రూ.29 వేల శామ్‌సంగ్ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ రూ.10 వేలకే! | Buy SAMSUNG 253L Frost Free Fridge Under 10000 in Flipkart | Sakshi
Sakshi News home page

రూ.29 వేల శామ్‌సంగ్ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ రూ.10 వేలకే!

Published Sun, Feb 20 2022 8:42 PM | Last Updated on Sun, Feb 20 2022 8:42 PM

Buy SAMSUNG 253L Frost Free Fridge Under 10000 in Flipkart - Sakshi

ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఎప్పటికప్పుడు సరికొత్త ఆఫర్లతో వినియోగదారులకు సర్ ప్రైజ్ ఇస్తూనే ఉంటుంది. తాజాగా ఫ్లిప్‌కార్ట్ కూలింగ్ డేస్ పేరుతో ఈ నెల 18 నుంచి సరికొత్త సేల్‌తో మీ ముందుకు వచ్చింది. ఈ సేల్‌లో భాగంగా ఫ్రిజ్, కూలర్, ఎయిర్ ఎసి వంటి వాటి మీద మంచి డిస్కౌంట్ అందిస్తుంది. ఈ సేల్‌లో ఇతర కంపెనీలతో పాటు శామ్‌సంగ్ ఉత్పత్తులపై కూడా బంపర్ డిస్కౌంట్ అందిస్తుంది. మీరు కొత్త ఫ్రిజ్ కొనాలనే ఆలోచనలో ఉంటే ఇది మీకు ఒక మంచి అవకాశం ఉంది. 

ఈ సేల్‌లో మీరు శామ్‌సంగ్ 253 లీటర్ల డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ మీద ఆకర్షణీయమైన ఆఫర్ పొందుతున్నారు. ఈ ఆఫర్'ను సద్వినియోగం చేసుకుంటే రూ.29,000ల డబుల్ డోర్ ఫ్రిజ్ రూ.10,000 కంటే తక్కువకు లభిస్తుంది. ఈ ఆఫర్ గురించి మాకు తెలియజేయండి. ఈ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ మార్కెట్ ధర రూ. 28,990. అయితే ఈ ఫ్రిజ్'పై 15% తగ్గింపు ఆఫర్ అందుబాటులో ఉంది. అంటే ఎవరైనా ఈ సేల్‌లో రూ.24,790కే ఈ ఫ్రిజ్ కొనుగోలు చేయొచ్చు. మీరు ఈ రిఫ్రిజిరేటర్‌ను కొనుగోలు చేసేటప్పుడు, ఏదైనా బ్యాంక్ కార్డ్‌ని ఉపయోగిస్తే ప్రీపెయిడ్ ఆఫర్ కింద రూ.500 తగ్గింపును పొందొచ్చు. 

ఇంకా మీరు గనుక యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ వినియోగిస్తే 2 వేల తగ్గింపు పొందొచ్చు. అయితే దీంతో పాటు భారీ ఎక్సేంజ్ ఆఫర్ సైతం ఈ ఫ్రిజ్ కొనుగోలుపై అందుబాటులో ఉంది. మీ దగ్గర ఉన్న పాత రిఫ్రిజిరేటర్‌ను ఎక్సేంజ్ చేస్తే రూ.12 వేల ఎక్సేంజ్ ఆఫర్ పొందవచ్చు. అంటే మీ పాత ఫ్రిజ్ కండిషన్ ఆధారంగా మీకు లభించే ఎక్సేంజ్ ఆధారపడి ఉంటుంది. ఈ ఆఫర్స్ అన్నీ మీకు లభిస్తే.. శామ్‌సంగ్ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ కేవలం రూ.10,790కే లభిస్తుంది.

(చదవండి: కరోనా తర్వాత ప్రపంచానికి మరో ముప్పు తప్పదు: బిల్‌గేట్స్‌!)


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement