low price
-
నేటి నుంచి మార్కెట్లోకి ‘భారత్ రైస్’
కేంద్ర ప్రభుత్వం బియ్యం ధరల తగ్గింపునకు శ్రీకారం చుట్టి, సామాన్య ప్రజలకు ఊరట కలిగించింది. మంగళవారం (ఫిబ్రవరి 6) సాయంత్రం 4 గంటలకు భారత్ రైస్‌ను ప్రభుత్వం మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఈ బియ్యాన్ని కిలో రూ.29కి విక్రయించనున్నారు. బియ్యం ధరల తగ్గింపునకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నప్పటికీ, దేశీయ మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరలలో గణనీయమైన తగ్గింపు లేదు. నిత్యావసరాల ధరలు ప్రస్తుతం 14.5 శాతం మేరకు పెరిగాయి. భారత్ రైస్ నేటి నుంచి ఎన్ఏఎఫ్ఈడీ, ఎన్సీసీఎఫ్, కేంద్రీయ భండార్‌తో సహా అన్ని చైన్ రిటైల్‌లలో అందుబాటులో ఉంటుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కిలో రూ.29కి లభ్యమయ్యే భారత్ రైస్ 5 కిలోలు, 10 కిలోల బస్తాలలో లభించనుంది. దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ప్రభుత్వం తొలుత భారత్ బ్రాండ్ కింద తక్కువ ధరకు గోధుమ పిండి, పప్పులు, ఉల్లిపాయలు, టమోటాల విక్రయాలను ప్రారంభించింది. ‘భారత్ ఆటా’ను 2023, నవంబరు 6న ప్రభుత్వం మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఇది బయటి మార్కెట్లో కిలో రూ. 35 ఉండగా, ప్రభుత్వం రూ.27.50కే అందిస్తోంది. అదే సమయంలో పప్పులు కిలో రూ.60కి అందుబాటులోకి వచ్చాయి. -
గుడ్ న్యూస్: రూ. 1515కే విమాన టికెట్, ఫ్రీ ఫ్లైట్ వోచర్ కూడా!
SpiceJet I-Day Sale: బడ్జెట్ ధరల విమానయాన సంస్థ స్పైస్జెట్ఇండిపెండెన్స్ డే సందర్భంగా గుడ్ న్యూస్ చెప్పింది. "ప్రత్యేక ఇన్క్రెడిబుల్ ఇండిపెండెన్స్ డే సేల్" పేరుతో స్పెషల్ సేల్ ప్రకటించింది. దీని ప్రకారం ఆగస్ట్ 14నుంచి ఎంపిక చేసిన దేశీయ డైరెక్ట్ వన్-వే ఫ్లైట్లలో ఈ సేల్ రూ.1,515 నుండి ప్రారంభమవుతుంది. అలాగే రూ. 2,000 వరకు ఉచిత విమాన వోచర్లను పొందవచ్చు. అంతేకాదు రూ. 15కే నచ్చిన సీటు ఎంపిక్ చేసుకోవచ్చు. కంపెనీ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ కింద ఈ టికెట్లు అందుబాటులో ఉంటాయని కంపెనీ వెల్లడించింది. ఆగస్ట్ 14- ఆగస్ట్ 20 వరకు అందుబాటులో ఉండే ఇండిపెండెన్స్ డే సేల్ ఆఫర్లో భాగంగా కేవలం రూ. 1515కే (వన్ వే టికెట్) విమాన టికెట్నుకొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు ఫ్రీ ఫ్లైట్ వోచర్, రూ. 15కే సీటు సెలెక్షన్ వంటి సర్వీసులు అందిస్తోంది. ఇలా బుక్ చేసుకున్న టికెట్ల ద్వారా ఆగస్ట్ 15 నుంచి 2024 మార్చి 30 వరకు ప్రయాణించవచ్చు. (ఎల్ఐసీ కొత్త ఎండీగా ఆర్ దొరైస్వామి) లాభాలు జంప్ మరోవైపు బలమైన విమాన ప్రయాణ డిమాండ్ కారణంగా స్పైస్‌జెట్ జూన్‌తో ముగిసినతొలి త్రైమాసికంలో రూ. 205 కోట్ల నికర లాభాన్ని నివేదించింది. గత ఏడాది ఇదే క్వార్టర్లో రూ. 789 కోట్ల నష్టాలను నమోదు చేసింది. దేశీయంగా ఉన్న డిమాండ్ కారణంగా 90 శాతం నమోదు చేసింది. మొత్తం నిర్వహణ ఆదాయం క్షీణించింది. అంతకుముందు సంవత్సరంఇదే త్రైమాసికంలో రూ. 2,457 కోట్లతోపోలిస్తే ఆదాయం రూ. 2,002 కోట్లుగా ఉంది. ఎబిట్టా మార్జిన్ 525 కోట్లుగా ఉన్నాయి. (టమాట భగ్గు: 15 నెలల గరిష్ఠానికి రీటైల్ ద్రవ్యోల్బణం) -
AP: తక్కువ రేట్లకే బియ్యం, కందిపప్పు విక్రయాలు
సాక్షి, అమరావతి : నిత్యావసరాల ధరలను సామాన్యులకు అందుబాటులో ఉంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడుతోంది. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్)లో భాగంగా మిల్లర్లు, టోకు వ్యాపారులను ఇందులో భాగస్వాములను చేస్తోంది. మార్కెట్ ధరల కంటే 15–20 శాతం తక్కువ రేట్లకే బియ్యం, కందిపప్పును విక్రయించేలా ప్రోత్సహిస్తోంది. ఏపీలోని 26 జిల్లాల్లో శనివారం నుంచి తక్కువ ధరకు బీపీటీ, సూపర్ ఫైన్, ఫైన్ వెరైటీ బియ్యం విక్రయాలను ప్రారంభిస్తోంది. ఆయా జిల్లాల్లోని మార్కెట్ ధరల ప్రకారం జాయింట్ కలెక్టర్లు ఈ సబ్సిడీ రేట్లను నిర్ణయిస్తారు. ప్రత్యేక కౌంటర్లలో.. దేశవ్యాప్తంగా గడిచిన రెండు నెలలుగా నిత్యావసరాల ధరలు వేగంగా పెరిగాయి. ఒక్కసారిగా బియ్యం, కందిపప్పు ధరలు అమాంతం పెరిగాయి. ఈ క్రమంలో ప్రజలపై అధిక రేట్ల భారాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. గత మూడ్రోజులుగా పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, పౌరసరఫరాల శాఖ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా మిల్లర్లు, టోకు వ్యాపారులతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. సామాజిక బాధ్యతలో భాగంగా బియ్యం, కందిపప్పును మార్కెట్ ధర కంటే తక్కువకు విక్రయించాలని కోరగా.. అందుకు వ్యాపారులు ముందుకొచ్చారు. రాష్ట్రంలోని ప్రధాన నగరాలతో పాటు రైతుబజార్లు, కళ్యాణమండపాలు, రద్దీగా ఉండే మార్కెట్లు, వ్యాపారుల దుకాణాల ప్రాంగణంలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా సబ్సిడీ రేట్లకు బియ్యం, కందిపప్పును విక్రయించనున్నారు. ఒక వ్యక్తికి గరిష్టంగా ఒక కేజీ కందిపప్పు, 10 కేజీల ఫైన్ వెరైటీ బియ్యాన్ని అందిస్తారు. వ్యాపారులను సమన్వయం చేస్తూ.. కొన్ని జిల్లాల్లో ఫైన్ వెరైటీ బియ్యం రకాల్లేవు. అయితే, వాటిని ఇతర జిల్లాల నుంచి వ్యాపారులతో కొనుగోలు చేయించి ప్రజలకు విక్రయించేలా రాష్ట్ర ప్రభుత్వం సమన్వయం చేస్తుంది. బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో పప్పుమిల్లులు ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వ చర్యలతో ఆయా ప్రాంతాల్లోని వ్యాపారులు సైతం తక్కువ రేటుకు కందిపప్పును విక్రయించేందుకు అంగీకరించారు. దీంతో అక్కడి నుంచి కందిపప్పు నిల్వలను మార్కెట్లోకి తరలిస్తారు. ఇక వచ్చే సోమవారం నుంచి కందిపప్పును పూర్తిస్థాయిలో తక్కువ రేటుకు అందిస్తారు. కార్పొరేషన్.. కొత్త బ్రాండ్.. ఏపీ పౌరసరఫరాల సంస్థ సైతం సొంత బ్రాండింగ్‌తో బియ్యం రకాలను విక్రయించేందుకు ఏర్పాట్లుచేస్తోంది. ఇప్పటికే కర్నూలు నుంచి 50 టన్నుల బీపీటీ రకం ధాన్యాన్ని కొనుగోలు చేసింది. వాటిని మిల్లింగ్ చేయగా 32 టన్నుల బియ్యం వస్తున్నట్లు గుర్తించారు. వీటిని పైలెట్ ప్రాజెక్టు కింది ప్రత్యేక ప్యాకింగ్‌లో మార్కెట్ రేటు కంటే తక్కువకు విక్రయించేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. వచ్చే సీజన్ నుంచి పౌరసరఫరాల సంస్థ స్థానిక రైతుల నుంచి కందులను కూడా మద్దతు ధరకు కొనుగోలు చేయనుంది. అవసరమైతే మద్దతు ధరకు మించి మార్కెట్ రేటు ఉన్నా కొనుగోలు చేసి ప్రజా ప్రజలకు చేర్చనుంది. నవంబర్, డిసెంబర్లలో కందుల సేకరణకు ప్రత్యేకంగా కార్పస్ పెట్టడంతో పాటు కొనుగోలు చేసిన వెంటనే రైతులకు నగదు చెల్లించేలా ప్రతిపాదనలు రూపొందిస్తోంది. నిల్వలపై పటిష్ట నిఘా వ్యాపారులు కృత్రిమ కొరతను సృష్టించి నిత్యావసరాల రేట్లను పెంచకుండా పౌరసరఫరాల శాఖ పటిష్ట నిఘా ఏర్పాటుచేసింది. వివిధ వర్గాల వ్యాపారుల వద్ద సరుకు నిల్వలను ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వ http://fcainfoweb. nic.in/pspలో వెబ్సైట్లో నమోదు చేయాలని హెచ్చరిస్తోంది. నిల్వలు అధికంగా ఉన్నట్లు తేలితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తోంది. గుంటూరు కోల్డ్ స్టోరేజీల్లోని కందుల నిల్వలను సైతం తనిఖీచేసి వాటిని కూడా బయట మార్కెట్లోకి తరలించనుంది. 111 ప్రత్యేక కౌంటర్లు.. రాష్ట్రవ్యాప్తంగా సీఎస్ఆర్ ద్వారా చౌకగా బియ్యం, కందిపప్పు విక్రయాలకు వీలుగా 111 ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటుచేశారు. ఇందులో 42 రైతుబజార్లలో, 56 ఓపెన్ మార్కెట్లలో ఉన్నాయి. వీటిల్లో సూపర్ ఫైన్ వెరైటీలతో పాటు బీపీటీ, సోనా మసూరి, సాంబామసూరి, ఆర్జీఎల్, స్టీమ్డ్ బియ్యం రకాలను అందుబాటులో ఉంచనున్నారు. కేవలం ప్రజల కోసమే.. ప్రజలకు నిత్యావసరాల ధరలు అందుబాటులో ఉంచేందుకు మిల్లర్లు, వ్యాపారులతో చర్చించాం. వారి ద్వారా మార్కెట్ రేటు కంటే 15–20 శాతం తక్కువకు సరుకులు అందిస్తాం. ప్రజల నుంచి వచ్చే డిమాండ్‌ను బట్టి తదుపరి నిర్ణయం తీసుకుంటాం. హోల్‌సేల్ వ్యాపారులు ఈ విక్రయాలను కేవలం ప్రజల కోసమే చేపడుతున్నారు. – హెచ్.అరుణ్‌కుమార్,కమిషనర్, పౌరసరఫరాల సంస్థ -
నోకియా చిన్న ఫోన్ రూ. 1,699లకే.. యూపీఐ పేమెంట్లూ చేసుకోవచ్చు!
Nokia 110 4G/2G: రిలయన్స్ జియో బాటలోనే నోకియా కూడా తక్కువ ధరకు 4జీ ఫీచర్ ఫోన్‌ను తీసుకొచ్చింది. ఇందులో యూపీఐ (UPI) పేమెంట్ ఆప్షన్‌ను ఇన్‌బిల్ట్‌గా ఇవ్వడం విశేషం. నోకియా 110 4జీ (Nokia 110 4G), నోకియా 110 2జీ (Nokia 110 2G) ఫీచర్ ఫోన్లకు సంబంధించిన 2023 మోడల్‌లు తాజాగా విడుదలయ్యాయి. వీటి స్పెసిఫికేషన్లు, ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం. ఇదీ చదవండి: హాట్ డీల్: రూ.12 వేలకే లేటెస్ట్ శాంసంగ్ స్మార్ట్‌ఫోన్! స్పెసిఫికేషన్స్ నోకియా 110 4G/2G ఫోన్ల 2023 మోడల్లను 2021 మోడల్‌తో పోలిస్తే చాలా ఆకర్షణీయంగా రూపొందించారు. కొత్త కొత్త రంగుల్లో నూతన ఫోన్లు ప్రీమియంగా కనిపిస్తున్నాయి. నోకియా 110 4జీ ఫోన్ మిడ్నైట్ బ్లూ, ఆర్కిటిక్ పర్పుల్ రంగుల్లో లభిస్తుండగా నోకియా 110 2జీ ఫోన్ చార్కోల్, క్లౌడీ బ్లూ కలర్స్‌లో అందుబాటులో ఉంది. విశేషమేమిటంటే, ఈ కొత్త మోడల్‌ల ఫోన్లలో ఇన్‌బిల్ట్ యూపీఐ పేమెంట్ ఫీచర్ ఇచ్చారు. యూజర్లు ఒక బటన్‌ను నొక్కడం ద్వారా సులభంగా యూపీఐ చెల్లింపులు చేసుకోవచ్చు. నోకియా 110 4జీలో బలమైన 1450mAh బ్యాటరీ, నోకియా 110 2జీ ఫోన్లో 1000mAh బ్యాటరీ ఇచ్చారు. రెండు ఫోన్లలోనూ 32జీబీ వరకు స్టోరేజ్‌ను విస్తరించుకోవచ్చు. నోకియా 110 4జీ ధర రూ.2,499, నోకియా 110 2జీ ఫోన్ ధర రూ.1,699లుగా ఉంది. వీటిని నోకియా రిటైల్ స్టోర్లలోనూ, నోకియా అధీకృత, భాగస్వామ్య వెబ్సైట్లలోనూ కొనుగోలు చేయవచ్చు. ఫీచర్స్ 1.8″ QQVGA డిస్ప్లే QVGA రిజల్యూషన్‌తో కూడిన రియర్ కెమెరా 12 రోజుల స్టాండ్‌బై టైమ్, 8 గంటల టాక్ టైమ్ అందించే 1450mAh బ్యాటరీ. ( నోకియా 110 2Gలో 1000mAh బ్యాటరీ) నానో ఆకృతిలో పాలికార్బోనేట్తో తయారు చేసిన బ్యాక్ ప్యానెల్ IP52 వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్ వైర్లెస్ FM రేడియో S30+ ఆపరేటింగ్ సిస్టమ్ 94.5 గ్రాముల బరువు 50mm x 121.5mm x 14.4mm కొలతలు ఇదీ చదవండి: ప్రపంచంలోనే అతి చిన్న స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు మాత్రం అదుర్స్! -
హాట్ డీల్: రూ.12 వేలకే లేటెస్ట్ శాంసంగ్ స్మార్ట్‌ఫోన్!
తక్కువ ధరకు కొత్త బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా.. అయితే మీ కోసం ఓ అద్భుతమైన డీల్ ఉంది. ప్రముఖ శాంసంగ్ గెలాక్సీ ఎఫ్13 (Samsung Galaxy F13) స్మార్ట్ ఫోన్ అత్యధిక డిస్కౌంట్ లభిస్తోంది. ఆఫర్లు ఇవీ... ప్రముఖ ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ శాంసంగ్ గెలాక్సీ ఎఫ్13 స్మార్ట్ ఫోన్‌పై 29 శాతం భారీ తగ్గింపు అందిస్తోంది. ఏడాది క్రితం లాంచ్ అయిన ఈ స్మార్ట్ ఫోన్ వాస్తవ ధర రూ.16,999 కాగా ఫ్లిప్‌కార్ట్‌లో రూ.11,999కే సొంతం చేసుకోవచ్చు. ఇక ఎక్స్ఛేంజ్ ఆఫర్, బ్యాంకు డిస్కౌంట్లను ఉపయోగించుకుంటే మరింపు తగ్గింపు లభిస్తుంది. పాత ఫోన్లను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా ఏకంగా రూ.11,450 వరకు డిస్కౌంట్ ఉంటుందని ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది. యాక్సిస్ బ్యాంక్ కార్డును ఉపయోగించి కొనుగోలు చేస్తే 10 శాతం క్యాష్ బ్యాక్, అదే ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డును వినియోగిస్తే 5 శాతం తగ్గింపు అదనంగా లభిస్తాయి. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్13 ఫీచర్స్ 6.6 అంగులాల డిస్ప్లే. ఆక్టాకోర్ శాంసంగ్ ఎక్సినోస్ 850 ప్రాసెసర్ 4 జీబీ ర్యామ్ ట్రిపుల్ రియర్ కెమెరా, 50 ఎంపీ మెయిన్ సెన్సర్, 5 ఎంపీ అల్ట్రావైడ్ సెన్సర్, 2 ఎంపీ డెప్త్ సెన్సర్ 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇదీ చదవండి: కొత్త కొత్తగా.. మోటో జీ32 స్మార్ట్‌ఫోన్ కొత్త వేరియంట్లు -
మస్కిటో జాపర్ - దోమల బెడదకు గుడ్ బై.. ధర రూ. 824 మాత్రమే
కాలాలతో సంబంధం లేకుండా చీకటి పడేసరికి చాలా ఇళ్లల్లో.. దోమలు ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. వాటికి చెక్ పెట్టడానికి దోమల చక్రాలు, దోమల అగరొత్తులు, ఆల్ ఔట్స్ వంటి ప్రొడక్ట్స్ వాటడం సర్వసాధారణం. అయితే కొన్ని మొండి దోమలు కాసేపటికే ఆ మత్తు నుంచి తేరుకుని.. తమ ప్రతాపాన్ని చూపెడుతుంటాయి. అందుకే చాలా మంది దోమల బ్యాట్ అందుకుని యుద్ధం చేస్తుంటారు. (అదరగొట్టిన పోరీలు..ఇన్‌స్టాను షేక్ చేస్తున్న వీడియో చూస్తే ఫిదా!) ఈ డివైస్ ఇంట్లో ఉంటే.. బ్యాట్ తీసుకుని మూల మూలకు తిరగాల్సిన పనిలేదు. వాటంతట అవే ఆ మెషిన్ దగ్గరకు వచ్చి చటుక్కున చస్తాయి. దీని హైసింథైన్ ఎల్ఈడీ లైట్.. ఇరువైపుల నుంచి ప్రత్యేకమైన కాంతిని వెదజల్లుతూ దోమలను, కీటకాలను ట్రాప్ చేసి తనవైపు రప్పిస్తుంది. క్షణాల్లో లోపలకు లాగి.. లోపలున్న బాస్కెట్లో వేసేస్తుంది. ఇది రసాయనాలు, విషపదార్థాలు, రేడియేషన్స్ జోలికి వెళ్లదు. ఈ మెషిన్ ఆన్‌లో ఉన్నప్పుడు.. పిల్లలు, పెంపుడు జంతువులు పొరబాటున తగిలినా.. విద్యుదాఘాతం వంటి ప్రమాదాలేం జరగవు. దీన్ని ఎక్కడికైనా సులభంగా వెంట తీసుకెళ్లొచ్చు. ఇది పనిచేస్తున్నప్పుడు ఎలాంటి శబ్దం చేయదు. మరునాడు ఉదయాన్నే బాస్కెట్‌ని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. దీని ధర 10 డాలర్లు మాత్రమే. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ. 824. (ఆకాష్ అంబానీ-శ్లోక లిటిల్ ప్రిన్సెస్ పేరు: పండితులు ఏమంటున్నారంటే?) ఇదీ చదవండి: ఒకప్పుడు రెస్టారెంట్లో పని:.. ఇప్పుడు లక్షల కోట్ల టెక్ కంపెనీ సీఈవో -
రెక్కల్లేని ఫ్యాన్.. ధర తక్కువ & నిమిషాల్లో చల్లదనం
ఈ ఫొటోలో గది మధ్య స్తంభంలా కనిపిస్తున్నది 36 అంగుళాల టవర్ ఫ్యాన్. దీనికి రెక్కలు లేకపోయినా, దీన్ని ఆన్ చేసుకుంటే గదిలో గాలికి లోటుండదు. అమెరికాకు చెందిన బహుళజాతి సంస్థ ‘వెసింక్’కు అనుబంధ సంస్థ అయిన ‘లెవోయిట్’ ఈ స్తంభంలాంటి టవర్ ఫ్యాన్‌ను ఇటీవల విడుదల చేసింది. మిగిలిన ఫ్యాన్ల మాదిరిగానే దీనిలోనూ గాలి వేగాన్ని అదుపు చేసుకునే వెసులుబాటు ఉంది. అయితే, మామూలు ఫ్యాన్ల మాదిరిగా ఇది శబ్దం చేయదు. (ఇదీ చదవండి: సమయం ఆదా చేసే 'అల్ట్రాస్పీడ్ త్రీడీ ప్రింటర్' - ధర ఎంతంటే?) తొంభై డిగ్రీల కోసం అటూ ఇటూ తిరుగుతూ గాలిని కోరుకున్న వేగంలో ప్రసరిస్తుంది. అంతేకాదు, ఇందులో ఇంకో విశేషమూ ఉంది. ఇది ‘టెంపరేచర్ రెస్పాన్సివ్ ఫ్యాన్’. అంటే, ఈ ఫ్యాన్ గదిలోని ఉషోగ్రతకు అనుగుణంగా పనిచేస్తుంది. లోపల బాగా వేడిగా ఉంటే, ఇందులోని సెన్సర్లు ఉషోగ్రతను గుర్తించి, నిమిషాల్లోనే గదిని చల్లబరుస్తాయి. ఇది దాదాపుగా ఏసీకి ప్రత్యామ్నాయంగా పనిచేస్తుందని చెబుతున్నారు. దీని ధర 69.99 డాలర్లు (రూ. 5,743) మాత్రమే! -
రూ. 6 వేలకే సరికొత్త స్మార్ట్ఫోన్లు.. లాంచ్ చేసిన షావోమీ
అతి తక్కువ ధరలో సరికొత్త స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది షావోమీ (Xiaomi). రెడ్మీ ఏ2 (Redmi A2), రెడ్మీ ఏ2 ప్లస్ (Redmi A2 Plus) ఫోన్లు భారత్‌లో అధికారికంగా విడుదలయ్యాయి. ఇదీ చదవండి: Motorola Edge 40: మోటరోలా ఎడ్జ్ 40 లాంచ్‌కు రెడీ.. ఫీచర్లు, స్పెసిఫికేషన్లు భలే ఉన్నాయే! రెడ్మీ ఏ2 సిరీస్ గత సంవత్సరం వచ్చిన రెడ్మీ ఏ1 సిరీస్‌కు కొనసాగింపు. పైకి చూడటానికి ఒకేలా ఉన్నా ఏ2 సిరీస్‌లో మరికొన్ని హంగులు చేర్చారు. మరింత శక్తివంతమైన చిప్‌ను జోడించారు. తాజా ఆండ్రాయిడ్ ( Android 13 Go) ఎడిషన్ సాఫ్ట్‌వేర్‌ను జత చేశారు. ఇక రెడ్మీ ఏ2, ఏ2 ప్లస్ డిజైన్ పరంగా రెండూ ఒకే రకంగా ఏ2 ప్లస్ ఫోన్లో అదనంగా ఫింగర్‌ప్రింట్ రీడర్ ఫీచర్ ఉంటుంది. రెడ్మీ ఏ2 సిరీస్ ధర రూ. 5,999 నుంచి ప్రారంభమవుతుంది. మే 23 తర్వాత ఈ ఫోన్లు కొనుగోలుదారులకు అందుబాటులోకి వస్తాయి. రేట్లు ఎంత.. ఎక్కడ కొనాలి.. ఆఫర్ల సంగతేంటి? రెడ్మీ ఏ2 2జీబీ/32జీబీ వేరియంట్ ధర రూ.5,999. 2జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజీ వెర్షన్ ధర రూ.6,499. ఇది 4జీబీ/64జీబీ కాన్ఫిగరేషన్‌లో కూడా కూడా అందుబాటులో ఉంది. దీని ధర రూ.7,499. ఇక రెడ్మీ ఏ2 ప్లస్ ధర రూ. 8,499. ఇది 4జీబీ/64జీబీ కాన్ఫిగరేషన్‌లో మాత్రమే వస్తుంది. సీ గ్రీన్, కామింగ్ ఆక్వా బ్లూ, క్లాసిక్ బ్లాక్ కలర్స్‌లో ఈ ఫోన్స్ లభిస్తాయి. ఈ ఫోన్లను ఆన్లైన్లో అయితే అమెజాన్, షావోమీ ఆన్లైన్ స్టోర్‌లో, అదే ఆఫ్‌లైన్‌లో అయితే ఎంఐ హోమ్ స్టోర్లతో పాటు కంపెనీ ఇతర రిటైల్ పార్టనర్ స్టోర్లలో మే 23 (మధ్యాహ్నం 12 తర్వాత) నుంచి కొనుగోలు చేయవచ్చు. ఇక ఆఫర్ల విషయానికి వస్తే షావోమీ ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్ వినియోగదారులకు ఈ ఫోన్ల కొనుగోలుపై రూ. 500 వరకు అదనపు తక్షణ తగ్గింపు లభిస్తుంది. ఈ మోడళ్లపై 2 సంవత్సరాల వారంటీ ఉంటుందని కంపెనీ పేర్కొంది. సీనియర్ సిటిజన్లకైతే ఈ ఫోన్లను హోం సర్వీస్‌లో అందించనున్నట్లు తెలిపింది. స్పెసిఫికేషన్లు, ఫీచర్లు వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్‌తో 6.52 అంగుళాల 720p డిస్ప్లే MediaTek Helio G36 చిప్సెట్ 4GB ర్యామ్ 64GB ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ Android 13 Go సాఫ్ట్వేర్. వెనుకవైపు 8MP ప్రధాన సెన్సార్‌తో డ్యూయల్ కెమెరా సెటప్, ముందువైపు మరో 5MP కెమెరా 10W మైక్రో USB ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీ. ఇదీ చదవండి: అదిరిపోయే రంగులో శాంసంగ్ గెలాక్సీ ఎస్23.. ధర ఎంతంటే.. -
బ్రాండెడ్, జనరిక్ మందుల మధ్య తేడా తెలుసుకోండి ఇలా..
సాక్షి, కర్నూలు: రోగమొచ్చిందంటే వ్యాధి కంటే దాని చికిత్సకయ్యే ఖర్చును తలచుకుని ఆందోళన, దిగులు చెందే పరిస్థితి. ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నా, తక్కువ ధరలో లభ్యమయ్యే మందులు ఉన్నా వాటిపై అవగాహన ఉండేది కొద్దిమందికి మాత్రమే. బ్రాండెడ్‌తో పోలిస్తే జనరిక్ మందులు చాలా తక్కువ ధరకు లభిస్తున్నా యి. నాణ్యత కూడా చాలా బాగుంటుంది. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో మూడు మెడికల్ షాపులు ఉన్నాయి. 2014 నుంచి ఈ మూడు దుకాణాలను జనరిక్ మందుల విక్రయశాలలుగా మార్చారు. ప్రస్తుతం జీవనధార మందుల దుకాణాలుగా ఇవి చెలామణి అవుతున్నాయి. చదవండి: వినూత్నం: ఆ గుప్పెళ్లు.. దయగల గుండెల చప్పుళ్లు వీటితో పాటు ప్రైవేటుగా కేంద్ర ప్రభుత్వ సహాయంతో పలువురు వ్యక్తులు జనరిక్ మందుల దుకాణాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో ఇవి 10కి పైగా ఉన్నాయి. అయితే వైద్యుల ప్రోత్సాహం లేని కారణంగా వీటికి ఆదరణ తక్కువగా ఉంటోంది. జనరిక్ మందులు నాణ్యత ఉండవని చెబుతూ అధికంగా బ్రాండెడ్ మందులనే వైద్యులు సూచిస్తున్నారు. ఎవరైనా రోగం తగ్గించుకునేందుకు ఎంత ఖర్చుకైనా వెనుకాడటం లేదు. దీన్ని ఆసరాగా చేసుకుని వైద్యులు బ్రాండెడ్ మందులనే రోగులకు రాస్తున్నారు. బ్రాండెడ్ మందులు రోగులకు రాస్తే ఆయా ఫార్మాకంపెనీలు వైద్యులకు భారీగా కమీషన్లు ముట్టజెబుతున్నాయన్నది బహిరంగ రహస్యం. ఈ కారణంగానే వారు తక్కువ ధరకు లభించే జనరిక్ మందులను ప్రోత్సహించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. భారతీయ వైద్య విధాన మండలి సైతం జనరిక్ మందులే రాయాలని పలుమార్లు హెచ్చరించినా వైద్యుల్లో మార్పు రావడం లేదు. చివరకు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని ప్రభుత్వ వైద్యులు సైతం జనరిక్ మందులు కాకుండా బ్రాండెడ్ మందులే రోగులకు రాస్తున్నారు. జనరిక్ మందులు రాస్తే రోగులకు 70 నుంచి 80 శాతం ఖర్చు తగ్గుతుందని తెలిసినా వారు ఆ పనిచేయకపోవడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఎలాంటి మార్పూ ఉండదు బ్రాండెడ్, జనరిక్ మందుల్లో ఉండేది ఒకే రకమైన ఔషధమే. బ్రాండెడ్ మందులకు ఉత్పత్తి ఖర్చుతో పాటు డీలర్, హోల్‌సేల్, రిటైల్ల లాభాలు, వైద్యుల కమీషన్లు అందులోనే ఉంటాయి కాబట్టి వాటి ధర అధికం. ఉదాహరణకు డోలో 650 అనేది బ్రాండెడ్ మందు. కేవలం పారాసిటమాల్ అనేది దాని జనరిక్ పేరు. వైద్యులు పారాసిటమాల్ అని రాయాలి. కానీ అలా చేయడం లేదు. నోవామాక్స్ అనేది బ్రాండెడ్ కాగా అందులోని అమాక్సిలిన్ జనరిక్ మందు పేరు. అయితే కొన్ని ఫార్మాకంపెనీలు ఏది బ్రాండెడ్ మందో, ఏది జనరిక్ మందో తెలియనంతా మందులు తయారు చేస్తూ వైద్యులనే అయోమయానికి గురిచేస్తున్నాయి. ప్రభుత్వం సబ్సిడీలు ఇస్తోంది జనరిక్ మందులు నాణ్యతలో బ్రాండెడ్ మందులతో ఏ మాత్రం తీసిపోవు. పైగా ఇవి బ్రాండెడ్ మందుల కంటే చాలా తక్కువ ధరకు లభిస్తాయి. జనరిక్ మందుల దుకాణాల ఏర్పాటుకు ప్రభుత్వం సబ్సిడీలు కూడా ఇస్తోంది. –ఎ.రమాదేవి, అసిస్టెంట్ డైరెక్టర్, ఔషధ నియంత్రణ శాఖ, కర్నూలు -
మోటరోలా కొత్త స్మార్ట్‌ఫోన్, ధర తక్కువ, ఇక జియో ఆఫర్ తెలిస్తే!
సాక్షి, ముంబై: మోటరోలా కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. మోటో ఈ32 పేరుతో కొత్త ఎంట్రీ-లెవల్ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ వెర్షన్‌గా తీసుకొచ్చింది. మీడియా టెక్ హీలియో జీ 37 ప్రాసెసర్‌ను ఇందులో జోడించింది. ఇంకా IP52 వాటర్-రిపెల్లెంట్ డిజైన్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, రెండు సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్స్తో స్టాక్ ఆండ్రాయిడ్ 12తో ఈ స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ధర, ఆఫర్లు ఈ స్మార్ట్‌ఫోన్ కేవలం ఒక వేరియంట్లో లభిస్తుంది. ధర రూ.10,499గా కంపెనీ నిర్ణయించింది. ఆర్కిటిక్ బ్లూ, ఎకో బ్లాక్ అనే రెండు రంగుల్లో, ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. రిలయన్స్ జియో కొనుగోలుదారులకు రూ. 2,549 విలువైన రిలయన్స్ జియో ప్రయోజనాలను ఉచితం. రూ. 2వేల రూపాయల క్యాష్‌బ్యాక్, వార్షిక Zee5 సభ్యత్వంపై రూ. 549 తగ్గింపు ఇందులో భాగం. మోటో ఈ32 ఫీచర్లు 6.5 అంగుళాల HD+ IPS LCD స్క్రీన్ 4 జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్, 1 టీబీ వరకు విస్తరించుకునే అవకాశం 2MP డెప్త్ సెన్సార్, 50MP రియర్ కెమెరా 8 ఎంపీ సెల్ఫీ కెమెరా 5000mAh బ్యాటరీ,10W ఛార్జింగ్ -
రియల్ మీ సరికొత్త ఫోన్ సీ30ఎస్ లాంచ్, లోబడ్జెట్ ధర
న్యూఢిల్లీ: రియల్మీ కంపెనీ సీ సిరీస్ నుంచి సీ30ఎస్ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. తక్కువ ధరలోనే ఫింగర్‌ప్రింట్ అన్‌లాక్ ఫీచర్‌తో ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. యూనిసాక్ ఎస్సీ9863ఏ ఆక్టాకోర్ ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ఫోన్ డిస్ప్లే 6.5 అంగుళాల పరిమాణంలో ఉంటుంది. వెనుక భాగంలో 8 మెగాపిక్సల్ ఏఐ కెమెరా, సెల్ఫీల కోసం ముందు భాగంలో 5 మెగాపిక్సల్ కెమెరా ఏర్పాటు చేశారు. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. రియల్మీ సీ30ఎస్ స్పెసిఫికేషన్స్ 6.5 ఇంచుల HD+ LCD డిస్ప్లేను 60Hz రిఫ్రెష్ రేట్, ఆక్టాకోర్ Unisoc SC9863A ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 12 బేస్ట్ రియల్మీ యూఐ గో ఎడిషన్‌తో 64 జీబీదాకా విస్తరించుకును అవకాశం 8 ఎంపీ రియర్ కెమెరా 5 ఎంపీ సెల్ఫీ కెమెరా 5000mAh బ్యాటరీ ధరలు,లభ్యత 2 జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజ్ బేస్ వేరియంట్ ధర రూ.7,499, 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.8,999గా ఉంది. స్ట్రిప్ బ్లాక్, స్ట్రిప్ బ్లూ కలర్ ఆప్షన్లలో ఇది లభ్యం. రియల్మీ సీ30ఎస్ మొబైల్ ఫ్లిప్‌కార్ట్ బిలియన్ డేస్ సందర్భంగా సెప్టెంబరు 23నుంచి సేల్కు రానుంది. -
కడుపునిండా తినండి బాబూ!
రెస్టారెంట్, ఫుడ్ కోర్టులలో కడుపునిండా భోంచేయాలంటే .. కనీసం రూ.200 పైనే వెచ్చించాల్సి ఉంటుంది. వివిధ వెరైటీ రుచులతో పుల్‌మీల్స్ ప్లేట్ తీసుకుంటే... హోటల్ ఉన్న ప్రాంతం, దానికి ఉన్న పాపులారిటిని బట్టి ప్లేటు రేటు ఉంటుంది. కొన్ని సార్లు పేరున్న రెస్టారెంట్లలో తిన్నప్పటికీ, భోజనం అంతరుచిగా ఉండదు. ఇలాంటి హోటల్స్ ఉన్న ఈ రోజుల్లో తిన్నంత అన్నం, ఐదారు రకాల కూరలతో కడుపునిండా పెడుతున్నారు. ఎంతో రుచికరమైన భోజనం పెడుతూ నామమాత్రము ధర రూ.50 ఫుల్‌మీల్స్ అందిస్తున్నారు ఓ జంట. ఇంత తక్కువకు భోజనం పెడుతున్నారంటే ఏదో చారిటీ సంస్థో అనుకుంటే పొరపడినట్లే. ఒంట్లో జవసత్వాలు నీరసించినప్పటికీ కొన్నేళ్లుగా ఎంతో ప్రేమగా వండి వారుస్తూ వేలమంది మన్ననలు పొందుతున్నారు ఈ అజ్జా అజ్టీలు. కర్ణాటకలోని మణిపాల్‌కు చెందిన వృద్ధ దంపతులే అజ్జా అజ్టీలు. రాజగోపాల్ నగర్ రోడ్‌లోని హోటల్ గణేష్ ప్రసాద్ (అజ్జా అజ్జీ మానే)ను 1951 నుంచి ఈ దంపతులు నడుపుతున్నారు. శాకాహార భోజనాన్ని అరిటాకు వేసి వడ్డించడాన్ని గత కొన్నేళ్లుగా సంప్రదాయంగా పాటిస్తున్నారు. అరిటాకు వేసి అన్నం, పప్పు, వేపుడు కూరలు, పచ్చడి, సలాడ్, రసం, పెరుగు పెడతారు. ఇవన్నీ బయట హోటల్లో తినాలంటే కనీసం రెండువందల రూపాయలైనా చెల్లించాలి. కానీ వీరు కేవలం యాభైరూపాయలకే భోజనం పెడుతూ కడుపు నింపుతున్నారు. ఇక్కడ పెట్టే భోజనం రుచిగా, శుచిగా ఉండడంతో కస్టమర్లు ఎగబడి ఇష్టంగా తింటున్నారు. ఇంట్లో వండిన వంట, తక్కువ రేటు, ప్రేమగా వడ్డిస్తుండడంతో ఈ హోటల్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. స్థానికంగా అంతా అజ్జాఅజ్జీ మానే అని పిలుచుకుంటుంటారు. వయసులో పెద్ద వాళ్లు కావడంతో కస్టమర్లకు ఆ దంపతులు తల్లిదండ్రులుగా, బామ్మ తాతయ్యలు వండిపెట్టినట్లుగా భావించి ఎంతో ఇష్టంగా తింటున్నారు. ప్రస్తుతం నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్నప్పటికీ వారు అనుకున్న దానిని కొనసాగిస్తున్నారు. ఈ దంపతుల గురించి ఇటీవల రక్షిత్ రాయ్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం అజ్జాఅజ్జీలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నారు. వీరి సేవాగుణం గురించి తెలిసిన నెటిజన్లు వీరిని అభినందనలతో ముంచెత్తుతున్నారు. -
గుడ్‌న్యూస్: భారీగా తగ్గనున్న కోవిషీల్డ్, కోవాగ్జిన్ ధరలు!
కొవిడ్ వ్యాక్సిన్లు త్వరలో రెగ్యులర్ మార్కెట్లోకి అడుగుపెట్టనున్నాయన్న విషయం తెలిసిందే. డ్రగ్ నియంత్రణ విభాగం నుంచి అప్రూవల్ దక్కిన వెంటనే టీకాలు మార్కెట్లోకి రిలీజ్ చేయనున్నాయి ఆయా కంపెనీలు. ఈ క్రమంలో ఇప్పుడు మరో గుడ్ న్యూస్ అందింది. రెగ్యులర్ మార్కెట్లోకి వచ్చిన వెంటనే ఈ రెండు కొవిడ్ వ్యాక్సిన్ల ధరలు భారీగా తగ్గనున్నట్లు సమాచారం. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఈ రెండు వ్యాక్సిన్ల ధరలు ఒక్కో డోసు రూ. 275గా నిర్ధారణ కానున్నాయని, అదనంగా సర్వీస్ ఛార్జీ మరో 150 రూపాయలతో మొత్తం.. రూ. 425గా ఉండొచ్చని ఆ కథనాలు వెల్లడించాయి. ఈ మేరకు నేషనల్ ఫార్మాసుటికల్స్ ప్రైసింగ్ అథారిటీ (NPPA) ధరల నియంత్రణ.. తగ్గింపు దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. జనవరి 19న సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ‘కోవిడ్-19పై సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ’ కొన్ని షరతులకు లోబడి వయోజన జనాభాలో ఉపయోగించడానికి కోవిషీల్డ్ మరియు కోవాగ్జిన్‌లకు సాధారణ మార్కెట్ ఆమోదం ఇవ్వాలని సిఫార్సు చేసింది. అలాగే పనిలో పనిగా ధరల నిర్ధారణపై కూడా ఎన్‌పీపీఏను కోరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రైవేట్ వ్యాక్సినేషన్ సెంటర్లలో కోవాగ్జిన్ ధర ఒక డోస్‌కు 1,200రూపాయలుగా ఉండగా.. కోవిషీల్డ్ ధర రూ. 780గా ఉంది. వీటికి అదనంగా రూ. 150 సర్వీస్ ఛార్జీలు చెల్లించాల్సి వస్తోంది. ఈ రెండూ ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఉపయోగించేందుకు అనుమతులు ఉన్న వ్యాక్సిన్లు. ఒకవేళ వ్యాక్సిన్ కు మార్కెట్ ఆథరైజేషన్ లేబుల్ దక్కితే కేవలం అత్యవసర పరిస్థితులు, రిజర్వ్ డ్ కండిషన్స్ లో మాత్రమే విక్రయించాలనే నిబంధన ఉండదు. భారత్‌లో వ్యాక్సినేషన్ ఉధృతిగా సాగుతున్న టైంలోనే కోవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్ కంపెనీలు రెగ్యులర్ మార్కెట్లోకి వచ్చేందుకు అప్రూవల్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాయి. -
అనిల్ అగర్వాల్ చేజారిన వీడియోకాన్!
న్యూఢిల్లీ: దివాలా తీసిన వీడియోకాన్ ఇండస్ట్రీస్‌ను ‘అతి తక్కువ ధరకు’ కొనుగోలు చేయాలన్న బిలియనీర్ అనిల్ అగర్వాల్ నేతృత్వంలోని ట్విన్ స్టార్ టెక్నాలజీస్ ప్రయత్నం నెరవేరలేదు. ట్విన్ స్టార్ టెక్నాలజీస్ దాఖలు చేసిన బిడ్స్‌ను ఆమోదిస్తూ ఎన్సీఎల్టీ, ముంబై బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను దివాలా వ్యవహారాల అప్పీల్స్ కోర్టు– ఎన్సీఎల్ఏటీ (నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్) బుధవారం కొట్టివేసింది. దీంతో తాజా బిడ్స్ ఆహ్వానానికి కమిటీ ఆఫ్ క్రెడిటార్స్‌కు (సీఓసీ) తగిన వెసులుబాటు లభించింది. మొదటి నుంచీ అనిశ్చితే..! నిజానికి ట్విన్ స్టార్ టెక్నాలజీస్ బిడ్‌కు తొలుత సరేనన్న క్రెడిటార్స్ కమిటీ (సీఓసీ) తరువాత యూ టర్న్ తీసుకుంది. 13 కంపెనీల వీడియోకాన్ గ్రూప్ కొనుగోలుకు తాజా బిడ్స్‌ను ఆహ్వానించడానికి అనుమతించాలని కోరుతూ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నేతృత్వంలోని క్రెడిటార్స్ కమిటీ దివాలా అప్పిలేట్ ట్రిబ్యునల్ ఎన్సీఎల్ఏటీని ఆశ్రయించింది. ఇందుకు అనుగుణంగా తిరిగి ఈ అంశాన్ని పునఃబిడ్డింగ్‌కు వీలుగా క్రెడిటార్స్ కమిటీకి తిప్పి పంపాలని కోరింది. కన్జూమర్ డ్యూరబుల్ సంస్థ వీడియోకాన్ ఇండస్ట్రీస్ కొనుగోలుకు ట్విన్ స్టార్ టెక్నాలజీస్ దాఖలుచేసిన రిజల్యూషన్ బిడ్ ప్రకారం, మొత్తం రుణాల్లో కేవలం 5 శాతమే తమకు లభిస్తుండడమే తాజా బిడ్స్ కోరడానికి కారణమని అప్పిలేట్ ట్రిబ్యునల్‌కు తెలిపింది. వీడియోకాన్ చెల్లించాల్సింది దాదాపు రూ.64,839 కోట్లయితే ఆ కంపెనీ కొనుగోలుకు బిలియనీర్ అగర్వాల్‌కు చెందిన ట్విన్ స్టార్ టెక్నాలజీస్ కేవలం రూ.2,962 కోట్లు ఆఫర్ చేసింది. వీడియోకాన్‌కు రుణాలు ఇచ్చిన ఎస్బీఐ నేతృత్వంలోని సంస్థలకు 94.98 శాతం వోటింగ్‌కు ప్రాతినిధ్యం ఉంది. ఇందులో ఒక్క ఎస్బీఐ ప్రాతినిధ్య వోటు 18.05 శాతం. ట్విన్ స్టార్ టెక్నాలజీస్ రూ.2,962 కోట్ల బిడ్‌కు జూన్ 9న ఎన్సీఎల్టీ ముంబై బెంచ్ ఆమోదముద్ర వేసింది. అయితే ఈ ఆమోదం సందర్భంగా ఈ బిడ్ అతి తక్కువగా ఉందని, దీనివల్ల క్రెడిటార్‌కు ఒరిగిదేమీ ఉండదని, ట్విన్ స్టార్ టెక్నాలజీస్ చెల్లించేది నామమాత్రమని కూడా ఎన్సీఎల్టీ బెంచ్ వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ రిజల్యూషన్ ప్రణాళికపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ఇరువురు క్రెడిటార్లు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (1.97 వోటింగ్ షేర్), ఐఎఫ్సీఐ లిమిటెడ్ (1.03 శాతం వోటింగ్షేర్) గత ఏడాది జూన్ 19న అప్పిలేట్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. దీనితో ఎన్సీఎల్టీ ఉత్తర్వుపై అప్పిలేట్ ట్రిబ్యునల్ స్టే విధించింది. యథాతథ పరిస్థితి కొనసాగింపునకు ఆదేశాలు జారీ చేసింది. అయితే అప్పిలేట్ ట్రిబ్యునల్ స్టే ఎత్తివేయాలని కోరుతూ ట్విన్ స్టార్ టెక్నాలజీస్ సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ ఫలితం దక్కలేదు. ఆగస్టు 13న ట్విన్‌స్టార్ పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. తన రిజల్యూషన్ ప్రణాళికను తొలత ఆమోదించి తరువాత యూ టార్న్ తీసుకోవడం సమంజసం కాదన్నది ట్విన్‌స్టార్ టెక్నాలజీస్ వాదన. టెలికం శాఖ, ధూత్ నుంచి కూడా వ్యతిరేకత కాగా తమ గ్రూప్ కంపెనీలను కేవలం రూ.2,962 కోట్ల కొనుగోలుకు వీలులేదంటూ వీడియోకాన్ గ్రూప్ చైర్మన్, ఎండీ వేణగోపాల్ ధూత్ దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా అప్పిలేట్ ట్రిబ్యునల్ విచారించింది. వీడియోకాన్ టెలికమ్యూనికేషన్స్‌సహా ఆ గ్రూప్‌నకు సంబంధించి 13 కంపెనీలకు ‘ఏకీకృత’ పరిష్కార (రిజల్యూషన్) ప్రణాళికకు ఎన్సీఎల్టీ ఆమోదముద్ర వేయడాన్ని టెలికమ్యూనికేషన్ల శాఖ (డీఓటీ) వ్యతిరేకించింది. ఎన్సీఎల్టీ రూలింగ్ని అప్పీలేట్ ట్రిబ్యునల్‌లో సవాలు చేసింది. తనకు వీడియోకాన్ టెలికమ్యూనికేషన్స్ దాదాపు రూ.882 కోట్లు బకాయి పడినట్లు తెలిపింది. ఎన్సీఎల్టీలో కేసు విచారణలో ఉండడం వల్ల తానకు రావాల్సిన బకాయిలను రాబట్టుకోవడం సాధ్యంకాదని అప్పీలేట్ ట్రిబ్యునల్‌కు విన్నవించింది. కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్‌ని ప్రారంభించడం ద్వారా డిఫాల్ట్ టెలికం కంపెనీలు ‘తమకు సంబంధించి రుణ బాధ్యతల నుండి బయటపడలేవని’ తన వాదనల్లో పేర్కొంది. మోసపూరిత విధానాలు పాల్పడిన కంపెనీలు ఐబీసీ నిబంధనావళికింద తప్పించుకోలేవని, తద్వారా ప్రభుత్వానికి చెల్లింపులను ఎగ్గొట్టలేవని స్పష్టం చేసింది. అంతేకాకుండా, ఆమోదించిన రిజల్యూషన్ ప్లాన్ కింద కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్ ద్వారా ఆపరేషనల్ క్రెడిటార్స్‌కు వచ్చేది అత్యంత తక్కువ మొత్తమని పేర్కొంది. తనవరకూ చూస్తే, తాను చేసే క్లెయిమ్‌లో లభించేది కేవలం 0.12 శాతమేనని వివరించింది. సీఓసీ నిర్ణయాలపై విమర్శ రిజల్యూషన్ ప్రణాళిక అమల్లో సీఓసీది కీలకపాత్ర. అయితే రుణాల్లో కూరుకుపోయి దివాల పక్రియలో ఉన్న కంపెనీ అమ్మకాలకు సంబంధించి రిజల్యూషన్ ప్రక్రియలో క్రెడిటార్స్ కమిటీ 95 శాతం వరకూ రాయితీ (హెయిర్‌కట్స్) ఇస్తుండడంపై ఇటీవల తీవ్ర విమర్శలు తలెత్తుతున్నాయి. తమకు రావాల్సిన బకాయిలకు సంబంధించి క్రెడిటార్ల సంఘం భారీ మాఫీలు జరిపి, రిజల్యూషన్ ప్రణాళికలను ఆమోదించడం తగదన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐబీసీ (ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్ట్సీ కోడ్) దివాలా ప్రక్రియలో కీలకమైన కమిటీ ఆఫ్ క్రెడిటార్స్ (సీఓసీ)కి ఒక నియమావళిని జారీ చేసే పనిలో కేంద్రం ఉన్నట్లు కనబడుతోంది. ఈ విషయంలో ఆర్థికశాఖ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్లతో కార్పొరేట్ వ్యవహారాల శాఖ చర్చిస్తున్నట్లు కార్పొరేట్ వ్యవహారాల కార్యదర్శి రాజేష్ వర్మ ఇటీవల తెలిపారు. అయితే అధిక హెయిర్‌కట్స్ విమర్శలపై ఆయన ఈ సందర్భంగా ఆయన ఎటువంటి వ్యాఖ్యలు, ఆ ప్రస్తావన చేయకపోవడం గమనార్హం. ఐబీసీకి పలు సవరణల ద్వారా దీనిని ఎప్పటికప్పుడు మరింత పటిష్టంగా మార్చడం జరుగుతోంది. ఈ దిశలో ఇప్పటికి ఐబీసీకి ఆరు సవరణలు జరిగాయి. ఐబీసీని మరింత సమర్థవంతంగా పటిష్టంగా మార్చడానికి విద్యావేత్తలు, విధాన నిర్ణేతలు, పరిశోధకులు, సంబంధిత ఇతర వర్గాలతో కేంద్రం నిరంతరం చర్చలు జరుపుతుందని, ఆయా సిఫారసులకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకుంటుందని అత్యున్నత స్థాయి వర్గాలు పేర్కొంటున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ ఐదు ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరుకోవడంలో ఇది కీలకమని కూడా ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఐబీసీ సెక్షన్ 31 (4) నిబంధనలు పాటించకపోవడమే కారణం! దివాలా కోడ్ (ఐబీసీ) సెక్షన్ 31 (4) ప్రకారం, రిజల్యూషన్ ప్లాన్‌ను సమర్పించడానికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) నుండి ముందస్తు అనుమతి అవసరమని, దీనిని అనిల్ అగర్వాల్ సంస్థ పొందలేదని జరత్ కుమార్ జైన్, అశోక్ కుమార్ మిశ్రాలతో కూడిన ఇరువురు సభ్యుల అప్పీలేట్ ట్రిబ్యునల్ పేర్కొంది. కోడ్ నిబంధనలకు అనుగుణంగా ప్రక్రియను పూర్తి చేయడం కోసం ఈ బిడ్స్ వ్యవహారాన్ని తిరిగి సీఓసీకి పంపుతున్నట్లు 213 పేజీల ఉత్తర్వు్యలో తెలిపింది. దీనిప్రకారం, ఎన్సీఎల్ఏటీ ఉత్తర్వును ఉన్నత న్యాయస్థానంలో సవాలు చేసి, అది రద్దయితే తప్ప, సీఓసీ ఇప్పుడు వీడియోకాన్ కోసం తాజా బిడ్లను కోరడానికి సౌలభ్యత ఏర్పడింది. పునర్విచారణ, సమీక్ష కోసం రుణదాతలకు రిజల్యూషన్ ప్లాన్‌ను తిరిగి పంపే అధికారాలు ఎన్సీఎల్టీ, ఎన్సీఎల్ఏటీలు రెండింటికి ఉన్నాయని అప్పీలేట్ ట్రిబ్యునల్ పేర్కొనడం గమనార్హం. సీఓసీకి ఆయా అంశాల్లో ఉన్న అధికారాలను తోసిపుచ్చలేమని స్పష్టం చేసింది. తగిన చర్యలు తీసుకుంటాం: ట్విన్‌స్టార్ తాము అప్పీలేట్ ట్రిబ్యునల్ ఉత్తర్వుల గురించి తెలుసుకున్నట్లు ట్విన్‌స్టార్ తరఫు న్యాయవాది గోపాల్ జైన్ పేర్కొన్నారు. తాజా ఆర్డర్ వల్ల వీడియోకాన్ దివాలా పరిష్కార పక్రియ (రిజల్యూషన్) మరింత ఆలస్యం అవుతుందని అన్నారు. వ్రాతపూర్వక ఉత్తర్వు కోసం ఎదురుచేస్తున్నామని, తీర్పును పూర్తి అధ్యయనం తరువాత తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. -
ఎలక్ట్రిక్ స్కూటర్లలో సంచలనం..! రేంజ్ ఎక్కువే..రేటు తక్కువే..!
బెంగళూరుకు చెందిన మొబిలిటీ సంస్థ బౌన్స్ భారత మార్కెట్లలోకి సరికొత్త ‘బౌన్స్ ఇన్ఫినిటీ ఈ1’ స్కూటర్‌ను లాంచ్ చేసింది. ఈ స్కూటర్ లాంచ్‌తో ఎలక్ట్రిక్ వాహనాల్లో సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్ఠింది. బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ బైక్ రెంటల్ సర్వీసెస్‌తో పరిచయమైన బౌన్స్ ఎలక్ట్రిక్ వాహనాల్లో కూడా సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. బౌన్స్ ఇన్ఫినిటీ ఈ1 స్కూటర్‌ను 'బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్'తో వచ్చిన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీ బౌన్స్. దేశవ్యాప్తంగా ఆయా నగరాల్లో ఏర్పాటుచేసిన బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్ల ద్వారా బ్యాటరీ ఛార్జ్ జీరో అవ్వగానే ఆయా స్వాపింగ్ స్టేషన్ల నుంచి ఫుల్ ఛార్జ్ బ్యాటరీలను ఉపయోగించవచ్చు. దేశవ్యాప్తంగా 3500 బ్యాటరీ స్వాపింగ్ సర్వీస్ స్టేషన్లను పార్క్ ప్లస్ భాగస్వామ్యంతో బౌన్స్ ఏర్పాటుచేయనుంది. ధర ఏంతంటే..! బ్యాటరీ, ఛార్జర్‌తో కూడిన బౌన్స్ ఇన్ఫినిటీ ఈ1 ధర రూ.68,999 (ఢిల్లీ ఎక్స్-షోరూమ్), కాగా బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్‌లో స్కూటర్‌ను తీసుకుంటే ఈ స్కూటర్ ధర రూ. 45,099 (ఢిల్లీ ఎక్స్-షోరూమ్) ధరగా ఉంది. బ్యాటరీ లేకుండా సరసమైన ధరకు బౌన్స్ ఇన్ఫినిటీ ఈ1 స్కూటర్‌ను కొనుగోలుదారులు పొందవచ్చు. బౌన్స్ ఇన్ఫినిటీ ఈ1 ఎలక్ట్రిక్ స్కూటర్ స్పోర్టీ రెడ్, స్పార్కిల్ బ్లాక్, పెరల్ వైట్, డెసాట్ సిల్వర్, కామెడ్ గ్రే కలర్ వేరియంట్స్‌లో రానుంది. చదవండి: తక్కువ ధరలోనే..! భారత మార్కెట్లలోకి మరో ఎలక్ట్రిక్ బైక్..! బుకింగ్స్, డెలివరీ ఎప్పుడంటే..! బౌన్స్ ఇన్ఫినిటీ ఈ1 స్కూటర్‌ను కంపెనీ అధికారిక వెబ్సైట్, డీలర్షిప్ నెట్వర్క్ నుంచి రూ. 499 చెల్లించి ప్రీ-బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ స్కూటర్లను కంపెనీ వచ్చే ఏడాది మార్చి నుంచి డెలివరీలను చేపట్టనుంది. ఈ స్కూటర్ కొనుగోలుపై ఫేమ్-2 పథకం కూడా వర్తించనుంది. కొనుగోలుదారులకు 50వేల కిమీలతోపాటు, 3 సంవత్సరాల వారంటీను కంపెనీ అందిస్తోంది. స్కూటర్ పర్ఫారెమెన్స్..! బౌన్స్ ఇన్ఫినిటీ ఈ1 స్కూటర్లో వాటర్‌ప్రూఫ్ IP67 రేటెడ్ 48V బ్యాటరీతో 39AHతో వస్తుంది, ఇది 83Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది గరిష్టంగా గంటకు 65కిమీ వేగంతో ప్రయాణిస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 85 కిమీ మేర ప్రయాణిస్తోందని కంపెనీ వెల్లడించింది. బౌన్స్ ఇన్ఫినిటీ ఎలక్ట్రిక్ స్కూటర్ 0 నుంచి 40 కెఎమ్‌పీహెచ్ వేగాన్ని 8 సెకన్లలో అందుకోగలదు. చదవండి: ఛార్జింగ్ సమస్యలకు చెక్..! ఎలక్ట్రిక్ స్కూటర్లలో సరికొత్త పంథా..! -
సింగిల్ స్విచ్‌తో పూటకో వెరైటీ వండివాడ్చేస్తాయి.. సరసమైన ధరల్లోనే..
రోబోటిక్ గ్రిల్ ‘సింగిల్ స్విచ్‌తో పూటకో వెరైటీ ’ అనే పద్ధతికి ఈ ఉరుకుల పరుగుల జీవితాలు బాగా అలవాటు పడిపోయాయి. వంటకు గరిటెతో పని లేకుండా పోయింది. ఇంకా చెప్పాలంటే అసలు మనిషి పక్కనుండాల్సిన అవసరమే లేదు. స్విచ్ ఆన్ చేసి వెళ్తే.. ఏ వేళలో వడ్డించుకున్నా.. వేడివేడిగా అందించడం నేటి టెక్నాలజీ స్పెషల్. చిత్రంలోని ఎలక్ట్రిక్ ఆటోమేటిక్ ఫ్రైయర్ మెషిన్.. గుండ్రంగా తిరుగుతూ క్రిస్పీ రుచులను అందిస్తుంది. గాడ్జెట్లోపల బౌల్ 360 డిగ్రీలు తిరుగుతూ ఆహారాన్ని ఫ్రై చేస్తుంది. ఇంటెలిజెంట్ నాన్‌స్టిక్ డ్రమ్ కలిగిన ఈ రోబోటిక్ మేకర్లో ఒకేసారి ఐదు రకాల ఫుడ్ ఐటమ్స్ గ్రిల్ చేసుకోవచ్చు. అందుకు వీలుగా ఐదు అరలతో కూడిన పార్టిషన్ గ్రిల్ ప్లేట్.. ఈ మేకర్‌తో పాటు లభిస్తుంది. దాన్ని సెట్ చేసి ఒక్కోదానిలో ఒక్కో రకం ఐటమ్‌ని చిత్రంలో ఉన్న విధంగా గ్రిల్ చేసుకోవచ్చు. ఒకే రకాన్ని ఎక్కువ మోతాదులో వండుకోవాలనుకుంటే పార్టీషన్‌ను తీసేసే సౌకర్యమూ ఉంది. ట్రాన్స్పరెంట్ మూత ఉంటుంది. దాన్ని గాడ్జెట్‌కి ఇరువైపులా లాక్ చేసుకునే వీలుంటుంది. గాడ్జెట్ పైభాగంలో ఆప్షన్స్‌తో కూడిన రెగ్యులేటర్ ఉంటుంది. వెనుక వైపు కింది భాగంలో వ్యర్థాలు చేరే ట్రే ఉంటుంది. చదవండి: Viral: సింహాన్ని పరుగులు పెట్టించిన భౌభౌ!! ధర: 181 డాలర్లు (రూ.13,640) పోర్టబుల్ అవుట్ డోర్ గ్రిల్ ఇంట్లో ఉన్నప్పుడు పవర్ సాయంతో నడిచే మేకర్స్ సరే.. కానీ పిక్నిక్స్, హైకింగ్, క్యాంపింగ్‌లకు వెళ్లినప్పుడు ఎలక్ట్రిక్ సేవలు అందిపుచ్చుకోవడం ఎలా? ఆ సమస్యకు పరిష్కారమే ఈ అవుట్ డోర్ చార్కోల్ గ్రిల్. ఒక సూట్ కేస్లా వెంట తీసుకుని వెళ్లి.. అవసరమైనప్పుడు గ్రిల్ ప్లేట్స్‌ను చిత్రంలో చూపిన విధంగా అమర్చుకుని.. బొగ్గులపై క్రిస్పీ రుచులను తయారుచేసుకోవచ్చు. హైక్వాలిటీ మెటీరియల్‌తో రూపొందిన ఈ గాడ్జెట్ తుప్పు పట్టదు. దీన్ని పట్టుకున్నప్పుడు చేతులు గీసుకోకుండా, బట్టల్లోని దారపు పోగులను లాగకుండా అన్ని అంచులు చక్కగా పాలిష్ చే సి ఉంటాయి. ఇందులో ఒకేసారి ఇద్దరి నుంచి ఐదుగురికి సరిపడే ఆహారాన్ని తయారుచేసుకోవచ్చు. ధర: 34 డాలర్లు (రూ.2,562) మల్టీఫంక్షన్ బ్రేక్‌ఫాస్ట్ మేకర్ చిత్రాన్ని చూసి ఇదేదో హ్యాండ్ బ్యాగ్ అనుకునేరు! కాదు కాదు. ఇదో బ్రేక్‌ఫాస్ట్ మేకర్. అవును.. శాండ్విచ్, బ్రెడ్ టోస్ట్, వాఫిల్స్, గుంత పొంగనాలు ఇలా చాలా రుచులను నిమిషాల్లో అందించగలిగే కుక్వేర్. ఒకరిద్దరికి సరిపడే పరిమాణంలో చాలా వెరైటీలను ఇందులో తయారుచేసుకోవచ్చు. ఈ మేకర్‌తో పాటు ఒక జత గ్రిల్ ప్లేట్స్, మరో జత వాఫిల్స్ ప్లేట్స్, రెండు గుంతపొంగనాల ప్లేట్స్ లభిస్తాయి. అవి డీప్ నాన్–స్టిక్ కోటింగ్ ప్లేట్స్ కావడంతో.. మెషిన్‌కి అటాచ్ చేయడం, వేరు చేయడం చాలా సులభం. ఇక దీనిపైన చికెన్, ఫిష్, రొయ్యలు వంటివీ గ్రిల్ చేసుకోవచ్చు. కట్లెట్స్, కబాబ్స్ లాంటివీ వండుకోవచ్చు. మెషిన్ ఆన్ అయిన తర్వాత రెడ్ లైట్ పవర్ ఆన్ని సూచిస్తుంది. ఇది లైట్ వెయిట్ కావడంతో ఉపయోగించడం చాలా తేలిక. ధర: 214 డాలర్లు (రూ.16,127) చదవండి: దయచేసి ఒక్కసారి తుమ్మి మా పార్టీని గెలిపించండి..!! -
50 రూపాయలకే ఎమ్ఆర్ఐ స్కాన్
న్యూఢిల్లీ: దేశంలోనే అత్యంత తక్కువగా ఎమ్ఆర్ఐ స్కాన్ ను కేవలం రూ. 50 కే అందించనున్నట్లు ఢిల్లీ సిఖ్ గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీ చెప్పింది. గురుద్వారా ప్రాంగణంలోనే ఉన్న గురు హరిక్రిషన్ ఆస్పత్రిలో ఈ సేవలు అందించనున్నట్లు తెలిపింది. డిసెంబర్ మొదటి వారంలో ఆయా సేవలు మొదలవుతాయని చెప్పింది. ఈ ఆస్పత్రిలో డయాలసిస్ ను కేవలం రూ. 600కే అందిస్తామని కమిటీ అధ్యక్షుడు మన్జిందర్ సింగ్ చెప్పారు. పేదలకు ఎమ్ఆర్ఐ కేవలం రూ. 50కే అందిస్తామని తెలిపారు. ప్రైవేటు ల్యాబుల్లో ఎమ్ఆర్ఐ రూ. 2,500 వరకూ ఉంది. -
తక్కువ ధరకు కొన్నాం.. రూ.5,000 కోట్లు పొదుపుచేశాం!
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఏప్రిల్–మే నెలల్లో రెండు దశాబ్దాల కనిష్టానికి పడినప్పుడు, ఈ పరిస్థితిని భారత్ తనకు అనుకూలంగా మార్చుకుందని పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. తక్కువ ధర వద్ద భారీగా ముడి చమురును కొనుగోలుచేసి, తన మూడు వ్యూహాత్మక భూగర్భ చమురు నిల్వల క్షేత్రాలనూ నింపుకుందని వెల్లడించారు. తద్వారా రూ.5,000 కోట్లను భారత్ పొదుపుచేయగలిగిందని ఆయన వివరించారు. భారత్ తన మొత్తం క్రూడ్ ఆయిల్ అవసరాల్లో 85 శాతం దిగుమతులపైనే ఆధారపడుతున్న సంగతి తెలిసిందే. ప్రపంచంలో మూడవ అతిపెద్ద క్రూడ్ ఆయిల్ దిగుమతిదేశంగా భారత్ కొనసాగుతోంది. ఆయా అంశాలపై రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు ధర్మేంద్ర ప్రధాన్ ఇచ్చిన ఒక లిఖిత పూర్వక సమాధానంలో కొన్ని ముఖ్యాంశాలను చూస్తే... ► అంతర్జాతీయంగా భారీగా పడిపోయిన క్రూడ్ ఆయిల్ ధరలను అవకాశంగా తీసుకుని ఏప్రిల్, మే నెలల్లో భారత్ 16.71 మిలియన్ బేరళ్ల (ఎంబీబీఎల్)ను కొనుగోలుచేసింది. విశాఖపట్నం, మంగళూరు, పద్దూర్‌లలో నిర్మించిన వ్యూహాత్మక చమురు నిల్వల క్షేత్రాలను నింపుకుంది. ► సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్, ఇరాక్‌ల నుంచి ఈ కొనుగోళ్లు జరిగాయి. ► 2020 జనవరిలో బేరల్ 60 డాలర్లకు కొంటే, తదుపరి తక్కువ ధరకు కొనుగోళ్ల వల్ల సగటు వ్యయం బేరల్‌కు 19 డాలర్లకు పడిపోయింది. ► మంగళూరు నిల్వల సామర్థ్యం మొత్తం 1.5 మిలియన్ టన్నులు. మూడింటిలో పద్దూర్ నిల్వల సామర్థ్యం 2.6 మిలియన్ టన్నులు. విశాఖ విషయంలో ఈ సామర్థ్యం 1.33 మిలియన్ టన్నులు. ► 5.33 మిలియన్ టన్నుల అత్యవసర నిల్వ భారత్ 9.5 రోజుల అవసరాలకు సరిపోతుంది. భారత్ రిఫైనరీలు 65 రోజులకు సరిపడా క్రూడ్ నిల్వలను నిర్వహిస్తాయి. మూడు నిల్వ క్షేత్రాలనూ కలుపుకుంటే, 87 రోజులకు సరిపడా క్రూడ్ నిల్వలు భారత్ వద్ద ఉంటాయి. ఇంధన భద్రతకు సభ్య దేశాలకు ఐఈఏ నిర్దేశిస్తున్న చమురు నిల్వల స్థాయికి ఈ పరిమాణం దాదాపు చేరువగా ఉంది. -
ఐఫోన్ ప్రేమికులకు శుభవార్త
సాక్షి,న్యూఢిల్లీ: ఐ ఫోన్ ప్రేమికులకు శుభవార్త. బడ్జెట్ ధరలో ఐఫోన్. అసలు ఈ మాటే...వినియోగదారులకు వీనుల విందైన మాటల మూట. ఐఫోన్లపై వినియోగదారుల క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు ఆపిల్ కంపెనీ సన్నద్ధమవుతోంది. తక్కువ ధరలో ఐఫోన్‌ను త్వరలో విడుదల చేయనుంది. ఈ ఏడాది మార్చి నాటికి ఈ ఫోన్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానుంది. ఈ నేపథ్యంలో వచ్చేనెల ఫిబ్రవరి నుంచి ఈ కొత్త ఐఫోన్ విడిభాగాల అసెంబ్లింగ్‌ను ప్రారంభించనుంది.ఇందుకోసం హ్యాండ్సెట్ అసెంబ్లింగ్‌ను హాన్‌హయ్ ప్రీసీషన్ ఇండస్ట్రీ, పెగట్రాన్ కార్పోరేషన్, విస్ట్రన్ కార్పొరేషన్లకు అప్పగించింది. తద్వారా అటు వినియోగదారులకు ఆకట్టుకోవడంతోపాటు, భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తన స్థానాన్ని మరింత విస్తరించుకోవాలని ఆపిల్ భావిస్తోంది. ఐఫోన్ ఎస్ఈ తరువాత అతి తక్కువ ధరలో రానున్న మొదటి ఐఫోన్ మోడల్ ఇది కానుండటం విశేషం. 4.7అంగుళాల స్క్రీన్‌తో 2017లో వచ్చిన ఐఫోన్ 8 మాదిరిగానే ఉండనుందట. అలాగే ఆండ్రాయిడ్ ఫోన్ల మాదిరిగానే ఫింగర్ ప్రింట్ సెన్సర్‌ను అమర్చనుంది. 2020లో మరిన్ని కొత్త ఫీచర్లు, 5 జీ కనెక్టివిటి, పాస్టర్ ప్రొసెసర్, 3డి బ్యాక్ కెమెరా లాంటి ఫీచర్లతో హైఎండ్ ఐ ఫోన్లను అందుబాటులోకి తేవాలని యోచిస్తోంది. అలాగే 2020 లో 200 మిలియన్ యూనిట్లకు పైగా రవాణా చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది ఆపిల్. ఈ లక్ష్య సాధనలో రానున్న లోబడ్జెట్ ఐఫోన్ ముఖ్యమైన పాత్ర పోషించనుందని భావిస్తున్నారు. ప్రస్తుతానికి దీని ధరపై ఎలాంటి అంచనాలు లేవు. మరోవైపు ఈ వార్తలపై స్పందించడానికి ఆపిల్ ప్రతినిధి నిరాకరించారు. -
రైలులో రాయితీల కూత
సాక్షి, ఏలూరు (టూటౌన్) : భారతీయ రైల్వేలో రాయితీల కూత కూస్తుంది. అన్ని వర్గాల ప్రజలకు రైల్వే శాఖ అనేక రాయితీలను ఇస్తుంది. తక్కువ ఛార్జీలతో ప్రయాణికులకు అన్ని సదుపాయాలు కల్పిస్తూ గమ్యస్థానాలకు చేరుస్తోంది. దీనిలో విద్యార్థులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు, జర్నలిస్టులు, కళాకారులు, వృద్దులు, జాతీయ పురస్కార గ్రహీతలు, అమరవీరుల కుటుంబ సభ్యులు, క్రీడాకారులు, స్వాతంత్ర సమరయోధులు.. ఇలా ఎన్నో వర్గాలకు వివిధ రుపాల్లో రైల్వే రాయితీ కల్పిస్తుంది. ఇవి ఎలా పొందాలో అవగాహన లేకపోవడం వల్ల రైల్వేలో రాయితీ ప్రయాణాలను చాలా మంది పొందలేకపోతున్నారు. ఆయా వర్గాల వారు వారి శాఖలు అందించే అధికారిక గుర్తింపు కార్డులను రైల్వే అధికారులకు సమర్పిస్తే రాయితీలను పొందే అవకాశం ఉంటుంది. రైల్వేలో లభించే వివిధ రాయితీల వివరాలను మీకోసం ‘సాక్షి’ అందిస్తుంది. గుర్తింపుకార్డులు.. రైల్వే శాఖ ప్రకటించిన రాయితీలు పొందేందుకు జర్నలిస్టులు, కళాకారులు, క్రీడాకారులు ముందుగా రైల్వే అధికారుల నుంచి గుర్తింపు కార్డులు పొందాలి. మిగిలిన వర్గాల వారు వారికి సంబంధించిన అర్హత సర్టిఫికెట్లను రైల్వే బుకింగ్ కౌంటర్ వద్ద చూపించి రాయితీ పొందవచ్చును. అలాగే ధ్రువీకరణ పత్రాలను ప్రయాణ సమయంలో తప్పనిసరిగా వెంట తీసుకువెళ్లాలి. రైల్వే అధికారులు అడిగినప్పుడు వారికి చూపించాల్సి ఉంటుంది. విద్యార్థులకు ఉచిత పాస్‌లు.. పదో తరగతి వరకూ చదివే విద్యార్థులు, ఇంటర్ చదివే బాలికలకు మాత్రమే రైల్వేశాఖ ఉచిత ప్రయాణ పాసులను అందిస్తోంది. ఇందులో విద్యార్థి నివాస ప్రాంతం నుంచి స్కూల్, కాలేజీలకు వెళ్లి రావడానికి ఈ పాస్‌లను జారీ చేస్తారు. ఈ పాస్‌ల కోసం విద్యార్థులు రైల్వే కౌంటర్ నుంచి ప్రత్యేక దరఖాస్తులను తీసుకుని వాటిపై సంబంధిత ప్రధానోపాధ్యాయుల, కాలేజ్ ప్రిన్సిపాల్ చేత అటెస్టేషన్ చేయించాల్సి ఉంది. కాలేజీ విద్యార్థులకు సంబంధించి.. సగం చార్జీలకే కాలేజీ విద్యార్థులకు రైల్వే శాఖ సీజన్ టిక్కెట్లను జారీ చేస్తుంది. ఈ పాసులను మూడు నెలలకు ఒకేసారి తీసుకుంటే తగ్గింపు లభిస్తుంది. ఈ సీజన్ పాసులను రెండు ప్రాంతాల మధ్య 150 కిలోమీటర్లు లోపు ప్రయాణించే వారికి జారీ చేస్తారు. విద్యార్థి నివాసానికి, చదివే కాలేజీకి మధ్య ఈ దూరంను పరిగణలోనికి తీసుకుంటారు. జర్నలిస్టులకు 50 శాతం రాయితీ.. దేశవ్యాప్తంగా వివిధ పత్రికలు, ఛానెల్స్‌లో పనిచేసే అక్రిడేటెడ్ జర్నలిస్టులకు ప్రయాణ ఛార్జీల్లో 50 శాతం రాయితీని రైల్వే శాఖ ఇస్తుంది. ఈ పాసు ద్వారా జర్నలిస్ట్ ఏడాది పొడవునా, భార్య, ఇద్దరు పిల్లలు ఏడాదిలో రెండు పర్యాయాలు సగం చార్జీలతో ప్రయాణం చేయవచ్చు. 15 రోజుల చార్జితో నెలంతా ప్రయాణం.. సీజన్ టిక్కెట్ ప్రయాణికులు తాము ప్రయాణించే రెండు ప్రాంతాల మధ్య ఉన్న చార్జీని 15 రోజులకు ఒకేసారి చెల్లించి దీన్ని పొందవచ్చును. ఈ సీజన్ టిక్కెట్ ద్వారా నెలంతా ప్రయాణం చేసే అవకాశాన్ని రైల్వే శాఖ కల్పిస్తోంది. ప్రయాణ దూరం 150 కిలోమీటర్ల లోపు దీన్ని వర్తింప చేసేవారు. అయితే తాజాగా ఈ దూరాన్ని 180 కిలోమీటర్లకు పెంచారు. ప్రభుత్వ ఉద్యోగాల ఇంటర్వ్యూలకు వెళ్లే వారికి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరడానికి నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులకు జనరల్ విభాగంలో ఉచిత ప్రయాణ సౌకర్య కల్పిస్తారు. స్లీపర్ క్లాసులో అయితే 50 శాతం రాయితీని అందిస్తారు. అవార్డు గ్రహీతలకు.. రాష్ట్రపతి నుంచి పోలీస్ మెడల్, ఇండియన్ పోలీస్ మెడల్ సాధించిన పురుషులకు అన్ని రైళ్లలో 50 శాతం రాయితీని, మహిళలకు 60 శాతం రాయితీని ఇస్తారు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులకు 50 శాతం రాయితీతో సెకండ్ క్లాస్ స్లీపర్ క్లాసులో ప్రయాణించే వెసులుబాటును కల్పిస్తున్నారు. అమరవీరుల కుటుంబాలకు.. విధి నిర్వహణలో అసువులు బాసిన అమరవీరులకు, ఉగ్ర దాడుల్లో మరణించిన మిలటరీ దళాలు, పోలీసు కుటుంబాల సభ్యులకు జనరల్, స్లీపర్ ఛార్జీల్లో రాయితీని కల్పిస్తున్నారు. క్రీడాకారులకు... జాతీయ, రాష్ట్రస్థాయి క్రీడల్లో పాల్గొనే వారికి జనరల్, స్లీపర్ క్లాసుల్లో 75 శాతం ఫస్ట్ క్లాసుల్లో రాయితీని పొందవచ్చును. పర్వతారోహణల్లో పాల్గొనే వారికి కూడా ఇదే తరహాలో రాయితీలు వర్తిస్తాయి. వైద్యులకు, సివిల్ సర్వీస్ ఉద్యోగులకు.. అంతర్జాతీయ స్థాయిలో సివిల్ సర్వీస్ సేవలు అందిస్తున్న వారికి, సామాజిక, సాంస్కృతిక, విద్యారంగాల్లో అఖిల భారత సదస్సులకు హాజరయ్యే వైద్యులకు జనరల్, స్లీపర్ క్లాస్‌లలో 25 శాతం రాయితీని రైల్వే అందిస్తుంది. వి«ధులకు వెళ్లే నర్సులకు కూడా ఈ రాయితీ వర్తింస్తుంది. దివ్యాంగులకు.. శారీరక వైకల్యం, మానసిక రుగ్మతలతో బాధపడే వారు, అంధులకు జనరల్, స్లీపర్, థర్డ్ ఏసీలతో పాటు ఏసీ చైర్ కార్లో 75 శాతం రాయితీతో ప్రయాణించవచ్చు. ఫస్ట్‌క్లాస్, సెకండ్ క్లాస్ ఏసీల్లో 50 శాతం రాయితీ వస్తుంది. రాజధాని, శతాబ్ది రైళ్లల్లో 25 శాతం మినహాయింపు ఉంటుంది. వీరితో పాటు వెంట వెళ్లే సహాయకులకు కూడా టికెట్ ఛార్జీల్లో అంతే రాయితీ లభిస్తుంది. చెవిటి, మూగ (బధిరులకు) సెకంట్ క్లాస్, స్లీపర్ క్లాస్, ఫస్ట్ క్లాసు ఏసీల్లో 50 శాతం రాయితీ కల్పిస్తున్నారు. వృద్ధులకు.. సీనియర్ సిటిజన్లకు రైల్వే శాఖ రాయితీలను అందిస్తోంది. 60 సంవత్సరాలు నిండిన పురుషులకు 40 శాతం, 58 ఏళ్లు నిండిన మహిళలకు 50 శాతం చొప్పున రాయితీని కల్పిస్తున్నారు. ఈ రాయితీ అన్ని తరగతుల ప్రయాణ ఛార్జీలకు వర్తిస్తాయి. దీర్ఘకాలిక వ్యాధులతో భాధపడే వారికి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారు అనగా క్యాన్సర్ రోగులు తరచూ రైలులో ప్రయాణించాలంటే తరగతులను బట్టి 50 శాతం నుంచి 100 శాతం రాయితీని అమలు చేస్తున్నారు. వీరితో పాటు వీరికి సహాయకులుగా వెళ్లే వారికి ఇదే రాయితీ వర్తిస్తుంది. తలసేమియా, గుండె, కిడ్నీ, శస్త్ర చికిత్సలకు వెళ్లే వారికి 50 శాతం రాయితీని అందిస్తున్నారు. కుష్టు, హెచ్ఐవీ, అనీమియా, టీబీ రోగులకు 50 నుంచి 75 శాతం వరకూ రాయితీని ఇస్తున్నారు. కళాకారులు, కార్మికులకు.. కూరగాయలు అమ్ముకునే వారు, ఇళ్లల్లో పనిచేసేవారు, వ్యవసాయ కార్మికులు, నిర్మాణ రంగ కార్మికులకు 100 కిలోమీటర్ల పరిధిలో అత తక్కువ ధరకే సీజన్ టిక్కెట్లు అందిస్తోంది. ఈ రాయితీలు పొందాలంటూ టిక్కెట్‌కు ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేశారు. కళాకారులకు జనరల్, స్లీపర్ క్లాసుల్లో 75 శాతం, ఫస్ట్ క్లాస్ ఏసీ చైర్ కార్ 50 శాతం, సినీ సాంకేతిక నిపుణులకు విధుల్లో ప్రయాణించాలంటే స్లీపర్ క్లాసులో 75 శాతం, ఫ్లస్ట్ క్లాస్ ఏసీలో 50 శాతం రాయితీని రైల్వే శాఖ కల్పిస్తోంది. -
ధర తక్కువ.. ఫీచర్లు ఎక్కువ!
చైనా స్మార్ట్ఫోన్ల కంపెనీ ఐవోమి తన సరికొత్త ఫోన్‌ని భారత మార్కెట్లోకి లాంచ్ చేసింది. ‘ఐ2 లైట్’ పేరుతో ఈ ఫోన్ విడుదల చేసింది. ఈ ఫోన్ నేటి(బుధవారం) నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉండనున్నట్లు కంపెనీ ప్రకటించింది. కేవలం 6,499 రూపాయలకే బడ్జెట్ ధరలో లభిస్తున్న ఈ ఫోన్లో ఫీచర్లు మాత్రం అదిరిపోయేలా ఉన్నాయని కంపెనీ అధికారులు తెలిపారు. ఈ స్మార్ట్‌ఫోన్‌కు 5.42 అంగుళాల హెచ్డీ ప్లస్ డిస్ప్లే 18:9 యాక్సెప్ట్ రేషియో కలిగి ఉంది. మెయిన్‌స్ట్రీమ్ ఫోన్లు ఆఫర్ చేసే అన్ని ఫీచర్లను ఈ స్మార్ట్‌ఫోన్ అందిస్తోంది. ఈ ఫోన్ టాప్ ఫీచర్ అతిపెద్ద 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ. ఫేస్ అన్‌లాక్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్ వంటి ఫీచర్లు ఈ స్మార్ట్‌ఫోన్‌లోనూ ఉన్నాయి. 1.5 గిగాహెడ్జ్ క్వాడ్ కోడ్ ప్రాసెసర్‌తో ఈ ఫోన్ రూపొందింది. 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్‌తో పాటు 128 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమరీని ఇది కలిగి ఉంది. 2 మెగాపిక్సెల్, 13 మెగాపిక్సెల్లలో రెండు రియర్ కెమెరాలతో పాటు 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఉంది. పలుచైన బడ్జెట్ ఫోన్లలలో ఇదీ ఒకటి. ఈ స్మార్ట్ ఫోన్ మెర్క్యూరి బ్లాక్, సాటన్ గోల్డ్, మార్స్ రెడ్, నెప్ట్యూన్ బ్లూ వంటి నాలుగు వేర్వేరు రంగుల్లో లభ్యం కానుందని ఐవోమి కంపెనీ తెలిపింది. -
కేవలం రూ.3,990కే ‘డూ–ఎస్2’ స్మార్ట్‌ఫోన్
సాక్షి, సిటీబ్యూరో : ప్రముఖ మొబైల్ హ్యాండ్సెట్ల తయారీ సంస్థ డూ మొబైల్... తమ కొత్త ఎస్2 స్మార్ట్ ఫోన్‌ను సిటీ మార్కెట్లోకి విడుదల చేసింది. రియర్ 5.0ఎం.పి కెమెరా, 2ఎం.పి సెల్ఫీ కెమెరాలతో పాటు 5 అంగుళాల డిస్ప్లే, 1 జీబీ ర్యామ్‌లతో అత్యాధునిక ఫీచర్లు మరెన్నో కలిగిన ఈ ఫోన్‌ను రూ.3,990ధరలో వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చినట్టు కంపెనీ ప్రతినిధులు ఓ ప్రకటనలో తెలిపారు. -
నరికేస్తున్నారు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : పతనమవుతున్న ఆయిల్‌పామ్ గెలల ధరలు రైతులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించక.. మరోవైపు సబ్సిడీ అందక ఆయిల్‌పామ్ సాగు ప్రశ్నార్థకంగా మారింది. పెట్టుబడి కూడా రాకపోవడంతో రైతులకు నష్టాలే మిగులుతున్నాయి. దీంతో ఆయిల్‌పామ్ తోటలను నరికివేయడానికి సైతం రైతులు వెనకాడటం లేదు. ఈ ఏడాది జిల్లాలో ఇప్పటికే సుమారు 600 ఎకరాల్లో తోటలను తొలగించారు. దేశంలోనే ప్రథమం.. ధర అథమం దేశంలోనే అత్యధికంగా మన రాష్ట్రంలోనే ఆయిల్‌పామ్ పంట సాగవుతోంది. దేశవ్యాప్తంగా 5 లక్షల ఎకరాల్లో దీనిని సాగు చేస్తుంటే.. ఆంధ్రప్రదేశ్‌లో మూడు లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ తోటలు ఉన్నాయి. అందులోనూ మన జిల్లాలో అత్యధికంగా 1.30 లక్షల ఎకరాల్లో దీనిని సాగు చేస్తున్నారు. ఏటా రాష్ట్రంలో 10 లక్షల టన్నుల ఆయిల్‌పామ్ గెలల దిగుబడి వస్తున్నట్టు అంచనా. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్‌పామ్ రీసెర్చి సెంటర్ అంచనా ప్రకారం టన్ను అయిల్‌పామ్ గెలల ఉత్పత్తికి రూ.8,145 ఖర్చవుతోంది. ఇది నాలుగేళ్ల క్రితం నాటి అంచనా. ప్రస్తుతం చెల్లిస్తున్న ధర మాత్రం చెల్లిస్తున్న ధర మాత్రం రూ.7,400 లోపే ఉంటోంది. విదేశాల నుంచి దిగుమతి అవుతున్న ముడి పామాయిల్‌పై కేంద్ర ప్రభుత్వం సుంకాన్ని 12.5 శాతానికి తగ్గించడంతో దిగుమతులు పెరిగాయి. ఈ పోటీని తట్టుకోలేక దేశీయంగా ధర తగ్గించారు. గతేడాది మార్చిలో టన్ను గెలల ధర రూ.8,400 వరకు ఉంటే.. ప్రస్తుతం రూ.7,376కు పడిపోయింది. దీంతో రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. గెలల దిగుబడి జూన్ నుంచి ప్రారంభమవుతుంది. డిసెంబర్ వరకూ ఉంటుంది. ఈ సమయంలో ధరలు పడిపోతున్నాయి. దీంతో నష్టాలను తట్టుకోలేక రైతులు తోటలను నరికేస్తున్నారు. ఎకరానికి ఏటా రూ.40 వేలకు పైగా పెట్టుబడి అవుతోంది. కోత, రవాణా ఖర్చులు కలుపుకుంటే ఈ మొత్తం మరింత పెరుగుతోంది. అయితే, ఎకరానికి 7 టన్నుల దిగుబడి కూడా రావడం లేదు. పెట్టుబడులు సైతం దక్కకపోవడంతో రైతులు నష్టాల పాలవుతున్నారు. అంతర పంటగా వేసిన కోకోకు కూడా గిట్టుబాటు ధర దక్కడం లేదు. కేంద్రం దృష్టికి తీసుకెళ్లినా.. ఆయిల్‌పామ్ రైతులు తమ ఇబ్బందులను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. కేంద్రమంత్రి నిర్మలా సీతారామ¯ŒS ఈ రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అయితే, ఆ దిశగా అడుగులు పడటం లేదు. విదేశాల నుంచి దిగుమతి అవుతున్న ముడి పామాయిల్‌పై సుంకం విధించడంతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా సబ్సిడీ ప్రకటించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. వ్యవసాయ మంత్రిగా పనిచేసిన ప్రత్తిపాటి పుల్లారావు సైతం ఆయిల్‌పామ్‌కు గిట్టుబాటు ధర పెంచుతామని ప్రకటించినా వాస్తవ రూపం దాల్చలేదు. ఒకవైపు గిట్టుబాటు ధరరాక, మరోవైపు ప్రభుత్వ ప్రోత్సాహం లేక రైతులు నష్టాలతో ఈ పంటను పండించడానికి అంతగా ఇష్టపడటం లేదు. తోటలను తొలగించాలన్నా లక్షలాది రూపాయల ఖర్చవుతుండటంతో భరించలేక ఎటూ పాలుపోలేని స్థితిలో ఉన్నారు. టన్ను గెలలకు మద్దతు ధర రూ.10 వేలు ఇస్తేనే గట్టెక్కుతామని, ప్రభుత్వం ఇస్తామని చెప్పిన రూ.8,900 కూడా తమకు అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణాజిల్లా బిళ్లనపల్లి గ్రామానికి చెందిన ఈ రైతు పేరు కాకుమాను శ్రీనివాసరావు. కొన్నేళ్లుగా ద్వారకాతిరుమల మండలం సీహెచ్.పోతేపల్లిలో 20 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేస్తున్నారు. ఏటా ఎకరానికి రూ.40 వేలకు పైగా పెట్టుబడి అవుతోంది. కోత, కూలి ఖర్చులు దీనికి అదనం. ఎకరానికి గెలల దిగుబడి 7 టన్నులు కూడా రావడం లేదు. గెలలను కోయించి అమ్మితే ఖర్చులు కూడా దక్కడం లేదు. దీంతో ఏంచేయాలో దిక్కుతోచక చివరకు తోటల్లోని చెట్లను పొక్లెయిన్ సాయంతో ఇలా తొలగిస్తున్నారు. ఆయన స్వగ్రామమైన బిళ్లనపల్లిలో 15 ఎకరాల్లో వేసిన ఆయిల్‌పామ్ తోటను ఇప్పటికే తొలగించిన శ్రీనివాసరావు.. ఇప్పుడు సీహెచ్.పోతేపలి్లలోని తోటలను సైతం నరికిస్తున్నారు. ఎకరం తోట తొలగించడానికి రూ.4 వేల వరకు ఖర్చవుతోంది. ఈ పరిస్థితి శ్రీనివాసరావు ఒక్కరికే పరిమితం కాలేదు. జిల్లాలో ఆయిల్‌పామ్ సాగు చేస్తున్న రైతులందరి దుస్థితి ఇలాగే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ చూపట్లేదు ఆయిల్‌పామ్ రైతులపై రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదు. దీనివల్లే తోటలను తొలగిస్తున్నాం. నాకున్న 6 ఎకరాల తోటను తొలగించేందుకు నిర్ణయించుకున్నాను. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో చర్చించి పరిష్కారాన్ని చూపకుంటే రాబోయే రోజుల్లో ఆయిల్‌పామ్ సాగు ప్రశ్నార్థకమవుతుంది. – బసివిరెడ్డి వెంకటరామయ్య, సాయన్నపాలెం, ద్వారకాతిరుమల మండలం ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం పాలన సాగిస్తోంది. ఆయిల్‌పామ్ సాగు చేసే రైతుల్లో ఎక్కువ మంది టీడీపీ వాళ్లే ఉన్నారు. ప్రభుత్వ తీరుతో కక్కలేక మింగలేక సతమతమవు తున్నారు. మద్దతు ధర కల్పించకుంటే నష్టాలు భరిస్తూ ఎన్నాళ్లు సాగు చేస్తాం. చంద్రబాబు ఈ జిల్లాపై కపటప్రేమ నటిస్తూ రైతుల నడ్డి విరుస్తున్నారు. – నెక్కంటి రమేష్, రైతు, సీహెచ్.పోతేపల్లి, ద్వారకాతిరుమల మండలం -
ధరలేక దిగాలు
నల్లజర్ల : మార్చి నెల ముగుస్తున్నా నిమ్మ ధరలు పెరగకపోవడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. గతేడాది ఇదే సమయానికి కిలో రూ.40కి పైగా ఉండగా ప్రస్తుతం కిలో రూ.28 నుంచి రూ.32 మాత్రమే పలుకుతున్నాయి. నిమ్మకాయలకు వేసవి కాలమే ప్రధాన సీజన్ మిగిలిన కాలంలో పెద్దగా ధర రాదు. ఆ సమయంలో పంట పెట్టుబడులకు సరిపోతుంది. వేసవిలో ఎక్కువగా డిమాండ్ ఉంటుంది. ఈ సమయంలో అమ్మకాలపైనే రైతులకు లాభాలు ఆధారపడి ఉంటాయి. ఈ ఏడాది మార్చి నెల ముగింపు దశకు వచ్చినా ధరలో పెద్దగా మార్పు లేకపోవడంతో నష్టపోతున్నట్టు రైతులు గగ్గోలు పెడుతున్నారు. వచ్చే నెల నాటికి ధర పెరగకపోతే ఈ ఏడాది తీవ్రంగా నష్టపోతామని చెబుతున్నారు. నల్లజర్ల నిమ్మ మార్కెట్ నుంచి నిత్యం 200 బస్తాల వరకు ఇతర రాష్ట్రాలకు నిమ్మకాయలు ఎగుమతి అవుతుంటాయి. ఇక్కడి నుంచి గయ, వారణాసి తదతర ప్రాంతాలకు ఎగుమతులు బాగానే జరుగుతున్నాయి. ఏప్రిల్ నెలలోనై ధరలు పెరుగుతాయని రైతులు ఆశాభావంతో ఉన్నట్టు మార్కెట్ నిర్వాహకుడు పాతూరి చిన్నబ్బాయి తెలిపారు. -
కంది ‘మద్దతు’ దళారులకే..
రైతుల నుంచి తక్కువకు కొని ఎంఎస్పీకి సర్కారుకు విక్రయం సాక్షి, హైదరాబాద్: కందులకు ప్రభుత్వం ఇస్తున్న కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) రైతుల కు కాకుండా దళారులకే చేరుతోందన్న విమ ర్శలు వినవస్తున్నాయి. కందుల ధర మార్కె ట్లో పతనం కావడంతో ఈ పరిస్థితి ఏర్పడిం ది. గతేడాది కందుల ధర మార్కెట్లో క్వింటా లుకు రూ.10 వేల వరకు ఉండగా... ఈసారి ఏకంగా రూ. 4 వేలకు మించి పలకడం లేదు. అంటే రూ. 6 వేల వరకు ధర తగ్గింది. దీంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. గత్యంతర లేక దళారులను, వ్యాపారులను ఆశ్రయించి అదే ధరకు విక్రయిస్తున్నారు. ఇలా తక్కువ ధరకు కొనుగోలు చేసిన కందులను దళారు లు మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో నడిచే కొనుగోలు కేంద్రాల్లో ఎంఎస్పీకి విక్రయిస్తున్నారన్న విమర్శలున్నాయి. రైతుల పాసు పుస్తకాలు దగ్గర పెట్టుకొని కొందరు మార్క్‌ఫెడ్ అధికా రుల అండతో ఇలా చేస్తున్నట్లు తెలిసింది. 95 వేల టన్నులే సేకరణ... రాష్ట్రవ్యాప్తంగా 5.15 లక్షల మెట్రిక్ టన్నుల కంది దిగుబడులు రావొచ్చని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అయితే ఎఫ్‌సీఐ, నాఫెడ్ ద్వారా 50 వేల మెట్రిక్ టన్నులే కొనుగోలు చేస్తానని కేంద్రం ప్రకటించింది. మరోవైపు రాష్ట్రంలోని మార్క్‌ఫెడ్, హాకాల ద్వారా కేవలం 45 వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడానికి కేంద్రం అనుమతిచ్చింది. కొనుగోలుకు పరిమితి తక్కువ ఉండటంతో దళారులు, వ్యాపారులే ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారు. క్వింటాల్ కందులకు కేంద్రం ఎంఎస్పీ రూ. 5,050కి ఖరారు చేసింది. రైతుల నుంచి రూ. 4 వేల వరకు కొనుగోలు చేసే వ్యాపారులు సర్కారు కొనుగోలు కేంద్రాల్లో రూ. 5,050కు విక్రయిస్తున్నారు. దీంతో ఒక్కో క్వింటాలుకు ఏకంగా రూ. వెయ్యికి మించి లాభం పొందుతున్నారు. రైతు మాత్రం దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నాడు. 95 వేల మెట్రిక్ టన్నులే పరిమితి విధించడం వల్ల కొందరు అధికారులు.. దళారులకే మద్దతు పలుకు తున్నారన్న ఆరోపణలున్నాయి. మార్క్‌ఫెడ్ లెక్కల ప్రకారం ఇప్పటివరకు తెలంగాణలో సుమారు 6,500 మెట్రిక్ టన్నులను కొనుగోలు చేశారు. అందులో ఎక్కువ భాగం వ్యాపారుల నుంచే కొన్నారని తెలిసింది. ముందు ప్రోత్సహించి... ఇప్పుడు గాలికొదిలేశారు 2015 ఖరీఫ్‌లో రాష్ట్రంలో కేవలం 5.62 లక్షల ఎకరాల్లోనే కంది సాగైంది. అప్పట్లో కరువు పరిస్థితులు కూడా కంది దిగుబడిని దెబ్బకొట్టాయి. దీంతో ఈ ఏడాది ఖరీఫ్‌లో కంది సాగు విస్తీర్ణాన్ని పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం రైతులను ప్రోత్సహించింది. ఈ ఏడాది తెలంగాణలో ఖరీఫ్‌లో కంది సాధారణ సాగు విస్తీర్ణం 6.44 లక్షల ఎకరాలు కాగా.. ఈ ఏడాది ఏకంగా 10.30 లక్షల (168%) ఎకరాల్లో సాగైంది. రైతులను కందివైపు ప్రోత్సహించిన ప్రభుత్వం వారికి అవసరమైన ఎంఎస్పీ దక్కేలా పూర్తిస్థాయి చర్యలు తీసుకోవడంలేదన్న ఆరోపణలున్నాయి. రైతులు పండించే కందులను పూర్తిస్థాయిలో కొనుగోలు చేసేలా కేంద్రంపై ఒత్తిడి తేవాల్సి ఉంది. పండే మొత్తం కందిని ఎంఎస్పీకి కొనుగోలు చేస్తే.. దళారులకు కళ్లెం వేయడమే కాకుండా రైతులు కూడా బాగుపడే అవకాశం ఉంటుంది.