refrigerators
-
కెన్‌స్టార్ నుంచి నూతన ఉత్పత్తులు
హైదరాబాద్: ప్రముఖ గృహోపకరణాల సంస్థ కెన్‌స్టార్.. పెద్ద సైజు హోమ్ అప్లయన్సెస్‌ను విడుదల చేసింది. వీటిల్లో డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్లు, స్లి్పట్ ఎయిర్ కండీషనర్లు, ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్లు ఉన్నాయి. వీటి ఆవిష్కరణతో అన్ని రకాల గృహోపకరణాలు అందిస్తున్న కంపెనీగా మారింది. ప్రధాన విభాగాలైన ఎయిర్ కూలర్లు, చిన్నపాటి గృహోపకరణాలు, వాటర్ హీటర్లపైనా తమ దృష్టి కొనసాగుతుందని కంపెనీ ప్రకటించింది. కూలర్ల విభాగంలో నంబర్ 1 కంపెనీగా అవతరిస్తామని పేర్కొంది. 2023–24 సంవత్సరంలో కంపెనీకి మైలురాయి అని, 55 శాతం వృద్ధిని సాధించినట్టు కెన్‌స్టార్ సీఈవో సునీల్ జైన్ ప్రకటించారు. -
Lok sabha elections 2024: ఓటేస్తే డైమండ్ రింగ్
లక్కీ డ్రాలో బహుమతులు గెలుచుకోవచ్చంటే సామాన్యుల కాలు కదలకుండా ఉంటుందా..? మధ్యప్రదేశ్‌లోని భోపాల్ లోక్‌సభ స్థానంలో ఓటింగ్ శాతం పెంచేందుకు అధికారులు ఇలాంటి ఆఫరే ఇస్తున్నారు. మూడో దశలో భాగంగా ఈ నెల 7న భోపాల్‌లో పోలింగ్ జరుగుతోంది. ఆ రోజున ఓటేసే వారి పేర్లనుంచి ప్రతి మూడు గంటలకు ఒకసారి లక్కీ డ్రా తీయనున్నారు. విజేతలకు వజ్రపు ఉంగరాలు, రిఫ్రిజిరేటర్లు, టీవీలు తదితర కానుకలిస్తారట! ‘‘నియోజకవర్గవ్యాప్తంగా ప్రతి పోలింగ్ కేంద్రంలో ఉదయం 10, మధ్యాహ్నం 3, సాయంత్రం 6 గంటలకు లక్కీ డ్రా తీసి విజేతలకు బహుమతులిస్తం. పోలింగ్ మర్నాడు మెగా డ్రా తీసి విజేతలకు మరింత పెద్ద బహమతులిస్తాం’’అని జిల్లా ఎన్నికల అధికారి కౌసలేంద్ర విక్రమ్ సింగ్ ప్రకటించారు. ఓటింగ్ పెంచేందుకే.. మధ్యప్రదేశ్‌లో ఇప్పటిదాకా జరిగిన రెండు దశల్లో పోలింగ్ 2019తో పోలిస్తే సగటున 8.5 శాతం తగ్గింది. 2019లో భోపాల్‌లో 65.7 శాతం ఓటింగ్ నమోదైంది. ఈసారి ఎండలు విపరీతంగా ఉన్నందున ఓటర్లు పెద్దగా ఇల్లు కదలకపోవచ్చన్న ఆందోళనలున్నాయి. దీంతో ఎలాగైనా ఓటింగ్‌ను పెంచాలని ఈసీ కృత నిశ్చయంతో ఉంది. భోపాల్ నియోజకవర్గంలో 3,097 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ప్రతి బూత్ వద్ద ఒక బీఎల్వో, వలంటీర్‌ను లక్కీ డ్రా కోసం నియమించారు. ఓటేశాక అక్కడి కూపన్ బుక్‌లెట్‌లో పేరు, మొబైల్ నంబర్ రాసి రసీదు తీసుకోవాలి. బహమతుల ఖర్చును కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద కంపెనీలు భరిస్తున్నాయి. మెగా డ్రా కోసం డైమండ్ ఉంగరాలు, ల్యాప్‌టాప్‌లు, ఫ్రిజ్‌లు ఎనిమిది డిన్నర్ సెట్లు, రెండు మొబైల్ ఫోన్లు రెడీగా ఉన్నాయి. దీంతోపాటు ప్రతి పోలింగ్ కేంద్రంలో తొలి ఓటర్ను గౌరవించేందుకు ప్రత్యేకంగా ఏదైనా చేయాలని అధికారులు ఆలోచిస్తున్నారు! – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఫ్రిజ్‌లు, ఏసీలు.. కొంటున్నారా? గ్యారెంటీపై ప్రభుత్వం కీలక సూచన!
రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనర్లు, వాషింగ్ మెషీన్లు వంటి వైట్‌గూడ్స్‌పై ఇచ్చే గ్యారెంటీ లేదా వారంటీకి సంబంధించి కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ వాటి తయారీ, విక్రయ కంపెనీలకు కీలక సూచనలు చేసింది. ఆయా ఉపకరణాల వారంటీ లేదా గ్యారెంటీ విధానాలను సవరించాలని కోరింది. రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనర్లు, వాషింగ్ మెషీన్లు వంటి వంటి ఉపకరణాలపై వారంటీ లేదా గ్యారంటీని అవి కొనుగోలు చేసిన తేదీ నుంచి వర్తింపజేస్తారు. అలా కాకుండా వాటిని ఇన్స్టాల్ చేసిన తేదీ నుంచి వర్తింపజేయాలని పరిశ్రమలు, రిటైల్ అసోసియేషన్లు, వైట్ గూడ్స్ తయారీదారులకు ప్రభుత్వ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ ఒక లేఖలో సూచించారు. రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనర్లు, వాషింగ్ మెషీన్లు వంటి ఉపకరణాలను సాధారణంగా శిక్షణ పొందిన సాంకేతిక నిపుణులే ఇన్స్టాలేషన్ చేస్తుంటారు. వాటిని సరిగ్గా ఇన్స్టాల్ చేసే వరకు వినియోగదారులు ఆ వస్తువులను ఉపయోగించలేరు. వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, వినియోగదారులు ఉత్పత్తిని ఉపయోగించలేనప్పుడు వారంటీ లేదా గ్యారెంటీ వ్యవధిని ప్రారంభించడం వినియోగదారుల రక్షణ చట్టం, 2019 ప్రకారం అన్యాయమైన వాణిజ్య పద్ధతిని ఏర్పరుస్తుంది. కొనుగోలు తేదీ నుంచి వారంటీ లేదా గ్యారెంటీ వ్యవధిని ప్రారంభించడం వలన వినియోగదారు సాధారణంగా ఆనందించే మొత్తం వారంటీ వ్యవధిలో తగ్గింపునకు దారి తీస్తుంది. ఈ-కామర్స్ ద్వారా చేసిన కొనుగోళ్ల విషయంలో ఈ సమస్య మరింతగా పెరిగింది. ఇక్కడ ఉత్పత్తి డెలివరీలో అదనపు సమయం ఉంటుంది. -
‘సో చిల్’.. ఆటబొమ్మలాంటి బుల్లి ఫ్రిజ్
బ్రిటన్‌కు చెందిన ఆటబొమ్మల తయారీ సంస్థ ‘కెనాల్ టాయ్స్’ ఇటీవల ఆటబొమ్మలాంటి ఫ్రిజ్‌ను మార్కెట్లోకి తెచ్చింది. ముఖ్యంగా టీనేజీ పిల్లలకు ఉపయోగపడేలా దీన్ని తీర్చిదిద్దింది. ఇందులో మేకప్ సామగ్రిని, పానీయాలను భద్రపరచుకోవచ్చు. ఇందులో రిమూవబుల్ షెల్ఫ్‌ను ఏర్పాటు చేశారు. వస్తువులు పెట్టుకోవడానికి షెల్ఫ్ అవరోధం అనుకుంటే, షెల్ఫ్‌ను బయటకు తీసేసి కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఇది రీచార్జబుల్ బ్యాటరీతో పనిచేస్తుంది. చాలా తేలికగా దీనిని బయటకు తీసుకువెళ్లవచ్చు. దీనితో పాటు ఒక స్టిక్కర్ సెట్ ఉచితంగా లభిస్తుంది. ఫ్రిజ్‌ను కోరుకున్న రీతిలో అలంకరించుకోవడానికి ఈ స్టిక్కర్లను ఉపయోగించుకోవచ్చు. దీని ధర 44.99 పౌండ్లు (రూ.4,696) మాత్రమే! ఇదీ చదవండి: ఇది ఈ-ట్రైక్! మూడుచక్రాల ఈ-సైకిల్.. తొక్కొచ్చు.. తోలొచ్చు! -
కొత్త టెక్నాలజీతో ఎల్జీ ఫ్రిజ్.. ఎక్కడ నుంచైనా ఆపరేట్ చేయొచ్చు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఎల్జీ మేకిన్ ఇండియా నినాదంపై మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా పుణెలో సైడ్ బై సైడ్ (ఎస్ బీ ఎస్) ఫ్రిజ్ ల తయారీ కోసం కొత్త యూనిట్ ప్రారంభించింది. రూ. 200 కోట్లతో దీన్ని ఏర్పాటు చేసినట్లు సంస్థ భారత విభాగం ఎండీ హోంగ్ జు జియోన్ తెలిపారు. దీని వార్షిక తయారీ సామర్థ్యం 2 లక్షల యూనిట్లుగా ఉంటుందని వివరించారు. తాజాగా దేశీయంగానే వీటిని తయారు చేయడం వల్ల ధరలు కూడా కొంత తగ్గే అవకాశం ఉంది. గతేడాదే దేశీయంగా విండో ఏసీల తయారీని ప్రారంభించినట్లు జియోన్ చెప్పారు. భారత్ లో ఎస్ బీ ఎస్ ఫ్రిజ్ ల విభాగంలో తమకు 50 శాతం మార్కెట్ వాటా ఉన్నట్లు ఆయన చెప్పారు. దేశీయంగా ఫ్రిజ్ ల విభాగంలో తమకు 34 శాతం, వాషింగ్ మెషీన్ల విభాగంలో 37 శాతం వాటా ఉండగా అన్ని విభాగాల్లోనూ మార్కెట్ వాటాను మరింతగా పెంచుకోవడంపై దృష్టి పెడుతున్నట్లు జియోన్ చెప్పారు. ఎల్జీకి దేశీయంగా పుణె, గ్రేటర్ నోయిడాల్లో ప్లాంట్లు ఉన్నాయి. పుణె ప్లాంటుపై 2004 నుంచి గతేడాది వరకూ రూ. 1,619 కోట్లు, నోయిడా ప్లాంటుపై 1997 నుంచి గతేడాది వరకు రూ. 1,778 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు తెలిపారు. కొత్త ఫ్రిజ్‌ల శ్రేణి.. 2023కి సంబంధించి ఎల్జీ కొత్త ఎస్ బీ ఎస్ ఫ్రిజ్ ల శ్రేణిని ఆవిష్కరించింది. ఎల్జీ థింక్యూ టెక్నాలజీతో వీటిలో టెంపరేచర్ సెట్టింగ్ వంటి ఫీచర్లను ఎక్కడ నుంచైనా ఆపరేట్ చేయొచ్చని సంస్థ తెలిపింది. ఎస్ బీ ఎస్ ఫ్రిజ్ లలో 15 మోడల్స్ ఉండగా ధరలు రూ. 1,20,699 నుంచి రూ. 2,29,099గా ఉంటాయని వివరించింది. చదవండి: గ్యాస్ సిలిండర్ డోర్ డెలివరీ చేస్తే డబ్బులు ఇస్తున్నారా? కంపెనీ ఏం చెప్తోందంటే! -
రిఫ్రిజిరేటర్ల కొనుగోలు దారులకు భారీ షాక్!
న్యూఢిల్లీ: రిఫ్రిజిరేటర్లు మరింత ప్రియం కానున్నాయి. ధరలు 5 శాతం వరకు అధికం అయ్యే అవకాశం ఉంది. బ్యూరో ఆఫ్ ఎనర్జీ (బీఈఈ) నూతన ప్రమాణాలు జనవరి 1 నుంచి అమలులోకి రావడమే ఇందుకు కారణం. కొత్త ప్రమాణాల కారణంగా మోడల్‌నుబట్టి 2–5 శాతం ధర పెరగవచ్చని గోద్రెజ్ అప్లయెన్సెస్, హాయర్, ప్యానాసోనిక్ వెల్లడించాయి. ఫ్రాస్ట్–ఫ్రీ మోడళ్లలో ఫ్రీజర్స్, రిఫ్రిజిరేటర్ ప్రొవిజనింగ్ యూనిట్ల (నిల్వ విభాగం) కోసం వేర్వేరుగా స్టార్ లేబులింగ్‌ను బీఈఈ తప్పనిసరి చేసింది. రిఫ్రిజిరేటర్ స్థూల సామర్థ్యానికి బదులు నికర సామర్థ్యం (వినియోగం అయ్యే స్థలం) ఆధారంగానే కంపెనీలు స్టార్ లేబులింగ్ చేయాల్సి ఉంటుంది. రీసెర్చ్ అండ్ మార్కెట్స్ నివేదిక ప్రకారం భారత్‌లో రిఫ్రిజిరేటర్ల విపణి 2022లో రూ.25,352 కోట్లు ఉంది. -
తక్కువ ధరలో టీవీ కొనాలనుకుంటున్నారా? అయితే ఎలక్ట్రానిక్స్ సేల్ ఉందిగా!
సాక్షి, ముంబై: వాషింగ్మెషీన్లు, ఏసీలు,టీవీలు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల కొనుగోళ్లపై ఆన్లైన్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తగ్గింపు ధరల సేల్ ప్రారంభించింది. ముఖ్యంగా టీవీలపై భారీ డిస్కౌంట్ ధరలను ప్రకటించింది. ఈ ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్ జూన్ 23 నుంచి 27 వరకు కొనసాగనుంది. ఐదు రోజుల పాటు కొనసాగే ఈ సేల్‌లో ఎస్బీఐ క్రెడిట్ కార్డ్‌లు, ఈఎంఐ లావాదేవీలపై రూ.1500 తగ్గింపు కూడా లభ్యం. వూ ప్రీమియం అల్ట్రా హెచ్డీ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ 43 అంగుళాల అల్ట్రా హెచ్డీ (4కే ) ఎల్ఈడీ టీవీ ఎలక్ట్రానిక్స్ సేల్ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 26,999లకే లభ్యం. దీని ఎంఆర్పీ ధర రూ. 45,000. యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌పై 5 శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. అలాగే ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. ఎంఐ 5 ఎక్స్ అల్ట్రా హెచ్డీ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ 43 అంగుళాల అల్ట్రా హెచ్డీ (4కే)టీవీని ఫ్లిప్‌కార్ట్ ఇపుడు రూ. 31,999 దీని ఎంఆర్పీ ధర రూ. 49,999. 8 వేల దాకా ఎక్స్ఛేంజ్ ఆఫర్. HDFC క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ EMI లావాదేవీలపై 2,000 తగ్గింపు. రియల్మీ హెచ్డీ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ 32-అంగుళాల హెచ్డీ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీని ఫ్లిప్‌కార్ట్ రూ. 15,999లకే సొంతంచేసుకోవచ్చు. దీని ఎంఆర్పీ ధర రూ. 17,999. దీంతోపాటు 8 వేల దాకా ఎక్స్ఛేంజ్ ఆఫర్ లభ్యం. Axis Bank కార్డ్‌పై 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను కూడా అందిస్తోంది. వోల్టాస్ 1.5 టన్ 5 స్టార్ స్ప్లిట్ ఇన్వర్టర్ AC వోల్టాస్ 1.5 టన్న 5 స్టార్ స్ప్లిట్ ఇన్వెర్టర్ ఏసీ తక్కువ ధర రూపాయలలో ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. రూ. 67,990 ల ఏసీని ఈ సేల్ లో కేవలం రూ. 37,999లకే సొంతం చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్ జూన్ 2022 సందర్భంగా. Axis బ్యాంక్ కార్డ్‌పై 5 శాతం క్యాష్‌బ్యాక్. శాంసంగ్ సింగిల్ డోర్ 5 స్టార్ రిఫ్రిజిరేటర్ శాంసంగ్ 198 లీటర్ల 198 లీటర్ల డైరెక్ట్ కూల్ సింగిల్ డోర్ ఫ్రిజ్ రూ. 18,000 (ఎంఆర్పీ ధర రూ. 21,990). 12 వేల రూపాయల వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను పొందవచ్చు. యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌పై 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను కూడా అందిస్తోంది. ఒనిడా 7కేజీ 5 స్టార్ వాషింగ్ మెషీన్ ఒనిడా 7కేజీ 5 స్టార్ ఫుల్లీ ఆటోమేటిక్ టాప్ లోడ్ వాషింగ్ మెషిన్ తగ్గింపు ధరలో రూ.13,490కి లభ్యం. దీని ఎంఆర్పీ ధర. రూ. 21,990 ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో కూడా దీన్ని కొనుగోలు చేయవచ్చు. -
ఇంట్లోనే నిమిషాల్లో ఐస్‌క్రీమ్‌లు తయారు చేసుకోవచ్చు.. ధర ఎంతంటే!
చల్లగా, తియ్యగా, కమ్మగా.. రకరకాల ఫ్లేవర్స్‌లో దొరికే ఐస్‌క్రీమ్ అంటే చప్పరించని వారెవరు? మరి అలాంటి ఐస్‌క్రీమ్‌ని మళ్లీమళ్లీ లాగించాలంటే ఇలాంటి మెషిన్ ఇంట్లో ఉండాల్సిందే. ఇందులో చాలా రకాల ఐస్‌క్రీమ్స్‌ను నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. ఆరోగ్యాన్నిచ్చే పండ్లు, కూరగాయలతో కూడా ఐస్‌క్రీమ్ తయారు చేసుకోవచ్చు. తగినన్ని పాలు, పంచదార, ఎసెన్స్‌ను జోడించి ఎన్నో రుచులను ఆస్వాదించొచ్చు. స్టెయిన్లెస్ స్టీల్‌తో రూపొందిన.. 2 లీటర్ల సామర్థ్యం కలిగిన ఈ డివైజ్ బౌల్‌ని ఫ్రిజ్లోనే ఉంచాలి. ఐస్‌క్రీమ్ తయారు చేసుకునే ముందు ఫ్రిజ్‌లోంచి తీసి, డివైజ్‌లో సెట్‌చేస్తే సరిపోతుంది. దానిపైన మూత, దానిపైనే పవర్ యూనిట్ అడ్జస్టబుల్గా ఉంటాయి. ఆన్, ఆఫ్ బటన్‌తోపాటు పవర్ బటన్ కూడా డివైజ్ పైనే కనిపిస్తూ ఉంటాయి. దాంతో దీన్ని వినియోగించడం చాలా ఈజీ. ఈ డివైజ్‌తో పాటు రెసిపీ బుక్ కూడా లభిస్తుంది. ధర : 40 డాలర్లు (రూ.3,063) చదవండి👉🏾Milk Warmer: బుజ్జాయిల పాల కోసం ఈ డివైజ్.. ధర ఎంతంటే! చదవండి👉🏾Pasta Noodle Maker: పాస్తా, నూడుల్స్ ఇలా ఈజీగా.. ఈ డివైజ్‌ధర రూ. 1,990 -
పేదోడి ఫ్రిడ్జ్‌కు భలే గిరాకీ!
దిల్సుఖ్నగర్: అప్పుడే వేసవి ఎండలు దంచి కొడుతున్నాయి... రోజు రోజుకూ పెరుగుతున్న వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. మలక్‌పేట, మహేశ్వరం, యాకత్పురా నియోజకవర్గాలలో కొందరు పేదల రిఫ్రిజిరేటర్ అయిన మట్టి కుండల్లోని శ్రేష్ఠమైన చల్లని నీటిని తాగుతూ దాహార్తి తీర్చుకుంటున్నారు. ఈ క్రమంలో కుండలకు గిరాకీ పెరిగింది.ధనిక, పేద తారతమ్యం లేకుండా అందరూ మట్టి కుండల్లోని నీటిని తాగేందుకు మొగ్గు చూపుతున్నారు. వినియోగదారులను ఆకర్షించడానికి మార్కెట్లలో రకరకాల డిజైన్లలో కుండలు, కూజాలను అందుబాటులో ఉంచారు. చల్లదనంతో పాటు మంచి డిజైన్లలో అందంగా ఉన్న కుండలను కొనుగోలు చేసేందుకు సామాన్యులతో పాటు ధనవంతులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. రూ. 60 నుంచి రూ.500 .. సరూర్‌నగర్, దిల్సుఖ్నగర్, సైదాబాద్, మాదన్నపేట ఎన్‌టీఆర్‌నగర్‌తో పాటు ప్రధాన చౌరస్తాల్లో మట్టి కుండలను విక్రయిస్తున్నారు. మార్కెట్లలో రూ. 60 నుంచి రూ.500 వరకు వివిధ ధరల్లో రకరకాల కుండలు మార్కెట్లో లభిస్తున్నాయి. అయితే ధరలు మాత్రం కొంత అధికమనే చెప్పవచ్చు. వేసవి ఎండలు ఒకవైపు కొలిమిలా కాగుతుండగా దాహం తీర్చుకోవడానికి నీరు తాగాలంటే ఈ మాత్రమైనా ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. (చదవండి: సంచలనం రేపిన ప్రణయ్ హత్య కేసులోని నిందితుడికి హార్ట్ఎటాక్) -
రూ.29 వేల శామ్సంగ్ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ రూ.10 వేలకే!
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఎప్పటికప్పుడు సరికొత్త ఆఫర్లతో వినియోగదారులకు సర్ ప్రైజ్ ఇస్తూనే ఉంటుంది. తాజాగా ఫ్లిప్‌కార్ట్ కూలింగ్ డేస్ పేరుతో ఈ నెల 18 నుంచి సరికొత్త సేల్‌తో మీ ముందుకు వచ్చింది. ఈ సేల్‌లో భాగంగా ఫ్రిజ్, కూలర్, ఎయిర్ ఎసి వంటి వాటి మీద మంచి డిస్కౌంట్ అందిస్తుంది. ఈ సేల్‌లో ఇతర కంపెనీలతో పాటు శామ్సంగ్ ఉత్పత్తులపై కూడా బంపర్ డిస్కౌంట్ అందిస్తుంది. మీరు కొత్త ఫ్రిజ్ కొనాలనే ఆలోచనలో ఉంటే ఇది మీకు ఒక మంచి అవకాశం ఉంది. ఈ సేల్‌లో మీరు శామ్సంగ్ 253 లీటర్ల డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ మీద ఆకర్షణీయమైన ఆఫర్ పొందుతున్నారు. ఈ ఆఫర్'ను సద్వినియోగం చేసుకుంటే రూ.29,000ల డబుల్ డోర్ ఫ్రిజ్ రూ.10,000 కంటే తక్కువకు లభిస్తుంది. ఈ ఆఫర్ గురించి మాకు తెలియజేయండి. ఈ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ మార్కెట్ ధర రూ. 28,990. అయితే ఈ ఫ్రిజ్'పై 15% తగ్గింపు ఆఫర్ అందుబాటులో ఉంది. అంటే ఎవరైనా ఈ సేల్‌లో రూ.24,790కే ఈ ఫ్రిజ్ కొనుగోలు చేయొచ్చు. మీరు ఈ రిఫ్రిజిరేటర్‌ను కొనుగోలు చేసేటప్పుడు, ఏదైనా బ్యాంక్ కార్డ్‌ని ఉపయోగిస్తే ప్రీపెయిడ్ ఆఫర్ కింద రూ.500 తగ్గింపును పొందొచ్చు. ఇంకా మీరు గనుక యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగిస్తే 2 వేల తగ్గింపు పొందొచ్చు. అయితే దీంతో పాటు భారీ ఎక్సేంజ్ ఆఫర్ సైతం ఈ ఫ్రిజ్ కొనుగోలుపై అందుబాటులో ఉంది. మీ దగ్గర ఉన్న పాత రిఫ్రిజిరేటర్‌ను ఎక్సేంజ్ చేస్తే రూ.12 వేల ఎక్సేంజ్ ఆఫర్ పొందవచ్చు. అంటే మీ పాత ఫ్రిజ్ కండిషన్ ఆధారంగా మీకు లభించే ఎక్సేంజ్ ఆధారపడి ఉంటుంది. ఈ ఆఫర్స్ అన్నీ మీకు లభిస్తే.. శామ్సంగ్ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ కేవలం రూ.10,790కే లభిస్తుంది. (చదవండి: కరోనా తర్వాత ప్రపంచానికి మరో ముప్పు తప్పదు: బిల్‌గేట్స్!) -
కూల్ కావాలంటే పర్స్ ఖాళీనే
న్యూఢిల్లీ: నూతన సంవత్సరం తొలి రోజుల్లోనే ఎయిర్ కండీషనర్లు, రిఫ్రిజిరేటర్లు మొదలైన వినియోగ ఉత్పత్తుల రేట్లు.. కొనుగోలుదారులకు షాక్ ఇస్తున్నాయి. ముడి వస్తువుల వ్యయాలు, రవాణా చార్జీలు పెరిగిపోవడంతో కంపెనీలు ఆ భారాన్ని కొనుగోలుదారులకు బదలాయిస్తున్నాయి. ఈ నెలాఖరులో లేదా మార్చి ఆఖరు నాటికి ఫ్రిజ్‌లు, ఏసీలు, వాషింగ్ మెషీన్లు వంటి ఉత్పత్తుల రేట్లు 5–10 శాతం మేర పెంచబోతున్నాయి. పానసోనిక్, ఎల్జీ, హయర్ వంటి సంస్థలు ఇప్పటికే పెంచగా.. సోనీ, హిటాచీ, గోద్రెజ్ అప్లయెన్సెస్ మొదలైనవి ఈ త్రైమాసికం ఆఖరు నాటికి నిర్ణయం తీసుకోనున్నాయి. కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయెన్సెస్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (సీఈఏఎంఏ) నివేదిక ప్రకారం జనవరి–మార్చి వ్యవధిలో ధరలు 5–7 శాతం మేర పెరగనున్నాయి. ‘కమోడిటీల ధరలు, అంతర్జాతీయంగా రవాణా, ముడి వస్తువుల రేట్లు అసాధారణంగా పెరిగిపోవడంతో ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు వంటి ఉత్పత్తుల రేట్లను 3–5 శాతం పెంచేందుకు మేము చర్యలు తీసుకున్నాం‘ అని హయర్ అప్లయెన్సెస్ ఇండియా ప్రెసిడెంట్ సతీష్ ఎన్ఎస్ తెలిపారు. ఏసీల రేట్లు ఇప్పటికే 8 శాతం వరకూ పెంచిన పానసోనిక్ .. ధరలను మరింత పెంచే యోచనలో ఉంది. ఇతర గృహోపకరణాల రేట్లను పెంచే అంశం పరిశీలిస్తోంది. ‘ఏసీల రేట్లు 8 శాతం వరకూ పెరిగాయి. కమోడిటీల వ్యయాలు, సరఫరా వ్యవస్థ పరిస్థితులు బట్టి ఇవి మరింత పెరగవచ్చు. సమీప భవిష్యత్తులో గృహోపకరణాల రేట్ల పైనా ప్రభావం పడే అవకాశం ఉంది‘ అని పానసోనిక్ ఇండియా డివిజనల్ డైరెక్టర్ ఫుమియాసు ఫ్యుజిమోరి తెలిపారు. దేశీ గృహోపకరణాలు, కన్జూమర్ డ్యూరబుల్ పరిశ్రమ పరిమాణం రూ. 75,000 కోట్ల స్థాయిలో ఉంటుందని అంచనా. పండుగ సీజన్లో వాయిదా.. పండుగల సీజన్ కావడంతో రేట్ల పెంపును కంపెనీలు వాయిదా వేస్తూ వచ్చాయని సీఈఏఎంఏ ప్రెసిడెంట్ ఎరిక్ బ్రగాంజా తెలిపారు. ‘అయితే, ప్రస్తుతం భారాన్ని కస్టమర్లకు బదలాయించడం తప్ప తయారీ సంస్థలకు వేరే మార్గం లేకుండా పోయింది. జనవరి నుంచి మార్చి మధ్యకాలంలో ధరల పెంపు 5–7 శాతం మేర ఉండొచ్చని అంచనా వేస్తున్నాం‘ అని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే కొన్ని సంస్థలు రేట్లు పెంచేయగా మరికొన్ని దానికి సంబంధించిన ప్రక్రియలో ఉన్నందున పెంపు పరిమాణం వివిధ రకాలుగా ఉండొచ్చని బ్రగాంజా చెప్పారు. అయితే, డిమాండ్ మందగించినా, ముడి వస్తువుల ధరలు తగ్గినా .. ఏప్రిల్ లేదా మే లో రేట్లు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందన్నారు. సోనీ ఇండియా, గోద్రెజ్ అప్లయెన్సెస్ వంటి సంస్థలు రేట్ల పెంపుపై తాము ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పేర్కొన్నాయి. వివిధ రకాల ఉత్పత్తుల ధరలు ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరు త్రైమాసికంలో పెరిగే అవకాశాలు ఉన్నాయని థామ్సన్, కోడక్ వంటి బ్రాండ్ల తయారీ సంస్థ సూపర్ ప్లాస్ట్రోనిక్స్ (ఎస్పీపీఎల్) సీఈవో అవ్నీత్ సింగ్ మార్వా తెలిపారు. మార్కెట్ పరిస్థితులను పరిశీలిస్తున్నామని, తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై వచ్చే నెలలో నిర్ణయం తీసుకుంటామని వీడియోటెక్స్ ఇంటర్నేషనల్ (దైవా, షింకో తదితర బ్రాండ్స్ తయారీ సంస్థ) తెలిపింది. తప్పని పరిస్థితి.. ధరల భారాన్ని వీలైనంత వరకూ తామే భరించేందుకు అన్ని ప్రయత్నాలూ చేశామని, కానీ వ్యాపారం నిలదొక్కుకునేందుకు పెంపు తప్పటం లేదని ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ దీపక్ పన్నసల్ తెలిపారు. రేట్ల పెంపు తప్పదని జాన్సన్ కంట్రోల్స్–హిటాచీ ఎయిర్ కండీషనింగ్ ఇండియా సీఎండీ గుర్మీత్ సింగ్ తెలిపారు. ముడివస్తువులు, పన్నులు, రవాణా వ్యయాలు మొదలైనవి పెరిగిపోవడం వల్ల ఏప్రిల్ నాటికి బ్రాండ్లు దాదాపు 10% వరకూ ధరలు పెంచవచ్చని ఆయన పేర్కొన్నారు. ‘ఏప్రిల్ వరకూ దశలవారీగా ధరల పెంపు కనీసం 8–10% మేర ఉండవచ్చు. గతేడాది కూడా ఇదే విధంగా 6–7% వరకూ పెరిగాయి. ముడి వస్తువుల ధరలు పెరిగిపోవడం, అల్యూమినియం .. రిఫ్రిజిరెంట్స్ వంటివాటిపై యాంటీ డంపింగ్ సుంకాల విధింపుతో రేట్లు మరో 2–3 శాతం పెరగవచ్చు‘ అని సింగ్ వివరించారు. -
త్వరపడండి: శాంసంగ్ ఉత్పత్తులపై భారీ ఆఫర్లు..!
దక్షిణ కొరియాకు చెందిన టెక్ దిగ్గజం శాంసంగ్ భారత్‌లో తన వినియోగదారుల కోసం అద్బుతమైన ఆఫర్లను ప్రకటించింది. శాంసంగ్ ఉత్పత్తులపై కొత్త శ్రేణి ఆఫర్లను ప్రకటించింది. ఎంపిక చేయబడిన బ్యాంక్ క్రెడిట్ కార్డులపై 20శాతం మేర క్యాష్‌బ్యాక్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్లు జూన్ 30 వరకు అందుబాటులో ఉండనున్నాయి. శాంసంగ్ టీవీలు: ఎంపిక చేసిన శాంసంగ్ చేసిన టీవీలకు కంపెనీ నుంచి ప్రీమియం సౌండ్బార్లను ఉచితంగా అందిస్తోంది. ఆఫర్ వ్యవధిలో 75-అంగుళాల అంతకంటే ఎక్కువ QLED టీవీలను కొనుగోలు చేసే వినియోగదారులకు 99,990 రూపాయల విలువైన సౌండ్‌బార్ Q900T లేదా QLED TV మోడల్‌ను బట్టి 48,990 రూపాయల విలువైన Q800T సౌండ్‌బార్ లభిస్తుంది. వినియోగదారులు ఈ టీవీలను 36 నెలల ఈఎంఐ లభిస్తోంది.అంతేకాకుండా కొనుగోలు చేస్తే 20 శాతం వరకు క్యాష్‌బ్యాక్ లభించనుంది. శాంసంగ్ సౌండ్ డివైజ్స్: ఎంపిక చేయబడిన శాంసంగ్ సౌండ్ బార్స్‌పై 10శాతం వరుకు అదనపు క్యాష్‌బ్యాక్‌ను ఇవ్వనుంది. శాంసంగ్ ఫ్రిజ్‌లు: సైడ్ బై సైడ్, కర్డ్ మాస్ట్రో, ఫ్రోస్ట్ ఫ్రీ, డైరక్ట్ కూల్ లాంటి శాంసంగ్ ఫ్రీజ్‌ల మోడళ్లను ఈఎంఐతో కొనుగోలు చేస్తే సుమారు 15శాతం వరకు క్యాష్‌బ్యాక్ కాకుండా డిజిటల్ కంప్రెసర్‌పై పది సంవత్సరాల వరకు వారంటీని ఇవ్వనుంది. మైక్రోవేవ్ ఓవెన్స్: శాంసంగ్ మైక్రోవేవ్ ఓవెన్స్ మ్యాగ్నెట్రాన్ పై 5 సంవత్సరాల వారంటీతో పాటు పది శాతం వరకు క్యాష్‌బ్యాక్, సెరమిక్ ఎనామిల్ కావిటీ మెడల్‌పై పది సంవత్సరాల వారంటీనీ ఇవ్వనుంది. చదవండి: మార్కెట్లోకి సోనీ టీవీ.. ధర వింటే షాక్! -
నెలకు రూ.890 కడితే శామ్సంగ్ ఫ్రిజ్ మీ సొంతం!
మీరు కొత్త ఫ్రిజ్ కొనుగోలు చేయాలని చూస్తున్నారా? మీ దగ్గర సరిపడినంత డబ్బులు లేవా? అయితే మీకు శుభవార్త. ఒకేసారి డబ్బులు పెట్టి కొనుగోలు చేయలేనివారు కోసం బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ స్టోర్ కస్టమర్లకు మంచి డీల్ అందిస్తోంది. శామ్సంగ్ రిఫ్రిజిరేటర్లపై నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ ని అందిస్తోంది. మీరు నెలకు రూ.890 చెల్లించి శాంసంగ్ ఫ్రిజ్‌ను కొనుగోలు చేయవచ్చు. శామ్సంగ్ ఫ్రిజ్‌లలో డిజిటల్ ఇన్వర్టర్స్, ఆల్‌రౌండ్ క్లీనింగ్ వంటి ఫీచర్లు ఉంటాయి. కస్టమర్లకు కన్వర్టిబుల్ 5-ఇన్ -1 మోడల్స్, సింగిల్ డోర్, డబుల్ డోర్ ఫ్రిజ్‌లు అందుబాటులో ఉన్నాయి. శామ్సంగ్ 212 లీటర్ల 5 స్టార్ డబుల్ డోర్ ఫ్రిజ్ కొనాలనుకుంటే ఈఎంఐ రూ.890గా ఉంది. అలాగే 198 లీటర్ల 5 స్టార్ సింగిల్ ఫ్రిజ్ కొంటే ఈఎంఐ రూ.1000 కట్టాల్సి ఉంటుంది. 198 లీటర్ల 3 స్టార్ సింగిల్ డోర్ ఫ్రిజ్ అయితే రూ.1025 ఈఎంఐ కట్టాలి. 386 లీటర్ల 2 స్టార్ డబుల్ డోర్ ఫ్రిజ్ అయితే రూ.2333 ఈఎంఐ పడుతుంది. ఫ్రిజ్ కొనాలనుకునే వారు బజాజ్ ఈఎంఐ స్టోర్‌లోకి లాగిన్ అయి కొనుగోలు చేయవచ్చు. 3 నుంచి 24 నెలల వరకు ఈఎంఐ ఆప్షన్ పెట్టుకోవచ్చు. ఢిల్లీ, పూణే, ముంబై, థానే, అహ్మదాబాద్, సూరత్, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా వంటి నగరాల్లో ఈ సదుపాయం ఉంది. ఈఎంఐ స్టోర్ హైపర్‌లోకల్ షాపింగ్ మోడల్‌ను కలిగి ఉంది. మీరు ఆన్లైన్ ద్వారా శామ్సంగ్ రిఫ్రిజిరేటర్‌ను ఆర్డర్ చేసిన రెండు లేదా మూడు రోజుల్లో మీ ఇంటికి డెలివరీ చేయనున్నారు. చదవండి: వన్‌ప్లస్ నార్డ్ నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్ -
Air Cooler Sales: ఏసీల విక్రయాలు ఢమాల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎయిర్ కండీషనర్స్ (ఏసీ), రిఫ్రిజిరేటర్ల విక్రయాలపై కరోనా–19 ఎఫెక్ట్ పడింది. అమ్మకాలు పడిపోవడం వరుసగా ఇది రెండవ ఏడాది. వైరస్ వ్యాప్తి చెందడం, లాక్డౌన్స్ కారణంగా అత్యంత కీలకమైన వేసవి సీజన్లో సేల్స్ లేకపోవడం పరిశ్రమకు కోలుకోలేని దెబ్బపడింది. 2019తో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్‌లో అమ్మకాలు 75 శాతం పడిపోయాయని తయారీ సంస్థలు చెబుతున్నాయి. ఇక మే నెలలో విక్రయాలు పూర్తిగా నిలిచిపోయాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో వినియోగదార్లలో సెంటిమెంట్ పడిపోవడం పరిస్థితిని మరింత దిగజార్చిందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. కోవిడ్–19 తగ్గే వరకు ఖర్చులను నియంత్రించుకోవాలన్నది కస్టమర్ల భావనగా ఉందని చెబుతున్నాయి. భారత్‌లో గృహాల్లో వినియోగించే ఏసీల వార్షిక మార్కెట్ 70–75 లక్షల యూనిట్లు. 15కు పైగా కంపెనీలు పోటీపడుతున్నాయి. గతేడాది నుంచీ కష్టాలే.. భారత్‌లో ఏసీలు, రిఫ్రిజిరేటర్ల విక్రయాలు 2020 ఏప్రిల్‌లో పూర్తిగా నిలిచిపోయాయి. 2019తో పోలిస్తే గతేడాది మే నెలలో 10 శాతానికే అమ్మకాలు పరిమితమయ్యాయి. జూన్‌లో 25 శాతం జరిగాయి. ఇక ఈ ఏడాది ఏప్రిల్‌లో సేల్స్ 75 శాతం పడిపోయాయి. లాక్డౌన్స్, కర్ఫ్యూలతో మే నెల అమ్మకాలు పూర్తిగా కనుమరుగు అయినట్టేనని పరిశ్రమ చెబుతోంది. సంవత్సరం పొడవునా జరిగే ఏసీ, రిఫ్రిజిరేటర్ల విక్రయాల్లో ఏప్రిల్–జూన్ వాటా 35 శాతం దాకా ఉంటుంది. దేశంలో కేవలం 15 శాతం మార్కెట్ మాత్రమే తెరిచి ఉందని కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, అప్లయెన్సెస్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కమల్ నంది తెలిపారు. స్టోర్లకు వచ్చే వినియోగదార్లు అతి తక్కువ అని వివరించారు. ముడి సరుకు భారం అవుతున్నందున ఏసీల ధరలు 8 శాతం పెరిగే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే వీటి ధరలు 12 శాతం వరకు అధికమయ్యాయి. లాక్డౌన్స్ ముందు వరకు ఏసీల డిమాండ్ ఉన్నప్పటికీ చిప్ కొరతతో సరఫరా 10 శాతమే ఉందని ఐటీ మాల్ ఎండీ మొహమ్మద్ అహ్మద్ తెలిపారు. అంచనాలు తారుమారయ్యాయి.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండంకెల వృద్ధి ఉంటుందని భావించినట్టు వోల్టాస్ తెలిపింది. సెకండ్ వేవ్, పరిమితుల కారణంగా లక్ష్యాలను పునర్ పరిశీలించుకోవాల్సి వస్తోందని వివరించింది. తొలి త్రైమాసికం అమ్మకాలు తుడిచిపెట్టుకు పోయినట్టేనని ఆందోళన వ్యక్తం చేసింది. 2019లో సాధించిన విక్రయాలు ఈ ఏడాది కూడా నమోదు చేస్తే అదే ఎక్కువ అని దైకిన్ అంటోంది. మార్చిలో ఏసీ సేల్స్ సానుకూలంగా ప్రారంభమయ్యాయని ప్యానాసోనిక్ ఇండియా సీఈవో మనీష్ శర్మ తెలిపారు. ఒక్కసారిగా కోవిడ్ కేసులు అధికం కావడం, పాక్షిక లాక్డౌన్లతో వేసవి అమ్మకాలు క్షీణించాయని చెప్పారు. ఏప్రిల్–జూన్ కాలంలో 50% నష్టం అంచనా వేస్తున్నట్టు వెల్లడించారు. స్టాక్ సరిపడ ఉందని గుర్తు చేశారు. లాక్డౌన్స్, కర్ఫ్యూలు జూన్ వరకే ఉంటాయి. అయితే అప్పటికే సీజన్ పూర్తి అవుతుందని హాయర్ అభిప్రాయపడింది. కీలకమైన మే నెలలో సేల్స్ సాధించకపోతే తరువాత చేయలేమని వివరించింది. గతేడాది జూలై, ఆగస్టులో మార్కెట్ పుంజుకుంది. ఈ ఏడాది అటువంటి పరిస్థితి లేదు అని హాయర్ ఇండియా ప్రెసిడెంట్ ఎరిక్ బ్రగాంజా తెలిపారు. -
ఏప్రిల్ 1 నుంచి వీటి ధరలు పైపైకి!
కొత్త ఆర్థిక సంవత్సరం రానే వచ్చేసింది. నేటి నుంచి పలు కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇవే కాకుండా పలు వస్తువుల ధరలు కూడా పెరగనున్నాయి. దీని వల్ల చాలా మందిపై ప్రతికూల ప్రభావం పడనుంది. నేటి నుంచి ధరలు పెరిగేవాటిలో టీవీ, ఏసీ, ఫ్రిజ్, కారు, బైక్ వంటివి ఉన్నాయి. అలాగే విమాన ప్రయాణ ఖర్చు కూడా పెరగనుంది. ఎలక్ట్రానిక్ ప్రొడక్టులు తయారు చేసే కంపెనీలు, వాహన కంపెనీలు ముడి పదార్థాల ధరల పెరగడం చేత ధరలను పెంచుతున్నట్లు పేర్కొన్నాయి. వాహనాలు వ్యాపారాలు వాహన ధరలను పెంచడంతో కార్లు, బైక్‌లు 2021 ఏప్రిల్ 1 నుంచి ఖరీదైనవిగా మారనున్నాయి. ధరలను పెంచుతున్నట్లు ఇప్పటికే మారుతి, నిస్సాన్ సంస్థలు ప్రకటించాయి. మొట్టమొదటి సారిగా భారతదేశంలో తన కార్లన్నింటినీ ధరలు పెంచుతున్నట్లు మారుతి సుజుకి ప్రకటించింది. అలాగే, ద్విచక్ర వాహనాల తయారీ సంస్థలు కూడా తమ ద్విచక్ర వాహనాల ధరలను పెంచుతున్నట్లు పేర్కొన్నారు. ప్రధానంగా హీరో స్కూటర్లు, బైక్‌ల ధరలు రూ.2,500 వరకు పెరిగే అవకాశం ఉంది. టీవీ 2021 ఏప్రిల్ 1 నుంచి టెలివిజన్ ధరలు పెరగనున్నాయి. గత ఎనిమిది నెలలుగా టీవీ రేట్లు క్రమంగా పెరుగుతున్నాయి. టీవీ తయారుదారులు టెలివిజన్ పరిశ్రమను పిఎల్ఐ ప్రణాళికల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. ఈ ఆకస్మిక పెరుగుదలకు ప్రధాన కారణం టీవీ ఉత్పత్తిలో వాడే ఓపెన్-సెల్ ప్యానెల్స్ ధర పెరగడమే. నేటి నుంచి టీవీ ధరలు యూనిట్‌కు కనీసం 2000-3000 రూపాయలు పెరిగే అవకాశం ఉంది. ఏసీ & రిఫ్రిజిరేటర్ ఎయిర్ కండీషనర్, రిఫ్రిజిరేటర్ కూడా ధర పెరిగే జాబితాలో ఉంది. తయారీ ఖర్చులు పెరగడం వల్ల ఎయిర్ కండీషనర్, రిఫ్రిజిరేటర్ ధర పెరుగుతుంది. ప్రతి ఎయిర్ కండీషనర్ ధర రూ.1500 నుంచి 2000 రూపాయలకు పెరగవచ్చు. కేవలం ఒక నెలలోనే ఓపెన్-సెల్ ప్యానెల్లు ప్రపంచ మార్కెట్లో ధర 35 శాతం పెరిగాయి. తత్పలితంగా ఎయిర్ కండిషనర్లు, రిఫ్రిజిరేటర్లు, కూలర్ల ధరలు పెరగనున్నాయి. విమాన ప్రయాణం దేశీయ విమానాల కనీస ఛార్జీలు 5 శాతం పెరుగుతాయి కాబట్టి విమానంలో ఇక ప్రయాణించడం కూడా ఖరీదైనదిగా మారనుంది. ఏప్రిల్ 1 నుంచి దేశీయ విమానయాన రక్షణ రుసుమును రూ.160 నుంచి రూ.200కు పెంచనున్నారు. అలాగే, అంతర్జాతీయ విమానాల రుసుము 5.2 డాలర్ల నుంచి 12 డాలర్లకు పెరగనుంది. దీనికి సంబంధించి డీజీసీఎ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. చదవండి: 17 రూపాయిలతో 116 కిలోమీటర్ల ప్రయాణం భారీగా పెరిగిన బంగారం ధరలు -
రోగుల ప్రాణాలతో మందులోళ్ల చెలగాటం..
సాక్షి, హైదరాబాద్: కొన్ని ఔషధ కంపెనీలు, మందుల దుకాణాలు, బ్లడ్ బ్యాంకులు నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయి. రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. సరైన పర్యవేక్షణ లేకపోవడంతో మెడికల్ షాపుల్లో గడువు తీరిన, నాసిరకం మందుల అమ్మకంతో రోగులకు ముప్పు పొంచి ఉంటోంది. ఔషధ నియంత్రణశాఖ పరిధిలో జరిగే ఉల్లంఘనల్లో దాదాపు 75% మెడికల్ షాపుల్లో జరిగేవేనని అధికారులు అంటున్నారు. ప్రధానంగా రిఫ్రిజిరేటర్లో ఉంచాల్సిన ఔషధాలను వేడి వాతావరణంలో పెట్టడం, సాధారణ మెడికల్ షాపు ల్లోనూ పశువుల మందులు విక్రయించడం, ఫార్మ సిస్ట్ లేకపోవడం, ప్రిస్క్రిప్షన్ లేకుండానే అమ్మడం, ఒక బ్రాండ్‌కు బదులు మరో బ్రాండ్ మందులు అంటగట్టడం, నిర్ణీత ధర కంటే ఎక్కువకు అమ్మడం, రికార్డుల నిర్వహణ సరిగా లేకపోవడం వంటి ఉల్లంఘనలు జరిగినట్లు సర్కారు గుర్తించింది. అలాగే కొన్ని ఔషధ కంపెనీలు కూడా నాణ్యతలేని ముడి సరుకులతో ఔషధాలు తయారు చేస్తున్నాయని తేలింది. అంతేగాక లేబిలింగ్ సరిగా ఉండకపోవడం, తక్కువధర ఉండాల్సిన వాటికి ఎక్కువ ధర నిర్ణయించడం తదితర ఉల్లంఘనలు జరిగాయి. మరోవైపు బ్లడ్‌బ్యాంకుల్లోనూ విపరీతంగా ఉల్లంఘనలు జరిగాయి. 2 నుంచి 8 డిగ్రీల ఉష్ణోగ్రతలో రక్తాన్ని నిల్వ ఉంచకపోవడం, నిర్దేశిత టెస్టుల్లో కొన్ని చేయకపోవడం జరుగుతోంది. తద్వారా సేకరించిన రక్తంలో ఏవైనా ఇన్ఫెక్షన్లు ఉంటే స్వీకరించే రోగులకు అంటుకునే ప్రమాదం ఉంటుంది. అలాగే మెడికల్ ఆఫీసర్ లేకుండానే టెక్నీషియన్లతో బ్లడ్ బ్యాంకును నడిపించడం వంటి ఉల్లంఘనలు జరిగాయి. ప్లాస్మా, రెడ్ బ్లడ్ సెల్స్, ప్లేట్లెట్స్ వంటి వాటికి ప్రత్యేక లైసెన్సు లేకుండా నడపడం తీవ్రమైన ఉల్లంఘనగా అధికారులు చెబుతున్నారు. 21,087 ఉల్లంఘనల్లో 18 వేలు మెడికల్ షాపుల్లోనే.. మందుల దుకాణాలు, ఫార్మసీ కంపెనీలు, బ్లడ్ బ్యాంకులు, స్టోరేజీ సెంటర్లలో గత ఐదేళ్లలో ఏకంగా 21,087 ఉల్లంఘనలు జరిగినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అసెంబ్లీకి సమర్పించిన నివేదిక వెల్లడించింది. 2016–17 నుంచి 2020–21 జనవరి వరకు ఈ ఐదేళ్లలో ఫార్మసీ కంపెనీలు, మందుల దుకాణాలు, బ్లడ్‌బ్యాంకులు, స్టోరేజీ సెంటర్లలో 87,700 తనిఖీలు నిర్వహించారు. వీటిల్లో 21,087 ఉల్లంఘనలను గుర్తించారు. ఏకంగా 24 శాతం ఉల్లంఘనలు జరగడం విస్మయం కలిగిస్తోంది. గడిచిన ఐదేళ్లలో 12,801 శాంపిళ్లను పరీక్షించగా... 1,348 కేసులు ప్రాసిక్యూషన్ వరకు వెళ్లాయి. ఔషధ నియంత్రణ సంస్థలోని కొందరు అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరించడం వల్లే యదేచ్ఛగా ఉల్లంఘనలు జరుగుతున్నాయని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అంటున్నారు. ఉల్లంఘనలు జరిగిన వాటిల్లో దాదాపు 18 వేలు మెడికల్ షాపుల్లోనే జరిగినట్లు ఔషధ నియంత్రణశాఖ వర్గాలు చెబుతున్నాయి. (చదవండి: ‘బల్సిందా నీ.. ఊర్కో బే’ బోధన్ ఎమ్మెల్యే బూతు పురాణం) వైద్య ఆరోగ్యశాఖ నివేదికలోని మరికొన్ని అంశాలు.. గతేడాది కరోనా నేపథ్యంలో అనారోగ్యానికి గురైనా చాలామంది ఆసుపత్రులకు రావడానికి జంకారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఔట్ పేషెంట్లు, ఇన్ పేషెంట్ల సంఖ్య బాగా పడిపోయింది. ప్రసవాలు మాత్రం గణనీయంగా పెరిగాయి. ప్రతిష్టాత్మక నిమ్స్ ఆసుపత్రిలో 2019లో ఔట్పేషెంట్లు 6.03 లక్షల మంది కాగా, 2020లో ఆ సంఖ్య ఏకంగా 2.98 లక్షలకు పడిపోయింది. అలాగే 2019లో 47,359 మంది ఇన్న్ పేషెంట్లుగా చికిత్స తీసుకోగా, 2020లో ఆ సంఖ్య 25,931కు పడిపోయింది. ఇక శస్త్రచికిత్సలు 2019లో 24,638 జరగ్గా, 2020లో సగానికికంటే తక్కువగా 11,073కు పడిపోయాయి. 2019లో మూత్రపిండాల మార్పిడి చికిత్సలు 105 జరగ్గా, 2020లో 30కు పడిపోయాయి. మోకాళ్ల మార్పిడి చికిత్సలు 2019లో 173 కాగా, 2020లో 34కు పడిపోయాయి. వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలోని 108 ఆసుపత్రులకు సగటున ఏడాదికి 1.08 కోట్ల మంది ఔట్ పేషెంట్లు వస్తుండగా, 2020–21లో జనవరి వరకు కేవలం 60.52 లక్షల మందే వచ్చారు. ఇన్ పేషెంట్లు 9.55 లక్షలు అంచనా కాగా, ఆ సంఖ్య 6.96 లక్షలకు పడిపోయింది. అయితే కరోనా కాలంలో 108 జిల్లా, ఏరియా ఆసుపత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాలు గణనీయంగా పెరిగాయి. వాటిల్లో సగటున ఏడాదికి 81,600 ప్రసవాలు జరుగుతుండగా, 2020లో ఏకంగా 1,24,278 ప్రసవాలు జరగడం విశేషం. ఆయా ఆసుపత్రుల్లో ల్యాబ్ టెస్ట్‌లు 36.95 లక్షల నుంచి 40.44 లక్షలకు చేరుకోవడం గమనార్హం. సగటు ఏడాదికి జరిగే ఈసీజీలు 63,175 కాగా.. గత ఏడాది ఏకంగా 79,970 జరిగాయి. ఇక తెలంగాణ డయాగ్నస్టిక్‌లలో 2019లో 9.05 లక్షల పరీక్షలు జరగ్గా, 2020లో 7.61 లక్షలకు పడిపోయాయి. 9 ప్రభుత్వ బోధనాసుపత్రులు, 22 స్పెషాలిటీ ఆసుపత్రుల్లో 2019లో 76.83 లక్షల మంది ఔట్ పేషెంట్లు వైద్య సేవలు పొందగా, 2020లో ఆ సంఖ్య సగానికి అంటే 38.25 లక్షలకు పడిపోయింది. ఇన్ పేషెంట్ల సంఖ్య 2019లో 5,91,772 కాగా, 2020లో 3.98 లక్షలకు పడిపోయింది. 2019లో ఈ ఆసుపత్రుల్లో 3.22 లక్షల శస్త్రచికిత్సలు జరగ్గా, 2020లో 1.48 లక్షలు జరిగాయి. ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో 2019–20లో 3.50 లక్షల మంది వైద్య సేవలు పొందగా, 2020–21 మార్చి 10వ తేదీ నాటికి 2.26 లక్షల మంది సేవలు పొందారు. (చదవండి: ఉపాధి పనికి ఆలయ అర్చకుడు ) -
ఫ్లిప్‌కార్ట్ లో ఏసీ, ఫ్రిజ్ లపై సరికొత్త ఆఫర్స్
ఫ్లిప్‌కార్ట్ రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఫ్లిప్‌కార్ట్ కూలింగ్ డేస్ పేరుతో సరికొత్త సేల్ ను తీసుకొచ్చింది. ఈ సేల్ మార్చి 10 నుంచి 14 వరకు కొనసాగుతుంది. ఫ్లిప్‌కార్ట్ కూలింగ్ డేస్ సేల్ లో ఎయిర్ కండీషనర్, రిఫ్రిజిరేటర్లు, ఫ్యాన్స్, ఎయిర్ కూలర్లు, వాటర్ ప్యూరిఫైయర్లపై ప్రత్యేక ఆఫర్స్ ప్రకటించింది. శాంసంగ్, బ్లూస్టార్, హిటాచీ, ఎల్జీ, వోల్టాస్ లాంటి బ్రాండ్స్‌కు చెందిన ప్రొడక్ట్స్‌పై ఆఫర్స్ లభిస్తాయి. ఏసీ కొనాలనుకునేవారికి వాల్పూల్, మార్క్యూ, ఒనిడా లాంటి బ్రాండ్స్ నుంచి ప్రత్యేక డీల్స్ ఉన్నాయి. ఏసీ, ఇన్వర్టర్ ఏసీ, త్రీ స్టార్ ఏసీ, విండో ఏసీ లాంటి వేర్వేరు ప్రొడక్ట్స్‌పై ఆఫర్స్ ఉన్నాయి. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డులతో కొంటే 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. 6 నెలల నుంచి 24 నెలల నోకాస్ట్ ఈఎంఐ ఆఫర్‌తో ఈ ప్రొడక్ట్స్ కొనొచ్చు. ఏసీ కొనాలనుకునేవారికి 0.8 నుంచి 1.5 టన్స్ వరకు అనేక ఆప్షన్స్ ఉన్నాయి. ఫ్యాన్స్ సెక్షన్లో వీటితో పాటు సీలింగ్ ఫ్యాన్స్, వాల్ ఫ్యాన్స్, టేబుల్ ఫ్యాన్స్‌పైనా ఆఫర్స్ ఉన్నాయి. చదవండి: ఇండియాలో పబ్జీ మళ్లీ రానుందా? బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్! -
విస్తరిస్తున్న నోకియా: త్వరలో మరిన్ని ఉత్పత్తులు
సాక్షి, ముంబై: ప్రముఖ సంస్థ నోకియా వ్యాపార విస్తరణలో దూకుడును ప్రదర్శిస్తోంది. భారతదేశంలో, నోకియా స్మార్ట్ టీవీలు, ఏసీలు ల్యాప్‌టాప్‌ల కోసం ఫ్లిప్‌కార్ట్‌లో భాగస్వామ్యాన్ని ఇటీవల ప్రకటించిన నోకియా తాజాగా మరికొన్ని ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను లాంచ్ చేయనుంది. త్వరలో రిఫ్రిజరేటర్లు, వ్యాక్యూమ్ క్లీనర్లు, డిష్ వాషర్లు లాంటి వంటి ఉపకరణాలను మార్కెట్లో ప్రారంభించనుంది. ఈ మేరకు నోకియా బ్రాండ్ పార్ట్నర్షిప్స్ హెడ్ విపుల్ మెహ్రోత్రా ధృవీకరించారు. మైక్రోసాఫ్ట్ నుండి బయటపడిన తరువాత, నోకియా మరింత విస్తరిస్తోంది. తన వ్యాపారాన్ని ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు లైసెన్సులతో రీబ్రాండ్ అవుతూ పూర్వ వైభవాన్ని దక్కించుకునేందుకు యోచిస్తోంది. ఈ క్రమంలోనే నోకియా స్మార్ట్ఫోన్లు మొదలు, నోకియా టెలివిజన్లు, నోకియా స్ట్రీమింగ్ పరికరాలు, నోకియా ల్యాప్‌టాప్‌లు, ఎయిర్ కండీషనర్లు, ఫ్రిజ్‌లను, డిష్ వాషర్ల వరకు భారతీయ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌తో నోకియా భాగస్వామ్యంపై మెహ్రోత్రా మాట్లాడుతూ, దేశంలో, ఫ్లిప్‌కార్ట్ మొట్టమొదటి నోకియా బ్రాండెడ్ ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్ టీవీని గత సంవత్సరం విడుదల చేసిందనీ, ఆ తర్వాత ఆరు నెలల క్రితం మీడియా స్ట్రీమర్లు, గత రెండు నెలల్లో ఆరు కొత్త స్మార్ట్ టీవీలను ఆవిష్కరించినట్టు తెలిపారు. అంతేకాదు ఇటీవలి పండుగ సీజన్ అమ్మకాలలో, నోకియా బ్రాండెడ్ స్మార్ట్ టీవీలు ఫ్లిప్‌కార్ట్‌లో అత్యధికంగా అమ్ముడైన ఐదు టీవీలలో ఒకటని వెల్లడించారు. కరోనావైరస్ మహమ్మారి వల్ల ఆలస్యం జరిగినప్పటికీ ఇంకా వాక్యూమ్ క్లీనర్, ఎలక్ట్రిక్ టూత్ బ్రష్, స్మార్ట్ లైట్లు, స్మార్ట్ ప్లగ్స్ వంటి స్మార్ట్ ఉపకరణాలను కూడా తీసుకొస్తామన్నారు. -
ముంచుకొస్తున్న మరో ముప్పు!
వాషింగ్టన్: మనం నిత్యం వాడుతున్న మొబైల్ ఫోన్లు, టీవీలు, రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, వాషింగ్ మిషన్లు, ఎలక్రిక్ వస్తువులు, ఇతర గాడ్జెట్లు... విచ్చలవిడిగా పెరుగుతున్న వాడకమే కాదు. వీటవల్ల ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న ఎలక్ట్రానిక్ వేస్టేజ్ కూడా ప్రమాదకరంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి గ్లోబల్ ఈ-వేస్ట్ మానిటర్ 2020 నివేదిక ప్రకారం 2019లో ప్రపంచవ్యాప్తంగా 52.7 మిలియన్ టన్నుల ఈ-వేస్ట్ ఉత్పత్తి కాగా అందులో కేవలం 17.4 శాతం మాత్రమే సేకరించి రీసైకిల్ చేసినట్లు వెల్లడించింది. ఈ నివేదిక ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితులను తిప్పికొట్టడంలో ఎంతో దోహదం చేస్తుందని ఐక్యరాజ్య సమితి అభిప్రాయ పడింది. గత ఏడాది మొత్తం ఉత్పత్తి అయిన ఈ-వ్యర్థాలలో ఆసియా పెద్దమొత్తంలో అనగా సుమారు - 46.4 శాతం ఉత్పత్తి చేయగా తరువాత స్థానాల్లో అమెరికా (24.4 శాతం), యూరప్ (22.3 శాతం), ఆఫ్రికా (5.4 శాతం), ఓషియానియా (1.3 శాతం) ఉన్నాయి. ఐరాస నివేదిక ప్రకారం 2030 నాటికి ప్రస్తుతం ఉన్న ఈ-వేస్ట్‌కు అదనంగా 19.6 మిలియన్ టన్నులు జోడించి మొత్తం ఈ- వేస్ట్ 72.8 మిలియన్ టన్నులకు చేరుకుంటుందని నివేదిక తెలిపింది. అంతేకాక ఈ దశాబ్దం చివరి నాటికి ప్రపంచ వ్యాప్తంగా ఈ-వేస్ట్ సమస్య మరింత తీవ్రమవుతుందని నివేదిక హెచ్చరించింది. (కరోనా వ్యాక్సిన్‌కు రెండున్నర ఏళ్లు పడుతుంది) ప్రపంచవ్యాప్తంగా ఏసీలు, ఫ్రిజ్‌లు, ఎలక్ట్రిక్ దీపాల వాడకంతో పాటు స్మార్ట్ ఫోన్ల వినియోగం, తక్కువ లైఫ్‌టైం ఉన్న టెక్ గాడ్జెట్లు ఈ-వ్యర్థాల ఉత్పత్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని నివేదిక వెల్లడించింది. ఈ-వేస్ట్‌పై పోరాడటానికి ప్రపంచ దేశాలకు 2014వరకు ఎలాంటి విధానాలు లేవు. అయితే ప్రస్తుతం ఈ పరిస్థితుల్లో మార్పు వచ్చిందని ఇప్పటికే పలు ప్రపంచ దేశాలు ఈ-వేస్ట్ నియంత్రణ కోసం చట్టాలు, విధానాలు రూపొందించాయని నివేదిక పేర్కొన్నది. ప్రస్తుతం ఈ- వేస్ట్ నియంత్రణకు చట్టాలు రూపొందించిన దేశాల సంఖ్య 61 నుంచి 78 కి పెరిగిందని నివేదిక తెలిపింది. రాజకీయ కారణాల వల్ల ఇప్పటికి ఈ-వేస్ట్ నిర్వహణను పలు దేశాలు సరిగా అమలు చేయడం లేదని యూఎన్వో తెలిపింది. ఐక్యరాజ్యసమితి టెలికాం శాఖ అయిన ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ఐటీయూ) సగానికి పైగా ప్రపంచ దేశాలు ఈ-వేస్ట్ చట్టాన్ని అమలు చేయాలని భావిస్తోంది. కానీ ప్రస్తుతం 78 దేశాలు మాత్రమే ఈ-వేస్ట్ చట్టాలను రూపొందించాయి. 2015 సెప్టెంబరులో యూఎస్, దాని సభ్య దేశాలు సుస్థిర అభివృద్ధి కోసం 2030 ఎజెండాను ఆమోదించాయి. దీనిలో 17 ‘సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు’ (ఎస్డీజీ), ‘పేదరికాన్ని అంతం చేయడం, భూమిని పరిరక్షించడం,అందరి శ్రేయస్సుకు కృషి చేయడం’ వంటి 169 లక్ష్యాలను గుర్తించాయి. అయితే పెరుగుతున్న ఈ-వ్యర్థాలతో పాటు వాటిని అసురక్షిత పద్దతిలో ట్రీట్ చేయడం, కాల్చడం, పల్లపు ప్రదేశాలలో పారవేయడం వల్ల ఈ లక్ష్యాలను సాధించడానికి అవరోధం కలగడమే కాక మానవ ఆరోగ్యం పర్యావరణం దెబ్బతింటుందని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఐక్యరాజ్య సమితి గ్లోబల్ ఈ-వేస్ట్ మానిటర్ 2020 నివేదిక వెల్లడించిన గణాంకాలు ఈ విధంగా ఉన్నాయి 2019 లో వినియోగించిన ఫ్రిజ్‌లు, ఎయిర్ కండిషనర్ల నుండి 98 మెట్రిక్ టన్నుల కార్జన్డై ఆక్సైడ్ వాతావరణంలోకి విడుదల అయ్యింది. ఇది ప్రపంచ గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలలో సుమారు 0.3 శాతంగా ఉంది. గత సంవత్సరం పోగుపడ్డ ఈ-వ్యర్థాలను పంచితే భూమిపై ఉన్న ప్రతి పురుషుడు, స్త్రీ , బిడ్డకు సగటున 7.3 కిలోలు వస్తుంది. 16.2 కిలోల తలసరి ఈ-వ్యర్థాల ఉత్పత్తితో యూరప్ ప్రపంచవ్యాప్తంగా మొదటి స్థానంలో ఉంది. ఓషియానియా రెండవ స్థానంలో (16.1 కిలోలు), అమెరికా (13.3 కిలోలు) తువాతి స్థానంలో ఉన్నాయి. ఆసియా, ఆఫ్రికా చాలా తక్కువగా ఈ- వేస్ట్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. ఏటా 50 టన్నుల పాదరసాన్ని మానిటర్లు, పీసీబీలు ఫ్లోరోసెంట్, ఎనర్జీ సేవింగ్ లైట్ సోర్స్‌లలో ఉపయోగిస్తున్నారు. 2019 లో ఉత్పత్తి అయిన ఈ-వ్యర్థాల్లో ప్రధానంగా చిన్న పరికరాలు (17.4 టన్నులు), పెద్ద పరికరాలు (13.1 మెట్రిక్ టన్నులు) ఉష్ణోగ్రత మార్పిడి పరికరాలు (10.8 టన్నులు) ఉన్నాయి. ఈ-వేస్ట్‌లో స్క్రీన్స్, మానిటర్లు, లైట్స్, చిన్న ఐటి ,టెలికమ్యూనికేషన్ పరికరాలు వరుసగా 6.7 మెట్రిక్ టన్నులు 4.7 మెట్రిక్ టన్నులు, 0.9 మెట్రిక్ టన్నులుగా ఉన్నాయి. తక్కువ ఆదాయ దేశాలలో ఆర్థిక పరిస్థితులు మెరుగు పడుతుండటంతో ఎలాక్ట్రానిక్ వస్తువుల వినియోగం పెరుగుతుంది. ఫలితంగా ఈ-వెస్ట్ పెరుగుతోంది. ఈ-వేస్ట్‌లో చిన్న ఐటీ, టెలికమ్యూనికేషన్ పరికరాల పెరుగుదల నెమ్మదిగా ఉండగా, స్క్రీన్లు మానిటర్లు స్వల్పంగా తగ్గుదలని చూపించాయి (-1 శాతం). భారీ సీఆర్టీ మానిటర్లు, స్క్రీన్ల స్థానంలో తేలికైన ఫ్లాట్ ప్యానెల్ డిస్ప్లేలు ఎక్కువవుతున్నాయి. 2014 నుండి, జాతీయ ఈ-వేస్ట్ విధానాలు, చట్టాలు రూపొందించిన దేశాల సంఖ్య 61 నుంచి 78 కి పెరిగింది. ఇది సానుకూల ధోరణి అయినప్పటికి, ఇది అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ నిర్దేశించిన లక్ష్యానికి దూరంగా ఉంది. ఈ యూనియన్ ఈ-వేస్ట్ చట్టాలు రూపొందించిన దేశాల శాతాన్ని 50 శాతానికి పెంచాలని భావిస్తోంది. -
ఆన్లైన్లో మళ్లీ టీవీలు, ఫ్రిజ్‌లు
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌ను క్రమంగా ఎత్తివేసే ప్రక్రియలో భాగంగా ఈ–కామర్స్‌లో విక్రయాలకు కేంద్రం అనుమతించింది. దీంతో ఏప్రిల్ 20 నుంచి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ వంటి ఈ–కామర్స్ పోర్టల్స్‌లో మళ్లీ మొబైల్ ఫోన్లు, టీవీలు, ఫ్రిజ్‌లు, ల్యాప్‌టాప్‌లు వంటి ఉత్పత్తుల అమ్మకం ప్రారంభం కానుంది. మే 3 దాకా పొడిగించిన లాక్డౌన్ మార్గదర్శకాలకు సంబంధించి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఒకరు ఈ మేరకు వివరణనిచ్చారు. టీవీలు, మొబైల్ ఫోన్స్ కూడా ఆన్లైన్ పోర్టల్స్‌లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. అయితే, ఈ–కామర్స్ కంపెనీల డెలివరీ వ్యాన్లు.. రోడ్ల మీదికి రావాలంటే ప్రత్యేకంగా అనుమతులు తీసుకోవాలన్నారు. మార్చి 25న తొలిసారిగా లాక్డౌన్ ప్రకటించినప్పుడు ఈ–కామర్స్ సంస్థలు కేవలం ఔషధాలు, ఆహారపదార్థాలు వంటి నిత్యావసరాలే విక్రయించడానికి అనుమతినిచ్చారు. సరుకు రవాణా, డెలివరీ మొదలైన సర్వీసుల ద్వారా చాలా మంది ఉపాధి పొందుతుండటంతో వారి ప్రయోజనాలు కాపాడేందుకు కేంద్రం ఈ నిర్ణ యం తీసుకుంది. దీనికి సంబంధించి బుధవారం ప్రకటించిన మార్గదర్శకాలపై నెలకొన్న సందేహాలను ఇప్పుడు నివృత్తి చేసింది. -
శాంసంగ్ కొత్త ఫ్రిజ్‌లు, ప్రపంచంలోనే మొదటివి
సాక్షి, ఢిల్లీ: ఎలక్ట్రానిక్స్ తయారీ దిగ్గజం శాంసంగ్ తాజాగా కొత్త రిఫ్రిజిరేటర్ల శ్రేణిని ప్రవేశపెట్టింది. పెరుగు తోడుపెట్టే బాదరబందీ లేకుండా చేసే 'కర్డ్ మేస్ట్రో' ఫ్రిజ్ కూడా వీటిలో ఉంది. పాలు..పెరుగుగా మారడంలో కీలకమైన ఫెర్మెంటేషన్ ప్రక్రియను ఆటోమేటిక్‌గా నిర్వహించే టెక్నాలజీని శాంసంగ్ ఈ ఫ్రిజ్‌లో పొందుపర్చింది. ఇందుకోసం ఫ్రిజ్‌లో ప్రత్యేక అర ఉంటుంది. అయిదు నుంచి ఆరు గంటల్లో పెరుగు సిద్ధమవుతుందని సంస్థ వెల్లడించింది. ప్రపంచంలోనే ఈ తరహా మొట్టమొదటి ఫ్రిజ్ ఇదేనని పేర్కొంది. 244 లీ. నుంచి 336 లీ. దాకా సామర్ధ్యముండే కర్డ్ మేస్ట్రో రిఫ్రిజిరేటర్ల ధరల శ్రేణి రూ. 30,990 నుంచి రూ. 45,990 దాకా ఉంటుంది. మరోవైపు, 2020 ఏడాదికి సంబంధించి ప్రవేశపెట్టిన ఇతర ఫ్రిజ్‌ల ధరల శ్రేణి రూ. 17,990 నుంచి రూ. 45,990 దాకా ఉందని శాంసంగ్ తెలిపింది. -
ఫ్రిజ్‌లు, ఏసీలు రయ్రయ్!
న్యూఢిల్లీ: వినియోగ ఉత్పత్తుల విక్రయాలపై మందగమన ప్రభావాలు గణనీయంగా కనిపిస్తున్నప్పటికీ .. ఎలక్ట్రికల్ ఉపకరణాల అమ్మకాలు మాత్రం జోరుగా సాగుతున్నాయి. ఈ ఏడాది వేసవిలో ఉష్ణోగ్రతలు అధిక స్థాయిలో నమోదుకావడంతో ఏసీలు, ఎయిర్ కూలర్లు, రిఫ్రిజిరేటర్లు, ఫ్యాన్లు వంటి పలు రకాల కూలింగ్ ఉత్పత్తుల విక్రయాలు భారీగా వృద్ధి నమోదు చేశాయి. కన్జూమర్ డ్యూరబుల్స్ రంగంలోని మిగతా విభాగాలతో పోలిస్తే ఎలక్ట్రికల్ ఉపకరణాల విభాగం మెరుగైన పనితీరు కనపర్చినట్లు బజాజ్ ఎలక్ట్రికల్స్ ఈడీ అనుజ్ పొద్దార్ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో పరిశ్రమపరంగా ఏసీల అమ్మకాలు 20 శాతం, ఫ్రిజ్‌ల విక్రయాలు 12 శాతం మేర వృద్ధి సాధించినట్లు గోద్రెజ్ అప్లయెన్సెస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయెన్సెస్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కమల్ నంది తెలిపారు. టీవీల కన్నా .. ఏసీలకే ఓటు.. వేసవి ఉష్ణోగ్రతలు ఈసారి ఎగబాకడంతో కొనుగోలుదారులు టీవీల కన్నా ఏసీల వైపే ఎక్కువగా మొగ్గు చూపినట్లు నంది పేర్కొన్నారు. అంతే కాకుండా వీడియో కంటెంట్ చూసే విషయానికొస్తే.. టీవీల్లో కన్నా మొబైల్ ఫోన్స్‌కి ప్రాధాన్యం పెరుగుతుండటం కూడా టీవీల అమ్మకాలపై ప్రభావం చూపిందన్నారు. దీంతో టీవీల విక్రయాలు ఒక మోస్తరు స్థాయికే పరిమితమయ్యాయని వివరించారు. ఆఖరికి క్రికెట్ వరల్డ్ కప్ కూడా టెలివిజన్ల అమ్మకాల వృద్ధికి ఉపయోగపడలేదు. మరోవైపు లో–బేస్ ఎఫెక్ట్ సైతం ఏసీల విక్రయాల్లో వృద్ధికి కొంత కారణమై ఉండొచ్చని బ్లూస్టార్ జాయింట్ ఎండీ బి. త్యాగరాజన్ తెలిపారు. గతేడాది అధిక కమోడిటీల ధరలు, కరెన్సీ మారకం రేటులో హెచ్చుతగ్గులు, కొంత సాధారణ ఉష్ణోగ్రతలు తదితర అంశాల కారణంగా ఏసీల విక్రయాల వృద్ధి పెద్దగా నమోదు కాలేదని ఆయన వివరించారు. దేశవ్యాప్తంగా పలు చోట్ల వర్షాలు, వరదల మూలంగా ఆగస్టులో ఏసీల విక్రయాలు ఒక మోస్తరు స్థాయిలో ఉన్నా పండుగల సీజన్ మొదలవుతుండటంతో సెప్టెంబర్‌లో మళ్లీ వృద్ధి కనిపించవచ్చని పేర్కొన్నారు. మందగమన ప్రభావాలూ ఉన్నాయి.. జూలై, ఆగస్టుల్లో మొత్తం కన్జూమర్ డ్యూరబుల్స్ పరిశ్రమని పరిగణనలోకి తీసుకుంటే మాత్రం అమ్మకాలు అంత ఆశావహంగా ఏమీ లేవని నంది పేర్కొన్నారు. కొన్ని విభాగాల్లో క్షీణత కూడా నమోదైందని వివరించారు. చాలా రంగాల్లో ఆర్థిక మందగమనం మూలంగా.. వినియోగదారుల కొనుగోలు ధోరణులపై కూడా ప్రభావం పడిందని తెలిపారు. కొనుగోలు నిర్ణయాలను కస్టమర్లు వాయిదా వేసుకోవడం కూడా జరిగిందని క్రిసిల్ రీసెర్చ్ డైరెక్టర్ హేతల్ గాంధీ తెలిపారు. మరోవైపు, వర్షపాతం సరైన రీతిలో లేకపోవడంతో కొన్ని ప్రాంతాల్లో పంటలు వేయడంలో జాప్యాలు జరగ్గా.. ఇంకొన్ని ప్రాంతాల్లో అధిక వర్షపాతంతో పంటలు కొట్టుకుపోవడం జరిగిందని నంది చెప్పారు. ఇలా వ్యవసాయోత్పత్తి మందగించి, ఆదాయాలు తగ్గడం వల్ల కన్జూమర్ డ్యూరబుల్స్ పరిశ్రమ కూడా మిగతా రంగాల్లాగానే క్షీణత నమోదు చేసే అవకాశం ఉందని తెలిపారు. రేట్ల కోత ఊతం.. వినియోగదారులు, పరిశ్రమ సెంటిమెంటును మెరుగుపర్చే దిశగా ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన కొన్ని చర్యలు పరిస్థితి మెరుగుపడటానికి ఊతమివ్వగలవని భావిస్తున్నట్లు నంది చెప్పారు. ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ. 70,000 కోట్ల మేర కేంద్రం నిధులు ప్రకటించడం, ఆర్బీఐ పాలసీపరంగా కీలకవడ్డీ రేట్లను తగ్గించడం వంటి అంశాలతో మార్కెట్లో నిధుల లభ్యత మెరుగుపడుతుందని, రుణ వితరణ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని ఆయన వివరించారు. వినియోగదారుల సానుకూల సెంటిమెంటు, వర్షపాతం, ఉపాధి కల్పన.. ఈ మూడు అంశాలు పరిశ్రమకు కీలకంగా ఉంటాయని చెప్పారు. వడ్డీ రేట్లపై ఆర్బీఐ ఉదార విధానాలు, వ్యవస్థలో నిధుల లభ్యత మెరుగుపడటం మొదలైనవి ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో వినియోగ వృద్ధికి ఊతమివ్వగలవని వివరించారు. ప్రథమార్ధం మందగించడంతో.. వినియోగ వస్తువుల తయారీ సంస్థలు.. ఈ పండుగ సీజన్లో కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రమోషనల్ ఆఫర్లను మరింతగా పెంచవచ్చని, పలు ఆకర్షణీయ ఫైనాన్సింగ్ స్కీములు కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉందని హేతల్ గాంధీ చెప్పారు. కన్జూమర్ డ్యూరబుల్స్ పరిశ్రమ వార్షిక అమ్మకాల్లో ఏకంగా 21 శాతం వాటా పండుగ సీజన్‌దే ఉంటోంది. అయినప్పటికీ 2020 ఆర్థిక సంవత్సరంలో మొత్తం కన్జూమర్ డ్యూరబుల్స్ అమ్మకాల పరిమాణం గతంలో అంచనా వేసిన 6–7 శాతం కన్నా 200–300 బేసిస్ పాయింట్ల మేర తగ్గవచ్చని పేర్కొన్నారు. -
సరికొత్తగా శాంసంగ్ ఫ్రిజ్‌లు
సియోల్: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ కొత్త రిఫ్రిజిరేటర్లను లాంచ్ చేసింది. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఎనిమిది రకాల ఫ్రిజ్‌లను కొరియా మార్కెట్లోకి తీసుకొచ్చింది. తన స్టాండర్డ్ మోడల్ ఫ్రిజ్‌లకు భిన్నంగా,కొరియన్ కిచెన్లకు అనుగుణంగా వీటిని రూపొందించింది. విభిన్న రంగులు, డిజైన్లతో సరికొత్తగా ఆవిష్కరించింది. వీటిల్లో ఫోర్ డోర్ ఫ్రిజ్‌లు, డబుల్ డోర్ ఫ్రిజ్లున్నాయి. 1.8 మీటర్లు ఎత్తు, 70 సెం.మీ. లోతు వుండేలా వీటిని డిజైన్ చేసింది. వినియోగదారుల విభిన్న పోకడలను ప్రతిబింబించేలా శాంసంగ్ కస్టమైజ్డ్ రిఫ్రిజరేటర్లను లాంచ్ చేశామని కిమ్ హున్-సక్ పత్రికా సమావేశంలో ప్రకటించారు. -
మరింత ఫ్రెష్‌గా..
ప్రతి దానికీ ఓ ఎక్స్పైరీ డేట్ ఉంటుంది.. మందులకు, కూల్ డ్రింక్‌లకు, పాలప్యాకెట్లకు.. ఇలా అన్నిటికీ.. మరి కూరగాయలకు? పళ్లకు?? మనం వండిన ఆహారానికి??? వీటి ఎక్స్పైరీ డేట్ తెలిసేదెలా? నేడే కొనండి.. ఆలసించిన ఆశాభంగం.. ఒకటి కొంటే మరొకటి ఫ్రీ.. రెండు కొంటే ఐదు ఫ్రీ సూపర్ మార్కెట్లో బోలెడన్ని ఆఫర్లు.. తక్కువకు వస్తున్నాయని కొనేశాం.. ఫ్రిజ్‌లో తోసేశాం.. కళ్లకు కనిపించినవి వాడుతున్నాం.. కానీ కనిపించకుండా కొన్ని లోలోపలే పాడైపోతున్నాయి.. ఆహారం వృథా.. చివర్లో చూసుకుని.. చేసేది లేక చెత్తకుప్పలో పడేయాల్సిన దుస్థితి ఇంతకీ పరిస్థితి మారేదెలా? ఇంట్లో జరిగే ఆహార వృథా.. చూడ్డానికి చిన్నదే కానీ ఓ పెద్ద సమస్య. దానికి పరిష్కారం ఈ స్మార్ట్ కంటెయినర్లని అంటోంది షికాగోకు చెందిన ఒవీ స్మార్టర్ వేర్. ఎందుకంటే వీటికి తగిలించి ఉండే ఎలక్ట్రానిక్ డిస్క్‌లు ఎప్పటికప్పుడు ఆహార పదార్థాల తాజాదనంపై మనల్ని అప్రమత్తం చేస్తూ ఉంటాయట. ఇవి ఇంటర్నెట్తో ఆనుసంధానమై ఉంటాయి. ఆన్లైన్ డాటాబేస్ ఆధారంగా పదార్థాలు ఎన్ని రోజులు తాజాగా ఉంటాయన్న వివరాలను అంచనా వేస్తాయి. రంగుల ఆధారంగా వినియోగదారులను అప్రమత్తం చేస్తాయి. డిస్క్ పచ్చ రంగులో ఉంటే తాజాగా ఉందని అర్థం. అదే పసుపు రంగులోకి మారితే.. ఫ్రిజ్‌లో ముందు వాడాల్సిన లేదా తినాల్సిన వస్తువు అదే అని సూచిస్తున్నట్లు లెక్క.. ఎరుపు రంగులోకి మారితే.. పాడైనట్లు అన్నమాట. ఇవి మన ఫోన్లోని ప్రత్యేకమైన యాప్‌తో లింక్ చేసి ఉంటాయి. డిస్క్ పసుపు రంగులోకి మారగానే.. ఫోన్‌కు మెసేజ్ రూపంలో సమాచారం వస్తుంది. అంతేకాదు.. స్మార్ట్ కంటెయినర్లో ఉన్న ఆహార పదార్థాలతో ఎలాంటి వంటలు చేసుకోవచ్చు. మీ ఏరియాలోని ఇతరులతో పోలిస్తే.. మీరు చేస్తున్న ఆహార వృథాను కూడా తెలియజేస్తుంది. ఒవీ స్మార్ట్‌వేర్ మీ సాధారణ ఫ్రిజ్‌ను స్మార్ట్ ఫ్రిజ్‌గా మారుస్తుందని ఆ కంపెనీ సీఈవో, సహ వ్యవస్థాపకుడు థాంపన్స్ అన్నారు. ‘చాలా మందికి ఆహారాన్ని వృథా చేయడం ఇష్టం ఉండదు. కానీ అలా జరిగిపోతూ ఉంటుంది. ఫ్రిజ్‌లో పెట్టి మర్చిపోతుంటారు.. ఒక్కోసారి ప్యాకెట్లకు ప్యాకెట్లు పడేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇలా ప్రతి ఇల్లు లెక్కేస్తే.. ఈ వృథా చాలా భారీగా ఉంటుంది. ఈ కంటెయినర్లు ఆహార వృథాను తగ్గించేందుకు తోడ్పడుతాయి’ అని తెలిపారు. ఇప్పటికే ఆన్లైన్లో ఆర్డర్లు తీసుకుంటున్నారు. మార్చి నుంచి డెలివరీలు మొదలవుతాయి. ధర రూ. 9,100. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
అన్నింటినీ రిఫ్రిజిరేటర్లో పెడితే అనర్థమే..
విజయనగరం మున్సిపాలిటీ: పోపులపెట్టె అంటే అందరికి తెలిసిందే... రిఫ్రిజిరేటర్ పరిస్థితి నేడలా తయారైంది. తినే వస్తువుంటే చాలు అందులో దాచేస్తున్నారు. దీని వల్ల జరిగే అనర్థాలను గుర్తించడం లేదు. నేటి తరం ప్రజల దైనందిన జీవితంలో రిఫ్రిజిరేటర్ వినియోగం ఒక భాగమైంది. జిల్లాలో సుమారు 13 లక్షల కుటుంబాలు ఉండగా 40 శాతం కుటుంబాల్లో రిఫ్రిజిరేటర్ల వినియోగం ఉందని అంచనా. వీరిలో 25 శాతానికి పైగా కుటుంబాలు పూర్తి మెలకువలు తెలియకుండానే వినియోగిస్తున్నారు. ప్రతి రోజు జిల్లాలో 100 నుంచి 300 రిఫ్రిజిరేటర్లు వరకు విక్రయాలు జరుగుతున్నాయి. వీటితో పాటు దుకాణాలు, హోటళ్లు, బార్లు తదితర వ్యాపార సంస్థల్లో, ఆహార పదార్థాల దుకాణాల్లో కూడా రిఫ్రిజిరేటర్లు వేల సంఖ్యలో వినియోగిస్తున్నారు. సరైన అవగాహన లేకుండా వీటి వినియోగం వల్ల అనారోగ్యం పాలవుతున్నారు. ఫ్రిజ్లున్న ప్రతి ఒక్కరూ ఆహార పదార్థాలను ఎక్కువ సమయం నిల్వ చేయడం, తరువాత వాటిని వాడడం సాధారణమైంది. ఈ పరిస్థితుల్లో రిఫ్రిజిరేటర్లలో ఏయే రకాల ఆహార పదార్ధాలు ఎలా నిల్వ చేసుకొవాలనే విషయంలో పోషకాహార నిపుణులు ఇస్తున్న సూచనలు పాటించాల్సిందే. ఏ పదార్ధాలు...ఎలా దాచుకోవాలి... కేకులను గాలి సోకని డబ్బాలో నిల్వ చేసుకుంటే ఉత్తమం. తాజా పదార్ధాలతో చేసినదైతేనే ఫ్రిజ్‌లో ఉంచుకోవచ్చు. లేదంటే వాటిని ప్రత్యేకంగా అందుబాటులోకి వచ్చిన కేక్ డబ్బాలలో నిల్వ చేసుకోవచ్చు. తేనెకు సహజ సిద్ధంగానే నిల్వ ఉండే గుణం ఉంటుంది. రిఫ్రిజిరేటర్లలో దాచి పెట్టాల్సిన అవసరం ఉండదు. చల్లని వాతావరణంలో నిల్వ ఉంచితే గట్టిపడి, సహజత్వం కోల్పోతుంది. రుచి కూడా మారిపోతుంది. ఉల్లిగడ్డ లాగానే వేరే పదార్ధాలకు వాసన కలిగించే వెల్లుల్లిని కూడా ఇందులో దాచుకోకూడదు. వాటిని పొడిగా, పరిశుభ్రంగా ఉండే ప్రదేశాల్లో నిల్వ ఉంచుకోవడమే మేలు. ఉల్లిగడ్డలను ఫ్రిజ్‌లో నిల్వ ఉంచుకోవడం వల్ల ఇతర పదార్థాల రుచి, వాసన మారిపోతుంది. పొడిగా, పరిశుభ్రంగా ఉండే చోట నిల్వ ఉంచుకోవడమే ఉత్తమం. రొట్టెలు రిఫ్రిజిరేటరులో పెడితే తొందరగా పాడైపోతాయి. బూజు పట్టే అవకాశం ఉంది. అందుకే రొట్టెలను డబ్బాలో కానీ, ప్రత్యేకంగా వీటి కోసం తయారు చేసిన సంచులలో కానీ పెట్టి ఫ్రిజ్‌లో దాచుకోవాలి. అరటిపండ్లు ఉష్ణ వాతావరణాన్ని తట్టుకునే శక్తితో ఉంటాయి. చల్లటి వాతావరణంలో అవి నిల్వ ఉండవు. ఇంకా పండని అరటి పండ్లను ఫ్రిజ్‌లో దాచుకుంటే చూడటానికి బాగానే కనిపించినా మెత్తగా, నల్లగా మారిపోతాయి. కాఫీ పొడి, గింజలకు పరిసరాల్లోని వాసనలను స్వీకరించే గుణం ఉంటుంది. అందుకే వాటిని ఫ్రిజ్‌లో ఉంచితే ఇతర పదార్థాల వాసనల్లోకి మారిపోతాయి. వాటిని బయట గాలి సోకని డబ్బాలో దాచుకోవడమే సరైనదని చెబుతున్నారు. సలాడ్లుగా ఉపయోగించుకునే చెర్రీలు, టమాటలు వంటి వాటిని చల్లగా, నాణ్యంగా ఉండాలని ఫ్రిజ్‌లో దాచుకుంటాం. నిపుణులు అది మంచిది కాదంటున్నారు. దీనివల్ల టమాటల లోపల పొరలు దెబ్బతిని, రుచి, సహజత్వం కోల్పోతాయని చెబుతున్నారు. ఫ్రిజ్‌లో ఉంటే వాటిలో నీటి శాతం పెరిగి రుచి కూడా తగ్గుతుంది. నీటితో ఉండే పుచ్చకాయలు, కర్బూజాలు వంటి వాటిని దాచుకునేందుకు వేసవిలో చల్లగా, రుచిగా ఉండేందుకు ఫ్రిజ్‌లో పెట్టుకుంటాం. కానీ ఆ పండ్లను కోయక ముందే ఫ్రిజ్‌లో పెట్టుకోవడం ఉత్తమం. కోసిన ముక్కలను ఫ్రిజ్‌లో దాచుకోవాల్సిన పరిస్థితి ఉంటే నేరుగా కాకుండా, తప్పనిసరిగా నాణ్యమైన కవర్లలో చుట్టి దాచుకోవాలి. బంగాళా దుంపలను ఫ్రిజ్‌లో పెట్టకూడదని గట్టిగా చెబుతున్నారు. ఆహార ప్రమాణాల సంస్థ నిపుణుల అభిప్రాయం ప్రకారం బంగాళాదుంపలను ఫ్రిజ్‌లో దాచుకుని వాడితే వాటిలోని పిండి పదార్ధాలు ఉడికించినపుడు చక్కెరగా మారిపోతాయి. ఈ చక్కెరతో పాటు విడుదలయ్యే అమైనో ఆమ్లాలు, రసాయనాల వల్ల అత్యంత ప్రమాదకరం. సరైన జాగ్రత్తలతో... ఇప్పటి తరం ప్రజలు ఆధునికంగా ఉండాలని కోరుకుంటున్నారు. తీసుకునే ఆహారంలో తగిన జాగ్రత్తలు పాటించకపోతే ఆరోగ్యం దెబ్బతింటుందని గ్రహించాలి. రిఫ్రిజిరేటర్లలో ఏ పదార్థాలు దాచుకోవాలో తెలియక అనారోగ్యాలను కొనితెచ్చుకుంటున్నారు. తీరిక లేని బాధ్యతలతో అనేక మంది ఎక్కువ సమయం నిల్వ ఉండాలనే ఉద్దేశంతో ఆహార వస్తువులు ఫ్రిజ్‌లో దాచుకుంటున్నారు. దీని వల్ల వాటి తాజాదనం, రుచి, నాణ్యత పాడైపోతాయి. రిఫ్రిజిరేటర్లలో పెడితే చెడిపోయే పదార్ధాలను సాద్యమైనంత వరకు నిల్వ ఉంచుకోవద్దు. శీతల పదార్ధాలు అనర్ధదాయకం శీతలం అన్ని సందర్భాల్లో ఉపయోగపడదు. ప్రధానంగా మానవ జీవితంలో ఇటీవల పెరిగిన శీతల పదార్ధాల వినియోగంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. అతి శీతల పదార్ధాలు ఆరగిస్తే æ జీర్ణవ్యవస్థ కుంటుపడుతుంది. అది అన్ని రోగాలకు, అనర్థాలకు మూలంగా తయారవుతుంది. ప్రత్యేకించి రిఫ్రిజిరేటర్లో వస్తువులన్నీ నిల్వ చేయకూడదు. అలా చేయడం ద్వారా వాటి స్వాభావిక లక్షణాన్ని కోల్పోయి తినేటపుడు సహజ రుచిని అందించలేవు. చల్లదనం ఎపుడూ హానికరమే. ఇవాళ సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో మెటబాలిజం ఎక్కువగా ఉండటానికి ఇదే కారణం. తాజాగా ఉన్న ఆహారం తీసుకోవడమే ఉత్తమం. – బి.నరేంద్ర, వైద్యులు, విజయనగరం చద్దన్నం ఆరోగ్యకరమన్నది పాతతరం వారి మాట. చద్ది ఆహారం అనారోగ్యం అన్నది నేటి తరం మాట. మారుతున్న కాలానికి, తరానికి అనుగుణంగా ఆహార అలవాట్లు, రుచులు మారుతున్నాయి. చద్ది అనే భావన రాకుండా రోజుల తరబడి రిఫ్రిజిరేటర్లలో ఆహారాన్ని నిల్వ చేస్తున్నారు. నిల్వ చేసుకునే కొన్ని ఆహార పదార్ధాలు అనర్థమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. -
సామాన్యులకు జీఎస్టీ మరో తీపి కబురు
-
20 ఏళ్ల తర్వాత, టాటాలు రీ-ఎంట్రీ
న్యూఢిల్లీ : దేశంలో అతిపెద్ద కార్పొరేట్ గ్రూప్ ఏంటి అంటే? ఠక్కున టాటా గ్రూప్ అని చెప్పేస్తాం. ఈ గ్రూప్ సరిగ్గా 20 ఏళ్ల క్రితం అంటే 1998లో అప్పుడప్పుడే గృహవినియోగదారులు అలవాడు పడుతున్న వైట్ గూడ్స్‌ను అంటే రిఫ్రిజిరేటర్లు, మైక్రోవేవ్ ఓవెన్స్, డిష్ వాషర్స్ను విక్రయించడం ఆపేసింది. తాజాగా ఈ మార్కెట్ జోరందుకోవడంతో, మళ్లీ వైట్ గూడ్స్ మార్కెట్లోకి రీ-ఎంట్రీ ఇవ్వాలని చూస్తోంది. ఆగస్టు నుంచి రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మిషన్లు, మైక్రోవేవ్ ఓవెనస్, డిష్ వాషర్స్ను ఓల్టస్ బెకో బ్రాండ్ కింద విక్రయించాలని యోచిస్తుందని గ్రూప్‌కు చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్ చెప్పారు. దీని కోసం వెయ్యి కోట్ల పెట్టుబడులను కూడా టాటా గ్రూప్ సిద్ధం చేసిందట. ప్రస్తుతం దేశీయంగా వైట్స్ గూడ్స్‌కు రూ.35 వేల కోట్ల మార్కెట్ ఉంది. ఈ ఓల్టస్ బ్రాండ్ కిందనే 1998 వరకు టాటాలు వైట్ గూడ్స్‌ను విక్రయించేవి. ఆ అనంతరం విక్రయాలను ఆపివేసి, 2003 వరకు ఎల్జీ, శాంసంగ్‌ల కోసం రిఫ్రిజిరేటర్లను తయారు చేసే కాంట్రాక్ట్‌ను మాత్రమే ఓల్టస్ కలిగి ఉంది. ప్రస్తుతం వైట్స్ గూడ్స్ మార్కెట్లోకి రీ-ఎంట్రీ ఇవ్వాలని టాటాలు నిర్ణయించారు. ఆగస్టు నుంచి దశల వారీగా వైట్ గూడ్స్‌ను లాంచ్ చేయాలనుకుంటున్నట్టు ఓల్టస్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రదీప్ భక్షి చెప్పారు. అక్టోబర్‌లో ప్రారంభం కాబోయే పండుగ సీజన్ వరకు దేశవ్యాప్తంగా వీటిని ప్రవేశపెట్టనున్నట్టు అంచనా వేస్తున్నారు. దీని కోసం ఓల్టస్, టర్కీకి చెందిన ఆర్సెలిక్ ఏఎస్‌లు జాయింట్ వెంచర్‌గా ఏర్పడ్డాయి. ఉత్పత్తులను తొలుత థాయ్‌లాండ్, చైనా, టర్కీలలోని ఆర్సెలిక్ ప్లాంట్ల నుంచి దిగుమతి చేసుకుంటామని, ఆ అనంతరం వచ్చే ఏడాది నుంచి గుజరాత్లో ప్రారంభించబోయే ప్లాంట్‌లో ఈ ఉత్పత్తులను తయారుచేయడం ప్రారంభిస్తామని భక్షి చెప్పారు. 2019 ద్వితీయార్థం నుంచి 10 లక్షల రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మిషన్లు, 5 లక్షల మైక్రోవేవ్ ఓవెన్లను రూపొందిస్తామని తెలిపారు. దీని కోసం రూ.240 కోట్లను పెట్టుబడులుగా పెట్టినట్టు కూడా పేర్కొన్నారు. ప్రస్తుతం టాటా గ్రూప్ ఏసీ వ్యాపారాల్లో ఆధిపత్య స్థానంలో ఉంది. వైట్స్ గూడ్స్ రీ-లాంచింగ్‌తో ఈ మార్కెట్లోనూ ఆధిపత్యస్థానాన్ని కైవసం చేసుకోనుంది. బెకో-పార్టనర్స్ ఆఫ్ ఎవ్రీడే అనే ట్యాగ్‌లైన్‌లో ఓల్టస్ బెకో ఉత్పత్తులు మార్కెట్లోకి రానున్నాయని తెలుస్తోంది. ఓల్టస్ విక్రయాలను, పంపిణీని, సర్వీసులను చూసుకుంటే, ఆర్సెలిక్ టెక్నాలజీ, తయారీ సేవలను అందించనుంది. -
తగ్గనున్న ఏసీ, ఫ్రిజ్, వాషింగ్ మిషన్ల ధరలు
-
తగ్గనున్న ఏసీ, ఫ్రిజ్, వాషింగ్ మిషన్ల ధరలు
సాక్షి, న్యూఢిల్లీ : వినియోగదారుల వస్తువులు, నిత్యావసర వస్తువుల జీఎస్టీ రేట్లను తగ్గించిన అనంతరం కేంద్ర ప్రభుత్వం కన్జ్యూమర్ డ్యూరెబుల్స్‌పై కూడా పన్ను రేట్లు తగ్గించేందుకు యోచిస్తోంది. ఏసీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మిషన్లపై ప్రస్తుతమున్న 28 శాతం పన్ను రేట్లను తగ్గించాలని చూస్తున్నట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. పన్ను రేట్లు అధికంగా ఉన్నందున్న తమ విక్రయాలు తగ్గిపోయాయంటూ తయారీదారులు చేస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకోబోయే ఈ కీలక నిర్ణయం వీటికి డిమాండ్‌ను పెంచనుంది. మహిళలను లక్ష్యంగా చేసుకుని పన్ను రేట్లను తగ్గించబోతున్నట్టు ఓ సీనియర్ ప్రభుత్వాధికారి చెప్పారు. ఈ నిర్ణయం మహిళలకు ఎంతో ఉపయోగపడనుందన్నారు. మహిళలను దృష్టిలో పెట్టుకుని ఇటీవల రెస్టారెంట్లపై కూడా జీఎస్టీ రేట్లను తగ్గించినట్టు పేర్కొన్నారు. కేంద్రం తీసుకోబోయే మరో కీలక నిర్ణయంతో ఎలక్ట్రిక్ వస్తువులు, కన్జ్యూమర్ డ్యూరెబుల్స్ పన్ను రేట్లు 18 శాతానికి దిగిరానున్నట్టు తెలుస్తోంది. ఇక ఇవి లగ్జరీ గూడ్స్‌గా పరిగణలోకి రావని వెల్లడవుతోంది. ''అన్ని కన్జ్యూమర్ డ్యూరెబుల్స్‌ను ఒకే పన్ను 18 శాతం పరిధిలోకి తీసుకొస్తే, దేశీయ తయారీదారులకు ఎంతో మేలు చేకూర్చినట్టు అవుతుంది. ధరలు తగ్గుతాయి. దీంతో డిమాండ్ పైకి ఎగుస్తుంది'' అని డెలాయిట్ ఇండియా పార్టనర్ ఎంఎస్ మని తెలిపారు. గత వారంలోనే 28శాతం శ్లాబులో ఉన్న 178 వస్తువులపై జీఎస్టీని కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. షాంపూలు, వాషింగ్ పౌడర్ డిటర్జెంట్, ఫేషియల్ మేకప్, చాక్లెట్లు, వెట్ గ్రైండర్లు, బ్యాటరీలు, చేతివాచీలు తదితర వాటిపై జీఎస్టీని 18శాతానికి తగ్గించారు. ప్రస్తుతం 28శాతం శ్లాబులో కేవలం 50 వస్తువులే ఉన్నాయి. -
ఎక్స్చేంజ్ లో ఫోన్ కొనాలనుకుంటున్నారా?
ముంబై : ఎక్స్చేంజ్ ఆఫర్లతో వస్తువులు కొనుకొని ఇన్ని రోజులు పన్ను భారాన్ని తగ్గించుకుంటున్న వినియోగదారులకు షాకింగ్ న్యూస్. ఎక్స్చేంజ్ లో ఓ వస్తువు కొన్నా ఇక జీఎస్టీ మోత మోగనుంది. ఇన్ని రోజులు ఎక్స్చేంజ్ ఆఫర్లపై మార్కెట్ విలువ కంటే తక్కువకు లభిస్తున్న ధరకు మాత్రమే పన్ను కట్టేవారు. కానీ ఇకనుంచి అలా ఉండదట. జీఎస్టీ కింద సప్లయి విలువను లెక్కకట్టే డ్రాఫ్ట్ రూల్స్ ను ప్రభుత్వం ఏప్రిల్ 1న విడుదల చేసింది. సప్లయ్ అనేది సమగ్ర పదమని, దీనిలో కేవలం విక్రయం మాత్రమే ఆధారపడి ఉండదని, దీనిలోనే ఎక్స్చేంజ్, సరుకు బదలాయింపు కూడా కలిసి ఉంటుందని పేర్కొంది. దీని ప్రకారం.. కొత్త 24వేల రూపాయలున్న కొత్త ఫోన్ ను ఎక్స్చేంజ్ లో రూ.20వేలకు కొంటున్నామనుకోండి... అసలు ధర రూ.24 వేలపైనే ప్రస్తుతం జీఎస్టీని లెక్కకట్టనున్నారు. ఇన్నిరోజులు కేవలం 20వేల రూపాయల పైనే పన్ను చెల్లించేవారు. ఎక్కువగా ఎక్స్చేంజ్ ఆఫర్లను పాత మొబైల్ ఫోన్లు, రిఫ్రిజిరేటర్లు, టెలివిజన్ సెట్లు, కార్లపై ప్రకటిస్తుంటారు. ఆన్ లైన్, ఆఫ్ లైన్ రెండింట్లోనూ ఈ ఎక్స్చేంజ్ లపై వివిధ స్కీమ్ లు అందుబాటులో ఉంటుంటాయి. సప్లయి విలువ, మార్కెట్ విలువ ఆధారంగానే ఉండాలని జీఎస్టీ డ్రాఫ్ట్ రూల్స్ లో పొందుపరచడంతో, ఇక ఎక్స్చేంజ్ ఆఫర్లపై కొనే వస్తువులపైనా జీఎస్టీ మోత మోగించనుంది. ఏజెంట్ ద్వారా ఏయిర్ ట్రావెల్ టిక్కెట్లను బుక్ చేసుకునేటప్పుడు చెల్లించే సర్వీసులపైనా జీఎస్టీ డ్రాఫ్ట్ రూల్స్ ను పొందుపరిచారు. బేసిక్ ఫేర్ పై 5 శాతం చెల్లించాలని డ్రాఫ్ట్ రూల్స్ పేర్కొన్నాయి. అదే ఇంటర్నేషనల్ ట్రావెల్ కు అయితే 10 శాతం చెల్లించాలి. . -
నోట్ల రద్దు దెబ్బతో ఆ విక్రయాలన్నీ ఢమాల్
-
నోట్ల రద్దు దెబ్బతో ఆ విక్రయాలన్నీ ఢమాల్
న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు దెబ్బకు దాదాపు విక్రయాలన్నీ డౌన్ అయ్యాయి. ఈ నోట్ల రద్దుతో పాటు, నగదు విత్‌డ్రాలో పరిమితులు విధించడం వినియోగదారుల తయారీ వస్తువులకు భారీగా గండికొట్టనుందని తెలుస్తోంది. వచ్చే ఆరునెలల వరకు టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషిన్ల విక్రయాలు గడ్డుపరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. వైట్ గూడ్స్‌గా పేరున్న టెలివిజన్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషిన్ల అమ్మకాలు 70 శాతం క్షీణించనున్నాయని, మార్కెట్లో ఈ గూడ్స్ ఎక్కువగా నగదు అమ్మకాలే నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. '' వచ్చే ఆరు నెలల వరకు ఈ క్షీణతను కంపెనీలు భరించాల్సి ఉంటుంది. ప్రజానీకానికి అవసరమైన మేరకు కొత్త కరెన్సీలు చలామణిలోకి వచ్చే వరకు ఈ పరిస్థితి ఎదురవుతుంది'' అని పానాసోనిక్ ఇండియా ప్రెసిడెంట్ మనీష్ శర్మ తెలిపారు. మంగళవారం రాత్రి 500, 1000 నోట్ల రద్దుపై ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న సంచలన నిర్ణయంతో షాపింగ్ మాల్స్, రెస్టారెంట్, సినిమా హాల్స్ వెలవెలపోయాయని, దీంతో ఫుడ్ అవుట్ లెట్స్ బిజినెస్‌లు 40 శాతం పతనమయ్యాయని నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ రియాజ్ అమ్లానీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా బుధవారం విక్రయాలన్నీ పడిపోయినట్టు వీడియోకాన్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సీఎం సింగ్ తెలిపారు. నెలవారీ వాయిదాల ప్రకారం ప్రీమియం అప్లియన్స్, టెలివిజన్ కొనుగోళ్లు పట్టణ ప్రాంతాల్లో 60 శాతం వరకు జరుగుతాయని, మిగతా 40 శాతం కొనుగోళ్లు నగదు చెల్లింపులతోనే జరుగుతున్నాయని రియాజ్ తెలిపారు. దీంతో నగదు చెల్లింపులతో చేసే కొనుగోళ్లన్నీ భారీగా దెబ్బతిన్ననున్నాయని వివరించారు. రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా కొత్తగా 500, 2000 నోట్లను ప్రజల్లోకి తీసుకొస్తున్నా.. వాటిపై పరిమితులు విధించడం వ్యాపారాలకు ప్రతికూలతేనని చెప్పారు. అయితే మంగళవారం రాత్రి ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించిన సంచలన నిర్ణయం సెల్‌ఫోన్ విక్రయాలకు బాగా కలిసివచ్చిందట. ఈ రద్దును కొంతమంది వినియోగదారులు వారికి అవకాశంగా మరలుచుకుని, వెంటనే సెల్‌ఫోన్ రిటైల్ షాపులకు పరుగెత్తారు. దీంతో సెల్‌ఫోన్ రిటైలర్లు బిజెనెస్‌లు ఒక్కసారిగా పైకి ఎగిశాయి. ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్, శాంసంగ్ గెలాక్సీ ఎస్7, ఎస్7 ఎడ్జ్ వంటి స్మార్ట్ఫోన్లను వినియోగదారులు భారీగా డిమండ్ పెరిగినట్టు తెలుస్తోంది. కొంతమంది కస్టమర్లు ఒక్కొక్కరూ ఐదు నుంచి ఆరు హ్యాండ్సెట్లు కొనుగోలు కూడా చేశారని ఓ లీడింగ్ సెల్‌ఫోన్ రిటైలర్ సీఈవో తెలిపారు. -
‘సర్వే’జనా.. ‘దుఖమే’ భవిష్యత్తు
సంక్షేమ పథకాల కుదింపు సర్వే టీవీ, ఫ్రిడ్జ్ ఉంటే పేదలు కానట్లే సాధికార సర్వేలో ఇదే ‘లోగుట్టు’...! వివరాలు చెప్పడానికి జనం నిరాకరణ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలనుంచి తప్పించుకోవడానికే టీడీపీ సర్కారు సాధికార సర్వే చేయిస్తోందా..? సంక్షేమ పథకాలను కొందరికే పరిమితం చేయడానికి ప్రణాళిక వేసిందా..? ఇంట్లో టీవీ, రిఫ్రిజిరేటర్లు ఉండే కుంటుంబాలు ప్రభుత్వం దృష్టిలో సంపన్న కుటుంబాలా..? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానాలు వస్తున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెబుతున్న ప్రజాసాధికార సర్వే కొందరికే సాధికారికతను చేకూర్చేలా ఉందనే విమర్శలను తెచ్చిపెడుతోంది. చిత్తూరు (అర్బన్): కుటుంబ ఆదాయ వనరులు, ఆర్థిక పరిస్థితులు, పథకాల ద్వారా పొందుతున్న లబ్ధిదారులు..తదితర లెక్కలు సేకరించడానికే ప్రజాసాధికారత సర్వే (స్మార్ట్ పల్స్ సర్వే) నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 13 లక్షల కుటుంబాలను 2,745 బ్లాకులుగా విభవించారు. ఒక్కో బ్లాకుకు ఎన్యుమరేటరును నియమించారు. సర్వే తీరును పరిశీలించడానికి 317 మందిని అదనంగా నియమించారు. ఆరు వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఇందుకోసం పనిచేస్తున్నారు. ఈనెల 6 నుంచి ప్రారంభమయ్యింది. వారం రోజుల్లో అధికారులు పూర్తిచేసిన బ్లాకులు రెండంకెలు కూడా దాటలేదు. సీఎం డాష్ బోర్డులో చిత్తూరు జిల్లా నుంచి యాభై బ్లాకులు కూడా పూర్తి చేయలేదనే సమాచారం కనిపిస్తోందని సర్వే చేస్తున్న అధికారులపై, పర్యవేక్షకులు రోజూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాంకేతిక లోపాలున్నప్పటికీ చాలా చోట్ల ప్రజలు వ్యక్తిగత వివరాలు చెప్పడానికి నిరాకరించడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఆ వివరాలు ఎందుకో.. సర్వేలో ప్రతి కుటుంబంలోని వ్యక్తిని ఫొటో తీయాలి. ఇంటిని ఫోటో తీసి జియో ట్యాగింగ్ చేయాలి. టీవీ, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషీన్, ఏసీ, హీటర్, సెల్‌ఫోన్, సైకిల్, స్కూటర్ వివరాలు తప్పనిసరిగా తెలియచేయాల్సి ఉంటుంది. కులాల వివరాలు సైతం చెప్పాలి. దారిద్య్రరేఖకు దిగువగా (బీపీఎల్), దారిద్య్ర రేఖకు ఎగువగా (ఏపీఎల్) ఉన్న కుటుంబాలుగా ప్రజల్ని విభజించడమే సర్వే ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. టీవీ, రిఫ్రిజిరేటర్ ఆధారంగా ప్రజల్ని బీపీఎల్, ఏపీఎల్‌గా విడగొట్టడం ద్వారా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కొందరికే చేకూర్చాలన్నదని ప్రభుత్వ ఉద్దేశంగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సర్వేలో కులాల ప్రస్తావన ఉండటం వెనుక కాపులను బీసీల్లో చేరస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు ముద్రగడ దీక్ష నేపథ్యంలో ఏర్పాటు చేసిన మంజునాథ కమిషన్‌కు సాధికార సర్వేలో కులాల వారీగా తీసిన వివరాలను ఇవ్వనున్నట్లు స్పష్టమవుతోంది. ఎలాంటి ప్రామాణికం లేకుండా చేస్తున్న సర్వేలో కాపుల సంఖ్యను తక్కువగా చూపిస్తూ బీసీల్లో చేర్చడానికి వీల్లేదనే విధంగా కొత్త అంశాన్ని తెరపైకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
అవసరాన్ని బట్టి కూలింగ్...
♦ శాంసంగ్ నూతన రిఫ్రిజిరేటర్లు ♦ ధరల శ్రేణి రూ.15-82 వేలు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రానిక్స్ తయారీ దిగ్గజం శాంసంగ్ నూతన శ్రేణి ఉత్పత్తులను హైదరాబాద్ మార్కెట్లో బుధవారం విడుదల చేసింది. వీటిలో రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, మైక్రోవేవ్ ఓవెన్లు ఉన్నాయి. రిఫ్రిజిరేటర్ల విభాగంలో స్మార్ట్ కన్వర్టిబుల్ 5 ఇన్ 1 శ్రేణిలో 393-670 లీటర్ల మోడళ్లను ప్రవేశపెట్టింది. వీటి ధర రూ.45,000-82,500 మధ్య ఉంది. ట్విన్ కూలింగ్ ప్లస్ టెక్నాలజీతో రూపొందిన ఈ రిఫ్రిజిరేటర ్ల కూలింగ్ స్థాయిని కస్టమర్లు అవసరాన్ని బట్టి నిర్ణయించుకోవచ్చు. ఫ్రిజ్, ఫ్రీజర్‌కు వేర్వేరు ఎయిర్ఫ్లోస్ ఉన్నాయి. దీంతో చేపల వంటి ఉత్పత్తుల వాసన మరొక ఉత్పాదనకు సోకదు.ఆహారోత్పత్తులు 7 రోజుల దాకా తాజాగా ఉంటాయని కంపెనీ చెబుతోంది. వీటితోపాటు స్మార్ట్ డిజిటల్ ఇన్వర్టర్ కంప్రెసర్ విభాగంలో 192-230 లీటర్ల సామర్థ్యంతో రిఫ్రిజిరేటర్లను ప్రవేశపెట్టారు. ప్రారంభ ధర రూ.15,100. రిఫ్రిజిరేటర్ల విపణిలో తమకు 40.5% వాటా ఉందని శాంసంగ్ కంజ్యూమర్ ఎలక్ట్రానిక్స్ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ భుటాని ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. ప్రపంచంలో తొలిసారిగా 8 పోల్ మోటార్‌తో డిజిటల్ ఇన్వర్టర్ కంప్రెసర్‌తో కూడిన ఏసీలను కంపెనీ రూపొందించింది. సంప్రదాయ ఏసీలతో పోలిస్తే 43% వేగంగా చల్లబరుస్తుంది. బయటి వాతావరణం 58 డిగ్రీలున్నా గదిని కూల్ చేస్తుందని కంపెనీ వెల్లడించింది. ఏసీల్లో అంతర్గతంగా స్టెబిలైజర్‌ను పొందుపరిచారు. రూమ్ ఏసీ విభాగంలో 49 రకాలను రూ.30,800-67,000 ధరలో ప్రవేశపెట్టారు. -
మార్కెట్లో ఏసీలు, ఫ్రిజ్‌లకు కొరత!
రోజురోజుకి పెరుగుతున్న భానుడి ఉగ్రరూపం, చాలా ప్రాంతాల్లో డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఈ వేడిమి నుంచి ఉపశమనం పొందడానికి ప్రజలు ఏసీలు, ఫ్రిజ్‌లతో పాటు.. కూల్డ్రింకులు, ఐస్ క్రీమ్‌లను ఆశ్రయిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా వీటి అమ్మకాలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. దీపావళి వరకూ తక్కువ స్థాయిలో నమోదైన ఈ అమ్మకాలు, ప్రస్తుతం ఊపందుకున్నాయి. ఏసీల అమ్మకాలు గత ఏడాది కంటే 50 శాతం పెరిగాయి. ఫ్రిజ్‌ల అమ్మకాలు కూడా 18శాతం మేర ఎక్కువ నమోదవుతున్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. కూల్‌డ్రింక్స్ 15 నుంచి 20 శాతం, ఐస్ క్రీమ్ లు 30 నుంచి 40 శాతం మేర పుంజుకున్నాయని పేర్కొన్నాయి. కానీ పెరిగిన డిమాండ్ మేర ఏసీలు, ఫ్రిజ్‌లు మార్కెట్లో కనిపించడం లేదు. వీటికి కొరత ఏర్పడింది. కావాలనుకునేవారు ముందుగా బుక్ చేసుకుంటే తప్ప వెంటనే దొరికే పరిస్థితి లేదు. చివరి ఏడాది ఏప్రిల్ లో అమ్మిన ఏసీల కంటే ఈ ఏడాది ఏప్రిల్ లో రెండింతలు అమ్మినట్లు వోల్టాస్ కంపెనీ తెలిపింది. ఎలక్ట్రానిక్ ఉత్పత్తులో ముందంజలో ఉన్న ఎల్జీ కంపెనీ, ఈ ఏడాది ఏసీల అమ్మకాలో 50 శాతం వృద్ధి కనబరిచింది. పటియాలా, ఆనంద్, విజయవాడలలో వీటికి డిమాండ్ అధికంగా ఉందని పేర్కొంది. ఎప్పుడూ ఆహ్లాదకరమైన వాతావరణం ఉండే బెంగళూరులో కూడా ఈసారి ఏసీల అమ్మకాలు పెరిగినట్లు ఎల్జీ తెలిపింది. ఏసీలు, ఫ్రిజ్‌ల డిమాండ్ పెరుగుతుండటంతో వాటి కంపెనీల షేర్లు కూడా మార్కెట్లో పాజిటివ్ ట్రెండ్ నే కొనసాగిస్తున్నాయి. -
గృహోపకరణాల సేల్స్ బాగుంటాయ్!
జూన్ తర్వాతి నుంచి అమ్మకాలకు జోష్ ఈ ఏడాది 15 శాతం వృద్ధి ఆశిస్తున్న కంపెనీలు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రానిక్, గృహోపకరణాల తయారీ కంపెనీలు బిజీ బిజీగా ఉన్నాయి. ఈ ఏడాది నుంచి మార్కెట్ పుంజుకుంటుందన్న విశ్వాసంతో డిమాండ్‌ను అందుకోవడానికి తగిన ఏర్పాట్లలో మునిగిపోయాయి. కొత్త కొత్త మోడళ్లతో కస్టమర్లకు దగ్గరవ్వాలని కృతనిశ్చయంతో ఉన్నాయి. స్థిర ప్రభుత్వం రాకతో మార్కెట్ సెంటిమెంటు బలపడిందని గృహోపకరణాల కంపెనీలు అంటున్నాయి. మరోవైపు ఎండవేడిమి కూడా ఏసీ, రిఫ్రిజిరేటర్ల అమ్మకాలు పెంచేందుకు దోహదం చేస్తోందని చెబుతున్నాయి. మొత్తంగా 2014 నుంచి పరిశ్రమ వృద్ధి ఉంటుందని ఆనందంగా ఉన్నాయి. దేశంలో ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాల విపణి పరిమాణం రూ.40,000 కోట్లుంది. 15 శాతం వృద్ధి..: కొన్నేళ్లుగా భారత గృహోపకరణాల మార్కెట్ స్తబ్దుగా ఉంది. దేశీయంగా సెంటిమెంటు బలహీనంగా ఉండడం, రూపాయి విలువ క్షీణించడంతో ఎలక్ట్రానిక్ విడిభాగాలు ఇక్కడి కంపెనీలకు భారమయ్యాయి. దీంతో కంపెనీలు ఉపకరణాల ధర పెంచకతప్పలేదు. ఈ ప్రభావం కాస్తా అమ్మకాలపై పడింది. అయితే స్థిర ప్రభుత్వం రాకతో మార్కెట్ వాతావరణం మారిందని ఒనిడా బ్రాండ్‌తో ఉపకరణాలను విక్రయిస్తున్న మిర్క్ ఎలక్ట్రానిక్స్ సీఎండీ జీఎల్ మిర్చందానీ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. జూన్ తర్వాతి నుంచి అమ్మకాలు పుంజుకుంటాయని ఆయన చెప్పారు. 2014లో గృహోపకరణాల విపణి 15 శాతం వృద్ధి నమోదు చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 2014-15లో 10-15 శాతం వృద్ధితో తమ కంపెనీ రూ.1,500-1,700 కోట్ల వ్యాపారం ఆశిస్తోందని పేర్కొన్నారు. అన్ని విభాగాల్లోనూ..: టీవీలు, రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, వాషింగ్ మెషీన్లు ఇలా అన్ని విభాగాల్లోనూ ఈ ఏడాది మంచి అమ్మకాలు ఉంటాయని పరిశ్రమ చెబుతోంది. గతేడాది దేశవ్యాప్తంగా 31 లక్షల ఏసీలు అమ్ముడయ్యాయి. 2014లో ఈ సంఖ్య 34 లక్షలకు చేరుకుంటుందని బ్లూ స్టార్ రూమ్ ఏసీ విభాగం ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సి.పి.ముకుందన్ మీనన్ తెలిపారు. ఈ ఏడాది 2.8 లక్షల ఏసీలను విక్రయించాలని లక్ష్యంగా చేసుకున్నామని, గతేడాదితో పోలిస్తే ఇప్పటికే కంపెనీ 10-12 శాతం వృద్ధిని నమోదు చేసిందని వివరించారు. ఏసీల అమ్మకాల్లో 5 శాతం వృద్ధి చెందామని ప్యానాసోనిక్ ఇండియా ఎండీ మనీష్ శర్మ తెలిపారు. రిఫ్రిజిరేటర్ల విభాగంలో గతేడాది మాదిరిగా నిలకడైన వృద్ధి ఉంటుందని చెప్పారు. నూతన ఉత్పత్తులు కూడా..: హాయర్ ఒక అడుగు ముందుకేసి 60కిపైగా ఉత్పత్తులను ఈ ఏడాది ప్రవేశపెట్టింది. మరిన్ని ఉత్పత్తులు కస్టమర్ల ముందుకు రానున్నాయని హాయర్ ఇండియా ప్రెసిడెంట్ ఎరిక్ బ్రగాంజా వెల్లడించారు. ప్రస్తుత సంవత్సరంలో తమ కంపెనీ 35 శాతం వృద్ధి ఆశిస్తోందని చెప్పారు. ఫిఫా వరల్డ్ కప్ నేపథ్యంలో టీవీల అమ్మకాలు రెండింతలు అవుతాయని అంచనా వేస్తున్నట్టు సోనీ వెల్లడించింది. మార్కెట్ సానుకూల పవనాలతో ఆశించిన వృద్ధి సాధిస్తామని సోనీ సేల్స్ హెడ్ సునిల్ నయ్యర్ తెలిపారు. బ్రేవియా టీవీల విభాగంలో రెండు మోడళ్లను ఇటీవలే ప్రవేశపెట్టామని చెప్పారు. జూన్ తర్వాతి నుంచి కంపెనీలకు మంచి రోజులని కంజ్యూమర్ ఎలక్ట్రానిక్స్, అప్లయాన్సెస్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (సియామా) తెలిపింది. కేంద్ర ప్రభుత్వ చర్యలతో ఈ ఏడాది మార్కెట్ మలుపుతిప్పుతుందని సియామా ప్రెసిడెంట్ అనిరుధ్ ధూత్ అన్నారు.