
సాక్షి, ఢిల్లీ: ఎలక్ట్రానిక్స్ తయారీ దిగ్గజం శాంసంగ్ తాజాగా కొత్త రిఫ్రిజిరేటర్ల శ్రేణిని ప్రవేశపెట్టింది. పెరుగు తోడుపెట్టే బాదరబందీ లేకుండా చేసే 'కర్డ్ మేస్ట్రో' ఫ్రిజ్ కూడా వీటిలో ఉంది. పాలు..పెరుగుగా మారడంలో కీలకమైన ఫెర్మెంటేషన్ ప్రక్రియను ఆటోమేటిక్‌గా నిర్వహించే టెక్నాలజీని శాంసంగ్ ఈ ఫ్రిజ్‌లో పొందుపర్చింది. ఇందుకోసం ఫ్రిజ్‌లో ప్రత్యేక అర ఉంటుంది. అయిదు నుంచి ఆరు గంటల్లో పెరుగు సిద్ధమవుతుందని సంస్థ వెల్లడించింది. ప్రపంచంలోనే ఈ తరహా మొట్టమొదటి ఫ్రిజ్ ఇదేనని పేర్కొంది. 244 లీ. నుంచి 336 లీ. దాకా సామర్ధ్యముండే కర్డ్ మేస్ట్రో రిఫ్రిజిరేటర్ల ధరల శ్రేణి రూ. 30,990 నుంచి రూ. 45,990 దాకా ఉంటుంది. మరోవైపు, 2020 ఏడాదికి సంబంధించి ప్రవేశపెట్టిన ఇతర ఫ్రిజ్‌ల ధరల శ్రేణి రూ. 17,990 నుంచి రూ. 45,990 దాకా ఉందని శాంసంగ్ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment