MRI scan
-
ఆ ఒక్క ఇంజెక్షన్ చాలు,రీసెర్చ్‌లో ఏం తేలిందంటే..
రకరకాల కారణాలతో చాలామందిని వెన్నునొప్పి బాధిస్తుంటుంది. ఎప్పటికప్పుడు మాత్రలు మింగడం.. ఆ రోజు గడిపేయడం అంతే. అయితే అమెరికాలో జరిగిన ఓ పరిశోధన పుణ్యమా అని ఇకపై ఈ ఇబ్బంది తీరిపోనుంది. శరీరంలోని ఏ కణంలానైనా మారిపోగల సామర్థ్యమున్న మూలకణాలు కొన్నింటిని ఇంజెక్షన్ రూపంలో ఎక్కించుకుంటే మూడేళ్ల పాటు వెన్నునొప్పి దరి చేరదని రీసెర్చ్‌లో వెల్లడైంది. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో మెసోబ్లాస్ట్ అనే ఓ ఫార్మా కంపెనీ ఉంది.ఇటీవల వెన్నెముకలోని భాగాలు అరిగిపోయిన దాదాపు 100 మందికి మూలకణాలు అందించింది. వెన్నెముకలోని ఎముకల మధ్య ఉన్న ఖాళీల్లో ద్రవం పూర్తిగా ఇంకిపోయినప్పుడు చిన్నపాటి కదలికలకూ విపరీతమైన నొప్పి కలుగుతుంది. వారికి ఇతరుల ఎముక మజ్జలోంచి సేకరించిన మూలకణాలను ఎక్కించినప్పుడు వారిలో నొప్పి గణనీయంగా తగ్గిపోయినట్లు తెలిసింది. కొంతమందిలో దాదాపు రెండేళ్ల పాటు నొప్పి లేకపోగా.. కొంతమందికి సమస్య మూడేళ్ల తర్వాత గానీ తిరిగిరాలేదు. తాము పరిశోధనలు చేసిన వందమందిని ఎంఆర్ఐ స్కాన్ చేసినప్పుడు వెన్నెముకలోని సమస్యలు చాలా వరకూ తగ్గిపోయినట్లు తెలిసిందని మెసోబ్లాస్ట్ పరిశోధకులు తెలిపారు. -
ఎంఆర్ఐ స్కాన్ చేయించుకున్న ప్రపంచంలోనే తొలి పక్షి ఏంటో తెలుసా!
పక్షులకు, జంతువులకు ఏదైన సమస్య వస్తే మనుషుల మాదిరి ఆస్పత్రులకు వెళ్లడం, చికిత్స చేయించుకోవడం వంటివి ఉండవు. ప్రత్యేకంగా పెంచుకుంటేనో లేక పార్క్‌లో ఉంటేనో వాటి సంరక్షకులు వాటి బాగోగులు గమనించి వెటర్నరీ ఆస్పత్రులకు తీసుకువెళ్లడం జరుగుతోంది. వాటికి మహా అయితే ట్రీట్మెంట్ చేసి పంపిచేస్తారు గానీ స్కానింగ్‌లు వంటి ఉండవు. కానీ తొలిసారిగా ఒక పక్షి ఎంఆర్ఐ స్కాన్ చేయించుకుంది. ఇలాంటి స్కానింగ్ చేయించుకున్న తొలి పక్షిగా కూడా నిలిచింది. వివరాల్లోకెళ్తే..న్యూజిలాండ్ రాజధాని వెల్లింగ్టన్లోని అడ్వెంచర్ పార్క్‌లో ఉంటున్న చకా అనే పెంగ్విన్ పక్షి నిలబడటం, కదలికలకు సంబదించిన సమస్యలు ఎదుర్కొంటోంది. అందుకు గల కారణాలేంటో తెలుసుకునేందుకు వెటర్నరీ డాక్టర్లు పలు పరీక్షలు నిర్వహించారు. ఐతే ఎందువల్ల ఈ సమస్యను ఎదర్కొంటుందనేది తెయకపోవడంతో దానికి ఎంఆర్ఐ స్కానింగ్ చేయాలని నిర్ణయించారు వైద్యులు. అందులో భాగంగా ఈ చకా అనే పెంగ్విన్‌కి ఎంఆర్ఐ స్కాన్ చేయగా..అది ఏ మాత్రం భయపడకుండా ఏం జరుగుతుందా అని నిశితంగా గమనించింది. ఈ పరీక్షల తదనంతరం నెమ్మదిగా బ్యాలెన్స్ అవ్వడం, మిగతా పెంగ్విన్ పక్షుల మాదిరి చకచక నడవడం వంటివి చేయగలుగుతోంది. ప్రస్తుతం దాని ఆరోగ్య పరిస్థితి కూడా నిలకడగానే ఉందని అడ్వెంచర్ పార్క్ పేర్కొంది. దీంతో ప్రపంచంలోనే తొలిసారిగా ఎంఆర్ఐ స్కానింగ్ చేయించుకున్న తొలిపక్షి. ఈ స్కానింగ్ ప్రక్రియ అనేది సముద్ర జాతికి చెందిన పక్షులు, జంతువుల తోపాటు అభయరణ్యాలు, పార్క్‌ల్లో పెరిగే జంతువులు వంటి వాటి గురించి మరింత లోతుగా అధ్యయనం చేయడానికి ఎంతగానో ఉపకరిస్తుందని అంటున్నారు వైద్యులు. (చదవండి: అనూహ్యంగా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్..నలుగురు ప్రయాణికులు అరెస్టు) -
8 నిమిషాల్లోనే గుండె వైఫల్యం నిర్ధారణ
లండన్: సంప్రదాయ మ్యాగ్నెటిక్ రెజోనెన్స్ ఇమేజింగ్(ఎంఆర్ఐ) పరీక్ష ద్వారా గుండె వైఫల్యాన్ని గుర్తించేందుకు 20 నిమిషాలకుపైగా సమయం పడుతుంది. కానీ, కేవలం 8 నిమిషాల్లోనే గుర్తించే అత్యాధునిక సాంకేతికతను బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ ఆంగ్లియా పరిశోధకులు అభివృద్ధి చేశారు. అంటే ఎంఆర్ఐ పరీక్షతో పోలిస్తే సగం కంటే తక్కువ సమయంలోనే గుండె వైఫల్యాన్ని నిర్ధారించవచ్చు. దీనివల్ల సమస్యను 8 నిమిషాల్లోనే గుర్తించి, రోగులకు ప్రభావవంతమైన చికిత్స అందించవచ్చని పరిశోధకులు చెప్పారు. ఎంఆర్ఐతో సవివరమైన 4డీ ఫ్లో చిత్రాలను అభివృద్ధి చేసి, గుండె పనితీరును తెలుసుకోవచ్చని అన్నారు. ఈ టెక్నాలజీకి ‘4డీ ఫ్లో ఎంఆర్ఐ’ అని పేరు పెట్టారు. ఇందులో గుండె కవాటాలు, గుండె లోపలికి రక్తప్రవాహాన్ని స్పష్టం చూడవచ్చు. వీటిని బట్టి రోగులకు ఎలాంటి చికిత్స అందించాలన్నది వైద్యులు నిర్ణయించుకోవచ్చు. ఈ పరిశోధన వివరాలను యూరోపియన్ రేడియాలజీ ఎక్స్పరిమెంటల్ పత్రికలో ప్రచురించారు. హార్ట్ ఫెయిల్యూర్‌ను గుర్తించే విషయంలో ఇది విప్లవాత్మకమైన టెక్నాలజీ అని పరిశోధకులు వెల్లడించారు. -
సర్కారు ఆస్పత్రుల్లో సంతాన సాఫల్య కేంద్రాలు
గాంధీఆస్పత్రి: ఆరోగ్య తెలంగాణను ఆవిష్కరించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఆరోగ్య రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి రూ.11,440 కోట్లు కేటాయించిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గుర్తించిన ఆస్పత్రుల్లో సంతాన సాఫల్య కేంద్రాలను అందుబాటులోకి తెస్తామన్నారు. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో రూ.23 కోట్లతో ఏర్పాటు చేసిన అత్యాధునిక ఎమ్మారై స్కానింగ్ మిషన్, క్యాథ్‌ల్యాబ్‌లను ఆయన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రం లో తెలంగాణలోని ఆస్పత్రులు నిర్లక్ష్యానికి గురైతే.. కేసీఆర్ ప్రభుత్వం నగరం నలుదిక్కులా అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం చేపట్టిందన్నారు. త్వరలో గాంధీ, పేట్లబురుజు (హైదరాబాద్), వరంగల్ ఆస్పత్రుల్లో రూ.7.50 కోట్లతో సంతాన సాఫల్య కేంద్రాలను అందుబాటులోకి తెస్తామన్నారు. హైదరాబాద్‌లో 259 బస్తీ దవాఖానాలు ఉండగా, కొత్తగా 91 దవాఖానాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నూతన డైట్‌క్యాంటిన్ నిర్మాణం, 20వేల కిలోలీటర్ల సామర్థ్యం కలిగిన ఆక్సిజన్ ట్యాంక్‌లనూ హరీశ్‌రావు ప్రారం భించారు. కార్యక్రమంలో టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మ న్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్, డీఎంఈ రమేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పెంచింది చాంతాడు... తగ్గించింది బెత్తెడు పెట్రో ధరలను చాంతాడంత పెంచి, బెత్తెడు తగ్గించి తామే తగ్గించామని బీజేపీ ప్రభుత్వం చెప్పుకోవడం సిగ్గుచేటని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. 2014 మార్చిలో డీజిల్‌పై సెస్సు రూ.3.46 ఉండగా, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.31కి పెంచేశారన్నారు. ప్రజలను మభ్య పెట్టేందుకు మోదీ ప్రభుత్వం పిల్లిమొగ్గలు వేస్తోందని, ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బీజేపీకి ప్రజలు సరైన రీతిలో బుద్ధి చెబుతారన్నారు. -
మీ సేవలకు అభినందనలు
అధికారులందరికీ ఒక విజ్ఞప్తి. నా దగ్గర నుంచి పారిశుద్ధ్య కార్మికుడి వరకు కోవిడ్ వల్ల ఎదురయ్యే అనూహ్య పరిస్థితులను ఎదుర్కొనే ఒత్తిడిలో ఉన్నారు. ఆస్పత్రుల్లో వైద్యులు, నర్సులు, వార్డు బాయ్‌లు, శానిటేషన్ సిబ్బంది.. ఇలా ప్రతి ఒక్కరూ ఎంతో ఒత్తిడి మధ్య పని చేస్తున్నారు. కాబట్టి కింది వారికి నచ్చ చెప్పి పని చేయించుకోండి. ఆగ్రహిస్తే వచ్చేదేమీ లేదు. కాబట్టి ఎవ్వరూ సహనం కోల్పోవద్దు. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ‘కోవిడ్ సంక్షోభంలో ప్రతి ఆస్పత్రిలో వైద్యులు, నర్సులు, శానిటేషన్ సిబ్బందితో పాటు, గ్రామ స్థాయిలో ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, వలంటీర్లు పగలు.. రాత్రి కష్టపడుతున్నారు. చాలా బాగా పనిచేస్తూ ప్రజలకు సేవలందిస్తున్నారు. వీరి సేవల గురించి ఎంత పొగిడినా తక్కువే. కోవిడ్ సమయంలో ఎంతో మంచి సేవలందిస్తున్న మీ అందరికీ అభినందనలు’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. శ్రీకాకుళం, ఒంగోలు, నెల్లూరు, కడపలోని బోధనాస్పత్రుల్లో రూ.67 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన సీటీ స్కాన్లు, ఎంఆర్ఐ పరికరాలను బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రతి రోజూ 20 వేల కోవిడ్ కేసులు నమోదవుతున్నాయని, మన దగ్గర టయర్–1 సిటీ, ఆ స్థాయిలో ఆస్పత్రులు లేకపోయినా, దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ మరణాల రేటు చాలా తక్కువగా ఉందని చెప్పారు. మీరంతా (వైద్యులు, వైద్య సిబ్బంది) ఆస్పత్రుల్లో బా«ధ్యత తీసుకోవడమే కాకుండా, ఎంతో ఒత్తిడి ఉన్నా చిరునవ్వుతో పని చేస్తున్నారు కాబట్టే కోవిడ్‌ను ఎదుర్కోగలుగుతున్నామని అభినందించారు. అయితే ఫీవర్ సర్వే కొన్ని చోట్ల అనుకున్న విధంగా జరగలేదని కొందరు అధికారులు దిగువ స్థాయి సిబ్బందిపై చర్యలు తీసుకున్నారని తన దృష్టికి వచ్చిందని చెప్పారు. కరోనా మహమ్మారితో ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ఎంతో ఒత్తిడిలో ఉన్నారనే విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని, ఈ దృష్ట్యా అధికారులంతా మంచితనంతో తమ సిబ్బందితో పని చేయించుకోవాలని కలెక్టర్లు, జేసీలు, డీహెచ్‌ఎంఓలకు సూచించారు. ఈ సమీక్షలో సీఎం వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. నెల్లూరు, ఒంగోలు, కడప, శ్రీకాకుళం ప్రభుత్వ ఆస్పత్రుల్లోని వైద్య సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆస్పత్రుల్లో ఉన్నత ప్రమాణాలు ► ఉన్నత ప్రమాణాలతో ప్రభుత్వ ఆస్పత్రులను అభివృద్ధి చేస్తున్నాం. అన్ని బోధనాస్పత్రుల్లో డయాగ్నస్టిక్ సదుపాయాలు కల్పించి ఆరోగ్య శ్రీ పథకంలో ఉచితంగా వైద్య సేవలు, పరీక్షలు నిర్వహించనున్నాం. డయాగ్నస్టిక్ పరికరాల నిర్వహణ బాధ్యత ఆరోగ్య శ్రీ ట్రస్టుకు అప్పగిస్తాం. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రతి పార్లమెంటు నియోజవర్గంలో ఒక బోధనాస్పత్రి, నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నాం. ► ఈ రోజు రాష్ట్రంలో 11 టీచింగ్ ఆస్పత్రుల్లో కేవలం ఏడింటిలో మాత్రమే సీటీ స్కాన్, ఎంఆర్ఐ పరికరాలు ఉన్నాయి. అవి కూడా పీపీపీ పద్ధతిలో ఉన్నాయి. వాటిలో టెక్నాలజీ, క్వాలిటీ అప్‌గ్రేడేషన్ కూడా లేదు. ఈ పరిస్థితి మారాలని పలు చర్యలు తీసుకుంటున్నాము. ఆస్పత్రులను జాతీయ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేస్తున్నాము. ► ఇవాళ రూ.67 కోట్ల వ్యయంతో శ్రీకాకుళం, ఒంగోలు, నెల్లూరు, కడపలో సీటీ స్కాన్లు, కడప మినహా మూడు చోట్ల ఎంఆర్ఐ పరికరాలను ప్రారంభించాం. వీటికి మూడేళ్ల వారంటీ ఉంది. మరో ఏడేళ్లు సర్వీసు బాధ్యతను ఆ కంపెనీలు నిర్వహిస్తాయి. ఏ పేదవాడికైనా ఉచితంగా సేవలందించేలా, ప్రభుత్వ టీచింగ్ ఆస్పత్రుల్లో అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తాం. కొత్త ఆస్పత్రుల్లోనూ అన్ని సదుపాయాలు ► కొత్తగా ఏర్పాటు చేస్తున్న 16 టీచింగ్ ఆస్పత్రుల్లోనూ అన్ని సదుపాయాలు కల్పిస్తున్నాము. ఇప్పటికే ఉన్న 11 టీచింగ్ ఆస్పత్రులను నాడు–నేడు కింద అప్‌గ్రేడ్ చేయడంతో పాటు, కొత్తగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో టీచింగ్ ఆస్పత్రితో పాటు, నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నాం. వాటిలో టాప్ ఆఫ్ ది లైన్ డయాగ్నస్టిక్ సర్వీసులు అందించే దృక్పథంతో అడుగులు వేస్తున్నాము. ► టీచింగ్ ఆస్పత్రుల్లో సదుపాయాలన్నింటినీ ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువచ్చి, పథకం లబ్ధిదారులకు ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తాము. ఆ విధంగా డయాగ్నస్టిక్ సేవలు అందిస్తాము. మరోవైపు ఆరోగ్యశ్రీ ట్రస్టు వాటి నిర్వహణ వ్యయం భరిస్తుంది. ► ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని), విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్, ఏపీఎంఎస్ఐడీసీ వీసీ అండ్ ఎండీ వి.విజయరామరాజు, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్.గుల్జార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
సిటీస్కాన్, ఎంఆర్ఐ మిషన్లను ప్రారంభించిన సీఎం జగన్
-
కరోనా తీవ్రతతో మహిళ.. అంబులెన్స్‌లో అసభ్యకరంగా..
కొచ్చి: కరోనాతో బాధపడుతున్న బాధితులకు తమకు తోచిన విధంగా కొందరు సాయంచేస్తుంటే.. మరికొందరు ఏమీ చేయలేని వారి నిస్సహాయతను అదునుగా తీసుకుని వారిపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. ఇటీవల కరోనాతో తీవ్రంగా బాధపడుతున్న మహిళతో ఓ వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ ఘటన కేరళలోని మలప్పురం జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది. ఎంఆర్ఐ సెంటర్‌కు బాధితురాలిని తరలిస్తుండగా ఆమెపై అంబులెన్స్ అటెండెంట్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఏప్రిల్ 27న జరగింది. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పెరింతలమన పట్టణంలో బాధిత మహిళ ఇటీవల ప్రైవేట్ ఆస్పత్రిలో కరోనా చికిత్స నిమిత్తం చేరారు. ఆమె పరిస్థితి విషమం కావడంతో ఏప్రిల్ 27న అంబులెన్స్‌లో ఎంఆర్ఐ స్కానింగ్ కోసం ల్యాబ్‌కు తరలించమని వైద్యులు తెలిపారు. ఎంఆర్ఐ స్కానింగ్ సెంటర్‌కు తీసుకెళ్తుండగా అంబులెన్స్‌లో అటెండెంట్‌గా ఉన్న ప్రశాంత్ తనను లైంగికంగా వేధించాడని ఆమె వైద్యులకి తెలిపింది. బాధితురాలు పరిస్థితి అప్పడు తీవ్రంగా ఉన్నందున ఘటన జరిగిన వెంటనే ఈ చర్య గురించి తెలపలేకపోయింది. ఆరోగ్యం మెరుగుపడిన అనంతరం గురువారం (మే 13) వైద్యులకు ఈ విషయం వెల్లడించింది. వైద్యులు పోలీసులకు సమాచారం అందించడంతో నిందితుడు ప్రశాంత్‌పై పోలీసుల ఫిర్యాదు నమోదు చేసుకుని, అతడిని అదుపులోకి తీసుకున్నారు. ( చదవండి: మహిళ రెండో పెళ్లి.. ఉమ్మిని నాకాలని కుల పెద్దల శిక్ష ) -
కరోనా నుంచి కోలుకున్నా.. కొత్త ముప్పు!
సాక్షి, హైదరాబాద్: గోరుచుట్టుపై రోకటి పోటు అంటే ఇదేనేమో! ఒకవైపు రోజూ లక్షల మంది కోవిడ్ బారిన పడి అల్లాడుతుంటే.. మరోవైపు వైరస్ దాడి నుంచి ఎలాగో కోలుకున్న వారిలో కొందరు, ఓ కొత్త జబ్బుకు గురికావడం, మరణాలు సైతం సంభవిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. మ్యుకోర్మైకోసిస్ లేదా బ్లాక్ ఫంగస్ అనే ఈ వ్యాధి వైద్య నిపుణులను సైతం కలవరానికి గురి చేస్తోంది. ప్రస్తుతానికి ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లలో కోవిడ్ నుంచి బయటపడిన రోగులు కొందరిలో ఈ బ్లాక్ ఫంగస్ కనిపిస్తున్నట్లు సమాచారం. దీని లక్షణాలు కొంచెం భయం గొలిపేవిగానే ఉన్నప్పటికీ అతి తక్కువ మందిలోనే ఈ వ్యాధి కన్పించడం కాస్త ఊరటనిచ్చే అంశం. వీలైనంత త్వరగా గుర్తించడం ద్వారా మందులతోనే ఈ సమస్యను అధిగమించవచ్చని వైద్యులు చెబుతున్నారు. గత ఏడాదే వెలుగులోకి.. వాతావరణంలోనూ ఉండే మ్యుకోర్మైకోసిస్ అనే శిలీంద్రానికి గాలిద్వారా వ్యాపించే కోవిడ్–19తో సంబంధం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. గత ఏడాది కోవిడ్–19 తొలి దశలోనే దీన్ని కొన్నిచోట్ల గుర్తించారు. గతంలో దీన్ని జైగోమైకోసిస్ అని పిలిచేవారు. ఎవరికి సోకుతుంది? కోవిడ్–19 నుంచి కోలుకున్న వారికి సోకే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మధుమేహం, మూత్రపిండాల సమస్యలు, కేన్సర్లతో కోవిడ్–19కి గురైతే సమస్య మరింత జటిలమవుతుంది. అవయవ మార్పిడి జరిగిన వారు, స్టెరాయిడ్లు వాడుతున్న వారికీ ఈ శిలీంద్రంతో ముప్పు ఉంటుంది. అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం ఇది మధుమేహుల్లో ఎక్కువ కనిపిస్తుంటుంది. కోవిడ్ కంటే ముందు ఈ ఫంగస్ చాలా అరుదుగా మాత్రమే కనిపించేది. అయితే కోవిడ్ కారక కరోనా.. రోగ నిరోధక వ్యవస్థను బలహీన పరుస్తున్న విషయం తెలిసిందే. అలాగే మధుమేహులకు వైరస్ సోకే అవకాశం ఉండటం.. వారికి స్టెరాయిడ్లతో చికిత్స కల్పిస్తుండటం బ్లాక్ ఫంగస్ వ్యాప్తికి కారణమవుతోందని అంచనా. ఫంగస్ వల్ల జరిగిన జరుగుతున్న నష్టం తెలుసుకునేందుకు ఎమ్మారై స్కాన్ చేయాల్సి ఉంటుంది. ప్రాణాంతకమూ కావచ్చు: మ్యుకోర్‌మైకోసిస్‌ను సకాలంలో గుర్తించకపోయినా, చికిత్స చేయకపో యినా..అంధత్వం సంభవించవచ్చు లేదా ముక్కు, దవడ ఎముకలను తొలగించాల్సి రావచ్చు. కొన్ని సందర్భాల్లో మరణం సంభవించే అవకాశమూ ఉంటుంది. సకాలంలో గుర్తించకపోతే ఫంగస్ సోకిన వారిలో సగం మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. గుజరాత్‌లోని సూరత్ నగరంలో బ్లాక్‌ఫంగస్ బారిన పడ్డ సుమారు యాభై మందికి చికిత్స చేస్తుండగా.. ఇంకో అరవై మంది చికిత్స కోసం ఎదురుచూస్తున్నట్లు సమాచారం. వ్యాధి బారిన పడ్డ వారిలో ఏడుగురు చూపు కోల్పోయినట్లు తెలుస్తోంది. కోవిడ్ చికిత్సలో జాగ్రత్త వహించాలి కోవిడ్ రోగులకు ఆక్సిజన్‌తో చికిత్స కల్పిస్తున్న సందర్భంలో హ్యుమిడిఫయర్ నుంచి నీరు లీక్ కాకుండా జాగ్రత్త పడాలని, అలాగే టోసిలిజుమాబ్ వంటి స్టెరాయిడ్లను చాలా విచక్షణతో మాత్రమే ఉపయోగించాలని, తద్వారా బ్లాక్ ఫంగస్ వ్యాప్తిని కొంతవరకైనా అడ్డుకునే వీలేర్పడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. బ్లాక్ ఫంగస్ అంటే.. మ్యుకోర్మైకోసిస్ అనేది ఓ అరుదైన శిలీంద్రం. తేమతో కూడిన ఉపరితలాలపై ఎక్కువగా కనిపిస్తుంటుంది. నల్లగా బూజు పట్టినట్లు ఉండటం వల్ల దీన్ని బ్లాక్ ఫంగస్‌గా వ్యవహరిస్తున్నారు. ఇవీ లక్షణాలు: దీని బారిన పడిన వారిలో కనిపించే సాధారణ లక్షణాల్లో ముఖం ఒకవైపు వాపు ఉండటం ఒకటి. తలనొప్పి, ముక్కుదిబ్బడ, ముక్కు పైభాగంలో, లేదా నోటి లోపలి భాగంలో నల్లటి కురుపులు, జ్వరం, పాక్షిక దృష్టి లోపం, కళ్ల కింద నొప్పి వంటివి కొన్ని ఇతర లక్షణాలు. -
50 రూపాయలకే ఎమ్ఆర్ఐ స్కాన్
న్యూఢిల్లీ: దేశంలోనే అత్యంత తక్కువగా ఎమ్ఆర్ఐ స్కాన్ ను కేవలం రూ. 50 కే అందించనున్నట్లు ఢిల్లీ సిఖ్ గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీ చెప్పింది. గురుద్వారా ప్రాంగణంలోనే ఉన్న గురు హరిక్రిషన్ ఆస్పత్రిలో ఈ సేవలు అందించనున్నట్లు తెలిపింది. డిసెంబర్ మొదటి వారంలో ఆయా సేవలు మొదలవుతాయని చెప్పింది. ఈ ఆస్పత్రిలో డయాలసిస్ ను కేవలం రూ. 600కే అందిస్తామని కమిటీ అధ్యక్షుడు మన్జిందర్ సింగ్ చెప్పారు. పేదలకు ఎమ్ఆర్ఐ కేవలం రూ. 50కే అందిస్తామని తెలిపారు. ప్రైవేటు ల్యాబుల్లో ఎమ్ఆర్ఐ రూ. 2,500 వరకూ ఉంది. -
ఫ్రాక్చర్ లేకపోయినా నొప్పి తగ్గడం లేదు
నా వయసు 25 ఏళ్లు. ఈమధ్యే నేను బైక్‌పైనుంచి పడ్డాను. అప్పట్నుంచి నా మోకాలు కొద్దిగా వాచింది. నొప్పి ఎంతగా ఉంటోందంటే ఒక్కోసారి అస్సలు దానిపై భారం వేయలేకపోతున్నాను. కాలు కింద పెట్టలేకపోతున్నాను. డాక్టర్‌కు చూపిస్తే ఎక్స్‌రే తీసి ఫ్రాక్చర్ ఏదీ లేదని చెప్పారు. అయినప్పటికీ నొప్పి మాత్రం తగ్గడం లేదు. దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి. ఫ్రాక్చర్ లేనప్పటికీ మీకు బహుశా మోకాలిలో ఉన్న కీలకమైన లిగమెంట్లు చీరుకుపోయి ఉండవచ్చు. ఇలాంటి గాయాలు బైక్ యాక్సిడెంట్లలో చాలా సాధారణంగా జరుగుతుంటాయి. లిగమెంట్లు చీరుకుపోవడం వంటి గాయాలు ఎక్స్–రేలో కనిపించవచ్చు. దీనికోసం ఎమ్మారై స్కాన్ అవసరం. ఇలాంటి గాయాలకు చాలా త్వరగా చికిత్స అందించాలి. ఉద్దేశపూర్వకంగా కాకపోయినా... ఎలాంటి ఫ్రాక్చర్ లేదనే అపోహతో చికిత్స ఆలస్యం చేసినట్లయితే మీలాంటి యువకుల్లో భవిష్యత్తులో అది మరింత సమస్యాత్మకంగా పరిణమించవచ్చు. మీరు వీలైనంత త్వరగా ఆర్థోపెడిక్ సర్జన్‌ను సంప్రదించండి. -
క్యాథ్‌ల్యాబ్, ఎంఆర్‌ఐలకు సుస్తీ
సాక్షి, హైదరాబాద్: ‘చిత్రంలో కన్పిస్తున్న ఈమె పేరు తస్లిభాను. ఇటీవల ఈమె మెదడులో రక్తం గడ్డకట్టింది. చికిత్స కోసం ఉస్మానియాకు వచ్చింది. మెదడులో ఏర్పడ్డ రక్తం గడ్డలు ఏ మేరకు ఉన్నాయో నిర్ధారించేందుకు ఎంఆర్ఐ తీయించాల్సిందిగా సూచించారు. ఆస్పత్రిలో ఎంఆర్ఐ పని చేయడంలేదని, బయట చేయించుకుందామంటే తన వద్ద డబ్బులు లేవని ఆవేదన వ్యక్తం చేసింది. ఎంఆర్ఐ రిపోర్టు వచ్చే వరకు మందులు రాయనని వైద్యుడు చెప్పడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉంది’. ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో 20 రోజులుగా ఎం ఆర్ఐ మిషన్ పనిచేయడం లేదు. 2007లో దీన్ని ఏర్పాటు చేశారు. రోజంతా విరామం లేకుండా పనిచేయడంతో మిషన్‌లో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. గతంలో ఆయా ఆస్పత్రులే వార్షిక నిర్వహణ కింద మరమ్మతులు చేయించుకునేవి. 6 మాసాల క్రితం టీఎస్ఎంఐడీసీ.. చెన్నైకి చెందిన ఓ సంస్థకు ఈ పనులను అప్పగించింది. పాత బకాయిలు చెల్లిస్తే కానీ యంత్రాలకు మరమ్మతులు చేయమని సదరు సంస్థ భీష్మించుకుని కూర్చుంది. చేసేది లేక చాలామంది రోగులు ప్రైవేటు డయాగ్నస్టిక్ సెంటర్లను ఆశ్రయించాల్సి వస్తోంది. ఒక్కో టెస్టుకు రూ.8 వేల నుంచి రూ.12 వేల వరకు చెల్లించుకోవాల్సి వస్తుంది. క్యాథ్‌ల్యాబ్ అంతే..: ఎంఆర్ఐతో పాటు హృద్రోగ విభాగంలో కీలకమైన క్యాథ్ ల్యాబ్ వారం రోజులుగా పని చేయడం లేదు. హృద్రోగ సమస్యతో బాధపడుతూ అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రికి చేరుకుంటున్న రోగులకు కనీస వైద్యసేవలు అందడం లేదు. రోజుకు సగటున 10 మందికి యాంజియోగ్రామ్ నిర్వహిస్తుంటారు. ప్రస్తుతం ఇక్కడ క్యాథ్‌ల్యాబ్ పనిచేయకపోవడంతో రోగులు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎం ఆర్ఐ సహా క్యాథ్‌ల్యాబ్ నిర్వహణ బాధ్యత కూడా సదరు సంస్థదే. నిజానికి క్యాథ్‌ల్యాబ్‌పై ఎలాంటి బకాయిలు లేవు. కానీ సదరు సంస్థ రిపేరు చేసేందుకు నిరాకరిస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో రోగులను ఇతర ఆస్పత్రులకు సిఫార్సు చేసి చేతులు దులుపుకుంటున్నారు. -
ఎమ్ఆర్ఐ స్కాన్‌కు వెళ్లి మరణించాడు
-
ఎమ్మారై కావాలా.. 2018లో రండి!
దేశ రాజధానిలోని ప్రభుత్వాస్పత్రుల పరిస్థితి ఘోరంగా ఉంది. అక్కడ ఉన్న మొత్తం 34 ప్రభుత్వాస్పత్రులలో 11 వేల బెడ్లు ఉండగా, వచ్చే పేషెంట్ల సంఖ్య మాత్రం 50 వేలకు పైగా ఉంది. ఏదైనా పెద్ద దెబ్బ తగిలి గానీ, తీవ్ర అనారోగ్యంతో ఉండి గానీ ఎమ్మారై తీయించుకోవాలంటే.. 2018 వరకు ఆగాలి. ప్రైవేటు ఆస్పత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్లోల అయితే ఎమ్మారై పరీక్షకు దాదాపు రూ. 5 వేల వరకు ఖర్చవుతుంది. అదే ప్రభుత్వాస్పత్రులలో అయితే ఉచితంగా చేస్తారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అన్ని పరీక్షలు ఉచితంగా చేస్తామని ఆప్ ప్రభుత్వం ప్రకటించడంతో వీటికోసం ప్రభుత్వాస్పత్రులకు వచ్చేవారి సంఖ్య బాగా పెరిగిపోయి, వేచి ఉండాల్సిన సమయం మరో ఏడాది పెరిగిందని ఆస్పత్రుల వర్గాలు చెబుతున్నాయి. ఆస్పత్రులలో సదుపాయాలు, ఉద్యోగుల సంఖ్యను ఏమాత్రం పెంచకుండా ఇలా ఉచితంగా చేస్తామనడం వల్లే ఇలా జరగిందంటున్నారు. ఉచితానికి ముందు సబ్సిడీ చార్జీలతో ఎమ్మారై తీయించుకోవాలంటే రూ. 1200 నుంచి రూ. 3వేల వరకు అయ్యేది. కొత్తగా ఐదు ఎమ్మారై మిషన్లు, 10 సిటి స్కాన్ మిషన్ల కొనుగోలుకు టెండర్లు పిలిచామని, త్వరలోనే కొత్త ఎమ్మారై యంత్రాలు తీసుకుంటామని ఢిల్లీ ఆరోగ్యశాఖ కార్యదర్శి తరుణ్ సీమ్ చెప్పారు. ఒక మహిళకు గత నెలలో ఉన్నట్టుండి కణితి వచ్చింది. ఆమెకు 8 గంటల్లోగా ఆపరేషన్ చేయించాలని అన్నారు. ఆమెకు వెంటనే ఎమ్మారై చేయించాల్సి ఉండగా.. 15 రోజుల తర్వాత గానీ చేయలేమని చెప్పారు. దాంతో ఆ కుటుంబం స్థోమత లేకపోయినా ప్రైవేటు డయాగ్నస్టిక్ కేంద్రంలోనే ఎమ్మారై చేయించుకుంది. లోక్ నాయక్, జీబీ పంత్.. ఇలాంటి ప్రధాన ఆస్పత్రుల్లోనూ ఇదే పరిస్థితి. లోక్ నాయక్ ఆస్పత్రిలో ఎమ్మారై మిషన్ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పనిచేస్తూనే ఉంటుంది. ప్రస్తుతం ఎమ్మారై మిషన్ల ఖరీదు రూ. 4 కోట్ల నుంచి రూ. 14 కోట్ల వరకు ఉన్నాయి. అయినా, ఢిల్లీ ప్రభుత్వం గత సంవత్సరం లోక్ నాయక్ ఆస్పత్రి కోసం కొన్న మిషన్‌కు రూ. 15.35 కోట్లు వెచ్చించింది. మరి ఇప్పుడున్న డిమాండును అందుకోడానికి ఎన్ని మిషన్లు తీసుకుంటారో.. అందుకు ఎంత ఖర్చుపెడతారో చూడాల్సి ఉంది. -
‘సూపర్’ దోపిడీ
=అవసరం లేకున్నా టెస్టులు రాసేస్తున్న వైద్యులు =రోగ నిర్ధారణ పేరుతో నిలువు దోపిడీ =ఒక్కో ఆస్పత్రిలో ఒక్కో రేటు =టెక్నాలజీ పెరిగినా తగ్గని ఖర్చులు =ఇదీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల తీరు సాక్షి, సిటీబ్యూరో : తలనొప్పికి ఎంఆర్ఐ స్కాన్... అసిడిటీకి టూడీ ఎకో టెస్ట్.. మోకాలి నొప్పికి.. స్పైన్ ఎక్స్‌రే.. ఇదీ నగరంలో పలు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల తీరు. ‘అవసరమున్నా లేకున్నా ఎడాపెడా టెస్టులు రాసేయ్... అందిన కాడికి రోగులను దోచేయ్’ అన్న సూత్రాన్ని ఒంటబట్టించుకొని వైద్యాన్ని వైట్ కాలర్ వ్యాపారంగా మార్చేస్తున్నాయవి. రోగనిర్ధారణ పరీక్షల పేరుతో పేషెంట్లను నిలువుదోపిడీ చేసేస్తున్నాయి. ప్రభుత్వం నుంచి పలు రాయితీలు పొందే ఈ ‘సూపర్’ ఆస్పత్రులు.. ఆ మేరకు ఉచిత సేవలందించే బాధ్యత మాత్రం విస్మరిస్తున్నాయి. ఓ సాధారణ డయాగ్నోస్టిక్స్‌లో సీబీపీ (కంప్లీట్ బ్లడ్ పిక్చర్)కి రూ.50 ఖర్చు అవుతుంది. కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఇదే పరీక్షకు రూ.350కి పైగా ఖర్చు చేయాల్సి వస్తోంది. చెస్ట్ ఎక్స్‌రేకు బయట రూ.100-150 ఖర్చు అవుతుండగా, కార్పొరేట్ ఆస్పత్రుల్లో మాత్రం రూ.500 వరకు చార్జీ చేస్తున్నారు. అదే విధంగా తెల్లరేషన్ కార్డులేని రోగులకు గాంధీలో ఎంఆర్ఐ బ్రెయిన్ టెస్ట్‌కు రూ.2000 చార్జీ చేస్తుండగా, ప్రైవేటు ఆస్పత్రుల్లో రూ. 8500 నుంచి రూ. 12,000 వరకు వసూలు చేస్తున్నారు. నిజానికి గత పదేళ్లతో పోలిస్తే నగరంలో డయాగ్నోస్టిక్ సెం టర్ల సంఖ్యతోపాటు సాంకేతిక పరిజ్ఞానం కూడా పెరిగింది. అదేస్థాయిలో ఆయా టెస్టుల కోసం ఉపయోగించే మిషనరీ ఖర్చులు కూడా భారీగా తగ్గాయి. కానీ వైద్య పరీక్షల ఖర్చులు తగ్గకపోగా, భారీగా పెరగడాన్ని పరిశీలిస్తే రోగ నిర్ధారణ పేరుతో కార్పొరేట్ ఆస్పత్రులు ఏ స్థాయిలో దోపిడీకి పాల్పడుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఒకే టెస్టు, ఒకే కంపెనీ మిషన్, కానీ రోగ నిర్ధారణ పరీక్షల పేరుతో ఆస్పత్రులు వసూలు చేస్తున్న చార్జీల్లో మాత్రం భారీగా వ్యత్యాసం కానవస్తోంది. వైద్యులకూ టార్గెట్లు... నగరంలోని పలు కార్పోరేట్ ఆస్పత్రులు అందులో పనిచేస్తున్న వైద్యులకు టార్గెట్లు పెడుతున్నాయి. దీంతో వారు అవసరం లేకపోయినా రోగనిర్ధారణ పరీక్షలు రాస్తున్నారు. సాధారణ జ్వరంతో బాధపడుతున్న రోగికి సీబీపీ, సీయూఎస్, ప్లేట్లెట్స్ కౌంట్ టెస్టులతో పాటు జబ్బుతో సంబంధం లేని పరీక్షలు రాస్తున్నారంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. ‘నేను కొంతకాలంగా ఛాతీలో మంట, గ్యాస్ట్రిక్ ట్రబుల్ వంటి సమస్యతో బాధపడుతున్నాను. వైద్యుడికి చూపించుకుందామని ఎర్రమంజిల్ సమీపంలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి వెళ్తే, అక్కడి వైద్యులు ఎండోస్కోపి, కొలనోస్కోపిలే కాదు, సమస్యతో సంబంధం లేని సీబీపీ, సీయూపీ, ఈసీజీ, టూడీఎకో వంటి టెస్టులన్నీ రాశారు. వైద్యులు సిఫార్సు చేశారు కదా! అని ఆయా పరీక్షలన్ని చేయించుకుని రిపోర్టులు తీసుకెళ్లి సంబంధిత వైద్యుడికి చూపిస్తే కడుపులో ఏమీ లేదన్నారు. చివ రకు మసాలాలు కలిగిన ఆహారం తగ్గిస్తే సరిపోతుందన్నారు’ అని బంజారాహిల్స్‌కు చెందిన రఘురామ్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘నాకు ఇటీవల మోకాళ్ల నొప్పులు ఎక్కువయ్యాయి. ప్యారడైజ్‌లోని ఓ ఆస్పత్రికి వెళ్తే స్పైన్ ఎక్స్‌రే, సీటీస్కాన్, ఎంఆర్ఐ వంటి టెస్టులన్నీ రాసి రూ.50 వేలకు పైగా బిల్లు వేసి చేతికిచ్చారు. పరీక్షలన్నీ చేయించుకురి రిపోర్టులు తీసుకుని వైద్యుడి వద్దకు వెళ్తే ఏ సమస్య లేదని చెప్పి పంపారు’ అని నల్లగొండకు చెందిన రవీందర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ‘రోగుల ఆర్థిక పరిస్థితి చూస్తే జాలేస్తుంది. కానీ మేము మాత్రం ఏమి చేయగలం. ఆస్పత్రిలో వేతనం తీసుకుంటున్నందుకు యాజమాన్యం చెప్పినట్లు వినాల్సి వస్తోంది. అవసరం లేకపోయినా ఆస్పత్రి అవసరాల దృష్ట్యా రోగ నిర్ధారణ పరీక్షలు రాయాల్సి వస్తోంది. లేదంటే వైద్యులకూ పనిష్మెంట్లు తప్పడం లేదు’ అని సోమాజిగూడలోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రిలో పనిచేస్తున్న ఓ సీనియర్ కార్డియాలజిస్ట్ ఆవేదన వ్యక్తం చేశారు. రాయితీలు పొందినా.. ఉచిత సేవలేవి? రోగ నిర్ధారణలో కీలకమైన ఎంఆర్ఐ, సీటీస్కాన్, ఆల్ట్రాసౌండ్ స్కానింగ్, ఎండోస్కోపి, కొలనోస్కోపి, ఎక్స్‌రే తదితర మిషన్లలో చాలావరకు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నవే. ప్రభుత్వం వీటికి రాయితీ కూడా ఇస్తుంది. మిషనరీపై ప్రభుత్వం నుంచి రాయితీ పొందినందుకు గానూ ఒప్పందం ప్రకారం ఆస్పత్రుల్లో 20 శాతం ఉచిత సేవలు అందించాల్సి ఉండగా.. నగరంలోని ఏ ఒక్క ఆస్పత్రి కూడా ఈ నిబంధనలు పాటించడం లేదు. చివరకు వైద్య సేవల పేరుతో ఆస్పత్రుల ఏర్పాటు కోసం ప్రభుత్వం నుంచి ఖరీదైన భూములు పొందిన వైద్యులు సైతం వీటిని అమలు చేయడం లేదు. డయాగ్నోస్టిక్ సెంటర్లోనూ, ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రుల్లోనూ ఒకే కంపెనీకి చెందిన ఎంఆర్ఐ, సిటీస్కాన్, ఆల్ట్రాసౌండ్, ఎక్స్‌రే యంత్రాలే ఉన్నా... టెస్టుల పేరుతో అవి వసూలు చేస్తున్న చార్జీల్లో మాత్రం భారీ వ్యత్యాసం కన్పిస్తూ ఉండటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పెరుగుతున్న ఈ రోగ నిర్ధారణ ఖర్చులను ఎప్పటికప్పుడు నియంత్రించాల్సిన ప్రభుత్వం వీటిని పట్టించుకోవడం లేదు. నిర్వహణ వ్యయం పెరగడం వల్లే.. నిజానికి ఆస్పత్రులతో పాటు ఎంఆర్ఐ, సీటీస్కాన్, ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ వంటి యంత్రాల సంఖ్య పెరిగినప్పుడు రోగ నిర్ధారణ పరీక్షల ఖర్చు తగ్గాలి. కానీ గత పదేళ్లతో పోలిస్తే ఆస్పత్రుల నిర్వహణ వ్యయం రెట్టింపైంది. దీనికి తోడు పదేళ్ల క్రితం ఎంఆర్ఐ ధర రూ.1.5 కోట్లు ఉంటే, ప్రస్తుతం రూ.3-6 కోట్లకు చేరింది. పెరిగిన ధరల భారాన్ని రోగులపై మోపక తప్పడం లేదు. - డాక్టర్ భాస్కర్‌రావు, ప్రెసిడెంట్, ఆంధ్రప్రదేశ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ వైట్‌కాలర్ వ్యాపారమైన వైద్యం మానవతా దృక్పథంతో వ్యవహరించాల్సిన కొన్ని కార్పొరేట్ ఆస్పత్రులు.. వైద్యాన్ని వైట్ కాలర్ వ్యాపారంగా మార్చేశాయి. ఇక్కడ పనిచేస్తున్న కొంతమంది వైద్యులు రోగుల ఆరోగ్య, ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా అవసరం లేకపోయినా ప్రతి చిన్న సమస్యకూ ఎంఆర్ఐ వంటి ఖరీదైన టెస్టులు రాస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులపై తప్పుడు ప్రచారం చేస్తూ రోగుల దృష్టిని మరల్చుతున్నారు. - డాక్టర్ నాగేందర్, ఉస్మానియా శాఖ అధ్యక్షుడు, తెలంగాణ వైద్యుల సంఘం తలనొప్పితో వెళ్తే ఎంఆర్ఐ రాశారు ఇటీవల తలనొప్పి రావడంతో కొత్తపేటలోని ఓ ఆస్పత్రికి వెళ్లాను. అక్కడి వైద్యుడు ఎంఆర్ఐ తీసుకోవాలన్నాడు. రూ.8500 చెల్లించి బ్రెయిన్ ఎంఆర్ఐ తీయించాను. రిపోర్టు తీసుకుని మళ్లీ వైద్యుడి వద్దకు వెళ్తే, తీరా ఏమీ లేదని చెప్పి సాధారణ తలనొప్పి మాత్రలు రాసి పంపారు. - ఎన్.కేశవరాజు, నల్లగొండ