హృదయ స్పందన | Heart | Sakshi
Sakshi News home page

హృదయ స్పందన

Published Sat, Feb 14 2015 12:25 AM | Last Updated on Sat, Sep 2 2017 9:16 PM

హృదయ స్పందన

హృదయ స్పందన

ప్రేమికుల రోజున క్యాండిల్ లైట్ విందులు, చాక్లెట్లు, ఖరీదైన కానుకలతో భాగస్వామి మనసు గెలుచుకోవాలని తపిస్తారు. కానీ, తమ భాగస్వామిని ఏడాది మొత్తంగా సంతోషపెట్టే కానుక ఇవ్వాలని ఆలోచించేవారికి ఓ అద్భుతమైన ఐడియా ‘హెల్త్ చెకప్.’ ఇలా ఆలోచించే జంటలకు ప్రేమికుల రోజైన నేడు నగరంలోని కార్పొరేట్ ఆసుపత్రులు ప్రత్యేక హెల్త్ చెకప్‌లు అందిస్తున్నాయి.
 
కిమ్స్ ఆసుపత్రి రూ.10 వేల విలువ గల హెల్త్ చెకప్‌కి ప్రేమికుల రోజును పురస్కరించుకొని రూ.3,200కే ఇస్తోంది. ఈ రోజు రూ.200 చెల్లించి పేరు నమోదు చేసుకుంటే 6 నెలల వరకు ఇదే డిస్కౌంట్ పొందవచ్చు. కిమ్స్ ఉషాలక్ష్మి సెంటర్ రొమ్ము వ్యాధులను నిర్ధారించే బైలేటరల్ మమోగ్రామ్, అల్ట్రాసౌండ్ వంటి పరీక్షలలలో 50 శాతం డిస్కౌంట్ ఇస్తోంది. ఈ పరీక్షలు మామూలు రోజుల్లో రూ.4,470 ఉంటే ఈ ఒక్క రోజు రూ.2,325కే చేస్తారు.

ప్రేమికుల రోజు సందర్భంగా మీ జీవితభాగస్వామి ఆరోగ్యరీత్యా రొమ్ము క్యాన్సర్ పరీక్షలను సగం ధరకే పొందవచ్చు’ అని కిమ్స్-ఉషాలక్ష్మి ఆసుపత్రి డెరైక్టర్ డా.పి.రఘురామ్ తెలియజేశారు. కేర్ గ్రూప్, గ్లోబల్ హాస్పిటల్స్ సైతం మరో అడుగు ముందుకేసి జంటలకు హెల్త్ చెకప్స్, నిర్ధారణ పరీక్షలలోనూ, అవుట్ పేషంట్ సేవలలోనూ డిస్కౌంట్స్ ఇస్తున్నాయి. హెల్త్ చెకప్స్‌లో ఏడాది పొడవునా డిస్కౌంట్స్ ఇచ్చే గ్లోబల్ హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ హెల్త్‌చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్స్‌లో ఈ రోజు మరో 500 రూపాయల డిస్కౌంట్ ఇస్తోంది.

ఇప్పటికే రూ.9,275కు పైగా ఉన్న హెల్త్ చెకప్స్ డిస్కౌంట్ ధరలో రూ.3,000కు ఇస్తుండగా ఈ రోజు మాత్రం మరింత డిస్కౌంట్ ఇస్తూ రూ.2,500 చేసింది. డాక్టర్ ఫీజులో 15 శాతం రాయితీ ఇస్తోంది. కేర్ గ్రూప్ హాస్పిటల్స్ 60 ఏళ్లు పైబడిన వయోవృద్ధులైన జంటకు హెల్త్ చెకప్స్‌లో 30 శాతం డిస్కౌంట్ అందజేస్తుంది. ఇతర ఆఫర్లలో భాగంగా కాస్మటిక్, డెంటల్ కూడా చోటుచేసుకున్నాయి. వాటిలో భాగంగా అపోలో వైట్ డెంటల్ స్పా ఓరల్ స్క్రీనింగ్, వైట్ ఫేషియల్, కాస్మటిక్ పాలిషింగ్‌లలో 60 శాతం డిస్కౌంట్ ఇస్తోంది. సో... ఏడాది పొడవునా ఆరోగ్య ధీమా కలిగించే ఏ హెల్త్ చెకప్ అయినా ఓ అమూల్యమైన కానుకే!
 
- నిర్మలారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement