మంచి ట్రెండీగా ఉన్న ఫైర్ హెయిర్ కట్ స్టేయిల్లో కట్ చేయించుకుందామని ఒక యువకుడు మంచి పేరున్న సెలూన్‌కి వెళ్లాడు. అయితే ఈ హెయిర్ కట్ని మంటతో హెయిర్‌ని స్టైయిలిష్‌గా కట్ చేస్తారు. అదే ఇందులోని ప్రత్యేకత. అందులో భాగంగా హెయిర్‌కి ఒక విధమైన లిక్విడ్ కెమికల్ని రాసి కటింగ్ స్టార్ట్ చేస్తే ప్రమాదవశాత్తు భగ్గుమని మంటలు అతని తలభాగం, మెడ వరకు వ్యాపించాయి. దీంతో సదరు యువకు చాలా తీవ్రంగా గాయపడ్డాడు. ఈఘటన బుధవారం గుజరాత్లో వలసద్ జిల్లాలో వాపీ అనే సిటీలోని సెలూన్లో చోటు చేసుకుంది. దీంతో సదరు వ్యక్తిని హుటాహుటినా సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని బాధితుడు నుంచి, సదరు సెలూన్‌లోని హెయిర్ కటింగ్ చేసిన బార్బర్ వద్ద నుంచి వాగ్ములం తీసుకుని దర్యాప్తు చేయడం ప్రారంభించారు. (చదవండి: కుమారుడు, భార్య తన కళ్లెదుటే.. ఎంత శిక్ష వేశావు దేవుడా..) -
సీఎం కేసీఆర్ గుడ్‌న్యూస్.. 250 యూనిట్ల కరెంట్ ఫ్రీ
హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో హెయిర్ కటింగ్ షాపులు, లాండ్రీలు, ధోబీఘాట్లకు నెలకు 250 యూనిట్ల వరకు నాణ్యమైన విద్యుత్‌ను ఉచితంగా ఇవ్వాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా రజక సంఘాలు, నాయీ బ్రాహ్మణ సంఘాలు ప్రభుత్వానికి ఇప్పటికే చేసిన విజ్ఞప్తులను పరిశీలించిన మీదట సీఎం కేసీఆర్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. తక్షణమే జీవో జారీ చేయాల్సిందిగా సీఎంవో కార్యదర్శి భూపాల్ రెడ్డిని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ ఆదేశాలకు అనుగుణంగా బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బి.వెంకటేశం ఆదివారం జీవో విడుదల చేశారు. ఉచిత విద్యుత్ సరఫరా ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి రానున్నది. అత్యంత బలహీన వర్గాల అభ్యున్నతే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని, వారి సంక్షేమం కోసం ఇప్పటికే అనేక పథకాలను అమలు చేస్తున్నామని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా తెలిపారు. ఈ నిర్ణయం ద్వారా గ్రామ స్థాయినుంచి జీహెచ్ఎంసీ వరకు ఉన్న కటింగు షాపులు, లాండ్రీ షాపులకు, ధోబీఘాట్లకు నెలకు 250 యూనిట్ల వరకు నాణ్యమైన కరెంటు ఉచితంగా అందుబాటులోకి రానున్నదన్నారు. కులవృత్తిని ఆధారం చేసుకుని జీవనం సాగిస్తున్న తెలంగాణలోని లక్షలాది రజక, నాయీ బ్రాహ్మణ కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందన్నారు. -
గడ్డం గీయటానికి రూ. 4 లక్షల గోల్డ్ రేజర్
ముంబై : కరోనా వైరస్ లాక్డౌన్ కారణంగా దెబ్బ తిన్న వ్యాపారాలను చక్కబెట్టుకోవటానికి కొత్తకొత్త ఐడియాలతో ముందుకు దూసుకుపోతున్నారు వ్యాపారస్తులు. కస్టమర్లను ఆకర్షించటానికి కొత్తకొత్త పద్దతులు వెతుక్కుకుంటున్నారు. మహారాష్ట్ర, పుణెలోని ఓ సెలూన్ షాపు రాజు,పేద తేడా లేకుండా బంగారు రేజర్‌తో గడ్డం గీస్తాం అంటూ కస్టమర్లను బుట్టలో వేసుకుంటోంది. వివరాలు.. పుణెలోని పింపిరిచించ్వాడ్కు చెందిన అవినాష్ బొరుండియాకు ఓ సెలూన్ షాపు ఉంది. లాక్డౌన్ తర్వాత షాపులు తెరిచినప్పటికి ఆశించినంత ప్రయోజనం లేకపోయింది. కస్టమర్లు కూడా చాలా తక్కువ మంది వచ్చేవారు. ఈ నేపథ్యంలో వినూత్నంగా ఏదో ఒకటి చేసి కస్టమర్లను ఆకర్షించాలని భావించాడు. అందుకే దాదాపు 4 లక్షల రూపాయలు ఖర్చుపెట్టి 80 గ్రాముల బంగారు రేజర్‌ను తయారు చేయించాడు. బంగారు రేజర్‌తో గడ్డం గీయటానికి 100 రూపాయలు తీసుకుంటున్నాడు. దీనిపై అవినాష్ మాట్లాడుతూ.. ‘‘ ఈ బంగారు రేజర్‌తో గడ్డం గీయటం ద్వారా సామాన్య ప్రజలు సైతం తాము ప్రత్యేకం అని అనుకునేలా చేస్తున్నాము. గడ్డం చేయించుకోవటానికి కేవలం 100 రూపాయలు మాత్రం చెల్లిస్తే చాలు’’ అని అన్నాడు. చదవండి : గుర్రం అంటే ఆయనకు ప్రాణం.. అందుకే.. ఇంటర్వ్యూలలో ఫెయిల్.. బాధతో 9 ప్లాస్టిక్ సర్జరీలు -
ఎవరికి వారే హెయిర్ స్టైలిస్టులు
‘అసలే కరోనా.. పిల్లలకు కటింగ్ పెరిగింది..సెలూన్‌కు తీసుకెళ్లాలంటే భయమేస్తుంది.. అందుకే నేనే వారికి ఇంట్లో నేనే కటింగ్ చేశా ’ అని బోడుప్పల్‌కు చెందిన ప్రశాంత్ చెప్పాడు. ఇలా నగరంలో చాలా మంది పిల్లలకు కటింగ్ చేయడంతోపాటు సొంతంగా తామే చేసుకుంటున్నారు. సెలూన్ ఎట్ హోమ్..అవును ఇప్పుడు ఇదే సరికొత్త ట్రెండ్. ఎవరి ఇళ్లల్లో వారే హెయిర్ కటింగ్ చేసుకుంటున్నారు. అవసరమైతే భార్య, పిల్లల సైతం సహాయం కోరుతున్నారు. ఇంట్లో తల్లిదండ్రులే పిల్లలకు హెయిర్ కట్ చేస్తున్నారు. సెలూన్లకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటిస్తున్నారు. మగువల బ్యూటీపార్లర్లు సైతం ఇళ్లల్లోనే వెలిశాయి. సాక్షి, హైదరాబాద్: కోవిడ్ మోసుకొచ్చిన సరికొత్త జీవన శైలి ఇది. సెలూన్లు, పార్లర్లకు వెళ్లేందుకు చాలా మంది వెనుకడుగు వేస్తున్నారు. కోవిడ్ కారణంగా అన్ని రంగాల్లో సరికొత్త పోకడలు ముందుకు వచ్చేశాయి. చివరకు హెయిర్ కటింగ్ కోసం కూడా బయటకు వెళ్లకుండా వైరస్ కట్టడి చేసింది. ఇందుకోసం యూట్యూబ్ పాఠాలు సైతం దొహదం చేస్తున్నాయి. నచ్చిన పద్ధతిలో, చక్కటి ఆకృతిలో హెయిర్ కటింగ్ చేసుకొనేందుకు యూట్యూబ్ శిక్షణనిస్తోంది. ఇదే సమయంలో ఇంటి వద్దకు వచ్చి సర్వీసులు అందజేసే ఆన్లైన్ సంస్థలకు సైతం డిమాండ్ కనిపిస్తోంది. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా పనిచేసే ఈ ఆన్లైన్ సంస్థలు వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. దీంతో సాధారణ సెలూన్లు, బ్యూటీపార్లర్లకు డిమాండ్ తగ్గుముఖం పట్టింది. కార్పొరేట్ సెలూన్ల మనుగడ సైతం ప్రశ్నార్థకంగా మారింది. సెలూన్ మనుగడ ప్రశ్నార్థకం ‘‘ఆరు నెలలైంది. గిరాకీ లేదు. మూడు నెలలుగా అద్దెలు చెల్లించలేదు. కుటుంబాన్ని పోషించుకోవడం కష్టంగా మారింది. భవిష్యత్తుపై ఆశలు సన్నగిల్లుతున్నాయి’’ నాగోల్ దగ్గర్లోని బండ్లగూడకు చెందిన ఉదయ్ అనే ఒక బార్బర్ ఆవేదన ఇది. చిన్న సెలూన్ అతనిది. కరోనాకు ముందు జీవితం సాఫీగా సాగింది. రోజుకు రూ.వెయ్యి పైనే లభించింది. కానీఇప్పుడు వారం రోజులు పని చేసినా రూ.200 కూడా రావడం లేదు. ఒక్క ఉదయ్ మాత్రమే కాదు. నగరంలో వేలకొద్దీ సెలూన్ల పరిస్థితి ఇదే.. క్షౌ రవృత్తిదారుల సంఘాల అంచనాల మేరకు గ్రేటర్ హైదరాబాద్‌లో సుమారు 30 వేల హెయిర్ కటింగ్ సెలూన్లు, మరో 10 వేలకు పైగా బ్యూటీ పార్లర్లు ఉన్నాయి. ఈ రెండు కేటగిరీలలో కలిపి కనీసం 7 వేల నుంచి 8 వేల సెలూన్లు, పార్లర్లు గిరాకీ లేక మూతపడినట్లు అంచనా. ఇంకా కొన్ని మూసివేత దిశగా ఉన్నాయి. కోవిడ్ మహమ్మారి వేలాది కుటుంబాలకు ఆర్థికంగా చితికిపోయాయి. దూసుకెళ్తున్న ట్రిమ్మర్ సికింద్రాబాద్‌లోని ఒక కాస్మొటిక్ షోరూమ్‌లో ప్రతి నెలా సుమారు 5 వేల ట్రిమ్మర్లను విక్రయిస్తారు. సాధారణంగా సెలూన్ నిర్వాహకులే వీటిని కొనుగోలు చేస్తారు. కానీ గత జూలై నెలలో ఆ ఒక్క షోరూమ్‌లోనే ఏకంగా 20 వేల ట్రిమ్మర్లను విక్రయించారు. గ్రేటర్ హైదరాబాద్ అంతటా ఆ నెలలో సుమారు 2.5 లక్షల ట్రిమ్మర్ల విక్రయం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. ఒక్క హెయిర్ కటింగ్ కోసం, షేవింగ్ కోసం వినియోగించే ట్రిమ్మర్లే కాదు. రేజర్లు, సీజర్లు, లోషన్లు, ఫోమ్‌లు, డిస్పోజల్ షీట్స్, కోంబ్స్ వంటి వాటి విక్రయాలు సైతం గణనీయంగా పెరిగాయి. వినియోగదారులే స్వయంగా వచ్చి కొనుగోలు చేయడమే ఇందుకు కారణమని వ్యాపార సంస్థలు చెబుతున్నాయి. ఇలా కొనుగోలు చేస్తున్న వాళ్లలో స్వయంగా హెయిర్ కటింగ్‌లు చేసుకొనేవాళ్లతో పాటు బార్బర్ల వద్ద సొంత వస్తువులను వినియోగించే వాళ్లు కూడా ఉన్నారు. చిన్న చిన్న హెయిర్ కటింగ్ సెలూన్లు మొదలుకొని కార్పొరేట్ సెలూన్లు, బ్యూటీపార్లకు వివిధ రకాల వస్తువులను విక్రయించే వ్యాపార సంస్థలు ఇప్పుడు నేరుగా వినియోగదారులకే విక్రయించడం ఈ సరికొత్త ట్రెండ్‌లో భాగమే. దీంతో బేగంబజార్, కోఠీ, చార్మినార్, సికింద్రాబాద్, కూకట్పల్లి, దిల్సుఖ్నగర్ వంటి వివిధ ప్రాంతాల్లో ఉన్న కాస్మొటిక్ షోరూమ్‌లలో ఈ వస్తువుల అమ్మకాలు భారీగా పెరిగాయి. రూ.కోట్లల్లో వ్యాపారాలు జరుగుతున్నాయి. కుదేలైన పార్లర్లు... తిరుమలగిరి ఆర్టీసీ కాలనీకి చెందిన ఒక బ్యూటీపార్లర్ కోవిడ్‌కు ముందు స్త్రీ, పురుషులకు ప్రత్యేకంగా సేవలందజేసింది. వినియోగదారులు ముందస్తు అపాయింట్మెంట్లతో వచ్చేవారు. కానీ ఇప్పుడు వినియోగదారుల సంఖ్య మూడొంతుల మేరకు పడిపోయింది. ‘కోవిడ్ ప్రొటోకాల్ మేరకు సర్వీసులు అందజేస్తున్నప్పటికీ వినియోగదారులు ముందుకు రావడం లేదు..’అని నిర్వాహకులు శ్రీనివాస్ విస్మయం వ్యక్తం చేశారు. బడంగ్‌పేట్‌కు చెందిన పేజ్ 18 సెలూన్ అండ్ అకాడమీ ఒక శిక్షణా సంస్థ. మహిళలకు, పురుషులకు విడి విడిగా సర్వీసులు అందజేస్తుంది. హెయిర్ డిజైనర్లకు శిక్షణనిస్తోంది.‘ఏడాది క్రితం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన అకాడమీ భవితవ్యం ప్రశార్థకంగా మిగిలింది.’’అని ఆవేదన వ్యక్తం చేశారు నిర్వాహకులు సతీష్‌కుమార్. కార్పొరేట్ సెలూన్లపైనా ప్రభావం ఈ క్రమంలోనే కోట్లాది రూపాయలు ఖర్చుచేసి ఏర్పాటు చేసిన కార్పొరేట్ బ్యూటీపార్లర్లు, సెలూన్లలోనూ వినియోగదారుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. వివిధ సంస్థలకు చెందిన వందలాది ఫ్రాంచైసీస్ మూతపడ్డాయి. నగరంలో బాగా ప్రాచుర్యం పొందిన నేచురల్స్, గ్రీన్‌ల్యాండ్స్, అలెగ్జాండర్, జావేద్ వంటి అనేక బడా సంస్థల్లో సైతం 60 శాతానికి పైగా ఆదాయం పడిపోయింది. సగానికి పైగా సిబ్బందిని కుదించారు. సికింద్రాబాద్‌లోని ఓ కార్పొరేట్ సెలూన్లో కరోనాకు ముందు ప్రతి నెలా రూ.25 లక్షలకు పైగా ఆదాయం లభించగా ఇప్పుడు రూ.8 లక్షలు కూడా రావడం లేదని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆన్లైన్ సంస్థలతో మరింత దెబ్బ.. ఇటీవల వినియోగంలోకి వచ్చిన ఆన్లైన్ సంస్థలు సెలూన్ల మనుగడను మరింత ప్రశ్నార్థకం చేశాయి. ఇళ్ల వద్దకే వెళ్లి సేవలందజేసే వెసులుబాటు కల్పించడంతో చాలామంది ఆన్లైన్ సంస్థలను ఆశ్రయియిస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ఉన్న సెలూన్లు, బ్యూటీపార్లకు గిరాకీ లేకుండా పోతోంది. సాధారణ సెలూన్లకే కాకుండా బడా కార్పొరేట్ సెలూన్లకు కూడా ఆన్లైన్ సంస్థలు సవాల్ విరుతున్నాయి. వ్యక్తిగత రక్షణకే కరోనా నుంచి వ్యక్తిగత రక్షణ పొందేందుకే సెలూన్లకు వెళ్లడం లేదు. యూట్యూబ్‌లో చూసి స్వయంగా హెయిర్ కట్ చేసుకుంటున్నారు. పరిస్థితులు మారే వరకు తప్పదు మరి. – సంతోష్, హైటెక్‌సిటీ పిల్లలకు నేనే హెయిర్ స్టైలిస్ట్ పిల్లలకు సెలూన్‌కు తీసుకెళ్లాలంటే భయమేస్తుంది. అందుకే ఇంటి దగ్గర నేనే కట్ చేస్తున్నాను. కొద్దిగా ఇబ్బందిగానే ఉన్నా సెలూన్ కంటే ఇల్లే సేఫ్ కదా. – ప్రశాంత్‌రెడ్డి, బిజినెస్మెన్, బోడుప్పల్ భవిష్యత్తు ప్రశార్థకమే గతంలో ప్రతి రోజూ కనీసం 30 మంది మహిళలు వివిధ రకాల సర్వీసుల కోసం వచ్చేవారు. ఇప్పుడు రోజులో ఐదుగురు కూడా రావడం లేదు. – సుకన్య, బడంగ్పేట్,బ్యూటీపార్లర్ నిర్వాహకులు ఒక పాలసీని రూపొందించాలి సెలూన్లను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలి. ఆర్థిక సహాయం చేయాలి. ప్రతి కుటుంబానికి రూ.50 వేల సహాయం అందజేయాలి. –బాలకృష్ణ నాయీ, క్షౌరవృత్తిదార్ల సంఘం అధ్యక్షుడు -
ఒక్క హెయిర్ కటింగ్‌తో 60 వేల రూపాయలు!
భోపాల్: ఇటీవల కాలంలో రాజకీయ నాయకులు స్వార్థ ప్రయోజనాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. కానీ కొందరు రాజకీయ నాయకులు మాత్రం సేవా భావంతో ఆదర్శంగా నిలుస్తున్నారు. తాజాగా మధ్యప్రదేశ్‌కు చెందిన రోహిదాస్ హెయిర్ సెలూన్ షాప్ పెట్టడానికి మధ్యప్రదేశ్ అటవీశాఖ మంత్రి విజయ్ షాను ఆశ్రయించాడు. అయితే కటింగ్‌లో రోహిదాస్ నైపుణ్యం తెలుసుకోవడానికి హెయిర్ కటింగ్, షేవింగ్ చేయమని రోహిదాస్‌ను మంత్రి విజయ్ షా కోరారు. దీంతో కరోనా నేపథ్యంలో మాస్క్ ధరించి అద్భుతంగా కటింగ్ చేశాడు. రోహిదాస్ నైపుణ్యానికి ముగ్ధుడైన మంత్రి సంతోషంతో రూ.60,000 ఆర్థిక సహాయం చేశారు. ఈ అంశంపై విజయ్ షా స్పందిస్తూ కరోనా ఉదృతి నేపథ్యంలో గత కొన్ని నెలలుగా యువత ఉద్యోగాలు కోల్పోయారని తెలిపారు. కరోనా ప్రభావం ఉన్నా నిబంధనలు (మాస్క్‌లు) పాటించి సంతోషంగా హెయిర్ కటింగ్ చేసుకోవచ్చని అన్నారు. మరోవైపు చిన్న వ్యాపారాలు చేయాలనుకునే యువతకు ప్రభుత్వం రుణ సహాయం చేస్తుందని పేర్కొన్నారు. -
కరోనా: మహారాష్ట్ర కీలక నిర్ణయం
ముంబై : కరోనా కారణంగా గత మూడు నెలల నుంచి మూసి ఉన్న సెలూన్లలకు అనుమతిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జూన్ 28 నుంచి రాష్ట్రవ్యాప్తంగా క్షౌరశాలలు తెరిచేందుకు ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గురువారం జరిగిన సమీక్షలో కేబినెట్ దీనికి ఆమోదముద్ర వేసిందని మంత్రి విజయ్ తివార్ తెలిపారు. లాక్డౌన్ కారణంగా సెలూన్ ఆపరేటర్లు ఆర్థికంగా చితికిపోయారని, ఇప్పటికే 12 మంది బార్బర్లు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో పరిస్థితి ఇంకా దిగజారకముందే వాళ్లకు ఉపశమనం కలిగించేలా ప్రభుత్వం తాజా చర్యలు చేపట్టిందని విజయ్ పేర్కొన్నారు. (రెండు వారాల పాటు సంపూర్ణ లాక్డౌన్) గత వారం రోజుల నుంచి దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే జిమ్ సెంటర్లకు కూడా అనుమతిస్తామని దీనికి సంబంధించి మార్గదర్శకాలను రూపొందిస్తామని తెలిపారు. అయితే తమ వ్యాపారాలను పునరుద్దరించడానికి అనుమతించాలని డిమాండ్ చేస్తూ మహారాష్ట్ర నభీక్ మహామండల్, రాష్ట్రస్థాయి బార్బర్ సంఘాలు గత కొద్దిరోజులుగా ఆందోళనలు చేస్తున్నాయి. లాక్డౌన్ కారణంగా ఆదాయం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వెంటనే దుకాణాలు తెరిచేందుకు అనుమతించాలని, లేని పక్షంలో ఆర్థిక ప్యాకేజీ అయినా ప్రకటించాలని డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సెలూనల్లోమాస్క్, శానిటైజర్ల వాడకం లాంటి వ్యక్తిగత శుభ్రతా ప్రమాణాలు పాటించాలని మంత్రి విజయ్ ఆదేశించారు. ఒక కస్టమర్ కోసం ఉపయోగించిన తువాలు లేదా వస్త్రాన్ని ఇతరులకు ఉపయోగించరాదన్నారు. భారత్‌లో నమోదవుతున్న కరోనా కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలోనే నమోదవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 142,900కి చేరగా 6,739 మంది కోవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. (భూటాన్-అస్సాం నీటి వివాదం అవాస్తం: భారత్) -
ఆర్టీసీ సమ్మె : కత్తెర పట్టిన కండక్టర్
నిర్మల్ అర్బన్: ఓ ఆర్టీసీ కండక్టర్ కత్తెర పట్టాడు. ఆర్టీసీ సమ్మె కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదురవడంతో కుటుంబ పోషణ నిమిత్తం కులవృత్తిని చేపట్టాడు. నిర్మల్ రూరల్ మండలం రత్నాపూర్ కాండ్లీకి చెందిన మహిపాల్ గతంలో సెలూన్ నిర్వహించేవాడు. 2009లో ఆర్టీసీ కండక్టర్‌గా విధుల్లో చేరాడు. అప్పటి నుంచి కులవృత్తిని వదిలేశాడు. నిర్మల్‌లో స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నాడు. వచ్చే జీతంలో ఇంటి కిస్తీలు చెల్లిస్తూ.. పిల్లలను చదివిస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఈ క్రమంలో కార్మికులంతా సమ్మెలో పాల్గొన్నారు. అప్పటికే నెల జీతం రావాల్సి ఉంది. సమ్మె కారణంగా మరో నెల జీతం రాకుండా పోయింది. రెండు నెలలుగా జీతాలు లేకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. ఏం చేయాలో పాలుపోక కులవృత్తి అయిన.. తనకు వచ్చిన పనిని చేపడుతున్నాడు. సమస్యల పరిష్కారం కోసం అటు సమ్మెలో పాల్గొంటూ.. కుటుంబ పోషణ కోసం కులవృత్తిని చేపడుతున్నాడు. -
ప్రజాసంకల్పప యాత్ర : సెలూన్షాపులోకి వెళ్లిన వైఎస్ జగన్
-
అగ్నికి ఆహుతి
బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్ నెం 3లో రెండురోజుల క్రితం ప్రారంభమైన ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ హబీబ్ జావెద్ సెలూన్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీపావళి పండగను పురస్కరించుకుని నిర్వాహకులు లక్ష్మీ పూజ నిర్వహించి దీపాలు వెలిగించి ఎప్పటిలాగే షట్టర్‌ను తాళాలు వేసి వెళ్లిపోయారు. బుధవారం సాయంత్రం దీపాలు సామగ్రికి అంటుకుని మంటలు చెలరేగాయి. సెలూన్లో మంటలను గమనించిన స్థానికులు ఫిలింనగర్ ఫైర్‌స్టేషన్‌కు సమాచారం అందించారు. రెండు ఫైరింజిన్లతో మంటలు ఆర్పారు. సెలూన్లో ఖరీ«దైన ఫర్నిచర్‌తో పాటు బ్యూటీ ఎక్విప్మెంట్స్ మంటల్లో కాలి బూడిదయినట్లు నిర్వాహకులు తెలిపారు. సెలూన్లో ఎలాంటి ఫైర్‌సేప్టీ పరికరాలు లేకపోవడాన్ని అ«ధికారులు గుర్తించారు. షార్ట్ సర్క్యూట్‌తో మంటలు.. బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని ఎమ్మెల్యే కాలనీకి వెళ్లే దారిలో ఏసీబీ కార్యాలయాన్ని ఆనుకుని ఉన్న వ్యాపారికి చెందిన కార్యాలయంలో మంగళవారం అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఫర్నిచర్‌తో పాటు కంప్యూటర్లు, పత్రాలు, ఇతర సామగ్రి కాలిపోయాయి. మంటలను త్వరగా గుర్తించడంతో పైఫ్లోర్‌లో ఉన్న ఇంటికి ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదు. రాకెట్ దూసుకు వచ్చి.. బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని çకిమ్టీ కాలనీలోని ఫుడీస్ రెస్టారెంట్లో బుధవారం రాత్రి 11 గంటల సమయంలో అగ్ని çప్రమాదం చోటు చేసుకుంది. దీపావళి సందర్భంగా సమీపంలో స్థానికులు కాలుస్తున్న బాణసంచా ఎగిరివచ్చి మూడో అంతస్తులో ఉన్న కిటికీ నుంచి లోపకి పడింది. దాంతో అక్కడున్న సోఫాలు, కర్టెన్లు ఇతర సామగ్రికి మంటలు అంటుకున్నాయి. ఈ సమయంలో రెస్టారెంట్ మూసి ఉండడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.రెస్టారెంట్లో నుంచి పొగలు వస్తున్న విషయాన్ని గుర్తించిన సెక్యూరిటీ సిబ్బంది ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో అక్కడకు చేరుకుని మంటలు ఆర్పారు. గోదాములో అగ్ని ప్రమాదం.. రూ.3 లక్షల ఆస్తినష్టం రాంగోపాల్‌పేట్: హౌస్ కీపింగ్ మెటీరియల్ గోదాములో బుధవారం రాత్రి అగ్ని ప్రమాదం జరగడంతో సుమారు రూ.3లక్షల మేరకు ఆస్తినష్టం వాటిల్లింది. పోలీసుల కథనం ప్రకారం.. జజనరల్ బజార్‌కు చెందిన ఘన్‌శ్యామ్ అదే మంగ్నిరామ్స్ హోల్‌సేల్ హౌస్ కీపింగ్ మెటీరియల్ విక్రయాలు చేస్తుంటారు. ఆయనకు అదే ప్రాంతంలోసెల్లార్లో గోదాము ఉంది. అక్కడ సామగ్రి మొత్తం నిలువ చేస్తుంటారు. బుధవారం దీపావళి పూజ చేసిన అనంతరం రాత్రి గోదాములో ఒకవైపు సామగ్రి అంటుకుంది. వెంటనే వాళ్లు ఆర్పేందుకు యత్నించిన మంటలు అదుపులోకి రాకపోవడంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి మంటలను ఆర్పేందుకు యత్నించారు. టపాసుల నిప్పురవ్వలతోనే అగ్ని ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇల్లు దగ్ధం.. తప్పిన ప్రాణాపాయం నాంపల్లి: తారాజువ్వల నిప్పు రవ్వలు అంటుకోవడంతో ఓ ఇల్లు దగ్ధమైన ఘటన దీపావళి రోజున అర్థరాత్రి చోటుచేసుకుంది. నాంపల్లి ఇన్స్పెక్టర్ సుభాష్ చంద్రబోస్ తెలిపిన వివరాల ప్రకారం... నాంపల్లి రైల్వే పోలీసు స్టేషన్ సమీపంలో టిప్పుఖాన్ సరాయి మురికివాడలో జావెద్ నివాసం ఉంటున్నారు. అతడి ఇంటిపైకప్పుపై తారా జువ్వల నిప్పు పడింది. ఇది రాజుకుని గురువారం తెల్లవారు జామున మంటలు చెలరేగాయి. గాఢ నిద్రలో ఉన్న జావెద్ కుటుంబ సభ్యులు బయటకు పరుగులు తీశారు. ప్రమాదంలో మేక, పది కోళ్లు మృతి చెందాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పాకిస్తానీలా ఉన్నావ్ గడ్డం తీసెయ్..!
గురుగ్రామ్ (హరియాణ) : దేశంలో కుల, మతాల మధ్య కుమ్ములాటలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఓవైపు గోరక్షణ పేరుతో ముస్లింలపై దాడులు కొనసాగుతుండగా.. తాజాగా గడ్డం పెంచిన ఓ ముస్లిం యువకుడిపై కొందరు దుండగులు దాడికి దిగారు. బలవంతంగా లాక్కెళ్లి షేవింగ్ చేయించారు. ఈ ఘటన గురుగ్రామ్‌లో గురువారం చోటుచేసుకుంది. వివరాలు.. సెక్టార్ 29, మేవాత్ ప్రాంతంలో నివాసముండే జఫారుద్దీన్ హమీద్‌ను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అడ్డుకున్నారు. ‘పాకిస్తానీలా ఉన్నావ్ గడ్డం తీసెయ్’ అంటూ హుకుం జారీ చేశారు. అతను నిరాకరించడంతో.. ‘నువ్ పాకిస్తానీవి. అందుకే అలా గడ్డం పెంచుకున్నావ్. పాకిస్తానివి కాకపోతే వెంటనే గడ్డం తీసేయ్’ అని దాడి చేశారు. అక్కడితో ఆగకుండా దగ్గర్లో ఉన్న సెలూన్ షాప్‌కు అతన్ని లాక్కెళ్లారు. అక్కడ గడ్డం గీయడానికి బార్బర్ నిరాకరించడంతో.. ఇద్దరినీ కొట్టారు. హమీద్‌ను కుర్చీకి కట్టేసి.. బలవంతంగా గడ్డం గీయించారు. బాధితుని పిర్యాదు మేరకు కేసు నమోదు చేశామనీ, నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. -
పాత కక్షలతో వ్యక్తి దారుణ హత్య
ముదిగుబ్బ, న్యూస్‌లైన్ : పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్న సెలూన్ షాపులో షేవింగ్ చేయించుకుంటున్న ఓ వ్యక్తి శనివారం దారుణ హత్యకు గురయ్యా డు. పాతకక్షలే ఈ హత్యకు దారితీశాయని తెలిసింది. పోలీసులు, మృతుని కుటుంబ సభ్యుల కథనం మేరకు... తిమ్మనాయుని(టీఎన్)పాళ్యంకు చెం దిన టీడీపీ కార్యకర్త బొగ్గు మునయ్య (50) ఏడేళ్లుగా ముదిగుబ్బలో నివాసముంటున్నాడు. టీఎన్ పాళ్యం సమీపంలోని యోగి వేమన రిజర్వాయర్ (వైవీఆర్) ప్రాజెక్టులో చేపలు పట్టే విషయమై ఈయనకు మరొక వర్గానికి తరచూ ఘర్షణలు జరిగేవి. ఇదే విషయమై 20 రోజుల క్రితం ఇరు వర్గాల వారూ గొడవపడి పోలీస్‌స్టేషన్‌లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం నాలుగు గంటలకు పోలీస్‌స్టేషన్ సమీపంలోని ఓ షాపులో షేవింగ్ చేయిం చుకుంటున్న మునయ్యపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వేటకొడవళ్లతో దాడిచేశారు. తల, చేయి తదితర భాగాలపై విచక్షణారహితంగా నరకడంతో ఆయన అక్కడే కుప్పకూలిపోయాడు. ఈ హఠాత్పరిణామానికి భీతిల్లిన సెలూన్‌షాపు నిర్వాహకుడు బయటకు పరుగులు తీశాడు. సమాచారం అందుకున్న నల్లమాడ సీఐ రవీంద్రనాథ్‌రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మునయ్యకు భార్య, ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ప్రత్యర్థి వర్గం వారే ఈ దారుణానికి పాల్పడి ఉంటారని హతుని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ హత్యకు పోలీసుల వైఫల్యమే కారణమని టీడీపీ ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జి వరదాపురం సూరి ఆరోపించారు.