న్యూఢిల్లీ: మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చితాభస్మాన్ని కుటుంబసభ్యులు సిక్కు ఆచారాల ప్రకారం ఆదివారం మజ్జు కా తిలా గురుద్వారా సమీపంలోని యమునా నదిలో కలిపారు. ఆదివారం ఉదయం నిగమ్‌బోధ్ ఘాట్‌లో చితాభస్మాన్ని కుటుంబసభ్యులు సేకరించారు. మనోహ్మన్ భార్య గురుశరణ్ కౌర్, ముగ్గురు కుమార్తెలు ఉపీందర్ సింగ్, దమన్ సింగ్, అమృత్ సింగ్ తమ బంధువులతో కలిసి నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు.
సిక్కు మతాచారాలను అనుసరించి జనవరి ఒకటో తేదీన మన్మోహన్ అధికార నివాసం మోతీలాల్ నెహ్రూ మార్గ్‌లోని మూడో నంబర్ భవనంలో ‘అఖండ్ పథ్’జరపనున్నారు. దీంతోపాటు, జనవరి 3న భోగ్, అంతిమ్ అర్దాస్, కీర్తన్ కార్యక్రమాలను పార్లమెంట్ కాంప్లెక్స్ సమీపంలోని రకాబ్ గంజ్ గురుద్వారా నిర్వహించనున్నారు. కాగా, ఆదివారం జరిగిన కార్యక్రమాల్లో కాంగ్రెస్ నేతలెవరూ పాల్గొనకపోవడాన్ని బీజేపీ తప్పుపట్టింది. అత్యంత గౌరవనీయుడైన సింగ్ జీ పట్ల కాంగ్రెస్ తీరు విచారకరమని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment