న్యూఢిల్లీ: దేశంలోనే అత్యంత తక్కువగా ఎమ్‌ఆర్‌ఐ స్కాన్ ను కేవలం రూ. 50 కే అందించనున్నట్లు ఢిల్లీ సిఖ్ గురుద్వారా మేనేజ్‌మెంట్ కమిటీ చెప్పింది. గురుద్వారా ప్రాంగణంలోనే ఉన్న గురు హరిక్రిషన్ ఆస్పత్రిలో ఈ సేవలు అందించనున్నట్లు తెలిపింది. డిసెంబర్ మొదటి వారంలో ఆయా సేవలు మొదలవుతాయని చెప్పింది. ఈ ఆస్పత్రిలో డయాలసిస్ ను కేవలం రూ. 600కే అందిస్తామని కమిటీ అధ్యక్షుడు మన్జిందర్ సింగ్ చెప్పారు. పేదలకు ఎమ్‌ఆర్‌ఐ కేవలం రూ. 50కే అందిస్తామని తెలిపారు. ప్రైవేటు ల్యాబుల్లో ఎమ్‌ఆర్‌ఐ రూ. 2,500 వరకూ ఉంది.
Comments
Please login to add a commentAdd a comment