Canal Toys Launches So Chill Mini Fridge - Sakshi
Sakshi News home page

‘సో చిల్‌’.. ఆటబొమ్మలాంటి బుల్లి ఫ్రిజ్‌

Published Sun, Jul 2 2023 11:25 AM | Last Updated on Wed, Jul 5 2023 1:04 PM

Canal Toys launches So Chill Mini Fridge - Sakshi

బ్రిటన్‌కు చెందిన ఆటబొమ్మల తయారీ సంస్థ ‘కెనాల్‌ టాయ్స్‌’ ఇటీవల ఆటబొమ్మలాంటి ఫ్రిజ్‌ను మార్కెట్‌లోకి తెచ్చింది. ముఖ్యంగా టీనేజీ పిల్లలకు ఉపయోగపడేలా దీన్ని తీర్చిదిద్దింది. ఇందులో మేకప్‌ సామగ్రిని, పానీయాలను భద్రపరచుకోవచ్చు.

ఇందులో రిమూవబుల్‌ షెల్ఫ్‌ను ఏర్పాటు చేశారు. వస్తువులు పెట్టుకోవడానికి షెల్ఫ్‌ అవరోధం అనుకుంటే, షెల్ఫ్‌ను బయటకు తీసేసి కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఇది రీచార్జబుల్‌ బ్యాటరీతో పనిచేస్తుంది. చాలా తేలికగా దీనిని బయటకు తీసుకువెళ్లవచ్చు. దీనితో పాటు ఒక స్టిక్కర్‌ సెట్‌ ఉచితంగా లభిస్తుంది. ఫ్రిజ్‌ను కోరుకున్న రీతిలో అలంకరించుకోవడానికి ఈ స్టిక్కర్లను ఉపయోగించుకోవచ్చు. దీని ధర 44.99 పౌండ్లు (రూ.4,696) మాత్రమే!

ఇదీ చదవండి: ఇది ఈ-ట్రైక్‌! మూడుచక్రాల ఈ-సైకిల్‌.. తొక్కొచ్చు.. తోలొచ్చు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement