
ఫైల్ ఫోటో
సియోల్: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ కొత్త రిఫ్రిజిరేటర్లను లాంచ్ చేసింది. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఎనిమిది రకాల ఫ్రిజ్‌లను కొరియా మార్కెట్లోకి తీసుకొచ్చింది. తన స్టాండర్డ్ మోడల్ ఫ్రిజ్‌లకు భిన్నంగా,కొరియన్ కిచెన్లకు అనుగుణంగా వీటిని రూపొందించింది. విభిన్న రంగులు, డిజైన‍్లతో సరికొత్తగా ఆవిష్కరించింది. వీటిల్లో ఫోర్ డోర్ ఫ్రిజ్‌లు, డబుల్ డోర్ ఫ్రిజ్‌లున్నాయి. 1.8 మీటర్లు ఎత్తు, 70 సెం.మీ. లోతు వుండేలా వీటిని డిజైన్ చేసింది. వినియోగదారుల విభిన్న పోకడలను ప్రతిబింబించేలా శాంసంగ్ కస్టమైజ్డ్ రిఫ్రిజరేటర్లను లాంచ్ చేశామని కిమ్ హున్-సక్ పత్రికా సమావేశంలో ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment