toys
-
ప్రపంచాన్ని చుట్టేసిన ఏటికొప్పాక లక్కబొమ్మ (ఫొటోలు)
-
Gujarat: పిల్లల బొమ్మల్లో, లంచ్ బాక్సుల్లో దాచి..
గాంధీ నగర్: గుజరాత్ రాష్ట్రంలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. అహ్మదాబాద్‌లో విదేశాల నుంచి వచ్చిన వారి నుంచి సుమారు రూ. కోటికి పైగా విలువైన డ్రగ్స్‌ను కస్టమ్ అధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన ఒకరిని అదుపులోకి తీసుకున్నారు.వివరాలు.. అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్‌తోపాటు కస్టమ్స్, ఎక్సైజ్ శాఖ అధికారులు సంయుక్త ఆపరేషన్ చేపట్టారు. ఈ ఆపరేషన్‌లో అమెరికా, కెనడా, థాయ్‌లాండ్ నుంచి వచ్చిన వారి వద్ద నుంచి రూ. 1.15 కోట్ల విలువైన హైబ్రిడ్, సింథటిక్ గంజాయి పొట్లాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని చిన్నారుల ఆట బొమ్మలు, చాక్లెట్లు, లంచ్ బాక్స్‌లు, క్యాండీ విటమిన్‌లల్లో దాచి అక్రమంగా తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి ఓ విదేశీయుడిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. -
పిల్లలు మారాం తగ్గించడానికే.. ఈ భలే భలే బొమ్మలు!
పిల్లలు మారాం చేయకుండా.. ఉండాలంటే ఏదో ఒకటి చేస్తుంటాం. తిను బండారాలుగానీ, ఆట వస్తువలుగానీ ఇస్తూంటాం. వారికి ఇష్టమైనవి ఇవ్వగానే ఇట్టే గప్‌చుప్ అవుతారు. ఇలా వారిని ఆకట్టుకునేట్లుగా ఉండే వస్తువులలో బొమ్మలే ఫస్ట్! ఆటకు సరే.. అలసట తీర్చడానికీ ఆ బొమ్మలు కుషన్స్గా మెత్తగా ఒదిగితే..! భలే బాగుంటాయి కదా! మరింక ఆలస్యం ఎందుకు.. వాటిని చూద్దాం! ఇలా అంబారీ ఏనుగు.. ఎడారి ఓడ ఒంటె.. జిరాఫీ.. పిల్లి.. టెడ్డీ.. పిల్లలకు ఏ జంతువులు ఇష్టమో లిస్ట్ రాసుకుని.. మార్కెట్లో సెలక్ట్ చేసుకోవడమే.. వాటితో మీ పిల్లల్ని దోస్తీ చేయించడమే! అయితే మీ సోఫా కవర్స్.. బెడ్ కవర్స్‌కు మ్యాచ్ అయ్యే ఆకర్షణీయమైన ప్రింట్లతో డిజైన్ చేసిన బొమ్మ కుషన్స్నే ఎంపిక చేసుకోండి. అవి పిల్లల్నే కాదు పెద్దలనూ ఆకట్టుకుంటాయి. ఇవి చదవండి: Sharmila Yadav: డ్రోన్ దీదీ -
బాలరామునికి బొమ్మల బహుమానం
అయోధ్యలోని నూతన రామాలయంలో కొలువుదీరనున్న బాలరాముని దర్శించేందుకు భక్తులు వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. బాల రాముడు ఎంత ముద్దుగా ఉంటాడోనని భక్తులు పరిపరివిధాలుగా ఊహించుకుంటున్నారు. బాలుని రూపంలో ఉండే రాముడు బొమ్మలతో ఆడుకోవడం సహజం. అందుకే బాలరామునికి బొమ్మలను కానుకగా ఇచ్చేందుకు ‘రామ్ బ్యాంక్’ సిద్ధమవుతోంది. వారణాసిలోని రామ్ బ్యాంక్ అనేది నామానామాన్ని డిపాజిట్ చేసే సంస్థ. ఇక్కడ భక్తులు తాము రామనామాలను రాసిన పుస్తకాలను జమ చేస్తుంటారు. ఈ బ్యాంకు వారణాసిలోని దశాశ్వమేధ్ ప్రాంతంలో ఉంది. ఈ బ్యాంకు 96 ఏళ్లుగా రామనామ సేవ చేస్తోంది. మెహ్రోత్రా కుటుంబం ఈ బ్యాంకును ప్రారంభించింది. నేడు మూడవ తరం వారసులు ఈ బ్యాంకును నడుపుతున్నారు. ఇప్పుడు ఈ బ్యాంకు నిర్వాహకులు అయోధ్యలోని రామ్‌లల్లాకు కాశీలో తయారైన చెక్క బొమ్మలను కానుకగా అందించనున్నారు. బాలరామునికి సమర్పించేందుకు ఓ బుట్ట నిండా బొమ్మలను సిద్ధం చేసినట్లు బ్యాంక్ మేనేజర్ సుమిత్ మెహ్రోత్రా తెలిపారు. ఈ బొమ్మలలో ఏనుగు, గుర్రం, పల్లకీ, మొదలైన బొమ్మలు ఉన్నాయి. వీటిని అయోధ్యకు పంపేందుకు ప్రత్యేకంగా సిద్ధం చేశారు. మెహ్రోత్రా కుటుంబం రామ్ దర్బార్‌లో ఈ బొమ్మలను అందజేస్తుంది. రామాలయ నిర్మాణ ఉద్యమంలో ఈ బ్యాంకు కీలక పాత్ర పోషించింది. నాడు కరసేవకులు ఓ వైపు అయోధ్యకు వెళ్లి నిరసనలు తెలియజేస్తూనే, మరోవైపు ఈ బ్యాంకులో రామనామాలను జమ చేసేవారు. నేటికీ కాశీలో రామ్ బ్యాంక్ ఎంతో ఆదరణ పొందుతోంది. ఇది కూడా చదవండి: రామాలయ ప్రాంగణంలో ప్రత్యేక ఆలయాలివే.. -
స్మార్ట్ సీతాకోక చిలుకలు
రంగు రంగుల సీతాకోక చిలుకలు ఎగురుతున్న దృశ్యం పిల్లలకే కాదు, పెద్దలకూ సంబరంగానే ఉంటుంది. అలాగని సీతాకోక చిలుకలు ఎప్పుడంటే అప్పుడు కనిపించవు. కాంక్రీట్ కీకారణ్యాల్లాంటి నగరాల్లోనైతే, సీతాకోక చిలుకలు కనిపించడం మరీ అరుదు. మరి పిల్లలకు సీతాకోక చిలుకల సరదా తీరేదెలా? అందుకే, అమెరికన్ టాయ్ కంపెనీ ‘జింగ్’ ఎప్పుడంటే అప్పుడు ఎగరవేయగలిగే సీతాకోక చిలుకలను ‘గో గో బర్డ్’ పేరుతో మార్కెట్లోకి విడుదల చేసింది. రంగు రంగులతో అచ్చం అసలు సిసలు సీతాకోక చిలుకల్లా కనిపించే ఈ బొమ్మ సీతాకోక చిలుకలను రిమోట్ కంట్రోల్ సాయంతో కోరుకున్నప్పుడల్లా ఇంచక్కా ఎగరేయవచ్చు. డ్రోన్ మాదిరిగా ఎగిరే ఈ సీతాకోక చిలుకలను రాత్రిపూట చీకటిపడిన తర్వాత కూడా ఎగురవేయవచ్చు. వీటిలోని ఎల్ఈడీ లైట్లు రంగు రంగుల్లో వెలుగుతూ చీకట్లో మిరుమిట్లు గొలుపుతాయి. ఇవి రీచార్జబుల్ బ్యాటరీల సాయంతో పనిచేస్తాయి. ఈ ‘గో గో బర్డ్’ సీతాకోక చిలుక ధర 12.99 డాలర్లు (రూ. 1,083) మాత్రమే! స్మార్ట్ ఉకులెలె.. మ్యూజిక్ మేడీజీ! గిటార్‌లా కనిపించే ఈ బుల్లి వాద్యపరికరం ఉకులెలె. ఈ పోర్చుగీసు సంప్రదాయ పరికరాన్ని అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో స్మార్ట్‌గా తయారు చేసిన చైనీస్ కంపెనీ జియోమీ ఇటీవల ‘పాపులెలె 2 ప్రో స్మార్ట్’ పేరుతో మార్కెట్లోకి తెచ్చింది. సంగీతంలో కొత్తగా సరిగమలు నేర్చుకుంటున్న వారు సైతం దీనిపై తేలికగా కోరుకున్న పాటలు పలికించేలా దీన్ని తీర్చిదిద్దడం విశేషం. స్మార్ట్‌ఫోన్ లేదా లాప్టాప్ ద్వారా కోరుకున్న పాటను ఎంపిక చేసుకుని, యాప్ ద్వారా దీనిని అనుసంధానం చేసుకుంటే చాలు. ఈ ఉకులెలె ఫింగర్ బోర్డులో పాటలోని సంగీతానికి తగిన స్వరస్థానాలలో ఎల్ఈడీ లైట్లు వెలుగుతాయి. ఎల్ఈడీ లైట్ల వెలుగు ఆధారంగా వేళ్లను కదుపుతూ దీనిని వాయిస్తే, ఎలాంటి పాటైనా భేషుగ్గా పలుకుతుంది. దీనిని వాయించడంలో మొదట్లో కొద్దిగా తడబడినా, సంగీతం రానివారు సైతం దీనికి పదిహేను నిమిషాల్లోనే అలవాటు పడిపోతారని, తేలికగా పాటలు వాయించగలుగుతారని జియోమీ కంపెనీ చెబుతోంది. సంప్రదాయ ఉకులెలెను కలపతో తయారు చేస్తారు. ఈ స్మార్ట్ ఉకులెలెను సింథటిక్ ఫైబర్‌తో కొద్దిపాటి డిజైన్ మార్పులతో తయారు చేశారు. దీని ధర 279 డాలర్లు (రూ.23,264) మాత్రమే! చార్జర్ కమ్ రేడియో ఇది చార్జర్ కమ్ రేడియో. మామూలు చార్జర్లలా దీనికి బయటి విద్యుత్తుతో పనిలేదు. ఇది తనంతట తానే విద్యుత్తును ఉత్పత్తి చేసుకుంటుంది. కావలసినప్పుడు ఆన్ చేసుకుంటే, ఇంచక్కా రేడియోను వినిపిస్తుంది. దీనొకక ఎల్ఈడీ లైట్ కూడా ఉంటుంది. ఈ చార్జర్ కమ్ రేడియో పనిచేయడానికి కాసింత ఉప్పునీరు చాలు. జపానీస్ కంపెనీ ‘స్టేయర్ హోల్డింగ్’ దీనిని ఇటీవల మార్కెట్లోకి తెచ్చింది. ఇది మాగ్నెటిక్ చార్జర్. దీని సాకెట్లో నాలుగు మెగ్నీషియం రాడ్లు ఉంటాయి. అందులో ఉప్పునీరు వేసి నింపడం వల్ల జరిగే రసాయనిక చర్య ద్వారా విద్యుత్తు పుడుతుంది. దీంతో మొబైల్ ఫోన్లు, లాప్‌టాప్‌లు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులను చార్జ్ చేసుకోవచ్చు. వినియోగాన్ని బట్టి దీనిలోని మెగ్నీషియం రాడ్లను మార్చుకోవాల్సి ఉంటుంది. ఆరుబయట పిక్నిక్లకు వెళ్లేటప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుంది. దీని ధర 15,800 యెన్లు (రూ.8,837) మాత్రమే! -
బొల్లి వ్యాధి బయటకు రానివ్వకుండా కుంగదీసినా..కళ గెలిపించింది!
స్కూలు అకడమిక్ పరీక్షల్లో కాస్త వెనకబడితేనే కుంగిపోతుంటారు. పిల్లలు. అలాంటిది పదేళ్ల వయసులో తన శరీరం మీద తెల్లని మచ్చలు రావడం చూసిన ఆశా ఖత్రికి ఏమీ అర్థం కాలేదు. తన స్నేహితులు, చుట్టుపక్కల వారి శరీరం మీద అలాంటి మచ్చలు ఏవీ కనపడకపోవడంతో తను ఏదో ప్రత్యేకంగా ఉన్నట్లు భావించి.. అందరిలా తను లేదని చాలా బాధపడింది. తనకొచ్చిన బొల్లి మచ్చలు పోవడం లేదని తీవ్ర నిరాశకు లోనైంది. ఏది ప్రయత్నించినా తనకి ఎదురే వచ్చాయి. అయినా తన చిన్ననాటి అలవాటునే ఉజ్వల భవిష్యత్‌గా మార్చుకుని, సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమన్‌గా ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోంది ముఫ్పైరెండేళ్ల ఆశాఖత్రి. రాజస్థాన్‌లోని చిత్తోర్ఘర్కు చెందిన ఆశా ఖత్రి పదేళ్ల వయసులో ఉన్నప్పుడు మిగతా పిల్లల్లా కాకుండా ఒళ్లంతా తెల్లని మచ్చలతో కొంచెం అసాధారణంగా ఉండేది. తన రూపాన్ని చూసుకుని చిన్నారి ఆశా చాలా కుంగిపోయింది. అది గమనించిన తల్లిదండ్రులు, స్నేహితులు ఆమెను ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఆమెలో ధైర్యాన్ని నింపుతూ, వైద్యం చేయించేవారు. ఎంతోమంది డాక్టర్లకు చూపించినప్పటికీ పెద్ద మార్పు రాలేదు. కుంగిపోయినప్పటికీ... తన పరిస్థితి చూసుకుని ఎప్పుడూ బాధపడే ఆశ.. మందులు, హార్మోన్లలో మార్పుల వల్ల విపరీతమైన బరువు పెరిగిపోయింది. దీంతో సమాజంలో తిరగాలంటే చాలా బిడియంగా ఉండేది తనకు. అంగవైకల్యం ఉన్న అమ్మాయిలా అందరూ తనని చూసేవారు. ఇంత బాధలోనూ ధైర్యం తెచ్చుకుని ఎం.ఏ., బీఈడీ. చేసింది. చదువు పూర్తయ్యాక ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమైంది. సంవత్సరాలపాటు కష్టపడినప్పటికి కాలం కలిసిరాక ఉద్యోగం రాలేదు. ఎవరి మీదా ఆధారపడకుండా తన కాళ్లమీద తనే నిలబడాలనకునే ఆశ.. ఏదోఒకటి చేసి సంపాదించాలన్న కోరికతో రకరకాలుగా ప్రయత్నిస్తూ చివరికి క్రొచెట్ను ఎంచుకుంది. అలవాటునే సంపాదనగా... క్రొచెట్ టాయిస్‌ను తయారు చేసే కళ ఒక తరం నుంచి మరోతరానికి బదిలీ అవుతుంటుంది. ఆశ చిన్నప్పుడు అల్లికలతో బొమ్మలు తయారుచేసే క్రొచెట్కళను తన అమ్మ, అమ్మమ్మల దగ్గర నేర్చుకుంది. వివిధ రకాల బొమ్మలు చేస్తుండేది. ఆ అలవాటే తన డెస్టినీ అవుతుందని ఎప్పుడూ అనుకోలేదు. అనేకప్రయత్నాలు విఫలం అయ్యి దిక్కుతోచని రోజులవి. అది 2021 నవంబర్. ఒకరోజు ఆశ...తన చుట్టాల పిల్లలు క్రొచెట్ టాయిస్‌తో ఆడడం చూసింది. క్రొచెట్ టాయిస్‌తో ఆ పిల్లలు ఎంతో సంతోషంగా ఉండడం గమనించిన ఆశ.. తను కూడా ఆ టాయిస్‌ను తయారు చేసి ఆన్లైన్లో విక్రయించవచ్చన్న ఆలోచన వచ్చింది. అనుకున్న వెంటనే తనకు తెలిసిన క్రొచెట్ కళతో చిన్న ఆక్టోపస్‌ను తయారు చేసి అందరికి చూపించింది. అది చూసిన వారంతా చాలా బావుంది. క్యూట్‌గా ఉంది అని చెప్పడంతో.. మరికొన్ని టాయిస్ తయారు చేసి, ఎగ్జిబీషన్‌లో ప్రదర్శించింది. అక్కడ ఆ టాయిస్‌ను చూసిన వారంతా ఇష్టపడి కొనడం, ఆశకు మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చింది. తన బొమ్మలకు వస్తోన్న ఆదరణను చూసి మరిన్ని టాయిస్‌ను రూపొందించి చిన్నచిన్న ఎగ్జిబిషన్లలో విక్రయించేది. అక్కడ వచ్చిన స్పందనతో తన వ్యాపారాన్ని మరింత విస్తరించింది. తను తయారు చేసే టాయిస్‌ను ఇన్స్టాగ్రామ్, ఇంకా వెబ్సైట్ ఆశి. టాయిస్.స్టూడియో పేరిట విక్రయిస్తోంది. రెండువేలకుపైగా బొమ్మలు అమ్ముడయ్యాయి. ఆశ టాయిస్కు దేశవ్యాప్తంగా కస్టమర్లు ఉన్నారు. పిల్లలు ఆడుకునే బొమ్మల నుంచి ఇల్లు,ఆఫీసు అలంకరణకు వాడే వివిధ రకాల వస్తువులను తయారు చేసి విక్రయిస్తోంది. జైపూర్‌లో బాగా పాపులర్ అయిన ‘‘టాటూ కేఫ్’’ కు డ్రీమ్ క్యాచర్స్‌ను తయారు చేసి ఇవ్వడం విశేషం. ఒకపక్క బొల్లి, మరోపక్క అధిక బరువు ఉన్నప్పటికీ... తన టాలెంట్‌తో అందమైన క్రొచెట్ టాయిస్‌ను రూపొందిస్తూ కస్టమర్ల మనసులు గెలుచుకుంటోంది ఆశాఖత్రి. దారులన్నీ మూసుకు పోయినప్పటికీ... ఏదో ఒకదారి తెరిచే ఉటుంది. ఒపిగ్గా ఆ దారిని వెతికి పట్టుకుంటే బంగారు భవిష్యత్‌కు మార్గం సుగమం అవుతుందనడానికి ఆశాఖత్రి ఉదాహరణగా నిలుస్తోంది. (చదవండి: లాయర్ని కాస్త విధి ట్రక్ డ్రైవర్‌గా మార్చింది! అదే ఆమెను..) -
చిన్నారులకు ఆత్మీయ నేస్తం
పిల్లల కోసం పర్యావరణ అనుకూలమైన ఉత్పత్తుల తయారీలోగ్రామీణ మహిళలకు అవగాహన కల్పిస్తున్నారు. న్యూ ఏజ్ పేరెంట్స్‌ను ఆకట్టుకునేలా చేస్తున్న ఈ ప్రయత్నానికి మంచి స్పందన వస్తోందని, పిల్లలకు ఈ బొమ్మలు ఆత్మీయ నేస్తాలు అవుతున్నాయని ఆనందంగా వివరిస్తోంది స్వాతి. ‘‘పిల్లల మనసులు తెల్లని కాగితాల్లాంటివి. వాటిపై మనం ఏది రాస్తే అదే వారి భవిష్యత్తు. పదేళ్లుగా వందలాది మంది చంటి పిల్లలతో ఆడిపాడి, వారికి నచ్చినట్టు చెప్పే పద్ధతులను నేనూ నేర్చుకుంటూ వచ్చాను. డిగ్రీ చేసిన నాకు స్వతహాగా పిల్లలతో గడపడంలో ఉండే ఇష్టం నన్ను టీచింగ్ వైపు ప్రయాణించేలా చేస్తోంది. ప్లే స్కూల్ పిల్లలతో ఆడుకోవడం, వారితో రకరకాల యాక్టివిటీస్ చేయించడం ఎప్పుడూ సరదాయే నాకు. నాకు ఒక బాబు. వాడి వల్లనే ఈ ఇష్టం మరింత ఎక్కువైందనుకుంటాను. బాబుతోపాటు నేనూ ఓ స్కూల్లో జాయిన్ అయి, నా ఆసక్తులను పెంచుకున్నాను. ఆలోచనకు మార్గం పదేళ్లుగా చంటి పిల్లల నుంచి పదేళ్ల వయసు చిన్నారుల వరకు వారి ఆటపాటల్లో నేనూ నిమగ్నమై ఉన్నాను కనుక వారి ముందుకు ఎలాంటి వస్తువులు వచ్చి చేరుతున్నాయనే విషయాన్ని గమనిస్తూ వచ్చాను. కానీ, నేను అనుకున్న విధంగా అన్నింటినీ ఒక దగ్గరకు చేర్చడం ఎలాగో తెలియలేదు. కరోనా సమయంలో వచ్చిన ఆలోచన నాకు నేనుగా నిలబడేలా చేసింది. ఒకప్రా జెక్ట్ వర్క్‌లాగా పిల్లల మానసిక వికాసానికి ఏమేం వస్తువులు అవసరం అవుతాయో అన్నీ రాసుకున్నాను. నేను ఏయే పద్ధతుల్లో పిల్లలకు నేర్పిస్తున్నానో, దాన్నే నాకు నేనేప్రా జెక్ట్ వర్క్‌గా చేసుకున్నాను. ఏ వస్తువులు ఏ ప్రాంతానికి ప్రత్యేకమైనవి, నాకు నచ్చినట్టుగా ఏయే వస్తువులను తయారు చేయించాలి అనేది డిజైన్ చేసుకున్నాను కాబట్టి అనుకున్న విధంగా పనులు మొదలుపెట్టాను. కిండోరా టాయ్స్ పేరుతో రెండేళ్ల క్రితం ఈప్రా జెక్ట్నుప్రా రంభించాను. అన్నింటా ఎకో స్టైల్ పిల్లలకు దంతాలు వచ్చే దశలో గట్టి వస్తువులను నోటిలో పెట్టేసుకుంటారు. వాటిలోప్లాస్టిక్వీ వచ్చి చేరుతుంటాయి. అందుకని సాఫ్ట్ ఉడ్‌తో బొమ్మలను తయారు చేయించాను. వీటికోసం మన తెలుగు రాష్ట్రాల్లోని కొండపల్లి, నిర్మల్ నుంచే కాకుండా, ఇతర రాష్ట్రాల్లోని టాయ్ మేకింగ్ వారిని కలిసి నాకు కావల్సిన విధంగా తయారు చేయించాను. ఇంద్రధనుస్సు రంగులను పరిచయం చేయడానికి సాఫ్ట్ ఉడ్ మెటీరియల్, కలర్, బిల్డింగ్ బాక్స్‌లే కాదు... ఐదేళ్ల నుంచి చిన్న చిన్న అల్లికలు, కుట్టు పని నేర్చుకోవడానికి కావల్సిన మెటీరియల్, క్రోచెట్ అల్లికలు వంటివి కూడా ఉండేలా శ్రద్ధ తీసుకున్నాను. సాఫ్ట్ టాయ్స్తోపాఠం మన దేశ సంస్కృతిని పిల్లలకు తెలియజేయాలంటే మన కట్టూ బొట్టునూ పరిచయం చేయాలి. అందుకు ప్రతి రాష్ట్రం ప్రత్యకత ఏమిటో డెకొరేటివ్ బొమ్మల ద్వారా చూపవచ్చు. ఇవి కూడా ఆర్గానిక్ మెటీరియల్స్ తో తయారు చేసినవే. డెకరేటివ్ సాఫ్ట్ టాయ్స్ స్వయంగా నేను చేసినవే. ఆర్గానిక్ కాటన్ మెటీరియల్‌తో చేయించిన సాఫ్ట్ టాయ్స్‌లో జంతువులు, పండ్లు, పువ్వుల బొమ్మలు కూడా ఉంటాయి. వీటివల్ల చిన్న పిల్లలకు ఎలాంటి హానీ కలగదు. రంగురంగులుగా కనిపించే ఈ బొమ్మల ద్వారా చెప్పేపాఠాలను పిల్లలు ఆసక్తిగా వింటారు. వీటితోపాటు పిల్లలను అలరించే పుస్తకాలు కూడా అందుబాటులో ఉండేలా చూసుకున్నాను. ఒక విధంగా చె΄్పాలంటే ఈ కాలపు తల్లిదండ్రులు తమ పిల్లలకు ఎలాంటి మానసిక వికాసపు బొమ్మలు కావాలనుకుంటారో అవన్నీ నా దగ్గర ఉండేలాప్లాన్ చేసుకున్నాను. నా ఆసక్తే పెట్టుబడి.. ఉద్యోగం చేయగా వచ్చిన డబ్బుల నుంచి చేసుకున్న పొదుపు మొత్తాలను ఇందుకోసం ఉపయోగించాను. ముందు చిన్నగా స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఆన్లైన్ వేదికగా మంచి ఆర్డర్స్ వస్తున్నాయి. నాతోపాటు ఈ పనిలో గ్రామీణ మహిళలు భాగస్వామ్యం కావడం మరింత ఆనందాన్ని ఇస్తోంది. ప్లే స్కూళ్లు, ఆన్లైన్, ఆఫ్ లైన్ ద్వారా వచ్చే ఆర్డర్లను బట్టి సాఫ్ట్ టాయ్స్ తయారీలో కనీసంపాతికమంది మహిళలుపాల్గొంటున్నారు. ముందుగా వర్క్‌షాప్ నిర్వహించి, టాయ్స్ మేకింగ్ నేర్పించి వర్క్ చేయిస్తుంటాను. పూర్తి ఎకో థీమ్ బేస్డ్ కావడంతో ఈ కాలం అమ్మలు ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్నారు. నేననుకున్న థీమ్ ఎంతో కొంతమందికి రీచ్ అవడం నాకు చాలా ఆనందంగా ఉంది’’ అని వివరించింది స్వాతి.– నిర్మలారెడ్డి ఫొటోలు: మోహనాచారి -
కనబడని చెయ్యేదో ఆడిస్తున్న ఆటబొమ్మలం... తోలుబొమ్మలం
‘రంగ రంగ రంగస్థలానా... కనబడని చెయ్యేదో ఆడిస్తున్న ఆటబొమ్మలం అంటా...తోలు బొమ్మలం అంటా’ అంటూ ‘రంగస్థలం’లో తాత్వికంగా పాడతాడు రామ్‌చరణ్. ఈ పాట సంగతి ఎలా ఉన్నా ‘బొమ్మలు మన కుటుంబ సభ్యులు’ అంటున్నాడు ఆలిఫ్. కోల్‌కతాకు చెందిన వ్లోగర్ ఆలిఫ్ బొమ్మలు తయారుచేసే కార్మికుల వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. లిక్విడ్ ప్లాస్టిక్‌ను వివిధ రకాల బొమ్మల మూసలలో పోయడం నుంచి బొమ్మల తలలకు ప్లాస్టిక్ వెంట్రుకలు అతికించడం వరకు రకరకాల దశలు ఈ వీడియోలో కనిపిస్తాయి. ‘లైఫ్ ఇన్ ప్లాస్టిక్ నాట్ ఫంటాస్టిక్’ అంటూ ఒక యూజర్ స్పందించాడు. ‘అందమైన బొమ్మల వెనుక ఇంత కష్టం ఉంటుందా!’ అని చెప్పేలా ఉన్న ఈ వీడియో వైరల్ అయింది. -
మీకు తెలుసా? తాటాకు బొమ్మలకు చాలా డిమాండ్, ఉపాధి మార్గం
తాటాకులు ఇప్పటికీ మన పల్లెల్లో విస్తారం. కానీ తాటాకు విసనకర్రలు పోయాయి. తాటాకు చాపలు, తాటాకు బొమ్మలూ పోయాయి. ‘మన కళ ఇది. మన పిల్లలకు బార్బీ కంటే తాటాకు బొమ్మలే నచ్చుతాయి’ అంటుంది కోయంబత్తూరు మోహనవాణి. తాటాకు కళను పిల్లలకు నేర్చించి వారికై వారు తయారు చేసుకున్న బొమ్మలతో ఆడుకునేందుకు ప్రోత్సహిస్తోంది. స్త్రీలు సరిగా నేర్చుకుంటే ఉపాధి మార్గం అని కూడా చెబుతోంది. మన దేశంలో పశ్చిమ బెంగాల్లో తాటాకుతో చేసే బొమ్మలకు, బుట్టలకు చాలా డిమాండ్ ఉందని చాలా కొద్ది మందికే తెలుసు. విశాఖ జిల్లా నక్కపల్లి, నర్సీపట్నంల నుంచి శ్రేష్టమైన తాటాకు గ్రేడింగ్ అయ్యి, రంగులు అద్దుకుని కోల్‌కతాకి ఎగుమతి అవుతుంది. అక్కడ వాటితో బొమ్మలు, బుట్టలు తయారు చేసి అమ్ముతున్నారు. పెద్ద ఆదాయం. విశాఖలో జరుగుతున్నట్టుగా మిగిలిన జిల్లాల్లో జరగడం లేదు. తాటాకులు మన తొలి కాగితాలు. తాటాకుతో ఒకప్పుడు ఇళ్లు కప్పేవారు, పందిళ్లు వేసేవారు, చాపలు, బుట్టలు, బొమ్మలు తయారు చేసేవారు. ఇప్పుడు ఆ కళంతా ఎవరూ సాధన చేయడం లేదు. దానిని అందరికీ నేర్పించాలని కూడా అనుకోవడం లేదు. కాని తమిళనాడులో 34 ఏళ్ల మోహనవాణి అనే మహిళ పట్టుబట్టి తాటాకు బొమ్మల కళను అందరికీ నేర్పుతోంది. దక్షిణాదిలో విస్తారంగా ఉండే తాటి చెట్టు నుంచి ఆకు సేకరించి బొమ్మలు చేసి ఉపాధి పొందవచ్చంటున్నది. ఎనిమిదేళ్ల వయసులో.. మోహనరాణిది కోయంబత్తూరు. ఆమెకు ఎనిమిదేళ్లు ఉండగా మేనమామ ఆమెకు తాళపత్ర గ్రంథం చూపించాడు. రోజూ చూసే తాటాకుల మీద పుస్తకమే రాయవచ్చా అని మోహనరాణికి ఆశ్చర్యం వేసింది. తాటాకులతో చిన్న చిన్న బొమ్మలు చేసే ప్రయత్నం చేసిందిగాని పూర్తిగా రాలేదు. అప్పటినుంచి తాటాకు బొమ్మలు చేయాలనే కోరిక ఉండిపోయింది. ఐదేళ్ల క్రితం మదురైలో తాటాకు బొమ్మలు నేర్పించే వర్క్‌షాప్ జరుగుతున్నదని తెలిసి హాజరయ్యింది. మూడు రోజుల ఆ వర్క్‌షాప్‌లో తాటాకు బొమ్మలు చేయడం నేర్పించారు. పచ్చి ఆకుతో నేరుగా, ఎండిన ఆకైతే నీటితో తడిపి మెత్తగా చేసుకుని అప్పుడు బొమ్మలు చేయాలని తెలిసింది. ఎలా కత్తిరిస్తే ఏ షేప్ వస్తుందో అర్థమయ్యాక తన ఊహ కలిపి బొమ్మలు తయారు చేసింది. వాటికి పూసలు జత చేయడంతో స్పష్టమైన బొమ్మలు తయారయ్యాయి. మోహనవాణి తాటాకులతో చీమలు, చిలుకలు, నెమళ్లు, చేపలు... ఇలా చాలా బొమ్మలు చేస్తుంది. వాటితో గట్టి బుట్టలు కూడా అల్లుతుంది. పిల్లల లోకం అయితే ఈ బొమ్మలు తర్వాతి తరాలకు అందాలని నిశ్చయించుకుంది మోహనవాణి. కోయంబత్తూరులోని స్కూళ్లకు వెళ్లి తాటాకు బొమ్మలు నేర్పించింది. పిల్లలు ఎంతో హుషారుతో బొమ్మలు నేర్చుకున్నారు. కొత్త బొమ్మలు చేశారు. ‘ఆశ్చర్యం ఏమిటంటే మీరు తయారు చేసిన బొమ్మలతో కథ కల్పించి చెప్పండి అనంటే వాళ్లు చాలా విచిత్రమైన కథలు చెప్పారు. పిల్లలకు ఇదెంతో మానసిక వికాసం అనిపించి తరచూ అనేక స్కూళ్లకు వెళ్లి వర్క్‌షాపులు నిర్వహించి ఈ కళను నేర్పుతున్నాను’ అంది మోహనవాణి. ప్లాస్టిక్‌కు దూరం తాటాకు బొమ్మలు పర్యావరణ హితమైనవి. పిల్లల్ని, పర్యావరణాన్ని ప్లాస్టిక్ నుంచి దూరంగా ఉంచుతాయి. అంతేకాదు తాటాకు బొమ్మలు దేశీయమైనవి. మనదైన కళ కావడం వల్ల పిల్లలు కృత్రిమ పాశ్చాత్య బొమ్మలతో కాకుండా అమాయకమైన ఈ బొమ్మలతో ఎక్కువ ఆనందం పొందుతారు. ‘పర్యావరణ స్పృహ పెరిగింది కాబట్టి తాటాకు బుట్టలను, బాక్సులను, విసనకర్రలను చాలామంది కొంటున్నారు. మహిళలు ఈ కళను నేర్చుకుంటే అతి తక్కువ పెట్టుబడితో మంచి ఉపాధి పొందవచ్చు’ అంటోంది మోహనవాణి. ఆమె ఇప్పుడు ముంబైలోని కొన్ని స్కూళ్లకు వెళ్లి ఈ విద్య నేర్పుతోంది. మిగిలిన రాష్ట్రాలలో కూడా చాలా స్కూళ్లు ఆమెను ఆహ్వానిస్తున్నాయి. టీచర్లు ఈ క్రాఫ్ట్ నేర్చుకుంటే పిల్లలకు నేర్పించవచ్చని టీచర్లకు తాటాకు కళ నేర్పుతోంది మోహనవాణి. ‘తాటాకు బొమ్మలు చేయడం పెద్ద స్ట్రెస్‌బస్టర్. మీ ఒత్తిడి దూరం చేసుకోవడానికైనా తాటాకు అందుకుని బొమ్మలు చేయండి’ అంటోంది మోహనవాణి. -
రానున్న రోజుల్లో టాయ్స్ ఎక్స్ పోర్ట్ హబ్ గా ఏపీ..
-
‘సో చిల్’.. ఆటబొమ్మలాంటి బుల్లి ఫ్రిజ్
బ్రిటన్‌కు చెందిన ఆటబొమ్మల తయారీ సంస్థ ‘కెనాల్ టాయ్స్’ ఇటీవల ఆటబొమ్మలాంటి ఫ్రిజ్‌ను మార్కెట్లోకి తెచ్చింది. ముఖ్యంగా టీనేజీ పిల్లలకు ఉపయోగపడేలా దీన్ని తీర్చిదిద్దింది. ఇందులో మేకప్ సామగ్రిని, పానీయాలను భద్రపరచుకోవచ్చు. ఇందులో రిమూవబుల్ షెల్ఫ్‌ను ఏర్పాటు చేశారు. వస్తువులు పెట్టుకోవడానికి షెల్ఫ్ అవరోధం అనుకుంటే, షెల్ఫ్‌ను బయటకు తీసేసి కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఇది రీచార్జబుల్ బ్యాటరీతో పనిచేస్తుంది. చాలా తేలికగా దీనిని బయటకు తీసుకువెళ్లవచ్చు. దీనితో పాటు ఒక స్టిక్కర్ సెట్ ఉచితంగా లభిస్తుంది. ఫ్రిజ్‌ను కోరుకున్న రీతిలో అలంకరించుకోవడానికి ఈ స్టిక్కర్లను ఉపయోగించుకోవచ్చు. దీని ధర 44.99 పౌండ్లు (రూ.4,696) మాత్రమే! ఇదీ చదవండి: ఇది ఈ-ట్రైక్! మూడుచక్రాల ఈ-సైకిల్.. తొక్కొచ్చు.. తోలొచ్చు! -
కొయ్య కొరత తీర్చేలా... బొమ్మల తయారీకి ఊతమిచ్చేలా
నిర్మల్‌ఖిల్లా: నిర్మల్ అనగానే మొదట గుర్తొచ్చేది కొయ్యబొమ్మలే..వీటి తయారీ పరిశ్రమ కొలువుదీరింది ఇక్కడే. పొనికి చెట్టు నుంచి తీసే కలప ముడిసరుకుతో ఈ బొమ్మలను కళాకారులు తయారు చేస్తారు. ఈ కర్ర మృదువుగా, తేలికగా ఉపయోగించవచ్చు. ప్రస్తుతం అడవుల్లో పొనికి చెట్లు కనుమరుగవడంతో జిల్లాలో గత ఐదారేళ్లుగా బొమ్మల తయారీ పరిశ్రమ తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటోంది. దాదాపు 150 కళాకారుల కుటుంబాలు ఈ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పొనికి మొక్కల పెంపకానికి చర్యలు చేపట్టింది. ఈ మేరకు మొక్కల పెంపకానికి అనువైన ప్రాంతాలను అధికారులు గుర్తించారు. హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా సంరక్షణ చర్యలు చేపడుతున్నారు. పొనికి కర్ర ప్రత్యేకం.. నిర్మల్ కొయ్యబొమ్మల తయారీకి ఉపయోగించే పొనికి చెట్టు నుంచి తీసిన కలప చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఈ పొనికి కర్ర తేలికగా సరళంగా ఉండి, బొమ్మను చెక్కే క్రమంలో మృదువుగా ఉంటుంది. బొమ్మల తయారీలో కళాఖండంగా తీర్చుదిద్దవచ్చు. అందుకే పొనికి కర్రను వినియోగిస్తామని కళాకారులు అంటున్నారు. పొనికి మొక్కల పెంపునకు అనువైన ప్రాంతాలు.. పొనికి మొక్కల పెంపకం కోసం ప్రయోగాత్మకంగా పలు గ్రామ పంచాయతీలను డీఆర్డీఏ, ఇతర అధికారులు ఎంపిక చేశారు. మట్టి నమూనా పరీక్ష ల ఆధారంగా మామడ మండలం కొరిటికల్, గా యిద్పెల్లి, మొండిగుట్ట, తాండ్ర, వాస్తాపూర్, లింగాపూర్, తోటిగూడ, రాయదారి, సారంగాపూర్ మండలం గోపాల్పేట్ సమీపంలోని అటవీప్రాంతం అనువైనవిగా గుర్తించారు. ఇప్పటికే మట్టికి భూసార పరీక్ష అనంతరం ఇక్కడ మొక్కలు నాటి సంరక్షిస్తున్నారు. రాయదారి సమీపంలో 500 మొక్కలు నాటారు. మొదటగా లింగాపూర్ శివారులోని ప్రభుత్వ భూమిలో హరితహారం కింద వెయ్యి పొనికి మొక్కలు నాటారు. వాస్తాపూర్, గాయిద్పెల్లి తదితర గ్రామాల్లో దశలవారీగా మొక్కల పెంపకం చేపట్టనున్నారు. సారంగాపూర్ మండలం గోపాల్పేట సమీపంలో మహబూబ్ ఘాట్స్ ప్రాంతంలో 2,200 మొక్కలు నాటారు. నీటి వసతి కోసం ప్రత్యేకంగా డీఆర్డీఏ అధికారులు బోర్వెల్ వేయించారు. మొక్కలు నాటించాం పొనికి కర్రకు తీవ్రమైన కొరత ఏర్పడిన విషయాన్ని గుర్తించాం. జిల్లా కలెక్టర్ ప్రోత్సాహంతో హరితహారంలో మొక్కల ప్లాంటేషన్‌ను పకడ్బందీగా చేపడుతున్నాం. కొన్ని ప్రాంతాలను గుర్తించి మొక్కలు నాటించాం. సంరక్షణ చర్యలు తీసుకుంటున్నాం. – కె.విజయలక్ష్మి, జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ అధికారి హర్షణీయం పొనికి కలపతో తయారీ చే సిన కొయ్య బొమ్మలు ఎక్కువకాలం మన్నిక ఉంటాయి. వీటి తయారీపై ఆధారపడిన కళాకారుల కుటుంబాలు క ర్ర కొరతతో ఇబ్బంది పడ్డాం. రాష్ట్ర ప్రభుత్వం, డీ ఆర్డీఏ అధికారులు జిల్లాలో పొనికి వనాల పెంప కం చేపట్టాలని నిర్ణయం తీసుకోవడం హర్షణీయం. – నాంపల్లి రాజశేఖర్‌వర్మ, కళాకారుడు, నిర్మల్ -
ఆటబొమ్మలకు త్వరలో పీఎల్ఐ
న్యూఢిల్లీ: ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ) కింద తోలు, పాదరక్షలు, ఆటబొమ్మలు, నూతన తరం సైకిళ్ల విడిభాగాలకు ప్రోత్సాహకాల ప్రతిపాదన పురోగతి దశలో ఉందని పారిశ్రామిక ప్రోత్సాహక, అంతర్గత వాణిజ్య విభాగం (డీపీఐఐటీ) కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ తెలిపారు. వివిధ శాఖలు తమ పరిధిలో పీఎల్ఐ కింద ఆశించిన మేర పురోగతి లేకపోతే దిద్దుబాటు చర్యలు తీసుకుంటాయని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 14 రంగాల్లో ఉత్పత్తిని పెంచేందుకు, భారత్‌లో తయారీకి ఊతమిచ్చేందుకు పీఎల్ఐ కింద రూ.1.97 లక్షల కోట్ల ప్రోత్సాహకాలను ప్రకటించింది. కానీ 2023 మార్చి నాటికి రూ.3,400 కోట్ల క్లెయిమ్‌లు రాగా, కేవలం రూ. 2,900 కోట్ల ప్రోత్సాహక నిధులనే కేంద్రం మంజూరు చేసిన నేపథ్యంలో రాజేష్ కుమార్ స్పందించారు. ఐటీ రంగం మాదిరే కొన్ని సవరణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఇతర రంగాలకూ ఏర్పడొచ్చన్నారు. ఐటీ హార్డ్‌వేర్ ఉత్పత్తులకు సంబంధించి గత నెలలో కేంద్ర సర్కారు పీఎల్ఐ 2.0ని ప్రకటించడం గమనార్హం. ‘‘పీఎల్ఐ కింద రూ.1.97 లక్షల కోట్లు వినియోగం అవుతాయనే నమ్మకం ఉంది. కాకపోతే విడిగా ఒక్కో పథకంలో అవసరమైతే దిద్దుబాటు, సవరణలు ఉంటాయి’’అని రాజేష్‌కుమార్ సింగ్ వెల్లడించారు. మొబైల్స్ తయారీలో కావాల్సిన విడిభాగాల తయారీ దేశీయంగా 20 శాతమే ఉండగా, దాన్ని 50 శాతానికి తీసుకెళతామని రాజేష్ కుమార్ తెలిపారు. చైనాలో ఇది 49 శాతం, వియత్నాంలో 18 శాతమే ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. -
భారత్ నుంచి వాల్‌మార్ట్ మరిన్ని ఎగుమతులు
న్యూఢిల్లీ: భారత్ నుంచి మరిన్ని ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్‌కు ఎగుమతి చేయాలన్న లక్ష్యంతో దిగ్గజ రిటైల్ సంస్థ వాల్‌మార్ట్ ఉంది. ఆటబొమ్మలు, సైకిళ్లు, పాద రక్షలను భారత సరఫరా దారుల నుంచి సమీకరించుకోవాలని చూస్తోంది. ఆహారం, ఫార్మాస్యూటికల్, కన్జ్యూమబుల్, హెల్త్, వెల్నెస్, అప్పారెల్, హోమ్ టెక్స్టైల్ విభాగాల్లో భారత్ నుంచి కొత్త సరఫరాదారులను ఏర్పాటు చేసుకోవడంపైనా దృష్టిపెట్టింది. భారత్ నుంచి ఎగుమతులను 2027 నాటికి 10 బిలియన్ డాలర్లకు (రూ.82,000 కోట్లు) పెంచుకోవాలన్న లక్ష్యాన్ని ఈ సంస్థ లోగడే విధించుకుంది. ఈ దిశగా తన చర్యలను వేగవంతం చేస్తోంది. ఈ సంస్థ ఇటీవలే భారత్‌కు చెందిన పలువురు బొమ్మల తయారీదారులతో వర్చువల్ సమావేశాన్ని నిర్వహించింది. తమకు ఎంత మేర ఉత్పత్తి కావాలి, ఎలాంటి నాణ్యత ప్రమాణాలు పాటించాలనే విషయాలను వారికి తెలియజేసింది. ఐకియా సైతం... మరో ప్రముఖ అంతర్జాతీయ రిటైలింగ్ సంస్థ ఐకియా సైతం తన అంతర్జాతీయ విక్రయ కేంద్రాల కోసం భారత్ నుంచి ఆటబొమ్మలను సమీకరిస్తోంది. ఈ చర్యలు ఆట బొమ్మల విభాగంలో పెరుగుతున్న భారత్ బలాలను తెలియజేస్తోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. కొన్నేళ్ల క్రితం వరకు మన దేశం ఆటబొమ్మల కోసం దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడేది. చైనా నుంచి చౌక ఆట ఉత్పత్తులు మన మార్కెట్‌ను ముంచెత్తేవి. కేంద్ర సర్కారు దీనికి చెక్ పెట్టేందుకు దిగుమతి అయ్యే ఆట బొమ్మల నాణ్యతా ప్రమాణాలను పెంచడం, టారిఫ్‌లను పెంచడం వంటి చర్యలు తీసుకుంది. ఇవి ఫలితమిస్తున్నాయి. సరఫరా వ్యవస్థ బలోపేతం ఈ నెల మొదట్లో వాల్‌మార్ట్ ఐఎన్‌సీ ప్రెసిడెంట్, సీఈవో డగ్ మెక్‌మిల్లన్ భారత పర్యటన సందర్భంగా సంస్థ ప్రణాళికలను పునరుద్ఘాటించారు. భారత్‌లోని వినూత్నమైన సరఫరాదారుల వ్యవస్థ అండతో 2027 నాటికి ఇక్కడి నుంచి 10 బిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని చేరుకుంటామన్న ధీమాను వ్యక్తం చేశారు. తన పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీని సైతం ఆయన కలిశారు. ఆ తర్వాత సంస్థ లక్ష్యాలను పేర్కొంటూ ట్వీట్ చేశారు. లాజిస్టిక్స్, నైపుణ్యాల అభివృద్ధి, సరఫరా వ్యవస్థ బలోపేతం ద్వారా భారత్‌ను ఆటబొమ్మలు, సముద్ర ఉత్పత్తులు, ఇతర విభాగాల్లో అంతర్జాతీయ ఎగుమతి కేంద్రంగా చేస్తామని ప్రకటించారు. -
అరవైలో అల్లికలు
అభిరుచి ఏ వయసులోనైనా మనకు ఆదాయ వనరుగా మారవచ్చు. గుర్తింపును తీసుకురావచ్చు. ఈ మాటను ‘లక్ష’రాల నిజం చేసి చూపుతోంది ఆరు పదుల వయసులో ఉన్న కంచన్ భదానీ అనే గృహిణి. జార్ఖండ్ రాష్ట్రంలో ఉండే కంచన్ ఏడాది క్రితం వరకు గృహిణి. ఇప్పుడు వ్యాపారవేత్తగా మారింది. అదీ తనకు బాగా నచ్చిన అల్లికల బొమ్మలతో. యేడాదిలోనే రూ.14 లక్షల రూపాయలు సంపాదించడమే కాకుండా, యాభై మంది గిరిజన మహిళలకు ఉపాధి కల్పిస్తూ తన సత్తా ఏంటో నిరూపించింది. ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్న కంచన్కు వచ్చిన ఈ ఆలోచన గురించి ఎవరైనా అడిగితే ఎన్నో విషయాలు వెలిబుచ్చుతుంది. ‘‘వస్త్ర పరిశ్రమ ఎంతో వేగవంతంగా మారిపోతోంది. అయినా ఇప్పటికీ ఇళ్లలో చేతితో కుట్టే ఎంబ్రాయిడరీకి, అల్లిన వస్తువులకు ఎనలేనంత డిమాండ్ ఉంది. ఒకప్పుడు తల్లులు, అమ్మమ్మలు చాలా సాధారణంగా రోజువారీ ఇంటి పనులు పూర్తి చేసిన తర్వాత టేబుల్ క్లాత్‌లు, సోఫా కవర్లు, బొమ్మల వరకు అనేక అలంకార వస్తువులను తయారుచేసేవారు. అలాంటి వస్తువులు కాలక్రమంలో తగ్గిపోతున్నాయి. ఇది గమనించే 2021లో ‘లూప్హూప్’ పేరుతో క్రోచెట్ బొమ్మల యూనిట్‌ను స్టార్ట్ చేశాను. దీనికి ముందు 50 మంది గిరిజన మహిళలకు క్రోచెట్ కళలో శిక్షణ ఇచ్చి, వారికి వర్క్స్ ఇస్తుండేదాన్ని. కోల్‌కతాలో పుట్టిన పెరిగిన నేను మా అమ్మమ్మ, అత్తలు తయారుచేసే క్రోచెట్ బొమ్మలు, టేబుల్ క్లాత్ తయారు చేయడం చూసి నేర్చుకున్నాను. ఆ రోజుల్లో ప్రతి ఆడపిల్లకు కుట్లు, అల్లికలు నేర్పేవారు. ► స్కూల్లోనూ నైపుణ్యం.. ఇంట్లోనే కాదు, స్కూల్లోనూ క్రోచెట్ వస్తువుల తయారీలో శిక్షణ ఉండేది. దీంతో ప్రాక్టీస్ బాగా అయ్యింది. పెళ్లయ్యాక పట్టణప్రాంతానికి వెళ్లాల్సి రావడం, బాధ్యతలు పెరగడంతో పై చదువులకు వెళ్లలేకపోయాను. కానీ, వచ్చిన క్రోచెట్ కళను ఇష్టంగా చేస్తుండేదాన్ని. మా వారి ఉద్యోగరీత్యా మేం జార్ఖండ్‌లోని జుమ్రీ తెలయాకు మారినప్పుడు అక్కడ గిరిజన స్త్రీలను చూశాను. వారు గనులలో పనులు చేసేవారు. రోజువారి కూలీ ఏ మాత్రం వారికి సరిపోదు. వారి బాధలను చూసి, ఏదైనా మార్పు తీసుకురాగలిగితే బాగుంటుందని ఆలోచించేదాన్ని. ఏదైనా చేస్తాను అనుకుంటాను, కానీ, ఏం చేయాలో కచ్చితంగా తెలిసేది కాదు. ► కుటుంబ బాధ్యతలలో.. ముగ్గురు పిల్లల తల్లిగా నాకు ఇంటి బాధ్యతలు ఎక్కువే ఉండేవి. ఎప్పుడూ తీరికలేకుండా ఉండేదాన్ని. దీంతో నా సామాజిక ఆకాంక్షలపై దృష్టి పెట్టలేకపోయేదాన్ని. పిల్లలు పెద్దయ్యి, వారి జీవితాల్లో స్థిరపడ్డాక నా అభిరుచిని కొనసాగించాలనే ఆలోచన పెరిగింది. క్రోచెట్ నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్న మహిళలకు అప్పుడప్పుడు క్లాసులు తీసుకునేదాన్ని. 2021లో మా పిల్లలతో కూర్చొని చర్చిస్తున్నప్పుడు ఈ క్రోచెట్ బొమ్మల తయారీ పెద్ద ఎత్తున చేసి, అమ్మకాలు జరిపితే బాగుంటుందనే ఆలోచన వచ్చింది. ► సోషల్ మీడియాలో.. క్రోచెట్ బొమ్మల అమ్మకాలను ఆన్లైన్ ద్వారా చేయాలనే ఆలోచనతో వెబ్సైట్, సోషల్ మీడియా సెటప్స్కి మా పిల్లలు సాయం చేశారు. నేను గిరిజన మహిళలకు క్రొచెట్ వర్క్ నేర్పిస్తూ, వారితో ఈ బొమ్మలను తయారుచేయిస్తుంటాను. యాభై మంది గిరిజన మహిళలు తమ ఇళ్ల వద్దే ఉంటూ సౌకర్యంగా ఈ పనులు చేస్తుంటారు. నా దగ్గర కావల్సిన మెటీరియల్ తీసుకెళ్లి, బొమ్మలతో వస్తారు. ఒక్కొక్కరు రోజుకు 2–3 గంటల క్రోచెట్ అల్లిక చేస్తే నెలకు ఐదు వేల రూపాయలు వస్తాయి. మా జట్టులో ఉండే కొందరు నెలలో 30 బొమ్మలకు పైగా చేస్తారు. దీంతో ఇంకొంత ఆదాయం పెరుగుతుంది. ఆ విధంగా ఏడాది కాలంలో మూడు వేల బొమ్మలను అమ్మగలిగాను. పద్నాలుగు లక్షల రూపాయలు సంపాదించగలిగాను. చదువుకునే పిల్లలు, తీరిక ఉండే గృహిణుల్ని ఈ పనిని ఎంచుకుంటున్నారు. ► మృదువైన బొమ్మలు తాబేళ్లు, కుందేళ్లు, ఆక్టోపస్‌లు, ఏనుగులు, మనుషుల బొమ్మలు వీటిలో ప్రధానంగా ఉంటాయి. వెబ్సైట్, సోషల్‌మీడియా, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలోనూ ఈ బొమ్మలు అందుబాటులో ఉన్నాయి. ఏ పదార్థాలనూ వృథా చేయకుండా ఉన్నితో వీటిని తయారుచేస్తాం. పసిపిల్లలు వీటితో ఆడుకోవడం చాలా ఇష్టపడతారు. ఆదివాసీ సమాజం కోసం ఏదైనా చేయాలన్న నా కల ఇలా తీరడం సంతోషంగా ఉంది. ఏదైనా పనిని ప్రారంభించడానికి అభిరుచి ఉండాలి కానీ, వయసుపైబడటం ముఖ్యం కాదని నమ్ముతున్నాను’’ అని వివరిస్తుంది కంచన్. -
Meeta Sharma: ఆటలు ఆడు కన్నా
చీప్ ప్లాస్టిక్. చైనా ప్లాస్టిక్. ఇవాళ పిల్లల బొమ్మలు వీటితోనే దొరుకుతున్నాయి. కళాత్మకమైన దేశీయమైన చెక్కతో తయారైన బొమ్మలు పిల్లలకు ఉండాలి అని బొమ్మల కేంద్రం ప్రారంభించింది మీతా శర్మ. హార్వర్డ్‌లో చదువుకున్నా తన ఇద్దరు పిల్లలు ఆడుతున్న బొమ్మలను చూశాక ఆమె ఈ పని మొదలెట్టింది. ఇవాళ నెలకు వెయ్యి అర్డర్లు వస్తున్నాయి. 100 మంది బొమ్మల కళాకారులు ఉపాధి పొందుతున్నారు. పిల్లలు ఆమె బొమ్మలతో చక్కగా ఆడుకుంటున్నారు. ఈసప్ కథల్లో ‘కాకి దప్పిక’ కథ పిల్లలందరికీ చెబుతారు. దప్పికగొన్న కాకి కుండలో నీళ్లను తాగడానికి ప్రయత్నించి, అవి అందకపోతే నాలుగు రాళ్లు జారవిడిచి, నీళ్లు పైకి తేలాక తాగుతుంది. ఆ విధంగా ఆ కథ అవసరం అయినప్పుడు యుక్తిని ఎలా పాటించాలో పిల్లలకు చెబుతుంది. ఈ కథ యూట్యూబ్‌లో వీడియో గా సులభంగా దొరుకుతుంది. కాని మీతా శర్మ తయారు చేసే బొమ్మల్లో ఇదే కథ మొత్తం బుజ్జి బుజ్జి చెక్క బొమ్మల సెట్టుగా దొరుకుతుంది. పిల్లలను ఉద్రేక పరిచే ఆటబొమ్మల కంటే ఇలాంటి బొమ్మలే అవసరం అంటుంది ‘షుమి’ అనే బొమ్మల సంస్థను సక్సెస్‌ఫుల్‌గా నిర్వహిస్తున్న మీతా శర్మ. కంప్యూటర్ ఇంజనీర్ మీతా శర్మది ఢిల్లీ. అక్కడే ఐఐటీ లో బిటెక్ చేసింది. ఆ తర్వాత హార్వర్డ్ యూనివర్సిటీలో పీహెచ్డీ చేసింది. వివాహం అయ్యాక అమెరికాలోనే జీవితం మొదలెట్టింది. ‘మా పెద్దాడు పుట్టాక అమెరికాలో క్వాలిటీ బొమ్మలు కొనిచ్చాను ఆడుకోవడానికి. అవన్నీ ఎకో ఫ్రెండ్లీ కొయ్యబొమ్మలు. పాడు కావు. హాని చేయవు. 2012 లో అమెరికా వద్దనుకుని ఇండియా వచ్చాక నాకు సమస్య ఎదురైంది. అప్పటికి నా రెండో కొడుక్కి రెండేళ్లు. ఇక్కడ వాడికి ఇద్దామంటే మంచి బొమ్మలే లేవు. అన్నీ ప్లాస్టిక్‌వి లేదా గాడ్జెట్స్, అమెరికన్ కామిక్స్‌లో ఉన్న కేరెక్టర్... ఇవే ఉన్నాయి. ఆ ప్లాస్టిక్ పిల్లలు నోటిలో పెట్టుకుంటే ప్రమాదం. మన చిన్నప్పుడు చెక్కతో తయారు చేసిన బుజ్జి బుజ్జి బొమ్మలు ఎంతో బాగుండేవి. అలాంటి బొమ్మలకోసం ఎంత వెతికినా దొరకడం లేదు. కొన్నిచోట్ల సంప్రదాయ బొమ్మలు ఉన్నాయి కాని వాటి మార్కెటింగ్ సరిగా లేదు. అందుకని నాకే ఒక బొమ్మల తయారీ సంస్థ ఎందుకు మొదలెట్టకూడదు అనిపించింది. 2016లో షుమి సంస్థను స్థాపించాను’ అని తెలిపింది మీతా శర్మ. వేప, మామిడి కలపతో ‘నిజానికి సంస్థ స్థాపించడానికి పెట్టుబడి దొరకలేదు. ఎందుకంటే ఆ రోజుల్లో అందరూ పిల్లల గేమ్స్ తయారు చేసే సంస్థలనే ప్రోత్సహించేవి. నా దారేమో సంప్రదాయ కలప బొమ్మల దారి. అందుకే సొంత పెట్టుబడితో సంస్థను స్థాపించాను. బొమ్మలు చేసే కళకారులను సంప్రదించి కేవలం వేప, మామిడి కలపతో ముద్దొచ్చే బొమ్మలను ముఖ్యంగా రెండేళ్ల వయసున్న పిల్లల కోసం ఎక్కువ గా ఆ తర్వాత పదేళ్ల లోపున్న పిల్లలకోసం బొమ్మలను తయారు చేయించాను. వాటికి ఉపయోగించే రంగులు కూడా రసాయనాలు లేనివే’ అంది మీతా శర్మ. ఢిల్లీలో తన సంస్థను స్థాపించాక రకరకాల కొయ్యగుర్రాలను, మూడు చక్రాల తోపుడు బండ్లను, బుజ్జి గుడారాలను, పిల్లలు ఆడే వంట సామగ్రిని, వారికి కొద్దిపాటి లెక్కలు నేర్పే ఆట వస్తువులను, కథలను బొమ్మల్లో చెప్పే సెట్లను ఇలా తయారు చేయించింది.‘ఆన్లైన్లో మాకు ఆర్డర్లు వచ్చేవి. చాలామంది తల్లులు ఆ బొమ్మలతో ఐడెంటిఫై అయ్యారు. ఎందుకంటే వారంతా బాల్యంలో అలాంటి బొమ్మలతోనే ఆడారు కనుక. తమ పిల్లలకు సరిగ్గా అలాంటివే దొరకడంతో వారి ఆనందానికి హద్దులు లేవు’ అని చెప్పిందామె. ఇప్పుడు మీతా తయారు చేయిస్తున్న బొమ్మలు అమెరికా, యు.కె, సింగపూర్‌కు కూడా రవాణా అవుతున్నాయి. నెలలో 8000 ఆన్లైన్ ఆర్డర్లు వస్తున్నాయి. 100 మంది కళాకారులు చేతినిండా పనితో ఉపాధి పొందుతున్నారు. ఆటే పరిశోధన ‘పిల్లల అసలైన పరిశోధన వారు ఆడే ఆటలతోనే మొదలవుతుందని పిల్లల మనస్తత్వ నిపుణులు తెలుపుతారు. పిల్లల్ని పిల్లల్లా ఉంచే ఆటబొమ్మలతో వారిని ఆడనివ్వాలి. హింసాత్మకమైన బొమ్మల నుంచి వారిని దూరం పెట్టాలి. హింసను ప్రేరేపించే గేమ్స్ నుంచి కూడా. పిల్లలు బొమ్మలతో స్నేహం చేసి వాటిని పక్కన పెట్టుకుని భయం లేకుండా నిద్రపోతారు. వారికి బాల్యం నుంచి అలాంటి నిశ్చింతనిచ్చే బొమ్మల వైపుకు నడిపించాలి’ అని సలహా ఇస్తోంది మీతా. ఒక ఉద్యోగిగా కంటే తల్లిగా ప్రయోజనాత్మక అంట్రప్రెన్యూర్‌గా ఆమె ఎక్కువ సంతృప్తిని, గౌరవాన్ని, ఆదాయాన్ని పొందుతోంది. అదీ విజయమేగా. -
కలర్‌ఫుల్ ఎంఆర్ఐ స్కానర్
న్యూఢిల్లీ: ఎంఆర్ఐ స్కానింగ్ అంటే చాలా మందికి భయం. వింత శబ్దాలతో గుహలోకి వెళ్లిన ఫీలింగ్. చిన్నారులకు ఎంఆర్ఐ అంటే మరీ కష్టం. పిల్లలు భయపడకుండా స్కాన్ తీయడం కోసం ‘చిన్నారి’ ఎంఆర్ఐ మిషన్లు వస్తున్నాయి. మిషన్‌కు రంగులద్దడంతో పాటు దానిపైన ఫిక్షనల్ కేరక్టర్స్, బొమ్మలు చిత్రీకరించి పిల్లల్ని ఆకర్షించేలా రూపొందిస్తున్నారు. చాలా ఆస్పత్రుల్లో ఇలాంటి ఎంఆర్ఐ మిషన్లు ఉంటున్నాయని పారిశ్రామికవేత్త హర్షగోయెంక ఒక ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ఇప్పుడు ఆ మిషన్‌ను చూసిన నెటిజన్లు భలేగా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. -
బొమ్మల తయారీలోకి రిలయన్స్ రిటైల్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం రిలయన్స్ రిటైల్ స్థానికంగా బొమ్మల తయారీలోకి ప్రవేశించనుంది. బొమ్మలకు పెరుగుతున్న డిమాండుకు అనుగుణంగా హర్యానా కంపెనీ సర్కిల్ ఈ రిటైల్‌తో భాగస్వామ్యానికి తెరతీసింది. తద్వారా బొమ్మల బిజినెస్‌లో సమీకృత కార్యకలాపాలను నిర్వహించే ప్రణాళికల్లో ఉన్నట్లు రిలయన్స్ రిటైల్ సీఎఫ్‌వో దినేష్ తలుజా పేర్కొన్నారు. కంపెనీ ఇప్పటికే సుప్రసిద్ధ బ్రిటిష్ బొమ్మల బ్రాండ్ హామ్లేస్తోపాటు, దేశీ బ్రాండు రోవన్ విక్రయాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. బొమ్మల బిజినెస్‌లో డిజైన్ నుంచి షెల్ఫ్వరకూ రిలయన్స్ రిటైల్ వ్యూహాత్మకంగా కార్యకలాపాలను విస్తరించనున్నట్లు ఈ సందర్భంగా పరిశ్రమ వర్గాలు తెలియజేశాయి. వెరసి బొమ్మల డిజైనింగ్, తయారీ, రిటైల్ మార్కెటింగ్ తదితరాలను చేపట్టడం ద్వారా టాయ్ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేయనున్నట్లు వివరించారు. -
యూఎస్‌కు భారతీయ బొమ్మలు
ప్యారిస్: భారత్‌లో తయారైన బొమ్మలను దిగుమతి చేసుకునేందుకు యూఎస్, యూరప్‌కు చెందిన దిగ్గజ కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయి. ఈ సంస్థలు పెద్ద ఎత్తున బొమ్మలను కొనుగోలు చేసి ఆయా దేశాల్లో విక్రయించాలని భావిస్తున్నాయని ప్రభుత్వ అధికారుల సమాచారం. అంతేకాదు అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా తయారీ చేపట్టేందుకు వీలుగా ఇక్కడి కంపెనీలకు సాయం అందించేందుకూ ముందుకు రానున్నాయి. దేశీయంగా బొమ్మల తయారీని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్న డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ, ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ).. ఎగుమతులను పెంచడానికి విదేశీ కంపెనీలతో భాగస్వామ్యానికి కూడా సహాయం చేస్తోంది. డీపీఐఐటీ తోడ్పాటు.. బొమ్మల కొనుగోలుకై ఇటీవలే యూఎస్‌కు చెందిన ప్రముఖ రిటైల్ కంపెనీ ఒకటి ఇక్కడి పరిశ్రమను సంప్రదించిందని ప్లేగ్రో టాయ్స్ ప్రమోటర్, టాయ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ మను గుప్తా తెలిపారు. రూ.3,280 కోట్ల విలువైన రైడ్ ఆన్, ఔట్‌డోర్, మెకానికల్, ఎలక్ట్రికల్ టాయ్స్‌ను దిగుమతి చేసుకునేందుకు ముందుకు వచ్చిందని చెప్పారు. అలాగే ఇటలీ కంపెనీ సైతం ఆసక్తి చూపుతోందని వెల్లడించారు. ప్రపంచ దిగ్గజ కంపెనీలతో భాగస్వామ్యానికి, ఆర్డర్లు పొందేందుకు ఇక్కడి కంపెనీలకు డీపీఐఐటీ తోడ్పాటు అందిస్తోందని వివరించారు. భారత కంపెనీల్లో పనిచేస్తున్న కార్మికులకు నైపుణ్యం మెరుగుపరిచేందుకు విదేశీ కంపెనీలు చేయి అందించనున్నాయని తెలిపారు. విదేశీ సంస్థలతో చేతులు కలిపేందుకు 82 భారతీయ కంపెనీలు అడుగు ముందుకు వేశాయన్నారు. ఎగుమతులు ఇలా.. భారత్ నుంచి 2022–23 ఏప్రిల్–డిసెంబర్ కాలంలో రూ.1,017 కోట్ల విలువైన ఆట వస్తువులు ఎగుమతి అయ్యాయి. 2021–22లో వీటి విలువ రూ.2,601 కోట్లు. 2013–14 ఏప్రిల్–డిసెంబర్లో ఇక్కడి నుంచి విదేశాలకు చేరిన బొమ్మల విలువ కేవలం రూ.167 కోట్లు మాత్రమే. విదేశాల నుంచి భారత్‌కు దిగుమతైన బొమ్మల విలువ 70 శాతం క్షీణించి 2021–22లో రూ.870 కోట్లుగా ఉంది. 20 శాతంగా ఉన్న దిగుమతి సుంకం 2020 ఫిబ్రవరిలో 60 శాతానికి చేర్చుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం దిగుమతి సుంకం 70 శాతం ఉంది. దిగుమతులను నిరుత్సాహపర్చడం, దేశీయంగా తయారీని ప్రోత్సహించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ చర్యలకు ఉపక్రమించింది. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకాన్ని బొమ్మల తయారీకి వర్తింపజేయాలని కేంద్రం భావిస్తోంది. -
5 ఏళ్ల పాప... ఆడుకుంటుంది అనుకున్న తల్లికి ఊహించని షాకిచ్చింది!
ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారంటే తల్లిదండ్రులు కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ మధ్య కాలంలో చిన్నారులు ఆట బొమ్మలకంటే స్మార్ట్ఫోన్లతోనే కాలంక్షేపం చేస్తున్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు బొమ్మలతో ఆడుకున్నట్లే ఫోన్లతో ఆడుకుంటున్నారని లైట్ తీసుకుంటున్నారు. ఆ తర్వాత జరిగే పరిణామాలను చూసి కంగుతింటున్నారు. తాజాగా ఓ ఐదేళ్ల చిన్నారి తన తల్లికి ఊహించని షాకిచ్చింది. ఈ ఘటన అమెరికాలో వెలుగు చూసింది. మసాచుసెట్స్‌కి చెందిన జెస్సికా నూన్స్ అనే మహిళ కారులో వెళ్తుండగా తన ఐదేళ్ల కూతురు లీల గోల చేస్తూ ఉంది. దీంతో పాపకి తన ఫోన్ ఇవ్వడంతో సైలెంట్ అయ్యింది. అయితే ఫోన్లో గేమ్స్, లేదా వీడియోలు చూస్తూ ఉందేమో అని జెసికా అనుకుంది. అయితే లీలా మాత్రం అమెజాన్ యాప్ ఓపెన్ అందులో 3,180 డాలర్లు (భారత కరెన్సీ ప్రకారం రూ.2.46 లక్షల) బొమ్మలను ఆర్డర్ చేసింది. లీలా ఆర్డర్ చేసిన బొమ్మలలో.. 10 మోటార్‌సైకిళ్ల బొమ్మలు, ఒక జీప్ బొమ్మ, 10 జతల ఉమెన్స్ కౌగర్ల్ బూట్లు ఉన్నాయి. బైక్‌లు, జీప్ ఆర్డర్లు కలిపి 3,180 డాలర్లు ఉండగా... అందులో బూట్లే సుమారు 600 డాలర్లు ఉన్నాయి. మోటార్‌సైకిళ్లు, బూట్ల ఆర్డర్లలో సగం క్యాన్సిల్ చేసినప్పటికీ, అప్పటికే డెలివరీ చేసిన ఐదు మోటార్‌సైకిళ్లు, ఒక పిల్లల జీప్‌ను ఆమె ఆపలేకపోయింది. వీడియో గేమ్‌లు లేదా షాపింగ్ యాప్‌ల కోసం పిల్లల తల్లిదండ్రులకు తెలియకుండా ఎక్కువ డబ్బు ఖర్చు చేయడం ఇదే మొదటిసారి కాదు. తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. -
AP: ‘బొమ్మ’ అదిరింది..రాష్ట్రంలో బొమ్మల తయారీకి సర్కారు ప్రోత్సాహం
సాక్షి, అమరావతి: దేశీయ బొమ్మల పరిశ్రమ దశ తిరిగింది. ఈ రంగం ఇప్పుడు వేగంగా విస్తరిస్తోంది. ఇంతకాలం చిన్నపిల్లల ఆట వస్తువుల కోసం దిగుమతులపై ఆధారపడిన భారత్ ఇప్పుడు ఏకంగా ఎగుమతులు చేసే స్థాయికి చేరుకుంటోంది. కేవలం తొమ్మిదేళ్ల కాలంలో బొమ్మల ఎగుమతులు ఆరు రెట్లకు పైగా పెరిగాయి. 2013–14 ఆర్థిక సంవత్సరంలో దేశీయ బొమ్మల ఎగుమతులు రూ.167 కోట్లుగా ఉంటే అది 2021–22 నాటికి రూ.2,601 కోట్లకు చేరుకుంది. కానీ, దేశీయ ఎగుమతులు భారీగా పెరుగుతున్నప్పటికీ అంతర్జాతీయ బొమ్మల మార్కెట్లో ఇది ఒక శాతంలోపే ఉంది. ప్రస్తుతం అంతర్జాతీయ బొమ్మల ఎగుమతుల మార్కెట్ విలువ రూ.12,64,000 కోట్లుగా ఉంది. భారత్ నుంచి వీటిని దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో అమెరికా మొదటి స్థానంలో ఉంది. ఇక దేశీయ బొమ్మల ఎగుమతుల్లో 77 శాతం అమెరికాకే జరిగినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇదే సమయంలో దేశంలో బొమ్మల దిగుమతులు భారీగా పడిపోయాయి. 2018–19లో భారత్ రూ.2,960 కోట్ల విలువైన ఆట బొమ్మలను దిగుమతి చేసుకుంటే అది 2021–22 నాటికి 70 శాతం తగ్గి రూ.870 కోట్లకు పరిమితమయ్యింది. ఇందులో 90 శాతం చైనా నుంచే వస్తున్నాయి. ‘వోకల్ ఫర్ లోకల్ టాయ్స్’తో సత్ఫలితాలు మరోవైపు..స్థానిక ఆట బొమ్మలను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘వోకల్ ఫర్ లోకల్ టాయ్స్’ విధానం సత్ఫలితాలిస్తోంది. దేశీయ ఆట బొమ్మల మార్కెట్‌ను ఎటువంటి ప్రమాణాల్లేని చైనా వస్తువులు ఆక్రమించడంతో కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. స్థానిక చేతి వృత్తి కళాకారులు తయారుచేసే బొమ్మలకు ప్రచారం కల్పిస్తూనే మరోపక్క దిగుమతులకు అడ్డుకట్ట పడే విధంగా వివిధ ఆంక్షలను విధించింది. ముఖ్యంగా ఆటబొమ్మల దిగుమతులపై సుంకాన్ని 2020లో 20 శాతం నుంచి ఏకంగా 60 శాతానికి పెంచింది. అంతేకాక.. పిల్లల ఆరోగ్యంపై ఎటువంటి దుష్ప్రభావం చూపకుండా ఉండేందుకు దిగుమతి అయ్యే బొమ్మలపై క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్‌ను తప్పనిసరి చేసింది. ఇదే సమయంలో బొమ్మలు తయారుచేసే ఎంఎస్ఎంఈ యూనిట్లను ప్రోత్సహించడానికి రూ.55.65 కోట్లతో ఒక ఫండ్‌ను ఏర్పాటుచేసింది. రూ.3,500 కోట్లతో మరో పథకం అదే విధంగా.. ఇతర దేశాలతో పోటీపడేలా బొమ్మల తయారీని పెద్దఎత్తున ప్రోత్సహించడానికి రూ.3,500 కోట్లతో ఉత్పత్తి ఆధారిత, ప్రోత్సాహక ఆధారిత పథకాన్ని ప్రవేశపెట్టే యోచనలో కేంద్రం ఉంది. ఈ చర్యలు రాష్ట్రంలోని బొమ్మల తయారీ కళాకారులకు చేయూతనిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రసిద్ధి చెందినఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలను వన్ డిస్ట్రిక్ వన్ ప్రోడక్ట్ కింద చేర్చి ఎగుమతులను ప్రోత్సహించేలా చర్యలు తీసుకుంటోంది. దీంతో 2021–22లో రాష్ట్రం నుంచి రూ.3.66 కోట్ల విలువైన బొమ్మలు ఎగుమతి అయినట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. -
Bureau of Indian Standards: 18వేల ఆటబొమ్మలు సీజ్
న్యూఢిల్లీ: గత నెల రోజుల వ్యవధిలో ఆర్చీస్, హ్యామ్లీస్, డబ్ల్యూహెచ్ స్మిత్ వంటి రిటైల్ స్టోర్స్ నుంచి 18,600 ఆటబొమ్మలను అధికారులు సీజ్ చేశారు. భారతీయ నాణ్యతా ప్రమాణాలకు సంబంధించిన బీఐఎస్ మార్కు లేకపోవడం, నకిలీ లైసెన్సులతో తయారు చేయడం తదితర అంశాలు ఇందుకు కారణం. బీఐఎస్ డైరెక్టర్ జనరల్ ప్రమోద్ కుమార్ తివారీ శుక్రవారం ఈ విషయాలు తెలిపారు. బీఐఎస్ ప్రమాణాలకు తగ్గట్లుగా లేని బొమ్మల విక్రయం జరుగుతోందంటూ దేశీ తయారీదారుల నుంచి ఫిర్యాదులు రావడంతో దేశవ్యాప్తంగా గత నెలలో పెద్ద విమానాశ్రయాలు, మాల్స్‌లోని బడా రిటైలర్స్ స్టోర్స్‌లో 44 సోదాలు నిర్వహించినట్లు ఆయన వివరించారు. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై తదితర విమానాశ్రాయాల్లో వేల కొద్దీ బొమ్మలను సీజ్ చేసినట్లు తెలిపారు. బీఐఎస్ చట్టం కింద నిబంధనల ఉల్లంఘనకు గాను రూ. 1 లక్ష జరిమానా మొదలుకుని జైలు శిక్ష వరకూ నేరం తీవ్రతను బట్టి శిక్షలు ఉంటాయి. -
ఈ కామర్స్ దిగ్గజాలకు మరోసారి బిగ్ షాక్, కేంద్రం నోటీసులు
సాక్షి,ముంబై: ఈ కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ సంస్థలకు భారీ షాక్ తగిలింది. నాణ్యతా ప్రమాణాలు విస్మరించి, బొమ్మల విక్రయాలపై రెగ్యులేటరీ కొరడా ఝళిపించింది. బీఐఎస్ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ) క్వాలిటీ మార్క్ లేని బొమ్మలను విక్రయించి నందుకు వినియోగదారుల రక్షణ నియంత్రణ సంస్థ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్‌లకు నోటీసులు జారీ చేసింది. నాణ్యతా ప్రమాణాలు పాటించని బొమ్మలను అక్రమంగా విక్రయిస్తున్న మూడు ఇ-కామర్స్ సంస్థలకు ఈ మేరకు నోటీసులిచ్చామని సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) చీఫ్ నిధి ఖరే ఒక ప్రకటన జారీ చేశారు. బీఐఎస్ ప్రమాణానికి అనుగుణంగా లేని బొమ్మల విక్రయాలపై ఫిర్యాదులు నేపథ్యంలో దేశంలో పలు దుకాణాల్లో దాడులు నిర్వహించామని బీఐఎస్ డైరెక్టర్ జనరల్ ప్రమోద్ కుమార్ తివారీ తెలిపారు. 44 చోట్ల గత నెలలో నిర్వహించిన దాడుల్లో ప్రధాన రిటైల్ దుకాణాల నుండి 18,600 బొమ్మలను స్వాధీనం చేసు కున్నామని వెల్లడించారు. ముఖ్యంగా దేశంలోని ప్రధాన విమానాశ్రయాలు, మాల్స్‌లో ఉన్న హామ్లీస్, ఆర్చీస్, డబ్ల్యూహెచ్ స్మిత్, కిడ్స్ జోన్ , కోకోకార్ట్‌తో సహా రిటైల్ దుకాణాలపై దాడులు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. బీఐఎస్ చట్టంలోని నిబంధనల ప్రకారం సంబంధిత వ్యాపారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తివారీ తెలిపారు. కాగా 2021, జనవరి నుంచి బీఐఎస్ నిర్దేశించిన భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని టాయ్‌మేకర్స్ కంపెనీలను ప్రభుత్వం ఆదేశించింది. నాసిరకం వస్తువులు విక్రయించినందుకుగానూ గతంలో ఈకామర్స్ సంస్థలకు సీసీపీఏ నోటీసులిచ్చిన సంగతి తెలిసిందే. -
టాయ్స్‌లో ‘రోవన్’ ద్వారా రిలయన్స్ విస్తరణ
న్యూఢిల్లీ: రిలయన్స్ రిటైల్ ఎక్కువ అమ్మకాలు నమోదయ్యే ఆట బొమ్మల మార్కెట్లో ‘రోవన్’ బ్రాండ్ ద్వారా వ్యాపారాన్ని విస్తరించాలని భావిస్తోంది. చిన్న సైజు షాపుల రూపంలో రోవన్ బ్రాండ్‌ను మరింత మందికి చేరువ చేయాలన్న ప్రణాళికతో ఉంది. టాయ్స్ పంపిణీ వ్యాపారాన్ని ఇప్పటి వరకు రోవన్ ద్వారా నిర్వహిస్తుండగా, దీన్నే ప్రధాన బ్రాండ్‌గా కస్టమర్ల ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించింది. దేశ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్) పరిధిలోని గురుగ్రామ్‌లో మొదటి ఎక్స్‌క్లూజివ్ బ్రాండ్ అవుట్లెట్ తెరవనుంది. తన టాయ్స్ అవుట్‌లెట్‌లో రోవన్ బ్రాండ్ ఆటబొమ్మలే కాకుండా, ఇతర బ్రాండ్ల అందుబాటు ధరల్లోని వాటినీ ఉంచనుంది. రిలయన్స్ రిటైల్ కింద బ్రిటిష్ టాయ్ రిటైల్ బ్రాండ్ హ్యామ్లేస్ కూడా ఉన్న విషయం తెలిసిందే. దీన్ని 2019లో కొనుగోలు చేసింది. హ్యామ్లేస్ ప్రీమియం టాయ్స్‌కు సంబంధించిన బ్రాండ్‌గా కొనసాగనుంది. రోవన్ బ్రాండ్‌ను 500–1000 చదరపు అడుగుల విస్తీర్ణం సైజు అవుట్‌లెట్స్‌తో, బడ్జెట్ ఆటబొమ్మలతో నిర్వహించాలన్నది సంస్థ ప్రణాళికగా రియలన్స్ రిటైల్ బిజినెస్ డెవలప్మెంట్ హెడ్ గౌరవ్జైన్ తెలిపారు. -
సృజన: తెలుగింటి బార్బీ
పట్టులంగా, ఓణీ కట్టిన బొమ్మలు కాళ్లకు పారాణి, నుదుటన బాసికం కట్టిన బొమ్మలు, పసుపు కొట్టే బొమ్మలు.. పందిట్లో బొమ్మలు, అమ్మవారి బొమ్మలు, అబ్బురపరిచే బొమ్మలు.. చిందేసే బొమ్మలు.. చిదిమి దీపం పెట్టుకోవచ్చు అనిపించే బొమ్మలు ..,ఎవ్వరి చూపులనైనా కట్టిపడేసేలా ఉండే బొమ్మలేవీ అంటే.. అవి దివ్య తేజస్వి చేతుల్లో రూపుదిద్దుకున్న అందమైన బొమ్మలై ఉంటాయి. వెస్ట్రన్ బార్బీ డాల్‌ను ఇండియన్ డాల్‌గా మార్చేసి, వాటిని మన సంప్రదాయ వేడుకలకు అనువుగా మార్చేసింది హైదరాబాద్ ఎఎస్‌రావు నగర్‌కు చెందిన దివ్య తేజస్వి. అమ్మాయి పుట్టుక నుంచి షష్టిపూర్తి వరకు ప్రతి వేడుకను బొమ్మల్లో అందంగానూ, అర్థవంతంగానూ చూపుతూ పది మందికి ఉపాధి కల్పిస్తోంది. భర్త ఉద్యోగరీత్యా బెంగుళూరులో ఉంటున్న దివ్య ఈ అందమైన బొమ్మల రూప కల్పన గురించి అడిగితే ఒక చిన్న ఆలోచన తన జీవితాన్ని ఎలా నిలబెట్టిందో, పదిమందికి ఆదాయవనరుగా ఎలా మారిందో నవ్వుతూ వివరించింది. ఆ వివరాలు ఆమె మాటల్లోనే... ‘‘దసరా వచ్చిందంటే బొమ్మల కొలువు గురించి ఆలోచన చేయకుండా ఉండరు. అలాగే, ఒక బొమ్మనైనా ఇంటికి తెచ్చుకుంటారు. నేను ఇంట్లోనే బొమ్మల తయారీ మొదలుపెట్టాను. పాప ముచ్చట తీర్చిన బొమ్మ అమ్మానాన్నలది వెస్ట్ గోదావరి. నాన్న ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లో స్థిరపడ్డాం. బయోకెమిస్ట్రీ చేశాను. జూనియర్ లెక్చరర్‌గా ఉద్యోగం చేసేదాన్ని. పెళ్లయ్యాక మా వారి ఉద్యోగరీత్యా బెంగుళూరు వెళ్లాను. అక్కడ టీచర్‌గా ఉద్యోగంలో చేరాను. మాకు ఓ పాప. హ్యాపీగా గడిచిపోతున్నాయి రోజులు అనుకున్న సమయంలో కరోనా మా జీవితాలను దెబ్బతీసింది. మా ఉద్యోగాలు పోయాయి. అద్దె కట్టడానికి కూడా కష్టంగా ఉన్న రోజులు. ఇంట్లో ఖాళీగా ఉంటున్నాను. ఓరోజు మా పాప తన బొమ్మకి డ్రెస్ వేసివ్వమంటే, నా చీర అంచుతో చీరకట్టి, అలంకరించి ఇచ్చాను. దాన్ని ఫొటో తీసి ఇన్‌స్టా పేజీలో పెట్టాను. ఆర్డర్లు తెచ్చిన బొమ్మలు నేను పెట్టిన బొమ్మ ఫొటో నచ్చి అమెరికా నుంచి ఒక ఎన్ఆర్ఐ ఫోన్ చేశారు. ‘నాకు ఆ బొమ్మ చాలా నచ్చింది. మా అమ్మాయి ఓణీ ఫంక్షన్ ఉంది. వచ్చినవారికి రిటన్‌గిఫ్ట్ ఇవ్వాలి. నాకు అలాంటి బొమ్మలు ఒక పదిహేను కావాలి. చేసిస్తారా..’ అంది. నాకు ఆశ్చర్యంతో పాటు ఆనందం కూడా వేసింది. ఆ నెల రెంట్ ఇవ్వకుండా ఓనర్‌తో మాట్లాడి, ఆ డబ్బుతో బార్బీ బొమ్మలు, వాటికి కావల్సిన మెటీరియల్ తీసుకొచ్చాను. వ్యాపారం అనుకోలేదు. కానీ, ముందు గణేషుడి బొమ్మ తయారు చేశాను. ఆ ముద్దు వినాయకుడిని చూసి ఆ రోజు కళ్లలో నీళ్లు వచ్చేశాయి. ఇక వెస్ట్రన్ కల్చర్‌తో ఉండే బార్బీ బొమ్మను తెలుగింటి సంప్రదాయం అద్దుకునేలా తయారు చేయడానికి చాలా ప్రయోగాలే చేయాల్సి వచ్చింది. జుట్టు రంగు, స్కిన్కలర్, కళ్లు.. వీటితో పాటు డ్రెస్సింగ్.. చాలా సమయమే తీసుకుంది. కానీ, ఒక్కో బొమ్మ తయారు చేసి, అనుకున్న సమయానికి పంపాను. ఆ ఆర్డర్ తర్వాత మరో ఆర్డర్ వచ్చింది. అలా వచ్చిన డబ్బుతో ఇంటి అద్దె కట్టాం. సందర్భానికి తగిన కానుకలు మా అమ్మనాన్నలకు నేను, చెల్లి సంతానం. మా చిన్నప్పుడు మేం ఆడుకోవడానికి మా అమ్మ క్లాత్‌తో బొమ్మలు కుట్టి, చీరలు కట్టి, వాటికి పూసలతో అలంకారం చేసేది. నాకు అదంతా గుర్తుకువచ్చింది. మన సంప్రదాయాల్లో ఎన్నో పండగలు ఉన్నాయి. వాటిని ఉదాహరిస్తూ బొమ్మలు తయారు చేసేదాన్ని. మొదట్లో అంతగా గుర్తింపు లేదు కానీ మెల్ల మెల్లగా గుర్తింపు రావడం మొదలైంది. పుట్టుక నుంచి షష్టిపూర్తి వరకు అమ్మాయి పుట్టిన నాటి నుంచి ప్రతీది వేడుకలాగే సాగుతుంది ఆమె జీవితం. ఒక ఆర్డర్ అయితే వాళ్లమ్మాయి మొదటి రోజు స్కూల్‌కి వెళుతోంది, ఆ రోజును పురస్కరించుకుని బొమ్మ కావాలని అడిగారు. ఉయ్యాల నుంచి విద్యాభ్యాసం, ఓణీ ఫంక్షన్, పెళ్లి, సీమంతం, గృహప్రవేశం, షష్టిపూర్తి ... వరకు ఇలా ప్రతి దశలోనూ జరిగే వేడుక సందర్భాన్ని తీసుకొని, దానికి అనుగుణంగా బొమ్మల సెట్స్‌ను తయారుచేయడం ప్రారంభించాను. ఆర్డర్లు పెరుగుతున్నాయి. నాతోపాటు నాకు తెలిసిన స్నేహితులు జత కలిశారు. ఆర్డర్లు పెరుగుతున్న కొద్దీ వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఒకరు డ్రెస్ కుడతారు, మరొకరు హెయిర్ బ్లాక్‌గా రావడానికి, ఇండియన్ స్కిన్ కలర్‌కి తేవడానికి, కళ్లు డిజైన్ చేయడానికి కష్టపడతారు. మొదట్లో నాకు ఒక్క బొమ్మ చేయడానికి రోజు మొత్తం పట్టేది. ఇప్పుడు 2–3 గంటలు పడుతుంది. నేను చేసిన విధానం నేర్పించి, నా పనిలోకి తీసుకున్నవారిలో కాలేజీ అమ్మాయిలు, గృహిణిలు ఉన్నారు. వాళ్ల ఇంటి వద్దే వర్క్ చేసిచ్చేవారున్నారు. హైదరాబాద్‌లో ఉన్న మా అమ్మ, చెల్లెలు కూడా ఈ బొమ్మల తయారీలో భాగమయ్యారు. మా అమ్మ, మా చెల్లెలు బొమ్మలకు జడలు, పువ్వులు కుట్టి, పంపుతారు. మా వారు షాపింగ్ చేసుకొస్తారు. ఆన్లైన్లో చూసి, నేర్చుకోవడానికి వచ్చిన అమ్మాయిలు అలంకరణలో మార్పులు చేర్పులు, ప్యాకింగ్‌లో సాయం చేస్తుంటారు. మా చెల్లెలు ‘లలిత డాల్స్’ అనే పేరుతో ఉన్న ఇన్‌స్టా పేజీలో ఫొటోలన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటుంది. ఇలా కొందరి చేయూతతో నా బొమ్మలు మరింత అందంగా రూపుకడుతున్నాయి. బడ్జెట్‌కు తగినట్టు.. ఒక బొమ్మ రూ. 200 నుంచి ధర ఉంది. వెడ్డింగ్ సెట్ అయితే రూ. 15000 వరకు ఉంటుంది. తక్కువ ధరలో సెట్ కావాలంటే అందుకు తగినట్టు కస్టమైజ్ చేసి ఇస్తున్నాను. ఇది దసరా సమయం కాబట్టి, అమ్మవారి బొమ్మలు, బతుకమ్మ ఆడుతున్న మహిళల బొమ్మల సెట్.. తయారుచేశాను. హైదరాబాద్‌లోని ఎఎస్‌రావునగర్‌లో ఇప్పుడు ఎగ్జిబిషన్ పెట్టాం. అమ్మాయి జీవితంలో ముఖ్యమైన ఘట్టాలతో పాటు పౌరాణిక గాధలు కూడా ఈ బొమ్మల ద్వారా చూపుతున్నాను’’ అని వివరించింది ఈ కళాకారిణి. – నిర్మలారెడ్డి -
మేడిన్ ఇండియా బొమ్మల హవా
చెన్నై: లెగో, బార్బీ లాంటి విదేశీ ఉత్పత్తులను పక్కన పెట్టి దేశీయంగా మన ఆటలు, బొమ్మలు, ఆట వస్తువులకు డిమాండ్ పెరుగుతోంది. బొంగరాలు, విక్రమ్ బేతాళ్ పజిళ్లు, ఇతరత్రా దేశీ థీమ్స్‌తో తయారవుతున్న ఆటవస్తువులపై పిల్లలు ఆసక్తి చూపుతున్నారు. టాయ్స్ పరిశ్రమకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం గతేడాది నిర్దిష్ట నిబంధనలను తప్పనిసరి చేయడంతో కొన్ని రకాల బొమ్మలను దిగుమతి చేసుకోవడం కొంత తగ్గింది. అదే సమయంలో దేశీ టాయ్స్ తయారీ సంస్థలు కూడా వినూత్నంగా ఆలోచించడం మొదలుపెట్టాయి. భారతదేశంలోని వివిధ ప్రాంతాల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే ఉత్పత్తులను రూపొందించడంపై దృష్టి పెట్టాయి. మార్కెట్ లీడర్లయిన ఫన్‌స్కూల్, హాస్బ్రో, షుమీ లాంటి సంస్థలు ఆట వస్తువులు, గేమ్స్‌ను రూపొందిస్తున్నాయి. జన్మాష్టమి మొదలుకుని రామాయణం వరకు వివిధ దేశీ థీమ్స్ కలెక్షన్లను కూడా తయారుచేస్తున్నాయి. పిల్లలు ఆడుకునే సమయం కూడా అర్థవంతంగా ఉండాలనే ఆలోచనా ధోరణి కొత్త తరం పేరెంట్స్‌లో పెరుగుతున్న నేపథ్యంలో ఇలాంటివి హాట్ కేకులుగా అమ్ముడవుతున్నాయి. సంప్రదాయ భారతీయ గేమ్స్‌కు ఊహించిన దానికన్నా ఎక్కువ స్పందనే లభిస్తోందని ఫన్‌స్కూల్ వర్గాలు తెలిపాయి. దీంతో తాము బొంగరాలు, గిల్లీడండా (బిళ్లంగోడు) లాంటి ఉత్పత్తులను కూడా ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నాయి. తాము చిన్నప్పుడు ఆడుకున్న బొమ్మలు, ఆటల్లాంటివి తమ పిల్లలకు కూడా పరిచయం చేయాలన్న ఆసక్తి సాధారణంగానే తల్లిదండ్రుల్లో ఉంటుందని, ఇది కూడా దేశీ గేమ్స్ ఆదరణ పొందడానికి కారణమవుతోందని హాస్బ్రో ఇండియా వర్గాలు పేర్కొన్నాయి. ఈ బొమ్మలు, గేమ్స్ మొదలైనవి పూర్తిగా దేశీయంగానే తయారవుతున్నాయని, దీనితో స్థానికంగా కొనుగోళ్లు, తయారీకి కూడా ఊతం లభిస్తోందని వివరించాయి. తాము మోనోపలీ ఆటను తమిళంలో కూడా అందుబాటులోకి తెచ్చామని, దీన్ని తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో కూడా ప్రవేశపెట్టే యోచనలో ఉన్నామని పేర్కొన్నాయి. అటు జన్మాష్టమి కలెక్షన్ ఆవిష్కరించిన ఆటవస్తువుల కంపెనీ షుమీ కొత్తగా దీపావళి కలెక్షన్‌ను కూడా ప్రవేశపెడుతోంది. 90 శాతం వాటా అసంఘటిత సంస్థలదే.. దేశీ టాయ్స్ మార్కెట్ 1.5 బిలియన్ డాలర్లుగా ఉంటుందని అంచనా. ఇందులో సింహభాగం 90 శాతం వాటా అసంఘటిత సంస్థలదే ఉంటోంది. అంతర్జాతీయంగా టాయ్స్ మార్కెట్ 5 శాతం మేర వృద్ధి చెందుతుంటే మన మార్కెట్ మాత్రం 10–15 శాతం వృద్ధి నమోదు చేస్తోంది. దీంతో వచ్చే రెండేళ్లలో మార్కెట్ పరిమాణం 2–3 బిలియన్ డాలర్లకు చేరవచ్చన్న అంచనాలు ఉన్నాయి. ఎంతో కాలంగా భారత్‌లో దేశీ ఆటవస్తువులు, బొమ్మలు, గేమ్స్‌కు డిమాండ్ ఉన్నప్పటికీ తయారీ సంస్థలు ఇప్పుడు దాన్ని గుర్తిస్తున్నాయని టాయ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా జనరల్ సెక్రటరీ శరద్ కపూర్ తెలిపారు. -
మాకూ పీఎల్ఐ స్కీమ్ ఇవ్వండి : టోయ్స్ పరిశ్రమ
న్యూఢిల్లీ: ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకాన్ని తమకూ వర్తింపచేయాలని, ప్రత్యేకంగా ఎగుమతి ప్రోత్సాహక మండలిని ఏర్పాటు చేయాలని ఆట వస్తువుల పరిశ్రమ వర్గాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. ఉద్యోగాల కల్పనకు, ఎగుమతులను పెంచేందుకు ఇవి దోహదపడగలవని పేర్కొన్నాయి. ఇటు దేశీయంగా తయారీకి, అటు ఎగుమతులకు ప్రోత్సాహం ఇచ్చేందుకు ఉద్దేశించిన పీఎల్ఐ స్కీము ప్రస్తుతం ఫార్మా తదితర 14 రంగాలకు వర్తిస్తోంది. ఈ నేపథ్యంలో టాయ్స్ పరిశ్రమ విజ్ఞప్తి ప్రాధాన్యం సంతరించుకుంది. (Hero Motocorp: విడా ఈవీ: తొలి మోడల్ కమింగ్ సూన్) ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు పరిశ్రమకు సహాయకరంగా ఉంటున్నప్పటికీ పీఎల్ఐ స్కీము, ఎగుమతుల ప్రోత్సాహక మండలి ఏర్పాటు చేస్తే మరింత తోడ్పాటు లభించగలదని లిటిల్ జీనియస్ టాయ్స్ సీఈవో నరేశ్ కుమార్ గౌతమ్ చెప్పారు. అలాగే పరిశ్రమ భవిష్యత్ వృద్ధికి దిశా నిర్దేశం చేసేలా ప్రభుత్వం జాతీయ టాయ్ పాలసీ రూపొందించే అంశాన్ని కూడా పరిశీలించాలని ఆయన కోరారు. మరోవైపు, ప్రస్తుతం టాయ్స్ పరిశ్రమను హస్తకళలు లేదా క్రీడా వస్తువుల కింద వర్గీకరిస్తున్నారని అలా కాకుండా దీని కోసం ప్రత్యేకంగా ఎగుమతి మండలిని ఏర్పాటు చేస్తే మరింత ప్రాధాన్యం దక్కేందుకు అవకాశం ఉంటుందని నట్‌ఖట్ టాయ్స్ ప్రమోటర్ తరుణ్ చేత్వాని అభిప్రాయపడ్డారు. ఎగుమతులకు భారీ అవకాశాలు ఉన్నాయని, పరిశ్రమ ప్రస్తతుం తయారీపై దృష్టి పెడుతుండటంతో చైనా వంటి దేశాల నుంచి దిగుమతులు గణనీయంగా తగ్గాయని వివరించారు. ఎగుమతులు 61 శాతం అప్.. గడిచిన మూడేళ్లలో ఆటవస్తువుల ఎగుమతులు 61 శాతం పెరిగాయని ప్లేగ్రో టాయ్స్ ఇండియా ప్రమోటర్ మను గుప్తా తెలిపారు. ఇవి 2018–19లో 202 మిలియన్ డాలర్లుగా ఉండగా 2021–22లో 326 మిలియన్ డాలర్లకు చేరాయని వివరించారు. మరోవైపు గత మూడేళ్లలో దిగుమతులు 70 శాతం తగ్గాయని, 371 మిలియన్ డాలర్ల నుంచి 110 మిలియన్ డాలర్లకు దిగి వచ్చాయని వాణిజ్య శాఖ గణాంకాలను ఉటంకిస్తూ పేర్కొన్నారు. చాలా మటుకు దిగుమతిదారులు దిగుమతులను తగ్గించుకుని, స్థానికంగా ఉత్పత్తి చేసేందుకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహక చర్యలు సహాయపడుతున్నాయని చెప్పారు. -
చిట్టి మెదళ్లకు చెట్టు పాఠాలు
చల్లని గాలి కావాలంటే ఏసీ ఉంటే చాలు కదా అనుకుంటారు పిల్లలు. మంచి నీళ్లు కావాలంటే ఫ్రిజ్‌లోంచి వస్తాయి కదా అనుకుంటారు. పండ్లు కావాలంటే మార్కెట్ నుంచి తెచ్చుకోవచ్చు కదా అంటారు. పాలు ప్యాకెట్ల నుంచే వస్తాయని అనుకునే రేపటి తరం ‘పర్యావరణం’ అనే పెద్ద పదం గురించి అర్థం చేసుకోవాలంటే వారి బుర్రలకు మొక్కను పరిచయం చేయాల్సిందే! ‘అయితే అందుకు, ఇంట్లో పెద్దలే పూనుకోవాలి’ అంటారు హైదరాబాద్ మణికొండలో ఉంటున్న సోదరీమణులు రాజశ్రీ, నవ్యశ్రీ. చదువుకుంటూ, సొంతంగా ఫ్యాషన్ డిజైనర్స్గా రాణిస్తున్న ఈ అక్కాచెల్లెళ్లు ఈ వేసవిలో ఓ కొత్త ఆలోచన చేశారు. ఫ్యాబ్రిక్ ప్లాంట్ టాయ్స్ చేసి, చుట్టుపక్కల పిల్లలకు ఇస్తే బాగుంటుంది కదా అనుకున్నారు. అదే ఆచరణలో పెట్టారు. పిల్లలను ఆకట్టుకునేలా ఫ్యాబ్రిక్ ప్లాంట్ టాయ్స్ చేయడం మొదలుపెట్టారు. ‘కాస్త ఫ్రీ టైమ్ కేటాయించుకునే చేస్తున్నాం. కానీ, ఒక టాయ్ పూర్తవడానికి వారం రోజులైనా పడుతుంది’ అంటున్నారు. గ్యాడ్జెట్స్‌కు కాస్త దూరంగా! ఎండ అని పిల్లలు ఎక్కువ శాతం ఇంటి పట్టునే ఉంటున్నారు. స్కూళ్ళు లేకపోవడంతో కాస్త పెద్ద పిల్లలు కూడా ఇంటికే పరిమితం అయ్యారు. ఫోన్లు, టీవీలు, ల్యాప్‌టాప్ స్క్రీన్లకు తమ కళ్లను అప్పజెప్పేసి వీడియోగేమ్స్‌తో కుదురుగా కూర్చుంటున్నారు. ‘గ్యాడ్జెట్స్‌తో ఉండే పిల్లలకు పర్యావరణం గురించి క్లాసు తీసుకుమంటామంటే వింటారా. మనమే ఇప్పుడు అమ్మో, ఏం ఎండలు.. వేడికి తట్టుకోలేకపోతున్నాం..’, ‘చల్లని గాలి అన్నదే కరువైంది. అన్నీ బిల్డింగ్లే... చెట్లు ఎక్కడ ఉన్నాయి’ అంటూ అల్లాడిపోతున్నాం. మరి పిల్లలకు వాతావరణం గురించి అర్థమయ్యేదెలా..?’ అనిపించింది. మా సొంత ఊరు వరంగల్‌కి వెళ్లినప్పుడు ఈ భావన మరింత బలపడింది. పట్టణాలలో ఉన్న పిల్లలకు చెట్ల గురించి, వాటి పెంపకం గురించి తక్కువ తెలుసు అని. వీటిని కొంతవరకైనా అర్థమయ్యేలా ఆసక్తికరంగా చెప్పడం కోసం ఏం చెయ్యాలా అని ఆలోచించాను’ అని వివరిస్తుంది నవ్యశ్రీ. బొమ్మలతో వివరణ.. ‘పిల్లలకు బొమ్మలంటే చాలా ఇష్టం. కానీ, వాటిలోనూ హానికారకమైనవే ఉన్నాయి. నర్సరీ పిల్లల బుర్రల్లోకి మంచి ఆలోచనలు వచ్చేవిధంగా, అలాగే వారి శరీరానికి, ఆరోగ్యానికి ఏ మాత్రం హాని చేయని బొమ్మలైతే బాగుంటుందనిపించింది. ఈ విషయంగా శోధిస్తున్నప్పుడు ఫ్యాబ్రిక్ ప్లాంట్స్ బొమ్మల ఐడియా బాగా నచ్చింది’ అంటూ తాము ఎంచుకున్న పర్యావరణ కాన్సెప్ట్‌ను తెలియజేసింది రాజశ్రీ. కొబ్బరి చిప్పలు, వెదురు కొమ్మలు, మట్టి కుండలలో చిన్న చిన్న మొక్కల పెంపకం తెలిసిందే. ఐదేళ్ల లోపు పిల్లల శరీరానికి, మనసుకు హత్తుకునేలా చెప్పగలిగేదే ప్లాంటేషన్. అది ఎప్పుడూ ముచ్చటైనదే. ఫ్యాబ్రిక్‌తో మేకింగ్.. ‘టెడ్డీబేర్ క్లాత్‌ను ఉపయోగించి, బొమ్మ ఆకారం వచ్చేలా చేశాను. అందులో కొంత కోకోపిట్ నింపి, తల భాగంలో హెయిర్ ఎలా అయితే ఉంటుంది, అలా గోధుమ గడ్డి పెరిగేలా ఏర్పాటు చేశాను. అక్క వాటికి కళ్లూ, ముక్కు.. వంటివి పెట్టి ఆర్టిస్టిక్‌గా తయారుచేసింది. బొమ్మ తలభాగంలో పైన కొన్ని నీళ్లు చల్లుతూ ఉంటే వారం రోజుల్లో మొలకలు ఏపుగా పెరిగాయి. అప్పుడు మా చుట్టుపక్కల పిల్లలను పిలిచి, చూపించాం. ఎంత ఆనందించారో మాటల్లో చెప్పలేం. రోజంతా ఈ ప్లాంట్ బొమ్మలతోనే గడిపాశారు. ఆ సమయంలో వాతావరణం గురించి, చెట్ల గురించి ఎన్నో విషయాలు మాట్లాడాం. తరవాత వాటిని వారికే ఇచ్చేశాం. వరి, ఇతర చిరుధాన్యాలతోనూ ఇలాంటి బొమ్మలను సిద్ధం చేశాం. వీలున్నప్పుడల్లా చేస్తున్నాం. పాత క్లాత్స్తో తయారు చేసిన ప్లాంట్ టాయ్స్‌ని పిల్లలచేతే తయారుచేయించవచ్చు. ఇందుకు ఈ వేసవి సమయం మరింత అనువైది’’ అని తమ ప్రయత్నం గురించి వివరించింది నవ్యశ్రీ. ఆడుకున్నా మేలే.. పిల్లలకు ఈ బొమ్మలు ఏ మాత్రం హానిచేయవు. పొరపాటున నోట్లో పెట్టుకున్నా ఏ హానీ కలగదు. పైగా గోధుమగడ్డి వంటివి ఆరోగ్యానికి మంచివే. వారి ముందే బొమ్మల హెయిర్(గడ్డి) కత్తిరించి జ్యూస్ చేసి, ఇవ్వచ్చు. పిల్లలు ఈ విధానాన్ని బాగా ఆనందిస్తారు. ఈ ప్లాంట్స్‌తో మొక్కలను ఎలా పెంచవచ్చు, చెట్లు వాతావరణానికి, ఆరోగ్యానికి చేసే మేలేమిటి.. వంటివన్నీ చెప్పవచ్చు. దీనికి పెద్దగా కష్టపడక్కర్లేదు’ కూడా అని వివరిస్తున్నారు ఈ అక్కాచెల్లెళ్లు. రేపటì పర్యావరణ సమతుల్యతకు ఈ రోజే జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. అందుకు, పిల్లల్లో మొక్కల పెంపకం పట్ల ఆసక్తి ఎలా పెంచవచ్చో ఇంటి నుంచే మొదలుపెట్టవచ్చు. వాతావరణ కాలుష్యానికి కారకమయ్యే ప్రతీ విషయాన్ని వివరించి, మనం జాగ్రత్తపడటంతో పాటు రేపటితరాన్నీ అప్రమత్తం చేయచ్చు. – నిర్మలారెడ్డి -
‘బొమ్మ’కు బాసట
సాక్షి ప్రతినిధి విజయవాడ : కొండపల్లి బొమ్మల పరిశ్రమకు పూర్వ వైభవం తెచ్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. బొమ్మల తయారీకి అవసరమయ్యే కలపనిచ్చే చెట్ల పెంపకానికి ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు అటవీశాఖ అధికారులు, బొమ్మల తయారీదారులతో ఇటీవల సమావేశమై పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చర్చించారు. బొమ్మల తయారీకి అవసరమైన కలప గతంలో అందుబాటులో ఉండేదని, ఇప్పుడు తెలంగాణ సరిహద్దు ప్రాంతాలైన వీరులపాడు, ఎ.కొండూరు అటవీ ప్రాంతాల నుంచి తెచ్చుకుంటున్నట్టు బొమ్మల తయారీదారులు తెలిపారు. ఈ చెట్లు అంతరించిపోతున్నాయని, బొమ్మలు తయారు చేసే కళాకారుల సంఖ్యా తగ్గిపోతోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో చెట్ల పెంపకానికి అవసరమైన స్థలాన్ని పరిశీలించి, ఉపాధి హామీ పథకం కింద మొక్కలు పెంచేలా చర్యలు తీసుకోవాలని అటవీశాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. తెల్లపొని చెట్లతో కలప బ్యాంకు ఏర్పాటు చేయాలన్నారు. ఈ పరిశ్రమను ప్రోత్సహించేలా యువతకు శిక్షణ సదస్సులు నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు. అలా వచ్చి.. ఇలా! కొండపల్లి ఖిల్లా రాజభవనాల నిర్మాణంలో డిజైన్లు(నక్సే) చేసేందుకు 400 ఏళ్ల కిందట రాజస్థాన్ నుంచి వచ్చిన హస్తకళాకారులు.. రాజుల కాలం అంతరించాక బొమ్మల తయారీ పరిశ్రమను జీవనోపాధిగా ఎంచుకుని ఇక్కడే స్థిరపడ్డారు. కొండపల్లి అడవుల్లో లభించే తెల్లపొని చెట్ల నుంచి లభించే చెక్కతో బొమ్మల తయారీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వారి శిక్షణలో స్థానికులు సైతం పరిశ్రమలు ఏర్పాటు చేసుకున్నారు. బొమ్మల తయారీ, ఉత్పత్తుల్లో అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన పరిశ్రమ.. నేడు కలప కొరతతో కొంత నిరాదరణకు గురైంది. గతంలో మొత్తం బొమ్మల పరిశ్రమ కుటుంబాలు 250 ఉండగా.. ప్రస్తుతం 45 కుటుంబాలు మాత్రమే బొమ్మలను తయారు చేస్తున్నాయి. మళ్లీ పూర్వ వైభవం దిశగా.. డిమాండ్ ఉన్న బొమ్మలను మనసుకు హత్తుకునేలా వివిధ ఆకృతుల్లో మలిచి రంగులద్ది.. అమ్మకాలకు ఉంచుతారు. ఎడ్లబండి, కల్లుగీత తాటిచెట్టు, దశావతారాలు, ఏనుగు అంబారీ, ఆవుదూడ, గంగిరెద్దు, అర్జునుడి రథం, తాటిచెట్టు బొమ్మలను అత్యంత నైపుణ్యంతో తీర్చిదిద్దడంతో పాటు.. దేవతామూర్తుల బొమ్మలను జీవం ఉట్టిపడేలా తయారు చేస్తారు. కుటుంబ సభ్యులంతా కలిసి కుటీర పరిశ్రమలా పనిచేసి ఈ బొమ్మలను తయారు చేస్తారు. ప్రధాని నరేంద్ర మోదీ సైతం మన్‌కీబాత్‌లో కొండపల్లి బొమ్మల పరిశ్రమ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటాలని ప్రస్తావించడం, ‘ఒక జిల్లా.. ఒక ఉత్పత్తి’ ప«థకంలో అంతర్జాతీయ ఆన్లైన్ మార్కెటింగ్‌కు రాష్ట్ర పరిశ్రమ శాఖ సన్నాహాలు చేస్తుండటంతో కొండపల్లి బొమ్మల పరిశ్రమకు పూర్వవైభవం వస్తుందని బొమ్మల తయారీదారులు ఆశిస్తున్నారు. మళ్లీ మంచిరోజులు.. బొమ్మల పరిశ్రమ అభివృద్ధికి వన సంరక్షణ సమితులు ద్వారా తెల్లపొని వనాలు పెంచాలి. నైపుణ్యం కోసం శిక్షణ కేంద్రాన్ని కూడా నెలకొల్పితే బాగుంటుంది. ప్రభుత్వం తెల్లపొని కలపను సబ్సిడీపై అందించడంతో పాటు.. అంతర్జాతీయ స్థాయిలో ఆన్లైన్ మార్కెటింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలి. కలెక్టర్ తీసుకుంటున్న చొరవతో పరిశ్రమకు మంచిరోజులొస్తాయన్న నమ్మకం ఉంది. – కె.వెంకటాచారి, బొమ్మల కళాకారుడు -
కొండపల్లి బొమ్మ.. తరతరాల జ్ఞాపకం
‘కొండపల్లి కొయ్యబొమ్మ... కోటగట్టి కూచుందమ్మ...’ అని పాడుకోవడానికే కాదు.. కొండపల్లి బొమ్మ పాటకు తగ్గట్టే తరతరాలకు జ్ఞాపకంగా మిగిలిపోతుంది కూడా. అమ్మకు చిన్నప్పుడు తిరునాళ్లలో తాతయ్య కొనిచ్చిన ‘అమ్మాయి– అబ్బాయి’ బొమ్మ ఉంటుంది. అన్నయ్య కొనిపించుకున్న ఎడ్లబండి అదే షెల్ఫ్‌లో చోటు చేసుకుంటుంది. నానమ్మ ముచ్చటపడి తెచ్చుకున్న దశావతారాల బొమ్మ ఉండనే ఉంటుంది. కొండపల్లి బొమ్మ ఒకసారి ఇంట్లో షోకేస్‌లోకి వచ్చిందంటే ఇక తరాలు మారినా ఆ బొమ్మ చెక్కు చెదరదు. బొమ్మ చెక్కు చెదరదు... కానీ ఇటీవల బొమ్మలు చేసే వాళ్లు కనుమరుగైపోతున్నారు. వందలాది కుటుంబాలు ఈ కళను కొనసాగించలేక ఇతర వృత్తుల్లోకి వెళ్లిపోయాయి. ఈ దశలో కళను బతికించుకోవడానికి, కళతోనే తమ బతుకును నిర్మించుకోవడానికి ముందుకు వచ్చారు మహిళలు. బావుదరి పట్టారు! నలభై ఏళ్ల కిందట కొండపల్లి కళాకారుల చేతిలో 84 రకాల కళాఖండాలు రూపుదిద్దుకునేవి. ఇప్పుడా సంఖ్య ఐదారుకు మించడం లేదు. ఈ కళ మీద ఆధారపడి ఉపాధి పొందే పరిస్థితులు సన్నగిల్లడంతో ఈ తరం యువకులు ఎవరూ ముందుకు రావడం లేదు. కళ అంతరించిపోవడానికి ఎంతోకాలం పట్టదనే పరిస్థితి పదేళ్ల కిందటే మొదలైంది. ఈ దశలో మహిళలు ముందుకు వచ్చారు. ఇంతవరకు మగవాళ్లు బొమ్మలు చేస్తుంటే, మహిళలు ఆ బొమ్మలకు రంగులు వేయడం, ప్యాకింగ్ వంటి సహాయక బాధ్యతలకే పరిమితమయ్యారు. ఇప్పుడు మహిళలే కలప కొట్టడం, రంపంతో కోసి చిన్న దిమ్మలు చేయడం, ఆ దిమ్మలను కుంపటి మీద ఆరబెట్టడం నుంచి బొమ్మను చెక్కి రంగులు వేయడం వరకు అన్ని పనులూ చేస్తున్నారు. ‘ఈ బొమ్మల తయారీలో ఉపయోగించే మెటీరియల్ మొత్తం సహజమైనదే. చెట్ల బెరళ్లు, కాయల పై తొక్కలు, గింజల పొడులతో రంగులు తయారు చేస్తారు. ఈ కలప మెత్తగా ఉంటుంది. కాబట్టి పిల్లలు నోట్లో పెట్టుకున్నా, ఒకరి మీద ఒకరు విసురుకున్నా అంతగా దెబ్బ తగలదు. కాబట్టి స్కూల్ కిట్ల కోసం ప్రైవేట్ స్కూళ్ల నుంచి కూడా మంచి డిమాండ్ రావచ్చ’ని ఆశాభావం వ్యక్తం చేశారు అభిహార స్వచ్ఛంద సంస్థ నిర్వహకురాలు సుధారాణి. అంతర్జాతీయ వేదికల మీద మన కొండపల్లి బొమ్మలు కనిపించాలనేది ఆమె ఆకాంక్ష. ఇన్నాళ్లూ బావుదరికి దూరంగా ఉన్న మహిళలు ఇప్పుడు తమ కెరీర్‌ని స్వయంగా చెక్కుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ల దృష్టి కార్లలో వేళ్లాడే నారింజ రంగు హనుమాన్ బొమ్మ మీద పడింది. కొండపల్లి హనుమాన్ రూపకల్పనలో మునిగిపోయారు. కార్లలో షోపీస్‌లుగా కొండపల్లి బొమ్మలు కనిపించే రోజు ఎంతో దూరం ఉండకపోవచ్చు. ఇప్పుడు మేమే చెక్కుతున్నాం! నేను ముప్పై ఏళ్లుగా ఈ పని చేస్తున్నాను. ఇప్పుడు అన్ని పనులూ నేర్చుకున్నాను. కలపను ముక్కలు చేయడం, ఆరబెట్టడం వంటివి పది బొమ్మలకు సరిపడిన మెటీరియల్ ఒకేసారి సిద్ధం చేసుకుంటాం. ఆకారాలు చెక్కడం రెండు రోజుల్లో పూర్తవుతుంది. ఈ బొమ్మల్లో మనిషి దేహం చెక్కేటప్పుడు పాదాల నుంచి తల వరకు ఒకే ముక్కలో చెక్కుతాం. చేతులను విడిగా చెక్కి అతికిస్తాం. ఆ తర్వాత తల మీద కిరీటం వంటి అలంకరణ చేసి రంగులు వేస్తాం. అడుగు ఎత్తున్న బొమ్మల జత ధర నాలుగు నుంచి ఆరువేలవుతుంది. మొదట్లో మేము లేపాక్షి హస్తకళల ఎంపోరియమ్‌కి ఇచ్చేవాళ్లం. ఇప్పుడు అభిహార సంస్థ వాళ్లు మాకు మరికొన్ని కొత్త వస్తువులు చేయడంలో కూడా శిక్షణ ఇస్తున్నారు. మేము చేసిన బొమ్మలను మార్కెట్ చేయడానికి వాళ్లకే ఇస్తున్నాం. ఇప్పుడు రోజూ పని ఉంటోంది. కొండపల్లి బొమ్మ చేయడానికి తెల్ల పొణికి చెక్క వాడతాం. ఎన్నేళ్లయినా ఈ చెక్కలో పగుళ్లు రావు. అందుకే బొమ్మలు కలకాలం అంత అందంగా ఉంటాయి. – చందూరి స్వరాజ్యం, కొండపల్లి బొమ్మల కళాకారిణి ‘చెక్క’ని విప్లవం కొండపల్లి బొమ్మల తయారీలో మహిళల శ్రమ చిన్నది కాదు. కానీ ఆ శ్రమ ప్రధాన బొమ్మ తయారీ కాకపోవడంతో వాళ్లకు ఆర్టిజాన్ గుర్తింపు కార్డు వచ్చేది కాదు. నాలుగు నెలల శిక్షణలో ఇప్పుడు మహిళలు ఎవరి సహాయమూ లేకుండా స్వయంగా బొమ్మ చేయగలుగుతున్నారు. ఇప్పుడు మహిళలు కూడా హక్కుగా ఆర్టిజాన్ కార్డు పొందవచ్చు. ఇప్పటి వరకు మహిళలకు కళాకారులుగా గుర్తింపు లేకపోవడంతో కళాఖండాల ప్రదర్శన, కళాకారుల అవార్డుల విషయంలో మహిళలు కనిపించేవాళ్లు కాదు. ఇప్పుడు ఈ మహిళలు ఆ పరిధిని చెరిపివేశారు. – సుధారాణి, అభిహార సంస్థ నిర్వహకురాలు బొమ్మల బడి! కొండపల్లి బొమ్మలు చూపుతిప్పుకోనివ్వడం లేదు. ఈ కళాకారుల చేతిలో చెక్క చక్కని బొమ్మగా ఎంత లాలిత్యంగా రూపుదిద్దుకుంటుందో వర్ణించడం సాధ్యం కాదు. ఇంత గొప్ప కళ అంతరించిపోతుంటే చూస్తూ ఊరుకోకూడదు. ఆ కళ తరతరాలకు అందాలి, ఈ కళాకారులు సంతోషంగా, ఆత్మవిశ్వాసంతో జీవించాలి. అందుకే మాకు వచ్చిన ఆలోచనలను ఆచరణలో పెడుతున్నాం. స్కూల్ కిట్‌కు ఐడియా ఇచ్చాం. ఆ కిట్‌లో తెలుగు, ఇంగ్లిష్ అక్షరమాల ఉంటాయి. అలాగే పిల్లలు లాయర్, టీచర్, డాక్టర్, రైతు, జాలరి వంటి వృత్తులను తెలుసుకోవడానికి వీలుగా ఆ బొమ్మలు చేయించాం. ఆఫీస్‌లో ఉపయోగించే ట్రే, పెన్ స్టాండ్, ఇళ్లలో ఉపయోగించే వస్తువులను కూడా ఈ మెటీరియల్‌తో చేయవచ్చు. ఇలాంటి మార్పును స్వాగతిస్తే కళాకారులకు చేతినిండా పని ఉంటుంది. ఈ కళాకారుల కోసం బీటూబీ మీటింగ్ వంటి మార్కెట్ వేదికల గురించి ఆలోచిస్తున్నాం. – విజయశారదారెడ్డి, వైస్ చైర్పర్సన్, ఏపీఎస్‌ఈఆర్‌ఎమ్‌సీ కొండపల్లి కృష్ణుడు నేను చేసిన తొలి బొమ్మ గోపికల మధ్య కృష్ణుడు. బావుదరి మీద పట్టు రావడానికి నెల రోజులు పట్టింది. అది వస్తే ఇక బొమ్మలు చేయడం ఏ మాత్రం కష్టం కాదు. మా బ్యాచ్ ట్రైనింగ్ పూర్తి కావస్తోంది. తర్వాత బ్యాచ్‌కి మరో పది మంది సిద్ధంగా ఉన్నారు. – పద్మావతి వెన్నవల్లి, శిక్షణలో ఉన్న విద్యార్థి – వాకా మంజులారెడ్డి ఫొటోలు : ఎ. బాబు, సాక్షి, ఇబ్రహీంపట్నం -
అంతరాలు దాటిన కల్లాకపటంలేని ప్రేమ
కొన్ని విషయాలు పిల్లల చూసి నేర్చుకునేలా ఉంటాయి. వాళ్ల పసిమనసు, నిష్కల్మషమైన హృదయం, అమాయకత్వంతో చేసే పనులు చాలా గొప్పగా అనిపిస్తాయి. మనకే అనిపిస్తుంది వాళ్లలా మనమెందుకు అంత స్వచ్ఛంగా లేం అని. బహుశా అందువల్లనే ఏమో చిన్నపిల్లలను దేవుడుతో సమానం అంటారు. పైగా వారి అల్లరిని చూస్తే చాలు అప్పటి వరకు ఉన్న టెన్షన్లు చికాకులు అన్ని ఎగిరిపోతాయి. ఒక్కసారిగా చాలా రిలీఫ్‌గా ఫీలవుతాం కూడా. ఇక్కడొక సన్నివేశం కూడా అచ్చం అలానే చాలా సంతోషాన్ని ఇవ్వడమే కాక మనసును కదిలించేలా చేస్తోంది. (చదవండి: కారులోనే ఆల్కహాల్ టెస్టింగ్ టెక్నాలజీ... మోతాదుకు మించి తాగితే కారు స్టార్ట్ అవ్వదు!!) అసలు విషయంలోకెళ్లితే...కియాన్ష్ దేటే అనే బాలుడు బొమ్మలు అమ్ముకునే మహిళ కొడుకు ముందు నిలబడి ఉత్సహంగా డ్యాన్స్ చేస్తాడు. పైగా ఆ బాలుడిని కూడా డ్యాన్స్ చేయమంటూ కియాన్ష్ ప్రోత్సహిస్తాడు. అయితే ఆ మహిళ కొడుకు కియాన్ష్ దగ్గరకు వచ్చి ప్రేమగా హగ్ చేసుకుంటాడు. ఒక్కసారిగా కియాన్ష్ డ్యాన్స్ చేయడం ఆపి అలా చూస్తాడు. కాసేపటికీ కియాన్ష్ కూడా ఆ మహిళ కొడుకుని ప్రేమగా ఆలింగనం చేసుకుంటాడు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియోని కియాన్ష్ తల్లి అశ్విని నికమ్ దేటే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. దీంతో ఆ వీడియో కాస్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. పైగా ఈ వీడియోకి మిలియన్లకు పైగా వ్యూస్, లైక్‌లు వచ్చాయి. (చదవండి: 48 గదులతో కూడిన తొలి పాడ్ వెయిటింగ్ రూమ్!) View this post on Instagram A post shared by Kiansh Dete & Ayansh Dete (@kiansh_ayansh) -
స్మార్ట్‌గా నేర్చుకున్నారు
నీటి కొలనులో నుంచి పైకి ఉద్భవిస్తున్నట్లున్న నిండు చంద్రుడి పెయింటింగ్ పౌర్ణమిని డ్రాయింగ్ రూమ్‌లోకి తెచ్చినట్లుంది. ఒకరినొకరు తదేకంగా చూసుకుంటున్న రాధాకృష్ణుల చిత్రం... ఎన్నెన్నో ప్రశ్నలతో మనసును ఊపిరాడనివ్వదు. జుట్టు ముడిచుట్టిన ఆదివాసీ మహిళ చిత్రం... ఆధునికత ఫ్యాషన్ రీతులను ప్రశ్నిస్తున్నట్లు ఉంటుంది. వీటితోపాటు సూర్యోదయం, సూర్యాస్తమయాలు ఆ ఇంటి గోడల మీద వచ్చి వాలాయి. అడవిలో ఎగురుతున్న జింక ఈ ఇంట్లోకి తొంగి చూడడానికి వచ్చినట్లుంది ఓ చిత్రం. వీటి పక్కనే ఒక హృదయాకారంలో ‘ఐ లవ్ యూ అమ్మా’ అనే అక్షరాలు ఆ పెయింటింగ్‌ని మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తున్నాయి. హైదరాబాద్, ఈసీఐఎల్ సమీపంలోని సాయినాథపురంలోని ప్రశంస, అభిజ్ఞల ఇల్లు ఇది. ఈ బొమ్మలు వేసిన పిల్లలు అచ్చంగా పిల్లల్లాగా, స్వచ్ఛతకు ప్రతీకల్లా ఉన్నారు. ప్రశంస తొమ్మిదవ తరగతి, అభిజ్ఞ ఏడవ తరగతి. వీళ్లకు బొమ్మలు వేయడం నేర్పిన గురువు టెక్నాలజీ. నిజమే! ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది నిజం. కరోనా కారణంగా లాక్డౌన్ ప్రపంచాన్ని స్తంభింపచేస్తే ఈ పిల్లలిద్దరూ ఆ విరామాన్ని పెయింటింగ్ శిక్షణకు ఉపయోగించుకున్నారు. ఒకరి ఇంటికి మరొకరు వెళ్లడానికి భయపడే కోవిడ్ కాలంలో వాళ్లకు బొమ్మలు వేయడం నేర్పించడానికి ఏ గురువు కూడా ఇంటికి వచ్చే సాహసం చేయలేరు. ఏ గురువు కూడా తమ ఇంటికి శిష్యులను స్వాగతించే పరిస్థితి కూడా కాదు. అలాంటప్పుడు యూ ట్యూబ్ చూస్తూ పెయింటింగ్ వేయడం నేర్చుకున్నారు. రోజుకొక పెయింటింగ్ వీడియో చూస్తూ సొంతంగా ప్రాక్టీస్ చేస్తూ పూర్తి స్థాయి చిత్రకారులైపోయారు. ఏ చిత్రానికి ఏ తరహా రంగులు వాడాలో, ఎంత మోతాదులో మిశ్రమాలను కలుపుకోవాలో కూడా నేర్చుకున్నారు. లాక్డౌన్ కాలం పిల్లల బాల్యాన్ని హరించిందని, స్తబ్దుగా మార్చేసిందని ఆందోళన పడుతుంటాం. కానీ కాలం అందరికీ సమానమే. ఎవరికైనా రోజుకు ఉన్నది ఇరవై నాలుగ్గంటలే. ఆ ఇరవై నాలుగ్గంటలను ఉపయోగపెట్టుకునే వాళ్లు, నిరర్ధకంగా గడిపేసే వాళ్లూ ఉన్నట్లే... ఈ అక్కాచెల్లెళ్లు లాక్డౌన్ కాలంలో చిత్రకారిణులుగా నైపుణ్యం సాధించారు. తోటి పిల్లలకు మార్గదర్శనంగా నిలుస్తున్నారు. పిల్లలందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే. ప్రశంస, అభిజ్ఞ ఫోన్ చేతికి వచ్చింది! ‘‘నేను పదవ సంవత్సరం నుంచి బొమ్మలేస్తున్నాను. స్కూల్లో డ్రాయింగ్ కాంపిటీషన్లలో పాల్గొన్నాను కూడా. లాక్డౌన్లో రోజంతా ఇంట్లోనే ఉండేవాళ్లం. బోర్ కొట్టేది. ఆన్లైన్ క్లాసుల కోసమని అమ్మానాన్న వాళ్ల స్మార్ట్ ఫోన్లు నాకు చెల్లికి ఇచ్చేశారు. క్లాస్‌లు అయిపోయిన తర్వాత నేను యూ ట్యూబ్ సెర్చ్ చేస్తూంటే పెయింటింగ్ క్లాసుల వీడియోలు కనిపించాయి. అప్పటి నుంచి రోజూ వీడియోలు చూస్తూ నోట్స్ రాసుకునేదాన్ని. అక్రిలిక్ కలర్స్, వాటర్ కలర్స్, ఆయిల్ పెయింటింగ్స్‌లో ఏ పెయింటింగ్‌కి ఏది వాడాలో వచ్చేసింది. ఈ ఏడాది కాలంగా నేను వందకు పైగా బొమ్మలు వేశాను. మధుబని, రంగోలి ఆర్ట్‌లు, రవీంద్రనాథ్ టాగూర్, స్వామి వివేకానంద పోట్రయిట్‌లు వేశాను. పెద్ద ఆర్టిస్ట్‌ను కావాలనేది నా లక్ష్యం. టెన్త్ క్లాస్ తర్వాత పెయింటింగ్ కోసం ఎక్కువ టైమ్ ప్రాక్టీస్ చేస్తాను’’. -
Vidyun Goel: ఈ లైబ్రరీలో పుస్తకాలుండవ్! ఆడుకునే బొమ్మలు మాత్రమే..
టాయ్ బ్యాంక్, ఇది పిల్లలు డబ్బులు దాచుకునే కిడ్డీ బ్యాంకు కాదు. పిల్లలు ఆడుకునే బొమ్మల బ్యాంకు. పుస్తకాలు చదువుకోవాలనే ఆసక్తి ఉన్న పెద్దవాళ్లు లైబ్రరీకి వెళ్లి తమకు నచ్చిన పుస్తకాన్ని చదువుకున్నట్లే ఇది కూడా. అందరూ అన్ని పుస్తకాలనూ కొనుక్కోవడం సాధ్యమయ్యే పని కాదు, కాబట్టి లైబ్రరీ అనే ఒక అందమైన ప్రదేశం ఆవిష్కృతమైంది. మరి, బొమ్మలతో ఆడుకునే బాల్యాన్ని హక్కుగా కలిగిన పిల్లల గురించి ఎవరైనా ఆలోచించారా? విద్యున్ గోయెల్ ఆలోచించారు. ఆమె టాయ్ బ్యాంకు పేరుతో ఒక బొమ్మల నిలయానికి రూపకల్పన చేశారు. నాలుగేళ్ల కిందట ఆమె ప్రారంభించిన టాయ్ బ్యాంకు బొమ్మలతో ఇప్పటికి ఐదు లక్షల మంది పిల్లలు ఆడుకున్నారు. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. విద్యున్ గోయెల్ బాల్యం దాటి కాలేజ్ చదువుకు వచ్చిన సమయం అది. పైగా వాళ్ల నాన్నకు ఉద్యోగ రీత్యా బదిలీ కూడా. ఇంట్లో ఉన్న బొమ్మలన్నింటినీ ఒక చోట జమ చేస్తే ఓ గది నిండేలా ఉంది. వాటన్నింటినీ ఏం చేయాలనే ప్రశ్న అందరిలో. పారేయడానికి మనసు ఒప్పుకోదు. తమతో తీసుకువెళ్లడమూ కుదిరే పని కాదు. అప్పుడు వాళ్ల నాన్న ‘ఈ బొమ్మలన్నింటినీ వెనుక ఉన్న కాలనీలో పిల్లలకు ఇస్తే, వాళ్లు సంతోషంగా ఆడుకుంటారు’ అని సలహా ఇచ్చారు. అంతే... తన బొమ్మలతోపాటు తన స్నేహితుల ఇళ్లలో అటక మీద ఉన్న బొమ్మలను కూడా జత చేసి పంచేసింది విద్యున్ గోయెల్. అలా మొదలైన బొమ్మల పంపకాన్ని ఆమె పెద్దయిన తర్వాత కూడా కొనసాగించింది. టాయ్ బ్యాంకు పేరుతో బొమ్మలను సేకరించడం మొదలుపెట్టింది. చదవండి: Viral Video: బాబోయ్..! చావును ముద్దాడాడు.. దాదాపుగా ప్రతి ఇంట్లో పిల్లలుంటారు. వాళ్లు పెద్దయిన తర్వాత ఆ బొమ్మలు అటకెక్కుతుంటాయి. అలా తెలిసిన వాళ్లందరి నుంచి సేకరించిన బొమ్మలను ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లలకు, అంగన్వాడీ కేంద్రాలకు, షెల్టర్ హోమ్స్‌లో ఉన్న పిల్లలకు, పిల్లల హాస్పిటళ్లు, అల్పాదాయ వర్గాల కాలనీలకు వెళ్లి పంపిణీ చేయడం మొదలు పెట్టింది. ఆమె టాయ్ బ్యాంకు సర్వీస్ ఏ ఒక్క నగరానికో, పట్టణానికో పరిమితం కాలేదు. ఆమె మొదలు పెట్టిన ఈ కాన్సెప్ట్‌ను దేశవ్యాప్తంగా ఎంతోమంది అందుకున్నారు. ఇప్పటి వరకు టాయ్ బ్యాంకు బొమ్మలతో ఆడుకున్న పిల్లలు ఐదు లక్షలకు చేరి ఉంటుందని అంచనా. మనం కూడా మనవంతుగా టాయ్బ్యాంకు వితరణలో పాల్గొందాం. ఇంట్లో ఉన్న బొమ్మలను మన ఊళ్లోని అంగన్వాడీ కేంద్రానికి విరాళంగా ఇద్దాం. మన పిల్లలకు వాళ్ల జ్ఞాపకంగా ఒకట్రెండు బొమ్మలను ఉంచి మిగిలిన వాటిని బొమ్మలతో ఆడుకునే వయసు పిల్లలకు ఇద్దాం. ఇచ్చేసే బొమ్మలు కూడా ఓ జ్ఞాపకంగా ఉండాలనుకుంటే మన పిల్లల చేతనే ఇప్పిస్తూ చక్కటి ఫొటో తీసుకుంటే... పెద్దయ్యాక ఆ ఫొటోలు చూసుకుని సంతోషిస్తారు. ఆ బొమ్మలతో ఆడుకునే పిల్లలు బొమ్మల లోకంలో ఆనందంగా విహరిస్తారు. చదవండి: ఇదే అతి పె..ద్ద.. గోల్డ్ మైనింగ్! ఏటా లక్షల కిలోల బంగారం తవ్వుతారట! -
ఇదంతా నీ కోసమే రా....ఇవన్నీ నీవే
పసిహృదయాల మనస్సులు ఎంతో నిర్మలంగా, అమాయకంగా ఉంటాయి. అంతేకాదు వాళ్లు తమ స్నేహితులు బాధపడుతుంటే పెద్దవాళ్ల కంటే వాళ్లే ఎక్కువగా చొరవ తీసుకుని భలే ఊరడిస్తారు. వాళ్లు ఒకరికొకరు వారికి తోచిన రీతిలో గిఫ్ట్‌లు ఇచ్చుకుంటూ భలే సరదాగా గడుపుతుంటారు. అచ్చం అలాగే ఇక్కడోక విద్యార్థి విషయంలో జరిగింది. అసలు ఎక్కడ ఏం జరిగిందో చూద్దాం రండి. (చదవండి: చూడ్డానికి పిల్ల...కానీ చెరుకు గడలను ఎలా లాగించేస్తుందో!) అసలు విషయంలోకెళ్లితే.....తమ స్నేహితుడి ఇల్లు అనుకోని ప్రమాదంలో కాలిపోతుంది. దీంతో అతని తోటి స్నేహితులు అతని బాధను మర్చిపోయాలా అతని మంచి సర్ప్రైజ్ ఇవ్వాలని నిర్ణయించుకుంటారు. అంతే తమ స్నేహితుడు క్లాస్‌రూంలోకి రాగానే వారంతా కొత్త కొత్త బొమ్మలను గిఫ్ట్‌గా ఇస్తారు. అంతేకాదు "ఇదంతా నీకోమే రా", "ఇవన్నీ నీకే" అంటూ అందరూ రకరకలా బొమ్మలతో క్లాస్ రూమ్‌ని నింపేస్తారు. దీంతో ఆ విద్యార్థి ఒక్కసారిగా ఆశ్చర్యపోయి 'వావ్' అని గట్టిగా అరిచి ఆనందంగా వారిని కౌగిలించుకోవటానికీ రెండు చాతులు చాపుతాడు. దీంతో అతని స్నేహితులంతా ఒకేసారి అతన్ని కౌగిలించుకోవటానికి ఎగబడతారు. అయితే దీనికి సంబంధించిన వీడియోను స్కూల్ డిస్ట్రిక్ట్ ఫిలడెల్ఫియా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దీంతో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ మేరకు నెటిజన్లు ఈ వీడియో చూస్తే ఎవరి హృదయం అయినా ద్రవించిపోతుంది అంటూ రకరకాలుగా ట్వీట్ చేశారు. (చదవండి: వాట్ ఏ ఎక్స్ప్రెషన్స్...ఎవ్వరికైనా నవ్వు రావల్సిందే....) View this post on Instagram A post shared by Jay Shetty (@jayshetty) -
చైనా బొమ్మలతో డేంజర్!
Dangerous Chemicals In China Toys: మేడ్ ఇన్ చైనా బొమ్మలకు అమెరికా చెక్ పోస్ట్ వేసింది. చైనా నుంచి నౌకల్లో చేరిన బొమ్మలను దేశంలోకి రాకుండా అడ్డుకుంది. తాజాగా పోర్ట్‌లోనే సుమారు ఏడు బాక్స్‌ల బొమ్మలను అధికారులు సీజ్ చేయడం విశేషం. ఇందుకు కారణం.. బొమ్మల్లో ప్రమాదకరమైన కెమికల్స్‌ను గుర్తించడం!. చైనా నుంచి వచ్చిన బొమ్మల్లో ప్రమాదకరమైన రసాయనాల ఆనవాళ్లను అమెరికా అధికారులు గుర్తించారు. ఈ మేరకు షిప్లో వచ్చిన మేడ్ ఇన్ చైనా బొమ్మల్ని అమెరికా కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. భారత్‌లో బాగా ఫేమస్ అయిన లగోరి(స్వీట్, పల్లీ.. ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు) తరహా చైనా మేడ్ బొమ్మలూ ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది. జులై 16న చేపట్టిన కన్జూమర్ ప్రొడక్ట్స్ సేఫ్టీ కమిషన్(CPSC), సీబీపీ అధికారులు సంయుక్తంగా చేపట్టిన తనిఖీలలో ప్రమాదకరమైన కెమికల్స్ ఉన్న బొమ్మల్ని గుర్తించారు. కొన్ని బొమ్మలకు సీసం, కాడ్మియం, బేరియం పూత పూస్తున్నారని, దానివల్ల పిల్లల ప్రాణాలకు ముప్పుపొంచి ఉందని పేర్కొంటున్నారు వైద్యులు. అంతేకాదు ఆగష్టు 24న చైనా నుంచి షిప్ ద్వారా వచ్చిన కొన్ని బొమ్మల్లోనూ ఈ కెమికల్స్ ఆనవాళ్లను నిర్ధారించారు. ఈ తరుణంలో అక్టోబర్ 4న అమెరికాకు చేరుకున్న చైనా బొమ్మల్ని సీజ్ చేయడం విశేషం. మరోవైపు హాలీడే షాపింగ్ సీజన్ నేపథ్యంలో యూఎస్ కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్(సీపీబీ) అప్రమత్తమైంది. అంతేకాదు ఆన్లైన్ షాపింగ్ చేసేప్పుడు పిల్లల బొమ్మల విషయాల్లో జాగ్రత్తగా ఎంచుకోవాలని ప్రజలకు హెచ్చరిక జారీ చేసింది. ఈ ఎఫెక్ట్‌తో చైనా బొమ్మల వర్తకంపై భారీ ప్రతికూల ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది. చదవండి: చైనాలో భారీ కార్పొరేట్ పతనం తప్పదా? -
భళా వెంకటవర్షిత్: కాగితంతో బొమ్మలు తయారీ
చెన్నూర్: చిన్నారి కళా..భళాగా ఉంది. ఖాళీగా ఉంటే చాలు వివిధ రకాల కళాకృతులు తయారు చేస్తాడు. న్యూస్ పేపర్లు ఉంటే చాలు వాటితో ఏదైనా ఇట్టే తయారు చేయడంలో దిట్టా. న్యూస్ పేపర్లలో వివిధ రకాలు వాహనాలు, సెట్టింగ్‌లను తయారు చేసి అందరితో శేభాష్ అనిపించుకుంటున్నాడు. చెన్నూర్ పట్టణానికి చెందిన రెడ్డి మహేశ్, దీప్తి దంపతుల ప్రథమ కుమారుడు వెంకటవర్షిత్ కోటపల్లి మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో 7వ తరగతి చదువుతున్నాడు. చిన్నప్పటి నుంచి కొత్త ఆలోచనలతో వివిధ రకాల వస్తువులను తయారు చేయడంపై మక్కువ పెంచుకున్నాడు. కుమారుడిలోని సృజనాత్మకతను గమనించిన తండ్రి మహేశ్ ప్రొత్సహించాడు. తండ్రి ప్రొత్సహంతో వెంకటవర్షిత్ ముందుకు సాగుతున్నాడు. ఖాళీ సమయం సద్వినియోగం కరోనాతో ఏడాదిన్నర కాలంగా పాఠశాలలో ప్రతేక్ష బోధన నిలిచిపోయింది. దీంతో ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. ఖాళీ సమయంలో పనికి రాని న్యూస్ పేపర్లు, రంగుపేపర్లతో వివిధ రకాల బొమ్మలను తయారు చేయడం ప్రారంభించాడు వెంకటవర్షిత్. చిన్న చిన్న బొమ్మలను తయారు చేసిన చిన్నారి ఏకంగా వివిధ మోడళ్లలో వచ్చి మోటార్ సైకిళ్లతో పాటు వివిధ రకాల సెట్టింగ్‌లను తయారు చేస్తూ అందరి మన్ననలు పొందుతున్నాడు. రానున్న రోజుల్లో మరిన్ని రకాలు.. న్యూస్ పేపర్లతో ప్రస్తుతానికి మోటార్ సైకిళ్లలో పాటు వివిధ రకాల వస్తువులను తయారు చేశా. కరోనా సమయంలో ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకున్న. ఎన్నో రకాల బొమ్మలను తయారు చేశా. రానున్న రోజుల్లో మరిన్ని కొత్త వాహనాలతో పాటు దేవుని, జాతీయ నాయకులు బొమ్మలను తయారు చేస్తానని వెంకటవర్షిత్ తెలిపారు. పాఠశాలలు ప్రారంభమయ్యాయి. సెలవు రోజుల్లో పెద్ద వాహనాల బొమ్మలను తయారు చేస్తా. న్యూస్ పేపర్లతో బొమ్మల తయారీలో రికార్డు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్న. –రెడ్డి వెంకటవర్షిత్, విద్యార్థి, చెన్నూర్ -
దిల్లీ... మా చల్లని తల్లీ!
తాలిబన్ల భయంతో ఆ దేశం నుంచి పారిపోవడానికి సాధారణ ప్రజలు పడుతున్న కష్టాలు చూస్తుంటే కన్నీళ్లొస్తున్నాయి. చాప కింద నీరులా విస్తరిస్తున్న తాలిబన్ల ప్రాబల్యాన్ని కొన్ని సంవత్సరాల క్రితమే కొందరు మహిళలు పసిగట్టారు. వారికి భవిష్యత్ చిత్రపటం కనిపించింది. ఆ చిత్రంలో ఆయుధాలు, అణిచివేత తప్ప అభివృద్ధి ఎక్కడా కనిపించలేదు. అందుకే ప్రమాదాన్ని ఊహించి దిల్లీకి వచ్చేశారు. దిల్లీ వారి కన్నీళ్లను తుడిచి, వారికో దారి చూపిన తల్లి అయింది. 24 సంవత్సరాల మోష్గన్ మాతృభూమి అఫ్ఘాన్‌ను వదిలి వస్తున్నప్పుడు ఏంచేసి బతకాలో తెలియదు. బతకాలంటే అఫ్ఘాన్‌ను వదిలివెళ్లాలనేది మాత్రమే తెలుసు. దిల్లీకి వచ్చిన తరువాత నిస్సహాయంగా దిక్కులు చూడాల్సిన దీనస్థితి రాలేదు. దిల్లీ కేంద్రంగా పనిచేసే ‘సీలైవాలి’ అనే సామాజిక స్వచ్ఛంద సంస్థ మోష్గన్ను ఆదుకుంది. బతకడానికి ఒక దారి చూపింది. ‘సీలైవాలి’ కేంద్రంలో ఆటబొమ్మలు, గృహఅలంకరణ వస్తువులు తయారుచేస్తుంటుంది మోష్గన్. ‘పరిస్థితిని ముందే ఊహించి ఇక్కడ భద్రంగా ఉన్నందుకు సంతోషించాలో, తల్లిదండ్రులు, బంధువులు, మిత్రులు ప్రమాదం అంచున ఉన్నందుకు బాధపడాలో తెలియడం లేదు. ఈ దేశం మమ్మల్ని కన్నతల్లిలా ఆదుకొని ఆదరిస్తోంది’ అంటుంది మోష్గన్. 45 సంవత్సరాల రజియా, 23 సంవత్సరాల షబానా... మోష్గన్లా భవిష్యత్‌ను పసిగట్టి దిల్లీకి వచ్చినవారే. వీరు కూడా ‘సీలైవాలి’లో పనిచేస్తున్నారు. బొమ్మలు తయారుచేస్తూ ఉపాధి పొందుతున్నారు. ‘మనసులో భయం తప్ప, చేతిలో తెలిసిన విద్య అంటూ ప్రత్యేకంగా లేదు. అలాంటి నేను శిక్షణలో బొమ్మలు, ఇతర వస్తువుల తయారీ నేర్చుకున్నాను. నాకు పరాయి దేశంలో ఉన్నట్లుగా లేదు. మాతృభూమిలోనే ఉన్నట్లుగా ఉంది’ అంటుంది రజియా. ‘దిల్లీకి వచ్చే ముందు చాలామంది వారించారు. చావోబతుకో ఇక్కడే అన్నారు. ఎవరూ పరిచయం లేని, ఎప్పుడూ చూడని దేశంలో ఇబ్బందులు పడతావు అని హెచ్చరించారు. అయినా మొండిధైర్యంతో వచ్చాను. ఎలాంటి ఇబ్బందులు పడలేదు. విశాల ప్రపంచంలోకి వచ్చినట్లు అనిపించింది. మరోవైపు అక్కడ మా వాళ్ల పరిస్థితి చూస్తే బాధగా ఉంది’ అంటుంది షబాన. మోష్గన్, రజియా, షబానా... ఇంకా చాలామంది ఆఫ్గాన్ మహిళలకు ‘దిల్లీ’ అనేది దేశరాజధాని కాదు వారి చల్లనితల్లి. -
మట్టి కాని గట్టి బొమ్మలు
బంక మట్టితో చేసిన బొమ్మలు ఎక్కువసేపు నిలబడవు. ఎండిపోగానే పగుళ్లు వచ్చేస్తాయి. అందుకే పిల్లలు రసాయనాలతో తయారైన మట్టితో బొమ్మలు చేస్తూ ఆడుకుంటారు. ఆ మట్టిలో ప్రమాదకరమైన కిరసనాయిల్, బొరాక్స్ వంటివి ఉంటాయి. అవి పిల్లల ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తాయి. తన యేడాది వయసున్న కొడుకు మట్టితో ఆడుతుంటే దీప్తికి భయంగా ఉండేది. పిల్లవాడి ఆరోగ్యం కోసం రసాయనాలు లేని బొమ్మలు తయారు చేయాలనుకుంది దీప్తి. ఆ ఆలోచన నుంచి వచ్చినదే పర్యావరణ హితమైన మట్టి. పిల్లల కోసం బెంగళూరుకు చెందిన దీప్తి భండారీ హాని కలిగించని కృత్రిమ మట్టిని తయారు చేయడం ద్వారా ఆ మట్టితో ఆడుకునే పిల్లలకు ఆరోగ్యాన్ని చేకూరుస్తున్నారు.. తాను ఆర్థికంగా ఎదుగుతున్నారు దీప్తి. బయో కెమిస్ట్రీలో మాస్టర్స్ డిగ్రీ చేసిన దీప్తి.. టీచింగ్ మీద ఆసక్తి పెంచుకున్నారు దీప్తి. బంధువుల పిల్లలకు పాఠాలు చెబుతూ టీచింగ్ లో అనుభవం సంపాదించారు. ఆ అనుభవంతో పిల్లల కోసం ‘మిల్క్ టీత్ యాక్టివిటీ సెంటర్’ను బెంగళూరులోని చామరాజ్‌పేట్‌లో ప్రారంభించారు. పిల్లలకు పాఠాలు చెబుతూ, వృత్తి మీద ప్రేమ పెంచుకున్నారు. ఆ సమయంలోనే ఒక తల్లి పిల్లల్ని ఎలా పెంచాలనే విషయం మీద అవగాహన ఏర్పడింది దీప్తికి. పిల్లల మనస్తత్వాన్ని అర్థం చేసుకుంటూ, వాళ్లకి ఏ విధంగా చెబితే అర్థమవుతుందో తెలుసుకున్నారు దీప్తి. ‘‘పసి వయసులో నేర్చుకున్న విద్య జీవితాంతం గుర్తుండిపోతుంది. అందులో నైపుణ్యం కూడా వస్తుంది’’ అంటారు దీప్తి. ఆటల్లోనే అన్నీ... పిల్లలకు బొమ్మలతో ఆటలు నేర్పుతూ, రంగులు, ఆకారాలు, పరిమాణాల గురించి కూడా నేర్పించటం దీప్తి ప్రత్యేకత. ‘‘మా అబ్బాయి చేతి రాత బాగుండేది కాదు. కాని మట్టితో బొమ్మలు చేయడం ద్వారా అందమైన రాత అలవాటయ్యింది. అంతకుముందు పెన్సిల్ సరిగ్గా పట్టుకోలేకపోయేవాడు. ఇలా మట్టితో ఆటలు మొదలుపెట్టాక, చేతి వేళ్లు, కండరాలు బలంగా తయారు కావడంతో పెన్సిల్ చక్కగా పట్టుకోగలిగాడు. చక్కగా రాయగలుగు తున్నాడు. టీచర్‌గా నాకున్న అనుభవం మా అబ్బాయిని పెంచుకోవటానికి ఉపయోగపడింది’’ అంటారు దీప్తి. అందరూ ఆసక్తి చూపించారు ‘‘నేను పిల్లల కోసం టాడ్లర్ క్లాసులు ప్రారంభించాను. ఆ క్లాసులో పిల్లలంతా మట్టితో బొమ్మలు తయారు చేస్తారు. పిల్లలు చేసిన బొమ్మలు చూసిన తల్లిదండ్రులు ఆ మట్టి గురించి సమాచారం అడిగారు’’ అంటూ ఆనందంగా చెబుతారు దీప్తి. సాధారణంగా మార్కెట్ లో దొరికే మట్టితో చేసిన బొమ్మలు చాలా త్వర గా ఎండిపోతాయి. ఆ మట్టి ని మళ్లీ ఇంక ఉపయోగించలేం. కాని దీప్తి.. ఉప్పు, పిండి, నూనె, ఫుడ్ గ్రేడ్ కలర్స్, నీళ్లు కలిపి తయారు చేసిన మట్టి ఆరునెలల వరకు గట్టి పడకుండా ఉంటుంది. ‘‘నేను చేసిన మట్టి చూసి తల్లిదండ్రులంతా చాలా సంతోషించారు. వాళ్లకి కూడా ఈ మట్టి కావాలి అని అడిగి కొని తీసుకు వెళ్తున్నారు’’అంటున్న దీప్తి 20 వేల పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించి ఇప్పుడు నెలకు 35 వేలు సంపాదిస్తున్నారు. పిల్లలకు ఆరోగ్యంతోపాటు, తనకు ఆదాయం వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది అంటారు దీప్తి భండారీ. -
ఇక్కడి బొమ్మలే కొందాం
సాక్షి, న్యూఢిల్లీ: భారతీయులు స్థానిక బొమ్మలపై మక్కువ పెంచుకోవాలని, ఈ రంగంలోని వారంతా దేశీయ బొమ్మలకు ‘గొంతుక’ కావాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. భారత్‌లో వినియోగిస్తున్న బొమ్మల్లో దాదాపు 80 శాతం బొమ్మలను దిగుమతి చేసుకుంటున్నామని, వీటినే కొనడంతో వేలకోట్ల ధనం విదేశాలకు తరలిపోతోందని ప్రధాని ఆందోళన వ్యక్తంచేశారు. రూ.7.5 లక్షల కోట్ల విలువైన ప్రపంచ బొమ్మల మార్కెట్లో భారత్ వాటా కేవలం రూ.11 వేల కోట్లమేరకే ఉందని ఈ పరిస్థితిని పూర్తిగా మార్చాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. గురువారం వర్చువల్ వేదికగా జరిగిన టాయ్‌కాథాన్–2021లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రధాని ప్రసంగించారు. బొమ్మల ఆర్థిక వ్యవస్థ(టాయ్ ఎకానమీ–టాయ్‌కానమీ)లో భారత స్థానం మరింతగా మెరుగుపడాలని ఆయన అభిలషించారు. ఆట వస్తువుల తయారీ, గేమింగ్ పరిశ్రమల్లో ప్రపంచ విపణిలో భారత్ మరింత పురోగతి సాధించాలని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. ‘ఈ పరిశ్రమ దేశీయంగా వృద్ధిచెందితే సమాజంలో ఈ రంగంపై ఆధారపడ్డ వర్గాలకు మేలు జరుగుతుంది. గ్రామీణులు, దళితులు, పేద ప్రజలు, గిరిజనుల భాగస్వామ్యంతో దేశీయంగా చిన్నతరహా ఆట వస్తువుల పరిశ్రమ కొనసాగుతోంది. ఈ రంగంలో మహిళల పాత్ర ఎంతో ఉంది. వీరందరి జీవితాలు మరింతగా వృద్ధిలోకిరావాలంటే మనందరం స్థానిక బొమ్మలనే కొందాం’అని మోదీ పిలుపునిచ్చారు. చదవండి: Narendra Modi: సహకారంతోనే సంస్కరణలు రేషన్ కార్డు దారులకు కేంద్రం శుభవార్త! -
నైకీ, హెచ్అండ్ఎం బ్రాండ్స్‌కు చైనా షాక్
బీజింగ్: వీగర్ ముస్లింల అణిచివేత అంశంలో చైనా వైఖరిని వ్యతిరేకిస్తున్న విదేశీ కంపెనీలను కట్టడి చేయడంపై డ్రాగన్ దేశం దృష్టి పెట్టింది. ఈ క్రమంలో హెచ్అండ్ఎం, నైకీ, జారా తదితర విదేశీ బ్రాండ్స్ .. పిల్లలకు హానికరమైన బొమ్మలు, దుస్తులు మొదలైనవి దేశంలోకి దిగుమతి చేస్తున్నాయంటూ ఆరోపించింది. ఈ వారంలో అంతర్జాతీయ బాల కార్మికుల దినోత్సవం సందర్భంగా ఇలాంటి 16 కంపెనీలకు చెందిన టీ-షర్టులు, బొమ్మలు, టూత్‌బ్రష్షులు మొదలైన వాటిని ‘‘నాణ్యత, భద్రత పరీక్షలో అర్హత పొందని’’ ఉత్పత్తులుగా చైనా కస్టమ్స్ ఏజెన్సీ ఒక జాబితా తయారు చేసింది. వీటిని ధ్వంసం చేయడం లేదా వాపసు పంపడం చేస్తామని పేర్కొంది. అయితే, వివాదాస్పదమైన షాంజియాంగ్ ప్రావిన్స్ పరిణామాల గురించి గానీ, విదేశీ కంపెనీల విమర్శలను గానీ ఈ సందర్భంగా ప్రస్తావించలేదు. దుస్తులు, బొమ్మల్లో హానికారకమైన అద్దకాలు, ఇతర రసాయనాలు ఉన్నాయని మాత్రమే తెలిపింది. షాంజియాంగ్ ప్రావిన్స్‌లో వీగర్ ముస్లింలను అణిచివేస్తూ, వెట్టిచాకిరీ చేయిస్తోందంటూ చైనా ఆరోపణలు ఎదుర్కొంటోంది. అక్కడి ఉత్పత్తులను ఉపయోగించడం వల్ల తమపైనా విమర్శలు వస్తుండటంతో హెచ్అండ్ఎం ఇకపై షాంజియాంగ్ ప్రావిన్స్‌లో ఉత్పత్తయ్యే పత్తిని తమ ఉత్పత్తుల్లో వినియోగించబోమంటూ ఇప్పటికే ప్రకటించింది. ఈ ప్రకటనతో ఆగ్రహించిన చైనా ఈ-కామర్స్ కంపెనీలు తమ ప్లాట్‌ఫామ్స్ నుంచి హెచ్అండ్ఎం ఉత్పత్తులను తొలగించాయి. ఆ కంపెనీతో పాటు నైకీ, అడిడాస్ వంటి ఇతర విదేశీ బ్రాండ్స్‌కి సంబంధించిన యాప్స్‌ను కూడా యాప్ స్టోర్స్ తొలగించాయి. అయితే తాజా పరిణామంపై నైక్, జారా, హెచ్ అండ్ ఎం ఇంకా స్పందించలేదు. -
Plastic Toys: అమ్మో ‘ప్లాస్టిక్ బొమ్మ’..
సాక్షి, న్యూఢిల్లీ: మీ చిన్నారులు ఎక్కువ సమయం బొమ్మలతో ఆడుకుంటున్నారా..? ఆటల్లో భాగంగా బొమ్మలను నోట్లో పెట్టుకోవడం వంటివి చేస్తున్నారా...? అయితే మీరు ఇప్పటికైనా పిల్లల అలవాట్లను మార్చాల్సిన సమయం వచ్చేసింది. ఎందుకంటే కరోనా కారణంగా ఏడాదిగా స్కూళ్ళకు తాళం పడడంతో, చదువులంతా ఆన్లైన్లో అయిపోయేసరికి రోజంతా చిన్నారులు ఇంట్లోనే ఉంటున్నారు. అయితే ఆన్లైన్ క్లాసులు అయిపోయిన తరువాత ఖాళీ సమయం టీవీ చూడడం, బొమ్మలు వారికి వినోదంగా మారాయి. అయితే చిన్నారులు ఎక్కువగా రోజంతా తమతో పాటే ఉంచుకొనే బొమ్మల విషయంలో ఇప్పుడు ప్రతీ ఒక్కరు జాగ్రత్త పడాల్సిందేనని నిపుణులు అంటున్నారు. అంతేగాక శిశువుల చేతికి ప్లాస్టిక్ బొమ్మలను అందించే మీ అలవాటును మార్చుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే పిల్లలు ఆడుకొనే బొమ్మల విషయంలో నాణ్యతా ప్రమాణాలు ఏమేరకు ఉన్నాయనే విషయంలో ఆందోళన వ్యక్తమౌతూనే ఉంది. ఇదేమీ కేవలం మన దేశంలోని సమస్య మాత్రమే కాదు. ప్రపంచవ్యాప్తంగా చిన్నారులు ఆడుకొనే ప్లాస్టిక్ బొమ్మలు, సాఫ్ట్ టాయ్స్ ఏ మేరకు సురక్షితం అనే విషయంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఒక అంతర్జాతీయ అధ్యయనంలో, బొమ్మల తయారీలో వాడే రసాయనాల్లో సుమారు 100కు పైగా ప్రాణాంతకమైన రసాయనాలను వినియోగిస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. హార్డ్, సాఫ్ట్, ఫోం బేస్డ్ ప్లాస్టిక్‌తో తయారుచేసిన బొమ్మల్లో సుమారు 419 రసాయనాలు లభించాయని డెన్మార్క్ సాంకేతిక విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకుడు పీటర్ తెలిపారు. వీటిలోని 126 రసాయనాల కారణంగా చిన్నారుల్లో క్యాన్సర్ వంటి అనేక వ్యాధులు వచ్చేందుకు కారణమయ్యే ప్రమాదం ఉందని అభిప్రాయపడుతున్నారు. పిల్లలు ఉపయోగించే బొమ్మల్లో ఉండే ప్రాణాంతకమైన ఫ్లేమ్ రిటార్డెంట్ రసాయనంతో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని అమెరికా శాస్త్రవేత్తలు గతంలో ప్రకటించారు. ఈ ప్రమాదం చిన్నారులు ఇటీవల ఎక్కువగా ఆడుకొనే పాలిస్టర్ టన్నెల్‌తో కూడా ఉందని అధ్యయనం గుర్తించింది. పాలిస్టర్ టన్నెల్ తయారీలో వినియోగించిన మెటీరియల్‌లో ఫ్లేమ్ రిటార్డెంట్ రసాయనం ఉందని పరిశోధకులు పేర్కొన్నారు. వాణిజ్య, వినియోగదారు ఉత్పత్తులలో ఫ్లేమ్ రిటార్డెంట్ రసాయన వాడకం 1970 లో ఫ్లేమ్ ఎబిలిటీ స్టాండర్డ్‌తో ప్రారంభమైంది. అయితే మార్కెట్లో లభించే ఫ్లేమ్ రిటార్డెంట్ రసాయనంతో తయారైన అన్ని ఉత్పత్తులతో ఆరోగ్యపరంగా ప్రమాదం ఉండదని, ఈ రసాయనంతో క్లోరిన్, బ్రోమైడ్ , భాస్వరం రసాయనాలు కలిసి ఉన్న త్పత్తులతో ప్రమాదం ఉందని గుర్తించారు. ఫర్నిచర్, పిల్లల ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్స్ వస్తువులు, భవన నిర్మాణ సామగ్రి, దుస్తులు, కారు సీట్లు , వాహనాల లోపలి భాగాల తయారీలో ఫ్లేమ్ రిటార్డెంట్ ఉంటుంది. ఈ ఉత్పత్తుల్లో ఉన్న రసాయనం నేరుగా చర్మంలోకి వెళ్ళే అవకాశం ఉండడంతో పాటు, దుమ్ములో పేరుకుపోవచ్చని తెలిపారు. ఒక పరిశోధనలో ఫ్లేమ్ రిటార్డెంట్ అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని పరిశోధకులు వెల్లడించారు. అంతేగాక బ్రోమినేటెడ్ రసాయనంతో క్యాన్సర్, హార్మోన్‌ల్లో తేడాలు, పునరుత్పత్తి వ్యవస్థలపై ప్రభావంతో పాటు న్యూరో డెవలప్మెంట్ సమస్యలు కూడా వస్తాయని పేర్కొన్నారు. కొద్దిమంది చిన్నారులపై నిర్వహించిన పరిశోధనలో ఈ రసాయనం కారణంగా పిల్లల్లో ఐక్యూ లెవల్స్ తగ్గుతాయని, పిల్లల ప్రవర్తన, వ్యవహార శైలిలో మార్పు వస్తుందని గుర్తించారు. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఒక పరిశోధనలో చిన్నారుల్లో ఐక్యూ నష్టానికి బ్రోమినేటెడ్ ఫ్లేమ్ అతిపెద్ద కారణమని తేలింది. అంతేగాక ఇది పిల్లల్లో మేధో వైకల్యాన్ని ప్రోత్సహిస్తుందని పరిశోధకులు గుర్తించారు. అంతేగాక ఇటీవల శిశువుల ఉత్పత్తులు, కౌచ్ల్లో క్లోరినేట్ ట్రీ రసాయనం ఉన్నట్లు కనుగొన్నారు. 40 ఏళ్ళ క్రితం మాన్యుఫాక్చరర్లు ఈ రసాయనాన్ని వాడటం మానేసినప్పటికీ, తరువాత దీనిని మళ్లీ ఉపయోగించడం ప్రారంభించినట్లు తాజా పరిశోధనల్లో తేలింది. క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(క్యూసిఐ) 2019 లో దిగుమతి చేసుకున్న కొన్ని బొమ్మలను పరీక్షించింది. 121 రకాల బొమ్మలను పరీక్ష కోసం ల్యాబ్‌కు పంపగా, అందులో 66.90% బొమ్మలు పరీక్షల్లో ఫెయిల్‌కాగా, 33.1% బొమ్మలు మాత్రమే నాణ్యతా పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాయి. పరీక్షలు జరిపిన బొమ్మలలో 30% ప్లాస్టిక్ బొమ్మలు భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా లేవని, వీటిలో సీసం వంటి హెవీ మెటల్ కంటెంట్ ఉందని గుర్తించారు. 80% ప్లాస్టిక్ బొమ్మలు మెకానికల్, ఫిజికల్ భద్రతా ప్రమాణాల విషయంలో విఫలమయ్యాయి. అంతేగాక రీసైకిల్ ప్లాస్టిక్‌తో చేసిన అన్ని బొమ్మలలో చిన్నారుల ఆరోగ్యానికి ప్రమాదకరమైన డయాక్సిన్ రసాయనం చాలా ఎక్కువగా ఉందని గుర్తించారు. బొమ్మలలో ఇది 690 ప్రతి గ్రాము టిఎఫ్క్యూ (టాక్సిక్ ఈక్వివలెంట్ కోషెంట్) ఉందని తేలింది. పిల్లలు తీవ్రమైన వ్యాధుల బారిన పడేందుకు కారణమైన బ్రోమినేటెడ్ డయాక్సిన్ రసాయనం సైతం ఈ బొమ్మల్లో ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. పిల్లలను ఎలా రక్షించాలి? ఈ రసాయనాల నుంచి పిల్లలను రక్షించేందుకు ప్లాస్టిక్ బొమ్మలు కొనడం తగ్గించడం తో పాటు, వారిని ప్లాస్టిక్ బొమ్మలకు దూరం గా ఉంచడమే సులభమైన మార్గం. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, విదేశాలలో ఉన్న పిల్ల లు ప్రతి సంవత్సరం సగటున 18.3 కిలోగ్రాముల ప్లాస్టిక్ బొమ్మలను కొనుగోలు చేయ డం కానీ జమ చేయడం కానీ చేస్తారు. అవస రాని కంటే ఎక్కువ బొమ్మలు కలిగి ఉన్న పిల్లలతో పోలిస్తే, తక్కువ బొమ్మలు ఉన్న పిల్లల్లో ఏకాగ్రత, సృజనాత్మకతలు గణనీయంగా ఎక్కువగా ఉన్నాయని తాజా అధ్యయనం వెల్లడించింది. -
‘టాయ్‌బాక్స్ 3డీ ప్రింటర్’ అంటే ఏంటో తెలుసా?
‘దాదీ... నాకు బొమ్మ తేవాలి’ అని మన ముద్దుల పిల్లాడు అడిగాడే అనుకుందాం. ‘ఇప్పుడెక్కడ తేగలం’ అని రకరకాల సాకులు వెదుక్కుంటాం. ఇక ముందు అలాంటి పరిస్థితి రాదు. ఇంట్లోనే టీ, కాఫీలు చేసి ఇచ్చినట్లే బుజ్జి బుజ్జి బొమ్మలు తయారుచేసి పిల్లలకు ఇవ్వవచ్చు. ‘టాయ్‌బాక్స్ 3డీ ప్రింటర్’తో ఇది సాధ్యమవుతుంది. ఈ ప్రింటర్‌తో పాటు కేటలాగ్ కూడా ఇస్తారు. దీనిలో మనకు ఇష్టమైన బొమ్మలను, ఇష్టమైన రంగులతో టకటకా తయారుచేసుకోవచ్చు. దీనితోపాటు సొంతంగా డిజైన్లను రూపొందించుకొని వాటికొక రూపం కూడా ఇవ్వవచ్చు. ఈ బయోడిగ్రేడబుల్ ప్రింటర్ బరువు 3 కేజీలు, మన సంతోషం బరువు వంద కేజీలు! -
9 ఏళ్లకే మిలియన్ డాలర్ల సంపాదన
న్యూయార్క్ : తొమ్మిదేళ్ల వయసులో మనందరం ఏం చేస్తాం.. మహా అయితే స్కూల్‌కి వెళ్లడం.. ఇంటికి వచ్చాక స్నేహితులతో ఆడుకోవడం చేస్తుంటాం. కానీ అమెరికాకు చెందిన 9 ఏళ్ల ర్యాన్ కాజీ మాత్రం చిన్న వయసులోనే మిలియన్ డాలర్లు సంపాదిస్తున్నాడు. వినడానికి ఆశ్యర్యకరంగా ఉన్నా ఇది మాత్రం నిజం. అసలు విషయంలోకి వెళితే.. ర్యాన్ కాజీ ..' ర్యాన్స్ వరల్డ్’ అనే పేరుతో యూట్యూబ్ చానల్ నిర్వహిస్తున్నాడు. ఇందులో అతడు వివిధ బొమ్మలతో ఆడుకుంటూనే వాటిపై సమీక్ష నిర్వహిస్తాడు. అలా అతని చానల్‌కు 27 మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అతడి సంపాదన చూస్తే ఎవరికైనా దిమ్మతిరగాల్సిందే. 2018లో అతడు యూట్యూబ్ ద్వారా 17 మిలియన్లు సంపాదించగా.. 2019లో అది 26 మిలియన్లకు చేరుకుంది. (చదవండి : ఇలా ప్రపోజ్ చేస్తే ఎవరైనా పడిపోవాల్సిందే) ఈ ఏడాది ఏకంగా 30 మిలియన్లు సంపాదించిన ర్యాన్ కాజీ వరుసగా మూడేళ్లలో అత్యధికంగా డబ్బులు పొందిన యూట్యూబర్‌గా నిలిచాడు . ఇటీవలే మిలియన్ డాలర్ల విలువైన నికెలోడియన్‌లో ఒక టీవీ సిరీస్ కోసం ర్యాన్‌కాజీ ఒక ఒప్పందంపై సంతకం చేయడం విశేషం. అంతేకాదు.. ర్యాన్ కాజీకి, అతడి తల్లిదండ్రులకు కలిపి మొత్తం తొమ్మిది యూట్యూబ్ చానల్స్ ఉండగా.. అన్నింటికీ మిలియన్ల వ్యూస్ వస్తున్నాయి. ఇప్పుడు ర్యాన్ కాజీ అమెరికాలో సెన్సేషనల్ స్టార్‌గా మారిపోయాడు. ఈ బుడ్డోడు నిజంగా జీనియస్ అంటూ అతనిపై ప్రశంసలు వస్తున్నాయి. -
బొమ్మల షాపులో మహిళపై దారుణం
ముంబై : షాపులో బొమ్మలు కొందామని వచ్చిన మహిళను దారుణంగా చంపడమే గాక అత్యాచారం చేసిన ఘటన మహారాష్ట్రలోని నలాసోపారాలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు.. 32 ఏళ్ల మహిళ తన భర్త, పిల్లలతో కలిసి నలాసోపారాలో నివసిస్తుంది. ఆమె భర్త పాల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. కాగా జూన్ 26న పిల్లలకు బొమ్మలు కొందామని వెళ్లిన సదరు మహిళ తిరిగిరాలేదు. దీంతో ఆమె భర్త తులింగ్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు వివరాలు సేకరించి మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు.( పరారీలో టీడీపీ నేత కొల్లు రవీంద్ర!) అయితే జూన్ 28న నలాపోపారాలోని చందన్‌నకా రోడ్ వెంబడి పార్క్ చేసి ఉన్న కారులో అనుమానాస్పద స్థితిలో ఒక మహిళ మృతదేహం కుళ్లిపోయి దుర్వాసన వస్తోందని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. తన భార్య కనిపించడం లేదని మిస్సింగ్ కేసు నమోదు చేసిన మహిళ భర్తను వెంటబెట్టుకొని పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆ వ్యక్తి మృతదేహాన్ని పరిశీలించి చూడగా ఆ మృతదేహం తన భార్యదేనని పేర్కొన్నాడు. కాగా మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించగా సదరు మహిళ హత్యకు గురవ్వడమే గాక అత్యాచారం చేయబడిందని రిపోర్టులో తేలింది. దీంతో కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు పాల్గర్ సీడీఐ సహాయంతో విచారణ ప్రారంభించారు. గత కొన్ని రోజులుగా ఆ వాహనం అక్కడే పార్క్ చేసి ఉంటుందని అక్కడి స్థానికులు విచారణలో పేర్కొన్నారు. పక్కనే ఉన్న సీసీటీవీ ఫుటేజీ సహాయంతో అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి.(రోజు కూలీపై ఆస్పత్రి యాజమాన్యం దాడి) జూన్ 26 న ఆ వ్యాన్ పార్క్ చేసిన ప్రదేశంలో పక్కనే ఉన్న ఒక టాల్‌స్టాయ్ షాపుకు మహిళ వెళ్లినట్లు సీసీటీవీలో కనిపించింది. ఆ తర్వాత ఆమె ఆచూకి లభించకపోవడంతో పోలీసుల అనుమానం బలపడి షాపు యజమానిని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించారు. దీంతో షాపు యజమాని ఆ మహిళను హత్య చేసింది తానేనని ఒప్పుకున్నాడు.' జూన్ 26న సదరు మహిళ తన షాపుకు వచ్చింది. బొమ్మలు కొనే విషయంలో వాగ్వాదం తలెత్తడంతో క్షణికావేశంతో ఆమె జుట్టు పట్టుకొని గదిలోకి ఈడ్చుకుపోయి మెడమీద చేతులు పెట్టి చంపేశాను. అనంతరం ఆమెను శారీరకంగా అనుభవించాను. ఒక రాత్రంతా మహిళ శవంతోనే గడిపి తర్వాత ఆమె మృతదేహాన్ని ప్లాస్టిక్ కవర్లో చుట్టి పక్కనే పార్క్ చేసి ఉన్న వాహనంలోకి విసిరేసి అక్కడి నుంచి వెళ్లిపోయాను.' అంటూ పేర్కొన్నాడు. కాగా నిందితునిపై లైంగిక దాడి కేసుతో పాటు మర్డర్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. -
బతుకు.. బొమ్మలాట
జీవకళ తొణికిసలాడే మట్టి బొమ్మలవి. ఇంటికి అందాన్నిచ్చే ఆకృతులవి. కళాకారుల కుటుంబాల ఆకలి తీర్చే కళారూపాలవి. వాటిని నమ్ముకున్న బతుకులకు కరోనా దెబ్బ కొట్టింది. రాష్ట్రాలు దాటి వచ్చిన రాజస్థానీ కళాకారుల్ని పస్తులుంచుతోంది. లాక్డౌన్ ప్రకటించినప్పటి నుంచి బొమ్మల వ్యాపారం మూతపడింది. ఒక్కటంటే.. ఒక్కటి కొనేవారు లేక.. ఆదాయం రాక.. ఆకలి తీరక అవస్థలు పడుతున్న రాజస్థానీ కళాకారుల దీనగాథ ఇది. రామభద్రపురం: రాజస్థాన్‌కు చెందిన చున్నీలాల్ కుటుంబ సభ్యులు పది మంది, బచనారామ్ కుటుంబ సభ్యులు ఆరుగురు రెండేళ్ల క్రితం రామభద్రపురం మండల కేంద్రానికి వలస వచ్చారు. స్థానిక ప్రభుత్వ పశువైద్యశాల వెనుకనున్న ఓ ప్రైవేట్ ఖాళీ స్థలంలో చున్నీలాల్ కుటుంబం, బైపాస్‌లోని విశాఖ డెయిరీ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో బచనారామ్ కుటుంబ సభ్యులు గుడారాలు ఏర్పాటు చేసుకున్నారు. వీరంతా ఆకర్షణీయమైన బొమ్మలు చేసి, విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. లాక్‌డౌన్‌కు ముందు రోజూ రూ.2వేల వరకూ వ్యాపారం సాగింది. లాక్డౌన్ ప్రకటించిన తర్వాత వీరి వ్యాపారం పూర్తిగా పడిపోయింది. ఒక్కటంటే ఒక్క బొమ్మను అమ్ముకోలేకపోయారు. తయారు చేసిన బొమ్మలన్నీ అలాగే ఉండిపోయాయి. సాధారణంగా వీటిని దిగుమతి చేసుకునేందుకు అప్పు చేస్తుంటారు. బొమ్మల తయారీకి అనంతపురం, బళ్లారి, బెంగుళూరుకు వెళ్లి అవసరమైన ముడిసరుకును తెచ్చుకుంటారు. ప్రస్తుతం విక్రయాలు నిలిచిపోవడంతో ఆర్థికంగా వీరంతా చితికిపోయారు. కుటుంబ పోషణకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాలుగు నెలలుగా వ్యాపారాలు లేకపోవడంతో తినడానికి తిండిలేక నానా అవస్థలు పడుతున్నారు. రామభద్రపురం విశాఖ డెయిరీ ఎదురుగా ఉన్న గుడారంలో ఖాళీగా బచనారామ్ కుటుంబం దాతల కోసం ఎదురుచూపు చున్నీలాల్‌కు ఎనిమిది మంది పిల్లలు ఉండగా వారిలో ఆరుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇటీవల లాక్డౌన్ సమయంలో ఒక కుమారుడికి పచ్చకామెర్లు సోకింది. వైద్యం కోసం చుట్టుపక్కల ఉన్న దాతలు కొంతమంది డబ్బులు సేకరించి ఇచ్చి విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రిలో చేరి్పంచి వైద్యం అందించినా ఫలితం లేక మృతి చెందాడు. మిగిలిన పిల్లలంతా ఇక్కడ బతకలేక వేరే ప్రాంతానికి వలస వెళ్లిపోయారు. ఇక్కడ చున్నీలాల్ అతని భార్య, ఒక కుమారుడు ఉన్నారు. వారికి ఒక్క పూట కూడా తిండి లేక నానా అవస్థలు పడుతున్నారు. దాతలు సహాయం చేసి ఆదుకోమని వేడుకుంటున్నారు. దాతల సాయం కోసం నిరీక్షణ లాక్డౌన్ కారణంగా పనులు లేక ఇబ్బందులు పడుతున్న పేదలను పలు స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ నాయకులు, అధికారులు ఆదుకున్నారు. ఈ క్రమంలోనే రాజస్థానీయులకూ సరుకులు అందజేశారు. వారు నివాసం ఉన్న ప్రాంతంలో ఉన్న వారు కూడా ఎంతో కొంత డబ్బులు సేకరించి ఇచ్చి ఆదుకున్నారు. ఇప్పుడు నిత్యం సరుకుల పంపిణీ లేక, దాతలు ఆదుకోక, వ్యాపారాలు సాగక రెండు రాజస్థానీ కుటుంబాలు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. పస్తులుంటున్నాం లాక్డౌన్ కారణంగా నాలుగు నెలలుగా వ్యాపారాలు జరగడం లేదు. చేతిలో డబ్బు లేదు. కుటుంబ పోషణ తీవ్ర ఇబ్బందిగా మారింది. లాక్డౌన్ కాలంలో అధికారులు సరుకులను ఇచ్చారు. ఇప్పుడు తిండి లేక పస్తులతో పడుకుంటున్నాం. – చున్నీలాల్, రాజస్థానీ కళాకారుడు, రామభద్రపురం వ్యాపారం పడిపోయింది తయారు చేసిన బొమ్మలు చుట్టుపక్కల పల్లెలకు తీసుకెళ్లి అమ్ముకొని వచ్చేవాళ్లం. ప్రస్తుతం కరోనా కారణంగా ఊళ్లలోకి కొత్తవాళ్లని రానివ్వకపోవడంతో పాటు బొమ్మలు ఎవరూ కొనుగోలు చేయడం లేదు. దీంతో వ్యాపారం పూర్తిగా నిలిచిపోయి, కుటుంబ పోషణ భారమైంది. ఇప్పటికి రూ.20 వేలు అప్పు చేశాం. ఇంకా ఎవరూ అప్పులు ఇవ్వకపోవడంతో కుటుంబ పోషణ కష్టంగా ఉంది. – బచనారామ్, రాజస్థానీ, రామభద్రపురం -
వినోదం.. విజ్ఞానం.. విలువైన పాఠం
సాక్షి, బేస్తవారిపేట : పురాణేతిహాసాలు.. పర్యావకరణ పరిరక్షణ.. వివిధ రాష్ట్రాల ఆచారాలు.. వేషభాషలు.. పండుగుల ప్రాధాన్యత.. ఇలా సమస్త విషయాలను ఒక గదిలో కళ్లకు కట్టినట్లు చూపే ఘట్టాలు బొమ్మల కొలువులో మాత్రమే ఆవిష్కృతమవుతాయి. దసరా పండుగ వైశిష్ట్యాన్ని ఘనంగా చాటే ఈ వేడుకను జిల్లాలోని పలు చోట్ల భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. విజ్ఞాన వినోదాలను సమపాళ్లలో అందించే బొమ్మల కొలువు సంప్రదాయాన్ని నియమనిష్టలతో పాటిస్తున్న వారందరూ ఇప్పటి తరం వారికి మన సంస్కృతిని మరచిపోకుండా కాపాడుకుంటూ రెండు తరాల వారధిగా నిలుస్తున్నారు. కొలువు.. సులువు కాదు ఒకప్పుడు దసరా వస్తోందంటే ఇంటింటా అందమైన బొమ్మలు కొలువుదీరేవి. వినోదంతోపాటు విజ్ఞానాన్ని పంచేవి. బొమ్మల కొలువును తీర్చిదిద్దడం అంత సులువైన పని కాదనేది అందరూ ఒప్పుకునే సత్యం. ఎక్కువ మొత్తంలో కొనుక్కోవడం, వాటిని జాగ్రత్తగా పదిలపరచడం అవసరం. భవిష్యత్తు తరాల వారికి పాత సంప్రదాయాలను అందించాలన్న ఉద్దేశంతో పాతతరం వారు బొమ్మల కొలువును ఇప్పటికీ అందంగా అందిస్తున్నారు. కొన్ని చోట్ల దసరా పండుగను కలిసికట్టుగా ఆనందోత్సాహాల మధ్య నిర్వహిస్తూ మళ్లీ పాత వైభవాన్ని గుర్తు చేసుకుంటున్నారు. బొమ్మల కొలువు సంప్రదాయం అనాదిగా వస్తున్న బొమ్మల కొలువు సంప్రదాయం వెనుక అనేక కారణాలున్నాయి. పూర్వం లలితకళల్లో ప్రధానమైన శిల్పకళను ప్రోత్సహించడానికి, జీవకళతో ఉట్టిపడే కళారూపాలను తయారు చేసే కళాకారులను బతికించడానికి అందరి చేత బొమ్మలు కొనిపించేవారు. సినిమాలు, టీవీలు లేని రోజుల్లో బొమ్మల కొలువు ద్వారా పురాణాల్లోని కథలను, విజ్ఞాన విషయాలను చిన్నారులను దగ్గర కూర్చోబెట్టుకుని పదిరోజులపాటు వీలు దొరికినప్పుడల్లా తెలియజేసేవారు. ఇవన్నీ ఇలా ఉంటే ముత్తయిదువులు, చిన్నారులకు బొమ్మలకొలువు ముందు నిత్యం తాంబూలాలు ఇవ్వాలనే సంప్రదాయం కూడా బాంధవ్యాలను మరింత దగ్గర చేసేది. కాలక్రమంలో బొమ్మల కొలువులు పెట్టే వారు తగ్గిపోయారు. -
మొక్కజొన్న బాల్యం
ఆ ఇంటి పై కప్పు నుంచి వెలువడిన చిక్కటి పొగ ఆకాశంలో దట్టమైన మేఘాలను సృష్టిస్తోంది. అప్పటికే అలుముకున్న చిక్కటి మంచు దుప్పటిని చీల్చుకుంటూ ప్రయాణిస్తోంది పొగ. ఇంట్లో ఎంత భారీ వంటలు వండితే ఇంత చిక్కటి పొగ ఇంత సేపు వస్తుంది? ఎంతమందికి వండుతున్నారు? పెళ్లి వంటి వేడుక ఉందేమో, విందు కోసం పెద్ద ఎత్తున వంటలు చేస్తున్నారేమో అనిపిస్తుంది ఆ పొగను చూస్తుంటే. మణిపూర్‌లోని సాంగ్‌సాంగ్ గ్రామస్థులకు అది రోజూ అలవాటైన దృశ్యమే. ఆ ఇల్లు నెలీ చాచియాది. బొమ్మల ‘కర్మాగారం’ ఆ పొగ వస్తున్న ఇల్లు నెలీ చాచియా బొమ్మలిల్లు. నిజమే. బొమ్మరిల్లు కాదు బొమ్మలిల్లే. ఆ ఇంట్లో నెలీ చాచియా బొమ్మలు తయారు చేస్తుంది. దాదాపుగా అన్నీ చేతిలో పూలబుట్ట పట్టుకున్న మోడరన్ యువతి బొమ్మలే. ఆ బొమ్మలకు ముడిసరుకు మొక్కజొన్న పంట వ్యర్థాలే. అది ఆమె బొమ్మల కార్ఖానా. నెలీ ఆడుతూపాడుతూ బొమ్మలు చేస్తుంది. ఆ బొమ్మలను పిల్లల కోసం అమ్ముతుంది. నెలకు కనీసంగా 45 వేలు సంపాదిస్తోంది. రోజంతా వర్క్ స్టేషన్లో గడిపితే పన్నెండు బొమ్మలు చేస్తుందామె. బొమ్మ డిజైన్‌ను బట్టి మార్కెట్లో రెండు నుంచి ఐదు వందల ధర పలుకుతుంది. ఉద్యోగాలు దొరకట్లేదని, ఉపాధికి మార్గాల్లేవని నిరాశ పడకూడదంటారు నెలీ. ‘ప్రకృతిలో ప్రతిదీ అవసరమైన వస్తువే, ప్రతి వస్తువూ అందమైనదే. మన దృష్టి కోణం సృజనాత్మకమైనదైతే ఆ వస్తువులో సౌందర్యాన్ని చూడగలుగుతాం. మనసు పెట్టి పని చేస్తే... ఆ పనే మనకు ఆలంబన’ అంటారామె. డబ్బుంటే అబ్బేది కాదేమో నెలీ చాచియా బొమ్మలు తయారు చేయడాన్ని వృత్తిగా మలుచుకోవడానికి బీజం పడిన చిన్నప్పటి పరిస్థితులను గుర్తు చేసుకున్నారు. ‘‘నా చిన్నప్పుడు తోటి పిల్లలతో ఆడుకోవడానికి వెళ్లినప్పుడు అందరి దగ్గరా బొమ్మలుండేవి. అందరూ ఆటలకు తమ బొమ్మలు తెచ్చేవాళ్లు. ఆ బొమ్మలన్నీ ఒక చోట చేర్చి ఆడుకునే వాళ్లం. నాకు బొమ్మలు కొనడానికి అమ్మ దగ్గర డబ్బులుండేవి కాదు. అందరి దగ్గరా బొమ్మలున్నాయని, నాకూ కొనివ్వమని బాగా మారాం చేసి ఏడ్చాను. అప్పుడు మా అమ్మ... మొక్కజొన్న కండెలు, పొట్టు, ఆకులతో బొమ్మ చేసిచ్చింది. బొమ్మ ఎలా చేయాలో నేర్పించి, ఎన్ని రకాల బొమ్మలు కావాలో అన్నీ చేసుకోమన్నది. అప్పటి నుంచి రకరకాలుగా బొమ్మలు చేసుకుని ఆటలకు తీసుకెళ్లేదాన్ని. నా బొమ్మలకు క్రేజ్ కూడా పెరిగింది. పెద్దయిన తర్వాత నా చేతిలో ఉన్న కళనే ఉపాధిగా మార్చుకుంటే బాగుంటుందనిపించింది. అలా 2000వ సంవత్సరంలో బొమ్మల తయారీ యూనిట్ ప్రారంభించాను. తర్వాత కొన్నేళ్లకు పిల్లలకు, మహిళలకు బొమ్మల తయారీలో శిక్షణ ఇవ్వడం కూడా మొదలుపెట్టాను. ‘ఇలా అందరికీ నేర్పిస్తూ పోతే నీ పరిశ్రమ నడిచేదెలాగ’ అన్నారు స్నేహితులు. నేర్పించడంలో నా ఉద్దేశం... ప్రతి ఒక్కరిలో ‘మన ఎదుట ఉన్న ఎందుకూ పనికిరావనుకున్న వస్తువులతో అందమైన రూపాన్ని తయారు చేయవచ్చ’నే ఊహకు జీవం పోయడమన్నమాట. నా దగ్గర నేర్చుకున వాళ్లు... నేను నేర్పిన మెళకువలకు తమ క్రియేటివిటీని జోడించి, వాళ్లకు అందుబాటులో ఉన్న మెటీరియల్‌తో మరింత ఆకర్షణీయమైన బొమ్మలు చేస్తున్నారు. ముఖ్యంగా పిల్లల్లో అంతర్లీనంగా ఉన్న కళ బయటికొస్తుంది. నా బొమ్మలన్నీ పర్యావరణానికి ఏ మాత్రం హాని కలిగించని ఎకో ఫ్రెండ్లీ బొమ్మలే. పర్యావరణానికి హాని కారకమైన వస్తువుల వినియోగంలో తొలి వరుసలో ఉన్నది పిల్లల ఆట బొమ్మలే. వాటి స్థానాన్ని ఎకో ఫ్రెండ్లీ బొమ్మలతో భర్తీ చేయాలనేది నా కోరిక’’ అంటారు నెలీ చాచియా. మణిపూర్ రాజధాని నగరంలో ఇంఫాల్‌లో ఒక స్టోర్ తెరిచారామె. తాను మాత్రం ఎక్కువ రోజులు సొంతూరు సాంగ్‌సాంగ్ లోని బొమ్మల పరిశ్రమలోనే పని చేస్తారు. బొమ్మల పరిశ్రమకే కాదు ఏ పరిశ్రమ అయినా మణిపూర్ బొమ్మ ‘‘ఇండియన్ ఫ్లవర్స్, ఆర్నమెంటల్ ప్లాంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్లు సంయుక్తంగా 2007లో న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ఇంటర్నేషనల్ ఫ్లోరా ఎక్స్´ ో నిర్వహించాయి. ఆ ఎక్స్‌పోలో పాల్గొనడం నాకు పెద్ద టర్నింగ్ పాయింట్. అప్పటినుంచి నెలీ చాచియా మణిపూర్ దాటి బయటి ప్రపంచానికి తెలిసింది. నా మొక్కజొన్న బొమ్మల స్టాల్ కోసం అనేక ఎగ్జిబిషన్ల నుంచి ఆహ్వానాలు వస్తున్నాయి. విదేశాల్లో కూడా మన మొక్కజొన్న బొమ్మలకు మంచి ఆదరణ లభిస్తోంది’’.– నెలీ చాచియా, ఎకో ఫ్రెండ్లీ బొమ్మల పరిశ్రమ నిర్వహకురాలు మొక్కజొన్న మెరుపుతీగలు మొక్కజొన్న కంకిని కప్పి ఉంచే ఆకులు, ఆకులకు గింజలకు మధ్య ఉండే పట్టులాంటి మృదువైన దారాలు, గింజలు ఒలిచిన కండెలు, గింజలను మర పట్టినప్పుడు వచ్చే పొట్టు ఆమె బొమ్మలకు ముడిసరుకులు. పొట్టును తడిపి బొమ్మ తల, దేహం ఆకారాల్లో మలిచి ఆరబెట్టాలి. మొక్కజొన్న ఆకులను బొమ్మలకు దుస్తుల్లా కట్టాలి. మృదువైన దారాలను తల మీద అమరిస్తే చక్కటి హెయిర్‌స్టయిల్‌తో మోడరన్ యువతి బొమ్మ రెడీ. నెలీ ఫ్లోరిస్ట్ కూడా కావడంతో ఆమె బొమ్మల్లో డ్రై ఫ్లవర్స్ పూలబుట్టలు కూడా ప్రధానంగా కనిపిస్తాయి. సరే... యజమాని వర్క్‌స్టేషన్‌ను వదిలి షో రూమ్‌లో కూర్చోవడం మొదలు పెడితే ఇక అప్పట్నుంచి పరిశ్రమ తిరోగమనం మొదలైనట్లే అంటారామె. – మంజీర -
బార్బీకి పోటీగా ఫియర్లెస్ గర్ల్
బార్బీ ప్లేస్‌లోకి ‘ఫియర్లెస్ గర్ల్’ అనే కొత్త బొమ్మ రాబోతోందా! బార్బీ నాజూకుగా ఉంటుంది. ‘ఫియర్లెస్ గర్ల్’ స్ట్రాంగ్‌గా ఉంటుంది. అమ్మాయిలు స్ట్రాంగ్‌గా ఉండడం ఇప్పడు ‘కొత్త నాజూకు’ కాబట్టి.. రాబోయే రోజుల్లో ఫియర్లెస్ గర్ల్నే అంతా ఇష్టపడబోతున్నారా? మరేం పర్వాలేదు. పాత బొమ్మ ప్లేస్‌లోకి కొత్త బొమ్మ వచ్చినా కొత్తగా మారబోయేదేం ఉండదు. బార్బీలో ఇన్‌బిల్ట్‌గా ఫియర్‌లెస్‌నెస్ ఉంటుంది కనుక రెండు బొమ్మలూ ఒకటే. రెండు బొమ్మలూ ఇచ్చే ఇన్స్పిరేషన్ ఒక్కటే. చాయిస్ మాత్రం మీ అమ్మాయిదే. రెండూ కావాలి అంటే రెండూ కొనివ్వొచ్చు. మార్చి 7. మార్చి 8. మార్చి 9. చరిత్రలో ఈ మూడూ మూడు ముఖ్యమైన రోజులు. మూడూ మూడు మహిళా దినోత్సవాలు. మూడూ ఈ మధ్యనే వచ్చి వెళ్లిపోయాయి. మార్చి ఎనిమిది.. తెలిసిందే. హిస్టారిక్ డే. అండ్.. హిస్టారికల్ డే కూడా. మార్చి ఏడు, మార్చి తొమ్మిది కూడా అలాంటివే. అయితే అవి పెద్దగా సెలబ్రేట్ అవలేదు. మార్చి ఏడైతే అసలు వచ్చి వెళ్లినట్లే ఎవరికీ తెలీదు. ఏంటి మార్చి 7కు ఉన్న ప్రత్యేకత? ‘ఫియర్లెస్ గర్ల్’ పుట్టిన రోజు. అవును. భయమన్నదే లేని పిల్ల బర్త్‌డే ఆ రోజు. ఆరో ఏడో ఏళ్లుంటాయి. పొట్టి గౌన్‌లో ఉంటుంది. కాళ్లకు బూట్లు ఉంటాయి. జుట్టు రబ్బరు బ్యాండుతో ముడివేసి ఉంటుంది. నడుం మీద చేతులు పెట్టుకుని నిలబడి, తల కాస్త పైకి ఎత్తి చూస్తుంటుంది. సర్దార్ పాపారాయుడు (1980) సినిమాలో ఎన్టీఆర్‌లో కనిపించే ‘ఫియర్‌లెస్‌నెస్’ లాంటి ఫియర్‌లెస్‌నెస్ ఆ గర్ల్‌లో కనిపిస్తుంటుంది.స్త్రీ శక్తిని తక్కువగా అంచనా వేస్తాం మనం. మనలాంటివాడే.. ‘సర్దార్ పాపారాయుడు’లో మోహన్ బాబు. పాపారాయుడు శక్తిని తక్కువగా అంచనా వేస్తాడు. పాపారాయుణ్ణి ఎంత తేలిగ్గా షూట్ చేసి, డెడ్‌బాడీ తేవచ్చో డీటెయిల్డ్‌గా చెప్తాడు. మోహన్‌బాబు బ్రిటిష్ దొరబాబు. ఎన్టీఆర్ అతడి టార్గెట్.‘‘వాణ్ణి కాల్చడం అంత సులభం కాదు సర్’ అని ఇండియన్ ఏజెంట్ ఒకడు అంటే.. ‘‘ఇన్సల్ట్’’ అని పెద్దగా అరుస్తాడు ఆ ఏజెంట్ మీద మోహన్‌బాబు.‘‘ఏమీ.. వాడేమి అల్లూరి సీతారామా రాజా, ఆజాద్ చంద్రశేఖరా, భగత్సింగా, సుభాస్ చంద్రబోసా.. ఆఫ్ట్రాల్ పప్పారాయుడు. చెట్టు పక్కన నక్కి పిట్టను కొట్టినట్టు కొట్టేయండి. తుపాకీ చేత్తో పట్టుకోండి. వేలు నొక్కండి. గుండు బయటికొస్తుంది. గుండెల్లోనుంచి దూసుకుపోతుంది. దట్సాల్. గిలగిలా తన్నుకు ఛస్తాడు. అండర్‌స్టాండ్? శవాన్ని నా దగ్గరకు తీసుకురండి. గెట్టావుట్’’ అంటాడు. అంతా వెళ్లిపోతారు. మోహన్‌బాబు ఒక్కడే బంగళాలో మిగిలిపోతాడు. అప్పుడొస్తాడు పాపారాయుడు అదే బంగళాలోని పై ఫ్లోర్‌లోంచి.. కిందికి ఒక్కో మెట్టూ దిగుతూ! ఉలిక్కిపడతాడు మోహన్‌బాబు.. ఒక్కో మెట్టూ వెనక్కు దిగుతూ. అంతకు ముందెప్పుడూ పాపారాయుడిని చూసి ఉండడు అతడు. ‘‘హు ఆర్ యు.. నీవెవరు? నీ పేరేమి? వాటీజ్ యువర్ నేమ్’’ అంటాడు. చెప్తాడు ఎన్టీఆర్. ‘‘ఓహ్.. పప్పారాయుడు’’ అని బెదిరిపోతాడు మోహన్‌బాబు. తన స్టెయిల్లో నవ్వుతాడు ఎన్టీఆర్. ‘‘ఏ! పేరు వినగానే పిస్తోలు జారిపోయిందా? ఊ. తీసుకో. వేలుతో నొక్కు. హె. గుండు బయటికొస్తుంది. గుండెల్లోనుంచి దూసుకుపోతుంది. ఊ.. తీసుకో. తీసుకో’’ అంటాడు ఎన్టీఆర్. ‘‘ఎ.. నువ్వెందుకొచ్చావిక్కడికి?’’ అంటాడు.‘‘నువ్వు చచ్చేముందు పాపారావు ఎలా ఉంటాడో చూచి తరిస్తావని’’ అంటాడు ఎన్టీఆర్.‘‘ఓ.. గుడ్ పర్సనాలిటీ. ఓ.. బెస్టాఫ్ లక్. గో.. గో.. ప్లీజ్ గో.. వెళ్లూ..’ అంటాడు.‘‘పిరికిపంద. కుక్కను కాల్చినట్టు కాల్చి శవాన్ని తీసుకు రమ్మన్నావ్. నీ కళ్ల ముందుకు వచ్చినవాణ్ణి పొమ్మంటున్నావ్. ఏ.. భయమా?’’ అంటాడు ఎన్టీఆర్.‘‘నీ చెవులు వైర్లెస్. నీ చూపులు కేర్లెస్. నీ మాటలు ఫియర్లెస్’’ అంటాడు మోహన్‌బాబు. పాపారాయుడులోని సేమ్ ఆ కేర్లెస్నెస్, ఫియర్‌లెస్‌నెస్ ఈ పాప.. ‘ఫియర్లెస్ గర్ల్’లో కనిపిస్తుంటాయి. న్యూయార్క్‌లోని ‘బౌలింగ్ గ్రీన్’ పబ్లిక్ పార్క్‌లో అలా నిలబడి ఉంటుంది. పాప ఎదురుగా వాల్‌స్ట్రీట్ బుల్ (ఎద్దు) ఉంటుంది. ‘చూసుకుందాం రా..’ అని ఆ బుల్‌ని సవాల్ చేస్తున్నట్లుగా ఉంటుంది. ఆమె కాళ్ల దగ్గర చిన్న గుండ్రటి పళ్లెం లాంటి శిలాఫలకం ఉంటుంది. ‘నో ద పవర్ ఆఫ్ ఉమెన్ ఇన్ లీడర్షిప్. షి మేక్స్ ఎ డిఫరెన్స్’ అని ఆ ఫలకంపై రాసి ఉంటుంది. ‘మహిళా నాయకత్వ శక్తి గురించి తెలుసుకోండి. తన సత్తా ఏమిటో చూపిస్తుంది’.. అని. 50 అంగుళాల పొడవు, 110 కిలోల బరువు ఉన్న ఈ ‘ఫియర్లెస్ గర్ల్’ కంచు విగ్రహాన్ని ‘స్టేట్ స్ట్రీట్ గ్లోబల్ అడ్వైజర్’ (ఎసెస్‌జీఏ) అనే ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ కంపెనీ తయారు చేయించి అక్కడ పెట్టించింది. ఆస్తుల విలువను అంచనా వెయ్యడంలో ఎసెస్‌జీఏ ఎక్స్పర్ట్. మహిళలు లీడ్ చేసే కంపెనీల ఆస్తుల విలువ త్వరగా, స్థిరంగా పెరగడం ఆ కంపెనీ గమనించింది. అయితే ఎలా ఆ విషయాన్ని ఇండికేట్ చెయ్యడం? మామూలు విలువను గ్రాఫ్‌లో చూపించవచ్చు. మరి మహిళా శక్తిని? స్టాచ్యూలో చూపించారు. ఆ స్టాచ్యూనే ‘ఫియర్లెస్ గర్ల్’. 2017 మార్చి 7న స్టాచ్యూని ప్రతిష్టించారు. వందేళ్ల నాటి మహిళా పోరాటాల్లోంచి వచ్చిన మార్చి 8 ఎక్కడ? రెండేళ్ల క్రితమే పుట్టిన ఈ ఫియర్లెస్ పాపాయి ఎక్కడ? ఆ ప్రశ్నే అక్కర్లేదు. మార్చి ఎనిమిది అనే రోజును విగ్రహంలా చెక్కితే.. ‘ఫియర్లెస్ గర్ల్’ రూపమే వస్తుంది. మహిళలు నిర్భయంగా చేసిన పోరాటాలు, లేవదీసిన ఉద్యమాలు, నడిపించిన విప్లవాలు.. వీటన్నిటికీ సరిగ్గా సరిపోయే సింబాలిక్ వర్చ్యూ, స్టాచ్యూ.. ఫియర్లెస్ గర్ల్. ఇప్పుడీ గర్ల్ పవర్ ఎలా విస్తరించబోతోందో చూడండి. ఆడపిల్లలు ఉన్న ఇళ్లల్లో బార్బీడాల్ ప్లేస్‌లోకి ఫియర్లెస్ గర్ల్ డాల్స్ రాబోతున్నాయి. అయితే డాల్స్‌లా కాదు. చిట్టిపొట్టి స్టాచ్యూల్లా! కోర్టులో కేసు నడుస్తోంది. అది క్లియర్ అయితే హైదరాబాద్‌కి, ఆంధ్రా కేపిటల్కీ వచ్చేస్తుంది ఫియర్లెస్ గర్ల్. మనమూ ఒకటి కొనొచ్చు. మన అమ్మాయి బర్త్‌డేకి గిఫ్ట్‌గా ఇవ్వొచ్చు. ఫియర్లెస్ గర్ల్ స్టాచ్యూని చేయించింది ఎసెస్‌జీఏ అయితే, చేసింది క్రిస్టన్ విస్బెల్ అనే అమెరికన్ మహిళ. ఫియర్లెస్ గర్ల్ నమూనాలను ఇప్పటికే ఆమె ఇద్దరు ముగ్గురికి కానుకగా ఇచ్చారు. అయితే ‘మీకా హక్కులేదు’ లేదని ఎసెస్జీఎ కేసు వేసింది. ‘ఫియర్లెస్సెన్ మనిషి జన్మహక్కు. ఎవరి దగ్గరైనా ఆ స్టాచ్యూ ఉండొచ్చు’ అని విస్బెల్ వాదన. అయితే మనిషి జన్మహక్కు కాదు. స్త్రీ జన్మహక్కు. మరి మగవాడికి? స్త్రీని భయపెట్టడం తన జన్మహక్కు అనుకుంటుంది కదా పురుష ప్రపంచం? ఆ ప్రపంచాన్ని హద్దుల్లో ఉంచడానికే ఫియర్లెస్ గర్ల్ స్టాచ్యూ. మార్చి 8 ఉమెన్స్ డే. మార్చి 7 ఫియర్లెస్ గర్ల్ బర్త్ డే. మరి మార్చి 9? బార్బీడాల్ పుట్టినరోజు. బార్బీకి అరవై ఏళ్లొచ్చాయి మొన్న తొమ్మిదికి. మొదట్లో బార్బీ వట్టి మమ్మీ డాల్. మన చిన్నప్పుడు ఆడపిల్లలు ఆడుకునేవాళ్లు కదా.. చిన్న పాపాయిని చంకలో ఎత్తుకుని ఉన్న చిన్నారి బొమ్మతో. అలాంటి బొమ్మ.. బార్బీ డాల్. అయితే ఇండిపెండెంట్ బొమ్మ. చేతిలో పాపాయి ఉండదు. అలాగని తను పాపాయీ కాదు. ఉమన్. ఆ ఉమన్ అరవై ఏళ్లుగా ఆడపిల్లల చేతిలో పాపాయి అయింది. ఫస్ట్ ఫస్ట్ బార్బీ క్యూట్ ఉమన్, స్వీట్ ఉమన్, స్విమ్ సూట్ ఉమన్. స్త్రీని ఇలాగేనా చూపించడం అని మధ్యలో ఎవరో క్వశ్చన్ చేశారు. పాయింటే. వెంటనే ఫ్యాషన్ మోడల్‌గా ఉన్న బార్బీ రోల్ మోడల్ అయింది. సెలబ్రిటీ అయింది. ఆస్ట్రోనాట్ అయింది. సి.ఇ.వో. అయింది. జర్నలిస్ట్ అయింది. ఇంజినీర్ అయింది. ఎయర్హోస్టెస్ అయింది. లోకంలో ఎన్ని టఫ్ ప్రొఫెషన్స్ ఉంటాయో అన్నీ అయింది. ఆఖరికి అమెరికన్ ప్రెసిడెంట్ కూడా. అంతేనా, పవర్ఫుల్ గర్ల్‌గా టైమ్ మేగజీన్ కవర్ పేజీ కూడా అయింది! సాదాసీదాగా ఉన్న బార్బీనీ, స్ట్రాంగ్ బార్బీని చెయ్యడానికి చాలానే ఉద్యమాలు నడిచాయి. ‘‘బార్బీని నెలువెత్తు బొమ్మగా ‘స్కేల్ అప్’ చేసి చూస్తే 5 అడుగుల 9 అంగుళాల ఎత్తు ఉంటుంది. 55–60 కేజీల మధ్య బరువు ఉంటుంది. 36–18–33 ఆకృతిలో ఉంటుంది. లక్ష మందిలో ఒకరికి మాత్రమే ఉండే ఇలాంటి బాడీ షేప్, ఎత్తుకు సరిపడా లేని బార్బీ బరువు.. ఆడపిల్లల మనసు పాడుచేసి, వారిని ‘బార్బీ సిండ్రోమ్’కు గురిచేస్తోందని జూలీ బిండెల్ అనే స్త్రీవాద రచయిత్రి పదేళ్ల క్రితమే ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘ఈ భూమ్మీద బార్బీ ఉన్నంత కాలం ఆడపిల్లలకు మనశ్శాంతి ఉండదు’’ అని యాగ్నెస్ నైర్న్ అనే విద్యావేత్త కలవరపడ్డారు. వాళ్ల ఒపీనియన్‌కి గౌరవం లభించింది. బార్బీ ఇప్పుడు అందమైన పిల్లే కాదు. స్ట్రాంగ్ గర్ల్ కూడా. మరేమిటి? బార్బీ ప్లేస్‌లో ఫియర్లెస్ గర్ల్ వచ్చేస్తుందా? ఇంకో రెండు మూడేళ్లలో వచ్చేస్తుందనే అంటున్నారు. వచ్చినా, రాకున్నా.. ప్రతి బార్బీలోనూ ఇన్‌బిల్ట్‌గా ఓ ఫియర్లెస్ గర్ల్ ఉంటుంది. అందుకే కదా.. కదా ప్రపంచాన్ని అరవై ఏళ్లుగా శాసిస్తూ వస్తోంది. ఫియర్లెస్ గర్ల్‌కి ఉన్నట్లే బార్బీ డాల్ కీ ఒక జన్మ వృత్తాతం ఉంది. బార్బీని సృష్టించింది రూత్హ్యాండ్లర్ అనే మహిళ. అమెకో కొడుకు. కూతురు. కొడుక్కి ఆడుకోడానికి చాలా బొమ్మలు ఉండేవి. కార్లు, ఏరోప్లేన్లు, గన్లు. కూతురికి ఒకే బొమ్మ ఉండేది. కేరింగ్ డాల్. పాపాయిని ఎత్తుకున్న పాపాయి బొమ్మ. ‘కేరింగ్ గానే కాదు, డేరింగ్‌గానూ ఉండాలి నా కూతురు’ అనుకున్నారు రూత్. తనే స్వయంగా కూతురి కోసం బార్బీ డాల్ని తయారు చేశారు. ఆమె కూతురి పేరు బార్బారా. ఆ పేరే బొమ్మకు పెట్టారు బార్బీ అని. -
అమ్మానాన్న.. వందల ప్రేమలేఖలు!
వకుళానాయక్ చిత్రకారిణి. అందమైన భావం ఆమె కుంచె నుంచి అద్భుతంగా ఆవిష్కారమవుతుంది. వాస్తవికతకు గీతల్లో రూపమిస్తుంది. ‘ఇది చిత్రకారులందరూ చేసే పనే కదా! కొత్తగా ఏదైనా చేయాలి’ అని వకుళానాయక్ అనుకుంటుండగా.. ఆ అన్వేషణలో యాదృచ్ఛికంగా జరిగిందో సంఘటన. వాళ్ల నాన్నగారు, వాళ్ల అమ్మకు రాసిన ప్రేమలేఖలు వకుళానాయక్ కంటపడ్డాయి. ఆయన ఉత్తరాల్లోని భావుకత, అక్షరాల్లో ఒలికించిన ప్రేమ భావం గొప్పగా ఉన్నాయి. ప్రతి ఉత్తరాన్ని క్షుణ్నంగా చదివారామె. ఆ ఉత్తరంలో వ్యక్తమైన భావానికి రూపమిచ్చారు. అలా ఆమె వేసిన బొమ్మలతో బెంగుళూరులో ప్రదర్శన కూడా పెట్టారామె. భావాల బొమ్మలు నీటి ఉపరితలం మీద పడవ ప్రయాణిస్తుంటుంది. రెండు చేపలు నీటి లోపల ఈదుతూ ఒకదానికొకటి ఎదురుపడతాయి. ఆరాధనాభావంతో చూసుకుంటూ ఉంటాయి. పడవలో నుంచి ఒక ఎర చేపల మధ్య వేళ్లాడుతూ ఉంటుంది. ఆ ఎరకు కొసన ప్రేమచిహ్నం ఉంటుంది. మరో చిత్రంలో ఒక రాకెట్ ఆకాశం నుంచి నేల వైపు పయనిస్తుంటుంది. అందులో ఉన్న వ్యక్తి చేతిలో ఒక జెండా. ఆ జెండా మీద ప్రేమ చిహ్నంగా ఎర్రటి హృదయం బొమ్మ. మరో చిత్రంలో ప్రేమగా ముక్కులు రాసుకుంటున్న రెండు రామచిలుకలు. ఇంకో చిత్రంలో రెండు గోరువంకల మధ్య ఫోన్ రిసీవర్ వేళ్లాడుతూ ఉంటుంది. రెండు ప్రేమ పక్షులు చెరొక కాఫీ కప్పులో కూర్చుని ఒకదానిని మరొకటి చూసుకుంటుంటాయి. రోజుకో ప్రేమలేఖ! ‘‘మా అమ్మానాన్న ఉద్యోగరీత్యా చాలా కాలం దూరంగా ఉండాల్సి వచ్చింది. ఎప్పుడో ముఖ్యమైన సందర్భాల్లో తప్ప తరచూ కలుసుకునే అవకాశం కూడా ఉండేది కాదు. ఆ రోజుల్లో ఆయన మా అమ్మకు తరచూ ఉత్తరాలు రాసేవాడు. కొన్ని ఉత్తరాల మీద తేదీలను చూస్తే రోజుకొక ఉత్తరం రాసిన రోజులూ ఉన్నాయి వాళ్ల జీవితంలో. ఇప్పటిలా ఫోన్లు ఉన్న రోజులు కావవి. టెలిఫోన్ ఉన్నా కూడా అందరికీ అందుబాటులో ఉండేది కాదు. ‘ఫలానా రోజు ఫోన్ చేస్తాను’ అనే సంగతి కూడా ఉత్తరంలో సమాచారం ఇచ్చుకోవాల్సిన రోజులవి. అప్పుడు వారి మధ్య దూరాన్ని తగ్గించిన నేస్తాలా ఉత్తరాలు. అందులో ఆయన రాసిన విషయాలకు నేను బొమ్మలు వేశాను. నాన్న పోయాక ఆయన వస్తువులు చూస్తున్నప్పుడు ఈ ఉత్తరాలు దొరికాయి’’ అని వివరించారు వకుళా నాయక్. ఉత్తరాలే కాదు ఏ రకమైన పాత కాగితం కనిపించినా దానికి నప్పే బొమ్మ వేసి ఆ బొమ్మలో ఈ కాగితాన్ని ఇమడ్చడం ఆమె ప్రత్యేకత. పాత దస్తావేజులు, సరుకులు కొన్న చీటీలు, సంగీతం నోట్స్... ఏదైనా సరే... ఆ కాన్సెప్ట్‌కు తగినట్లు బొమ్మ వేసి ఒక డెకరేటివ్ పీస్‌గా మారుస్తారు వకుళ. ఈ ఆర్ట్‌ను వింటేజ్ లవ్ లెటర్స్ ఎగ్జిబిషన్ అంటారు. – మంజీర -
అనగనగా ఓ ఊరు
జపాన్‌లోని షికోకు అనే ద్వీపం.. అక్కడ కొండకోనల్లో నగోరో అనే చిన్న పల్లె.. అక్కడ అందరూ కష్టజీవులే అనుకుంటా.. ఎందుకంటే.. ఈ గ్రామానికి వెళ్లి చూస్తే.. రోడ్డు పనులు చేస్తూ కొందరు.. పొలాల్లో మరికొందరు.. చేపలు పడుతూ ఇంకొందరు.. ఇలా ఎక్కడ చూసినా జనం పనిచేస్తూ కనిపిస్తారు.. కనిపించడమే గానీ.. ఒక్కమాటా వినిపించదు.. దీంతో మాట్లాడదామని దగ్గరకు వెళ్తే గానీ.. మనకు అసలు విషయం బోధపడదు.. వాళ్లు మనుషులు కాదు.. బొమ్మలని..! ఆ పల్లె జనాభా 40 లోపే.. బొమ్మల జనాభా దాదాపు 350! ఇంతకీ ఏమిటీ బొమ్మల కథ.. కొంచెం తేడాగా ఇది ప్రతి పల్లె కథ.. పని కోసం ఆ పల్లె కూడా నడిచింది పట్నపు దారుల వెంట.. చదువుల కోసం, ఉద్యోగాల కోసం జనం ఊరును విడిచారు.. ఊరును మరిచారు. టకుమి అయానో తప్ప.. ఆమె చిన్నప్పుడే వాళ్ల కుటుంబం ఊరు విడిచి వెళ్లిపోయింది. అయితే, 2000 సంవత్పరంలో టకుమి తిరిగి వచ్చింది. తన తండ్రి బాగోగులు చూడటం కోసం.. జనం లేక ఊరు వల్లకాడులా కనిపించింది. దీంతో పల్లెకు మళ్లీ ప్రాణం పోయాలనుకుంది. వినూత్నంగా తన నిరసనను తెలుపుతూ.. ఊరును మళ్లీ ‘జనం’తో నింపాలనుకుంది. అలా మొదలైంది.. ఈ బొమ్మల కథ.. ఆ ఊరులో చనిపోయినవారు లేదా ఆ ఊరు విడిచిపోయినవారి పేరిట బొమ్మలను తయారుచేయడం ప్రారంభించింది. బెస్తవారైతే ఆ లెక్కన.. వ్యవసాయదారుడైతే ఆ తరహాలో.. బొమ్మలను రూపొందించింది. అంటే.. ఆ ఊరిలో చనిపోయిన లేదా విడిచివెళ్లిన ప్రతి ఒక్కరి పేరు మీద బొమ్మలున్నాయన్నమాట. వారు విడిచివెళ్లిన ఇళ్ల వద్ద వారు ఉన్నట్లుగానే భ్రమింపజేసేలా ఆ బొమ్మలను తయారుచేసి.. అక్కడే పెట్టింది. అంటే ఆ ఊరి వారు ఇంకా అక్కడే ఉన్నట్లుగా.. జనం లేక వల్లకాడులాగ మారుతున్న పల్లెల సమస్యను తెలియజేయడానికి తానిలా చేస్తున్నట్లు టకుమి తెలిపారు. పైగా.. దీని వల్ల పదిమందితో కలిసి ఉంటున్నామన్న భావన కూడా కలుగుతుందని చెప్పారు. ఇది పదిమందిని ఆకర్షించింది. ఆ ఊరు చిన్నసైజు పర్యాటక ప్రదేశంగా మారిపోయింది. జపాన్‌లో దాదాపు 10 వేల ఊళ్లు ఇలాంటి ఇబ్బందిని ఎదుర్కొంటున్నాయట. ఇప్పుడిప్పుడే వేరే గ్రామాల్లోనూ ఇలాంటి బొమ్మల నిరసన మొదలవుతోందట. -
అయస్కాంతాలతో అనారోగ్యం పాలయ్యాడు!
ఉటా : పిల్లలు బొమ్మలతో ఆడుకోవడమంటే చాలా ఇష్టపడుతారు. అందులో వైవిధ్యమైన బొమ్మలంటే వారికి మరింత సంతోషం. వాటి కోసం కొట్లాడుతారు. మారం చేస్తారు. చివరకు కావాల్సిన బొమ్మలను కొనిపించుకుంటారు. అయితే కొన్నిసార్లు అవే బొమ్మలు వారి అనారోగ్యానికి కారణం అవుతాయి. ఈ బొమ్మల విషయంలో పిల్లల పట్ల తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తగా ఉన్నా.. ఒక్కోసారి ఏదో తీట పనిచేసి ఇబ్బందులు తెస్తుంటారు. ఇలానే అమెరికా, ఉటాలోని సాండీకి చెందిన మికా అర్విడ్సన్ అనే ఆరేళ్ల కుర్రాడు ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. తన సోదరుడి బొమ్మను నోట్లో దాచుకునే ప్రయత్నం చేసి తెలియకుండానే మింగేశాడు. దీంతో అనారోగ్యానికి గురైన అతను వాంతులు చేసుకున్నాడు. ఇది గమనించిన తల్లిదండ్రులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. అత్యవసర శస్త్ర చికిత్స చేసిన వైద్యులు మికా కడుపులో బొమ్మకు సంబంధించిన 14 చిన్న అయస్కాంతాలను గుర్తించి బయటకు తీశారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని, ఇంకా మికా ఎలాంటి ఆహారం తీసుకోవడం లేదని అతని తల్లిదండ్రులు తెలిపారు. -
వీధి బొమ్మలు
వీధి బొమ్మలు.. అయ్యో.. తప్పు రాశామే! విధి బొమ్మలేమో కదా!విధాత రాసిన విధి కాదు. కొందరు దురాగతుల రాత ఇది.రాలిన పూలను నులిమి ఆ రంగులు పూసిన వీధులివి. మన వీధులే. మన పిల్లలే. మన సమాజమే. కానీ.. వీధిలో వదిలేశారు.అదే వీధి బొమ్మలు ఇవాళ మన సంస్కారాన్ని వెక్కిరిస్తున్నాయి. కోల్‌కతా రెడ్‌లైట్ ఏరియాలోని చెల్లెళ్లు గీసిన ఈ బొమ్మలు అమ్మవారి మంటపాల ముందు కొలువయ్యాయి. దసరా నవరాత్రులకు పుట్టిల్లు కోల్‌కతా. ఈ నవరాత్రుల్లో దుర్గాపూజలో పాల్గొన్నారీ కోల్‌కతా మహిళలు. కోల్‌కతాలో వీళ్లు నివసించే ప్రదేశం ‘సోనాగచ్చి’ గురించి నూటికి తొంభై మందికి తెలిసే ఉంటుంది.. కానీ తెలియనట్లు ముఖం పెడతారంతే. ఆ ప్రదేశం పేరు పలకడానికి కూడా ఇష్టపడనంత విముఖతను కూడా వ్యక్తం చేస్తుంది సభ్యసమాజం. మరి వాళ్ల జీవితాలు అక్కడికి చేరడంలో సభ్యసమాజం పాత్ర లేదా? లేదా కాదు, పూర్తి బాధ్యత సమాజానిదే. దేహంతో వ్యామోహం తీర్చుకోవచ్చనే కుత్సిత బుద్ధికి, దేహం మీద వ్యాపారం చేయవచ్చనే కుటిలనీతికి పుట్టిన వృత్తి వారిది. ఇప్పుడీ మహిళలు దుర్గామాతకు అర్పిస్తున్న నైవేద్యం ఏమిటో తెలుసా? వారి మనోవేదన! తమ జీవితాలు ఎలా ఉన్నాయో చెప్పడానికి మాటలు కావాలి. చెప్పడానికి మాటలు చాలని బాధను వాళ్లు కుంచెతో చెప్పారు. నోరు విప్పడానికి ధైర్యం లేని తమ దుస్థితిని బొమ్మల్లో చూపించారు. వీధే వేదిక కోల్‌కతా సోనాగచ్చి మహిళలు ‘అహిరోతోలా’ లో మూడు వందల అడుగుల పొడవున్న వీధిలో బొమ్మలు వేశారు. ఆ వీధి వెంట నడుస్తూ ఆ బొమ్మలను చూస్తుంటే కొద్ది నిమిషాలు మాటలు రావు. ప్రతి బొమ్మా మౌనంగా మాట్లాడుతుంటుంది. ఆ మాటలను నిశ్శబ్దంగా వింటూ ముందుకు సాగిపోవాల్సిందే. ఒక బొమ్మలో... తలుపు కొద్దిగా తెరుచుకుని ఉంటుంది, ముగ్గురమ్మాయిలు ఒకరి వెనుక ఒకరు నిలబడి బయటకు తొంగి చూస్తుంటారు. అది విటుడు వచ్చినప్పుడు వేశ్యాగృహం నిర్వహకుల పిలుపుతో బయటకు వచ్చి చూసే దృశ్యం. ఆ బొమ్మకు పైన మూడు బొమ్మలున్నాయి. మొదటి బొమ్మలో ఒక అమ్మాయి అద్దంలో చూసుకుంటూ అలంకరించుకుంటోంది, రెండవ బొమ్మలో అదే అమ్మాయి అలంకరణ పూర్తి చేసుకుని చేతి విసనకర్రతో విసురుకుంటూ ఉంటుంది. ఇక మూడవ బొమ్మలో అమ్మాయి ముఖాన్ని సగం మేర చీర కొంగు కప్పేసి ఉంది. మిగిలిన సగం ముఖంలో బొట్టు కూడా సగం మేరకే కనిపిస్తోంది. ఆ బొమ్మ చెప్తున్న విషయం ఏమిటంటే.. ఆ బొట్టు చెరిగి ఉందన్న వాస్తవాన్ని గమనించమని. కన్నీటి మడుగు ఒక బొమ్మలో ఒక టీనేజ్ దాటని అమ్మాయి.. కళ్ల నుంచి నీరు ధారాపాతంగా కారిపోతోంది. అలా కారిన నీళ్లు ఆమె ముందే మడుగు కట్టి ఉంది. తన దుర్భర జీవితాన్ని తలుచుకుని కడివెడు కన్నీళ్లు కార్చిందని చెబుతోందా బొమ్మ. మరొకమ్మాయి ఒంటి మీద ఉండాల్సిన చీర నేల మీద పరుచుకుని ఉంది. ఆమె చేతులతో దేహాన్ని కప్పుకుంటోంది. మరికొన్ని బొమ్మలు కేవలం పెదాలే.. వాటికి తాళం కప్పలు వేసి ఉన్నాయి. మరికొన్ని బొమ్మల్లో కేవలం చేతులు.. మా దేహం మీద దాష్టీకం వద్దు అడ్డు చెబుతున్నట్లున్నాయి. మరో బొమ్మలో ముగ్గురమ్మాయిలు ఒకరి కన్నీళ్లు మరొకరు తుడుచుకుంటున్నారు. ఇదీ.. సోనాగచ్చి మహిళలు చెప్పదలుచుకున్న వారి జీవితం. వంద వాక్యాల్లో కూడా చెప్పలేని దైన్యాన్ని బొమ్మల్లో చూపించిన వైనం. అమ్మవారిని శక్తిస్వరూపిణిగా పూజించే సమాజమే... అమ్మాయిని మాత్రం వ్యామోహం తీర్చుకోవడానికి, ఆమె దేహంతో వ్యాపారం చేయడానికి వాడుకుంటుంది. ఆమె పొట్ట నింపుకోవడానికి ఆమె దేçహాన్నే పెట్టుబడి వనరుగా మారుస్తుంది. ఈ ద్వంద్వ ప్రవృత్తి రూపుమాసిపోనంత కాలం ఈ వీధి బొమ్మలు కూడా చెరిగిపోవు. చెప్పడానికే ఇదంతా సెక్స్ వర్కర్ల జీవితంలో ఉన్న దౌర్బల్యాన్ని సమాజానికి తెలియచేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు జుబాక్బృంద దుర్గాపూజ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ సాహా. ఒక మహిళ సెక్స్ వర్కర్‌గా మారిందంటే... అందుకు కారణం అక్రమ రవాణా కావచ్చు లేదా తన పిల్లల కడుపు నింపడానికి మరోదారి లేక కావచ్చు... అన్నారాయన. – వాకా మంజులారెడ్డి -
అద్భుతం: వాల్‌మార్ట్‌తో ఆరేళ్ల బాలుడి డీల్!
న్యూఢిల్లీ : ముద్దులొలికే మాటలతో అలరించే ఓ ఆరేళ్ల బాలుడు అద్భుతం చేశాడు. అమెరికాకు చెందిన అతిపెద్ద రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్‌తో డీల్ కుదుర్చుకున్నాడు. యూట్యూబ్‌లో టోయస్(బొమ్మలను) సమీక్షించే ఆరేళ్ల బాలుడు ర్యాన్, ఏకంగా తన సొంత టోయస్ బ్రాండులను మార్కెట్లోకి తీసుకొచ్చి విక్రయించడం మొదలుపెట్టాడు. దీని కోసం వాల్‌మార్ట్‌కు చెందిన 2500 అమెరికా స్టోర్లతో, వెబ్‌సైట్‌తో సోమవారం డీల్ కుదుర్చుకున్నాడు. యూట్యూబ్ ఛానల్ ర్యాన్ టోయస్రివ్యూకు ఈ అబ్బాయే స్టార్. గతేడాది 8వ బెస్ట్ పెయిడ్ యూట్యూబర్‌గా కూడా నిలిచాడు. యూట్యూబ్‌లో టోయిస్లను రివ్యూ చేస్తూ ఉంటాడు. ఇప్పటికీ ర్యాన్ యూట్యూబ్ టోయస్రివ్యూ ఛానల్‌కు 15 మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్లున్నారు. టోయస్తో ఆడుకుంటూ.. వాటికి అనుగుణంగా స్పందించే ర్యాన్ వీడియోలకు నెలకు 1 బిలియన్కు పైగా వ్యూస్ వస్తున్నాయి. యూట్యూబ్‌లో టోయస్ రివ్యూ చేస్తూనే.. ఈ బాలుడు మిలీనియర్ అయ్యాడు. గతేడాది 11 మిలియన్ డాలర్లను ఆర్జించాడు. 2015 మార్చి నుంచి ర్యాన్ ఫ్యామిలీ ఆ బాలుడి వీడియోలను రికార్డు చేయడం, పోస్ట్ చేయడం చేస్తోంది. లిగో బ్యాక్స్ తెరవడం, దానితో ఆడటం ఈ బాలుడి తొలి వీడియో. మూడేళ్ల వయసులో దీన్ని యూట్యూబ్‌లో పెట్టారు. ఇలా ర్యాన్ యూట్యూబ్ స్టార్‌గా మారిపోయాడు. దీంతో తన సొంత బ్రాండ్ టోయస్‌నే ఏకంగా మార్కెట్లోకి తీసుకొస్తున్నాడు. అక్టోబర్‌లో తన టోయస్ వ్యాపారాన్ని మరింత విస్తరించనున్నట్టు ర్యాన్ చెబుతున్నాడు. కాగ, యూట్యూబ్ స్టార్ల రీచ్‌ను విస్తరించడానికి వారితో పాకెట్.వాచ్ లైసెన్స్ డీల్స్ చర్చలు కూడా జరిపింది. టోయస్, అప్పీరల్, హోమ్ ప్రొడక్ట్‌లకు వీరి రీచ్‌ను విస్తరించాలనుకుంది. ర్యాన్ వరల్డ్ వర్తకం మూడేళ్లు, ఆపై వారికి డిజైన్ చేస్తూ మార్కెట్లోకి వచ్చింది. ర్యాన్‌కు ఇష్టమైన వాటిలో పిజ్జాలు కూడా ఉన్నాయి. -
రాతిని శిలగా మార్చి..
మనిషిని దేవుడు సృష్టించినట్లు పలువురువిశ్వసిస్తున్నారు. అయితే దేవుడి రూపు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. మనం కొలిచే దేవుడు ఇలాగే ఉంటాడు అని నిర్ధిష్టమైనప్రమాణాలు ఏవీ లేనప్పటికీ.. పేరు తలవగానే ఆ రూపం కళ్లముందు కదలాడే విధంగా శిలా ప్రతిమలను తీర్చిదిద్దుతున్నాడు రామ్మూర్తి. అతని ఉలి దెబ్బకు ఎలాంటి రాయి అయినా దేవతా రూపం దాల్చి తీరుతోంది. శిల్ప కళతో పాటు వడ్రంగి పనిలోనూ ప్రత్యేకతనుచాటుకుంటున్న రామ్మూర్తి గురించి తెలుసుకోవాలంటే చంద్రగిరి గ్రామానికివెళ్లి తీరాల్సిందే. బొమ్మనహాళ్ : రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహాళ్ మండలంలోని చంద్రగిరి గ్రామానికి చెందిన రామ్మూర్తి ఆచారి.. రాతితో శిల్పాలు చెక్కుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రాతితో దేవతా ప్రతిమలు చేయడంలోనే కాదు చెక్కతో రథాలు, బొమ్మలు చేయడంలోనూ మంచి నైపుణ్యాన్ని కనబరుస్తూ మరి కొందరికి ఉపాధిని అందిస్తున్నారు. చిన్నప్పటి సాధనే.. రామ్మూర్తికి చిన్నప్పటి నుంచి చిత్రలేఖనంపై ఆసక్తి ఎక్కువ. ఇంటర్మీడియట్ తర్వాత ఆర్థిక ఇబ్బందులతో ఉన్నత చదువులకు దూరమయ్యాడు. అప్పటి వరకు చిత్రకళపై ఉన్న మక్కువను చెక్కతో బొమ్మలు తయారు చేయడంపై మళ్లించాడు. అనంతరం రాతితో విగ్రహాలను తయారు చేయడం ప్రారంభించాడు. తొలిదశలో రాతిని శిల్పంగా మార్చేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇంటి వద్దనే ఉంటూ అదే పనిగా సాధన చేయడంతో తిరుగులేని నైపుణ్యాన్ని అతను సంపాదించుకున్నాడు. ముందుగా స్కెచ్ పెన్ను, పెన్సిల్‌తో దేవతామూర్తుల చిత్రాలను గీసుకుని అందుకు అనుగుణంగా విగ్రహాలను ఆయన తయారు చేస్తుంటారు. ఉభయ రాష్ట్రాల్లో పేరు శిలా విగ్రహాల తయారీకి రామ్మూర్తి కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ, గుంటూరు జిల్లా కోటప్ప కొండ నుంచి ప్రత్యేకంగా రాయిని తెప్పించుకునేవాడు. వీటితో శివుడు, పార్వతి, ఆంజనేయస్వామి, మద్దానేశ్వరస్వామి, సరస్వతీ, అయ్యప్ప, వినాయకుడు, ప్రభావతి, నాగలింగేశ్వరుడు, నంది, నవగ్రహాలు, వీరభద్రస్వామి తదితర విగ్రహాలను ప్రత్యేకంగా తయారు చేస్తుంటాడు. బళ్లారిలోని బసవ భవన్లో ఏర్పాటు చేసిన అనాది లింగేశ్వర స్వామి విగ్రహం, హిందూపురంలోని ప్రత్యంగిరాదేవి ప్రతిమ ఇతను చేసినవే. జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నెలకొల్పిన వాల్మీకి, కనకదారు విగ్రహాలను కూడా రామ్మూర్తి చేసినవే కావడం గమనార్హం. తన వృత్తి నైపుణ్యంతో ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ఆయనకు మంచి పేరు ఉంది. ఇప్పటివరకు వందకు పైగా విగ్రహాలు, రథాలను రామ్మూర్తి ఆచారి చేసి ఇచ్చారు. గ్రామీణ శిల్పులను ఆదుకోవాలి గ్రామీణ ప్రాంతాల్లోని శిల్పులను ప్రభుత్వం ఆదుకోవాలి. వృత్తి నైపుణ్యతకు సహకరించాలి. శిల్పాలు చేసేందుకు ప్రత్యేక రాయితీలతో పాటు ప్రోత్సాహాకాలు అందించాలి. దేవతా విగ్రహాలను తయారు చేయడం ద్వారా రోజూ రూ. 400 ఆదాయం వస్తోంది. దీంతోనే జీవనం సాగించడం దుర్భరంగా ఉంటోంది.– బడిగే రామ్మూర్తి ఆచారి, శిల్పి, చంద్రగిరి -
ఈ రాముడు..ఏకలవ్యుడు
కంక బొంగులకు ప్రాణం పోస్తే.. సిమెంటు, ఇసుకకు ఓ ఆకృతినిస్తే.. బొమ్మలు మాట్లాడుతాయి.. ప్రతిమలు మనుసులను ఆకర్షిస్తాయి. ఏకలవ్యుడి చేతిలో ప్రాణం పోసుకున్న కళాకృతుల్ని చూస్తే అబ్బా ఏం కళ అనకుండా ఉండరంటే నమ్మండి. అంత కళ ఉన్నప్పటికీ కొలాం గిరిజన యువకుడికి తగిన ప్రోత్సాహం లభించట్లేదు. తగిన ప్రోత్సామందిస్తే మరింతమందికి ఉపాధి కల్పిస్తానని ఆ యువకుడు పేర్కొంటున్నాడు. నార్నూర్(ఆసిఫాబాద్): నార్నూర్ మండలం ఖైర్‌డట్వా గ్రామ పంచాయతీ పరిధిలోని నడ్డంగూడ గ్రామానికి చెందిన మాడవి రాము అద్భుతమైన కళాకృతులకు ప్రాణం పోస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. రాము పదో తరగతి వరకు నార్నూర్ మండలంలోనే అభ్యసించాడు. అనంతరం ఆర్థిక స్థోమత లేక ఉన్నత విద్యను అభ్యసించలేదు. తల్లిదండ్రులతో అడవికి వెళ్లి వెదురు తెచ్చుకుని వారు తయారు చేసే చాపలు, బుట్టలు, తడకలు తదితర రూపాలను రాము సైతం నేర్చుకున్నాడు. ప్రతిభ బయటికొచ్చిందిలా.. కొన్నేళ్ల క్రితం పొలాల అమావాస్య నాడు ఎడ్ల పూజలకు రకరకాల అలంకార వస్తువులను రాము తల్లిదండ్రులు తీసుకువచ్చారు. ఆ కాగితాలు, దేవుళ్ల చిత్రాలను రాము అందంగా తయారు చేశాడు. అదే సమయంలో కట్టెలతో తయారు చేసిన ఎడ్ల జత ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గ్రామంలోని దేవాలయంలో తాను తయారు చేసిన ఎడ్ల జతను దేవాలయంలో ప్రదర్శనకు ఉంచాడు. అంతే కాకుండా దేవాలయంలోని గోడలపై వివిధ బొమ్మలు వేశాడు. అతడి ప్రతిభ గుర్తించిన ఇరుగు పొరుగు తమ ఇళ్లకు కూడా బొమ్మలు వేయాలని ఆఫర్ ఇచ్చారు. ఆ రోజు నుంచే తన జీవితం మారిపోయిందని రాము చెప్పకొస్తున్నాడు. మరుసటి రోజు నుంచే అలా ఇళ్ల గోడలపై బొమ్మలు వేయడం ప్రారంభించానని, భరతమాత, గాంధీజీ, అంబేద్కర్, బుద్ధుడు, శ్రీరాముడు, బాలాజీ, శివుడు ఇలా చిత్రాలు వేసి రోజుకు రూ. 500 చొప్పున కూలీ సంపాదించానని రాము చెబుతున్నాడు. విగ్రహాల తయారీతో ఉపాధి.. రాముకు ఒక ఆలోచన రావడంతో సుత్తితో హనుమంతుడిని చిన్న ప్రతిమ చెక్కడం మొదలు పెట్టాడు. దాన్ని చూసిన ఖండోరాంపూర్ గ్రామానికి చెందిన నాగోరావు అనే రేషన్ డీలర్ మాకు సంత్ తుక్డోజీ మహారాజ్, గాంధీజీ విగ్రహాలు కావాలని కోరడంతో సిమెంట్, కాంక్రిట్, ఇనుప చువ్వలతో రెండు విగ్రహాలను తయారు చేసి రాము రూ, 10 వేలు పారితోషికం పొందాడు. అప్పటి నుంచి రాము ప్రతిమల్ని తయారు చేయడం ప్రారంభించాడు. తాను ఎవరి దగ్గరా శిక్షణ తీసుకోకుండా ఏకలవ్యుడిగా పేరు తెచ్చుకున్నాడు. అర్డర్లు చాలానే వస్తున్నాయని, కొన్ని విగ్రహాలకు కావాల్సిన పని ముట్లు, మిషన్లు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని రాము పేర్కొంటున్నాడు. వెదురుతో క్రాప్ట్:నడ్డంగూడ గ్రామానికి చెందిన వికలాంగుడు ఆత్రం జలపత్రావు సహాయంతో రాము వెదురుతో రకరకాల వస్తువులను తయారు చేస్తున్నారు. ఇంట్లో వాడే దగ్గరి నుంచి కూర్చీలు వరకు వెదురుతో తయారు చేసి అందరికీ అదర్శంగా నిలుస్తున్నారు. ఆయన దగ్గర ఎలాంటి సామగ్రి లేకున్న సొంత తెలివితేటలతో వస్తువులను తయారు చేస్తున్నాడు. వెదురుతో ఎడ్ల బండి, ఎద్దులు, తాజ్‌మహాల్, స్టాండ్లు, బొమ్మలు, సెల్‌ఫోన్ స్టాండ్లు తదితర వస్తువులను తయారు చేస్తున్నారు. వీటిని ఆదిలాబాద్ లేదా హైదరబాద్ తీసుకెళ్లి అమ్ముతున్నారు. వసువులు తయారీకై ఎలాంటి పనిముట్లు తమ వద్ద లేవని, ఐటీడీఏ ద్వారా సామగ్రిని అందజేస్తే మరింత మందికి ఉపాధి కల్పిస్తామని ఆయన అంటున్నారు. ఐటీడీఏ అధికారులతో పాటు కలెక్టర్ స్పందించి కొలాం గిరిజనులను ప్రోత్సహించాలని వారు కోరుతున్నారు. యువతకు నేర్పిస్తా నేను స్యయంగా నేర్చుకుని శిల్పా కళతో కుటుంబాన్ని పోషిస్తున్నా. శిల్పాలను సుత్తితో చెక్కడం చాలా కష్టంగా ఉంది. ఐటీడీఏ ద్వారా ప్రభుత్వం ఏదైనా సహాయం చేస్తే మిషన్లు కొనుక్కుని తక్కువ సమయంలో అందమైన శిల్పాలను చెక్కుతా. నేను ఉపాధి పొందుతూ మరో పది మందికి ఉపాధి కల్పిస్తా.– మాడవి రాము, నడ్డంగూడ, నార్నూర్ -
బొమ్మ కొంటే...కారు గిఫ్ట్
సాక్షి, సిటీబ్యూరో: ‘షాపింగ్‌ఫ్లెవర్.కామ్’ వెబ్సైట్లో ఆన్లైన్లో బొమ్మలు కొనుగోలు చేస్తే కారు బహుమతిగా ఇస్తామంటూ అమాయకులను మోసం చేస్తున్న ఇద్దరు ఢిల్లీవాసులను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. క్రైమ్స్ డీసీపీ జానకీ షర్మిలా కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి..పాయ్‌పాల్ నుంచి యోగేశ్ అనే పేరుతో మాదాపూర్‌కు చెందిన బాధితురాలికి ఫోన్ చేసిన ఓ వ్యక్తి మీ బాబుకు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.షాపింగ్‌ఫ్లెవర్.కామ్ వెబ్సైట్లో ఆన్లైన్లో బొమ్మలు కొనుగోలు చేస్తే కారు బహుమతిగా వస్తుందని నమ్మించాడు. ఆన్లైన్లో కొనుగోలు చేసిన అనంతరం మీ కుమారుడు కారు గెలుచుకున్నాడంటూ ఫోన్ చేసిన అతను రూ1.5లక్షలు స్కైలర్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుమీద ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాలో డిపాజిట్ చేయించుకున్నాడు. ఆ తర్వాత మీ కారును విడుదల చేయాలంటే ఇన్కమ్ ట్యాక్స్ చార్జీల కోసం మీ బ్యాంక్ ఖాతాలో రూ.5.5 లక్షలు బ్యాలెన్స్ ఉంచాలని సూచించడంతో ఆ మొత్తాన్ని జమ చేసింది. ఆ తర్వాత ఇంటర్నెట్ బ్యాంకింగ్ లాగిన్ పాస్వర్డ్లు తెలుసుకున్న అతను ఆ మొత్తాన్ని ఇతర బ్యాంక్ ఖాతాలోకి మళ్లించాడు. చివరకు మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదుచేశారు. నిందితుడి బ్యాంక్ ఖాతా ఆధారంగా సోమవారం న్యూఢిల్లీలో నిందితులను పట్టుకొని ట్రాన్సింట్ వారంట్‌పై గురువారం నగరానికి తీసుకొచ్చారు. స్కైలర్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లుగా చెప్పుకుంటున్న మృదుల్ కపూర్, సుమిత్ సింగ్ సొలంకి ఫ్లాస్‌వై4యూ, మైషాప్‌మైడీల్స్, షాపింగ్‌ఫ్లెవర్.కామ్‌లతో ఆన్లైన్ వెబ్సైట్లు ఓపెన్ చేసి అమాయకులను మోసం చేస్తున్నట్లు తెలిపారు. నిందితులను న్యాయస్థానంలో హాజరుపరచగా జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. -
బొమ్మల బడి...అంగన్వాడీ
మేడ్చల్‌రూరల్: చిన్నారులు మనను అనుకరిస్తూ మనలా మాట్లాడటానికి ప్రయత్నిస్తుంటారు. పిల్లలు ఎదిగే దశలో మనను అనుసరిస్తూ నేర్చుకుంటారు. కానీ చాలా మంది పిల్లలు బొమ్మలతో ఆడుకోవడానికి ఆసక్తి కనబరుస్తారు. ప్రైవేటు ప్లే స్కూల్లకు దీటుగా ప్రభుత్వ అంగన్వాడీ కేంద్రాలలో చిన్నారులకు ఆటపాటలను నేర్పుతున్నారు. పిల్లలకు ఆటపాటలతో మనోవికాసం కలిగిస్తూ అంగన్వాడీ కేంద్రాలు ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఎటు చూసినా ఆట వస్తువులే... అంగన్వాడీ కేంద్రాలలో ఎక్కడ చూసినా పిల్లలు ఆడుకునేందుకు ఆట వస్తువులు, గోడలకు బొమ్మల చిత్రాలే దర్శనమిస్తున్నాయి. అంగవాడీ కేంద్రం భవనం గోడలపై తెలుగు వర్ణమాల, కూరగాయలు, పండ్ల బొమ్మలు, మనిషి అవయవాల పటాలను ఏర్పాటు చేశారు. పండ్లు, కూరగాయలు, గుర్రం, వంటి వాహనాల నమూనా ప్లాస్టిక్ బొమ్మలతో చిన్నారులకు బోధన చేస్తున్నారు. అంగన్వాడీ టీచర్లు చిన్నారుల మధ్యలో కూర్చోని ఆటపాటలతో విద్యనందిస్తున్నారు. అదే విధంగా అంగన్వాడీ కేంద్రాలు ఐసీడీఎస్ నినాదాలతో, తెలుగు వర్ణమాల, ఆరోగ్యలక్ష్మి పథకం ఉద్దేశం, గర్భిణులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలిపే చార్టులతో కనిపిస్తున్నాయి. మెనూ ప్రకారం.. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు మెనూ ప్రకారం పోషకాహారాలను అందిస్తున్నారు. బాలామృతం, క్రమం తప్పకుండా ప్రతి రోజు భోజనంలో ఉడకబెట్టిన గుడ్లు, పోషకాహారాలను అందిస్తున్నారు. పిల్లలకు మంచి అలవాట్లు నేర్పుతూ వారి భవిష్యత్‌కు బాటలు వేస్తున్నారు. ఆటవస్తువులు పంపిణీ చేసిన భాస్కర్‌యాదవ్... సీఎం కేసీఆర్, మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్రెడ్డిలజన్మదినం పురస్కరించుకుని ఇటీవలమేడ్చల్ జిల్లా గ్రంథాలయాల చైర్మన్ భాస్కర్‌యాదవ్ మండలంలోని 61 అంగన్వాడీ కేంద్రాలకు ఆట వస్తువులను ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి చేతుల మీదుగా ఉచితంగా అందజేశారు. -
భూటాన్ యువరాజుకు చెన్నపట్టణ బొమ్మలు
సాక్షి, బెంగళూరు: మొదటి సారిగా భారత పర్యటనకు వచ్చిన భూటాన్ రాజ దంపతుల కుమారునికి రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కర్ణాటకకు చెందిన ప్రముఖ హస్తకళాకృతుల్లో ఒకటైన చెన్నపట్టణ బొమ్మలను అందజేశారు. భూటాన్ రాజు జిగ్మే నామ్గల్ వాంగ్‌చుక్ తన భార్యా, ఏడాదిన్నర వయస్సున్న కుమారుడితో భారత పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భూటాన్ రాజ దంపతులతో సమావేశమైన నిర్మలా సీతారామన్ యువరాజుకు ఒక కుందేలు బొమ్మతో పాటు కొన్ని చెన్నపట్టణ బొమ్మలను బహుమతిగా అందజేశారు. యువరాజుకు అందజేసిన బొమ్మలు రాజదంపతులను ఆకట్టుకున్నాయంటూ నిర్మలా సీతారామన్ ట్వీట్ చేశారు. చెన్నపట్టణ బొమ్మలతో ఆడుకుంటున్న బుల్లి యువరాజు -
కొండపల్లి బొమ్మకు కొత్తందం
బొమ్మల తయారీ పరిశ్రమకు నిధుల విడుదల మూలనపడిన పరిశ్రమకు ఊతం కొండపల్లి కొయ్యబొమ్మ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటివరకు ప్రభుత్వ ప్రోత్సాహానికి నోచుకోక నిండా మునిగిన బొమ్మల పరిశ్రమకు ఊతం లభించింది. ఢిల్లీకి చెందిన ఎంపవర్ సంస్థ, కేంద్ర ప్రభుత్వం కలిసి కొండపల్లి బొమ్మల తయారీ పరిశ్రమకు రూ.1.75 కోట్ల నిధులు మంజూరు చేశాయి. ఈ డబ్బును సక్రమంగా వినియోగించుకుంటే వందల ఏళ్ల కళకు పునరుజ్జీవం కలుగుతుందని కళాకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొండపల్లి (ఇబ్రహీంపట్నం) : ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కొండపల్లి బొమ్మల తయారీ పరిశ్రమ ప్రగతి పథంలో దూసుకుపోతోంది. ఢిల్లీకి చెందిన ఎంపవర్ సంస్థ నేతృత్వంలో కేంద్ర చిన్న, మధ్య తరహా పరిశ్రమ నుంచి కొండపల్లి పరిశ్రమకు రూ.1.75 కోట్ల నిధులు మంజూరయ్యాయిఈ పరిశ్రమ ఇప్పటికే జాతీయస్థాయి జాగ్రఫికల్ ఇండికేషన్ గుర్తింపు పొందింది. సుమారు 350 కుటుంబాల జీవన మనుగడగా, సమస్యల వలయంలో నెట్టుకొస్తున్న బొమ్మల తయారీ పరిశ్రమకు ఈ పరిణామం ఊరట కలిగిస్తుందంటున్నారు. రాజస్థాన్ హస్తకళ స్ఫూర్తితో.. 400ఏళ్ల క్రితం కొండపల్లిలో రాచరిక పాలన కొనసాగేది. రాజుల కాలం నాటి భవనాలకు డిజైన్ చేసేందుకు రాజస్థాన్ నుంచి హస్తకళాకారులు వలస వచ్చారు. రాజులు అంతరించాక బొమ్మల తయారీ పరిశ్రమను జీవనోపాధిగా ఎంచుకుని వారంతా ఇక్కడే స్థిరపడ్డారు. కొండపల్లి అడవుల్లో లభించే తెల్ల పొనుగు చెట్ల నుంచి లభించే చెక్కతో బొమ్మలు తయారుచేసి.. క్రమంగా కేంద్రాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పటికీ బొమ్మలు తయారుచేస్తూ ఉపాధి పొందుతున్నారు. అందని ప్రభుత్వ సాయం వందల ఏళ్ల చరిత్ర కలిగిన కొండపల్లి బొమ్మల పరిశ్రమకు ప్రభుత్వ సహకారం అంతంతమాత్రమే. 2002లో నాబార్డు నుంచి ఒక్కొక్కరికి రూ.2,500 మాత్రమే రుణంగా ఇచ్చారు. అనంతరం లగడపాటి రాజగోపాల్ ఎంపీగా రూ.5 లక్షలు, ట్రస్ట్ ద్వారా రూ.11.5 లక్షలు మంజూరు చేశారు. పుర పథకంలో బొమ్మల పరిశ్రమ, కాలనీ అభివృద్ధికి రూ.4కోట్లు కేటాయించినా అమలుకు నోచుకోలేదు. గతంలో ఇక్కడ తయారైన బొమ్మలను లేపాక్షి సంస్థ 80 శాతం కొనుగోలు చేసింది. అప్పట్లో వ్యాపారం బాగుండేది. ప్రస్తుతం లేపాక్షి కొనుగోళ్లు నిలిపేసింది. వ్యాపారం మందగించింది. అసోసియేషన్ భవనం శిథిలావస్థకు చేరింది. కొండపల్లి అడవిలో పొనుగు చెట్లు అంతరించాయి. ఖమ్మంజిల్లా నుంచి దిగుమతి చేసుకునే పరిస్థితి ఏర్పడింది. దీంతో బొమ్మల తయారీదారులు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. రూ.1.75 కోట్లతో చేపట్టనున్న పనులు బొమ్మల పరిశ్రమకు పూర్వవైభవం తెచ్చేందుకు లేపాక్షి సంస్థతో కలిసి పరిశ్రమ అభివృద్ధికి రూ.1.75 కోట్లు వినియోగించనున్నారు. ఇందులో రూ.1.45 కోట్లు కేంద్ర గ్రాంటు కాగా, రూ.30లక్షలు డీఆర్డీఏ ఇంప్లిమెంట్ ఏజెన్సీ గ్రాంటు. బొమ్మల తయారీలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన యంత్రాలు వినియోగిస్తారు. ఇందుకు హస్త కళాకారుల భాగస్వామ్యం 25 శాతం, ప్రభుత్వ గ్రాంటు 75 శాతం. ముందుగా బొమ్మల తయారీదారులతో అసోసియేషన్ ఏర్పాటు, శిథిలావస్థకు చేరిన సంఘ భవనాన్ని పునఃనిర్మించడం, బొమ్మల తయారీలో వస్తున్న మార్పులకు అనుగుణంగా యంత్రాల వినియోగం, అందుకు అవసరమైనlనైపుణ్యాన్ని పెంచేందుకు శిక్షణ æకేంద్రం ఏర్పాటుచేస్తారు. వీటన్నింటినీ పర్యవేక్షించేందుకు ఒక క్లస్టర్ డెవలప్మెంట్ ఎగ్జిబిటర్‌ను ఏర్పాటుచేస్తారు. నేటితరానికి అనుగుణంగా బొమ్మలు మలిచేందుకు డిజైన్ సెంటర్, ఆన్లైన్ మార్కెటింగ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తారు. 20ఏళ్ల పాటు పొనుగు చెట్లు పెంచేందుకు ప్లాంటేషన్ ఏర్పాటు, వనసంరక్షణ సమితి సభ్యులకు చేయూత ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఇవన్నీ మూడేళ్ల కాలవ్యవధిలో నిర్వహించాలి. అలాగే, ఏపీహెచ్డీసీ సంస్థ కొండపల్లి బొమ్మల అభివృద్ధికి రూ.70లక్షలు అదనంగా మంజూరు చేసింది. వీటితో కార్మికులకు పవర్ టూల్స్, కమ్యూనిటీ హాల్‌కు కాంపౌండ్ వాల్, కాలనీకి ప్రధాన గేటు, ఈడీపీ ప్రోగ్రామ్, నైపుణ్యంతో కూడిన శిక్షణ, ఈడీపీ శిక్షణ ఇస్తారు. -
బొమ్మలతో బోధన
కంబాలచెరువు (రాజమహేంద్రవరం) : తరగతి గదిలో పాఠాలు చెబితే విద్యార్థులకు అర్థం కావడం కష్టమే. అదే బొమ్మలతో బోధిస్తే. విద్యార్థుల మనస్సుకు హత్తుకుంటుంది. వారికి పాఠ్యాంశం సులభంగా అర్థమవుతుంది. అందుకే ఆ బాటను అనుసరిస్తున్నారు రాజమహేంద్రవరంలోని ఉపాధ్యాయులు మంగారాణి, నరేష్. వీరు పాఠ్యాంశాలకు తగ్గట్టుగా బొమ్మలను తామే తయారు చేసుకొని బోధనలో వినియోగిస్తూ పలువురికి మార్గదర్శకులుగా ఉన్నారు. పిల్లలకు పాఠాలు చెబితే అవి వారి బుర్రలోకి మాత్రమే ఎక్కవచ్చు. ఆ విధానంలో బట్టీ తప్పదు. కానీ పాఠ్యాంశంపై వారికి అవగాహన కలిగిస్తే.. అదీ బొమ్మల ద్వారా.. అప్పుడు అది వారి హృదయాల్లో నాటుకుపోతుంది. అందుకే ఉపాధ్యాయులు బోధనోపకరణాలను తయారుచేసుకుని బోధించాలని విద్యాశాఖాధికారులు చెబుతున్నారు. అయితే కొందరే ఆ బాటలో నడుస్తున్నారు. వారిలో అగ్రగణ్యులు రాజమహేంద్రవరంలోని నాగరాజా ఎలిమెంటరీ పాఠశాల ఉపా«ధ్యాయిని మంగారాణి, వీరభద్రపురం మున్సిపల్ స్కూలు ఉపాధ్యాయుడు నరేష్. వీరు పాఠ్యాంశాలకు సంబంధించిన బొమ్మలను తయారు చేసుకొని విద్యార్థులకు విషయం గుర్తుండేలా బోధిస్తున్నారు. మంగారాణి అయితే ఒక బ్లాగునే ఏర్పాటు చేసుకున్నారు. అందులో ఒకటి, రెండో తరగతి విద్యార్థులకు కావాల్సిన పాఠాలు, బోధనోపకరణాలు ఉన్నాయి. యూ ట్యూబ్‌లో మంగారాణి అనే పేరుతో ఒక పేజీని ఏర్పాటుచేసుకుని పాఠాల వీడియోలు, తరగతిలో కృత్యాలు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంటారు. వీటిలో జెడ గేయం, ఎగిరే చిలుక పాఠ్యాంశాలెన్నో పొందుపర్చారు. అలాగే విద్యార్థులకు పాఠాలే కాదు పలు అంశాల్లో పరిశోధనల దిశగా అడుగులు వేసేందుకు కృషిచేస్తున్నారు నరేష్. ఆయన విద్యార్థులకు పాఠాలను బోధిస్తూనే వివిధ రకాల ప్రాజెక్టుల రూపకల్పనను స్వయంగా విద్యార్థులతో చేయిస్తున్నారు. వీరిని మిగిలిన ఉపాధ్యాయులందరూ ఆదర్శంగా తీసుకుంటే మంచి ఫలితాలు సాధించవచ్చు. తరగతి గది ఉత్తేజపరేదిగా ఉండాలి విద్యార్థులను ఉత్తేజపరిచేది తరగతి గది. అక్కడనుంచే వారిలో దాగిఉన్న నైపుణ్యాన్ని బయటకు తీయాలి. అలా జరగాలంటే ముందుగా వారు నిత్యం బడికి వచ్చేలా, పాఠాలపై శ్రద్ధ చూపేలా కృషిచేయాలి. అదే జరిగితే వారిలో దాగిఉన్న ప్రతిభ దానంతటదే బయటకు వస్తుంది. అందుకే వారిని విద్యవైపు ఆకర్షితులను చేసేందుకు పలు బోధనోపకరణాలను తయారుచేస్తున్నాను. దీనిపై ఒక పుస్తకాన్ని రూపొందిస్తున్నాను. – ఎం. మంగారాణి, నాగరాజా మున్సిపల్ స్కూలు, రాజమహేంద్రవరం ప్రతిభను వెలికితీయాలి ప్రతీ విద్యార్థిలోను నైపుణ్యం ఉంటుంది. దాన్ని వెలికితీయాలి. అప్పుడే వారు పురోగతి సాధిస్తారు. నూతన విధానాలతో విద్యాబోధన చేయాలనే తపనతో సొంతంగా బోధనోపకరణాలను తయారు చేసుకుంటూ వారికి విద్యాబోధన చేస్తున్నాను. ఇందులో భాగంగానే పలు ప్రాజెక్టులు, అంశాలను స్వయంగా వారితోనే చేయిస్తున్నాను. – నరేష్, వీరభద్రపురం మున్సిపల్ స్కూలు, రాజమహేంద్రవరం -
కండల వీరుడి కళాపోషణ!
కండల వీరుడు సల్మాన్ ఖాన్‌లో మంచి నటుడే కాదు.. మంచి చిత్రకారుడూ ఉన్నాడు. వీలు చిక్కినప్పుడల్లా కుంచె చేతబట్టి తనకు నచ్చిన బొమ్మలు గీస్తుంటారు. తాజాగా, ఆయన ఓ బొమ్మ గీశారు. ప్రేమ మైకంలో ఉన్న అందమైన జంట బొమ్మ అది. ఇప్పుడు సల్మాన్ ఆ బొమ్మ గీయడానికి కారణం లేకపోలేదు. కరీనాకపూర్‌తో కలిసి ఆయన నటించిన ‘భజరంగీ భాయ్‌జాన్’ త్వరలో విడుదల కానుంది. ఇందులో సల్మాన్, కరీనా మధ్య అందమైన లవ్‌స్టోరీ ఉంది. దాన్ని ఉద్దేశించి ఈ బొమ్మకు ‘భజరంగీ భాయ్‌జాన్’ అని పేరు పెట్టి, ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ బొమ్మను చూసినవాళ్లు ‘సల్మాన్ ఎంత మంచి చిత్రకారుడో’ అని అభినందించకుండా ఉండలేకపోయారు. -
ప్రేమికుల రోజు ఆన్లైన్ కొనుగోళ్లు రూ.22 వేల కోట్లు!
న్యూఢిల్లీ: ప్రేమికుల రోజు కార్డులు, ఫ్లవర్స్, డైమండ్ జ్యువెలరీ, చాక్లెట్లు, బొమ్మలు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు తదితర వాటిని కొనుగోలు చేయటానికి ఆన్లైన్ కొనుగోలుదారులు వెచ్చించే మొత్తం రూ. 22 వేల కోట్లు ఉంటుందని అసోచాం తెలిపింది. గతేడాది ఈ మొత్తం రూ.16 వేల కోట్లుగా ఉందని పేర్కొంది. దీనికోసం అసోచాం ఓ సర్వేను జరిపింది. సర్వేలో దాదాపు 52 శాతం మంది ఆన్లైన్ షాపింగ్ చేసే వారు రిటైల్ షాపులతో పోలిస్తే ఆన్లైన్లోనే ఆఫర్లు బాగుంటాయనే అభిప్రాయపడ్డారు. అలాగే 50 శాతం మంది స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు, 18 శాతం మంది ట్యాబ్లెట్ వినియోగదారులు గిఫ్ట్‌లను కొనుగోలు చేయటానికి వారి ఉపకరణాలనే వినియోగిస్తారు. -
హస్తకళాక్లేళి
బంకమన్ను (క్లే)తో పిల్లలు ఆడుకోవడం చూసే ఉంటారు. క్లేతో వారు రకరకాల బొమ్మలు చేస్తారు. తర్వాత క్లేని ముద్దలా చేసి దాచుకుంటారు. అయితే రేవతికి అలాంటి క్లే పనికిరాదు. ఒకసారి ఒక ఆకృతిలోకి మలిస్తే ఇక అదెప్పటికీ అదే ఆకృతిలో ఉండిపోవాలి. కానీ అలాంటి వండర్ క్లే మార్కెట్లో లేదే! రేవతి ఆలోచించారు. ప్రయోగాలు చేశారు. ఎంతో ముడిసరుకును వృథా చేశారు. చివరికి విజయం సాధించారు. వండర్ క్లే తయారైంది! దానికావిడ ‘ఆర్ట్ క్లే’అని పేరు పెట్టారు. అదిప్పుడు ‘రేవతి ఆర్ట్ క్లే’ గా కూడా వ్యవహారంలో ఉంది. ఇంతటి ఘనత సాధించిన రేవతి నేపథ్యం ఏమిటి? మహిళలకు ఆమె ఇచ్చిన స్ఫూర్తి ఎలాంటిది? రేవతి పశ్చిమగోదావరి జిల్లా భీమవరం అమ్మాయి. తండ్రి శ్రీపాద భగవన్నారాయణ స్వాతంత్య్ర సమరయోధులు. ఇంట్లో తనే చిన్న. ఇద్దరన్నయ్యలు, ఐదుగురు అక్కలు. రేవతికి చిన్నప్పటి నుంచి బొమ్మలు చేయడం ఇష్టం. రేగడిమట్టితో బొమ్మలు చెయ్యడం, పేపర్‌పై స్కెచ్‌లు వేయడం.. ఇదే ఆమె లోకం. దాంతో పెద్దన్నయ్య ఆమెను గుంటూరులోని మహిళా కళాశాలలో బి.ఎ ఫైన్ ఆర్ట్స్ అండ్ స్కల్ప్చర్ కోర్సులో చేర్పించారు. బి.ఎ మొదటి సంవత్సరం పూర్తికాగానే పెళ్లయింది. భర్త ఎయిర్‌ఫోర్స్ అధికారి. చండీగఢ్‌లో ఉద్యోగం. దాంతో రేవతి ఫైన్ ఆర్ట్స్ కోర్సు పూర్తి చేయలేకపోయారు. టర్నింగ్ పాయింట్ రేవతికి ఇద్దరబ్బాయిలు. వాళ్లు పెద్దయి, పెళ్లిళ్లయిన తర్వాత ఆమెకు ఖాళీ దొరికింది. పద్దెనిమిదవ యేట అర్ధంతరంగా ఆపేసిన చదువుని కొనసాగించాలని ఎం.ఎ ఇంగ్లిష్‌లో చేరారు. కొంతకాలం పిల్లల దగ్గర గడుపుదామని అమెరికా వెళ్లారు. ఓరోజు వాళ్లబ్బాయి మార్కెట్లో కనిపించిన పేపర్ క్లే చూపించి ‘బొమ్మలు చేసుకోవడానికి బావుంటుంది’ అని తీసిచ్చాడు. ‘‘దాంతో బొమ్మలు చాలా అద్భుతంగా వస్తాయి. అలా మళ్లీ నాకిష్టమైన బొమ్మలు చేయడం మొదలుపెట్టాను. పద్దెనిమిదవ యేట మానేసిన ఆర్ట్స్ అండ్ స్కల్ప్చర్ కోర్సుని యాభై దాటిన తర్వాత సొంత ప్రయోగాలతో పట్టాలెక్కించాను’’ అని చెప్పారు రేవతి. ఆ ప్రయోగాలలో ఒకదాని ఫలితమే మూడేళ్ల క్రితం ఆమె కనిపెట్టిన ఎకో ఫ్రెండ్లీ ‘ఆర్ట్ క్లే’. అన్నీ ఆహారపదార్థాలే! ఆర్ట్ క్లే కోసం రేవతి వాడే ముడిసరుకు అంతా ఆహార పదార్థాల మిశ్రమం. రంగులు కూడా ఫుడ్ కలర్సే కావడంతో ఈ క్లేతో ఎంతసేపు పని చేసినా చేతులకు, చర్మానికి, కళ్లకు, శ్వాసకోశానికి ఎటువంటి హాని కలగదు. పైగా ఆమె కనిపెట్టిన క్లే, పేపర్ క్లే లాగానే మృదువైనది. క్లే ఆరిన తర్వాత కనిపించే కొద్దిపాటి పెళుసుదనం కూడా అందులో ఉండదు. ఒకసారి ఒక రూపం ఇచ్చి ఇరవైనాలుగ్గంటలపాటు కదల్చకుండా ఉంచితే ఇక అది అలాగే ఆరిపోయి ఆకారం శాశ్వతంగా ఉండిపోతుంది. ఆ క్లేతో చేసిన పూలలో దుమ్ము చేరినా సబ్బు నీటిలో జాడించి శుభ్రం చేసుకోవచ్చు. కుటీర పరిశ్రమగా... హైదరాబాద్‌లోని బేగంపేటలో ‘రేవతి ఆర్ట్ క్లే హ్యాండీక్రాఫ్ట్స్’ ఉంది. అందులో ఎందరో మహిళలు శిక్షణ పొందుతున్నారు. ఆసక్తితో మొదలు పెట్టి, ఇలా కుటీర పరిశ్రమగా ఓ యూనిట్‌ను వృద్ధి చేశారు రేవతి. ఇప్పుడది వ్యాపార పరిశ్రమగా కూడా విస్తరించడానికి సిద్ధంగా ఉంది. అందమైన ఆకృతికి రూపం ఇవ్వడంలో నైపుణ్యం ఉంది కానీ మార్కెట్ చేసే చాకచక్యం తనలో లేదంటారామె. ప్రభుత్వం నుంచి పేటెంట్ పరీక్ష ఎదుర్కొన్న తర్వాత తనలా ఆసక్తి ఉన్నవారితో కలిసి మార్కెట్లోకి రావాలన్నది ఆమె ఆలోచన. అరవై ఆరేళ్ల వయసులో కూడా రేవతి ఇంత ఉత్సాహంగా ఉండడానికి కారణం... ఎప్పుడూ సృజనాత్మకంగా ఆలోచించడం, ఆలోచనకు ఒక రూపం ఇచ్చి మురిసిపోవడం, పదిమందికి నేర్పించి తృప్తి పొందడమే కావచ్చు. ఫొటోలు: శివ మల్లాల క్లే తయారీ కోసమే ఓ యంత్రం! నా క్లే తో శిల్పాలు, సీనరీలు, పూలు చేయవచ్చు. ఒకసారి తయారైన క్లే ఆరు నెలలపాటు తాజాగా ఉంటుంది. ఆ తర్వాత కూడా జిగురు తగ్గుతుంది తప్ప ఫంగస్ రాదు. మార్కెట్లో దొరికే మామూలు యంత్రానికి మరికొన్ని విడిభాగాలు చేర్చి ఈ క్లే తయారీ కోసం ప్రత్యేకంగా తయారు చేయించుకున్నాను. రోజుకు వంద కిలోల క్లే తయారు చేయగలను. - రేవతి, ఆర్ట్ క్లే రూపకర్త -
కర్రకు జీవం..
నిర్మల్ అర్బన్ : కొయ్యబొమ్మలు పేరు చెప్పగానే ముందుగా గుర్తుకువచ్చేది నిర్మల్. ఇక్కడి బొమ్మలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. పునికి కర్రతో తయారు చేసే బొమ్మలు, పరికరాలు, చిత్రకళలు, పెయింటింగ్స్ సహ జసిద్ధంగా ఉంటాయి. చూడగానే ఆకట్టుకుంటాయి. ప్రతీ ఒక్కరి మనస్సు దోచుకుంటాయి. చిత్రకళకు ప్రతీరూపాలైన నిర్మల్ బొమ్మలకు అంతటి ఘనత ఉంది మరీ. 400 ఏళ్ల చరిత్ర.. నిర్మల్ కొయ్యబొమ్మలకు 400 ఏళ్ల చరిత్ర ఉంది. ఆనాడు రాజస్థాన్, ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కళాకారులు ఇక్కడి కలపను ఉపయోగించి అందమైన బొమ్మలు తయారు చేసేవారు. దీనినే వృత్తిగా మలుచుకుని పలు కుటుంబాలు ఇళ్లలోనే బొమ్మలు తయారు చేసేవని పూర్వీకులు చెబుతారు. చిన్న, చిన్న వస్తువులు, బొమ్మలు తయారు చేసి విక్రయించి జీవనం సాగిస్తుండేవారని ప్రతీతి. దీంతో పాటు రాజులకు అవసరమైన వస్తువులు తయారు చేసేవారు. నిజాం నవాబు కాలంలో సోన్ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి వచ్చిన రాజు కూర్చునేందుకు ప్రత్యేకంగా కూర్చీని తయారు చేసి ( రాజు కూర్చోగానే బంగారు పూల వర్షం కురిసేలా) బహూకరించడంతో, దానిని చూసి మంత్రముగ్దులైన రాజు తన వంతుగా 16మంది కళాకారులకు పోషణ నిమిత్తం డబ్బులు అందజేశాడని, ఇలా ప్రారంభమైన కొయ్యబొమ్మల తయారీ నేడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని కళాకారులు చెబుతారు. సంఘంగా ఏర్పాటు మొదట్లో కొయ్యబొమ్మలను ఎవరికి వారే తమ తమ ఇళ్లలో తయారు చేసుకునే వారు. సంతలలో అమ్ముకునేవారు. ఎవరైనా ముందుగానే ఆర్డర్ ఇస్తే వాటిని తయారు చేసి ఇచ్చేవారు. అయితే అది అంత లాభసాటిగా లేకపోవడంతో పాటు మార్కెట్ ఇబ్బందులు రావడంతో తయారీదారులకు ఆర్థిక ఇబ్బందులు ఏర్పడేవి. హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ కళపై ఉన్న మక్కువతో సొసైటీ ఏర్పాటు చేయాలని ఇక్కడి కళాకారులకు సలహా ఇచ్చింది. దీంతో జిల్లా పరిశ్రమల కేంద్రం సహాయంతో 1955లో ‘నిర్మల్ కొయ్యబొమ్మల పారిశ్రామిక సహాకార సంఘం’ ఏర్పాటు చేశారు. అప్పుడు కేవలం 16 మందితో ఉన్న సొసైటీలో ప్రస్తుతం దాదాపు 46 మంది సభ్యులు ఉన్నారు. ఉట్టిపడే జీవకళ కళాకారులు చేతిలో కర్రలు జీవాన్ని పొందుతున్నాయి. మెత్తగా, తేలికగా, నాణ్యతగా, పగుళ్లు లేకుండా, రంగులు అద్దేందుకు వీలుగా, చెదలు పట్టకుండా ఎక్కువ కాలం మన్నేలా, అన్నింటికి అనువైనది పునికి కర్ర ఉండటంతో దీనిని బొమ్మల తయారీకి వినియోగిస్తున్నారు. ప్రత్యేక మైన మట్టిని కూడా వీటి తయారీలో వాడుతున్నారు. అలాగే సహజ సిద్ధమైన రంగులు వినియోగిస్తుండటంతో బొమ్మల్లో జీవకళ ఉట్టిపడుతోంది. నిర్మల్ బొమ్మలకు వినియోగించేది కేవలం పునికి కర్ర మాత్రమే కావడంతో దీనికోసం కళాకారులే అడవులకు వెళ్లారు. పునికి చెట్లపై స్థానికులు, అటవీ శాఖాధికారులకు అవగాహన అంతంత మాత్రంగా ఉండటం, చెట్లను గుర్తించేందుకు స్వయంగా వెళ్లాల్సి వస్తుందని కళాకారులు చెబుతున్నారు. పడిపోయిన చెట్లను మాత్రమే అటవీశాఖాధికారుల సహకారంతో టింబర్‌డిపోకు తరలించి, అక్కడ వారి నుంచి కొనుగోలు చేస్తామని, దీంతో ఖర్చు భారంగా మారిందని వాపోతున్నారు. కనీసం కర్రను కూడా ప్రభుత్వం అందించడం లేదు. అడవంతా గాలించడం ఒక ఎత్తయితే దానిని అడవి నుంచి తరలించడం మరో ఎత్తు అవుతోంది. టింబర్ డిపోనుంచి కొనుగోలు చేసిన కలపతో ఒక్కొక్కరు ఒక్కో వస్తువును తయారు చేసేందుకు కార్యదర్శి సూచనలతో తయారీకి సిద్ధమవుతామని చెబుతున్నారు. కుటీర పరిశ్రమగా.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన బొమ్మల తయారీ కుటీర పరిశ్రమగా కొనసాగుతోంది. పురుషులతోపాటు మహిళలు కూడా ఇంటి వద్ద కొయ్యబొమ్మలకు రూపాలు ఇస్తున్నారు. సుమారు 30 మంది మహిళలు ఇళ్లలో బొమ్మలు తయారు చేస్తూ ఆర్థికంగా కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నారు. వీరు తయారు చేసిన బొమ్మలు సహజ రూపంతో నిలుస్తున్నాయి. సహజత్వానికి మారు పేరు కొయ్యబొమ్మలు సహజత్వానికి మారుపేరుగా నిలుస్తున్నాయి. ఆయా రకాల పండ్లు, ఫలాలు, పక్షులు, జంతువుల వంటి వాటిని కర్ర రూపంలో తయారు చేసి వాటికి జీవం పోస్తున్నారు. అలాగే వీరు వేసే పెయింట్స్‌కు కూడా ప్రత్యేకత ఉంది. డెకో పేయింటింగ్‌తో వేయడంతో ప్రత్యేక ఆకర్షణ వస్తోంది. అలాగే పేయింటింగ్‌లో బ్లాక్ పేయింటింగ్ బ్యాక్‌గ్రౌండ్‌గా రావడమే ప్రత్యేకతగా చెప్పుకుంటారు. డెకో పేయింటింగ్ రాకముందు సహజమైన రూపంలో కళాకారులు రంగులు తయారు చేసుకునేవారు. తెలుపు రంగు కోసం గవ్వలు, పసుపు రంగు కోసం పసుపు, ఎరుపు రంగు కోసం మోదిగ పువ్వు వాడేవారు. ఇక నలుపు రంగు కోసం దీపం పెట్టి దానిపై ఓ పాత్రను ఉంచడంతో దానితో వచ్చే మసిని నలుపు రంగు కోసం వాడేవారు. అయితే ప్రస్తుతం వివిధ రంగులను ఒక్కతాటిపై తీసుకువచ్చి డెకో పేయింటింగ్‌తో చిత్రాలు గీస్తున్నారు. ఈ చిత్రాలు కొన్నేళ్ల పాటు శాశ్వతంగా చెక్కు చెదరకుండా ఉండడమే దీని ప్రత్యేకత. ఇతర రాష్ట్రాల్లోనూ దర్శనం నిర్మల్ కళారూపాలు దేశంలోని పలుచోట్ల దర్శనమిస్తాయి. దేశ రాజధాని అయిన ఢిల్లీలోని రాజీవ్‌గాంధీ మ్యూజియంలో కామధేను, కోన్గల్లి, రథం, డ్రెస్సింగ్ టేబుల్, తదితర వస్తువులు సుమారు 16 లక్షల విలువైన వాటిని ప్రదర్శనలో ఉంచారు. అలాగే 1948లో మహారాష్ట్రలోని పాలజ్‌కు చెందిన గ్రామస్తులు తమ గ్రామంలో నెలకొల్పేందు కోసం గణేశ్ విగ్రహాన్ని తయారు చేసి ఇవ్వాలని కోరడంతో అప్పట్లో.. కళాకారుడు గుండాజివర్మ పాలజ్ గణేశ్ విగ్రహాన్ని చెక్కారు. ఆ విగ్రహం ఇప్పటికి చెక్కు చెదరకుండా ఉంది. కాలానికనుగుణంగా.. నిర్మల్ కొయ్యబొమ్మలకు మరింత శోభ తెచ్చేందుకు, మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త కొత్త రూపాల్లో తయారీకి, మార్కెట్ సదుపాయం కల్పించేందుకు పలు సంస్థలు శిక్షణ ఇస్తున్నాయి. నిఫ్టు ఆధ్వర్యంలో ఇచ్చిన శిక్షణతో ఇళ్లల్లో ప్రజలు ఉపయోగించేలా వివిధ వస్తువులు తయారు చేస్తున్నారు. అలాగే సీసీహెచ్ ఆధ్వర్యంలో విజిటేబుల్ కలర్లతో పేయింటింగ్ నేర్పించారు. దీంతో వివిధ ఆకృతులను తీర్చిదిద్దుతున్నారు. అలాగే ప్యాకింగ్‌లోనూ ఇటీవల శిక్షణ ఇచ్చారు. ఎన్నో అవార్డులు, ప్రశంసాపత్రాలు పరిశ్రమలో పనిచేస్తున్న పలువురు కళాకారులు రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు, ప్రశంసా పత్రాలు అందుకున్నారు. రాచర్ల లింబయ్య వర్మ ఇటీవలే అనారోగ్యంతో మృతిచెందారు. ఈయన దేవతామూర్తులను తీర్చిదిద్దడంలో దిట్ట. ఈయన జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో అనేక అవార్డులు, ప్రశంసాపత్రాలు అందుకున్నారు. 2006లో అలనాటి రాజుల కాలంలో ఏ విధంగా ఉండేవో అదే రూపంలో కామధేనువు, నాగలక్ష్మీదుర్గాదేవి, కొనుగుల్ల (అవార్డుకు ఇచ్చేవారు), డాల్ల్యాంప్, డ్రెస్సింగ్ టేబుల్, చెస్‌బోర్డు (బరాత్), రథం, మంచం, సోఫాసెట్లు, ప్రముఖుల ఇళ్లలో ఉండే బట్టలు మార్చుకునే పరికరాలను న్యూఢిల్లీలోని మ్యూజియంలో ప్రదర్శించారు. వీటిని తయారు చేయడంలో రాచర్ల లింబయ్యతో పాటు పలువురు ఆయనకు సహాయమందించి జాతీయ స్థాయిలో గుర్తింపును తీసుకువచ్చారు. 2006లో అప్పటి ఉపరాష్ట్రపతి బైరాన్‌సింగ్ షేకావత్ చేతుల మీదుగా రాష్ర్టం నుంచి ‘శిల్పగురు’ అవార్డు అందుకున్నారు. ఈయనతో పాటు భూసాని నర్సింగం వర్మ, చిన్న పోశెట్టి వర్మ, నాంపల్లి రాజశేఖర్‌వర్మ తదితరులు అనేక గుర్తింపులు పొందారు. -
‘ఆర్ట్’ సోప్
కళాహృదయం ఉండాలే గానీ... ఆ కళ్లకు ప్రతిదీ కళాత్మకమే. పనికొచ్చేవి... పనికిరానివి... కళాకారుల చేతిలో పడితే ఏ వస్తువైనా కళాఖండమే. అపురూపమే. బాత్రూమ్కే పరిమితమైన సబ్బు బిళ్లను బొమ్మలుగా మలిచి ప్రత్యేకతను చాటుకొంటున్నారు నగరవాసి సహానా. బాత్ సోప్లపై బుజ్జి బుజ్జి పాపాయిలు, వారి చిట్టి పాదాలు, చంద్రునిపై చిన్నారులు, ప్రేమ చిహ్నాలు, పువ్వులు.. ఇలా కళారూపాలను చెక్కుతున్నారామె. వీటిని బర్త్‌డే గిఫ్ట్స్‌గా ఇస్తే... ఓ సరికొత్త తీపి గుర్తుగా మిగిలిపోతుందంటున్నారు. ఆర్డర్ ఇస్తే... చిన్నారుల ఫొటోలను కూడా వాటిపై మౌల్డ్ చేయడం సహానా స్పెషల్. బంజారాహిల్స్ సప్తపర్ణిలో ఆదివారం నిర్వహించిన ‘వెగాన్ ఫెస్ట్’లో తన ఆర్ట్ సోప్స్‌ను ఆమె ప్రదర్శించారు. చిన్నారులకు నచ్చేలా... ‘మార్కెట్లో ఎన్నో రకాల సబ్బులు అందుబాటులో ఉన్నాయి. కానీ, వాటిపైన ఎలాంటి ఆర్ట్ ఉండదు. ఆ ప్రయత్నం ఎందుకు చేయకూడదనిపించింది. ఆ ఆలోచనే ఇప్పుడీ కళాకృతులు. ముఖ్యంగా చిన్నారులను దృష్టిలో ఉంచుకొని... వారికి రిలేటెడ్‌గా ఉండే వాటిని తీర్చిదిద్దుతున్నా. మార్కెట్లో రా మెటీరియల్స్ తెచ్చి, ఆర్ట్‌ను బట్టి కలర్స్ ఎంపిక చేసుకుంటా. ఏడాది పైబడినవారెవరైనా ఈ సోప్స్ ఉపయోగించవచ్చు. ధర రూ.250 నుంచి ఉన్నాయి’ అన్నారు సహానా. -విజయ -
అందాల ఏరువాక...ఏటికొప్పాక
ఎల్లలు దాటిన లక్కబొమ్మల ఖ్యాతి అంకుడు కర్రతో అద్భుతాలు సూదిమొన సైజు నుంచి కళాఖండాలు ఆ బొమ్మ ముచ్చట గొలుపుతుంది... ఆ బొమ్మ ముచ్చట్లాడుతుంది... సహజసిద్ధమైన రంగులతో అపురూపమైన ఆకృతుల్లో ఇంటికి శోభను చేకూరుస్తుంది... కళాభిమానుల మనసు దోచుకుంటుంది. అంకుడు కర్రతో అద్భుతాలను ఆవిష్కరించే ఏటికొప్పాక లక్క బొమ్మలకు అందుకే ఖండాంతర ఖ్యాతి. కళాకారుల సృజనాత్మకత, వారి కళాతృష్ణ మన కళ్లను కట్టిపడేస్తుంటాయి. అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం ఇక్కడి హస్త కళాకారులకు లక్కతో పెట్టిన విద్య. ఉపాధి కోసం కొందరు బొమ్మలు చేస్తుంటే, ప్రతిభకు సానపెట్టి తమకు, తమ గ్రామానికి పేరు ప్రఖ్యాతులు తేవడానికి మరికొందరు కళాకారులు ఉవ్విళ్లూరుతున్నారు. జాతీయ అవార్డులు సాధించిన ప్రతిభావంతులు ఇక్కడున్నారు. సూదిమొన సైజులో కళాఖండాలను సృష్టించడంలో ఏటికొప్పాక హస్తకళాకారుల నైపుణ్యత ఎంతటి వారినైనా సరే ఔరా అన్పిస్తుంది. -యలమంచిలి అంకుడు కర్ర కొరత... పెరిగిన ధర లక్కబొమ్మల తయారీకి కావాల్సిన అంకుడు కర్ర దొరకడం ఇప్పుడు గగనమైపోతోంది. మునుపటి మాదిరిగా అంకుడు కర్ర లభించడం లేదని కళాకారులు ఆవేదన వెలిబుచ్చున్నారు. అనధికారికంగా దీనిపై కొందరు ఆంక్షలు పెడుతుండటం వల్ల అంకుడు కర్రను సరఫరా చేసే వారు ఒక్కసారిగా దానిపై ధరను పెంచేశారు. ఇది కళాకారులకు మరింత భారంగా మారింది. పరిస్థితిని చక్కదిద్దడానికి జిల్లా యంత్రాంగం మరింత కృషి చేయాల్సివుంది. వేలాది ప్రజానీకానికి ఇలవేల్పుగా ఉన్న బండిమాంబ అమ్మవారి ఆలయాన్ని స్పృశిస్తూ... పరవళ్లు తొక్కుతూ ప్రవహించే వరహానది చెంతనున్న ఏటికొప్పాక గ్రామం... లక్కబొమ్మల తయారీలో మేటికొప్పాకగా ఎంతో ఖ్యాతి, గుర్తింపు పొందుతోంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ ఆకట్టుకునే బొమ్మల తయారీతో యలమంచిలి మండలం ఏటికొప్పాక హస్తకళాకారులు కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నారు. ఇందుకు 150 ఏళ్ల కిందట నక్కపల్లిలో బీజం పడింది. అంకుడు కర్ర దొరకకపోవడం, ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉండటంతో నక్కపల్లిలో లక్కబొమ్మలు తయారు చేసే నాలుగు కుటుం బాలు ఏటికొప్పాకకు అప్పట్లోనే వలస వెళ్లాయి. క్రమేపీ హస్తకళాకారులు, వారి కుటుంబాలు పెరుగుతూ వచ్చా యి. నాడు నాలుగు కుటుంబాలుంటే ఇప్పుడవి 250కు చేరుకున్నాయి. లక్కబొమ్మల తయారీ, అమ్మకాల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా వందలాది కుటుం బాలు ఇప్పుడు ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. ప్రకృతి రంగుల పరవశం కర్రతో తయారు చేసిన బొమ్మలకు రసాయనాలు మిశ్రమం చేసిన రంగులను అద్దితే పిల్లల ఆరోగ్యానికి ఇబ్బందికరమవుతుందన్న ఉద్దేశంతో రెండు దశాబ్దాల నుంచీ సహజసిద్ధమైన రంగులనే ఇక్కడి కళాకారులు ఉపయోగిస్తున్నారు. ఔషధ మొక్కలు, వనమూలికల ద్వారా ప్రకృతి సిద్ధమైన రంగుల తయారీలో పద్మావతి అసోసియేట్స్ ఆధ్వర్యంలో ఇక్కడి కళాకారులు 1992 నుంచి శిక్షణ తీసుకున్నారు. ఈ రంగుల తయారీకి ప్రధాన ముడిసరుకైన లక్కను రాంచీ నుంచి కొనుగోలు చేస్తుంటారు. చాలామంది కళాకారులు వారు తయారు చేసిన కళాఖండాలను స్థానికంగా ఉన్న పద్మావతి అసోసియేట్స్‌కు విక్రయిస్తుంటారు. కళాకారుల శ్రమ, పెట్టుబడులను గుర్తించి పద్మావతి అసోసియేట్స్ ధర నిర్ణయిస్తుంది. అద్భుతమైన బొమ్మలను ఇండెంట్లపై ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలకు ఇక్కడి నుంచి ఎగుమతి చేస్తుంటారు. మరికొందరు కళాకారులు వారి ఉత్పత్తులను స్థానికంగా ఉండే అనేక దుకాణాలకు వెళ్లి విక్రయిస్తుంటారు. దీంతో లక్కబొమ్మల విక్రయం ద్వారా అనేక మంది వ్యాపారాలు సాగిస్తూ జీవనం పొందుతున్నారు. దేశ విదేశాలకు పాకిన ఖ్యాతి దేశంలో ఏమూలకెళ్లినా మార్కెట్లో ఏటికొప్పాక బొమ్మలు కచ్చితంగా కన్పిస్తుంటాయి. ఈ సామర్ధ్యం మరెవ్వరికీ సాధ్యం కాకపోవడంతో దేశ, విదేశాల్లో ఈ లక్క బొమ్మలకు ప్రాచుర్యం ఏర్పడింది. ఢిల్లీ, మద్రాస్, ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూర్, భువనేశ్వర్, రాజస్థాన్, హైదరాబాద్, పాట్నా, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి పట్టణాలతోపాటు స్విట్జర్లాండ్, హాలెండ్, అమెరికా, నేపాల్, లండన్, బ్రిటన్, శ్రీలంక, ఆస్ట్రేలియా, జర్మనీ వంటి దేశాలకు ఇక్కడి బొమ్మలు ఎగుమతి అవుతుంటాయి. చూసిన కళ్లు ధన్యం... పిల్లల నుంచి పెద్దల వరకు, కూలివారి నుంచి కోటీశ్వరుల వరకు ఎవరైనా ఏటికొప్పాక హస్తకళాకారులు తయారు చేసిన లక్కబొమ్మలను చూసి ముగ్ధులు కావాల్సిందే. వీటిని ఎలా చేశారంటూ కళాభిమానులు ఆశ్చర్యపోతున్నారంటే వీరి నైపుణ్యత ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. చాలామంది తమ ఇళ్ల షో కేసుల్లో ఏటికొప్పాక బొమ్మలను అలంకరించుకోవాలనుకుంటారు. మరికొంద రు అధికారులు, అతిథు లు, బంధువులకు, శుభకార్యాల సమయంలో ఈ బొమ్మలను కానుకగా ఇవ్వడానికి అమితాసక్తి కనబరుస్తుంటారు. అవార్డులెన్నో... గతంలో నిరక్షరాస్యులైన కార్మికులే లక్కబొమ్మలను తయారు చేసేవారు. రానురాను చదువుకున్నవారు, మంచి అభిరుచి ఉన్నవారు కళాకారులుగా ఎదిగారు. ‘కులవృత్తికి సాటిలేదు గువ్వల చెన్నా’ అన్న కవి వాక్కును నిజం చేస్తూ అక్షరాస్యులైన ఎంతో మంది లక్కబొమ్మల తయారీలో ప్రత్యేక తర్ఫీదు పొందారు. దీనికి వారి సృజనాత్మకత తోడవ్వటంతో అపురూపమైన కళాఖండాలెన్నింటినో వీరు సృజిస్తున్నారు. ఇలా చిన్నప్పటి నుంచే ఇదే వృత్తిపై ఆధారపడిన శ్రీశైలపు చిన్నయాచారికి పదేళ్ల కిందట తొలిసారిగా జాతీయ అవార్డు లభించింది. హస్తకళా నైపుణ్యంలో రాటుతేలిన చిన్నయాచారి చేతిలో ఆవిస్కృతమైన ఒక బొమ్మకు అప్పటి రాష్ట్రపతి కలాం చేతుల మీదుగా అవార్డు లభించింది. సాధారణ కోడిగుడ్డు సైజులో, ఒక కోడిగుడ్డులో 32 గుడ్లు ఇమిడి ఉండేలా చిన్నయాచారి తయారు చేసిన బొమ్మలకు తొలిసారిగా జాతీయ గుర్తింపు లభించింది. ఆయన తరువాత పెదపాటి శరత్ కూడా జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు. గిన్నిస్ బుక్, లిమ్కా బుక్‌లలో కూడా ఏటికొప్పాక హస్తకళాకారులు చోటు సంపాదించుకున్నారు. -
బొమ్మలు మాట్లాడతాయ్...
వెంట్రిలాక్విజమ్‌లో దిట్ట పరమేశ్వర్ హైదరాబాద్: జీవంలేని బొమ్మలు మాట్లాడుతాయ్.. ప్రముఖులను అనుకరిస్తాయ్.. ప్రేక్షకులను మైమరపిస్తాయి..ఇదో అద్భుత కళ.. దానిని ఔపోసాన పట్టాడు.. దానినే వృత్తిగా ఎంచుకున్నాడు.. నాలుగు దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తూ ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నాడు పరమేశ్వర్. వెంట్రిలాక్విజమ్(బొమ్మలతో మాట్లాడించే కళ) పరమేశ్వర్‌గా పేరొందాడు. నగరానికి చెందిన పరమేశ్వర్ తొలుత మిమిక్రీ నేర్చుకున్నాడు. తర్వాత వెంట్రిలాక్విజమ్‌ను నేర్చుకున్నాడు. బొమ్మలతో మాట్లాడించడం అంత సులభమేమీ కాదు.. ప్రేక్షకులను మెప్పించడం కూడా ఎంతో కష్టం.. కళ్లకు కనిపించకుండా మాట్లాడుతూ హావ భావాలను పలికించాలి..దీనిలో ఆరితేరాడు. వృత్తిగా ఎంచుకున్నాడు. అంతర్జాతీయంగా పేరుతెచ్చుకున్నాడు. ఎంతో మంది కళాకారులకు ఈ కళలో శిక్షణ ఇస్తున్నారు. నలభై ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో అంతర్జాతీయ స్థాయి వరకు తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో బొమ్మతో వేలాది ప్రదర్శనలు ఇచ్చాడు. ప్రభుత్వ కార్యక్రమమైనా, ప్రయివేటు కార్యక్రమమైనా పరమేశ్వర్ ప్రదర్శన ఉండాల్సిందే. పరమేశ్వర్ మిమిక్రీ, వెంట్రిలాక్విజమ్‌లో ఎన్నో మైలురాళ్లు దాటాడు. ధ్వని అనుకరణ కళా ప్రపూర్ణ, మిమిక్రీ వెంట్రిలాక్విజమ్ యువ సమ్రాట్ వంటి అవార్డులు అందుకున్నాడు. 1991లో నంది అవార్డుల ప్రదానోత్స వంలో ప్రదర్శన ఇచ్చారు. అనేక సినిమాల్లో మిమిక్రీ ఆర్టిస్టుగా పనిచేశాడు. 1996లో తెలుగు లలిత కళాతోరణంలో నాలుగు రోజుల పాటు జరిగిన ప్రపంచ మహా సభలు, 2013 తిరుపతిలో జరిగిన తెలుగు ప్రపంచ మహా సభల్లో సైతం ప్రదర్శనలు ఇచ్చి అందరి మెప్పు పొందాడు. జీవితంలో మిమిక్రీ కళను ప్రోత్సహించడానికి ప్రత్యేక సంస్థను నెలకొల్పి తద్వారా ఎంతో మంది కళాకారులను తయారు చేయడమే తన ముందున్న లక్ష్యమని పరమేశ్వర్ అన్నాడు. -
ఆ ప్రయాణంలో నాతో నేను మాట్లాడుకున్నాను
లైఫ్ బుక్ మా నాన్నగారు బొమ్మలు గీస్తారు. కవితలు రాస్తారు. వంట బాగా చేస్తారు. తోటపని చేస్తారు...ఈ అన్నిట్లోకి నాకు నచ్చిన విషయం ఆయనలోని సున్నితత్వం. సున్నితంగా ఉన్న వాళ్ల దగ్గరికి బొమ్మలైనా, కవిత్వమైనా ఆప్యాయంగా వస్తాయి! వేసవి సెలవుల్లో మా నాన్నమ్మ వాళ్లు ఉండే బారీపడ(ఒడిషా) అనే ఒక మోస్తరు పట్నానికి వెళ్లేవాళ్లం. ఎన్ని నగరాలకు వెళ్లినా... బారీపడ జ్ఞాపకాలు మాత్రం ప్రత్యేకమైనవి. రైలు నుంచి బస్సు, బస్సు నుంచి రిక్షా... ఇలా దీర్ఘ ప్రయాణం చేసిన తరువాతగానీ ఆ పట్నానికి చేరడానికి వీలయ్యేది కాదు. ఇప్పుడు మాత్రం విమానం ఎక్కి ఆ తరువాత కారు ఎక్కితే చాలు అది వస్తుంది. కానీ దీర్ఘమైన ప్రయాణమే నాకు నచ్చుతుంది. ఆ ఊళ్లో ఆలయ ఉత్సవాలు ఘనంగా జరిగేవి. అవి పేరుకు మత సంబంధమైన ఉత్సవాలుగా అనిపించినా నిజానికవి... సామాజిక, సాంస్కృతిక ఉత్సవాలు. ఆలయ ఉత్సవాల సందర్భంగా ఊరంతా కొత్త కళతో శోభించేది. నేను బాగా ఆలోచించిగానీ నిర్ణయం తీసుకోలేను. ఈ క్రమంలో నెల కావచ్చు...ఆర్నెల్లు కావచ్చు...సంవత్సరం కూడా కావచ్చు. ఉదా: భౌగోళికశాస్త్రంలో గ్రాడ్యుయేషన్ పూర్తయిన తరువాత...దేనిలో పోస్ట్-గ్రాడ్యుయేషన్ చేయాలో అర్థం కాలేదు. ‘‘ఓ ఏడాది విరామం తీసుకోవాలనుకుంటున్నాను’’ అని నాన్నతో చెప్పి చాలా ప్రాంతాలు ప్రయాణించాను. నాతో నేను మాట్లాడుకున్నాను. నా ఇష్టాన్ని వెతుకున్నాను. ప్రయాణం తరువాత ఒక పాఠశాలలో పిల్లలకు పాఠాలు బోధించాను. ప్రపంచంలో ఎన్ని ప్రాంతాలు తిరిగినా పుట్టి పెరిగిన ప్రాంతం అంటేనే ఎవరికైనా ఇష్టం. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో వేరే ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తే...తల్లి నుంచి దూరమైనట్లు అనిపిస్తుంది. ఢిల్లీలో పుట్టి పెరిగిన నాకు ఆ నగరాన్ని వదలాలంటే ఇబ్బం దిగా ఉంటుంది. ఢిల్లీకీ నాకూ మధ్య బలమైన ఆకర్షణ ఏదో ఉన్నట్లు అనిపిస్తుంది. - నందితా దాస్, ప్రముఖ నటి -
బొమ్మలు తెచ్చి... బాలలకిచ్చి...
శ్వేతాచారి... ఎలక్ట్రానిక్స్ ఇంజనీరు పిల్లలంతా బొమ్మలతో ఆడుకోవాలనే లక్ష్యంతో... తన ఇరవై రెండోఏట ‘టాయ్‌బ్యాంక్’ పేరిట ఓ ఎన్‌జివోను స్థాపించారు. ఇవ్వగలిగే స్థితిలో ఉన్నవారి దగ్గర నుంచి బొమ్మలు సేకరించి, కొనలేని స్థితిలో ఉన్నవారికి అందచేస్తున్నారు. ఆ రకంగా ధనిక పేద అనే విభజన రేఖను పిల్లల మధ్య చెరిపే ప్రయత్నం చేస్తున్నారు. ముంబైకి చెందిన ఆమె ప్రయాణం ఎంతో ఆసక్తికరం. ‘‘స్నేహితులమంతా కలిసి ముంబైలోని ఒక రెస్టారెంట్లో పిచ్చాపాటీ మాట్లాడుకుంటున్నాం. మాటల మధ్యలో... మన దేశంలోని పిల్లలంతా బొమ్మలతో ఆడుకోగలుగుతున్నారా? అని చర్చించుకున్నాం. మాకు తెలిసినంత వరకు చాలామంది పిల్లలకు బొమ్మలు అందుబాటులో లేవు. వారంతా బొమ్మలతో ఆడుతుంటే, చూసి ఆనందించాలనుకున్నాం. ఈ ఆలోచనకు కార్యరూపం సరిగ్గా పదేళ్ళ క్రితం ఆగస్టు 15న ఆచరణలోకి వచ్చింది’’ అంటారు శ్వేతాచారి. అందుకోసం ‘టాయ్ బ్యాంక్’ అనే లాభాపేక్ష రహిత సంస్థను స్థాపించి, చిన్నారులకు ఆట బొమ్మలు అందచేసి, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండే ప్రపంచాన్ని తయారుచేయాలనే లక్ష్యంతో అడుగులు ముందుకు వేస్తున్నారు శ్వేతాచారి. సంస్థను ప్రారంభించిన కొత్తలో ఇలా సేకరించిన బొమ్మలను కేవలం ముంబై చుట్టుపక్కల ప్రాంతాలలోని బాలలకు మాత్రమే అందచేశారు. ఇప్పుడు ఈ టాయ్‌బ్యాంక్ బెంగళూరు, పుణే, ఢిల్లీ ప్రాంతాలకు విస్తరించింది. ఇలా అందచేస్తారు... ధనికుల ఇళ్ళ నుంచి ఈ సంస్థ ద్వారా సేకరించిన బొమ్మలను ఏ వయసుకు తగ్గ పిల్లలకు ఇవ్వాలో చూసి, అలా వర్గీకరిస్తారు. ఆ పైన అందమైన గిఫ్ట్ ప్యాకింగ్ చేసి చిన్నారులకు అందచేస్తారు. ఇలా బొమ్మలు అందచేశాక, ఆ పిల్లల ప్రవర్తన, ఆలోచన ఎలా ఉందో తెలుసుకుంటున్నారు. ‘‘ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ బొమ్మలతో ఆడుకున్న తర్వాత పిల్లల ఆలోచనా విధానంలో చాలా మార్పు వచ్చింది. ఆ సంగతి మేము గమనించాం’’ అంటారు శ్వేతాచారి. వారి చిరునవ్వే లక్ష్యం శ్వేతాచారి చేస్తున్న మంచిపనికి చాలామంది సహకరించారు. కొందరు బొమ్మలు అందచేస్తే, కొందరు ఆ బొమ్మలతో ఆడుకోవడానికి కావలసిన స్థలం కేటాయించారు. ‘‘మేం చేస్తున్న పనికి ఊహించనంత ఆదరణ లభించింది. ఈ బొమ్మలతో ఆడుకోవడానికి ఇక్కడకు వచ్చే పిల్లలకు... ‘ఇతరులతో పంచుకోవడం’ అనే విషయాన్ని నేర్పిస్తాం. ఇక్కడకు వచ్చి ఆడుకునే పిల్లల ముఖాలలో చిరునవ్వు చూడాలన్నదే మా ఆశ’’ అంటారు శ్వేతాచారి. ప్రచారం లేని... మంచి పని ఎటువంటి ప్రచారం, ప్రకటనలు లేకుండా టాయ్‌బ్యాంక్ తన సేవలను అందిస్తూనే ఉంది. పిల్లలకు విజ్ఞానాన్ని కలిగించే బొమ్మలను ఎంచుకుంటారు. బొమ్మలతో ఆడుకోవడం పిల్లలకు ఎంత అవసరమో చెబుతూ, ‘‘వీధిబాలలు రాళ్లతో, విరిగిన బొమ్మలతో, సైకిల్ టైర్లతో ఆడుతూ కనపడతారు. అటువంటివారికి మా సంస్థ ఆట బొమ్మలు అందచేస్తుంది. పిల్లలకు విలువలతో కూడిన విద్యను నేర్పేలా బొమ్మలను అందచేస్తున్నాం. పిల్లలకు బొమ్మలు ఇవ్వకపోతే, పెద్దయ్యాక వారిలో హింసా ప్రవృత్తి చోటుచేసుకుంటుంది’’ అంటారు శ్వేతాచారి. దేశవ్యాప్తంగా తొమ్మిది వేల బొమ్మలను సేకరించి, నిరుపేద చిన్నారులకు పంపిణీ చేసిన శ్వేతాచారి ఒక ఉత్పాదక కేంద్రం ప్రారంభించి, దాని మీద వచ్చే లాభాలతో బొమ్మలు కొనుగోలు చేసి టాయ్‌బ్యాంక్ కార్యకలాపాలు నడపాలనుకుంటున్నారు. ప్రపంచంలోని బాలలంతా ఎక్కువ తక్కువలనే తేడా లేకుండా బాగా చదువుకుని, బొమ్మలతో ఆడుకొనేలా చేస్తే మా లక్ష్యం నెరవేరినట్లే’’ అంటారు శ్వేత. ఇలాంటి బొమ్మలు తీసుకోరు! హింసను ప్రేరేపించే తుపాకులు, కత్తులు పాడైపోయి, విరిగిపోయినవి బార్బీ బొమ్మలు (ఈ సంస్థ వివక్షను ఇష్టపడదు) ఆటబొమ్మలతో ఆశయాలు దారిద్య్రరేఖకు దిగువన ఉన్న బాలలంతా బొమ్మలతో ఆడుకోవడం ఆర్థిక అసమానతలకు దూరంగా బాలలంతా సృజనాత్మకతతో ఆడుకుంటూ అనేక కార్యక్రమాలలో పాల్గొనడం బాలల పార్లమెంట్, ప్లేగ్రూప్స్, బొమ్మల పాఠ్యప్రణాళిక ద్వారా పిల్లలకు విద్య, విజ్ఞానం కలిగించడం బొమ్మల గ్రంథాలయాలు ఏర్పాటుచేసి, పిల్లలు ఆడుకోవడానికి అనువైన స్థలం ఉండేలా చేయడం -
అమ్మతోడు... నిజంగా బొమ్మలే!
‘అచ్చు బొమ్మలా ఉంది!’ ‘బొమ్మలా ఉంది కాదు బొమ్మే’ ‘నిలువెత్తు మనిషిని పట్టుకొని బొమ్మ అంటావేమిటి?’ ‘అది ఆయన మహిమ!’ ‘ఎవరాయన?’ ఆయన గురించి.... ఆయన పేరు...రాన్ మ్యూక్. లండన్‌లో ప్రసిద్ధ ఆర్టిస్ట్. 1996 నుంచి రకరకాల శిల్పాలను రూపొందిస్తున్నాడు. 30వ ఏట జీవిక కోసం రకరకాల బొమ్మలు తయారుచేస్తూ ఉండేవాడు. మీడియాలో పెద్దగా కనిపించని, వినిపించని రాన్ తన పనేదో తాను నిశ్శబ్దంగా చేసుకుపోతాడు. దైనందిన జీవితంలో మనకు కనిపించే దృశ్యాలను ఆయన శిల్పాలుగా రూపుదిద్దుతాడు. దీనిలో భాగంగా కొన్ని శిల్పాలైతే మామూలుకంటే ఎక్కువ సైజ్‌లో ఉంటాయి. చిన్న సైజులో రూపొందించినా, పెద్ద సైజులో రూపొందించినా సైజుతో సంబంధం లేకుండా ప్రతి కోణంలో వాస్తవికత దర్శనమిస్తుంది. రాన్‌లోని ప్రతిభపాటవాలు, సాంకేతికపరిజ్ఞానం సినిమాలలో స్పెషల్ ఎఫెక్ట్స్‌కు ఉపయోగపడుతున్నాయి. ‘‘మీ సబ్జెక్ట్ ఏమిటి?’’ అనే ప్రశ్నకు ఆయన ఇచ్చే సమాధానం... ‘‘సాధారణ ప్రజలు’’ సాధారణ ప్రజల జీవితంలోని అసాధారణ సౌందర్యాన్ని నిశ్శబ్దంగా రూపుదిద్దిస్తున్నాడు రాన్. శిల్పాలకు పెట్టే పేర్లు కూడా చాలా సాధారణంగా ఉంటాయి. 1997లో రాయల్ అకాడమీలో తన తండ్రి బొమ్మను ప్రదర్శనకు పెట్టి సంచలనం సృష్టించాడు రాన్. ‘అప్పుడే పుట్టిన పాప’ బొమ్మ ‘మోస్ట్ షాకింగ్ క్రియేషన్’గా పేరు తెచ్చుకుంది. ‘‘అవి ఫైబర్‌గ్లాస్ కళారూపాలు కావు... నిజంగా మనుషులే అని ఎవరైనా అనుకుంటే అంతకు మించిన అవార్డ్ ఏమిటి?’’ అంటున్నాడు. తన కళారూపాలను కేవలం బొమ్మలుగానే చూస్తే తాను విఫలమైనట్లేనని చెబుతున్న రాన్, అవి అనుభూతులు పంచే వేదికలు కావాలని ఆశిస్తున్నాడు. బొమ్మలు తయారుకావాలంటే బంకమన్ను, ప్లాస్టర్, మిక్స్చర్ ఆఫ్ ఫైబర్‌గ్లాస్, సిలికాన్, రెజిన్... మొదలైనవి ఆయన చేతిలో ఉండాల్సిందే. అయితే వీటి అన్నిటికంటే ముఖ్యంగా ఆయన తలలో బ్రహ్మాండమైన సృజన ఉంది. అది అద్భుతాలు సృష్టిస్తూనే ఉంటుంది.