
గుజరాత్: యువకులు రకరకాల హెయిర్ స్టైయిల్స్‌లో కటింగ్ చేయించుకునేందుకు ట్రై చేస్తుంటారు. అందులో భాగంగానే ఇటీవల ఫైర్ హెయిర్ కట్ స్టైయిల్ మంచి క్రేజీ స్టైయిల్‌గా మారింది. దీంతో యువత ఆ ట్రెండ్ స్టెయిల్‌నే ఫాలో అవుతున్నారు. అచ్చం అలానే ఒక యువకుడు ఆ స్టైయిల్‌లోనే జుట్టు కట్ చేయించుకుందామని బార్బర్ షాపు కెళ్లి భయానక చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నాడు.
వివరాల్లోకెళ్తే...ఇటీవల మంచి ట్రెండీగా ఉన్న ఫైర్ హెయిర్ కట్ స్టేయిల్‌లో కట్ చేయించుకుందామని ఒక యువకుడు మంచి పేరున్న సెలూన్‌కి వెళ్లాడు. అయితే ఈ హెయిర్ కట్‌ని మంటతో హెయిర్‌ని స్టైయిలిష్‌గా కట్ చేస్తారు. అదే ఇందులోని ప్రత్యేకత. అందులో భాగంగా హెయిర్‌కి ఒక విధమైన లిక్విడ్ కెమికల్‌ని రాసి కటింగ్ స్టార్ట్ చేస్తే ప్రమాదవశాత్తు భగ్గుమని మంటలు అతని తలభాగం, మెడ వరకు వ్యాపించాయి.
దీంతో సదరు యువకు చాలా తీవ్రంగా గాయపడ్డాడు. ఈఘటన బుధవారం గుజరాత్‌లో వలసద్ జిల్లాలో వాపీ అనే సిటీలోని సెలూన్‌లో చోటు చేసుకుంది. దీంతో సదరు వ్యక్తిని హుటాహుటినా సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని బాధితుడు నుంచి, సదరు సెలూన్‌లోని హెయిర్ కటింగ్ చేసిన బార్బర్ వద్ద నుంచి వాగ్ములం తీసుకుని దర్యాప్తు చేయడం ప్రారంభించారు.
(చదవండి: కుమారుడు, భార్య తన కళ్లెదుటే.. ఎంత శిక్ష వేశావు దేవుడా..)
Comments
Please login to add a commentAdd a comment