వాలెంటైన్ స్టైల్స్
వాలెంటైన్స్ డే... ఎర్ర గులాబీలు, క్యాండిల్ లైట్ డిన్నర్స్, డేటింగ్స్, ఔటింగ్స్! ఈరోజు మీ పార్ట్‌నర్‌తో కలిసి సినిమా ప్లాన్ చేసుకున్నారా... రొమాంటిక్ డిన్నర్ చేస్తున్నారా.. రోజంతా ఔటింగ్‌కు వెళ్తున్నారా! ఏదైనా కావచ్చు. ప్లేస్‌ను బట్టి డ్రెస్ ఎంత ముఖ్య మో హెయిర్ స్టైల్ కూడా అంతే కీలకం. పర్ఫెక్ట్ అవుట్‌ఫిట్టే కాదు.. స్పెషల్ హెయిర్ స్టైల్ కూడా ఉండాలి. ఇంత ప్రత్యేకమైన ఈరోజు మిమ్మల్ని మరింత ప్రత్యేకంగా చూపించే హెయిర్ స్టైల్ కోసం సెలూన్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు.. జస్ట్ వీటిని ఫాలో అయిపోండి!
ఫ్లర్టేషియస్ బ్రెయిడ్స్
మీ వాలెంటైన్‌తో కలిసి మూవీకి ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే ఈ హెయిర్ స్టైల్ మీకోసమే. ఎక్కువ సమయం తీసుకోకుండానే మీరు స్టైలిష్‌గా కనపడేలా చేస్తుందీ ఫ్లర్టేషియస్ బ్రెయిడ్స్. వాష్ చేసిన జుట్టును ఆరబెట్టాక రెండు పాయలుగా విడదీయండి. మీ కుడి వైపు భాగం జుట్టును మళ్లీ మూడు పాయలుగా విడదీయండి. ఆ మూడు పాయలను చివరివరకు జడలా అల్లేయండి. ఇప్పుడు జుట్టునంతా ఎడమవైపు భుజం మీదకు తీసుకొచ్చి వదిలేయండి.
షై అండ్ డెలికేట్
మొదటిసారి మీ వాలెం టైన్‌తో కలిసి కాఫీ డేట్‌కు వెళ్లాలనుకుంటున్నారా? సిగ్గులొలికే షై అండ్ డెలికేట్ పోనీటెయిల్ ట్రై చేయండి! తలస్నానం చేశాక జుట్టును పాడిల్ బ్రష్‌తో స్ట్రైట్‌గా చేయండి. పాపడ తీసి చెవులను కవర్ చేస్తూ పోనీ వేయడానికి వెనక్కి తీసుకెళ్లండి. అయితే జుట్టును బిగుతుగా కాకుండా లూజ్‌గా బ్యాండ్‌తో పోనీ వేయండి. ఆ ఎలాస్టిక్ బ్యాండ్‌ను మీ డ్రెస్‌కు మ్యాచ్ అయ్యే రిబ్బన్‌తో చుట్టేయండి.
లవ్ వేవ్స్
ఈ సాయంత్రం రొమాంటిక్ డిన్నర్‌ను ప్లాన్ చేసుకున్నారా? అయితే మీ గ్లామరస్ హెయిర్ చూసి మీ పార్ట్‌నర్ వావ్ అనాలంటే.. రొమాంటిక్ వేవ్స్‌కి స్టికాన్ అయిపోండి. చెవుల పక్క రెండు, వెనుక రెండు.. జుట్టును నాలుగు పాయలుగా విడదీయం డి. ప్రతి పాయలో చెవి కింది భాగానికి స్ప్రే చేస్తూ కర్లర్ సాయంతో చుట్టేయండి. 5-8 నిమిషాల పాటు వదిలేయండి. తరువాత వంపులు తిరిగిన జుట్టును నెమ్మదిగా దువ్వండి. ఇప్పుడు మొత్తం జుట్టును ఒక పక్కకు తీసుకురండి. అంతే రొమాంటిక్ వేవ్స్ రెడీ!