గొడుగుడుగుంజం | Godugudugunjam | Sakshi
Sakshi News home page

గొడుగుడుగుంజం

Published Tue, Feb 10 2015 1:00 AM | Last Updated on Mon, Feb 10 2020 3:26 PM

గొడుగుడుగుంజం - Sakshi

గొడుగుడుగుంజం

గొడుగు (ఛత్రి)... వాన జల్లు గిల్లకుండా కాపాడుతుంది. మండే ఎండల్లో మాడిపోకుండా రక్షణ కవచంగా నిలుస్తుంది. ఎండైనా, వానైనా అతివృష్టిలా ఉండే నగరంలో.. ఈ రెండు కాలాల్లో నగరవాసి ఆశ్రయించేది గొడుగునే. అందుకే.. నగరానిది గొడుగుది విడదీయ రాని బంధం. సిటీలో వర్షాకాలమే కాదు.. ఏ కాలమైనా ఎండకన్నెరగకుండా మగువలు అంబ్రెల్లానే వాడతారు. అందుకే ఈ గొడుగు ప్రాముఖ్యాన్ని ముందే ఊహించారో ఏమో మన పాలకులు... దానికి సముచిత గౌరవం కల్పిస్తూ ఓ ప్రాంతానికి ‘ఛత్రినాక’ అని పేరు కూడా పెట్టేశారు.

ప్రేమికులను ఒక్కచోట చేర్చే సాధనం కూడా ఈ గొడుగే. ఎలా అంటారా? 1955లో రాజ్‌కపూర్, నర్గీస్ నటించిన ‘శ్రీ 420’ సినిమా గుర్తుండే ఉంటుంది. ‘ప్యార్  హువా ఇక్‌రార్ హువా’ అంటూ... హీరో హీరోయిన్ల ప్రేమ చిగురించింది కూడా ఈ గొడుగు కిందే. ఇక ఏ ఎండకాగొడుగు పట్టే వారు రోజూ మనకు తారసపడుతూనే ఉంటారు. ఈ గొడుగులకు పెద్ద చరిత్రే ఉంది. 11వ శతాబ్దం నుంచే చైనాలో గొడుగులను ఉపయోగించేవారు.

ఈజిప్టు, బాబిలోనియాల్లో ఇవే గొడుగులను హోదాకు గుర్తుగా వాడేవారు. ఐరోపాలో ఎండకు రక్షణగా వాడితే.. వాననుంచి రక్షించుకోవడం కోసం ఉపయోగించారు రోమన్లు. 1680లో ఫ్రాన్స్, తర్వాత ఇంగ్లండ్‌లో ఈ గొడుగువాడకం మొదలైంది. 18వ శతాబ్దం నుంచి ఐరోపా అంతటికి గొడుగు విస్తరించింది.

పాశ్చాత్య దేశాలు ఇప్పుడిప్పుడు ఉపయోగించిన ఈ గొడుగును మన భారతీయులు ముందే వాడేశారు.. కృత యుగంలో బలి చక్రవర్తిని మూడడుగుల నేల కోరిన వామనుడు ఛత్రంతోనే దర్శనమిచ్చాడు. ద్వాపరానికి వచ్చే సరికి శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని చిటికెన వేలుపై ఎత్తి గోవర్ధన గిరినే గొడుగుగా మార్చేశాడు. ఇంత గొడుగోపదేశం ఎందుకంటారా..? ఈ రోజు నేషనల్ అంబ్రెల్లా డే !

..:: కట్టా కవిత

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement