Hair style
-
ప్రభాస్ హెయిర్ స్టైల్ కావాలి.. ఫ్లాట్ హెయిర్ కట్ నచ్చడం లేదు!
‘మాకు హీరో ప్రభాస్‌లాగా హెయిర్ స్టైల్ కావాలి.. జుట్టు పొడుగ్గా పెంచుకొనేందుకు అనుమతి ఇవ్వాలి.. గాజులు వేసుకొనేందుకు పర్మిషన్ ఇవ్వాలి. టీచర్ల మాదిరిగా చీరలు కట్టుకోవాలని ఉంది’.. వరంగల్ జిల్లా రెసిడెన్షియల్ వెల్ఫేర్ స్కూళ్లలో సమస్యలు తెలుసుకొనేందుకు అధికారులు ఏర్పాటుచేసిన ఫిర్యాదుల బాక్సుల్లో విద్యార్థులు వేసిన వినతులు ఇవి. ఆహారం బాగా లేదనో, హోం వర్క్ ఎక్కువ ఇస్తున్నారో, పుస్తకాలు లేవనో ఫిర్యాదులు వస్తాయని అధికారులు ఆశించారు. కానీ, ఫిర్యాదు బాక్సుల్లో మాత్రం ఇలాంటి వినతులు కనిపించాయి.దీనిపై ఓ విద్యార్థిని ఒక సీనియర్ అధికారి ప్రశ్నించగా.. ‘స్థానిక బార్బర్ అబ్బాయిలందరికీ ఒకే రకమైన ఫ్లాట్ హెయిర్ కట్ ‘తాపేలి కట్’చేస్తున్నాడు. అది నచ్చడం లేదు. అందుకే హీరోల వంటి హెయిర్ కట్ కావాలని కోరాం’ అని తెలిపాడు. ఈ విషయంలో వారు సీరియస్‌గానే ఉన్నారని ఆ అధికారి చెప్పారు. ‘ఈ పిల్లలకు ఫోన్లు అందుబాటులో లేవు. తల్లిదండ్రులతో క్రమం తప్పకుండా మాట్లాడలేరు. అందుకే ఫిర్యాదు పెట్టెలను పెట్టించాం. వీళ్ల ఫిర్యాదులు ఆసక్తికరంగా ఉన్నాయి. తమ భావాలను స్పష్టంగా వ్యక్తీకరిస్తున్నారు’అని జిల్లా ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. గణేశ్ ఉత్సవాల సందర్భంగా కొంతమంది విద్యార్థులు పాఠశాలలో పూజలు ఏర్పాటు చేయాలని కోరారు. కొంతమంది విద్యార్థినులు సీనియర్లు తమను వేధిస్తున్నారని ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియా ప్రభావమే... ఇదంతా సోషల్ మీడియా ప్రభావమేనని విద్యారంగ నిపుణులు అంటున్నారు. ‘క్యాంపస్‌లలో ఫోన్లను అనుమతించనప్పటికీ, చాలా పాఠశాలల్లో కంప్యూటర్ సైన్స్ ల్యాబ్‌లు ఉన్నాయి. వాటి ద్వారా పిల్లలు సోషల్ మీడియాలో లేటెస్ట్ ట్రెండ్లను తెలుసుకుంటున్నారు. వాళ్లు తమ మనసులోని మాటలను చెప్పడం మంచిదే. వాళ్లపై ఏవి ప్రభావం చూపుతున్నాయో తెలియాలి’ అని పాఠశాల పిల్లలతో కలిసి పనిచేసే డెవలప్మెంట్ ప్రొఫెషనల్ కన్సల్టెంట్ ఒకరు చెప్పారు. కోవిడ్ –19కి ముందు ఎక్కువ ఫిర్యాదులు ఆహారం నాణ్యత, ఉపాధ్యాయుల శిక్షణ గురించి ఉండేవని.. ఇప్పుడు ఇలా ఉంటున్నాయని చెప్పారు.చదవండి: ముద్ద అన్నం.. తింటే కడుపు నొస్తోంది -
దీపికా పదుకొణె బ్యూటీ రహస్యం..! ఇలా చేస్తే జస్ట్ మూడు నెలల్లో..
బాలీవుడ్ ప్రసిద్ధ నటి దీపికా పదుకొణె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందం, అభినయంతో వేలాది అభిమానులను సంపాదించుకుంది. ఆమె ఇటీవలే పండటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఇక గ్లామర్ పరంగా దీపికాకి సాటిలేరు అనడంలో అతిశయోక్తి లేదు. ఆమె మేని ఛాయ, కురులు కాంతిలీనుతూ ఉంటాయి. చూడగానే ముచ్చటగొలిపే తీరైన శరీరాకృతి చూస్తే..ఇంతలా ఎలా మెయింటెయిన్ చేస్తుందా? అనిపిస్తుంది కదూ. ఇంతకీ ఆమె బ్యూటీ రహస్యం ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు. అంతేగాదు దీన్ని రెగ్యులర్‌గా పాటిస్తే జస్ట్ మూడునెలల్లో దీపికాలాంటి మెరిసే చర్మం, జుట్టుని సొంతం చేసుకోవచ్చట. అదేంటో చూద్దామా..!.మనం తీసుకునే ఆహరమే చర్మం, జుట్టు ఆరోగ్యంలో కీలకపాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతుంటారు. అందుకే తాజా పండ్లు, కూరగాయాలకు ప్రాధాన్యత ఇవ్వండని పదేపదే సూచిస్తుంటారు. అయితే ఇటీవల ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ పూజ అనే మహిళ జ్యూస్ రెసిపీతో కూడిన వీడియో పోస్ట్ చేసింది. అందులో ఇది బాలీవుడ్ నటి దీపికా పదుకొణెకు మూడు నెలల్లో మెరిసే చర్మం, మెరిసే జుట్టుని పొందడంలో సహయపడిందని పేర్కొనడంతో ఈ విషయం నెట్టింట తెగ వైరల్‌గా మారింది. నిజానికి ఆ జ్యూస్ రెసిపీలో ఉపయోగించిన పదార్థాలన్నీ ఆరోగ్యకరమైనవే. పైగా శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ ఉన్నాయి. ఆ జ్యూస్ ఏంటంటే..వేప, కరివేపాకు, బీట్రూట్, పుదీనాలతో చేసిన జ్యూస్. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, బయోస్కావెంజర్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉపయోగించినవన్నీ మంచి చర్మాన్ని, బలమైన జుట్టుని పొందడంలో ఉపయోగపడేవే. ప్రయోజనాలు..వేప ఆకులు: ఇది యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. కాబట్టి వేప ఆకులు శరీర నిర్విషీకరణకు దోహదం చేస్తాయి. ఇది మొటిమలను నియంత్రించి చర్మ కాంతివంతంగా ఉండేలా చేయడంలో సహాయపడుతుంది. బీట్రూట్: ఇందులో ఐరన్, ఫోలేట్, విటమిన్ సీలు ఉన్నాయి. ఇవి రక్త ప్రసరణకు, శరీరంలో కొత్త కణాలు ఏర్పడటానికి ముఖ్యమైనవి. ఇది చర్మాన్ని మృదువుగానూ, ఆర్యోకరమైన రంగుని అందిస్తుంది. అలాగే జుట్టు స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కొత్తిమీర ఆకులు: దీనిలో విటమిన్ ఏ, సీ కేలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి రక్తాన్ని శుద్దీ చేసి మేని ఛాయను మెరుగుపరచడంలో సహాయపడతాయి. అలాగే ఇది జీర్ణవ్యవస్థను మెరుగ్గా ఉంచడమే గాక హైడ్రేటెడ్‌గా ఉండేలా చేస్తుంది.పుదీనా ఆకులు: పుదీనా యాంటీఆక్సిడెంట్ లక్షణాల తోపాటు శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఇది వేడిని తగ్గించి శరీరాన్ని లోపలి నుంచి పునరుజ్జీవింపజేపసి మొటిమలను నివారిస్తుంది. తయారీ విధానం..కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కలు, కరివేపాకు, వేపాకులు, కొత్తిమీర, పుదీనా వంటి పదార్థాలన్ని మిక్కీలో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. పిప్పితో సహా తాగడం కష్టంగా ఉంటే..వడకట్టుకుని తాగినా మంచి ఫలితం ఉంటుంది. దీన్ని ఉదయాన్నే తాజాగా తీసుకోవాలి. ఇలా క్రమంతప్పకుండా కనీసం మూడు నెలలు ఈ జ్యూస్‌ని తీసుకుంటే కాంతివంతమైన మేని ఛాయ, ఒత్తైన జుట్టు మీ సొంతం.(చదవండి: అమెరికాలో ... శాస్త్రీయ నృత్య రూపకంగా దుర్యోధనుడు) -
విచిత్రమైన హెయిర్ స్టైల్‌తో రకుల్ ప్రీత్ సింగ్ (ఫొటోలు)
-
ఓర్రీ న్యూ లుక్.. నెటిజన్స్ దారుణ ట్రోల్స్!
సెలబ్రిటీలతో ఫోటోలు దిగాలని అందరూ తహతహలాడతారు.. కానీ సెలబ్రిటీలు మాత్రం ఇతడితో ఫోటో దిగేందుకు ఎగబడతారు. అతడే ఓర్రీ.. పూర్తి పేరు ఓర్హాన్ అవత్రమణి. సినీతారలు. హీరోయిన్లకు ఇతడు బెస్ట్ ఫ్రెండ్.. బాలీవుడ్లో అంతలా ఫేమస్ అయ్యాడు. రచయితగా, సింగర్‌గా, ఫ్యాషన్ డిజైనర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఓర్రీ తాజాగా న్యూ హెయిర్ కట్‌తో కనిపించారు. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. నేను ప్రతి సాయంత్రం మేల్కొంటాను.. మీరు ఇప్పటికీ 9 నుంచి 5 వరకు పనిచేస్తూనే ఉంటారు.. అది ఎంత చెడ్డదోనని ఆశ్చర్యపోతున్నానంటూ పోస్ట్ చేశారు.అయితే ఒర్రీ హెయిర్ స్టైల్‌పై నెటిజన్స్ భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు. అతని న్యూ లుక్‌ను ఉద్దేశించి నెటిజన్స్ దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. అతని లుక్‌ను చికెన్ హెయిర్ కట్ అంటూ కోడిపుంజుతో కొందరు పోల్చారు. మరికొందరేమో నా పాతబట్టలు తీసుకోండి అంటూ సలహా ఇచ్చాడు. ఇంకొందరైతే ఏకంగా చికెన్ సెంటర్లో పనిచేసే వాడిలా ఉన్నాడంటూ కామెంట్స్ చేశారు.ఎవరీ ఓర్రీ...ఓరీ గురించి వివరాలు ఆరా తీస్తే... అతడు న్యూయార్క్ పార్సన్స్ స్కూల్ ఆఫ్ డిజైన్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశాడట. ఆ తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించిన ఓ ఆఫీసులో స్పెషల్ ప్రాజెక్ట్ మేనేజర్‌గా పని చేసినట్లు తెలుస్తోంది. ఇతడు ఓ సామాజిక కార్యకర్త కూడా! మరి ఇప్పుడేం చేస్తున్నాడు? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.. దీని గురించి ఓరీ ఓసారి మాట్లాడుతూ.. 'నేను ఏరోనాటికల్ ఇంజనీర్ కావాలనుకున్నాను. కానీ ఏమయ్యాను? రచయితగా, సింగర్‌గా, ఫ్యాషన్ డిజైనర్‌గా, క్రియేటివ్ డైరెక్టర్‌గా, స్టైలిష్‌గా, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్‌గా.. ఇలా రకరకాల పనులు చేస్తున్నాను. కొన్నిసార్లు ఫుట్‌బాల్ కూడా ఆడతాను. View this post on Instagram A post shared by Orhan Awatramani (@orry) -
అనంత్ అంబానీ గ్రాండ్ వెడ్డింగ్ : ఆలిమ్ హకీం స్టయిల్స్ మామూలుగా లేవుగా!
హెయిర్ డ్రెస్సర్ అనగానే సెలబ్రిటీలకు గుర్తొచ్చే పేరు ఆలిమ్ హకీమ్. ఆలీం చెయ్యేస్తే మాస్.. క్లాస్ ..అదిరే లుక్స్.. గుర్తు పట్టలేనంత అందంగా తీర్చిదిద్దేంత ప్రతిభ అతని సొంతం. అందుకే సెలబ్రిటీలు, స్టార్లు, గొప్ప గొప్ప బిజినెస్ మేన్లు సెలబ్రిటీ హెయిర్ స్టయిలిష్ట్ ఆలిమ్ హకీమ్. తాజాగా అంబానీ పెళ్లి ఇంట సందడిలో మేజిక్ చేస్తున్నాడు.బాలీవుడ్ ,టాలీవుడ్ , క్రికెట్, బిజినెస్ ఇలా రంగం ఏదైనా టాప్ సెలబ్రిటీలు ఆలిమ్ హకీమ్ కస్టమర్లు. తన హెయిర్ స్టైల్‌తో స్టైలిష్ లుక్స్ ఇచ్చి అందర్నీ ఆకట్టుకుంటాడు. మహేష్ బాబు,రణవీర్ సింగ్, ధోని, కోహ్లీ లాంటి స్టార్ల లుక్‌ను అదుర్స్ అనిపించేలా తీర్చిదిద్దిన ఘన ఆయ సొంతం. తాజాగా రిలయన్స్ కుచెందిన కాబోయే వరుడు అనంత్ అంబానీకి రూపును అందంగా తీర్చిదిద్ది మరోసారి వార్తల్లోకి వచ్చాడు.రిలయన్స్ ఫ్యామిలీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అనంత్-రాధిక మర్చంట్ వివాహ వేడుకల్లో ఆలిమ్ హకీమ్ హెయిర్ స్టయిలిస్ట్‌గా తన సత్తా చాటాడు. వరుడు అనంత్ అంబానీ, అలాగే ముఖేష్ అంబానీ పెద్దకుమారుడు ఆకాష్ లుక్‌ను అద్భుతంగా మార్చేశాడు. ఈ సందర్భంగా ఇన్‌స్టాలో ఆలిమ్ హకీమ్ అంబానీకి ఫేడ్ కట్‌తో ఎలా సరికొత్త రూపాన్ని ఇచ్చాడో షేర్ చేశాడు.అంతేనా కాబోయే వరుడు అనంత్ అంబానీకి కూడా అలీమ్ అద్భుతమైన మేకోవర్ ఇచ్చాడు. అనంత్ పొడవాటి గిరజాల జుట్టును కత్తిరించకుండా మేకోవర్ చేయడం హైలైట్‌గా నిలిచింది. అలాగే పెళ్లికి వచ్చిన అతిథుల కేశాలను అందంగా తీర్చిదిద్దుతున్నాడు. View this post on Instagram A post shared by Eka (@ekalakhani) -
అనంత్ -రాధిక పెళ్లి వేడుక: తమిళియన్ హెయిర్ స్టైల్లో ఇషా..!
రిలయన్స్ ఇండస్ట్రీస్ దిగ్గజం ముఖేష్ అంబానీ-నీతాల చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి వేడుకలు అత్యంత వైభవోపేతంగా సాగుతున్నాయి. సంగీత్ దగ్గర నుంచి హల్దీ వరుకు సాగిన వివాహ సంబరాల్లో అంబానీ కుటుంబసభ్యులు మునిగితేలుతున్నారు. ఆ వేడుకల్లో వాళ్లంతా ఏళ్ల నాటి సంప్రదాయ ఫ్యాషన్ స్టైల్‌ని గుర్తుచేసేలా.. ఆయా వస్త్రధారణలో కనిపించి ఆశ్చర్యపరుస్తున్నారు. ఆ వేడుకలో నీతా నుంచి ఇషా, శ్లోకా మెహతా వివిధ రకాల లగ్జరీయస్ ఫ్యాషన్ డిజైనర్‌వేర్‌లతో అలరించారు. ఇప్పుడూ తాజాగా ఇషా సరికొత్త హెయిర్ స్టైల్లో కనిపించింది. ఇది తమిళయన్ హెయిర్ స్టైల్లో జడను వేశారు. జడ పైభాగంలో మొగ్ర పువ్వులతో ఓ పెద్ద కొప్పులా ఉండి..కింద నుంచి గోల్డెన్ థ్రెడ్‌తో అల్లారు. ఇక అందుకు తగ్గట్టుగా గ్రీన్ లెహంగాలో స్టన్నింగ్ లుక్‌లో కనిపించారు. అలాగే వాటికి మ్యాచింగ్ అయ్యేలా చెవిపోగులు ఇరువైపుల సూర్యుడు, చంద్రుడుని ధరించిందా అన్నంతా గ్రాండ్ లుక్‌లో కనిపించింది ఇషా. కాగా, అనంత్-రాధికలు జూలై 12న శుక్రవారం వివాహ బంధంతో ఒక్కటికానున్నారు. ఈ వివాహం అనంతరం జూలై 14న గ్రాండ్ రిసెప్షన్ జరగనుంది. ఇది మంబై నగరంలోని అంబానీ జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ , వారి కుటుంబ సభ్యుల సమక్షంలో జరగనున్నట్లు సమాచారం. View this post on Instagram A post shared by Ambani Family (@ambani_update) (చదవండి: నాజూగ్గా ఉండాలనుకుంటే..మొరింగ నీటిని ట్రై చేయండి..!) -
కొత్త హెయిర్ స్టైల్లో విరాట్ కోహ్లీ..వావ్!అంటూ ఫ్యాన్స్ కితాబు!
భారత క్రికెట్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లకి విధ్వంసకర బ్యాట్స్మ్యాన్గానే గాక.. స్టైలీష్ ఐకాన్‌గా కూడా మంచి గుర్తింపు పొందాడు. చాలామంది అభిమానులు విరాట్ స్టైల్‌నే ఫాలో అవుతుంటారు. అంతలా ఉంటుంది ఆయన హెయిర్ స్టైల్‌కి, గడ్డం స్టైల్‌కి క్రేజ్. ప్రతి ఐపీఎస్ మ్యాచ్‌కి కోహ్లీ కొత్త లుక్‌లో ఎంట్రీ ఇస్తూ..అభిమానులను ఆశ్చర్యపరుస్తుంటాడు. అందులోనూ ఈసారీ టీ20 వరల్డ్ కప్ రెండు వారాల్లో జరగనుంది. అందుకోసం కోహ్లీ ఏ హెయిర్‌స్టైల్‌తో కనిపించనున్నాడా? అని ఆసక్తిగా చూస్తున్నారు ఫ్యాన్స్. ఈసారి కోహ్లీ కేశాలంకరణ ఏ స్టయిల్లో ఉందంటే..విరాట్‌ని డిఫెరెంట్ డిఫెరెంట్ స్టయిల్ కనిపించేలా మెరుగులు దిద్దేది సెలబ్రిటీ స్టైలిస్ట్ ఆలిమ్ హకీమ్. అతడి స్టైలిష్ నైపుణ్యంతో విరాట్ లుక్‌ని మరింత ఎంట్రాక్టివ్గా కనిపించేలా చేస్తాడు. ముఖ్యంగా అతడి ఫ్యాన్స్ ఫిదా అయ్యి స్టయిల్‌నే ఫాలో అయ్యేంతగా ఆకర్ణణీయంగా మలుస్తాడు. ఈసారి హకీమ్ చాలా కొత్తగా.. కోహ్లి లుక్‌ని ప్రజెంట్ చేశాడు. View this post on Instagram A post shared by Aalim Hakim (@aalimhakim) వన్ అండ్ ఓన్లీ కింగ్ కోహ్లీ కోసం గ్రుంగి షార్ప్ హ్యారీకట్ని ఎంచుకున్నట్లు హకీమ్ సోషల్ మీడియాలో పేర్కొన్నాడు. ఇది గ్రాడ్యయేషన్ చేస్తున్న కుర్రాడి లుక్‌ని ఇస్తుందని చెప్పాడు. ఫ్రంట్ హెయిర్లెస్గా ఉండి, మిగతా అంతా పొడవుగా ఉండి కదలికలు ఉండేలా సరికొత్త హెయిర్ స్టయిల్ని సెట్ చేశాడు హకీమ్. ఇక హకీమ్ బాలీవుడ్ సినీ ప్రముఖుల నుంచి ప్రసిద్ధ సెలబ్రిటీలకు డిఫరెంట్ హెయిర్ స్టయిల్ పరిచయం చేస్తుంటాడు. అతడు ఏకంగా లక్ష రూపాయల దాక చార్జ్ చేస్తాడు.కోహ్లీ కొత్త హెయిర్ స్టైల్‌కి సంబంధించిన న్యూలుక్ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్ల రెండు రోజుల్లో జరగనున్ను టీ20 ప్రపంచకప్‌కి తగ్గ కొత్తహెయిర్ స్టయిల్ ఇది అని కామెంట్లు చేస్తూ పోస్టులు పెడుతున్నారు. ఒక అభిమాని ఆర్సీబీ జెర్సీ ధరించి..హృదయపూర్వకంగా నవ్వుతున్న కోహ్లీ వీడియోని షేర్ చేస్తూ.. టీ20 వరల్డ్ కప్‌కి విరాట్ కొత్త హెయిర్ స్టైల్ అని పేర్కొంటూ సోషల్ మీడియా ఎక్స్‌లో వీడియో పోస్ట్ చేశాడు.New hairstyle for T20 WC🙂👍🏻#viratkohli pic.twitter.com/4Vdp4Ha3PQ— 𝙒𝙧𝙤𝙜𝙣🥂 (@wrognxvirat) May 16, 2024 (చదవండి: సౌదీ అరేబియా రాజుకి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్! ఎందువల్ల వస్తుందంటే..?) -
కొత్త హెయిర్ స్టైల్ లుక్‌లో విరాట్ కోహ్లీ..ధర వింటే షాకవ్వుతారు!
సినీ తారలు, స్పోర్ట్స్ స్టార్ల పట్ల అభిమానుల్లో ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వాళ్లు ధరించే దుస్తులు దగ్గర నుంచి వాచ్‌లు, షూలు వరకు దేన్ని వదిలిపెట్టకుండా అనుకరిస్తుంటారు అభిమానులు. అందులోకి ముఖ్యంగా వారు చేయించుకునే హెయిర్‌స్టయిల్స్ అస్సలు వదిలపెట్టరు. అలాగే సెలబ్రిటీలు కూడా అందుకు తగ్గట్టుగానే కొత్త కొత్త స్టెయిలిష్ హెయిర్ స్టయిల్స్‌లో దర్శనమిస్తుంటారు. దీన్ని ఎక్కువగా అనుసరించేది స్పోర్ట్స్ స్టార్ ఆర్సీబీ ప్లేయర్ విరాట్ కోహ్లీ అని చెప్పొచ్చు. అతడు ప్రతి ఐపీఎల్ సీజన్‌కి ఓ కొత్త లుక్‌లో కనిపిస్తాడు. ఈసారి కూడా అలానే ఓ కొత్త లుక్ ట్రై చేశాడు. ఈ కొంగొత్త హెయిర్ స్టయిల్స్ కోసం ఎంత ఖర్చు చేస్తాడో వింటే షాకవ్వుతారు. స్టార్ క్రికెటర్‌గానే కాకుండా అత్యంత స్టైయిలిష్ ఇండియన్ క్రికెటర్‌గా కూడా విరాట్‌కి మంచి పేరు ఉంది. అతని దుస్తులు, హెయిర్ స్టైల్ తరుచు జనాల్లో చర్చనీయాంశంగా ఉంటాయి. అంతలా అతడి స్టైలింగ్ ప్రజలను ఆకర్షిస్తుందని చెప్పొచ్చు. ఈ 2024 ఐపీఎల్లో కూడా కొత్త హెయిర్ స్టైల్ లుక్‌లో కనిపించాడు విరాట్. ఆ హెయిర కట్ ధర ఎంతో ప్రముఖ హెయిర్ స్టైలర్ అలీమ్ హకీమ్ వెల్లడించాడు. బాలీవుడ్ తారల నుంచి స్పోర్ట్స్ స్టార్ల వరకు చాలామందికి అతనే హెయిర్ స్టైలింగ్ చేస్తుంటారు. ఈ నైపుణ్యంతోనే అతను మంచి పాపులర్ అయ్యాడు కూడా. స్పోర్ట్ స్టార్స్‌లో ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లికి అతడే ఎక్కువగా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్‌లో హెయిర్ కట్ చేస్తుంటాడు. అతడి ఫీజు స్టార్టింగే ఏకంగా రూ. లక్షల్లో మొదలవుతుందట. మహీ, విరాట్లు తన వద్దే హెయిర్ స్టైలింగ్ చేయించుకుంటారని హకీమ్ చెబుతున్నాడు. ఐపీఎల్ వస్తున్నందున తనను డిఫరెంట్‌గా ఏదైన కొత్త స్టయిల్ ట్రై చేయమని విరాట్ అడిగారని చెప్పుకొచ్చాడు. అతడెప్పుడూ కొత్త కొత్త స్టైల్స్‌ని ట్రై చేస్తుంటాడని అన్నారు. ఈ సారి అతడి హెయర్ స్టయిల్లో కొత్త లుక్‌ని ప్రయత్నించామని అన్నారు. కనుబొమ్మల్లో స్పిలిట్స్ ఉండేలా హెయిర్ కట్ చేశామని అన్నారు. కొద్దిగా హెయిర్‌ని ఒకవైపు పూర్తిగా ఫేడ్‌గా ఉంచి వెనుక భాగంలో కొద్దిగా జుట్టుని వదిలేసి, కలర్ వేసినట్లు వివరించాడు. అందుకు సంబంధించిన ఫోటోని కూడా ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేయడంతో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కాగా ఐపీఎల 2024 విషయానికి వస్తే.. విరాట్ కోహ్లీ టీమ్ ఆర్సీబీ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు).. 5 మ్యాచుల్లో 4 మ్యాచులు ఓడిపోయి..ఎనిమిదవ స్థానంలో ఉంది. ఇక ధోనీకి చెందిన చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే).. 4 మ్యాచ్‌ల్లో 2 గెలిచి.. 3వ స్థానంలో కొనసాగుతోంది. (చదవండి: ఐదుపదుల వయసులోనూ ఫిట్‌గా ఉండే మాధవన్.. నాన్‌వెజ్ లాగిస్తాడట!) -
ట్రెండీ షార్ట్ బాబ్ హెయిర్ స్టయిల్..ఎక్కడి నుంచి వచ్చిందంటే..
యువత రకరకాల హెయిర్ స్టయిల్స్ ఫాలో అవుతుంటుంది. సినిమాల్లో హీరోయిన్లు కొత్త హెయర్ స్టయిల్ పరిచయం చేస్తే ఇక ముందు వెనుక ఆలోచించే పనే లేదన్నట్లు ఫాలో అయిపోతుంది కాలేజ్ యువత. అలా ఎన్నెన్నో కొంగొత్త హెయిర్ స్టయిల్స్ వచ్చాయి. వాటిలో బాగా క్లిక్ అయ్యింది, యువతను బాగా అట్రెక్ట్ చేసింది బాబ్ హెయిర్ స్టయిల్. ఈ హెయర్ స్టయిల్ భారతదేశంలోకి ఎలా వచ్చింది? ఎప్పటి నుంచి అనుసరించేవారంటే.. ఈ హెయిర్ స్టయిల్ బాలీవుడ్ మూవీ 'కుచ్కుచ్ హోతా హై' కాజోల్దే తొలి హెయిర్ స్టయిల్ అని చెప్పొచ్చు గానీ అంతకుమునుపు మన తొలి మహిళా ప్రధాని ఇందిరా గాంధీ ఈ లుక్‌లోనే ఉండేవారు. మన భారతదేశంలో ఆమె నుంచి ఈ బాబ్ హెయిర్ స్టయిల్ మన దేశంలోకి వచ్చిందని చెప్పొచ్చు. అయితే ఎవ్వరూ ఆ కాలంలో దీన్ని అనుకరించే డేర్ చేయలేదు. ఎందుకంటే? పురుషాధిక్య ప్రపంచంలో మహిళలు ఇలా హెయిర్ స్టయిల్ వేసుకునుందుకు జంకే వారు. పైగా దాన్నో పెద్ద నేరంగా భావించేవారు. దీంతో అప్పట్లో ఇలాంటి హెయిర్ స్టయిల్ అంతగా ప్రజాదరణ పొందలేదు. ఇక కాజోల్ మూవీ "కుచ్కుచ్ హోతా"లో షార్ట్ భాబ్ హెయిర్ స్టయిల్లో కనిపించినప్పటి నుంచి ఈ హెయిర్ స్టయిల్‌కి కాస్త్ర క్రేజ్ వచ్చిందని చెప్పొచ్చు. అప్పటి నుంచి చిన్న పిల్లలకు దీన్ని బేబీ హెయిర్ స్టయిల్‌గా ఉపయోగించేవారు. అయితే ఇది పిల్లలకు చాలా క్యూట్‌గా ఉండి మంచి లుక్ ఇచ్చేది. ఆ తర్వాత క్రమంగా టీనేజర్లు ఈ లుక్‌ని పాలో అయ్యేవారు. దీన్ని 'టామ్ బాయ్ స్టయిల్" అని కూడా పిలిచేవారు. అయితే ఈ హెయిర్ స్టయిల్ సమ్మర్లో మంచి కంఫర్ట్‌గా ఉంటుందని చెప్పొచ్చు. ఈ ఎండలకు ఉక్కపోతతో చిర్రెత్తుకొస్తుంటుంది. వొంటి మీద బట్టలే ఈ ఎండల ధాటికి కంపరంగా అనిపిస్తుంది. అలాంటి సమయాల్లో పొడవాటి జుట్టుతో ఇబ్బంది అంతా ఇంతా కాదు!. అయితే ఈ స్టయిల్ కొన్నాళ్లుకు కనుమరుగయ్యి చిన్న జడలు ట్రెండ్‌లోకి వచ్చాయి. జస్ట్ భజాల దాక జుట్టు వదిలేసుకోవడం కూడా బాగా ట్రెండ్ అయ్యింది. ఆ తర్వాత మహిళా ఆఫీసర్లు, అధికారులు ఈ స్టయిల్‌నే అనుసరించేవారు. మళ్లీ ఇన్నేళ్లుకు షార్ట్ బాబ్(టామ్ బాయ్) హెయిర్ స్టయిల్ ట్రెండ్ అవుతోంది. ప్రస్తుతం బాలీవుడ్ సినీ తారలు అలియా భట్, అనుష్కా కోహ్లి నుంచి దీపికా పదుకునే వరకు అంతా ఈ హెయర్ స్టయిల్‌నే ఫాలో అవుతుండటం విశేషం. ఇక ఇటీవలే జరిగిన ఆస్కార్ అవార్డుల ఫంక్షన్లో కూడా ఈ హెయిర్ స్టయిల్‌తోనే రెడ్‌కార్పెట్‌పై హాలీవుడ్ హిరోయిన్లు సందడి చేశారు. పాత హెయిర్ స్టయిల్ అయినా ఎప్పటికీ ఎవర్ గ్రీన్ స్టయిల్‌గా ఈ షార్ట్ బాబ్ హెయర్ స్టయిల్ నిలచిపోయింది. భారతదేశం లాంటి దేశంలో సమ్మర్లో మంచి వెసులుబాటుగా ఉండే హెయిర్ స్టయిల్ ఇది. ఈ సమ్మర్లో పిల్లలతో చక్కగా ఎంజాయ్ చేయాలంటే సరదాగా మీరు ఈ హెయిర్ స్టయిల్లని ఫాలో అయిపోండి ఇంకెందుకు ఆలస్యం. View this post on Instagram A post shared by AnushkaSharma1588 (@anushkasharma) (చదవండి: దాల్చిన చెక్కతో మొటిమలకు చెక్‌పెట్టండిలా!) -
హెయిర్ డైగా 'ఉజాలా'.. కట్ చేస్తే హెయిర్ ఎలా ఉందంటే..!
యువత వింత వింత వేషధారణలు, విచిత్రమైన స్టయిల్స్‌ని పరిచయం చేస్తున్నారు. అందులో కొన్ని సౌలభ్యంగా ఉన్న మరికొన్ని బాబాయ్! ఏంటిదీ అనేలా ఉంటున్నాయి. అలాంటి వెరైటీ ప్రయోగమే చేశాడు ఓ హెయిర్ స్టైలిస్ట్. రాహుల్ కల్శెట్టి అనే హెయిర్‌స్టైలిస్ట్ తన కస్టమర్‌కి ఉన్న బ్లీచ్డ్ హెయిర్‌కి ఉజాలను హెయిర్ డైగా ఉపయోగించాడు. కొద్దిసేపటి తర్వాత నలుపు తెలుపు మిక్స్ అయ్యి ఓ అందమైన లుక్ వచ్చింది. చూడటానికి బాగుంది కూడా. ఇక హెయిర్ స్టైయిలిస్ట్ ఇలా ఉజాలతో హెయిర్ డై వేసిన వీడియో నెట్టింట చక్కర్లు కొట్టడంతో ప్రజలు ఒక్కసారి ఇలా చేసి చూడమని డిమాండ్ చేశారని, అందువల్ల తాను ఈ ధైర్యం చేశానని చెప్పాడు. అంతేగాదు అందుకు సంబంధించని వీడియోని కూడా సదరు స్టైయిలిస్ట్ నెట్టింట షేర్ చేశాడు కూడా. View this post on Instagram A post shared by Rahul Kalshetty (@haireducation_rahul) అయితే నెటిజన్లు ఈ వీడియోని చూసి.. ఉజాలాకి ఇక డిమాండ్ పెరిపోతుందేమో అని ఒకరూ, తదుపరి హార్పిక్ ట్రై చెయ్యండిని మరోకరు కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. ఏదీఏమైనా తెల్లబట్లలు కాంతివంతంగా కనిపించేందుకు ఉపయోగించే ఉజాల హెయిర్ డైగా వినియోగిస్తే అనే ఆలోచనే వెరైటీ. పైగా ట్రే చేసి ఇది కొత్త ట్రెండ్ అని చూపించడం మరింత విశేషం. View this post on Instagram A post shared by Rahul Kalshetty (@haireducation_rahul) (చదవండి: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కీటకం..ధర ఏకంగా రూ. 65 లక్షలు పైనే..) -
పొడవాటి జుట్టు లేదు.. అయినా మిస్ ఫ్రాన్స్‌గా కిరీటం..!
ఫ్రాన్స్ అందాల పోటోల్లో జడ్జీలు విభిన్నమైన దానికి ప్రాధాన్యత ఇస్తు జడ్జిమెంట్ ఇచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచారు. అందాల పోటీకి అసలైన నిర్వచనం ఏంటో క్లియర్‌గా చెప్పారు. ఓ మహిళ నీకు సరిలెవ్వరూ. ప్రతి స్త్రీ అందంగా విభిన్నంగా ఉంటుంది. ఎవరీ అందం వారిదే. స్త్రీల అందాన్ని ఎవరూ డిక్టేట్ చేయకూడదనే ఉద్దేశ్యంతో పొడవాటి కురులు లేకపోయినా మగవాళ్ల మాదిరిగా జుట్టు ఉన్న అమ్మాయిని ఎంపిక చేసి ఆశ్చర్యపరచడమే గాక పలువురు విమర్శులు అందుకున్నారు. ఈ మేరకు నార్డ్ పాస్ డి కైలస్కు చెందిన 20 ఏళ్ల గిల్లెస్ మిస్ ఫ్రాన్స్‌గా కిరీటాని దక్కించుకుంది. దీంతో 103 ఏళ్ల ఫ్రాన్స్ అందాల పోటీల చరిత్రలో పొడవాటి జుట్టు లేని మహిళగా గిల్లెస్ నిలిచింది. పిక్సీ కట్ ఉన్న గిల్లెస్ని విజేతగా ప్రకటించడం గురించి మీడియా ప్రశ్నించగా.. ఇంతవరకు పొడవాటి జుట్టుతో అందమైన మిస్లనే చూడటం అలవాటు చేసుకున్నాం కానీ పొట్టి జుట్టుతో ఆండ్రోజినస్ లుక్‌ని ఎంచుకోవాలని నిర్ణయిచామని ఈ పోటీకి జడ్జీలుగా వ్యవహరించినవారు అన్నారు. ప్రతి స్త్రీ విభిన్నంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఓ ప్రత్యేకం. ఎవర్నీ డిక్టేట్ చేయలేమని చెప్పేందుకే ఆమెను సెలక్ట్ చేశామని అన్నారు. మిస్ యూనివర్స్ లేదా ఫ్రాన్స్ కావడానికి ప్రత్యేకమైన అర్హత అంటూ దేన్ని పరిగణలోనికి తీసుకోం. వేదికపైకి వచ్చే ప్రతి రూపాన్ని స్వీకరిస్తాం, వారిలోని ఆత్మవిశ్వాసాన్ని బేరీజు వేసి ఎన్నిక చేస్తామని అందాల పోటీల నిర్వాహకులు చెబుతున్నారు. ఈ మేరకు కిరీటాన్ని దక్కించుకున్న గిల్లిస్ మాట్లాడుతూ..నేను బలమైన మహిళగా ఉండాలనుకుంటున్నాను. మహిళలు విభిన్నమైవారిని చూపాలనుకున్నాను. ఇక్కడ నా జుట్టు ప్రత్యేకం కాదు. నేను జీవితాన్ని ఇవ్వడం లేదా శ్వాసించడం లేదా జీవించడం వల్లే తాను ప్రత్యేకమని చెబుతోంది గిల్లేస్. కాగా, మిస్ఫ్రాన్స్ ఫైనల్‌కి ఏడుగురు మహిళలు రాగా ప్రజల ఓటు తోపాటు న్యాయనిర్ణేతల నిర్ణయాన్ని పరిగణలోకి తీసుకుని విజేతలను ప్రకటించడం జరుగుతుంది. నిజానికి మిస్ ఫ్రాన్ కిరీటం దక్కించుకున్న గిల్లెస్ మూడో స్థానంలో ఉన్నప్పటికీ జ్యూరీ(జడ్జీల)ఓటు కారణంగా అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఏడాది మిస్ ఫ్రాన్ పోటీల్లో ఎక్కు వైవిధ్యాన్ని అనుమతించింది. అలాగే ఇకపై పోటీల్లో వయోపరిమితి లేదు, వివాహమైన, పిల్లలు ఉన్నా, టాటుల ఉన్నా కూడా పాల్గొనవచ్చునని నిర్వాహకులు పేర్కొన్నారు. (చదవండి: డయానా ధరించిన డ్రెస్ ధర ఏకంగా రూ. 9 కోట్లు! మరోసారి రికార్డు స్థాయిలో..) -
పబ్లిసిటీ కోసం ఇలాంటివి చేస్తారా? యువతి హెయిర్‌స్టైల్‌పై ఫైర్
క్రియేటివిటీకి కాదేదీ అనర్హం అన్నట్లు ఈమధ్య జనాలు వెరైటీ స్టంట్లతో పబ్లిసిటీ దక్కించుకుంటున్నారు. సోషల్‌మీడియాలో పాపులారిటీ, లైకుల కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ఓ యువతి వెరైటీ హెయిర్‌స్టైల్‌తో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. ఇంతకీ ఆమె ఏం చేసిందంటే.. ఏదైనా పండగ వస్తుందంటే చాలు అమ్మాయిల హడావిడి మామూలుగా ఉండదు. వేసుకునే బట్టల దగ్గర్నుంచి హెయిర్ స్టైల్ వరకు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటారు. అందరి కంటే డిఫరెంట్‌గా రెడీ అవ్వాలని తెగ ట్రై చేస్తుంటారు. తాజాగా ఓ యువతి దీపావళి సందర్భంగా వెరైటీ హెయిర్‌స్టైల్‌తో షాకిచ్చింది. రాకెట్లు, భూచక్రాలు సహా రకరకాల క్రాకర్స్‌తో జుట్టును అందంగా అలంకరించుకుంది. దీనికి సంబంధించిన వీడియోను హెయిర్ స్టైలిస్ట్ సోషల్‌మీడియాలో పోస్ట్ చేయడంతో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. ఇది పర్ఫెక్ట్ దివాళీ బ్లాస్ట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరో యూజర్ స్పందిస్తూ.. ఒక్క అగ్గిపుల్లని ఆమె జుట్టుపైకి విసిరితే ఎంత ప్రమాదమో ఊహించండి, క్రియేటివిటి ఉండొచ్చు కానీ ఇలా ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు అంటూ హితవు పలికారు. View this post on Instagram A post shared by kamal_hairstylist_official (@kamal_hairstylist_official) -
చక్కగా మసాజ్,ఈ బ్రష్ జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది..
చూడటానికి కంప్యూటర్ మౌస్లా కనిపించే ఈ పరికరం హెడ్మసాజర్. ఇది రీచార్జబుల్ బ్యాటరీతో పనిచేస్తుంది. దీని అడుగుభాగంలో సున్నితమైన బ్రష్ ఉంటుంది. ఆన్ చేసుకుని, కోరుకున్న వేగాన్ని సెట్ చేసుకుంటే చాలు. తలదిమ్ము వదిలేలా, తలకు హాయి కలిగించేలా ఇంచక్కా మర్దన చేస్తుంది. దీని బ్రష్ జుట్టు కుదుళ్లను ఉత్తేజపరుస్తుంది. ఫలితంగా జుట్టురాలడాన్ని అరికడుతుంది. జుట్టు ఇప్పటికే రాలిపోయిన చోట కొత్త వెంట్రుకలను మొలిపిస్తుంది. జపాన్‌కు చెందిన ‘హెబావోడాన్’ కంపెనీ ఈ పరికరాన్ని ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర 5200 యెన్లు (రూ.2,925) మాత్రమే! -
డైసన్ హెయిర్ కేర్ టెక్నాలజీస్ ప్రచారకర్తగా దీపికా పదుకొనే
హైదరాబాద్: గ్లోబల్ టెక్నాలజీ సంస్థ డైసన్ హెయిర్ కేర్ టెక్నాలజీస్ తన బ్రాండ్ అంబాసిడర్‌గా నటి దీపికా పదుకొనేను నియమించుకుంది. ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరికి శిరోజాల సంరక్షణపై కనీస అవగాహన అవసరం. ఆరోగ్యకరమైన హెయిర్ స్టైల్ కోసం ఎప్పటికప్పుడు నూతన ఆవిష్కరణలను చేస్తున్న డైసన్‌కు బ్రాండ్ అంబాసిడర్ వ్యవహరిస్తుండటం సంతోషంగా ఉందని దీపికా అన్నారు. ‘‘మా బ్రాండ్‌కు దీపికా మరింత గుర్తింపు తీసుకొస్తుంది. అధునాతన కేశాలంకరణ పరికరాల మార్కెట్‌ను మరింత విస్తరించుకునేందుకు ఆమెకు ఉన్న ఆకర్షణ మాకు కలిసొస్తుంది’’ అని డైసన్ ఇండియా ఎండీ అంకిత్ జైన్ తెలిపారు. -
Largest Hair: ఈమె జుట్టు మీదే రికార్డులు ఉన్నాయి
సరదా.. కొందరికి అనుకోకుండా గుర్తింపు తెచ్చిపెడుతుంటుంది. అదే పనిగా ఆ పనిలో మునిగిపోతే. లూసియానాకు చెందిన 47 ఏళ్ల ఏవిన్ డుగాస్ జుట్టుతో గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కింది. దాదాపు పది ఇంచుల పొడవు ఆఫ్రో(ఆఫ్రికన్ స్టైల్) హెయిర్‌స్టైల్‌తో ఈమె ఇప్పుడు వార్తల్లో నిలిచింది. అయితే.. ఆమె గిన్నిస్ రికార్డు బద్ధలు కొట్టడం ఇదే తొలిసారి కాదు. 2010 సమయంలో.. నాటుగు ఫీట్ల జుట్టుతోనూ ఆమె ఇలాగే రికార్డు నెలకొల్పారు. ఇప్పుడు ఆ జుట్టును మరింతగా పెంచి.. తన రికార్డును తానే బద్ధలు కొట్టుకున్నారామె. గత 24 ఏళ్లుగా ఆమె ఆ జుట్టును అలాగే పెంచుతోందట. అయితే.. మొదట్లో ఆమె జుట్టు కోసం కెమికల్స్ వాడేదట. వాటిలో చాలావరకు ప్రమాదకరమైన రసాయనాలు ఉన్నాయని తర్వాతే ఆమెకు తెలిసిందట. దీంతో అప్పటి నుంచి ఆమె సహజ పద్ధతుల్లోనే జుట్టును పెంచుతూ వస్తోందామె. తన జుట్టుకోసం ఓ హెయిర్ స్టైల్ డిజైనర్‌ను పెట్టుకున్న ఆమె, కేవలం అంచులు కత్తిరించేందుకు మాత్రమే ఆమెను పిలిపించుకుంటుందట. ఆ జుట్టు మెయింటెనెన్స్ కష్టంగా ఉన్నప్పటికీ.. ఇష్టంతోనే తాను ముందుకు వెళ్తున్నట్లు చెప్తోంది డుగాస్. -
ఎంత పనిచేశాడు.. హెయిర్ స్టయిల్ నచ్చలేదని బాత్రూమ్లోకి వెళ్లి..
ముంబై: ఇటీవల టీనేజర్లు చిన్న విషయాలకు కలత చెందడం, గొడవలకు దిగడం, అంతెందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలను కూడా మనం చూస్తూనే ఉన్నాం. క్షణికావేశంలో నిండు నూరేళ్లు జీవితాన్ని అర్థంతరంగా ముగించుకుంటున్నారు. ఇంట్లో తమ తల్లిదండ్రుల ఆశలపై నీళ్లు చల్లుతున్నారు. తాజాగా ఓ టీనేజర్ హెయిర్‌కట్ నచ్చలేదని బిల్డింగ్‌పై నుంచి దూకేశాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని థానే జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మహరాష్ట్రలోని భయాందర్ నగరానికి చెందిన 13 ఏళ్ల బాలుడికి కుటుంబ సభ్యులు హెయిర్ కట్ చేయించారు. అయితే షాపు అతను చేసిన హెయిర్ కటింగ్ ఆ బాలుడికి అసలు నచ్చలేదు. ఇంటికి వెళ్లాక అద్దంలో పదే పదే ఆ హెయిర్ స్టైల్‌ను చూసుకుంటూ తనకు నచ్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఓ దశలో కోపోద్రిక్తుడైన ఆ బాలుడు అపార్ట్మెంట్ భవనం 16వ అంతస్తులోని బాత్రూంలోకి వెళ్లి అక్కడ ఉన్న కిటికీ నుంచి కిందకు దూకేశాడు. ఈ ఘటనలో బాలుడు తీవ్రంగా గాయపడడంతో అక్కడికక్కడే చనిపోయాడు. సమాచారం అందుకున్న నవ్ఘర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కాగా ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. -
కొంపముంచిన ఫైర్ హెయిర్ కట్... నిప్పుతో చెలగాటం వద్దు!
గుజరాత్: యువకులు రకరకాల హెయిర్ స్టైయిల్స్లో కటింగ్ చేయించుకునేందుకు ట్రై చేస్తుంటారు. అందులో భాగంగానే ఇటీవల ఫైర్ హెయిర్ కట్ స్టైయిల్ మంచి క్రేజీ స్టైయిల్‌గా మారింది. దీంతో యువత ఆ ట్రెండ్ స్టెయిల్నే ఫాలో అవుతున్నారు. అచ్చం అలానే ఒక యువకుడు ఆ స్టైయిల్లోనే జుట్టు కట్ చేయించుకుందామని బార్బర్ షాపు కెళ్లి భయానక చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నాడు. వివరాల్లోకెళ్తే...ఇటీవల మంచి ట్రెండీగా ఉన్న ఫైర్ హెయిర్ కట్ స్టేయిల్లో కట్ చేయించుకుందామని ఒక యువకుడు మంచి పేరున్న సెలూన్‌కి వెళ్లాడు. అయితే ఈ హెయిర్ కట్ని మంటతో హెయిర్‌ని స్టైయిలిష్‌గా కట్ చేస్తారు. అదే ఇందులోని ప్రత్యేకత. అందులో భాగంగా హెయిర్‌కి ఒక విధమైన లిక్విడ్ కెమికల్ని రాసి కటింగ్ స్టార్ట్ చేస్తే ప్రమాదవశాత్తు భగ్గుమని మంటలు అతని తలభాగం, మెడ వరకు వ్యాపించాయి. దీంతో సదరు యువకు చాలా తీవ్రంగా గాయపడ్డాడు. ఈఘటన బుధవారం గుజరాత్లో వలసద్ జిల్లాలో వాపీ అనే సిటీలోని సెలూన్లో చోటు చేసుకుంది. దీంతో సదరు వ్యక్తిని హుటాహుటినా సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని బాధితుడు నుంచి, సదరు సెలూన్‌లోని హెయిర్ కటింగ్ చేసిన బార్బర్ వద్ద నుంచి వాగ్ములం తీసుకుని దర్యాప్తు చేయడం ప్రారంభించారు. (చదవండి: కుమారుడు, భార్య తన కళ్లెదుటే.. ఎంత శిక్ష వేశావు దేవుడా..) -
కొత్త రకం హెయిర్ స్టయిల్లో రజనీకాంత్!
స్టయిలు స్టయిలులే ఇది సూపర్ స్టయిలులే.. అని రజనీకాంత్ స్టయిల్ మీద ‘బాషా’లో ఒక పాట ఉన్న విషయం తెలిసిందే. సిగరెట్‌ని గాల్లో విసిరి నోటితో క్యాచ్ పట్టడం, వేగంగా నడవడం.. టోటల్‌గా రజనీ స్టయిల్ సూపర్‌గా ఉంటుంది. ఇప్పుడు ఈ సూపర్ స్టార్‌ని సూపర్ హెయిర్ స్టయిల్లో చూపించనున్నారు ముంబైకి చెందిన హెయిర్ స్టయిలిస్ట్ అలీమ్ హకీమ్. రజనీ హీరోగా ‘జైలర్’ టైటిల్‌తో ఓ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రంలో రజనీని కొత్త రకం హెయిర్ స్టయిల్లో చూపించనున్నారు అలీమ్. ‘‘కింగ్ (రజనీని ఉద్దేశించి) తో వర్క్ చేసిన ఈ రోజు చాలా కొత్తగా ఉంది’’ అంటూ రజనీతో దిగిన ఫొటోను షేర్ చేశారు అలీమ్. ఇటీవల టెస్ట్ షూట్ జరిగిందని సమాచారం. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం షూటింగ్ వచ్చే నెల ఆరంభం కానుంది. ఇందులో రజనీ సరసన ఐశ్వర్యా రాయ్ నటిస్తారని టాక్. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించనున్నారు. -
కొప్పున పువ్వులు పెట్టుకోవడం కాదు.. కొప్పునే పువ్వులా మార్చితే ఎలా ఉంటుందంటే?
‘‘పూల రెక్కలు.. కొన్ని తేనె చుక్కలు.. రంగరిస్తివో ఇలా బొమ్మ చేస్తివో’’అంటూ పూవులాంటి అమ్మాయిని పొగిడాడో సినీ కవి. కానీ ఆ పూల రెక్కలంత పలుచగా.. నిజమైన పువ్వేనేమో అన్నంత అం దంగా జుట్టును డిజైన్ చేయగలడీ హెయిర్‌డ్రెస్సర్. ఈ పూల కొప్పుల సృష్టికర్త వియత్నాంకు చెందిన 28 ఏళ్ల గుయెన్ ఫట్ ఫట్ ట్రి. ‘‘కొప్పున పువ్వులు పెట్టుకోవడం పాత పద్ధతి. కొప్పునే పువ్వులా దిద్దుకోవడం కొత్త స్టైల్’’అంటూ మందారం, చామంతి, లిల్లీ, లోటస్... ఇలా అనేక రకాల పూల డిజైన్లలో జుట్టును వేస్తున్నాడు. జియాంగ్ యూనివర్సిటీలో బయోటెక్నాలజీ డిగ్రీ చదివిన గుయెన్‌కు ఈ ఆర్ట్ ఏంటంటూ ప్రారంభంలో ఎన్నో అడ్డంకులు... అయినా కొన్నాళ్లకు తనది రైట్ ఛాయిస్ అని నిరూపించాడు. చదవండి: పెరిగే వయసుకు కళ్లెం.. నిత్య యవ్వనం ఇక సులువే.. ఇప్పుడు వియత్నాం హెయిర్ స్టయిల్ ఇండస్ట్రీలో గుయెన్దో ప్రత్యేక ముద్ర. ఆయన డిజైన్ చేసే ఒక్కో హెయిర్ స్టైల్ఖరీదు... పది, పదిహేను, ఇరవై వేల వరకు ఉంటుంది. ఇక సాధారణ స్టయిల్ చేయడానికి ఒకటి నుంచి రెండు రోజులుపడితే... కొన్ని మాత్రం రెండు మూడు నెలల సమయం తీసుకుంటాయి. వియత్నాం హెయిర్ ఇండస్ట్రీకి ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకురావడం, తనలాంటి కళాకారులను ప్రోత్సహించడమే తన లక్ష్యమని చెబుతున్నాడు. చదవండి: ‘ఆ పసి హృదయం ఎంతగా గాయపడిందో ఆ కళ్లే చెబుతున్నాయి' -
హే! ఇది నా హెయిర్ స్టైయిల్... ఎంత క్యూట్‌గా ఉందో ఈ ఏనుగు!!
కోయంబత్తూర్: మాములుగా మనం ఎవరైన బయటకి వెళ్లేటప్పుడూ లేదా ఏదైన ఫంక్షన్‌కి వెళ్లాలనుకుంటే ఎంతలా రెడీ అవుతాం. అంతేందకు చాలామంది ట్రెండ్‌కి అనుగుణంగా రెడీ అవ్వడానకి ప్రయత్నిస్తారు కూడా. అయితే ఈ మధ్య ఆ ఫ్యాషన్ జాబితాలోకి జంతువులు కూడా చేరిపోతున్నాయి. అవి కూడా సరికొత్త ట్రెండ్‌ని సృష్టించడానికీ ప్రయత్నిస్తున్నాయి. పైగా మా కేం తక్కువ అన్నట్లుగా రెడీ అవ్వడానికీ తెగ ఇష్టపడుతున్నాయి. (చదవండి: ఆమె పాటకు ఫిదా.. స్టేజీ మీదే నోట్లతో అభిషేకం..!! అసలు విషయంలోకెళ్లితే...కోయంబత్తూరులోని తేక్కంపట్టి గ్రామాంలోని ఒక ఏనుగు ఎంత చక్కగా రెడీ అవుతుందో తెలుసా. నిజం ఆ ఏనుగు బాబ్ కట్ హెయిర్‌తో భలే ఆకర్షిస్తుంది. పైగా ఆ జుట్టును దువ్వించుకోవడానికి ఎలా కాళ్లను వంచి కిందికు ఉండి సహకరిస్తుందో చూడండి. అంతేకాదు చాల చక్కగా దువ్వించుకుని నుదటిపై తిలకంతో ఎంతో ఆకర్షణీయంగా రెడి అవుతుందో. ఏది ఏమైనా ఆ ఏనుగు బాబ్ కట్ హెయిర్‌తో మంచి స్టైయిలిష్‌గా ఠీవిగా ఉంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్చల్ చేస్తుంది. దీంతో నెటిజనల్లు వావ్ చాలా క్యూట్‌గా ఉందంటూ రకరకాలుగా ట్వీట్ చేశారు. (చదవండి: భక్తి పారవశ్యంతో ఈ పూజారి చేసిన పని... విగ్రహానికి వైద్యం..!!) -
నెత్తిన భగ్గుమంటున్న మంటలు.. ఇప్పుడు ఇదో స్టైల్
సాక్షి, కైలాస్‌నగర్: ఆదిలాబాద్ పట్టణంలోని కొత్త రకం ఫైర్ హెయిర్ కటింగ్ అందుబాటులోకి వచ్చింది. ప్రధాన నగరాల్లోనే ఉండే ఈ పద్ధతి ఇప్పుడు పట్టణాల్లో అందుబాటులోకి రావడంతో యువత ఆసక్తి చూపున్నారు. స్థానిక భుక్తాపూర్‌లోని ఐస్ ఫ్యాక్టరీ సమీపంలో అమెరికన్ హెయిర్ కటింగ్ షాపులో శేర్లవార్ నర్సింహులు అనే యువకుడు జట్టుకు నిప్పు పెట్టి కొత్త తరహా కటింగ్ చేస్తున్నాడు. హైదరాబాద్‌లో ఫైర్ కటింగ్‌లో ప్రావీణ్యం పొంది సొంతగా క్షవరశాలను ఏర్పాటు చేసుకున్నాడు. మహారాష్ట్రలోని పూణే నగరం నుంచి హెయిర్ ఫైర్ లిక్విడ్‌ను తెప్పిస్తున్నాడు. దీంతో తను ఉపాధి పొందుతూ.. మరో నలుగురికి ఉపాధి కల్పిస్తున్నాడు. ఫైర్ కటింగ్ రూ.500 రింగులు తిరిగిన జట్టుకు ప్రత్యేకమైన లిక్విడ్ పెట్టి నిప్పంటిస్తాడు. ఈరకం కట్టింగ్‌కు రూ.500 చార్జీ అవుతుంది. పిట్టెగూడులా ఉన్న వెంట్రుకలు ఫైర్ కటింగ్‌తో ఒక్కసారిగా సిల్కీ స్మూత్ హెయిర్‌గా మారుతుంది. దీంతో ఈ తరహ కట్టింగ్ చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. మొదటి సారి కొత్త తరహా కటింగ్ చేసుకున్న వారు దాని ప్రాధాన్యత తెలుసుకుని తరువాత ఫైర్ కటింగ్ చేసుకునేందుకు ఇష్టపడుతున్నారు. ఫైర్ కటింగ్ బాగుంది ఫైర్ కటింగ్ అంటే మొదట్లో కొంత బయమేసింది. తలపై నిప్పు పెట్టడంతో కొద్దిపాటి వేడి కావడంతో బయపడిన. తరువాత నీటితో తలను కడగానే చల్లగా ఉంది. వెంట్రుకలు చాలా స్మూత్, సాఫ్ట్‌గా అయ్యాయి. ఫైర్ కటింగ్ చాలా బాగుంది. – అజార్ ఖాన్, ఇందిరానగర్ చాలా మందికి తెలువదు ఆదిలాబాద్‌లో ఫైర్ కటింగ్ చేస్తున్నట్లు చాలా మందికి తెలువదు. ఈమధ్య కాలంలోనే కొత్తగా ఫైర్ కటింగ్ చేస్తున్నారని తెలిసి వచ్చాను. కొత్త తరహా కటింగ్‌తో ఎలాంటి నష్టం ఉండదు. వెంట్రుకలు ఆరోగ్యవంతంగా ఉంటాయి. – సాయికిరణ్, భీంపూర్ హైదరాబాద్‌లో నేర్చుకున్న హైదరాబాద్‌లోని నేచురల్ హెయిర్ సెల్యూన్లో పనిచేసిన సమయంలో ఫైర్ కటింగ్ గురించి తెలుసుకున్నాను. అక్కడ అనుభవాజ్ఞుల వద్ద శిక్షణ పొంది నేర్చుకున్నాను. మొదటి సారి ఫైర్ కటింగ్ చేసుకుంటున్న వారు బయపడుతారు. తరువాత ఈపద్ధతి కటింగ్ చేసుకునేందుకు ఆసక్తి చూపుతారు. – శేర్లవార్ నర్సింహులు, యజమాని -
ధోని హెయిర్ స్టైల్ అదరహో.. కుర్రకారు ఫిదా! లక్షల్లో లైకులు
భారత క్రికెట్ జట్టు కెప్టెన్లలో మహేంద్ర సింగ్ ధోనిది ప్రత్యేక స్థానం. విజయవంతమైన సారథిగా.. బ్యాట్స్‌మెన్‌గా.. వికెట్ కీపర్‌గా చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు. భారత్‌కు మూడు ఐసీసీ ట్రోఫీలు సంపాదించి పెట్టిన ఒకే ఒక్క కెప్టెన్‌గా ఘనత సాధించిన ధోని ఆటలోనే కాదు.. తన ఆహార్యంలోనూ స్టైలిష్‌గా కనిపిస్తుంటాడు. ముఖ్యంగా హెయిర్ స్టైల్ ఎప్పుడూ ప్రత్యేకంగా ఉండేలా ధోనీ చూసుకుంటాడు. ఆయన క్రికెట్ కెరీర్లోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో స్టైల్స్‌లో కనిపించాడు. ఒక్కో స్టైల్ అదిరిపోయేలా ఉండడంతో యువత ధోనీ స్టైల్ అంటూ హెయిర్ సెలూన్లకు పరిగెత్తుతుంటారు. మళ్లీ ఇప్పుడు ధోనీ మరో హెయిర్ స్టైల్‌తో కొత్త లుక్‌లో కనిపించాడు. ధోనీతో హెయిర్ స్టైలిస్ట్ ఆలిమ్ హకీమ్ సెలబ్రిటీల స్టైలిస్ట్‌గా గుర్తింపు పొందిన ఆలిమ్ హక్కీమ్ ధోనీని సరికొత్త లుక్‌లో కనిపించేలా చేశారు. ప్రత్యేక హెయిర్ స్టైల్ చేసి న్యూలుక్లో మెరిసేలా ఆలిమ్ ధోనీని తయారుచేశారు. ఈ లుక్‌ను ఫంకీ హెయిర్ స్టైల్‌గా పేర్కొంటారని తెలుస్తోంది. ఈ లుక్ కుర్రకారును తెగ ఆకర్షిస్తోంది. ఈ ఫొటోలను ఆలిమ్ హకీమ్ తన సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఆ ఫొటోలను నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. పాతికేళ్ల కుర్రాడిలా కనిపిస్తున్నారని కామెంట్లు చేస్తున్నారు. కుర్రకారు ఈ హెయిర్ స్టైల్‌ను చేయించుకోవాలని భావిస్తున్నారు. ధోనీ గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ధోనీ ఐపీఎల్లో చెన్నె జట్టుతో ఆడుతున్నాడు. View this post on Instagram A post shared by Aalim Hakim (@aalimhakim) -
నా జుట్టుకు ఏం అయింది.. వరుణ్ తేజ్ ఆసక్తికర పోస్ట్
మెగా కుటుంబం నుంచి వచ్చి తనదైన స్టైల్లో నటిస్తూ..టాలీవుడ్లో ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్నాడు యంగ్ హీరో వరుణ్ తేజ్. మొదట్లో కథల విషయంలో తడబడ్డా.. ఆ తర్వాత మూస కథలతో వచ్చే సినిమాలను పక్కన పెట్టిన వరుణ్ కొత్తరకం కథలను ఎంచుకోవడం చేయడం మొదలు పెట్టాడు. మెగా హీరోలంతా పక్కా కమర్షియల్ సినిమాలను ఎంచుకుంటే.. ఈ మెగా ప్రిన్స్ మాత్రం అన్ని రకాల మూవీలు చేస్తూ టాలీవుడ్లో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇటీవల ఆయన చేసిన ‘గద్దలకొండ గణేశ్’, ‘ఎఫ్ 2’ సినిమాలు సూపర్ హిట్‌గా నిలిచాయి. ప్రస్తుతం ఈ యంగ్ హీరో అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘ఎఫ్ 3’, కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ‘గని’అనే సినిమాల్లో నటిస్తున్నారు. షూటింగ్‌లతో నిత్యం బిజీ బిజీగా ఉండే ఈ యంగ్ హీరో.. అప్పుడప్పుడు సోషల్ మీడియాలోకి ఇలా వచ్చి అలా వెళ్తుంటాడు. తన సినిమాలకు సంబంధించి విషయాలు కానీ, లేదా ఏదైనా ప్రత్యేకమైన రోజు వస్తే కానీ ఆయన పోస్టులు పెట్టడు. ఇక ఆయన రేర్‌గా పెట్టే పోస్టులు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంటాయి. తాజాగా ఆయన ఇన్‌స్టాలో షేర్ చేసిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘అరే.. నా జుట్టుకు ఏం అయింది’అంటూ వరుణ్ ఓ ఓల్డ్ ఫోటోని షేర్ చేశాడు. అందులో వరుణ్ హెయిర్ స్టైయిల్ ఢిపరెంట్‌గా ఉంది. జుట్టంతా ముళ్లులుగా పైకి లేచి స్టైలీష్‌గా కనిపిస్తున్నాడు. ఈ ఫోటో నెటిజన్లను విశేషంగా ఆకర్షిస్తోంది. ముఖ్యంగా అమ్మాయిలైతే వరుణ్ న్యూ లుక్‌కి ఫిదా అవుతున్నారు. View this post on Instagram A post shared by Varun Tej Konidela (@varunkonidela7) -
ధోని జులపాల జుట్టు; ముషారఫ్‌తో ప్రత్యేక అనుబంధం
సాక్షి, వెబ్‌డెస్క్: ఎంఎస్ ధోని అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టినప్పుడు మొట్టమొదటగా అతను బాగా పాపులర్ అయింది హెయిర్‌స్టైల్‌తోనే. జులపాల జుట్టుతో మైదానంలో బరిలోకి దిగే ధోనిని చూస్తూ అప్పటి ఫ్యాన్స్ చేసే రచ్చ మాములుగా ఉండేది కాదు. ధోని హెయిర్‌స్టైల్ ఎంతలా పాపులర్ అయిందంటే.. అతని హెయిర్‌స్టైల్‌ను యువతలో కూడా చాలామంది అనుకరించడానికి ప్రయత్నించారు. తన హెయిర్‌స్టైల్‌తో సరికొత్త ట్రెండ్ సృష్టించిన ధోనికి పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కూడా ముచ్చట పడ్డాడు. ధోని హెయిర్‌స్టైల్‌ను అమితంగా ప్రేమించిన ముషారఫ్ జట్టు కట్ చేయించుకోవద్దంటూ రిక్వెస్ట్ చేయడం అప్పట్లో బాగా వైరల్ అయింది. తాజాగా 40వ పుట్టినరోజు జరుపుకుంటున్న ధోనికి శుభాకాంక్షలు తెలుపుతూ టీమిండియా ఫ్యాన్స్ మరోసారి దానికి సంబంధించిన వీడియోనూ తమ ట్విటర్లో షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం మరోసారి ట్రెండింగ్ మారింది. మరోసారి ఆ విషయాలను గుర్తుచేసుకుందాం. 2005-2006లో పాకిస్థాన్ పర్యటనకి వెళ్లిన రాహుల్ ద్రవిడ్ కెప్టెన్సీలోని భారత జట్టు.. ఐదు వన్డేల సిరీస్‌ని 4-1తో చేజిక్కించుకుంది. లాహోర్ వేదికగా జరిగిన మూడో వన్డేని ప్రత్యక్షంగా వీక్షించేందుకు అప్పటి అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్రాగా.. ఆ మ్యాచ్‌లో కేవలం 46 బంతుల్లో 13 ఫోర్ల సాయంతో 72 పరుగులు చేసిన ధోనీ.. ఛేదనలో భారత్ జట్టుని గెలిపించాడు. ఆ వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 8 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేయగా.. ధోనీ దూకుడుతో 47.4 ఓవర్లలో భారత్ 292/5తో విజయాన్ని అందుకుంది. మ్యాచ్‌ని ధోనీ ఫినిష్ చేసిన తీరుకి ముచ్చటపడిన ముషారఫ్.. మ్యాచ్ అనంతరం ధోనీ గురించి ప్రత్యేకంగా మాట్లాడాడు. ‘‘ధోనీ నువ్వు ఈ హెయిర్ కట్లో చాలా బాగున్నావు. ఒకవేళ నువ్వు నా ఒపీనియన్ తీసుకుంటే.. హెయిర్ కట్ చేయించుకోకు’’ అని రిక్వెస్ట్ చేశాడు. ఆ తర్వాత కూడా అదే హెయిర్ స్టయిల్ని కొనసాగించిన ధోనీ.. 2007 టీ20 వరల్డ్‌కప్ సాధించిన తర్వాత క్రమంగా తన హెయిర్‌స్టైల్‌ను మారుస్తూ వచ్చాడు. -
80ల నాటి హెయిర్ స్టైల్.. ధోని, మలింగలకు 10 పాయింట్లు
సౌతాంప్టన్: భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న ఐసీసీ ప్రపంచటెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ తొలిరోజు వర్షార్పణమైంది. ఒక్క బంతి కూడా పడకుండానే తొలిరోజు ఆట రద్దు అయిన సంగతి తెలిసిందే. ఇక రెండోరోజుకు వరుణుడు ఏ మేరకు సహకరిస్తాడో చూడాల్సి ఉంది. ఇదిలా ఉంటే కివీస్ ఆల్‌రౌండర్ కొలిన్ డి గ్రాండ్‌హోమ్ ఫైనల్ మ్యాచ్‌కు 80లకాలం నాటి ముల్లెట్ హెయిర్‌స్టైల్‌తో ఆకట్టుకున్నాడు. దీంతో ఐసీసీ కొలిన్ డి గ్రాండ్‌హోమ్‌ను అతని హెయిర్‌స్టైల్‌పై ఇంటర్య్వూ నిర్వహించింది. పాతతరం, కొత్తతరం క్రికెటర్లలో ఆటగాళ్ల హెయిర్‌స్టైల్‌కు సంబంధించి ఎన్ని పాయింట్లు ఇస్తారని అడగ్గా గ్రాండ్‌హోమ్ స్పందించాడు. మొదట ఇషాంత్ శర్మ హెయిర్‌స్టైల్‌కు 10కి ఆరు పాయింట్లు ఇచ్చాడు. ఆ తర్వాత ఎంఎస్ ధోని జులపాల జట్టుకు పదికి పది పాయింట్లు ఇచ్చాడు. ధోని హెయిర్‌స్టైల్ తనను ఆకట్టుకుందన్నాడు. అతనిలా తనది ఫర్ఫెక్ట్ హెయిర్స్టల్ కాదని.. ఇకపై ఎవరు చేయలేరని పేర్కొన్నాడు. అందుకే ధోని హెయిర్ స్టైల్‌కు మొత్తం పాయింట్లు ఇచ్చేశా. ఇక లసిత్ మలింగ హెయిర్‌స్టైల్ డిఫెరెంట్ షేడ్స్‌లో ఉంటుంది.. అతనికి 10 మార్కులు ఇవ్వకుండా ఎలా ఉంటానని తెలిపాడు. ఇక టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా హెయిర్‌స్టైల్‌కు 9 పాయింట్లు ఇచ్చాడు. ఆ తర్వాత వరుసగా మెక్కల్లమ్, డానియెల్ వెటోరి ఫోటోలు చూపించగా.. వాటికి 8, 9 మార్కులు ఇచ్చాడు. తన హెయిర్‌స్టైల్‌పై గ్రాండ్‌హోమ్ స్పందిస్తూ..' నా హెయిర్ స్టైల్ నా భార్యకు బాగా నచ్చింది. అది ఎందుకని మాత్రం తను చెప్పలేదు కాని 80ల కాలం నాటి స్టైల్‌ను మళ్లీ చూపించారంటూ మెచ్చకుంది. నా జట్టుపై సహచర ఆటగాళ్లు కామెంట్స్ చేసినా నాకు సంతోషమే కలిగింది. అంటూ తెలిపాడు. ఇక 2016లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన కొలిన్ డి గ్రాండ్‌హోమ్ కివీస్ తరపున 25 టెస్టుల్లో 1,194 పరుగులు.. 47 వికెట్లు, 42 వన్డేల్లో 722 పరుగులు.. 27, 36 టీ20ల్లో 487 పరుగులు.. 11 వికెట్లు తీశాడు. ఇక టీమిండియాతో జరుగుతున్న టెస్టుచాంపియన్‌షిప్ ఫైనల్లో కివీస్ తరపున ఆల్‌రౌండర్ కోటాలో తుది జట్టులో స్థానం దక్కించుకున్నాడు. చదవండి: WTC Final: అద్బుతమైన జట్టుతో ఆడుతున్నాం.. విజయం మాదే Long locks? Short locks? Coloured? Straightened? 💇♂️ Watch Colin ‘mullet’ de Grandhomme evaluate some interesting hairstyles 😄#WTC21 | #INDvNZ pic.twitter.com/UbA0UmKHbw — ICC (@ICC) June 19, 2021 -
డబ్బులిచ్చి మరీ హెయిర్ స్టయిలింగ్ చేసేదాన్ని: కాజల్
కాజల్ అగర్వాల్.. గ్లామర్ సిగ్నేచర్. సంప్రదాయ కట్టైనా .. మోడర్న్ అవుట్‌ఫిట్ అయినా కట్టిన వాటికే వన్నె తెచ్చే స్ట్రక్చర్ ఆమెది. అందుకే సిల్వర్ స్క్రీన్‌కే కాదు ఫ్యాషన్ ప్రపంచానికీ ఆమె మోస్ట్ వాంటెడ్. ఈ స్టార్ స్టైల్‌ను పెంచే ఆ బ్రాండ్స్ ఏంటో చూద్దామా? బ్రాండ్ వాల్యూ నికిత మైసల్కర్... భారతీయ ఫ్యాషన్ డిజైనర్లలో ప్రముఖురాలు. 2003, అహ్మదాబాద్‌లో ముగ్గురు స్నేహితులతో కలిసి ‘నికిత మైసల్కర్’ అని తన పేరు మీదే చిన్న సంస్థను ప్రారంభించింది. ప్రస్తుతం అది ఓ వస్త్ర పరిశ్రమగా స్థిరపడింది. దేశవ్యాప్తంగా 57 స్టోర్లున్నాయి. ఈ డిజైనర్ డ్రెస్‌లకు అన్‌లైన్‌లోనూ డిమాండ్ ఉంది. డిజైన్‌ను బట్టే ప్రైజ్. అదే ఈ బ్రాండ్ వాల్యూ. ఓ వైపు ఈ సంస్థను నిర్వహిస్తూనే మరో వైపు ఫ్యాషన్ డిజైనింగ్ తరగతులనూ బోధిస్తోంది నికిత మైసల్కర్. ఇయరింగ్స్ బ్రాండ్: ఓలియో జ్యూయెలర్స్ ఎథీనా హూప్స్ మిస్ మ్యాచ్డ్ ధర: రూ. 8,200 హీల్స్ బ్రాండ్: బ్రాండ్: సమ్‌థింగ్ ఐ బ్లష్ పింక్ హై హీల్స్ ధర: రూ. 7,000 డ్రస్ బ్రాండ్: నికిత మైసల్కర్ సీక్విన్ ఎంబ్రాయిడరీ స్లిట్ స్కర్ట్ ధర: రూ. 47,000 ఓలియో జ్యూయెలర్స్.. అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన దేశీ బ్రాండ్ ఇది. ఆష్నా సింగ్, స్నేహా సక్సెనా అనే ఇద్దరు స్నేహితులు కలసి 2015లో దీన్ని లాంచ్ చేశారు. సెలబ్రిటీస్ ఫేవరేట్ బ్రాండ్ జ్యూయెలరీ ఇది. 18 క్యారెట్ల బంగారు నాణ్యతతో లభించే ఈ యాంటిక్ డిజైన్ ఆభరణాలను హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ప్రతీ హీరోయిన్ ఒక్కసారి అయినా ధరించి ఉంటుంది. వీటి ధర కూడా ఆకాశంతో పోటీ పడుతూంటుంది. గోల్డ్ రేట్‌తో సంబంధం లేదు వీటికి. డిజైన్ ఓన్లీ మ్యాటర్స్. దాన్ని బట్టే ప్రైస్. ఆన్‌లైన్‌లోనూ అందుబాటులో ఉంటాయి. సమ్‌థింగ్ ఐ.. స్త్రీల కోసమే పాదరక్షలు తయారు చేసే భారతీయ కంపెనీ. సంప్రదాయానికి లేటెస్ట్ ట్రెండ్‌ను జత చేస్తూ డిజైనర్ జోళ్లను రూపొందించడం దీని యూఎస్పి (యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్). కేవలం ఆన్లైన్ మార్కెట్లో మాత్రమే లభించే ఈ ఫుట్‌వేర్.. సరసమైన ధరల్లోనే లభిస్తాయి. 'రెడీ అవ్వడం అన్నా.. రెడీ చెయ్యటం అన్నా చాలా ఇష్టం. నా చిన్నప్పుడు మా చెల్లికి డబ్బులిచ్చి మరీ హెయిర్ స్టయిలింగ్ చేసేదాన్ని.' – కాజల్ అగర్వాల్. -
పోనీ టెయిల్‌కి సెకండ్ వెర్షన్
వేసవిలో జుట్టును లూజ్‌గా వదిలేయడం ఇబ్బందిగానే ఉంటుంది. వెంట్రుకలు మెడమీద పడకుండా, నీటుగా హెయిర్‌స్టైల్ ఉండాలనుకుంటే ఈ స్టైల్‌ను ఫాలో అవ్వచ్చు. ఇది పోనీటెయిల్‌కి సెకండ్ వెర్షన్‌గా చెప్పచ్చు. ► జుట్టును చిక్కుల్లేకుండా దువ్వాలి. తర్వాత అటూ ఇటూ రెండు పాయలు తీసి ఒక పాయగా కలిపేసి, మధ్యన రబ్బర్ బ్యాండ్ వేయాలి. ► రబ్బర్ బ్యాండ్ వేసిన పాయకు దిగువ భాగాన మరొక రబ్బర్ బ్యాండ్ వేయాలి. ► రెండు రబ్బర్ బ్యాండ్స్ మధ్యలో ఉన్న హెయిర్‌ను ఓవెల్ షేప్ ఖాళీ ఉంచి, ఆ మధ్యలో నుంచి మిగతా హెయిర్‌ను బయటకు తీసి, ఒకసారి దువ్వెనతో దువ్వి, వదిలేయాలి. ► జుట్టు మందంగా ఉన్నవారు మధ్య నుంచి ఒక పాయగా తీసి, మెడమీద మిగతా హెయిర్‌తో కలిపి ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకోవచ్చు. దీనివల్ల మెడ మీద చెమట కు వెంట్రుకలు చికాకు పెట్టకుండా, హెయిర్‌స్టైల్ నీటుగా ఉంటుంది. – సత్యశ్రీ సుతారి హెయిర్ స్టైలిస్ట్, ఫస్ట్ ఫౌండేషన్, హైదరాబాద్ -
న్యూ లుక్ హెయిర్ స్టైల్స్...
-
సేవకు కాదేది అనర్హం..
సేవా గుణం ఉండాలే కానీ, సేవకు కాదేది అనర్హం అని నిరూపిస్తున్నారు సిటీకి చెందిన హెయిర్ స్టైలిస్ట్స్..తాము చేసే వృత్తినే సేవకు అనుసంధానం చేశారు. తమ సేవల కోసం తమ దగ్గరకు రాలేని వారి దగ్గరకు తామే స్వయంగా వెళుతూ... ‘‘వి ఫర్ ఆర్ఫన్స్’’ పేరుతో సిటీలోని ఆర్ఫాన్హోమ్స్, వృద్ధాశ్రమాలు... వంటి చోట్లకు వెళ్లి ఉచితంగా హేర్ కటింగ్ చేస్తూ మనసుంటే సేవా మార్గాలెన్నో అని నిరూపిస్తున్నారు. సాక్షి, సిటీబ్యూరో: ‘‘అనాథలకు తనకు తోచిన, నిరంతరాయంగా సాగే సహయం ఏదైనా చేయాలనే తపనతో ఉండేవాడినని, అందులోంచి పుట్టిన ఆలోచనే ‘‘వి ఫర్ ఆర్ఫన్స్’’ అని అంటున్నాడు ముషీరబాద్లో సెలూన్‌ని నిర్వహించే రాజేష్. 2018 నుంచి ఈ కార్యక్రమంలో భాగంగా సిటీలోనే దాదాపు 30 వరకు అనాథ ఆశ్రమాలు,స్వచ్చంద సేవా సంస్థల్లోని పిల్లలకు, వృద్ధులకు అంతేకాకుండా అంధులకు,రోడ్లపైన ఉండే మానసిక వికలాంగుల వద్దకు స్వయంగా తన టీంతో వెళ్ళి ఉచితంగా కటింగ్ చేస్తామని చెప్పాడు. సిటీలోనే కాకుండా చౌటుప్పల్, స్టేషన్ ఘన్పూర్, నర్సాపూర్ తదితర ప్రాంతాలలో కూడా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని అన్నాడు. ఇప్పటి వరకు 40 ఆశ్రమాల్లో 3500 మందికి పైగా తమ సేవలు అందించామన్నారు. సెలవుకు బదులు సేవ.. తను చేస్తున్న కార్యక్రమాలు నచ్చి సిటీలోని ప్రముఖ హేర్ సెలూన్స్‌లో పనిచేసే దాదాపు 40 మంది సభ్యులుగా చేరారని రాకేష్ చెప్పారు. వీరంతా ఎలాంటి లాభాపేక్ష లేకుండా తమ సేవలు అందిస్తున్నారన్నారు. తమకు సెలవు దినమైన మంగళవారం రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, ఇందులో భాగంగా ప్రతీ ఆశ్రమానికి నెలలో కనీసం ఒకసారైనా వెళ్ళి ఈ సేవలు అందిస్తామని తెలిపాడు. ప్రతీ ఆదివారం తన సెలూన్లో వచ్చే పూర్తి ఆదాయాన్ని ఈ కార్యక్రమ నిర్వాహణకు ఉపయోగిస్తానని,ఈ కార్యక్రమ నిర్వాహణకు ఒక ఆశ్రమానికి 1500 వరకు ఖర్చువుతుందని, ఎవరి దగ్గరా నిధులు సేకరించమని రాకేష్ తెలిపాడు. -
నయా హెయిర్ స్టైల్.. 40 మిలియన్ల వ్యూస్
కురులపైనా శ్రద్ధ కేవలం అమ్మాయిలకే ఉంటుంది అనుకుంటే పొరపాటే.. వాస్తవానికి అబ్బాయిలు కూడా జుట్టుపై ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారట. ఉన్న కొంచెం జుట్టు అయినా రకరకాలుగా సోకులు పడుతుంటారు. జుట్టును అటు వేసి.. ఇటు వేసి.. సగం కత్తిరించి వివిధ స్టైల్లో తిప్పుతుంటారు. అయితే ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కొంతమంది ఇంకేదో కొత్తదనం కావాలి అని అనుకుంటారు. అలా అనుకునే వారి కోసమే ఓ హెయిర్ స్టైల్ నిపుణుడు వెరైటీగా ట్రై చేశాడు. తన దగ్గరికి వచ్చన ఓ కస్టమర్‌కు జుట్టును స్టైల్ చేయడానికి మంటను ఉపయోగించాడు. జట్టును దువ్వి ఆపై దానికి మంట పెట్టగా.. అది చల్లారడానికి వస్తుంటే దాన్ని వెంట వెంటనే రెండు దువ్వెనలతో స్టైల్‌గా క్రాఫ్ చేశాడు. అయితే కస్టమర్‌కు మాత్రం ఎలాంటి నొప్పి లేకుండా ప్రశాంతంగా కూర్చుని ఉన్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోను మొదటగా టిక్‌టాక్‌లో నవంబర్‌లో ప్రకాశ్ అనే వ్యక్తి షేర్ చేశారు. ఈ వీడియో ఎక్కడ చిత్రీకరించారనే విషయం స్పష్టంగా తెలియనప్పటికీ ఖచ్చితంగా ఇండియాలోనే జరిగుంటుందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే దీనిని టిక్‌టాక్‌లో 30 మిలియన్ల మంది వీక్షించగా.. ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లోనూ షేర్ చేస్తున్నారు. ట్విటర్, ఇన్స్టాగ్రామ్ అన్నింట్లో కలిసి ఇప్పటి వరకు ఈ వీడియోను 43 మిలియన్ల మంది చూశారు. కాగా దీనిని చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. తాము కూడా ఒక్కసారైనా ఇలాంటి హెయిర్ స్టైయిల్ చేయించుకోవాలని తహతహలాడుతున్నారు. అయితే ఇలాంటి ప్రయోగాలు చేయడం వల్ల ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని, ఇంట్లో ఇలాంటివి చేయకండంటూ కొందరు నెటిజన్లు హెచ్చరిస్తున్నారు. This is an origin story for a hairstyle like mine.pic.twitter.com/gBKrhr1AQH — 𝙹𝚘𝚜𝚑 𝙶𝚛𝚞𝚋𝚋𝚜 (@JoshuaGrubbsPhD) January 27, 2020 -
ది బెస్ట్ విరాట్.. మనసు నుంచి తలవరకూ!
ముంబై: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది అభిమానులు విరాట్ సొంతం. కాగా, ఇలా విరాట్‌ని అత్యంత ఎక్కువగా ఇష్టపడే అభిమాని వాంఖడే స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో విన్నూత్నమైన హెయిర్ స్టైల్‌తో కనిపించాడు. అయితే అతని హెయిర్‌స్టైల్ అక్కడి వారందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. చిరాగ్ ఖిలరే అనే వ్యక్తి విరాట్ ముఖంని పోలినట్లు ఉండే విధంగా తన హెయిర్ స్టైలింగ్ చేయించుకున్నాడు. అంతేకాక.. దాన్ని ఫొటో తీసి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ‘ది బెస్ట్ విరాట్.. మనస్సు నుంచి తలవరకూ’ అంటూ అతను ఈ ఫొటోకి క్యాప్షన్ పెట్టాడు.‘అండర్-19 జట్టుకు కెప్టెన్‌గా ఉన్నప్పటి నుంచి నేను విరాట్‌కు అభిమానిగా ఉంటున్నాను. అప్పటి నుంచి అతను ఆడే ప్రతీ మ్యాచ్‌కి నేను వెళ్తాను. కోహ్లిని కలవడం నా కల. నేను అతన్ని కలిసినప్పుడు ముందు అతని కాళ్లను ముట్టుకొని.. ఆ తర్వాత అతన్ని కౌగిలించుకుంటాను. ఆ జ్ఞాపకాన్ని ఓ ఫొటోగ్రాఫ్‌లో బంధిస్తాను’ అని చిరాగ్ తెలిపాడు. The best @imVkohli From heart to head 🇮🇳🥰#viratianchirag @OaktreeSport @buntysajdeh @Cornerstone_CSE @jogeshlulla @BCCI @BCCIdomestic @RCBTweets @rcbfanarmy @ICC @cricketworldcup @imVkohli @vkfofficial @virendersehwag @gauravkapur @jatinsapru @IrfanPathan @RaviShastriOfc pic.twitter.com/ojQqNGWzGL — Chirag Khilare (@Chirag_Viratian) December 12, 2019 -
బ్రైడ్ లుక్... ఫిల్మీ స్టైల్
కల సాకారమయ్యే రోజు అందంగా కళ కళ లాడడానికి కేశాల నుంచి పాదాల దాకా తీర్చిదిద్దుకుంటున్నారు నవ వధువులు. ఈ నేపథ్యంలోనే వీరి కోసం డిజైనర్ దుస్తులు సహా మరెన్నో వస్తున్నట్టే... పెళ్లిళ్లలో రకరకాల సందర్భాలకు తగ్గట్టుగా కేశాలను, ముఖ వర్చస్సు, చేతి గోళ్లను తీర్చిదిద్దే విభిన్న రకాల మేకప్, హెయిర్ స్టైల్స్ అందుబాటులోకి వస్తున్నాయి. ఫిల్మీ నేమ్స్‌తో హెయిర్ స్టైలిస్ట్‌లు వీటిని అందిస్తున్నారు. సాక్షి, సిటీబ్యూరో: సినిమాలు ఎప్పుడూ కొత్త కొత్త స్టైల్స్ మోసుకొస్తాయి. మామూలుగానే అందంగా మెరిసిపోయే హీరోయిన్స్ పెళ్లిళ్లు వంటి సన్నివేశాల్లో మరింత అద్భుతంగా ఆకట్టుకుంటారు. ‘‘అటు సినిమా లుక్‌ని ప్రతిబింబిస్తూనే అవి రియల్లైఫ్కూ నప్పేలా స్టైల్స్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది’’ అని లాక్మెకు చెందిన క్రియేటివ్ డైరెక్టర్ పూజా సింగ్ అంటున్నారు. మూవీ నేమ్.. బ్రైడ్కి ఫేమ్ విభిన్న రకాల సినిమాల స్ఫూర్తితో డిజైన్ చేసిన మేకప్, హెయిర్స్టైల్స్కి అవే సినిమా పేర్లతోనే అందిస్తుండడం విశేషం. తల వెంట్రుకలు, మేకప్, నెయిల్స్ సై్టల్స్ అన్నీ కలిపి ఎంగేజ్మెంట్ సెర్మనీ కోసం అందించే స్టైల్‌కి ఉఫ్ తెరీ అదా లుక్ అని పేరు పెట్టారు. అలాగే సంగీత్ వేడుకలో భాగంగా డ్యాన్స్‌ఫ్లోర్ మీద సన్నిహితులతో కలిసి సందడి చేసే వధువు కోసం ప్రత్యేకంగా ‘మహి వె’ పేరిట స్టైల్‌ని క్రియేట్ చేశారు. ఇక మెహిందీ సెర్మనీ రోజున పెళ్లి కూతురు చుట్టూ చేరిన వారు చేసే అల్లరి అంతా ఇంతా కాదు. దీని కోసం తగ్గట్టుగా ‘మెహందీ లగా కే రఖ్నా’ పేరుతో స్టైల్ డిజైన్ చేశారు. పెళ్లి రోజున గంధర్వ కన్యలా మెరిసిపోయేలా కేశాలు, మేకప్‌తో బ్రైడ్ నెం.1, రిసెప్షన్ వేడుక కోసం వాఖ్రా స్వాగ్ లుక్, సంప్రదాయబద్ధంగా సిగ్గులొలికే వధువును ప్రతిబింబించేలా అమీ తుమాకే బలోబాషి , దక్షిణాది స్టైల్స్‌కు చిహ్నంగా కన్యాకుమారి లుక్, అందిస్తున్నారు. అదే విధంగా దీవానీ మస్తానీ, దిల్‌వాలె దుల్హనె లే జాయేంగే... ఇలా విభిన్న రకాల ఆకర్షణీయమైన పేర్లతో మరింత ఆకర్షణీయంగా ఈ స్టైల్స్‌ని సృష్టిస్తూ సిటీ అమ్మాయిల బ్రెడల్ లుక్‌ని తీర్చిదిద్దుతున్నారు. బ్లాక్ బస్టర్ క్రియేట్ చేశాం... సినిమాలలో కధానాయికల లుక్‌ని చాలా మంది అమ్మాయిలు ఇష్టపడతారు. తమ జీవితంలోని ప్రత్యేక సందర్భాల్లో హీరోయిన్స్‌లా తమ స్టైల్స్ బాగుండాలని ఆశిస్తారు. దీనిని దృష్టిలో ఉంచుకుని మేకప్ ఆర్టిస్ట్‌లు కొత్త కొత్త లుక్స్‌ని క్రియేట్ చేస్తున్నారు. ఈ ట్రెండ్‌కు అనుగుణంగానే ది బ్లాక్ బస్టర్ బ్రైడ్స్ పేరుతో మేం కొత్త సై్టల్స్ని సృష్టించాం. – పుష్కరాజ్ షెనాయ్, లాక్మె సెలూన్స్ -
బ్రెయిడ్ బ్యాండ్ స్టైల్
ఎన్ని హెయిర్ మోడల్స్ ఉన్నా జుట్టు విరబోసుకోవడమే ఎప్పటికీ నడిచే ట్రెండ్. చీరకట్టుకున్నా, జీన్స్ వేసుకున్నా క్రేజీగా కనిపించాలంటే హెయిర్ లీవ్ చేసుకోవాలి. తీరా జుట్టు విరబోసుకున్న తర్వాత.. కాసేపటికి చెరలేగిపోయి.. చిక్కులు పడి.. చిరాకు తెప్పిస్తాయి వెంట్రుకలు. అందుకే హెయిర్ బ్యాండ్స్ పెట్టుకుంటారు చాలా మంది. అలా హెయిర్ బ్యాండ్స్ అవసరం లేకుండా హెయిర్‌నే బ్యాండ్‌లా మార్చుకేనే మోడల్ ఇది. మరింకెందుకు ఆలస్యం ఇలా ప్రయత్నించండి. ముందుగా జుట్టునంతా చిక్కులు లేకుండా దువ్వుకోవాలి. హెయిర్ స్ప్రే చేసుకొని దువ్వుకుంటే జుట్టు మరింత మృదువుగా మారుతుంది. ఇప్పుడు జుట్టునంతా స్ట్రెయిటెనింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎడమవైపు చెవి పక్క నుంచి మూడు చిన్న చిన్న పాయలు తీసకుని.. చిత్రంలో చూపిస్తున్న విధంగా అల్లుకోవాలి. కుడివైపు కూడా అదే విధంగా చివరి వరకూ చిన్న జడ అల్లుకోవాలి. ఇప్పుడు కుడి ఎడమ జడలను పక్కకు పెట్టుకుని మిగిలిన జుట్టునంతా ఒకసారి దువ్వెనతో నెమ్మదిగా దువ్వుకోవాలి. తర్వాత పాయలను కాస్త లూజ్ చేసుకోవాలి. ఆ సమయంలో పాయల్లోంచి వెంట్రుకలు బయటికి రాకుండా, తెగిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు కుడి జడను ఎడమ వైపుకు.. ఎడమ జడను కుడివైపుకు.. తిప్పుకుని చిత్రంలో ఉన్న విధంగా పెట్టుకుని ఊడిపోకుండా హెయిర్ పిన్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు కుడి లేదా ఎడమవైపు తల ముందు భాగంలో చిన్న ఫంక్ తీసుకుంటే అదిరే లుక్ మీ సొంతమవుతుంది. హెయిర్‌కేర్ కేశసంరక్షణకు కాస్త సమయం జుట్టు ఒత్తుగా పెరగాలన్నా.. వెంట్రుకలు తెగిపోకుండా, రాలిపోకుండా ఉండాలన్నా.. కనీసం వారానికి రెండు సార్లు స్వచ్ఛమైన కొబ్బరి నూనెతో మర్దనా చేసుకుని మరునాడు తలస్నానం చెయ్యడం తప్పనిసరి. ఇక పెరుగుతున్న కాలుష్యానికి చర్మంతో పాటు వెంట్రుకలు కూడా నిగారింపుని కోల్పోతున్నాయి. జుట్టు విపరీతంగా ఊడిపోతుంది. అలాంటి సమస్యలు దూరం కావాలంటే ఇలా ప్రయత్నించండి. కావల్సినవి: కొత్తిమీర రసం – 2 టేబుల్ స్పూన్లు కలబంద గుజ్జు – 4 టేబుల్ స్పూన్లు ఆలివ్ నూనె – 2 టేబుల్ స్పూన్లు పుల్లటి పెరుగు – 3 టేబుల్ స్పూన్లు తయారీ: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో కలబంద గుజ్జు, పుల్లటి పెరుగు, ఆలివ్ నూనె, కొత్తిమీర వేసుకుని బాగా కలుపుకుని.. తలకు బాగా పట్టించి.. 30 లేదా 35 నిమిషాల తర్వాత తల స్నానం చెయ్యాలి. ఇలా వారానికి ఒకటీ లేదా రెండు సార్లు చెయ్యడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. -
ఆ పచ్చబొట్లేమిటి?
ఐటీ సిటీలో మహిళలు, అమ్మాయిలపై అరాచకాలకు అదుపు లేదు. వేధింపులు, అత్యాచారాల సంఘటనలు సరేసరి. ఇక భూ దందాలు, హత్యల్లోనూ దేశంలోనే టాప్‌లో ఉంటోందీ ఉద్యాననగరి. ఇలాగైతే కుదరదు, ఓ పట్టు పట్టాల్సిందేనని సీసీబీ పోలీసులు ఆపరేషన్‌ను షురూ చేశారు. సాక్షి, బెంగళూరు: సిలికాన్ సిటీలో నేర కార్యకలాపాలను అడ్డుకట్టవేయడానికి సెంట్రల్ క్రైం బ్రాంచ్ (సీసీబీ) పోలీస్ అధికారులు కొత్తమార్గాలు అన్వేషిస్తున్నారు. నగరంలో రౌడీలు, గూండాలను వెంటాడుతున్న సీసీబీ పోలీసులు తమదైనశైలిలో పబ్‌లు, బార్లపై దాడులు ప్రారంభించారు. ఇక చెవులకు పోగులు, చేతులకు కడియం,విచిత్ర తరహాలో జుట్టు, గడ్డాలు పెంచుకుని తిరిగే యువకులు, నిరంతరం బార్లలో గుంపులుగా కూర్చుని మందుకొట్టేవారిని అదుపులోకి తమదైనశైలిలో విచారిస్తున్నారు. సీసీబీ పోలీసుల కంటికి అనుమానాస్పదంగా కనబడినవారిని బార్లలో నుంచి నేరుగా ఆయా పోలీస్స్టేషన్లు, లేక సీసీబీ కార్యాలయానికి తీసుకెళ్లి విచారిస్తున్నారు. అమాయకులుగా తేలినవారిని వదిలేసి గతంలో ఏమాత్రం నేరచరిత ఉన్నా కౌన్సెలింగ్ ఆరంభిస్తున్నారు. ఆదివారం సాయంత్రం నుంచే ఇలాంటి దాడులకు సీసీబీ పోలీసులు శ్రీకారం చుట్టారు. రాజాజీనగర, మాగడిరోడ్డు, హనుమంతనగర, పోలీస్స్టేషన్లు పరిధిలోని పలుబార్ అండ్ రెస్టారెంట్లపై పోలీసులు దాడులకు, కౌన్సెలింగ్‌కు శ్రీకారం చుట్టారు. ఇప్పటివరకు దొరికినవారిలో 36 మంది రౌడీలు ఉండగా, వారి కార్యకలాపాలపై లోతుగా విచారణ చేపడుతున్నారు. రౌడీలు పట్టివేత హనుమంతనగర పోలీస్‌స్టేషన్ పరిధిలోని బ్లూవిం గ్బార్ పై సీసీబీ పోలీసుల దాడిలో అశోక్‌కుమార్, ప్రదీప్, వసంతకుమార్, దేవరాజు, చేతన్‌కుమార్, కాంతరాజు, విజయ్, రాజశేఖర్, విజయ్‌కుమార్ అనే రౌడీలు దొరికారు. రాజాజీనగర పోలీస్‌స్టేషన్ పరిధిలోని నవరంగ్ బార్ లో సూర్యకుమార్, చంద్రకాంత్, శ్రీకాంత్, మదన్, ఆనంద్, సంజయ్ అనే ఏడుగురుని పట్టుకెళ్లారు. మాగడి కాల్టెల్ బార్లో మద్యం సేవిస్తున్న నవీన్, మంజునాథ్, భరత్, మహేంద్ర, మంజు, విజయ్‌కుమార్, గోపినాయక్, జగదీశ్, జాకీర్, మహీబ్జాన్ అనే 11 మందిని తరలించారు. ముమ్మరంగా నిఘా చర్యలు రౌడీలు తమ ప్రభావాన్ని పెంచుకోవడానికి ఎక్కడెక్కడ గ్యాంగ్‌లు కడుతున్నారు అనే దాని పట్ల సీసీబీ అధికారులు సమాచారం సేకరిస్తున్నారు. నిర్మాణంలో ఉన్న కట్టడాలు, ఖాళీ మైదానాలు, కట్టడాల టెర్రస్‌లపై రౌడీలు చేరుకుని మద్యపానం సేవిస్తూ పార్టీలు చేసుకుంటున్నారని తెలిసి నిఘా పెట్టారు. మునుముందు మరిన్ని కఠిన చర్యలకు సిద్ధమవుతున్నారు. ఆ పచ్చబొట్లేమిటి? ‘చేతులపై కాకి, గుడ్లగూబ, శునకం ఇలా రకరకాల పచ్చబొట్లు వేసుకుని పోజు కొడితే ఊరుకునేదిలేదు. శుభ్రంగా కటింగ్, షేవింగ్ చేసుకుని మనుషుల్లా కనబడాలి. డాక్టర్ రాజ్‌కుమార్ ట్యాటూ వేసుకుని హత్యలకు పాల్పడతారా’ అని అదనపు పోలీస్‌కమిషనర్ అలోక్‌కుమార్ రౌడీలను హెచ్చరించారు. గాంధీ జయంతి సందర్బంగా మంగళవారం సీసీబీ కార్యాలయంలో సుమారు 500 మంది రౌడీలకు పరేడ్ నిర్వహించి తీవ్రంగామందలించారు. డిప్రెషన్లో ఉన్నాను సార్ అని ఒక రౌడీ చెప్పగా, నిన్ను ఎవరైనా అలా అంటారా? అని ఆగ్రహించారు. మళ్లీ ఏదైనా సెటిల్మెంట్లకు దిగితే గూండా చట్టం కింద జైలుకు పంపుతానని హెచ్చరించారు. వైట్‌డ్రెస్ వేసుకుని సంఘవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడతారా అని మండిపడ్డారు. ఒక్కో రౌడీని ఆయన ప్రశ్నించి ప్రవర్తన మార్చుకోవాలని హెచ్చరించారు. -
ప్లెయిట్ పోనీ
ఈ హెయిర్ స్టయిల్‌ను ‘ప్లెయిట్ పోనీ’ అంటారు. దీన్ని వేసుకోవడానికి జుత్తు మరీ ఒత్తుగా ఉండాల్సిన పనిలేదు. పోనీ స్టయిల్ని ఇష్టపడేవారికి ఈ హెయిర్ స్టయిల్ బాగా నచ్చుతుంది. ఇందులో మామూలు పోనీనే కాకుండా, ఫ్రెంచ్ అల్లిక ఉండటం దీని స్పెషాలిటీ. గాగ్రా, స్కర్ట్, జీన్స్, శారీస్ అనే తేడా లేకుండా... అన్ని డ్రెస్సుల మీదికీ ఈ హెయిర్ స్టయిల్ భలేగా నప్పుతుంది. మరింకెందుకు ఆలస్యం, వెంటనే కింద ఇచ్చిన స్టెప్స్‌ను ఫాలో అవుతూ ప్రయత్నించండి. 1 ముందుగా జుత్తునంతా చిక్కులు లేకుండా దువ్వుకో వాలి. హెయిర్‌స్ప్రే చేసుకొని దువ్వుకుంటే, జుత్తు మృదువుగా మారుతుంది. తర్వాత ఎడమ చెవివైపున కొంత జుత్తును తీసుకోవాలి. దాన్ని మూడు పాయలుగా చేసి ఓ అల్లిక అల్లాలి. తర్వాత ఆ మూడుపాయలను రెండుగా చేసి, ఎడమవైపు నుంచి ఓ సన్నని పాయను తీసుకొని అల్లుకోవాలి. అలా ప్రతిసారీ పక్కనుంచి సన్నని పాయలను తీసుకొని జడలో కలుపుకుపోవాలి. తర్వాత మిగిలిన పాయలతో జడను పూర్తిగా అల్లి, చివరికి బ్యాండ్ పెట్టుకోవాలి. 2 పై స్టెప్‌లో చేసినట్టుగానే, కుడివైపున కూడా మూడుపాయలను తీసుకొని అల్లాలి. తర్వాత కుడివైపు నుంచి సన్నని పాయలను తీసుకొని అల్లికల్లో కలుపుకొని అల్లుకోవాలి. ఆపైన మిగిలిన మూడు పాయలతో జడను పూర్తిగా అల్లి, బ్యాండ్ పెట్టుకోవాలి. 3 ఇప్పుడు ముందుభాగంలో కొంత జుత్తుకు ఏదైనా ప్లకర్ పెట్టి వదిలేయాలి. తర్వాత దానివెనుక వైపున్న జుత్తును స్ట్రెయిట్నింగ్ చేసుకోవాలి. 4 పై స్టెప్లోలాగే కొద్దికొద్దిగా జుత్తును చేతుల్లోకి తీసుకొని, స్ట్రెయిట్నర్తో స్ట్రెయిట్నింగ్ చేసుకోవాలి. 5 అలా సగం వరకు ముందుభాగం జుత్తునంతా స్ట్రెయిట్నింగ్ చేసుకున్నాక, వెనుకవైపున్న జుత్తునంతా చిక్కులు లేకుండా దువ్వుకోవాలి. 6 ఇప్పుడు ముందుభాగంలో ఉన్న జుత్తును, పఫ్ఫీగా వచ్చేలా వెనుకకు తీసుకురావాలి. కాస్తంత వదులుగా జడ మధ్యలోకి తీసుకొచ్చి, స్లైడ్స్ పెట్టుకోవాలి. పఫ్ వదులుకాకుండా ఉండేందుకు సరిపడా స్లైడ్స్ పెట్టుకోవాలి. 7 పై స్టెప్స్‌ను ఫాలో అవుతూ చేస్తూపోతే.. ఇప్పుడు మీ హెయిర్ స్టయిల్ ఫొటోలో కనిపిస్తున్నట్టుగా వస్తుంది. 8 తర్వాత ముందుభాగంలో వదిలేసిన జుత్తుకున్న ప్లకర్ను తొలగించి, ఆ జుత్తును వెనుకకు తీసుకురావాలి. ఆ జుత్తును కాస్తంత మెలితిప్పి స్లైడ్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు జుత్తునంతటికీ కలిపి బ్యాండ్ పెట్టుకోవాలి. 9 ఆపైన ఇరువైపులా ఉన్న రెండు జడలనూ... మధ్యలోకి తీసుకొచ్చి బ్యాండ్ చుట్టూ చుట్టుకోవాలి. జడల చివర్లు కనిపించకుండా స్లైడ్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఎంతో అందమైన హెయిర్ స్టయిల్ మీ సొంతం. -
బస్సు డ్రైవరే అమ్మలా మారి...
-
బస్సు డ్రైవరే తల్లిలా మారి...
ఆల్పైన్ : తల్లిలేని పిల్లకు తల్లిలా మారిందో మహిళా డ్రైవరు. రోజూ తన బస్సులో ప్రయాణించే చిన్నారికి తల దువ్వి జడేస్తూ ఆ బాలికకు అమ్మలేని లోటును కొంతైనా తీరుస్తోంది. వివరాల్లోకి వెళితే.. ఉటా దేశంలోని ఆల్పైన్ నగరానికి చెందిన పదకొండేళ్ల ఇసబెల్లా పీరీ అనే అమ్మాయి రెండేళ్ల క్రితం తల్లిని కోల్పోయింది. క్యాన్సర్ వ్యాధితో ఆమె మరణించగా.. అప్పటి నుంచి ఆ చిన్నారి తన పనులు తానే చేసుకుంటోంది. తండ్రి ఉద్యోగ రిత్యా ఉదయాన్నేలేచి వెళ్లిపోతుండటంతో.. సొంతగా పనులు చేసుకోవటం అలవర్చుకుంది. అయితే జడేసుకోవటం మాత్రం ఆ చిన్నారికి ఇబ్బందిగా అనిపించేది. ఓ రోజు తాను వెళ్లే స్కూలు బస్ డ్రైవర్ ట్రేసీ డీన్.. ఓ విద్యార్థినికి జడవేయడం ఇసబెల్లా గమనించింది . తనకు కూడా జడవేయాల్సిందిగా ట్రేసీని కోరింది. అలా అప్పటి నుంచి రోజు ఆమెకు ఎంచక్కా ఆ డ్రైవర్ జడేస్తూ ముస్తాబు చేసేది. ‘ట్రేసీ చేస్తున్న సేవలతో తాను ఆమెను ఓ తల్లిలా భావిస్తున్నాను’ అని ఇసబెల్లా చెబుతుండగా.. ట్రేసీ డీన్ స్పందిస్తూ.. ‘ఏడు సంవత్సరాల క్రితం నేను రొమ్ము క్యాన్సర్‌కి గురయ్యాను. ఆ సమయంలో నేను చనిపోతే నా పిల్లలను ఎవరు చూసుకుంటారనిపించింది. తండ్రి ఉన్నా.. తల్లి చేసే పనులు చేయలేరు. ప్రేమగా జడవేయడం తల్లికి మాత్రమే తెలుసు. అందుకే ఇసబెల్లా కోరికను తీరుస్తున్నా’ చెప్పారు. ఇసబెల్లాకు ట్రేసీ జడ వేస్తున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. -
లవ్లీ బ్రెయిడ్
ఇది ‘లవ్లీ్ల బ్రెయిడ్’ హెయిర్ స్టయిల్. ఇది చూడటానికి అందంగా, కొత్తగా ఉంటూ... చూపరులను ఇట్టే ఆకర్షిస్తుంది. దీన్ని వేసుకోవడానికి పెద్దగా కష్టపడనక్కర్లేదు. అలాగే దీనికి జుత్తు మరీ ఒత్తుగా ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఈ హెయిర్ స్టయిల్ స్కర్ట్స్, జీన్స్, శారీస్ మీదకు భలేగా నప్పుతుంది. చిన్న, పెద్ద అని తేడా లేకుండా అన్నిరకాల పార్టీలకు అందరూ వేసుకోవచ్చు. మరింకెందుకు ఆలస్యం, వెంటనే కింద ఇచ్చిన స్టెప్స్‌ను ఫాలో అవుతూ ప్రయత్నించండి. ►ముందుగా జుత్తునంతా చిక్కులు లేకుండా దువ్వుకోవాలి. హెయిర్‌స్ప్రే చేసుకొని దువ్వుకుంటే జుత్తు మృదువుగా మారుతుంది. తర్వాత జుత్తు మొత్తానికీ కలిపి ఓ బ్యాండ్ పెట్టుకోవాలి. ►ఇప్పుడు పోనీలో నుంచి కొంత జుత్తును చేతుల్లోకి తీసుకోవాలి. ►తర్వాత ఆ జుత్తును కాస్తంత వదులుగా పట్టుకొని, బ్యాండ్ చుట్టూ చుట్టుకోవాలి. ►అలా చుట్టుకున్న జుత్తు చివర్లు బయటికి రాకుండా స్లైడ్స్ పెట్టుకోవాలి. అప్పుడు ఫొటోలో కనిపిస్తున్నట్టుగా మీ జడ ఉంటుంది. ►కింద మిగిలిన జుత్తును మరోసారి దువ్వుకొని పూర్తిగా పైకి తీసుకెళ్లాలి. అలాగే బ్యాండ్‌ను కాస్తంత గ్యాప్ వచ్చేలా లాగి పట్టుకోవాలి. ►ఇప్పుడు ఆ జుత్తును పైనున్న బ్యాండ్‌లో నుంచి బయటికి తీయాలి. ►అలా బయటికి తీసిన జుత్తును రెండు భాగాలుగా చేసుకోవాలి. ►ఆ రెండు భాగాల జుత్తుతో రెండు ముళ్లు వేయాలి. ఆపైన చివర్లు కనిపించకుండా స్లైడ్స్ పెట్టుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. అంతే, ఎంతో అందమైన హెయిర్ స్టయిల్ మీ సొంతమవుతుంది. సిల్కీ అండ్ షైనీ రోజురోజుకీ పెరిగిపోతున్న కాలుష్యానికి హెయిర్ మొత్తం పాడైపోతుందని బాధపడుతున్నారా? ఆయిల్స్, షాంపూస్, కండీషనర్స్ మార్చి మార్చి విసిగిపోయారా? అయితే ఇలా ప్రయత్నించండి. కావల్సినవి: కొబ్బరి పాలు – 4 టీ స్పూన్స్ ఆలివ్ ఆయిల్ – 2 టీ స్పూన్స్, నిమ్మరసం – 1 టీ స్పూన్ తయారీ: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో కొబ్బరి పాలు, ఆలివ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. తరువాత నిమ్మరసం కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు హెయిర్ చిక్కులు లేకుండా దువ్వుకుని, కుదుళ్లకు పట్టేలా మొత్తం హెయిర్‌కు ఆ మిశ్రమాన్ని అప్లై చేసుకుని, ఓ 30 నిమిషాల తరువాత తలస్నానం చెయ్యాలి. ఇలా వారానికి ఒకటి లేదా రెండుసార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. -
స్పెషల్ పొంగల్
చేతిలో వైన్ గ్లాస్. డిఫరెంట్ హెయిర్ స్టైల్. కోపంగా చూస్తున్న చూపు... తెలుగు సినిమాల్లో కనిపించనంత డిఫరెంట్‌గా సిద్ధార్థ్ కనిపిస్తున్నారు కదూ. మలయాళ సినిమా ‘కమ్మార సంభవం’లో సిద్ధూ ఇలా కనిపించనున్నారు. మాలీవుడ్‌లో ఆయనకిది మొదటి సినిమా. రతిష్ అంబత్ దర్శకత్వంలో దిలీప్ కుమార్, సిద్ధార్థ్ ముఖ్య తారలుగా రూపొందుతున్న సినిమా ఇది. గత నెల ఈ సినిమాలోని దిలీప్ లుక్‌ను రిలీజ్ చేసిన చిత్రబృందం ఇప్పుడు íసిద్ధార్థ్ లుక్‌ను రిలీజ్ చేశారు. ‘‘దిస్ ఈజ్ మోస్ట్ స్పెషల్ పొంగల్. నేను నటిస్తున్న ఫస్ట్ మలయాళం సినిమా ‘కమ్మార సంభవం’లో నా లుక్ రిలీజ్ అయ్యింది. రితిష్ అంబత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు మురళీగోపీ కథ రాశారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాను’’ అని పేర్కొన్నారు సిద్ధార్థ్. -
స్టైల్!
-
ఇట్స్ మై స్టైల్..
లక్సెట్టిపేట(మంచిర్యాల): టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో ఫ్యాషన్ ప్రపంచం క్షణాల్లో కళ్ల ముందు దర్శనమిస్తోంది. యువతలో ఫ్యాషన్ అనుకరణ రోజురోజుకు పెరుగుతోంది. గ్రామాల్లోనూ ఈ ప్రభావం కనిపిస్తోంది. సమ్‌థింగ్ స్పెషల్‌గా ఉండేందుకు యువకులు ఆరాటపడుతున్నారు. తమదైన గెటప్‌తో ఆకట్టుకుంటున్నారు. ఈ కోవకు చెందిన వ్యక్తే జీవన్. వినూత్న హెయిర్‌స్టైల్, స్పెషల్ అప్పియరెన్స్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తూ ‘ఇట్స్ మై స్టైల్’ అంటున్నాడితను. మండలంలోని చందారం గ్రామానికి చెందిన జీవన్ (నిక్‌నేమ్ జీవా, లోబో) పదో తరగతి వరకు చదువుకున్నాడు. తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తుంటారు. చిత్రకళపై ఉన్న ఆసక్తితో చిన్నతనం లోనే ఆర్టిస్ట్ వద్ద మెళకువలు నేర్చుకున్నాడు. ప్రస్తుతం సొంతంగా షాపు ఏర్పాటు చేసుకున్నాడు. పేయింటింగ్, ఫ్లెక్సీ ప్రింటింగ్, రేడియం స్టిక్కరింగ్ చేస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉండాలని డిఫరెంట్ స్టైల్స్‌తో ప్రజల్లో తిరుగుతుంటాడు. ఓ టీవీ చానల్ యాంకర్ లోబోను చూసి ఆకర్షితుడయ్యాడు. తను కూడా అదే స్టైల్లో ఉండాలనుకున్నాడు. వెరైటీ డ్రెస్సెస్, హేర్‌కటింగ్ విత్ కలరింగ్, కాళ్లకు వేర్వేరు షూ, ఆకట్టుకునే బైక్‌తో ప్రత్యేక గుర్తింపు సంపాధించుకున్నాడు. తన కళానైపుణ్యం జోడించి బైక్‌ను పూర్తిగా మోడిఫై చేసుకున్నాడు. మంచిర్యాలలోని మెన్స్ ఓ బ్యూటీపార్లర్‌లో హెయిర్‌స్టైల్‌కు మెరుగులు దిద్దుకుంటాడు. షూ, చెప్పులు ఏవి వేసుకున్నా రెండు కాళ్లకు వేర్వేరుగా ధరించడం ఈయన హాబీ. తన పేరు జీవన్ కాగా కొద్దిరోజులు జీవాగా.. ప్రస్తుతం లోబోగా మార్చుకున్నాడు. పియానో, కీబోర్డులోనూ ప్రవేశం ఉంది ఇతడికి. ఆర్కెస్ట్రా, మ్యారేజ్ ఫంక్షన్ ప్రోగ్రాంలలో పాల్గొంటుంటాడు. మ్యూజిక్ ప్రోగ్రాంలకు వెళ్లాలంటే స్టైల్‌కు గుర్తింపు ఉంటుందని అందుకే ఇలా డిఫరెంట్‌గా ఉంటున్నాన్నంటున్నాడు జీవన్. -
బబుల్ బన్
సిగ సింగారం షార్ట్ హెయిర్ గలవారు కేశాలంకరణలో ఎన్నో రకాల స్టైల్స్‌తో వెలిగిపోవచ్చు. పార్టీకి వెస్టర్న్ వేర్ ధరించినప్పుడు ఎలాంటి హెయిర్ స్టైల్ బాగుంటుంది అని ఆందోళన చెందకుండా సింపుల్‌గా అనిపించడంతో పాటు సౌకర్యంగానూ సౌకర్యంగానూ, స్టైల్‌గానూ ఉండే ఈ బబుల్బన్ని ట్రై చేయవచ్చు. ఈ కేశాలంకరణను కేవలం 2 నిమిషాలలోనే చేసుకోవచ్చు. 1. జుట్టును చిక్కుల్లేకుండా దువ్వాలి. పోనీటెయిల్‌లా జుట్టునంతా నడినెత్తిమీదకు దువ్వి రబ్బర్ బ్యాండ్ పెట్టాలి. 2. రబ్బరు బ్యాండ్ పెట్టిన జుట్టు కొంత పైకి పెట్టి, మరో వరుస అదే రబ్బరు బ్యాండ్ వేయాలి. 3. ఫొటోలో చూపిన విధంగా కొంత కుచ్చు వచ్చేలా జుట్టును, రబ్బర్బ్యాండ్ను సెట్ చేసుకోవాలి. 4. రబ్బర్ బ్యాండ్ చుట్టూతా కింద మిగిలిన జుట్టును మడచి తిప్పాలి. 5. జుట్టు చివరలను మడ వాలి. రబ్బర్‌బ్యాండ్ పెట్టిన దగ్గర కొద్దిగా వదులు చేసిన మధ్య నుంచి జుట్టు చివరలను బయటకు తీయాలి. 6. పైన బన్ ఒక పువ్వు గుత్తిలా చేత్తోనే సెట్ చేయాలి. 7. జుట్టు చివరలను నీటుగా సర్ది, మడవాలి. 8. బయటకు రాకుండా జుట్టుకు దగ్గరగా చివరలను క్లిప్‌తో సెట్ట చేయాలి. 9. ఫొటోలో చూపిన విధంగా నడి నెత్తి మీద అందమైన బుడగలాంటి అలంకరణ ముచ్చట గొలుపుతుంది. సహజమైన కండిషనర్ దుమ్ము, పొగ.. వంటివి శిరోజాలను త్వరగా పొడిబారేలా చేస్తున్నాయి. పొడిగా మారిన వెంట్రుకల చివర్లు చిట్లడం, ఊడిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. పరిష్కారం.. * బాగా మగ్గిన అరటిపండును గుజ్జులా చేసి, దాంట్లో గుడ్డు సొన వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి, 15-30 నిమిషాలు ఉంచాలి. తర్వాత వెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఈ మిశ్రమం కురులకు సహజసిద్ధమైన కండిషనర్‌లా ఉపయోగపడుతుంది. * పావు కప్పు ఆర్గానిక్ యాపిల్ సైడర్ వెనిగర్‌ను కప్పు నీటిలో కలపాలి. షాంపూతో తలస్నానం చేసిన తర్వాత ఆ నీటితో వెంట్రుకలను తడపాలి. ఈ మిశ్రమం జుట్టుకు మంచి కండిషన్‌ని ఇస్తుంది. * షాంపూ చేసిన తర్వాత బేకింగ్ సోడాలో అతి కొద్దిగా కొబ్బరి నూనె కలిపి వెంట్రుకలను తడిపి, ఆ తర్వాత కడిగేయాలి. -
ఫైవ్ మినట్ బన్
సిగ సింగారం ఈ హెయిర్ స్టయిల్ పేరు ‘ఫైవ్ మినట్ బన్’. పేరుకు తగ్గట్టుగానే దీన్ని వేసుకోవడానికి అయిదు నిమిషాలు చాలు. మొదట్లో కొంచెం ఎక్కువ టైం పట్టినా... వేసుకుంటూ ఉంటే అయిదు నిమిషాలు సరిపోతుంది. ఈ హెయిర్ స్టయిల్‌ను విదేశీయులు వివాహ వేడుకల్లో ఎక్కువగా వేసుకుంటారు. అలాగే భారతీయులు కూడా ఈ మధ్య ఈ స్టయిల్‌ను బాగా ఫాలో అవుతున్నారు. గౌన్లు, స్కర్ట్స్, గాగ్రా, ఫ్యాన్సీ శారీస్ మీదకు ఈ హెయిర్ స్టయిల్ బాగా నప్పుతుంది. మరి ఈ సిగ సోయగం మీకూ కావాలంటే.. వెంటనే వేసుకోండి మరి. 1. ముందుగా జుత్తునంతా చిక్కులు లేకుండా దువ్వుకోవాలి. 2. ఇప్పుడు ఫొటోలో కనిపిస్తున్న విధంగా... కింది భాగంలోని జుత్తుకు బ్యాండు పెట్టాలి. 3. ఆ పోనీని పూర్తిగా మెలితిప్పి, గుండ్రంగా కొప్పులా చుట్టాలి. చివర్లు బయటికి రాకుండా స్లైడ్స్ పెట్టేయాలి. పై భాగంలోని జుత్తు కిందకు రాకుండా టెంపరరీగా వాటికీ స్లైడ్స్ పెట్టాలి. 4. తర్వాత పై భాగంలోని జుత్తుకు పెట్టిన స్లైడ్స్‌ను తీసేయాలి. ఇప్పుడు ఆ జుత్తును రివర్స్‌లో దువ్వాలి (అంటే చివర్ల నుంచి మాడుకు... అలా చేస్తే పఫ్ బాగా వస్తుంది). ఆపైన మధ్య భాగంలోని జుత్తును తీసుకొని బ్యాండ్ పెట్టాలి. 5. ఇప్పుడు ఎడమ చెవి వైపు మరో రెండు పాయలను తీసుకొని, విడివిడిగా వాటికి బ్యాండ్స్ పెట్టాలి. 6. ఆపైన కుడి వైపు కూడా రెండు పాయలను తీసుకొని, విడివిడిగా బ్యాండ్స్ పెట్టి పోనీలు వేయాలి. 7. తర్వాత అన్ని పోనీలను... వాటి వాటి బ్యాండ్లలోంచి పై నుంచి కిందకు తీయాలి. (ఎలా అంటే.. బ్యాండ్ పెట్టాక, దాని పైభాగంలోని జుత్తును చేతి వేళ్లతో కాస్తంత దూరం చేయాలి. అప్పుడు పోనీని అందులోంచి పై నుంచి కిందకు తీయలి) 8. ఇప్పుడు రెండువైపుల ఉన్న నాలుగు చిన్న పోనీలను ఒక్కొక్కొటిగా మధ్య పోనీలోంచి పై నుంచి కిందకు తీయాలి. 9. ఆ మిగిలిన పెద్ద పోనీ (మధ్యది)ని పూర్తిగా మెలితిప్పాలి. 10. ఆ మెలితిప్పిన పోనీని కింద ఉన్న కొప్పు చుట్టూ చుట్టాలి. చివర్లు బయటికి రాకుండా స్లైడ్స్ పెట్టాలి. -
లూప్డ్ ట్విస్ట్ పోనీ
సిగ సింగారం దీన్ని లూప్డ్ ట్విస్ట్ పోనీ అంటారు. ఈ హెయిర్ స్టయిల్ చాలా సింపుల్‌గా ఉంటుంది. ఇది అన్ని రకాల డ్రెస్సుల మీదకు నప్పుతుంది. ముఖ్యంగా జీన్స్, స్కర్ట్స్, పంజాబీ డ్రెస్సులకు బాగా సూట్ అవుతుంది. ఈ రకం పోనీని వేసుకోవడానికి జుత్తు మరీ ఒత్తుగా ఉండాల్సిన అవసరం లేదు. మరో విశేషం ఏమిటంటే.. ఈ హెయిర్ స్టయిల్‌ను నూనె పెట్టిన జుత్తుతో కూడా వేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఈ లూప్డ్ ట్విస్ట్ పోనీని మీరూ ట్రై చేయండి. ఎలా అంటే... 1. ముందుగా జుత్తునంతటినీ ఎడమ చెవి వైపుకు తీసుకొచ్చి, చిక్కులు లేకుండా దువ్వుకోవాలి. 2. ఇప్పుడు ఆ జుత్తుకు రబ్బర్ బ్యాండ్ పెట్టి పోనీ వేసుకోవాలి. 3. తర్వాత బ్యాండ్పైన జుత్తును ఫొటోలో కనిపిస్తున్న విధంగా చేతి వేళ్లతో దూరం చేయాలి. 4. పోనీని ఇప్పుడు అందులోంచి పై నుంచి కిందకు తీయాలి. 5. కింద భాగంలో మిగిలిన జుత్తును చిక్కులు లేకుండా మళ్లీ దువ్వుకోవాలి. కావాలంటే హెయిర్ స్ప్రే చేసుకోవచ్చు. 6. ఫొటోలో కనిపిస్తున్న విధంగా బ్యాండ్ పైన జుత్తును మెల్లిగా కదిలిస్తూ, వదులు చేసుకోవాలి. 7. తర్వాత ఫస్ట్ లూప్‌కు కాస్త కింది భాగంలో మరో బ్యాండ్ పెట్టి, స్టెప్ 3ను రిపీట్ చేయాలి. 8. ఇప్పుడు మిగిలిన పోనీని స్టెప్ 4 లాగే బ్యాండ్ పైన జుత్తులోంచి పై నుంచి కిందకు తీయాలి. తర్వాత ఆ లూప్‌ను కూడా వదులు చేసుకోవాలి. 9. అలా మీ జుత్తు పొడవును బట్టి లూప్స్‌ను వేసుకుంటూ పోవాలి. చివరగా కాస్త జుత్తును వదిలేసి బ్యాండు పెట్టుకోవాలి. కావాలంటే ఈ హెయిర్ స్టయిల్ కుడివైపు కూడా వేసుకోవచ్చు. -
బ్యూటిప్స్
• ఆయిలీ హెయిర్ పెట్టే ఇబ్బంది అంతా ఇంతా కాదు. ఊరికూరికే జిడ్డెక్కిపోతుంది. ఏ హెయిర్ స్టయిల్ వేసుకుందామన్నా ముద్దగా ఉండి ముప్పుతిప్పలు పెడుతుంది. అలాంటప్పుడు ఈ చిట్కాలు పాటిస్తే సమస్య తీరుతుంది. • ఓ కప్పు నీటిలో పావుకప్పు నిమ్మరసం, మూడు చెంచాల తేనె వేసి కలపాలి. దీన్ని మాడుకు, జుత్తుకు పట్టించి బాగా మసాజ్ చేసి, తలకు బట్ట చుట్టేయాలి. గంట తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే మంచి ఫలితముంటుంది. • ఓ కప్పు షాంపూ తీసుకుని... అందులో చెంచాడు కలబంద (అలొవెరా) జిగురు, చెంచాడు నిమ్మరసం కలపాలి. దీన్ని మాడుకి, జుత్తుకి పట్టించి... అరగంట తర్వాత శుభ్రంగా తలంటుకోవాలి. వారానికోసారి ఇలా చేస్తే... కొన్ని వారాలు తిరిగేసరికి జుత్తు జిడ్డెక్కడం ఆగిపోతుంది. -
సెమీ కలెక్టెడ్ వేవ్స్
సిగ సింగారం ఇది ‘సెమీ కలెక్టెడ్ వేవ్స్’ హెయిర్ స్టయిల్. పేరులోనే ఉంది కదా.. వేవ్స్ అని. అవును, ఈ స్టయిల్లో హెయిర్వేవ్స్ ఉండటమే విశేషం. సముద్రపు అలలు కాకపోయినా... ఈ వేవ్స్ కాస్తై ఆ వేవ్స్‌ను తలపించక మానవు. ఈ సెమీ కలెక్టెడ్ వేవ్స్ ఎలాంటి ఫ్యాన్సీ డ్రెస్సుల మీదికైనా నప్పుతాయి. ఫ్రాక్స్, స్కర్ట్స్, గాగ్రా, జీన్స్... ఇలా వేటికైనా సూట్ అవుతాయి. అంతేకాదు, ఈ హెయిర్ స్టయిల్ ఫ్యాన్సీ శారీస్ మీదకు కూడా భలే సెట్ అవుతుంది. దీన్ని వేసుకోవడం కూడా చాలా సులువు. కాబట్టి అందరూ ఈ హెయిర్ స్టయిల్‌ను ట్రై చేయొచ్చు. 1. ముందుగా జుత్తునంతా చిక్కులు లేకుండా దువ్వుకోవాలి. తర్వాత జుత్తును కొద్దికొద్దిగా తీసుకొని వేవ్స్‌గా మార్చుకోవాలి (అంటే జుత్తు స్ట్రెయిట్‌గా లేకుండా కర్లీగా చేసుకోవాలి) 2. ముందువైపు జుత్తును కాస్త వదిలేస్తే... ఆ అందమే వేరు. తర్వాత నడినెత్తి మీద ఓ పెద్ద పాయను తీసుకోవాలి. ఇప్పుడు ఆ పెద్ద పాయను మూడు భాగాలుగా చేసి కొద్దిగా అల్లుకోవాలి. 3. జడ కాస్త అల్లిన తర్వాత ఇరువైపుల నుంచి సన్నని పాయలను తీసుకొని, జడలో కలుపుకుంటూ అల్లుకోవాలి. 4. ఇప్పుడు ఫొటోలో కనిపిస్తున్న విధంగా... నడినెత్తి కంటే కాస్త కింద వరకు జడను అల్లి స్లైడ్స్ పెట్టేయాలి. ఇరువైపుల నుంచి సన్నని పాయలు వదులుగా వేలాడకుండా కూడా స్లైడ్స్ పెట్టుకోవాలి. 5. తర్వాత ఎడమ చెవి వైపు నుంచి ఒక సన్నని పాయను తీసి, దాన్ని అవతలి వైపుకు తీసుకెళ్లి స్లైడ్ పెట్టాలి. అలాగే కుడి చెవి వైపు నుంచి తీసిన పాయను, ఎడమ వైపుకు తీసుకెళ్లి స్లైడ్ పెట్టాలి. 6. చివరగా జుత్తునంతటికీ హెయిర్ స్ప్రే చేసుకోవాలి. అలాగే మిగిలిన వేవ్స్ (జుత్తు)ను చిక్కులు లేకుండా స్ప్రే చేసుకుంటూ దువ్వుకోవాలి. అంతే ఎంతో అందమైన వేవ్స్ మీ తలపై తారాడతాయి. -
ఫార్మల్ బ్రెయిడెడ్ అప్‌డూ
సిగ సింగారం ఇది ‘ఫార్మల్ బ్రెయిడెడ్ అప్‌డూ’ అనే హెయిర్ స్టయిల్ రకంలో ఒకటి. ఇది చాలా ఫార్మల్గా, డిగ్నిఫైడ్‌గా కనిపిస్తుంది. గాగ్రా, గౌన్లకే కాదు.. ఈ బ్రెయిడెడ్ అప్‌డూ ఫ్యాన్సీ సారీస్ మీదకు కూడా భలేగా నప్పుతుంది. మీకూ ఈ కొత్త కొప్పు సోయగం కావాలనుకుంటే... వెంటనే ట్రై చేయండి మరి. ముందుగా జుత్తునంతా చిక్కులు లేకుండా దువ్వుకోవాలి. తర్వాత మధ్య పాపిట కాకుండా కుడిచెవి వైపు నుంచి తీయాలి. ఇప్పుడు ఫొటోలో కనిపిస్తున్న విధంగా ఎడమవైపు భాగం నుంచి మూడు సన్నని పాయలను తీసుకొని కాస్త అల్లుకోవాలి. ఇప్పుడు కుడి, ఎడమ వైపుల నుంచి ఒక్కోపాయను తీసుకుంటూ ఈ జడలో కలుపుకుంటూ పోవాలి. (జడను ఇన్సైడ్ అవుట్ (రివర్స్) అల్లుకుంటూ పోవాలి) ఆ జడను ఫొటోలో కనిపిస్తున్న విధంగా పూర్తిగా అల్లి, చివర ఒక బ్యాండ్ పెట్టేయాలి. తర్వాత కుడివైపున్న జుత్తును ఎడమవైపుకు తీసుకొచ్చి, మూడు పాయలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఆ పాయలను కూడా పూర్తి జడలా రివర్స్‌లోనే అల్లి బ్యాండ్ పెట్టేయాలి. ఎడమచెవి వైపు అల్లుకున్న జడ మరీ టైట్‌గా లేకుండా... ఒక్కో పాయను కదిలిస్తూ వదులు చేసుకోవాలి. పైన విధంగానే రెండో జడను కూడా టైట్‌గా లేకుండా వదులు చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కుడిచెవి వైపున్న జడను ఎడమ వైపుకు తీసుకువచ్చి.. గుండ్రంగా చుట్టి కొప్పుగా చేసి స్లైడ్స్ పెట్టేయాలి. తర్వాత ఎడమవైపు ఉన్న జడను ఆ కొప్పు చుట్టూ చుట్టి స్లైడ్స్ పెట్టాలి. ఆపైన ఏదైనా ఆర్టిఫీషియల్ ఫ్లవర్‌తో ఆ కొప్పును అలంకరించుకుంటే ఆ అందమే వేరు. -
పుల్ త్రూ బ్రెయిడ్ షినాన్
సిగ సింగారం ఈ హెయిర్ స్టయిల్‌ను ‘పుల్ త్రూ బ్రెయిడ్ షినాన్’ అంటారు. ఇది ఎలాంటి డ్రెస్సుల మీదికైనా నప్పుతుంది. అంతేకాదు ఎలాంటి పార్టీలకైనా వేసుకోవచ్చు. ఈ హెయిర్ స్టయిల్‌ను వేసుకోవడానికి జుత్తు ఓ మోస్తరు పొడవున్నా సరిపోతుంది. కాబట్టి అందరూ దీన్ని హాయిగా ఈజీగా వేసుకోవచ్చు. ఈ సిగ సోయగం మీకూ కావాలంటే.. వెంటనే ట్రై చేయండి మరి. ముందుగా జుత్తునంతా చిక్కులు లేకుండా దువ్వుకోవాలి. ఇప్పుడు ఫొటోలో కనిపిస్తున్న విధంగా ఎడమ చెవి వైపు రెండు చిన్న పోనీలు వేసి రబ్బర్ బ్యాండ్లు పెట్టేయాలి. తర్వాత మొదటి పోనీని రెండు పాయలుగా పట్టుకొని.. మూడో పాయగా రెండో పోనీని తీసుకోవాలి. ఇప్పుడు ఆ మూడు పాయలతో ఒకటి లేదా రెండు అల్లికలు అల్లాలి. ఆ మూడు పాయల్ని రెండుగా చేసి, పక్క నుంచి మరి కొంత జుత్తును తీసుకొని అల్లుకోవాలి. పైనున్న మూడుపాయల్ని రెండుగా చేసి.. రెండో దానికి బ్యాండు పెట్టాలి. ఫొటోలో కనిపిస్తున్న రెండు పాయలకు.. పక్క నుంచి మరో పాయను తీసి కొద్దిగా అల్లాలి. ముందులాగే మూడు పాయల్ని రెండుగా చేసి, ఒకదానికి బ్యాండు పెట్టాలి. తర్వాత అలా మిగిలిన జుత్తును కూడా సన్నని పాయలుగా తీసుకొని అల్లికలో కలుపుకుంటూ పోవాలి. ఇప్పుడు మీ జుత్తు ఫొటోలో కనిపిస్తున్న విధంగా మారుతుంది. చివర మిగిలిన పోనీని మళ్లీ చిక్కులు లేకుండా దువ్వుకోవాలి. పైన అల్లుకున్న అల్లికలు మరీ టైట్‌గా లేకుండా.. ఒక్కో పాయను కదిలిస్తూ వదులు చేసుకోవాలి. మిగిలిన పోనీని మూడు పాయలుగా చేసుకొని పూర్తిగా అల్లుకోవాలి. చివరగా ఆ అల్లిన జుత్తును ఎడమవైపుకు తీసుకెళ్లి, మడిచి స్లైడ్స్ పెట్టేయాలి. కొప్పు వదులు కాకుండా కావలసిన చోట స్లైడ్స్ పెట్టాలి. కొప్పు వద్దనుకుంటే.. ఎనిమిదో స్టెప్‌తో ఆపేసి, కలర్‌ఫుల్ హెయిర్ బ్యాండ్ పెట్టుకుంటే సరి. -
హాట్ క్రాస్డ్ బన్
సిగ సింగారం ఈ హెయిర్ స్టయిల్‌ను ‘హాట్ క్రాస్డ్ బన్’ అంటారు. ఇది చీరలకే కాదు గాగ్రాలకు, లంగావోణీలకు భలేగా నప్పుతుంది. అసలు వేసవి కాలం వచ్చిందంటే చాలు.. అందరూ తమ జుత్తును కొప్పుగా మార్చేసుకుంటారు. అది సాధారణ విషయమే. కానీ ఆ కొప్పుల్లోనూ వెరైటీ ఉండాలి కదా. అందుకే మామూలు కొప్పుకు బదులుగా ఓసారి ఈ టైప్ ఆఫ్ కొప్పును ట్రై చేయండి. 1. ముందుగా జుత్తును నున్నగా చిక్కులు లేకుండా దువ్వుకోవాలి. ఆపైన జుత్తును ఫొటోలో కనిపిస్తున్న విధంగా మూడు భాగాలుగా చేసుకోవాలి. (ముందువైపు మధ్యపాపిట తీసుకోవాలి) 2. ఇప్పుడు మధ్య భాగంలోని జుత్తుకు ఓ రబ్బర్‌బ్యాండ్‌తో టై చేసుకోవాలి. 3. పైన బ్యాండ్ పెట్టిన పోనీని చిక్కులు లేకుండా దువ్వుకోవాలి. 4. ఆ పోనీని ఇప్పుడు కొప్పుగా చుట్టుకోవాలి. మిగిలిన పోనీ చివర జుత్తును బయటికి కనిపించకుండా కొప్పు లోపలకి పెట్టి స్లైడ్ పెట్టేయాలి. (కొప్పు బన్‌లా గుండ్రంగా వచ్చేలా చూసుకోవాలి) 5. తర్వాత ఎడమ చెవి వైపున్న జుత్తును ఓసారి దువ్వుకొని, మూడు పాయలు తీసుకోవాలి. జడ కాస్త అల్లిన తర్వాత ఎడమ పక్క నుంచి ఒక్కో పాయను తీసుకుంటూ ఈ జడలో కలుపుకుంటూ పోవాలి.(జడను ఇన్సైడ్ అవుట్ (రివర్స్) అల్లుకుంటూ పోవాలి) 6. జడను పూర్తిగా అల్లకుండా, చివర కొద్దిగా జుత్తును వదిలి బ్యాండు పెట్టేయాలి. 7. ఇప్పుడు కుడి చెవి వైపున్న జుత్తును కూడా మిగతా వైపు జుత్తులాగే అల్లి బ్యాండు పెట్టేయాలి. 8. ఎడమ చెవి వైపు అల్లుకున్న జడ మరీ టైట్‌గా లేకుండా, ఒక్కో పాయను కదిలిస్తూ వదులు చేసుకోవాలి. రెండోవైపు జడను కూడా అలాగే వదులు చేసుకోవాలి. 9. తర్వాత రెండువైపుల ఉన్న జడలను అటుది ఇటు, ఇటుది అటు తీసుకు రావాలి. 10. ఇప్పుడు ఆ రెండు జడల పోనీల చివర్లను చిక్కులు లేకుండా దువ్వుకోవాలి. 11. ఆ రెండింటినీ కొప్పు చుట్టూ చుట్టేయాలి. చివర్లు కనిపించకుండా, కొప్పు వదులుకాకండా కావలసిన చోట స్లైడ్స్ పెట్టేయాలి. చివరికి ఏదైనా ఫ్లవర్‌ని కొప్పుకు అలంకరిస్తే... ఎంతో అందమైన ‘హాట్ క్రాస్డ్ బన్’ హెయిర్ స్టయిల్ ఫొటోలో కనిపిస్తున్నట్లుగా తయారవుతుంది. -
ఎండల్లో హాయ్ హాయ్...!
వాలు జడను ఒయ్యారంగా తిప్పుతూ... అంతే ఒయ్యారంగా నడిచే అమ్మాయిలను చూడ్డానికి రెండు కళ్లూ చాలవు. అఫ్కోర్స్ ఇప్పుడు వాలు జడ భామలు దాదాపు కనిపించట్లేదనుకోండి. ఫ్యాషన్ పేరుతో జుట్టు కత్తిరించుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం శ్రుతీహాసన్, సమంత కూడా ఆ పనే చేశారు. హీరోయిన్లు కాబట్టి, ట్రెండ్‌ను అనుసరించి రకరకాల హెయిర్ స్టైల్స్ చేసుకోక తప్పదు. సినిమాల్లో ఎలా కనిపించినా విడిగా మాత్రం దాదాపు జట్టును వదులుగా వదిలేస్తారు. సమ్మర్లో అలా వదిలేస్తే, చీకాకుగా ఉంటుంది. అందుకే, సమ్మర్ కోసం జుట్టును పొట్టిగా కత్తించుకున్నారు. ఇక, ఈ మండుతున్న ఎండల్లో హాయ్ హాయ్‌గా ఉంటామంటున్నారీ బ్యూటీలు. ‘సమ్మర్ లుక్ చూశారా’ అంటూ శ్రుతీహాసన్ తన కొత్త హెయిర్ స్టైల్‌ను చూపించారు. సమంత అయితే, ‘కురచ జుట్టుతో నేను కిడ్‌లా కనిపిస్తున్నా’ అంటూ తన లుక్ చూపించారు. ఏమైనా, అందగత్తెలు కురచ జుట్టులోనూ బాగానే ఉంటారు, వాలు జడలో కనిపించినా వారెవ్వా అనే విధం గానూ ఉంటారు కదూ! -
కేటీఆర్ హెయిర్ స్టైల్ మారింది గురూ!
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ పార్టీ తిరుగులేని విజయం సాధించిన విషయం తెలిసిందే. పార్టీ గెలుపులో కేటీఆర్ కీలక పాత్ర పోషించారు. ఎన్నికల వేళ ఉరుకుపరుకులతో కనిపించిన ఆయన ప్రస్తుతం ప్రశాంతంగా ఉన్నట్లు కనిపిస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం చెప్పులు అరిగేలా తిరిగి ప్రజల మన్ననలు పొందిన కేటీఆర్ ఓట్లేసిన జనాలకు చేసే మంచి పనులకై అధికారులతో సుదీర్ఘ సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. అయితే, సోమవారం ఆశ్చర్యకరమైన సన్నివేశం కనిపించింది. ఎన్నడూ లేనిది కేటీఆర్ కొత్తగా కనిపించారు. ఈ చిత్రంలో ఆయన హెయిర్ స్టైల్ మారిపోయింది. ఎప్పుడూ తన జుట్టును పైకి దువ్వుతూ కనిపించే కేటీఆర్ సోమవారం తన హెయిర్ స్టైల్ తండ్రి ముఖ్యమంత్రి కేసీఆర్ మాదిరిగా దువ్వి కనిపించారు. అంతేకాకుండా ఎంతో సహనంతో చుట్టూ తన తండ్రి కేసీఆర్ లాగే అధికారులను కూర్చోబెట్టుకొని వారితో సావధానంగా సమావేశం నిర్వహించుకుంటూ కనిపించారు. మారిన కేటీఆర్ క్రాఫ్ చూసి ఆయన అభిమానుల స్పందన ఎలా ఉంటుందో చూడాలి మరీ! -
అచ్చం టోపీలాగ ఉంది గురూ!
మాస్కో: ఇదేమి స్టైల్ బాబు, అచ్చం టోపీ లాగ ఉంది చూడు!....పొడవాటి కురులున్న ముద్దు గుమ్మలను ఎంపిక చేసుకొని విభిన్న రీతుల్లో వారి కురులను మెలితిప్పి కొత్త కొత్త ఫ్యాషన్లను సృష్టించడంలో ఆరితేరిన రష్యన్ హెయిర్ స్టైలిస్ట్ జార్జి కాట్ సరికొత్త స్టైల్ ఇది. ఈ స్టైల్‌ను తీర్చిదిద్దిన తీరు గురించి తెలియజేసే ఆన్లైన్ వీడియో ఇప్పుడు ‘ఇన్స్టాగ్రామ్’లో హల్చల్ చేస్తోంది. ఇప్పటికే దీన్ని 70 వేల మంది వీక్షించగా, దాదాపు పదివేల మంది కామెంట్లు చేశారు. జార్జికాట్కు ఇన్‌స్టాగ్రామ్‌లో 6,23,000 మంది అభిమానులు ఉన్నారు. ఎప్పుడూ భిన్న రీతుల్లో హెయిర్ స్టైల్‌ను రూపొందించేందుకే తాన ప్రాధాన్యతనిస్తానని, ఒక్కోసారి తన స్టైల్‌ను చూసే తాను అబ్బుర పడతానని, కొన్ని సార్లు తాను చేసినదే తనకు నమ్మబుద్ధి కాదని ఆయన వ్యాఖ్యానించారు. అచ్చంగా శిలా విగ్రహాలకు కురులు దిద్దినట్టుగా ఆయన తీర్చిదిద్దే హెయిర్ స్టైల్ ఉంటుందని అభిమానులు ఆయన్ని ప్రశంసిస్తుంటారు. ఇప్పుడు ఈ సరికొత్త స్టైల్‌కు సంబంధించిన 30 సెకండ్ల వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో చూసిన అభిమానులు ప్రశంసలతో ఆయన్ని ముంచెత్తుతున్నారు. ఇదేమి స్టైల్ బాబు! అని కొందరు సంభ్రమాశ్చర్యాలు వ్యక్తం చేస్తుంటే మరికొందరు అద్భుతం, అత్యద్భుతమని, ఇంకొందరు ‘హెయిర్ టోపీకి కొత్త నిర్వచనం’ అంటూ వ్యాఖ్యానించారు. ఇలా హెయిర్ స్టైల్‌ను టోపీలాగా తీర్చి దిద్దడానికి టోపీ డోమ్‌లాంటి రింగ్‌ను, కొన్ని వలయాకారపు రింగులతోపాటు హేర్ పిన్స్‌ను జార్జ్ కాట్ ఉపయోగించారు. -
క్రాఫ్ బాలేదని విద్యార్థిని చితకబాదారు..
సాక్షి, సిటీబ్యూరో: హెయిర్ కటింగ్ (క్రాఫ్) సరిగా లేదన్న కారణంతో విద్యార్థిని ఓ ప్రైవేట్ స్కూల్ ఇన్ చార్జి చితకబాదారు. వెంగళ్రావునగర్లో నివాసం ఉంటున్న షేక్ హతీక్ ఎస్ఆర్ నగర్‌లోని భాష్యం స్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. బధవారం హతీక్ స్కూల్‌కు వెళ్లగా.. మిలటరీ కటింగ్ ఎందుకు చేసుకున్నావని ఇన్చార్జి శిరీష ప్రశ్నించింది. అంతేకాకుండా రెండు చేతులపై కర్రతో బలంగా బాదడంతో.. విద్యార్థి గాయపడ్డాడు. బాలుడి తల్లి ఫర్వీన్ సుల్తానా, తమకు సన్నిహితుడైన ఈశ్వర్‌ను అక్కడికి పిలిపించి.. వారితోనూ దురుసుగా మాట్లాడారని బాధిత విద్యార్థి తెలిపాడు. క్రాఫ్ సరిగా చేసుకొని వస్తేనే స్కూల్లో అడుగుపెట్టాలని ఇన్చార్జి హుకుం జారీ చేశారు. దీంతో చేసేదేమీలేక విద్యార్థి మళ్లీ క్రాఫ్ చేయించుకుని వెళ్లాడు. చిన్న కారణానికే విద్యార్థిని కొట్టడంపై పలువురు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. -
సాధనా కట్ స్టార్ ఫ్యాషన్
నాస్టాల్జియా పందొమ్మిది వందల అరవైలలో దేశానికి ఒకే ఒక హెయిర్ స్టయిల్ తెలుసు. ‘సాధనా కట్’. ఆ సంవత్సరమే ‘లవ్ ఇన్ సిమ్లా’ వచ్చింది. జాయ్ ముఖర్జీ ఫస్ట్ ఫిల్మ్. హీరోయిన్గా సాధనాకు కూడా. అప్పటికే సాధన సినిమాల్లో ట్రై చేస్తోంది. } 420లో ‘ముడ్ ముడ్ కే నా దేఖ్ ముడ్ ముడ్ కే’ పాటను మీరు యూ ట్యూబ్‌లో చూస్తే అందులో గ్రూప్ డాన్సర్లలో ఒకరుగా కనిపిస్తుంది. అయితే ఫిల్మాలయా స్టూడియో పెట్టి చక్రం తిప్పుతున్న శషధర్ ముఖర్జీ కళ్లల్లో పడటంతో దశ తిరిగింది. కొడుకు జాయ్ ముఖర్జీని హీరోగా చేస్తూ హీరోయిన్ ఎవరా అని వెతుకుతుంటే సాధనా కనిపించింది. ఓకే చేశాడు. కాని డెరైక్టర్ ఆర్.కె.నయ్యర్‌కు ఒక సమస్య వచ్చింది. సాధన నుదురు చాలా విశాలంగా ఉంది. ముఖం పొడవు. దీనిని సరి చేయాలంటే ఏం చేయాలా అని హాలీవుడ్ హీరోయిన్ ఆడ్రే హెప్బర్న్ హెయిర్ స్టయిల్ని ఈమెకు ట్రై చేశాడు. సినిమా రిలీజ్ అయ్యాక అదే సాధనా కట్‌గా దేశమంతా పాప్యులర్ అయ్యింది. సినిమాలంటే ఏమీ తెలియని పల్లెటూరి ఆడపిల్లలు కూడా ఈ కట్‌ను ట్రై చేశారు. సాధన ‘చుడీదార్ కుర్తా’ను కూడా చాలా పాప్యులర్ చేసింది. అప్పటి వరకూ హీరోయిన్లు లూజ్‌గా ఉన్న సల్వాల్ కమీజ్లను ధరించేవారు. అయితే వక్త్ (1965)లో సాధన చుడీదార్ కుర్తాను ధరించాక చాలా మంది హీరోయిన్లు ఆ దారి పట్టారు. సాధన తండ్రి, మరో హీరోయిన్ బబిత తండ్రి సొంత అన్నదమ్ములన్న సంగతి చాలా కొద్ది మందికి తెలుసు. థైరాయిడ్ వల్ల కంటి రెప్పలకు సంబంధించి సమస్య వస్తే సాధన అమెరికాలో వైద్యం చేయించుకుంది. కాని పెద్దగా ఫలితం ఇవ్వలేదు. 1975 తర్వాత సాధన నటించలేదు. బయట కూడా కనిపించడానికి ఇష్టపడలేదు. తొలి సినిమా దర్శకుడు నయ్యర్‌ను వివాహం చేసుకుని 30 ఏళ్లు వైవాహిక జీవితం అనుభవించింది. పిల్లలు లేరు. ప్రస్తుతం ఆశా భోంస్లేకు చెందిన ఒక భవంతిలో ఆమె అద్దెకు ఉంటున్నట్టు భోగట్టా. ‘మేరే మెహబూబ్’, ‘ఓ కౌన్ థీ’, ‘మేరా సాయా’, ‘ఏక్ ఫూల్ దో మాలీ’... ఇవన్నీ సాధనా హిట్స్. ‘లగ్ జా గలే’... ‘మేరా సాయా సాథ్ హోగా’, ‘నైనా బర్సే రిమ్జిమ్ రిమ్జిమ్’, ‘ఝమ్కా గిరారే బరేలీ కె బజార్ మే’... ఇవన్నీ సాధనా హిట్ సాంగ్స్. పసిడి రెక్కలు విసిరి కాలం పారిపోయింది. ఒక బంగారు ఈక ఇదిగో ఇలా మన గుండెల్లో మిగిలి ఉంది. -
జుట్టుకి జాబ్‌కి ముడి..!
కెరీర్‌కు తగ్గట్టు కేశాలంకరణ, స్పా సేవలు కూడా.. - ఇంటికొచ్చి మరీ సేవలందిస్తున్న నొమాడిక్ స్పాలూన్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో ‘భుజాల వరకూ వేలాడే జులపాల జుట్టు మెయిన్‌టెయిన్ చేయడమంటే నాకెంతో ఇష్టం’ అంటూ ఓ కుర్రాడు ఇషాంత్ శర్మలా ఫీలవ్వొచ్చు! ‘పోనీటెయిల్ వేసుకుంటే నేను రాణిలా ఉంటానంటూ’ ఓ చిన్నది చిరునవ్వులు చిందించొచ్చు!! ..అయితే ఇవన్నీ కాలేజీ రోజుల వరకే సుమా. ఇప్పుడు కార్పొరేట్ సంస్థలు ఉద్యోగుల కేశాలంకరణ, ముఖారవిందాన్ని నియంత్రిస్తున్నాయి. చేసే జాబ్‌కి.. డ్యూటీకి తగ్గట్టుగా హెయిర్ స్టయిల్ లేకపోతే ఒప్పుకోవట్లేదు. కాకపోతే ఇక్కడొచ్చిన సమస్యేంటంటే... ఉద్యోగం, ఇతరత్రా బాధ్యతల రీత్యా అందానికి మెరుగులుదిద్దేందుకు తగినంత సమయం లేకపోవటమే. దీన్ని గుర్తించే హైదరాబాద్ అమ్మాయి సీమానంద నొమాడిక్ స్పాలూన్ ప్రారంభించింది. గల్లీకో స్పా ఉన్న నేటి రోజుల్లో నొమాడిక్ ప్రత్యేకత ఏంటంటే ఇంటికొచ్చి మరీ స్పా సేవలందించటమే. అది కూడా ఆర్గానిక్ ఉత్పత్తులతో. క్యాండిల్ థెరపీ వంటి వాటితో!! మరిన్ని విశేషాలు సీమానంద మాటల్లోనే.. మాది హైదరాబాద్‌లో స్థిరపడిన పంజాబీ కుటుంబం. అప్పట్లో మా అమ్మ నగరంలో సెలూన్ నిర్వహించేది. ఓవైపు కాలేజీలో చదువుకుంటూనే మరోవైపు సెలూన్ నిర్వహణలో సహాయపడేదాన్ని. చదువు పూర్తయ్యాక ఢిల్లీలో ఓ వ్యాపారితో వివాహమైంది. కొన్నేళ్లకు అమ్మ కూడా చనిపోయింది. దీంతో హైదరాబాద్‌లోని సెలూన్ మూసేశాం. తర్వాత కొన్నాళ్లకు ముంబైలో స్పా మేనేజ్మెంట్లో శిక్షణ తీసుకొని రూ.8 లక్షల పెట్టుబడితో 2014 ఏప్రిల్‌లో ఢిల్లీలో నొమాడిక్ స్పాలూన్ పేరుతో సేవలను ప్రారంభించా. అయితే ఒకప్పుడు పెళ్లిళ్లు, పార్టీల వంటి ప్రత్యేక సందర్భాల్లోనే అందంగా తయారయ్యేవారు. కానీ, ఇప్పుడు ఇంట్లో ఉన్నా.. బయటికెళ్లినా.. ఉద్యోగం చేస్తున్నా ప్రతి ఒక్కరూ అందంగా కనిపించాలని తాపత్రయపడుతున్నారు. చదువనో, ఉద్యోగమనో చాలా మందికి సెలూన్‌కు, స్పాలకు వెళ్లేందుకు సమయం దొరకట్లేదు. కార్పొరేట్ సంస్థల్లో పనిచేసే మహిళా ఉద్యోగులకైతే మరీను. మహిళలకే కాదు పురుషులు, పిల్లలకు కూడా ఇంటి వరకూ వెళ్లి స్పా సేవలందిస్తున్నాం. నెలకు వంద మంది కస్టమర్లు: ఇప్పటివరకు నొమాడిక్ స్పాలూన్కు 2 వేల మంది కస్టమర్లున్నారు. వీరిలో ఢిల్లీలోని బడా పారిశ్రామికవేత్తలు, పలువురు రాజకీయ, సినీతారాలున్నారు. నెలకు వందకు పైగా కొత్త కస్టమర్లకు సేవలందిస్తున్నాం. హెయిర్, బాడీ మసాజ్, వ్యాక్సిన్, పెడిక్యూర్, మెనిక్యూర్, మేకప్, హెయిర్ స్టయిల్స్ వంటి అన్ని రకాల స్పా సేవలున్నాయి. ధర ఎంచుకున్న సేవలను బట్టి రూ.40 నుంచి 10 వేల వరకూ ఉంటాయి. వృద్ధులు, గర్భిణులకు కూడా: నొమాడిక్ స్పాలూన్ సేవలను అందంగా కనిపించాలనుకునే వారికే కాదు వృద్ధులకు, మంచానికే పరిమితమైన వారికి, గర్భిణిలకు కూడా అందిస్తున్నాం. తలనొప్పి, వెన్నునొప్పి వంటి చిన్న చిన్న మసాజ్‌లు కూడా చేస్తాం. నిధుల సమీకరణ బాటలో.. మెట్టినిల్లు ఢిల్లీలో ఉండటంతో మొదట ఢిల్లీలో సేవలను ప్రారంభించాం. ఆ తర్వాత నోయిడా, గ్రేటర్ నోయిడా, ఉత్తర, దక్షిణ ఢిల్లీ వంటి చోట్లకూ విస్తరించాం. ఈ ఏడాది చివరికల్లా పుుట్టినిల్లయిన హైదరాబాద్‌లో ఆ తర్వాత చెన్నై, కోయంబత్తూర్, బెంగళూరు, ముంబైలకు విస్తరిస్తాం. రూ.2-5 కోట్ల నిధుల సమీకరణపై దృష్టి పెట్టాం. ఇప్పటికే పలువురు పారిశ్రామికవేత్తలతో సంప్రదింపులు జరుపుతున్నాం. త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడిస్తాం. భద్రత కూడా ముఖ్యమే.. స్పా నిర్వహణలో భద్రతకు సంబంధించిన సమస్యలెక్కువ. దీనికి తోడు నిపుణులైన సిబ్బందిని నియమించుకోవటమూ సవాలే. మా సిబ్బందితో పాటు కారు డ్రైవర్ ఎలాగూ ఉంటాడు. వీరికి రక్షణగా మరొకరిని పంపిస్తాం. మా సిబ్బంది బయల్దేరేముందు ఆ విషయాన్ని కస్టమర్లకు ఫోన్ చేసి చెబుతాం. తిరిగొచ్చాక మళ్లీ ఫోన్ చేస్తాం. ఇక సేవల విషయంలో... ఓసారి వాడి పారేసే వస్తువులనే వినియోగిస్తాం. ఇంట్లో స్పాలూన్ సేవలను ప్రారంభించే ముందు కొవ్వొత్తులు వెలిగించి, ఆహ్లాదకరమైన సంగీతంలో, వెల్కం డ్రింక్స్ ఇచ్చి ప్రారంభిస్తాం. ఈ విశేషాలే మాకెంతో గుర్తింపును తెచ్చి పెట్టాయి. అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి... -
వాలెంటైన్ స్టైల్స్
వాలెంటైన్స్ డే... ఎర్ర గులాబీలు, క్యాండిల్ లైట్ డిన్నర్స్, డేటింగ్స్, ఔటింగ్స్! ఈరోజు మీ పార్ట్నర్తో కలిసి సినిమా ప్లాన్ చేసుకున్నారా... రొమాంటిక్ డిన్నర్ చేస్తున్నారా.. రోజంతా ఔటింగ్‌కు వెళ్తున్నారా! ఏదైనా కావచ్చు. ప్లేస్‌ను బట్టి డ్రెస్ ఎంత ముఖ్య మో హెయిర్ స్టైల్ కూడా అంతే కీలకం. పర్ఫెక్ట్ అవుట్ఫిట్టే కాదు.. స్పెషల్ హెయిర్ స్టైల్ కూడా ఉండాలి. ఇంత ప్రత్యేకమైన ఈరోజు మిమ్మల్ని మరింత ప్రత్యేకంగా చూపించే హెయిర్ స్టైల్ కోసం సెలూన్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు.. జస్ట్ వీటిని ఫాలో అయిపోండి! ఫ్లర్టేషియస్ బ్రెయిడ్స్ మీ వాలెంటైన్‌తో కలిసి మూవీకి ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే ఈ హెయిర్ స్టైల్ మీకోసమే. ఎక్కువ సమయం తీసుకోకుండానే మీరు స్టైలిష్‌గా కనపడేలా చేస్తుందీ ఫ్లర్టేషియస్ బ్రెయిడ్స్. వాష్ చేసిన జుట్టును ఆరబెట్టాక రెండు పాయలుగా విడదీయండి. మీ కుడి వైపు భాగం జుట్టును మళ్లీ మూడు పాయలుగా విడదీయండి. ఆ మూడు పాయలను చివరివరకు జడలా అల్లేయండి. ఇప్పుడు జుట్టునంతా ఎడమవైపు భుజం మీదకు తీసుకొచ్చి వదిలేయండి. షై అండ్ డెలికేట్ మొదటిసారి మీ వాలెం టైన్‌తో కలిసి కాఫీ డేట్‌కు వెళ్లాలనుకుంటున్నారా? సిగ్గులొలికే షై అండ్ డెలికేట్ పోనీటెయిల్ ట్రై చేయండి! తలస్నానం చేశాక జుట్టును పాడిల్ బ్రష్‌తో స్ట్రైట్‌గా చేయండి. పాపడ తీసి చెవులను కవర్ చేస్తూ పోనీ వేయడానికి వెనక్కి తీసుకెళ్లండి. అయితే జుట్టును బిగుతుగా కాకుండా లూజ్‌గా బ్యాండ్‌తో పోనీ వేయండి. ఆ ఎలాస్టిక్ బ్యాండ్‌ను మీ డ్రెస్‌కు మ్యాచ్ అయ్యే రిబ్బన్‌తో చుట్టేయండి. లవ్ వేవ్స్ ఈ సాయంత్రం రొమాంటిక్ డిన్నర్‌ను ప్లాన్ చేసుకున్నారా? అయితే మీ గ్లామరస్ హెయిర్ చూసి మీ పార్ట్నర్ వావ్ అనాలంటే.. రొమాంటిక్ వేవ్స్‌కి స్టికాన్ అయిపోండి. చెవుల పక్క రెండు, వెనుక రెండు.. జుట్టును నాలుగు పాయలుగా విడదీయం డి. ప్రతి పాయలో చెవి కింది భాగానికి స్ప్రే చేస్తూ కర్లర్ సాయంతో చుట్టేయండి. 5-8 నిమిషాల పాటు వదిలేయండి. తరువాత వంపులు తిరిగిన జుట్టును నెమ్మదిగా దువ్వండి. ఇప్పుడు మొత్తం జుట్టును ఒక పక్కకు తీసుకురండి. అంతే రొమాంటిక్ వేవ్స్ రెడీ! -
ధోనీ న్యూ లుక్... ద జార్‌హెడ్
-
ధోనీ న్యూ లుక్... ద జార్‌హెడ్
ప్రయోగాలు చేయటంలో క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని ముందుంటాడు. క్రికెట్ లోనే కాదండోయ్...తన జట్టు మీద కూడా. సీజన్‌కు తగ్గట్టు మనోడు... హెయిర్ స్టైల్‌ను ఈజీగా మార్చేస్తుంటాడు. ఒకప్పుడు పొడవాటి జట్టుతో అప్పటి పాక్ అధ్యక్షుడు ముషరాఫ్ను ఆకర్షించిన ధోని తాజాగా మరో అవతారం ఎత్తాడు. గాయం కారణంగా శ్రీలంకతో వన్డే సిరీస్‌కు దూరంగా ఉన్న మహేంద్రుడు.. ఆస్ట్రేలియా పర్యటనకు ముందు హెయిర్ స్టైల్‌ను డిఫరెంట్‌గా మార్చాడు. ఎప్పటికప్పుడు సరికొత్త ట్రెండీ లుక్‌తో కనిపించే ధోని ఈసారి సరికొత్త హెయిర్ స్టైల్లో దర్శనమిచ్చాడు. తాజా హెయిర్ స్టయి ల్లో చెవులపై భాగంతో పాటు తల వెనుక భాగంలోనూ వెంట్రుకలను బాగా ట్రిమ్ చేశాడు. దీన్ని 'ద జార్‌హెడ్' లేదా 'ద హై అండ్ టైట్' అంటారు. దుస్తుల్లాగే ... జుట్టుతోనూ ధోని రకరకాల ప్రయోగాలు చేస్తుంటాడు. గతంలో ధోనీ హెయిర్ స్టయిల్ అభిమానులకు విశేషంగా నచ్చి, దాన్ని అనుకరించారు కూడా. మరి తమ ఫేవరెట్ క్రికెటర్.. తాజా హెయిర్ స్టయిల్ అభిమానులను ఏవిధంగా ఆకర్షిస్తుందో చూడాలి మరి. (గతంలో ధోనీ హెయిర్ స్ట్రయిల్) -
క్యా బాత్ హై
చక్కటి చిరునవ్వు... అందమైన రూపంతో కనిపిస్తున్న ఈ విదేశీ భామను కాస్త దగ్గరగా గమనించండి. ఓ పక్క ఒత్తుగా జుత్తు... మరో వైపు గుండు... ఆమె హెయిర్ స్టైల్ చిత్రంగా ఉంది కదూ! బంజారాహిల్స్‌లో జరిగిన ఓ ఈవెంట్ కోసం వచ్చిన ఈ న్యూయార్క్ వనిత పేరు నికోలాస్. ఏమిటీ హెయిర్‌స్టైల్ అని అడిగితే... ‘భారత్ అమ్మాయిలు చాలా అందంగా ఉంటారు. వారి జుత్తూ అంతే. అందులో నేను పోటీపడలేను. అందుకే వారందరిలో కాస్త ప్రత్యేకంగా కనిపించడానికి ఈ హెయిర్ స్టయిల్’ అంటూ గలగలా నవ్వుతూ చెప్పేసిందీ సుందరి. -
త్రీ మంకీస్ - 26
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 26 - మల్లాది వెంకటకృష్ణమూర్తి మగాళ్ళల్లా బాయ్ కట్ క్రాఫ్ హెయిర్ స్టైల్. జీన్స్ పేంట్. టి షర్ట్. పాలరాయిలా తెల్లటి చర్మం. చూపరులని ఇట్టే ఆకట్టుకునే అందం ఆమెది. బట్టల సబ్బు కోసం ఆ విభాగంలోకి వచ్చిన కపీష్ ఆమెని, ఆమె రెండు చేతులతో లాఘవంగా తోసే రెండు ట్రాలీలని చూశాడు. వాటి నిండుగా బ్రష్‌లు, చీపుళ్ళు, క్లీనింగ్ లోషన్లు, హేండ్ శానిటైజర్స్, డెటాల్ బాటిల్స్... ‘‘మే ఐ హెల్ప్ యు?’’ అడిగాడు. ‘‘ఓ! థాంక్స్’’ ఆమె కృతజ్ఞతగా చెప్పింది. ఓ ట్రాలీని తోస్తూ ఆమె పక్కనే నడుస్తూ అడిగాడు. ‘‘మీరు హాస్టల్లో ఉంటారా?’’ ‘‘ఊహూ. దేనికలా అనుకున్నారు?’’ ‘‘ఈ సామాను చూసి’’ ‘‘సిల్లీ. ఇవన్నీ మా ఇంటికే.’’ ఆమెది చాలా పెద్ద ఇల్ల్లై ఉంటుందని, అంటే ధనవంతురాలు అయి ఉంటుందని కూడా కపీష్ భావించాడు. ‘‘మీరు నార్త్ ఇండియనా?’’ అడిగాడు. ‘‘కాదు. తెలంగాణియన్ని. ఏం?’’ ‘‘మీ చర్మం రంగు ఏపిలో కాని, తెలంగాణాలో కాని అరుదు. తమన్నాలా నార్త్ వాళ్ళు బాగా తెల్లగా ఉంటారు.’’ ‘‘మా నాన్న యుపి. మా అమ్మ ఏపి. నేను తెలంగాణియన్ని.’’ ఆ వస్తువులకి ఆమె చెకౌట్ కౌంటర్లో బిల్‌ని చెల్లించాక పార్కింగ్ లాట్ దాకా వెళ్ళి టాటా సఫారీలో వాటిని ఎక్కించాడు. ‘‘మీ ఫోన్ నంబర్?’’ నసిగాడు. ‘‘మీది చెప్పండి.’’ ఆమె తన సెల్ తీసి అతను చెప్పే నంబర్ని నొక్కి కాల్ చేసింది. అతని సెల్‌ఫోన్ మోగాక చెప్పింది. ‘‘ఫీడ్ చేసుకోండి. నా పేరు స్వచ్ఛ.’’ ‘‘స్వేచ్ఛా?’’ ‘‘కాదు. స్వచ్ఛ.’’ ‘‘మీ నాన్న గారి పేరు భారత్ కదా?’’ ‘‘కాదు. భరత్.’’ ‘‘నా పేరు కపీష్. సూపర్ బజార్ అని ఏడ్ చేసుకుంటే నేను గుర్తుండచ్చు’’ సూచించాడు. ‘‘ఆ అవసరం లేదు. ఏ హంసవర్ధనో, మృగాంకో అయితే గుర్తుండకపోవచ్చు. కపీష్ లాంటి పేరు ఎవరికీ ఉండదని పందెం. బై’’ ఆమె వాహనం వెళ్ళిన రెండు నిమిషాలకి స్వచ్ఛకి కాల్ చేశాడు. ‘‘యస్ మిస్టర్ కపీష్. ఏదైనా కింద పడిందా? అప్పటికీ కింద చూసే ఎక్కానే?’’ స్వచ్ఛ మాటలు వినిపించాయి. ‘‘నాకు ఎందుకో దిగులుగా ఉంది’’ అతను చెప్పాడు. ‘‘దేనికి దిగులు?’’ ‘‘దేనికి కాదు. ఎవరి మీద అని అడగండి... మీ మీద... మళ్ళీ ఎప్పుడు చూస్తానో అని! సాయంత్రం మీరు ఫ్రీనేనా?’’ ‘‘ఏ టైంకి?’’ ‘‘ేన బిట్విన్ సిక్స్ అండ్ సెవెన్.’’ ‘‘ఐ యామ్ నాట్ ష్యూర్... యస్ ఫ్రీ’’ మొహమాటపడి చెప్పింది. ‘‘గుడ్. జివికె మాల్లోని ఫుడ్ కోర్టులో కలుద్దామా?’’ ‘‘వైనాట్?’’ ‘‘థాంక్స్. డన్.’’ ‘‘మీకు ఏం ఇష్టం?’’ అడిగాడు. ‘‘మీకు?’’ స్వచ్ఛ అడిగింది. ‘‘మోమోస్ ఓకే?’’ ‘‘ఫైన్. నాన్ ఫేనింగ్, టేస్టీ’’ కపీష్ లేచి వెళ్ళి ఓరియెంటల్ వెజ్ మోమోలు రెండు ప్లేట్లని కొన్నాడు. ఇటీవల మోమోలు ఫుడ్ కోర్టుల్లో ప్రాచుర్యం పొంది యువతని ఆకర్షిస్తున్నాయి. మైదా పిండిని చపాతీలా వత్తి అందులో కేరట్, కేబేజ్, కేప్సికం, ఉల్లిపాయ, బ్రకోలి తరుగుని, అల్లం వెల్లుల్లి, సోయాసాస్, వెనిగర్, ఉప్పు, మిరియాల పొడి మిశ్రమాన్ని ఉంచి అర్ధచంద్రాకారంలో మడిచి పది నిమిషాలు ఆవిరి మీద ఉడికించి, సోయా, చిలీ సాస్‌లతో సర్వ్ చేసే ఈ సింగపూర్, సౌత్ కొరియా స్నాక్ ఇప్పుడు ఇండియాలో ఇంకా స్ట్ట్రీట్ ఫుడ్‌గా (రోడ్ల మీద బళ్ళ మీదకి) రాలేదు. వెజిటబుల్స్ బదులు చికెన్, ప్రాన్స్, ఫిష్ మొదలైనవి కూడా పెట్టి మోమోలు తయారు చేస్తారు. వాటిని చూసి ఆమె హేండ్ బేగ్లోంచి హేండ్ శానిటైజర్ తీసి అతని చేతులని చాపమని అతని అరచేతుల మీద, తన అరచేతుల మీద పోసి చెప్పింది. ‘‘క్లీన్లీనెస్ ఈజ్ నెక్ట్ ్సటు గాడ్లీనెస్’’ ‘‘అఫ్కోర్స్. అఫ్కోర్స్.’’ ఆమెతో అరగంట పైనే కబుర్లు చెప్పాడు. ఆమె తండ్రి ఎయిర్‌ఫోర్స్‌లో పెలైట్. తల్లి ఫిజియోథెరపిస్ట్. ‘‘నేను సెంట్రల్ యూనివర్సిటీలో ఇంగ్లీష్ భాషలోని పదాల మీద డాక్టరేట్ చేస్తున్నాను.’’ ‘‘ఓ! పదాల పుట్టుక మీద రీసెర్చా?’’ ‘‘కాదు. నేను ప్రత్యామ్నాయ పదాల మీద రీసెర్చ్ చేస్తున్నాను. ఆ క్రమంలో ప్రస్తుతం ఇప్పుడు ఉన్న పదాల కన్నా ఇంకాస్త స్పష్టమైన పదాలని సృష్టించే ప్రాజెక్ట్ మీద పని చేస్తున్నాను.’’ ‘‘అంటే?’’ ‘‘అమెరికా ఇందులో అందె వేసిన చెయ్యి. ఇలా అక్కడ సృష్టించబడ్డ కొత్త పదాలు ఇంగ్లీష్ స్పీకింగ్ దేశాల్లో కూడా ప్రాచుర్యం పొందుతున్నాయి. ‘సెకండ్ హేండ్ కారు’ అనగానే అదేదో నాసిరకంది అన్న భావన కలుగుతుంది. కాబట్టి ఆ పరిశ్రమ వారు ‘యూజ్డ్ కార్స్’ అనే కొత్త పేరుని సృష్టించారు. ఇప్పుడు అదీ నాసిరకం అనిపించి ‘ప్రీ-ఓన్డ్ కార్స్’ అనే పదాన్ని సృష్టించారు. ఇలాగే నీగ్రోలని బ్లాక్స్ అనే వాళ్ళు. చర్మం రంగు వివక్షత సరి కాదని ఇప్పుడు ‘ఆఫ్రో-అమెరికన్స్’ అనే పదాన్ని సృష్టించారు. ఈ తరహాలో నేను సృష్టించిన కొన్ని పదాలని మా ప్రొఫెసర్ పేనల్ అప్రూవ్ చేసింది. పేరుని బట్టి ఆ వస్తువేదో స్ఫురించాలి.’’ ‘‘గ్రేట్! కంగ్రాట్స్. మీరు సృష్టించిన పదాలు ఏమిటి?’’ కపీష్ ఆసక్తిగా అడిగాడు. (ఫింగర్ పాంట్స్ అంటే?) -
పెప్పర్ సాల్ట్‌గా అజిత్
నటుడు అజిత్ రూటే సెపరేటు. సహజత్వానికి ప్రాముఖ్యతనిచ్చే నటు ల్లో ఈయన ఒకరు. ఆరంభం, వీరం చిత్రాల్లో వయసుకు తగ్గ పాత్రలు ధరించి తన అభిమానులకు కొత్త అనుభవాన్నిచ్చిన అజిత్ తాజా చిత్రంలో పెప్పర్ సాల్ట్ పాత్రలో కనిపించనున్నారు. ఇందులో ఆయనతో అందాల భామలు అనుష్క, త్రిష రొమాన్స్ చేస్తున్నారు. అనుష్కతో కొన్ని సన్నివేశాల్లో మెరిసిన జుత్తుతోను, మరికొన్ని సన్నివేశాల్లో డ్రై వేసుకున్న జుత్తుతో నూ నవ మన్మథుడిలా కనిపించనున్నారని తెలిసింది. అదేవిధంగా ఫ్లాష్‌బ్యాక్‌లో త్రిషతో మరిం త స్టయిలిష్‌గా కనిపించనున్నారట. మొత్తం మీద ఈ ఇద్దరు ముద్దుగుమ్మలకు వెరైటీ చూపించనున్నారన్నమాట. గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో శ్రీ సత్యసాయి మూవీస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మొదట నవంబర్‌లో విడుదల చేయాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నారట. అయితే చిత్రానికి హరీష్ జయరాజ్ అతి నవీన సాంకేతిక టెక్నాలజీతో సంగీతాన్ని అందిస్తున్నారట. దీంతో ఆయనకు అధిక సమయం కావలసి రావడంతో చిత్రాన్ని జనవరికి విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. మరో విషయం ఏమిటంటే ఇంతకుముందు అజిత్ చిత్రం సంక్రాంతికి విడుదలై విజయఢంకా మోగించింది. ఆ సెంటిమెంట్‌తో ఈ తాజా చిత్రాన్ని సంక్రాంతికి తెరపైకి తీసుకురావాలని భావిస్తున్నట్టు సమాచారం. -
నీ స్టయిలే... చరాస్!
‘మన గౌరవ అధ్యక్షుడు కిమ్ జొంగ్- ఉన్ మాదిరిగానే మగాళ్లందరూ తలకట్టు మార్చుకోవాలి’ అంటూ ఉత్తర కొరియా ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసిందట. ఇదెంత వరకు నిజమో తెలియదుగానీ రాజుగారి హెయిర్ స్టయిల్ గురించి వేడి వేడి పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి.హెయిర్‌స్టయిల్ కోడ్ ఉల్లంఘించిన వారిని ప్రభుత్వం ఒక చూపు చూస్తుందని, పాటించిన వారిని కరుణించి తగిన ప్రోత్సాహకాలు అందిస్తుందని...ఇలా ఏవేవో వినిపిస్తున్నాయి. కింగ్ జొంగ్ తిక్క చేష్టల గురించి బాగా తెలిసిన కొరియా ప్రజలు ప్రతి వదంతిని నిజమే అనుకుంటున్నారు.సెలూన్ ముందు క్యూ కట్టి అధ్యక్షుల వారి స్టయిల్లోనే ‘షార్ట్ బ్యాక్ అండ్ సైడ్ ప్లీజ్’ అంటున్నారు. ‘షార్ట్ బ్యాక్ అండ్ సైడ్స్’ అనే ఈ స్టయిల్ 1990 ప్రాంతంలో బ్రిటన్‌లో చాలా ప్రాచుర్యం పొందింది. బ్రిటిష్ రియాలిటీ టీవి షో మేల్స్టార్లు ఎక్కువగా ఈ తలకట్టుతో కనిపించేవారు. ‘‘ ఇదెక్కడి తల నొప్పిరా బాబు’’ అని కొందరు పురుషులు విసుక్కుంటుంటే.. ‘‘పోయేదేమి ఉంది...కాస్త జుత్తు తప్ప’’ అని కొందరు పురుషులు బార్బర్ ముందు తలవంచుతున్నారు. ‘‘అది అధ్యక్షుడి హెయిర్ కట్లా ఉండదు. చైనీస్ స్మగ్మర్ల హెయిర్ కట్లా ఉంటుంది’’ అంటున్నారు కిమ్ జోంగ్ అంటే మండి పడేవాళ్లు! -
మీ ఫ్రేమ్లోపడనివ్వండి
వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు రోజూ మీ కాలనీలో... మిమ్మల్ని ఇద్దరు ముగ్గురైనా చూస్తూనే ఉంటారు. చూడడం అంటే ఎలా? దారిన పోయే దానయ్యలా! వచ్చేటప్పుడు, వెళ్లేటప్పుడు రోజూ మీ ఆఫీస్‌లో... మిమ్మల్ని మీ సహోద్యోగులు చూస్తూనే ఉంటారు. చూడడం అంటే ఎలా? దారిన పోయే దానయ్యలా! మీరు వస్తుంటారు, పోతుంటారు. వాళ్లు చూస్తుంటారు. చూస్తుంటారు తప్ప... ఒక్కసారీ తల తిప్పి చూడరు. ఎందుకంటే -మీరు ఎవరికీ కొత్త కాదు. సరికొత్త అసలే కాదు. అదే ఓల్డ్ ఫేస్, మీ కళ్లజోడుకు... అదే ఓల్డ్ ఫ్రేమ్!! ఫేస్‌ని ఎలాగూ మార్చలేం. కనీసం ఫ్రేమ్నైనా మార్చండి. అప్పుడు మీరిక దారిన పోయే దానయ్య కాదు. దారిన పోనివ్వని దానయ్య అవుతారు. అవును. సూటబుల్ ఫ్రేమ్‌తో మీరిచ్చే కొత్త లుక్... మీ దారిలో ఎవర్నీ తిన్నగా నడవనివ్వదు. ప్రతి చూపూ... మీ ఫ్రేమ్‌లో ప-డి-పో-వ-ల-సిం-దే! పర్ఫెక్ట్ లుక్ కోసం... ఫ్రేమ్ ముఖానికి పర్ఫెక్ట్గా ఫిట్ అవ్వాలి. చెవులకు రెండువైపులా, కనుబొమల మధ్య, ముక్కుపై భాగంలో సౌకర్యవంతంగా, సరిగ్గా సరిపోయేలా ఉండాలి. గుండ్రంటి ముఖాకృతి గలవారికి చదరపు ఆకృతి గల ఫ్రేమ్స్, చదరపు ఆకృతిగల ముఖానికి గుండ్రటి ఫ్రేమ్స్ నప్పుతాయి. కోల ముఖానికి ఏ తరహా ఫ్రేమ్ అయినా బాగా నప్పుతుంది. వీళ్ళు పెద్ద పెద్ద ఫ్రేమ్స్ ఎంచుకోవచ్చు. స్క్యేర్ షేప్ ఫేస్ ఉన్నవారికి వంపులు తిరిగిన ఫ్రేమ్ స్టైల్స్ సూటవుతాయి. త్రిభుజాకార ముఖాకృతి గలవారికి నుదుటిభాగాన్ని కొద్దిగా కవర్ చేసినట్టుండే మందపాటి ఫ్రేమ్స్ నప్పుతాయి. ఫ్రేమ్స్ విశాలంగా, పెద్దగా ఉన్నవి ఎంచుకునేటప్పుడు వాటి వల్ల ముఖం వయసు పైబడినట్టు పెద్దగా లేదా చిన్నగా కనపడుతుందా అనేది చూసుకోవాలి. ప్రతిరోజూ కొత్త లుక్‌తో కనిపించాలంటే ఒకేతరహా కళ్లజోడు కాకుండా ఫంకీ లేదా స్టైలిష్ గ్లాసెస్ మరొక జత ఉంటే ముఖ్యమైన వేడుకలలో వాడేందుకు వీలుగా ఉంటుంది. రాత్రివేళ బయటకు వెళ్లేవారు అందుకు తగిన డ్రెస్సింగ్‌తో పాటు కళ్లజోడూ ఉండేలా చూసుకోవాలి. ఆన్లైన్లో తమ ముఖాకృతినకి తగ్గ కళ్లజోడు ఎంపికలో గెడైన్స్ తీసుకోవచ్చు. దీని వల్ల షాప్‌కి వెళ్లి పదే పదే ఎలాంటి ఫ్రేమ్ అయితే బాగుంటుంది అని చూసుకోనక్కర్లేదు. సమయం కూడా ఆదా అవుతుంది. కళ్లజోడు ధరించినప్పుడు మెరిసే ఆభరణాలను ధరిస్తే వయసు పైబడినవారిలా కనిపిస్తారు. స్టైలిష్‌గా ఉండాలంటే ఆభరణాలను వాడకపోవడమే సముచితం. కంటి మేకప్‌లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. గ్లాసెస్ వల్ల అప్పటికే ఆ కాంతి కంటిమీద ఉంటుంది. గోల్డ్ ఐ షాడో లేదా ఐ లాషెస్ వాడి, మస్కారా ఉపయోగిస్తే బ్రైట్‌గా కనిపిస్తారు. కలర్స్ కీలకం శిరోజాల రంగు, కనుబొమల తీరు, చర్మం రంగును దృష్టిలో పెట్టుకొని కళ్లజోడును ఎంచుకోవాలి. సున్నితమైన చర్మం, మృదువైన శిరోజాలు గలవారు లేత రంగుల ఫ్రేమ్స్, ఆలివ్ లేదా చామనచాయ, నలుపు రంగు చర్మతత్వం గలవారు కాంతిమంతమైన, ముదురు రంగుల ఫ్రేమ్స్ ఎంచుకోవాలి. ఈ సీజన్‌కి కోరల్, లైట్ ఎల్లో, వంగపండు రంగు, ఎలక్ట్రిక్ బ్లూ, ఆరెంజ్ కలర్స్ నప్పుతాయి. అయితే రంగుకన్నా అత్యంత స్పష్టంగా చూపు కనపడటంపైనే దృష్టిపెట్టాలి. ధర విషయంలో బేరమాడటం, స్టైల్‌గా ఉందా లేదా అని చూసుకోవడం తర్వాత విషయాలు. మన జీవనవిధానానికి, పనులకు ఎటువంటి ఆటంకపరచని కళ్లజోడు అన్నివిధాల మేలైనది. హెయిర్‌స్టైల్ కళ్లజోడు ధరించినప్పుడు మహిళలు హెయిర్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం అవసరం. సైడ్ పొనీ, టాప్ పొనీ, బ్యాండ్ లేకుండా జుట్టును భుజాల మీదుగా వదిలేయడం వంటివి స్టైల్‌గా కనిపిస్తాయి. గీకీ లుక్... బుద్ధిమంతుల్లా, మేధావుల్లా కనిపించడానికి నేటితరాన్ని ఆకట్టుకుంటున్నది గీకీ లుక్. స్టైల్ కోసం గాగుల్స్, స్పోర్టింగ్ గ్లాసెస్ వాడే మహేష్‌బాబు, అల్లుఅర్జున్, ప్రభాస్ వంటి హీరోలూ వెండితెరమీద గీకీ లుక్‌తో క్లాస్‌నూ, మాస్‌నూ ఆకట్టుకుంటున్నారు. స్క్యేర్ షేప్, మందపాటి ఫ్రేమ్‌తో ఆకట్టుకోవడం ఈ లుక్ స్పెషాలిటీ! యాక్ససరీస్ కళ్లజోడు ఎంపికలో నిపుణుడి సలహాతో పాటు కుటుంబసభ్యులు, స్నేహితుల సూచనలూ తీసుకోవడం శ్రేయస్కరం. ప్రముఖ డిజైనర్ల చేతుల్లో రూపుదిద్దుకున్న సరికొత్త దుస్తులను ధరించినా వాటికి తగిన యాక్ససరీస్ లేకపోతే గుర్తింపు లభించదు. ఖరీదైన ఆభరణాలు, హ్యాండ్ బ్యాగ్, చెప్పుల వాడకమే కాదు స్టైల్లో కళ్లజోడూ ప్రధానపాత్ర పోషిస్తుంది. మోడ్రన్ డ్రెస్సులు వేసుకునేటప్పుడు మందపాటి ప్రేమ్ ఉన్నవి, సంప్రదాయ దుస్తులు ధరించినప్పుడు సన్నని ఫ్రేమ్ ఉన్న కళ్లజోడును ధరించాలి. సర్వే ఇటీవల అమెరికాలోని విజన్ కౌన్సిల్ జరిపిన ఓ సర్వేలో 87 శాతం మంది ఏదో ఒక కళ్లజోడును ఉపయోగిస్తున్నారు. అయితే అందులో 27 శాతం మంది మాత్రమే గ్లాసెస్‌లోనూ ఫ్యాషన్‌గా ఉండేవి ఎంచుకుంటున్నారట. ఈ సర్వే నిపుణులు ఏమంటున్నారంటే- ‘చాలామందిలో చూపు సరిగ్గా కనిపించడానికే కళ్లజోడు అనే అభిప్రాయం ఉంది. దీంతో పాటు ఫ్రేమ్స్ విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకుంటే రూపంలో ఒక కొత్త స్టైల్ తెప్పించవచ్చు. జీవనశైలి ఉత్సాహంగా మారడానికి కళ్లజోడూ ఉపకరిస్తుంది’ అని అంటున్నారు. -
నవయువం: స్టైల్ స్టైల్‌రా... హెయిర్ స్టైల్‌రా!
ఆట కోసం వారు స్టేడియంలోకి దిగితే అది ర్యాంప్ అవుతోంది. ఫ్యాషన్కొక ట్రెండ్‌ను నేర్పుతుంది. యువతకు ఒక గైడ్ అవుతుంది. వెరైటీ హెయిర్ స్టైల్ అవుతుంది! ఆకట్టుకునే ఆట తీరే కాదు.. ఆకర్షించే స్టైల్ కూడా వారి సొంతం. వ్యక్తిగత ప్రతిభ వారిని స్పోర్ట్స్ స్టార్స్‌గా నిలిపితే... వ్యక్తిగత ఆసక్తులు స్టైల్స్టార్లను చేస్తున్నాయి. స్పెషల్‌గా నిలుపుతున్నాయి. యూత్‌కు స్టైల్ గైడ్స్‌ని ఇస్తున్నాయి. అందరిలోకి భిన్నంగా కనిపించడమే ఫ్యాషన్. అందరినీ ఆకట్టుకునేదే స్టైల్... ఆటతోనే కాక తమ స్టైల్స్‌తో కూడా యువతను ఆకట్టుకునే ఆటగాళ్లు ఎంతోమంది ఉన్నారు. ప్రత్యేకించి నిత్యం హెయిర్ స్టైల్స్‌ను మారుస్తూ ఆకట్టుకునేవాళ్లు కూడా ఉన్నారు. అలా యువతను ప్రభావితం చేస్తున్న క్రీడాకారుల గురించి... ధనాధన్ హెయిర్ స్టైల్... భారత యువతకు బాగా ఇష్టమైన ఆట క్రికెట్. ప్రస్తుతం బాగా ఇష్టమైన ఆటగాడు ధోనీ. బాగా ఆసక్తిని రేపుతున్నది ధోనీ హెయిర్ స్టైల్. హెయిర్‌స్టైల్ విషయంలో అరంగ్రేటం నుంచే అదుర్స్ అనిపిస్తున్నాడు ఈ రాంచీ రాక్‌స్టార్. కెరీర్ తొలినాళ్లలో ధోనీ హెయిర్ స్టైల్‌ను చూసి ముషారఫ్ ముచ్చటపడ్డాడు. దేశీయ యువత ఇష్టపడ్డారు. ఇంకేముంది ధోనీ క్రికెట్ స్టైల్ మాత్రమేకాక హెయిర్ స్టైల్ కూడా ఫేమస్ అయ్యింది. ఆదిలో వచ్చిన ఇమేజ్‌కు అనుగుణంగా ఇప్పటికీ ధోనీ విభిన్నమైన స్టైల్స్‌ను కొనసాగిస్తున్నాడు. అందరినీ ఆకట్టుకుంటున్నాడు. తాజాగా ధోనీ తన ‘మొహాక్ హెయిర్‌స్టైల్’ తో వార్తల్లోకి వచ్చిన విషయం కూడా తెలిసిందే. దీన్ని అనుకరించేవారు కొంచెం తక్కువమందే ఉండవచ్చు కానీ ఆకర్షణీయంగా ఉందంటూ ఆసక్తిగా గమనించేవాళ్లు మాత్రం ఎంతోమంది. ప్రపంచం ఫాలో అవుతుంది... ఫుట్‌బాల్ మ్యాచ్‌ల విషయంలో సీజన్లు ఎలా మారుతుంటాయో, బెక్‌హమ్ హెయిర్‌స్టైల్స్ కూడా అలాగే మారుతుంటాయి. దేశీయ యువతకు హెయిర్‌స్టైల్ విషయంలో కొత్త స్టైల్స్‌ను పరిచయం చేసింది ధోనీ అయితే ధోనీకి ముందు దశాబ్దం నుంచే ఇంగ్లండ్ సాకర్ హీరో బెక్‌హమ్ హెయిర్ స్టైల్స్ విషయంలో స్టైలిష్ అన్న పేరు పొందాడు. బహుశా.. బెక్ మార్చినన్ని హెయిర్ స్టైల్స్ మరే స్పోర్ట్స్ పర్సన్ కూడా మార్చలేదేమో! పాశ్చాత్య ప్రపంచంలో బెక్ హెయిర్ డ్రస్సింగ్‌ను అనుకరించినవారు కూడా ఎంతోమంది. టార్జాన్ స్టైల్ నుంచి గుండు వరకూ... ఇప్పుడైతే అగస్సీ పూర్తి గుండుతో కనిపిస్తున్నాడు కానీ.. ఒకప్పుడు తన హెయిర్ స్టైల్‌తో అబ్బాయిలకు నిద్ర లేకుండా చేశాడు. టార్జాన్ స్టైల్లో తల వెంట్రుకలు పెంచిన అగస్సీ, బ్యాండ్ ధరిస్తే ఎక్కడలేని అల్లరితనం దర్శనమిచ్చేది. విషాదం ఏమిటంటే.. తర్వాతి రోజుల్లో అగస్సీకి హెయిర్ ఫాల్ మొదలైంది. బట్టతల వచ్చింది. టార్జాన్‌లా ఉన్నవాడు కాస్తా అరగుండుతో కనపడలేక ఎప్పుడూ క్లీన్‌షేవ్‌తో కనిపిస్తాడు. ఒకే స్టైల్‌తో మెరిసినవారూ ఉన్నారు.. నిత్యం స్టైల్స్ మారుస్తూ ఆకట్టుకునే వారే గాక ఒకే హెయిర్ స్టైల్‌తో ఆకట్టుకున్నవారూ ఉన్నారు. తన పొడవాటి హెయిర్ స్టైల్‌తో ఫేమస్ అయ్యాడు స్పెయిన్ టెన్నిస్ కెరటం నాదల్, ఇంకా అర్జెంటీనా సాకర్ హీరో మెస్సీ హెయిర్ స్టైల్ కూడా అభిమానులను సంపాదించుకుంది. యువతలో అటెన్షన్ తీసుకువచ్చింది. ఆ మధ్య సచిన్ టెండూల్కర్ కూడా కొంత భిన్నమైన హెయిర్‌స్టైల్ ట్రై చేశాడు. దానికి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇలా వ్యక్తులు మారుతున్నారు, స్టైల్స్ మారుతున్నాయి. ఆకట్టుకునే హెయిర్ స్టైల్ అయితే వారికి యూత్‌లో ఫాలోయింగ్‌ను పెంచుతుంది. -
విడ్డూరం: ఊరినిండా కొప్పుల కుప్పలే!
భుజాలు దాటని జుట్టు ఫ్యాషనై చాలా కాలమయ్యింది. గాలికి వయ్యారంగా ఎగిరే ముంగురులను ఎగదోసుకుంటూ తిరగడం ఇప్పుడు ఫ్యాషన్. మంచి జుత్తు ఉన్నా, దాన్ని పెంచి పోషించే ఆసక్తి ఇప్పటి అమ్మాయిలకు లేదు. కానీ చైనాలోని హాంగ్లువో గ్రామంలోని అమ్మాయిలు అలా కాదు. పొడవాటి కురులే తమకు అందమంటారు. పొందికగా కొప్పులు వేసి తమ గొప్పను చాటుతుంటారు. హాంగ్లువో యువతులు జుత్తు కత్తిరించరు. అది వారి సంప్రదాయం. పెరిగినంత మేర పెరగనిస్తారే తప్ప కత్తెర కురులను తాకనివ్వరు. అందుకే అక్కడ ప్రతి అమ్మాయీ పొడవాటి కురులతో కనిపిస్తుంది. రెండు మీటర్ల పొడవైన జుత్తు ఉన్న అమ్మాయిలు వందకు పైనే ఉన్నారా ఊరిలో. వీరికి తలస్నానాలు చేయడం ఓ పెద్ద సమస్య. అందుకే వారానికి ఒకట్రెండుసార్లు ఊరి పొలిమేరలో ఉన్న చెరువు దగ్గరకు పోయి, మూకుమ్మడిగా తలలు అంటుకుంటారు. ఒకప్పుడు హాంగ్లువో మగువల కురులను భర్త తప్ప ఎవరూ చూడకూడదనే నియమం ఉండేది. అయితే అతడు కూడా కేవలం పెళ్లిరోజునే చూడాలి. అందుకే స్త్రీలంతా తలలకు నీలిరంగు గుడ్డను చుట్టుకునేవారు. పరాయి పురుషుడు కనుక ఏ స్త్రీ జుత్తయినా చూస్తే, అతడు మూడేళ్లపాటు వారి ఇంట్లో బందీగా ఉండాల్సి వచ్చేది. అయితే రోజులు మారాక ఈ నియమం పోయింది. గుడ్డను తీసేసి కురులను కొప్పుగా ముడుచుకునే సంప్రదాయం వచ్చింది. జుత్తును పొడవుగా వేళ్లాడేసుకోకుండా చుట్టలా చుట్టి అందరూ ఒకే విధంగా కొప్పు పెట్టుకుంటారు. దుస్తులు కూడా ఒకలాంటివే వేసుకుంటారేమో... కొత్తవాళ్లు వెళితే అందరూ ఒకేలా కనిపించి కన్ఫ్యూజ్ అవుతుంటారు! ఆదమరిస్తే... అంతే సంగతులు! విమానం ఆకాశంలో ఎగిరితే చూడ్డానికి సరదాగా చూస్తాం. అదే మన నెత్తిమీద ఎగిరితే...! విమానం మన నెత్తిమీద ఎగిరేంత కిందికి ఎందుకొస్తుంది, పిచ్చి ప్రశ్న కాకపోతే... అనుకోకండి. కరీబియన్ దీవుల్లో ఒకటైన సెయింట్ మార్టిన్ దీవిలో అలా జరుగు తుంది మరి! సెయింట్ మార్టిన్ జనాభా ఎనభై వేలకు మించదు. ఈ దీవిలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినది మాహో బీచ్ గురించి. ఈ బీచ్‌లో ఉన్న వారి మీదకు విమానాలు దూసుకొస్తూ ఉంటాయి. అంటే, అంత కింద ఎగురు తాయన్నమాట! కొత్తగా వెళ్లినవాళ్లు విమానం కూలిపోతూ మీదికి దూసుకొస్తోందని అనుకుంటారు. కానీ అది కాదు అసలు విషయం. జూలియానా ఎయిర్‌పోర్టు చిన్నగా ఉంటుంది. అతి చిన్న రన్‌వే కావడంతో అక్కడికి వచ్చి ఎత్తును తగ్గించడానికి ఉండదు. కాబట్టి సముద్రం మీద ఉండగానే విమానాన్ని కిందకు దించడం మొదలుపెడతారు పెలైట్లు. బీచ్ పక్కనే రన్‌వే ఉండటంతో, అక్కడికి వచ్చేసరికి విమానం బాగా కిందకు దిగుతుంది. అప్రమత్తంగా లేకపోతే తగిలేయడం ఖాయం. అందుకే బీచ్ నిండా ప్రమాద హెచ్చరికలుంటాయి. అనౌన్స్మెంట్లు వినిపిస్తాయి. కాబట్టి ప్రమాదాలు జరగవు. ఇంకా చెప్పాలంటే, ఆ అనుభవాన్ని సొంతం చేసుకోవడానికే కొందరు ఆ బీచ్‌కి వెళ్తుంటారు! -
మన సీతామహాలక్ష్మేనా!
చీరకట్టినా, చుడీదార్ వేసుకున్నా సీతామహాలక్ష్మి సీతామహాలక్ష్మే. తేడా ఏం కొట్టదు. అదే... హెయిర్ స్టయిల్ మార్చమనండి... ‘మన సీతామహాలక్ష్మేనా!’ అని చూస్తాం. వేసిన ముడి తీసిన పాపిడి తిప్పిన మెలిక విప్పిన పాయ ఎవ్రీథింగ్... ఎ న్యూ లుక్! స్ట్రెయిట్ హెయిర్ అయితేనా... ఇక చెప్పడానికేం లేదు. తల తిప్పనివ్వని చూపులే... మీ కురులలోని పువ్వులు! పట్టుకుంటే పట్టులా, ముట్టుకుంటే మృదువుగా జారిపోయే తీరు సాఫ్ట్ హెయిర్ సొంతం. జడ అల్లినా, వదిలేసినా అందంగా కనిపించే ఈ జుట్టు ఉన్నవారు రకరకాల హెయిర్ స్టైల్స్‌పై ముచ్చటపడినా త్వరగా సెట్ కాక, చిరాకుపడుతుం టారు. మరికొన్ని స్టైల్స్ ట్రై చేస్తే బాగుంటుంది అనుకునే సాఫ్ట్ అండ్ స్ట్రెయిట్ హెయిర్ గలవారు నిమిషంలోనే అల్లేసుకునే హెయిర్ స్టైల్స్‌లో కొన్ని ఇవి. రివర్స్ పోనీటెయిల్: చిక్కుల్లేకుండా దువ్వుకోవాలి, జుట్టును పైనంతా ఒక చేతిలోకి తీసుకొని, మరో చేత్తో రెండు సార్లు మెలిక తిప్పి, పైకి మడిచి, క్లిప్ పెట్టాలి. పైన కాక్టెయిల్లాగ వస్తుంది. ఈ క్యాజువల్ హెయిర్ స్టైల్ మోడ్రన్ డ్రెస్సులకు సూటవుతుంది. సైడ్ ఫ్రెంచ్ప్లాట్: ఎడమ, కుడి ఏదో ఒక వైపుకు జుట్టు దువ్వి, వీలైనన్ని పాయలు తీసుకుంటూ జడ అల్లాలి. ఫిష్టెయిల్లా వచ్చే ఈ స్టైల్ ప్యాంట్‌షర్ట్, మిడీస్.. వంటి మోడ్రన్ డ్రెస్సులకే కాదు గాగ్రా, లంగాఓణీ మీద కూడా అందంగా ఉంటుంది. సైడ్ జడ: కుడి లేదా ఎడమ. ఏదో ఒకవైపు జడ అల్లుకోవాలి. అయితే పూర్తిగా జడ కాకుండా కొంత జుట్టు వదిలేసి రబ్బర్‌బ్యాండ్ పెట్టుకోవాలి. వీలైతే ఫ్రెంచ్ ప్లాట్ కూడా ఇలాగే వేసుకోవచ్చు. ఈ స్టైల్ ప్యాంట్‌షర్ట్, మిడీస్.. మోడ్రన్ డ్రెస్సులకే కాదు గాగ్రా, లంగాఓణీ మీద కూడా అందంగా ఉంటుంది. సింగిల్ ఫ్రెంచ్ ప్లాట్: నాలుగు నుంచి ఎనిమిది పాయలు తీసుకుంటూ పై నుంచి జడ అల్లాలి. దీనికి చిన్న చిన్న హెయిర్ బీడ్స్ అలంకరిస్తే మరింత అందంగా ఉంటుంది. ఈ స్టైల్ సంప్రదాయ తరహా దుస్తుల మీదకు బాగుంటుంది. నెం.8 స్టైల్: జుట్టును చివరి వరకు మెలితిప్పి, పైకి రెండుసార్లు మడిచి, మధ్యలో క్లిప్ పెట్టాలి. నెం.8ను పోలినట్టుగా ఉంటుంది కాబట్టి దీనికి ఆ పేరు. ఈ హెయిర్‌స్టైల్ చీరకట్టుకి ఇంటబయటా అందంగా ఉంటుంది. రిలీఫ్‌గా కూడా అనిపిస్తుంది. హెయిర్ స్టైలిస్ట్: శాంతి, సాక్షి టీవీ ఫొటోలు: శివ మల్లాల