హాట్‌ డీల్‌: రూ.12 వేలకే లేటెస్ట్‌ శాంసంగ్‌ స్మార్ట్‌ఫోన్‌!  | hot deal samsung galaxy f13 low price flipkart | Sakshi
Sakshi News home page

హాట్‌ డీల్‌: రూ.12 వేలకే లేటెస్ట్‌ శాంసంగ్‌ స్మార్ట్‌ఫోన్‌! 

Jul 3 2023 4:55 PM | Updated on Jul 3 2023 4:57 PM

hot deal samsung galaxy f13 low price flipkart - Sakshi

తక్కువ ధరకు కొత్త బ్రాండెడ్‌ స్మార్ట్‌ ఫోన్‌ కొనాలనుకుంటున్నారా.. అయితే మీ కోసం ఓ అద్భుతమైన డీల్‌ ఉంది. ప్రముఖ శాంసంగ్‌ గెలాక్సీ ఎఫ్‌13 (Samsung Galaxy F13) స్మార్ట్‌ ఫోన్‌ అత్యధిక డిస్కౌంట్‌ లభిస్తోంది. 

ఆఫర్లు ఇవీ...
ప్రముఖ ఈ-కామర్స్‌ సైట్‌ ఫ్లిప్‌కార్ట్‌ శాంసంగ్‌ గెలాక్సీ ఎఫ్‌13 స్మార్ట్‌ ఫోన్‌పై 29 శాతం భారీ తగ్గింపు అందిస్తోంది. ఏడాది క్రితం లాంచ్‌ అయిన ఈ స్మార్ట్‌ ఫోన్‌ వాస్తవ ధర రూ.16,999 కాగా ఫ్లిప్‌కార్ట్‌లో రూ.11,999కే సొంతం చేసుకోవచ్చు. ఇక ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌, బ్యాంకు డిస్కౌంట్‌లను ఉపయోగించుకుంటే మరింపు తగ్గింపు లభిస్తుంది. పాత ఫోన్‌లను ఎక్స్ఛేంజ్‌ చేయడం ద్వారా ఏకంగా రూ.11,450 వరకు డిస్కౌంట్‌ ఉంటుందని ఫ్లిప్‌కార్ట్‌ పేర్కొంది. యాక్సిస్‌ బ్యాంక్‌ కార్డును ఉపయోగించి కొనుగోలు చేస్తే 10 శాతం క్యాష్‌ బ్యాక్‌, అదే ఫ్లిప్‌కార్ట్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ కార్డును వినియోగిస్తే 5 శాతం తగ్గింపు అదనంగా లభిస్తాయి.

 

శాంసంగ్‌ గెలాక్సీ ఎఫ్‌13 ఫీచర్స్‌

  • 6.6 అంగులాల డిస్‌ప్లే.
  • ఆక్టాకోర్‌ శాంసంగ్‌ ఎక్సినోస్‌ 850 ప్రాసెసర్‌
  • 4 జీబీ ర్యామ్‌
  • ట్రిపుల్‌ రియర్‌ కెమెరా, 50 ఎంపీ మెయిన్‌ సెన్సర్‌, 5 ఎంపీ అల్ట్రావైడ్‌ సెన్సర్‌, 2 ఎంపీ డెప్త్‌ సెన్సర్‌
  • 6000 ఎంఏహెచ్‌ బ్యాటరీ 

ఇదీ చదవండి: కొత్త కొత్తగా..  మోటో జీ32 స్మార్ట్‌ఫోన్‌ కొత్త వేరియంట్లు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement