ప్రేమికుల రోజు ఆన్‌లైన్ కొనుగోళ్లు రూ.22 వేల కోట్లు!
న్యూఢిల్లీ: ప్రేమికుల రోజు కార్డులు, ఫ్లవర్స్, డైమండ్ జ్యువెలరీ, చాక్లెట్లు, బొమ్మలు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు తదితర వాటిని కొనుగోలు చేయటానికి ఆన్‌లైన్ కొనుగోలుదారులు వెచ్చించే మొత్తం రూ. 22 వేల కోట్లు ఉంటుందని అసోచాం తెలిపింది. గతేడాది ఈ మొత్తం రూ.16 వేల కోట్లుగా ఉందని పేర్కొంది. దీనికోసం అసోచాం ఓ సర్వేను జరిపింది. సర్వేలో దాదాపు 52 శాతం మంది ఆన్‌లైన్ షాపింగ్ చేసే వారు రిటైల్ షాపులతో పోలిస్తే ఆన్‌లైన్‌లోనే ఆఫర్లు బాగుంటాయనే అభిప్రాయపడ్డారు.
అలాగే 50 శాతం మంది స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు, 18 శాతం మంది ట్యాబ్లెట్ వినియోగదారులు గిఫ్ట్‌లను కొనుగోలు చేయటానికి వారి ఉపకరణాలనే వినియోగిస్తారు.