Ashes
-
మన్మోహన్ చితాభస్మం నిమజ్జనం
న్యూఢిల్లీ: మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చితాభస్మాన్ని కుటుంబసభ్యులు సిక్కు ఆచారాల ప్రకారం ఆదివారం మజ్జు కా తిలా గురుద్వారా సమీపంలోని యమునా నదిలో కలిపారు. ఆదివారం ఉదయం నిగమ్‌బోధ్ ఘాట్‌లో చితాభస్మాన్ని కుటుంబసభ్యులు సేకరించారు. మనోహ్మన్ భార్య గురుశరణ్ కౌర్, ముగ్గురు కుమార్తెలు ఉపీందర్ సింగ్, దమన్ సింగ్, అమృత్ సింగ్ తమ బంధువులతో కలిసి నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు. సిక్కు మతాచారాలను అనుసరించి జనవరి ఒకటో తేదీన మన్మోహన్ అధికార నివాసం మోతీలాల్ నెహ్రూ మార్గ్‌లోని మూడో నంబర్ భవనంలో ‘అఖండ్ పథ్’జరపనున్నారు. దీంతోపాటు, జనవరి 3న భోగ్, అంతిమ్ అర్దాస్, కీర్తన్ కార్యక్రమాలను పార్లమెంట్ కాంప్లెక్స్ సమీపంలోని రకాబ్ గంజ్ గురుద్వారా నిర్వహించనున్నారు. కాగా, ఆదివారం జరిగిన కార్యక్రమాల్లో కాంగ్రెస్ నేతలెవరూ పాల్గొనకపోవడాన్ని బీజేపీ తప్పుపట్టింది. అత్యంత గౌరవనీయుడైన సింగ్ జీ పట్ల కాంగ్రెస్ తీరు విచారకరమని పేర్కొంది. -
బుద్ధుడి అవశేషాల ప్రదర్శన థాయ్‌లాండ్‌లో..
ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించిన బుద్ధ భగవానుని పవిత్ర అస్థికలను, చితాభస్మాన్ని బౌద్ధమత అనుచరుల సందర్శనార్థం థాయ్‌లాండ్‌లో ప్రదర్శించనున్నారు. ఫిబ్రవరి 22 నుంచి మార్చి 18 వరకూ మధ్య థాయ్‌లాండ్‌లో బుద్ధుడి అవశేషాల ప్రదర్శన జరగనుంది. థాయ్‌లాండ్ ప్రభుత్వ అభ్యర్థన మేరకు భారత ప్రభుత్వం బుద్ధుని అస్థికలను, చితాభస్మాన్ని థాయ్‌లాండ్‌కు పంపాలని నిర్ణయించింది. ఫిబ్రవరి 22న కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్ నేతృత్వంలో వైమానిక దళానికి చెందిన ప్రత్యేక హెర్క్యులస్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో పటిష్టమైన భద్రత నడుమ వీటిని పంపనున్నారు. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. శిష్యుల అస్థికలు కూడా.. బుద్ధ భగవానుని అస్థికలతోపాటు అతని శిష్యులైన అర్హంత్ సరిపుత్ర, అర్హంత్ మహామొగల్యన్లో అస్థికలను కూడా థాయ్‌లాండ్ పంపనున్నారు. ప్రస్తుతం ఈ మహనీయుల చితాభస్మం మధ్యప్రదేశ్‌లోని సాంచి స్థూపంలో భద్రపరిచారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వంతో ఈ విషయమై చర్చించిన తర్వాత వీరి అస్థికలను థాయ్‌లాండ్‌కు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పంపిస్తోంది. ఎక్కడెక్కడ ఉన్నాయి? ఆ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ప్రస్తుతం దేశంలో బుద్ధ భగవానునికి సంబంధించిన 22 పవిత్ర అస్థికలు ఉన్నాయి. వీటిలో 20 అస్థికలు ప్రస్తుతం నేషనల్ మ్యూజియంలో ఉండగా, రెండు కోల్‌కతా మ్యూజియంలో ఉన్నాయి. వీటిలో నాలుగు అస్థికలను ఇప్పుడు థాయ్‌లాండ్‌కు పంపుతున్నారు. రెండోసారి థాయ్‌లాండ్‌కు.. బౌద్ధమత అనుచరులు ఈ పవిత్ర అస్థికలను ఎంతో పవిత్రమైనవిగా భావిస్తారు. బుద్ధునికి సంబంధించిన ఈ పవిత్ర ఎముకలను ఇప్పటికే శ్రీలంక, కంబోడియా, సింగపూర్, దక్షిణ కొరియాలకు అక్కడి ప్రజల సందర్శనార్థం పంపారు. ఇప్పుడ రెండోసారి థాయ్‌లాండ్‌కు వీటిని పంపుతున్నారు. గతంలో అంటే 1995లో తొలిసారి బుద్ధుని అస్థికలను థాయ్‌లాండ్‌కు పంపారు. -
బజ్‌బాల్ సూపర్! రోహిత్ మరింత దూకుడుగా ఉండాలి: టీమిండియా దిగ్గజం
Indian cricket legend Praising England’s “Bazball” approach: సంప్రదాయ క్రికెట్లో ఇంగ్లండ్ అనుసరిస్తున్న ‘బజ్‌బాల్’ విధానం అద్భుతంగా ఉందని టీమిండియా దిగ్గజం కపిల్ దేవ్ కొనియాడాడు. టెస్టుల్లో అన్ని క్రికెట్ జట్లు ఇలాంటి దూకుడు ప్రదర్శిస్తే ఆట మరింత రసవత్తరంగా ఉంటుందని పేర్కొన్నాడు. ఇటీవల తాను చూసిన అత్యుత్తమ టెస్టు సిరీస్‌లలో యాషెస్ అద్భుతమని కొనియాడాడు. కాగా న్యూజిలాండ్ మాజీ స్టార్ బ్రెండన్ మెకల్లమ్ ఇంగ్లండ్ టెస్టు క్రికెట్ కోచ్ అయిన తర్వాత.. బెన్‌స్టోక్స్ సారథంలో బజ్‌బాల్ విధానానికి శ్రీకారం చుట్టాడు. పరిమిత ఓవర్ల మాదిరే టెస్టుల్లోనూ దూకుడు ప్రదర్శిస్తూ ఇప్పటికే ఇంగ్లండ్ గుర్తుండిపోయే విజయాలు సాధించింది కూడా! డ్రాగా ముగిసినా ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లోనూ దూకుడును కొనసాగించింది. తొలి టెస్టులో అతి విశ్వాసంతో ఓటమి పాలైనా వెనక్కి తగ్గేదేలే అన్నట్లు ముందుకు సాగింది. ఈ క్రమంలో పర్యాటక ఆసీస్‌తో కలిసి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-2తో సమంగా నిలిచి డ్రాతో సరిపెట్టుకుంది. అయితే, సిరీస్ ఆసాంతం.. ముఖ్యంగా ఆఖరి టెస్టు నువ్వా- నేనా అన్నట్లు సాగడం అభిమానులకు మజాను అందించింది. ఈ నేపథ్యంలో కపిల్ దేవ్ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బజ్‌బాల్ విధానంపై ప్రశంసలు కురిపించాడు. ‘‘బజ్‌బాల్ అద్భుతం. రోహిత్ మరింత దూకుడుగా ఉండాలి ఇటీవల నేను చూసిన సిరీస్‌లలో ఇంగ్లండ్- ఆస్ట్రేలియా సిరీస్ అత్యుత్తమంగా అనిపించింది. నిజానికి క్రికెట్ అంటే అలాగే ఆడాలి మరి! మన కెప్టెన్ రోహిత్ వర్మ మంచి సారథి అనడంలో సందేహం లేదు. అయితే, నాయకుడిగా తను కూడా ఇకపై మరింత దూకుడుగా ఉండాలి. ఇంగ్లండ్ ఎలా ఆడుతుందో గమనించాలి. కేవలం మనం మాత్రమే కాదు.. అన్ని క్రికెట్ జట్లు బజ్‌బాల్ గురించి ఆలోచించాలి. కేవలం డ్రాలతో సరిపెట్టుకునే విధానానికి స్వస్తి పలికి దూకుడుగా ఆడుతూ.. గెలుపే పరమావధిగా ముందుకు సాగాలి’’ అని కపిల్ దేవ్ ప్రపంచ టెస్టు క్రికెట్ జట్లకు సూచించాడు. అలాంటపుడే ఆటకు మరింత ఆదరణ లభిస్తుందని అభిప్రాయపడ్డాడు. కాగా వచ్చే ఏడాది జనవరి 25 నుంచి టీమిండియా- ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రోహిత్‌ను ఉద్దేశించి కపిల్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. చదవండి: కలలు నిజమైన వేళ: వాళ్లు మెరిశారు..! ఇక అందరి దృష్టి అతడిపైనే.. -
ఆఖరి మజిలీలో ఇంగ్లండ్‌దే విక్టరీ.. విజయంతో బ్రాడ్ విడ్కోలు
లండన్: సంప్రదాయ క్రికెట్లో యాషెస్ సిరీస్‌కున్న ప్రత్యేకత, విశిష్టత ఇంకే సిరీస్‌కు ఎందుకు ఉండదో తాజా సిరీస్‌లో ఏ ఒక్క మ్యాచ్ చూసిన ఇట్టే అర్థమవుతుంది. టెస్టు సమరం ఐదు రోజులు ఆసక్తి కరంగానే మొదలైంది. ఐదు టెస్టులూ రసవత్తరంగానే జరిగాయి. గెలిచినా... ఓడినా... ఫలితంతో సంబంధంలేకుండా ఇంగ్లండ్ ఈ సిరీస్ అసాంతం వన్డేను తలపించే దూకుడునే కొనసాగించింది. ఇక ఈ ఐదో టెస్టు చివరి మజిలీలో వర్షం కూడా ‘యాషెస్’ విశిష్టత ముందు తోకముడిచింది. ఆఖరి రోజు ఆటలో క్లైమాక్స్‌కు సరిపడా మలుపులిచ్చి... ఇరు జట్లను ఊరించి మరీ సిరీస్‌ను పంచింది. ఆసీస్‌ను నడిపించి... ఇంగ్లండ్‌ను గెలిపించి... ఆఖరి రోజు 384 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు ఓవర్‌నైట్ స్కోరు 135/0తో రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఆస్ట్రేలియా 94.4 ఓవర్లలో 334 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓపెనర్లు వార్నర్ (60; 9 ఫోర్లు), ఖ్వాజా (72; 8 ఫోర్లు) స్వల్ప వ్యవధిలోనే అవుటయ్యారు. కానీ స్మిత్ (54; 9 ఫోర్లు), ట్రావిస్ హెడ్ (43; 6 ఫోర్లు) కలిసి నాలుగో వికెట్ కు 95 పరుగుల జోడించడంతో ఆసీస్ ఆశలు పెంచుకుంది. టీ సెషన్లో 238/3 స్కోరుతో ఇంగ్లండ్‌ను కంగారు పెట్టిన ఆసీస్‌కు... హెడ్, స్మిత్, మార్ష్ (6), స్టార్క్ (0), కెప్టెన్ కమిన్స్ (9) వికెట్లను 300 పరుగుల్లోపే కోల్పోవడంతో ఓటమి ఖాయమైంది. బ్రాడ్ కెరీర్ ఆఖరి టెస్టులో ఆఖరి వికెట్‌గా క్యారీ (28; 1 ఫోర్, 1 సిక్స్)ని అవుట్ చేయడంతో ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌కు 334 స్కోరువద్ద తెరపడింది. ఐదో టెస్టులో 49 పరుగులతో గెలిచిన ఇంగ్లండ్ సిరీస్‌ను 2–2తో సమం చేసుకుంది. అయితే గత సిరీస్‌ను గెలిచిన ఆసీస్ వద్దే ‘యాషెస్’ ఉండిపోనుంది. 2 వికెట్లతో బ్రాడ్ తన కెరీర్‌కు చిరస్మరణీయ ముగింపు ఇచ్చుకున్నాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ వోక్స్ 4, మొయిన్ అలీ 3 వికెట్లు తీశారు. వోక్స్, స్టార్క్‌లకు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి. తదుపరి యాషెస్ సిరీస్ ఆస్ట్రేలియాలో 2025–2026లో జరుగుతుంది. చదవండి: ఐర్లాండ్‌తో టీ20 సిరీస్.. టీమిండియాకు కొత్త కెప్టెన్, రింకూ సింగ్‌కు పిలుపు -
Ashes 3rd Test Day 4 Highlight Pics: ఆసీస్‌పై ఇంగ్లండ్ గెలుపు (ఫొటోలు)
-
ఓడిపోయాం అయితే ఏంటి టెస్ట్ క్రికెట్‌కు ఏది అవసరమో అదే చేసాం
-
తొలిటెస్టు ఆసీస్‌దే.. ఇంగ్లండ్‌పై రెండు వికెట్ల తేడాతో సంచలన విజయం (ఫొటోలు)
-
'బూడిద' కోసం 141 ఏళ్లుగా.. 'యాషెస్' పదం ఎలా వచ్చిందంటే?
క్రికెట్ చరిత్రలో భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌కు ఎంత క్రేజ్ ఉంటుందో అందరికి తెలిసిందే. దాయాదులు తలపడుతున్నాయంటే రెండు దేశాల్లోని క్రికెట్ అభిమానులు టీవీలకు అతుక్కుపోతుంటారు. టీఆర్పీ రేటింగ్‌లు కూడా బద్దలవుతుంటాయి. అచ్చం అలాంటి పోరు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ల మధ్య కూడా ఉంటుంది. అది కూడా సంప్రదాయ టెస్టు క్రికెట్లో. టి20 క్రికెట్ లాంటి వేగవంతమైన ఆట వచ్చాకా కూడా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరిగే యాషెస్ టెస్టు సిరీస్‌కు ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. దాదాపు 141 సంవత్సరాల చరిత్ర కలిగిన యాషెస్‌ను ఇంగ్లండ్, ఆస్ట్రేలియా క్రికెట్ అభిమానులు ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. కేవలం ఒక ట్రోపీలో ఉన్న బూడిద కోసం కొదమసింహాల్లా తలపడే రెండు జట్ల పోరు కోసం ఎదురుచూస్తూ ఉంటారు. రెండేళ్లకు ఒకసారి జరిగే యాషెస్ సిరీస్ మళ్లీ వచ్చేసింది. జూన్ 16 నుంచి ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య ఐదు టెస్టుల యాషెస్ సిరీస్ జరగనుంది. యాషెస్ సిరీస్‌కు ఈసారి ఇంగ్లండ్ వేదిక కానుంది. ఈ నేపథ్యంలో అసలు యాషెస్ అనే పేరు ఎలా వచ్చింది.. ఈ సిరీస్ ఎందుకు ఇరుదేశాలకు ప్రతిష్టాత్మకం అనేది మరోసారి తెలుసుకుందాం. -సాక్షి, వెబ్‌డెస్క్ 1882లో మొదలైన గొడవ.. 1882లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా తొలిసారి ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడాయి. ఆ ఏడాది ఇంగ్లండ్‌కు టెస్టుల్లో అద్భుతమైన రికార్డు ఉంది. అప్పటివరకు 22 టెస్టుల్లో కేవలం నాలుగింటిలో మాత్రమే ఓడిపోయింది. దీంతో సిరీస్‌లో ఫెవరెట్‌గా కనిపించిన ఇంగ్లండ్‌కు ఆస్ట్రేలియా షాక్ ఇచ్చింది. ఆ సిరీస్‌లో ఓవల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను ఓడించిన ఆసీస్ సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇంగ్లండ్ విజయానికి కేవలం 85 పరుగులు మాత్రమే కావాలి. అప్పటికి ఇంగ్లండ్ టీం స్కోరు రెండు వికెట్లకు 51 పరుగులు. క్రికెట్ అంటేనే అన్ ప్రిడిక్టబుల్ కాబట్టి.. అనూహ్యంగా ఆస్ట్రేలియా ఏడు వికెట్ల తేడాతో విజయాన్ని సాధించింది. ఇంగ్లండ్‌లో ఆస్ట్రేలియాకు ఇది తొలి విజయం. ఆగస్టు 29 న ఇంగ్లండ్ ఓడిపోయింది. ఈ ఓటమి ఇంగ్లండ్ మీడియాను తాకింది. ఇంగ్లండ్‌లోని ప్రతీ వార్తాపత్రిక ఇంగ్లండ్ టీంను దారుణంగా విమర్శిస్తూ వ్యాసాలు వందల్లో వెలువడ్డాయి ఈ ఓటమి తరువాత, స్పోర్టింగ్ టైమ్స్ అనే పత్రిక ఇంగ్లీష్ క్రికెట్ కోసం ఒక సంతాప సందేశాన్ని ప్రచురించింది. “ఇంగ్లీష్ క్రికెట్ చనిపోయింది. 29 ఆగస్టు 1882, ఓవల్‌లో ఇంగ్లండ్ టీం అంత్యక్రియల తర్వాత వచ్చిన బూడిదను (యాషెస్) ఆస్ట్రేలియా తీసుకెళ్లింది.. ” అంటూ రాసుకొచ్చింది. ఆ తర్వాత కొన్ని వారాలకే హాన్ ఐవో బ్లిగ్ సారథ్యంలోని ఇంగ్లిష్ జట్టు ఆస్ట్రేలియాకు బయలుదేరింది. ఈ సందర్భంగా బ్లిగ్ మాట్లాడుతూ... యాషెస్‌ను తిరిగి తీసుకొస్తానని శపథం చేశాడు. స్థానిక మీడియా ‘యాషెస్‌ను తిరిగి తీసుకరావాలంటూ’ మళ్లీ వందల సంఖ్యలో వార్తలు ప్రచురించాయి. అదే సమయంలో ఆస్ట్రేలియా కెప్టెన్ విల్ మర్దోక్ కూడా ఇలాంటి ప్రకటనే చేశాడు. యాషెస్‌ను ఇంగ్లండ్ పట్టుకెళ్లకుండా అడ్డుకుంటామని పేర్కొన్నాడు. కలశంలో బూడిద.. అయితే ఇంగ్లండ్ ఓటమిని దారుణంగా విమర్శిస్తూ వ్యాసాలు రాసిన వార్తా పత్రికలను ఒక మహిళా బృందం తగలబెట్టింది. దానికి సంబంధించిన బూడిదను కలశం లాంటి పాత్రలో పెట్టి అప్పటి ఇంగ్లండ్ కెప్టెన్ బ్లైగ్కు అందించారు. కాగా ఆ కలశంలో నిజమైన యాషెస్ ఇప్పటికీ ఉపయోగించిన ఒక జత స్టంప్ బెయిల్ల్ను లండన్ మ్యూజియంలో భద్రపరిచారు. అప్పటినుంచి కాగా పెళుసుగా ఉండే అసలైన దానిని లార్డ్స్‌లోని క్రికెట్ మ్యూజియంలో చూడొచ్చు. అప్పటి నుంచి ఈ రెండు దేశాల మధ్య టెస్టు సిరీస్‌కు యాషెస్ అని పేరు పెట్టారు. కాగా సిరీస్ గెలుపొందిన జట్లకు కలశం ప్రతిరూపాన్ని అందజేస్తారు.ఆ తర్వాత ఈ సిరీస్ కోసం కలశం రూపంలోనే ప్రత్యేక ట్రోఫీని తయారు చేశారు. దీనిలో మొప్పలను కాల్చిన తర్వాత బూడిదను ఉంచుతారు. ఈ ట్రోఫీని యూఆర్ఎన్ అని కూడా పిలుస్తారు, ఇది బూడిద కలిగిన పాత్ర. నేటికీ ఈ సంప్రదాయం కొనసాగుతోంది. మొదట్లో ఇంగ్లండ్.. ఇప్పుడు ఆసీస్‌దే ఆధిపత్యం ఇక ఇప్పటివరకు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ల మధ్య 72 యాషెస్ సిరీస్‌లు జరిగితే.. అందులో ఆస్ట్రేలియా 3 సార్లు, ఇంగ్లండ్ 32 సార్లు విజయాలు అందుకోగా.. ఆరు సిరీస్‌లు మాత్రం డ్రాగా ముగిశాయి. ఇక 141 సంవత్సరాల చరిత్ర కలిగిన యాషెస్ సిరీస్‌లో 356 మ్యాచ్‌లు జరగ్గా ఆస్ట్రేలియా 150.. ఇంగ్లండ్ 110 మ్యాచ్‌లు నెగ్గగా.. 96 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. ఇక ప్రస్తుతం యాషెస్ ట్రోపీ ఆస్ట్రేలియా వద్ద ఉంది. 2021-22లో జరిగిన యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. కాగా ఇంగ్లండ్ 2015 తర్వాత మళ్లీ యాషెస్‌ను గెలవలేకపోయింది. ఈసారి స్టోక్స్ నేతృత్వంలో బజ్‌బాల్ ఆటతీరుతో దూకుడు ప్రదర్శిస్తున్న ఇంగ్లండ్ ఎలాగైనా యాషెస్ ట్రోపీని దక్కించుకోవాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు ఇటీవలే టీమిండియాను ఓడించి ప్రపంచటెస్టు చాంపియన్‌గా అవతరించిన ఆస్ట్రేలియా మంచి ఆత్మవిశ్వాసంతో ఉంది. కాగా 73వ సారి జరుగుతున్న యాషెస్ టెస్టు సిరీస్‌లో తొలి టెస్టు ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జూన్ 16 నుంచి 20 వరకు జరగనుంది. చదవండి: ఎల్పీఎల్ వేలం.. రైనాను మరిచిపోయారా? పట్టించుకోలేదా? #TNPL2023: రోజుకో విచిత్రం.. ఒకే బంతికి రెండుసార్లు డీఆర్ఎస్ -
డెక్కన్ మాల్ ఘటన.. ఇక మిగిలింది బూడిదేనా?
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ రాంగోపాల్‌పేట డెక్కన్ మాల్ అగ్నిప్రమాద ఘటనలో.. గల్లంతైన ముగ్గురు వర్కర్ల ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. ప్రమాదం జరిగి ఇన్నిరోజులైనా కనీసం మృతదేహాల జాడ గుర్తించకపోవడం, మృతదేహాలు లభ్యమైనట్లు గందరగోళ ప్రకటనల నడుమ బాధితుల బంధువులు శోక సంద్రంలో మునిగిపోతున్నారు. మరోవైపు బిల్డింగ్ నుంచి ఇంకా పొగలు వస్తుండడంతో ఆదివారం మరోసారి ఫోమ్ జల్లుతున్నారు ఫైర్ సిబ్బంది. ఇక భవనంలో మొదటి మూడు ఫ్లోర్లలోని లోపలి భాగం స్లాబ్‌లు కుప్పకూలిపోయాయి. ఈ స్లాబ్‌ల కిందే మృతదేహాల అవశేషాలు ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు ఆదివారం అన్ని ఫ్లోర్లను క్షుణ్ణంగా పరిశీలించిన డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది కీలక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. బూడిద ద్వారా ఆనవాలు గుర్తించేందుకు యత్నిస్తున్నారు. బిల్డింగ్ లోపల బూడిద శాంపిల్స్‌ను క్లూస్ టీం ద్వారా సేకరించారు. ఆ శాంపిల్స్‌ను అధికారులు ల్యాబ్‌కి తరలించారు. బాధితులను గుజరాత్‌కు చెందిన జునైద్, వసీం, అక్తర్‌గా గుర్తించారు. సెల్ఫోన్ల ఆధారంగా వాళ్లు ప్రమాద సమయంలో భవనంలోనే చిక్కుకుని ఉంటారని అధికారులు ఓ నిర్ధారణకు వచ్చారు. ఇక మృత దేహాల ఆచూకీ లభ్యం అయిన తర్వాతే.. భవనాన్ని అత్యాధునిక పద్ధతుల్లో చుట్టుపక్కల భవనాలకు డ్యామేజ్ వాటిల్లకుండా కూల్చేసే అవకాశం ఉంది. -
భర్తపై ఎనలేని ప్రేమ.. అతని చితాభస్మానికి బానిసైన భార్య
బ్రిటన్: మద్యానికి, డ్రగ్స్‌కి అడిక్ట్ అయ్యే వాళ్లని చాలా మందిని చూసే ఉంటాం. ఇంకా చెప్పాలంటే... టీవి చూడటం, మొబైల్ ఫోన్ అధికంగా వాడటం, సోషల్ మీడియాలోనే గంటల తరబడి మునిగిపోయేవాళ్లు కూడా ఎంతోమంది ఉంటారు. కానీ బ్రిటన్‌కి చెందిన ఒక మహిళ మాత్రం తన భర్త చితాభస్మానికి బానిస అయ్యాను దాన్ని ఆపడం తన వల్ల కాదంటూంది. చాలా వింతగా ఉందనిపిస్తుందా? అయితే అసలు విషయంలోకి వెళ్లితే బ్రిటన్‌కి చెందిన కాసీ 2009లో సీన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. (చదవండి: ఏంటీ....స్నేక్ కేక్ ఆ!) అయితే అతను ఆస్తమా కారణంగా మరణించాడు. ఈ క్రమంలో ఆమె అప్పటి నుంచి తన భర్త చితాభస్మాన్ని తాను ఎక్కడకెళ్లితే అక్కడకి తనతోపాటే తీసుకువెళ్లాలని నిర్ణయించుకుంది. అంతేకాదు ఈ మేరకు ఆమె తన భర్త చితాభస్మాన్ని కూడా తింటున్నానని దాన్ని ఆపలేనంటూ చెప్పుకొచ్చింది. పైగా ఆ బూడిద కుళ్లిన వాసన వస్తున్నప్పటికీ చాలా ఇష్టంగా కొచెం కొంచెంగా తింటున్నానంటూ చెబుతోంది. ఆమె తన భర్తను ఈ భూమి మీద నుంచి శాశ్వతంగా తుడిచిపెట్టాయలని అనుకోవట్లేదని తనతోపాటు ఉన్నట్లుగా భావిస్తున్నందుకే ఇలా చేస్తున్నాను అంటోంది కాసీ. ఈ మేరకు బ్రిటన్ టీఎల్సీ ఛానెల్లోని 'మై స్ట్రేంజ్ అడిక్ట్' అనే కార్యక్రమంలో కాసీ తన వింత అలవాటు గురించి చెబుతూ నేను రోజు నా భర్త చితా భస్మాన్ని తింటున్నాను అంటూ పేర్కొంది. అంతే కాదండోయ్ అందరూ ఒక్కసారిగా షాక్‌కు గురి అవ్వడంతోపాటు ఆమెపై ఒక కథనాన్ని కూడా ప్రచురితమైంది. దీంతో అది కాస్త నెట్టింట తెగ వైరల్ అయ్యింది. (చదవండి: తలపాగే ప్రాణాలను కాపాడింది) -
ఆరేళ్లుగా కుమార్తె అస్థికలు భద్రపరిచి..
సాక్షి, కాళేశ్వరం : కరీంనగర్ జిల్లా మంకమ్మతోటకు చెందిన యశ్వంత్ చదువు నిమిత్తం సుమారు ఆరేళ్ల క్రితం ఇంగ్లాండ్ వెళ్లిన సమయంలో ఆ దేశానికి చెందిన ఫియానాను ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత అక్కడే స్థిరపడగా, వారికి కుమారుడు వివాన్, అనంతరం కవల కుమార్తెలు జీనా, ఆంజీ జన్మించారు. ఆరేళ్ల క్రితం కవలల్లో ఒకరైన ఆంజీ అనారోగ్యంతో మృతి చెందింది. అయితే, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు తూచా తప్పకుండా పాటించే యశ్వంత్.. తన కుమార్తె అస్థికలను భారత నదీ జలాల్లో కలపాలని నిర్ణయించుకుని అప్పటి నుంచి భద్రపరిచారు. తాజాగా స్వస్థలానికి వచ్చిన ఆయన సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో ఆమె అస్థికలకు ప్రత్యేక పూజలు నిర్వహించాక త్రివేణి సంగమం గోదావరిలో కలిపారు. ఉద్యోగ, ఉపాధి నిమిత్తం ఇంగ్లండ్ వెళ్లినా భారత సంస్కృతిని విస్మరించని యశ్వంత్‌ను పలువురు అభినందించారు. చదవండి: లేని కారుకు కిరాయి.. ఇదెలా సాధ్యం సార్! -
రాయగడ చేరిన వాజ్‌పేయి చితాభస్మం కలశం
రాయగడ : దివంగత ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి చితాభస్మం కలశం సోమవారం రాయగడకు చేరుకుంది. ప్రజల సందర్శనార్థమై రాయగడ టౌన్హాల్లో దీనిని ఉంచారు. ఈ సందర్భంగా మాజీ శాసన సభ్యుడు పూర్ణచంద్ర మజ్జి మాట్లాడుతూ జిల్లాలోని కాశీపూర్, టికిరి ప్రాంతాలతో సహా కల్యాణ సింగుపురం, తేరువలి, బిసంకటక్, మునిగుడ, అంబొదల, రామన్నగుడ, పద్మపూర్, గుడారి, ప్రాంతాల్లో వాజ్‌పేయి చితాభస్మ కలశం ఊరేగింపు నిర్వహిస్తామన్నారు. అనంతరం ఈ నెల 29వ తేదీన జిల్లాలోని వంశధార నదీ తీరంలో నిమజ్జనం చేయనున్నట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో కేంద్ర కమిటీ సభ్యులు కాశీరాం మజ్జి, రజిత్ మదల, శ్రీపాల్ జైన్, ఎం.రామారావు, భాస్కర పండా, సుమంత మహరణ, తిలక్ చౌదరి, వసంత ఉల్క, చిత్త ప్రధాన్, జోగేశ్వర్ చౌదరి, గౌరి ఇతర సభ్యులు పాల్గొన్నారు. -
వాజ్‌పేయి అస్థికలతో సీఎం రాజకీయం
రాయ్‌పూర్: దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి అస్థికలతో ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని ఆయన మేనకోడలు, కాంగ్రెస్ నేత కరుణ శుక్లా ఆరోపించారు. ఆమె మాట్లాడుతూ.. సీఎం రమణ్ సింగ్ గత పదేళ్లలో ఏనాడు వాజ్‌పేయి చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రస్తావించలేదని.. కానీ ఇప్పడు మాత్రం రాజకీయ లబ్ధి కోసం ఆయన పేరును వాడుకుంటున్నారని విమర్శించారు. వాజ్‌పేయి మరణానంతరం బీజేపీ స్వప్రయోజనాల కోసం ఆయన అస్థికలను, పేరును వాడుకోవటం దారుణమని మండిపడ్డారు. ఇది తనకు చాలా బాధ కలిగిస్తుందన్నారు. తొలుత బీజేపీలోనే కొనసాగిన కరుణ.. తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాగా, ఛత్తీస్‌గఢ్ నూతన రాజధాని కాబోయే నయా రాయ్‌పూర్ పేరును అటల్ నగర్‌గా నామకరణం చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నిర్ణయించిన సంగతి తెలిసిందే. మాజీ ప్రధాని అటల్ బిహరీ వాజ్‌పేయి సేవలకు గుర్తుగా ఈ మార్పు చేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఇదే కాకుండా కొత్త రాజధానిలోని పలు ప్రభుత్వ సంస్థలు, ప్రాజెక్టులకు వాజ్‌పేయి పేరు పెట్టాలని రమణ్ సింగ్ ఆధ్వర్యంలో మంగళవారం భేటీ అయిన మంత్రి వర్గం నిర్ణయించింది. ఈ సమావేశం అనంతరం రమణ్ సింగ్ మాట్లాడుతూ... 2000 సంవత్సరంలో వాజ్‌పేయి ప్రధానిగా ఉండగా ఈ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. అందుకే ఆయన పేరు కొత్త రాజధానికి పెడుతున్నట్లు, అలాగే స్మారక స్తూపాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. మరోవైపు వాజ్‌పేయి అస్థికలను దేశంలోని పలు నదుల్లో నిమజ్జనం చేయాలని బీజేపీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా అస్థికలను వివిధ రాష్ట్రాలకు తరలించారు. బుధవారం ఛత్తీస్‌గఢ్ బీజేపీ అధ్యక్షుడు ధరమ్‌లాల్ కౌశిక్, వాజ్‌పేయి అస్థికలను ఢిల్లీ నుంచి రాష్ట్రానికి తీసుకువచ్చారు. -
నేడు హైదరాబాద్‌కు వాజ్‌పేయి అస్థికలు
సాక్షి, హైదరాబాద్: స్వర్గీయ అటల్ బిహారీ వాజ్‌పేయి అస్తికలను బుధవారం హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయానికి తీసుకురానున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతా సాంబమూర్తి తెలిపారు. వాటిని తీసుకువచ్చేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ఢిల్లీకి వెళ్లారని పేర్కొన్నారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వాజ్‌పేయి అస్థికలు బుధవారం సాయంత్రం 4 గంటలకు శంషాబాద్ విమనాశ్రయానికి చేరుకుంటాయని, వాటిని అక్కడి నుంచి బీజేపీ పార్టీ కార్యాలయానికి తీసుకువస్తారని వివరించారు. వాటిని ఈనెల 23న ఉదయం 11 గంటలకు ప్రజల సందర్శనార్థం ఉంచుతామని వెల్లడించారు. ఆ తరువాత వాటిని మేడ్చల్ మీదుగా రామాయంపేట, కామారెడ్డి, నిజామాబాద్, బాసరకు తీసుకెళతామని వెల్లడించారు. అస్థికలను బాసరలోని గోదావరి పుణ్యనదిలో లక్ష్మణ్, జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు కలుపుతారని వివరించారు. మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, బీజేపీ శాసనసభాపక్ష నేత కిషన్‌రెడ్డి నేతృత్వంలోని మరో బృందం చేవెళ్ల వికారాబాద్ మీదుగా అనంతగిరిలోని మూసీ సంగమంలో అస్థికలను కలుపుతారని వివరించారు. ఇక ఈనెల 24, 25 తేదీల్లో అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో అఖిలపక్ష నాయకులతో వాజ్‌పేయి సంతాప సభలు నిర్వహించాలని పార్టీ నిర్ణయించినట్లు వివరించారు. -
వాజ్‌పేయి అస్థికలు యూపీ నదుల్లో నిమజ్జనం
లక్నో: భారత మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి అస్థికలను ఉత్తర్‌ప్రదేశ్(యూపీ)లోని అన్ని జిల్లాల్లో ఉన్న నదుల్లో నిమజ్జనం చేయనున్నట్లు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం తెలిపింది. ఈ విషయాన్ని ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వయంగా వెల్లడించారు. వాజ్‌పేయి కర్మభూమి ఉత్తర్ ప్రదేశ్ అని వ్యాఖ్యానించారు. ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి వాజ్‌పేయి అంతిమ యాత్రలో భాగస్వాములు అయ్యారని పేర్కొన్నారు. లక్నో లోక్‌సభ నియోజకవర్గం నుంచి వాజ్‌పేయి 1991 నుంచి వరుసగా ఐదుసార్లు ఎంపీగా గెలిచారు. బీజేపీ లక్నో నగర శాఖ ఆగస్టు 21న సంతాప సభ నిర్వహిస్తుందని, దానికి ప్రస్తుత లక్నో ఎంపీ, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హాజరవుతున్నట్లు బీజేపీ నాయకులు తెలిపారు. యూపీలో పేద ప్రజలు నివాసముండే వింటర్ షెల్టర్లకు మాజీ ప్రధాని వాజ్‌పేయి పేరు పెట్టాలని స్థానిక బీజేపీ నాయకుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. -
క్రికెట్‌కు స్టార్ బ్యాట్స్‌మన్ గుడ్‌బై
సాక్షి, స్పోర్ట్స్ : ‘స్విచ్ షాట్’ ఇన్వెంటర్, ఇంగ్లాండ్ స్టార్ బ్యాట్స్‌మన్ కెవిన్ పీటర్సన్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పారు. ఇంగ్లాండ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాట్స్‌మన్‌గా రికార్డులకెక్కిన కెవిన్.. 14 ఏళ్లపాటు అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగారు. సోషల్ మీడియా ద్వారా శనివారం ఆయన రిటైర్మెంట్ ప్రకటించారు. ఇంగ్లండ్ తరుపున 104టెస్టులు, 136 వన్డేలు, 37 టీ-20లు ఆడిన పీటర్సన్ పలు రికార్డులు సాధించాడు. నాలుగు యాషెస్ సిరీస్ గెలవడం, సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం, టీ20 ప్రపంచకప్ గెలుచుకోవడం లాంటివి కెరీర్లో మధురజ్ఞాపకాలని పీటర్సన్ ట్వీట్లో పేర్కొన్నారు. ఐపీఎల్లో బెంగళూర్, ఢిల్లీ, పుణె జట్ల తరఫున ఆడిన ఆయన ప్రస్తుతం పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో క్వెట్టా గ్లాడియేటర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో టెస్ట్‌లు, వన్డేల్లో 32 సెంచరీలు, 60 అర్థసెంచరీలు, 17వికెట్లు సాధించారు. పీటర్సన్ రిటైర్మెంట్ ప్రకటన ట్వీట్‌పై పలువురు క్రికెటర్లు, వ్యాఖ్యాతలు రీట్వీట్ చేస్తున్నారు. Just been told that I scored 30000+ runs which included 152 fifty’s & 68 hundreds in my professional career. Time to move on! pic.twitter.com/zMSIa3FK6K — Kevin Pietersen (@KP24) 17 March 2018 -
రామేశ్వరంలో శ్రీదేవి అస్థికల నిమజ్జనం
సాక్షి, ముంబయి : కోట్లాది అభిమానులను దుఖఃసాగరంలో ముంచి సుదూరతీరాలకు పయనమైన నటి శ్రీదేవి అంత్యక్రియలు ముంబయిలో అధికార లాంఛనాల మధ్య ముగిసిన సంగతి తెలిసిందే. శ్రీదేవి అస్థికలను సముద్రంలో కలిపేందుకు ఆమె భర్త బోనీకపూర్ ఇతర కుటుంబసభ్యులతో కలిసి రామేశ్వరం వెళ్లేందుకు చెన్నై చేరుకున్నారు. అస్థికల నిమజ్జనం అనంతరం వెనువెంటనే వారు ముంబయి తిరిగివెళతారు. బోనీకపూర్ బృందం ముంబయి నుంచి చార్టర్డ్ విమానంలో శుక్రవారం సాయంత్రం చెన్నై చేరుకున్నారు. అక్కడి నుంచి రామేశ్వరం వెళ్లి అస్ధికలు నిమజ్జనం చేస్తారు. నదుల్లో మరణించిన వారి అస్థికలు కలపడం హిందూ సంప్రదాయంలో భాగం. నదీతీర్థాల్లో కర్మకాండలు ఆచరించిన అనంతరం పవిత్ర నదుల్లో అస్థికలు నిమజ్జనం చేయడం ఆనవాయితీ. అనితర సాధ్యమైన తన నటనతో అశేష అభిమానులను సంపాదించుకున్న శ్రీదేవి మేనల్లుడి వివాహానికి హాజరై దుబాయ్ హోటల్లో ఫిబ్రవరి 24న ప్రమాదవశాత్తూ బాత్‌టబ్‌లో మునిగి మరణించారు. ఆమె మృతిపై పలు సందేహాలు వ్యక్తమైనా వాటికి తెరదించుతూ కేసును క్లోజ్ చేస్తున్నట్టు దుబాయ్ ప్రాసిక్యూషన్ ప్రకటించింది. -
గంగా నది ప్రక్షాళనకు కొత్త మార్గం
సాక్షి, న్యూఢిల్లీ : గంగా నదిని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని కేంద్రమంత్రి సత్యపాల్ సింగ్ సష్టం చేశారు. ఆ దిశగా పురోహితులు, అర్చకులు, హిందూ ఆధ్యాత్మిక నేతలు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. గంగా నది కలుష్యానికి కారణమవుతున్న హిందువుల్లో చైతన్యాన్ని తీసుకు వచ్చేందుకు అందరూ కృషి చేయాలని ఆయన చెప్పారు. గంగా నదిలో అస్థికలు కలపడం అనేది ప్రతి హిందువు ఒక నమ్మకంగా భావిస్తారు. నది కాలుష్యానికి ఇదొక ప్రధాన కారణం. ఈ కాలుష్యాన్ని అరికట్టేందుకు.. అస్థికలను నదీపరివాహక ప్రాంతంలో పూడ్చిపెట్టి.. దానిపై ఒక మొక్క నాటాలని ఆయన అన్నారు. ఈ పనిచేయడం వల్ల కాలష్యం తగ్గుతుందని ఆయన తెలిపారు. అస్థికలను గంగలో కలపడం అనేది ఒక అత్యున్నత విశ్వాసమే.. అయితే ప్రస్తుత పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవు. భవిష్యత తరాలకు గంగమ్మను పవిత్రంగా అందించాలంటే ఇలా చేయడం తప్పదని ఆయన అన్నారు. విశ్వాసాల మేరకు.. చాలా తక్కువ మోతాదులో అస్థికలను గంగలో కలిపి.. మిగిలిన దానిని పూడ్చి దానిపై మొక్క నాటితే మంచిదని ఆయన తెలిపారు. ఈ దిశగా అర్చకులు, పూజారులు, హిందూ ధార్మిక నేతలు ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని చెప్పారు. -
లేడీ షేన్ వార్న్
-
న్యూస్ పేపర్లు చదవడం ఆపితేనే..: వార్నర్
మెల్ బోర్న్:త్వరలో యాషెస్ సమరం ఆరంభం కానున్న నేపథ్యంలో సహచర ఓపెనర్ రెన్ షాకు ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ హితబోధ చేశాడు. ఆస్ట్రేలియా ఫస్ట్ కాస్ల్ క్రికెట్ లో భాగంగా ఫెఫల్డ్ షీల్డ్ పోరులో క్వీన్ లాండ్స్ తరపున బరిలోకి దిగిన రెన్ షా విఫలమైన నేపథ్యంలో వార్నర్ కొన్ని సూచనలు కూడిన హెచ్చరికలు చేశాడు. 'నువ్వు స్కోరు బోర్డుపై పరుగులు చూడాలనుకుంటే న్యూస్ పేపర్లు చదవడం ఆపేయ్. ఈ వారంలో నువ్వు పరుగులు చేస్తావని ఆశిస్తున్నా. నువ్వు చాలా ఒత్తిడిలో ఉన్నట్లు కనబడుతున్నావ్. ఒత్తిడిని అధిగమించాలంటే న్యూస్ పేపర్లకు దూరంగా ఉండు. బోర్డుపై పరుగులు చేయడానికి యత్నించు. యాషెస్ లో నీకు మరో ఎండ్ లో ఉన్న నన్ను నిరాశపరచకుండా ఆడతావని ఆశిస్తున్నా. సహచర ఆటగాడిగా నువ్వు సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. ఈ వారపు షెఫల్డ్ షీల్డ్ మ్యాచ్ ల్లో సత్తా చాటడానికి యత్నించు' అని వార్నర్ సూచించాడు. ఈ ఏడాది దక్షిణాఫ్రికా, పాకిస్తాన్ లతో స్వదేశంలో జరిగిన సిరీస్ లలో ఓపెనర్ గా ఆకట్టుకున్న రెన్ షా.. భారత పర్యటనలో భాగంగా మార్చిలో బెంగళూరులో జరిగిన మ్యాచ్ లో 60 పరుగులు మెరిశాడు. కాగా, గత తొమ్మిది టెస్టు ఇన్నింగ్స్ ల్లో రెన్ షా ఖాతాలో ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేదు. ప్రస్తుతం జరుగుతున్న షెఫల్డ్ షీల్డ్ టోర్నమెంట్ లో కూడా రెన్ షా విఫలమయ్యాడు. ఇప్పటివరకూ నాలుగు ఇన్నింగ్స్ లు ఆడిన రెన్ షా 20 పరుగుల్ని దాటడంలో విఫలయ్యాడు. -
అస్థికలతో ఆభరణాలు
నంగునూరు: సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెటలో పురావస్తుశాఖ అధికారులు కొనసాగిస్తున్న తవ్వకాల్లో శుక్రవారం అస్థికలతో చేసిన ఆభరణాలు లభ్యమయ్యాయి. మెన్హిర్ వద్ద ఉన్న మొదటి సమాధిలో 50 సెంటీమీటర్ల ఎముకతోపాటు, చిన్న ముక్కలు, ఎర్రమట్టి పాత్ర, మూడు నల్లటిమట్టి గిన్నెలు లభిం చాయి. ఈ సందర్భంగా పురావస్తు శాఖ సహాయ సంచాలకుడు నాగరాజు, ఎర్రమరాజు భానుమూర్తి మాట్లాడుతూ నర్మెటలోని పెద్ద సమాధిలో రెండున్నర మీటర్ల లోతు తవ్వకాలు జరిపి కీలకమైన ప్రాచీన మానవుడి ఆనవాళ్లను గుర్తించామని చెప్పారు. పొడవాటి కాలి ఎముకతోపాటు, ఎముకలతో చేసిన ఆభరణాలను వెలికి తీశామన్నారు. ఆనాటి మహిళలు దీన్ని ఆభరణంగా ధరించి ఉండవచ్చని భావిస్తున్నామని, పరీక్షల అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. మరికొన్ని మృణ్మయ పాత్రలు లభించాయన్నారు. ఇప్పటికే చాలా సమాచారాన్ని సేకరించామని, ఐదు రోజుల్లో తవ్వకాలు పూర్తి చేస్తామని అన్నారు. -
కాలి బూడిదైన ఆడీ..!
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఫ్లైఓవర్ పై ఓ లగ్జరీ కారు శుక్రవారం రాత్రి పూర్తిగా కాలి బూడిదైంది. పని పూర్తి చేసుకుని ఇంటికి వెళుతున్న కారు ఓనర్ కపిల్ అగర్వాల్(32) కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో అక్కడే ఆపి కిందకు దిగారు. వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బందికి సమాచారం చేరవేశారు. ఫైర్ ఇంజన్ అక్కడి చేరుకునే లోపే కారు మొత్తం పూర్తిగా కాలిపోయింది. ప్రముఖ నగల దుకాణం యజమాని అగర్వాల్ పేరు మీద కారు రిజిస్టర్ అయినట్లు పోలీసులు తెలిపారు. గత జనవరి నెలలో కారుకు సర్వీసింగ్ చేయించినట్లు అగర్వాల్ తెలిపారు. అంతకుముందు నుంచి చిన్నచిన్న సమస్యలు ఉన్నట్లు వెల్లడించారు. ఉన్నట్టుండి మంటలు రావడంతో అగర్వాల్ కార్ బానెట్ ను తెరచి చూశారని దీంతో ఒక్కసారి మంటలు రేగి కారు అంతా వ్యాపించినట్లు పోలీసులు వివరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. -
'ఇక్కడే చస్తా.. అస్థికలు కలిసేది గంగలోనే'
తిరువనంతపురం: తన జాతీయతపై మరోసారి చెలరేగుతున్న విమర్శకులకు ధీటుగా బదులిచ్చారు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ. తాను భారతీయురాలినేనని, తన ప్రియమైన వ్యక్తుల నెత్తురు కలిసిపోయిన ఈ గడ్డపైనే మరణిస్తానని, అస్తికలు ఇక్కడి గంగలోనే కలుస్తాయని ఉద్వేగభరితంగా మాట్లాడారు. కేరళ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం తిరువనంతపురంలో ఏర్పాటుచేసిన సభలో సోనియా మాట్లాడారు. 'అవును. నేను ఇటలీలో పుట్టానని చెప్పుకోవడానికి సిగ్గుపడను. 90 ఏళ్ల నా తల్లి అక్కడే ఉందని చెప్పడానికి సంకోచించను. ఇందిరాగాంధీ కోడలినయిన తర్వాత గడిచిన 48 ఏళ్ల నుంచి నేను ఇక్కడే ఉంటున్నా. ఇదే నా ఇల్లు. ఇదే నాదేశం. నా చావు ఇక్కడే. అస్తికలు కలిసేది ఈ నీటిలోనే' అని సోనియా గాంధీ అన్నారు. ఘనమైన తన జాతీయతను మోదీగానీ, ఆర్ఎస్ఎస్ గానీ అర్థంచేసుకోలేరని, అలా అర్థం చేసుకోవాలని తాను భావించనూలేదని వ్యాఖ్యానించారు. ఇటలీలోని ఒక గౌరవప్రదమైన కుటుంబంలో జన్మించానని, అక్కడ తన తల్లి, ఇద్దరు సోదరీమణులు ఉన్నారన్న సోనియా.. తన దేశం భారత్ లో తనకెంతో ప్రియమైన వ్యక్తుల రక్తం కలిసిపోయిందని, తుది శ్వాస వరకు ఇక్కడే ఉంటానని స్పష్టంచేశారు. వ్యక్తులను దూషించడం, ఎప్పుడూ అబద్ధాలు చెప్పడమే వాళ్ల పని అంటూ ప్రధాని మోదీని విమర్శించారు. శుక్రవారం కేరళలో జరిగిన బీజేపీ సభలో ప్రధాని మోదీ సోనియా జాతీయతపై వ్యంగ్యాస్త్రాలు సంధించిన సంగతి తెలిసిందే. కాగా, తమిళనాడు, కేరళల్లో శుక్ర, శనివారాల్లో పోలింగ్ జరగనుంది. ప్రచారానికి మరో మూడు రోజుల్లో గడువు ముగియనుండటంతో పార్టీలు తమ కీలక నేతలతో ప్రచారం నిర్వహిస్తున్నారు. -
నేతాజీ అస్థికలకు డీఎన్ఏ పరీక్ష చేయండి
బోస్ కుమార్తె అనిత న్యూఢిల్లీ: జపాన్‌లోని టోక్యో రెంకోజీ ఆలయం లో ఉన్న నేతాజీ సుభాష్‌చంద్రబోస్ అస్థికలకు డీఎన్ఏ పరీక్ష నిర్వహించాలని ఆయన కుమార్తె అనితబోస్ కోరారు. తద్వారా ఆ అస్థికలు తన తండ్రివో కాదో తేలుతుందన్నారు. తైపీలోని తైహోకు విమానాశ్రయం సమీపంలో 1945 ఆగస్టు 18న జరిగిన విమాన ప్రమాదంలో బోస్ మరణించారని తానూ నమ్ముతున్నానన్నారు. జర్మనీలో ఉంటున్న ఆమె వచ్చే నెల భారత్‌కు వచ్చే అవకాశం ఉందని, అప్పుడు డీఎన్ఏ పరీక్ష గురించి ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తానని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఫోన్ ఇంటర్వ్యూలో అనిత వెల్లడించారు. -
మందు ఆపేశాడు(ట)!
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ తెలుసుగా. ఏ దేశంలో ఉన్నా పబ్‌లలో తాగి ఏదో ఒక గొడవలోకి దిగడంలో ప్రస్తుత తరం క్రికెటర్లలో తనే టాప్. అయితే తాను మందు తాగి ఇప్పటికి 100 రోజులు దాటిపోయిందని చెప్పాడు వార్నర్. అదేంటని ఆశ్చర్యంగా ప్రశ్నిస్తే... ఇంగ్లండ్‌లో యాషెస్ సిరీస్ కచ్చితంగా గెలవాలని, అందుకోసం తాను శారీరకంగా పూర్తి ఫిట్నెస్తో ఉండాలని భావించాడట. అందుకే యాషెస్‌కు నెల రోజుల ముందు నుంచే మందు తాగడం ఆపేశాడట. ఒకవేళ యాషెస్ గెలిస్తే మాత్రం పూటుగా తాగాలని అనుకున్నాడట. కానీ ఆస్ట్రేలియా సిరీస్ ఓడిపోయింది. ఇక వన్డేలు ఆడి తిరిగి ఆస్ట్రేలియా వెళ్లేవరకూ మందు ముట్టుకునే ప్రసక్తే లేదని చెప్పాడు వార్నర్. తాగితే ఎక్కువకాలం క్రికెట్ ఆడలేనని ఈ ఆస్ట్రేలియన్ స్టార్ తెలుసుకున్నాడు. -
యాషెస్ నాలుగో టెస్టు
-
ఆసీస్ 'చెత్త' రికార్డు!
నాటింగ్ హామ్: ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే యాషెస్ సిరీస్ లో ఆసీస్ పేలవమైన ఆటను కొనసాగిస్తోంది. తొలి, మూడవ టెస్టులను కోల్పోయి సిరీస్ లో వెనుకబడ్డ ఆసీస్ మునుపటి ఫామ్ ను అందుకోవడం కోసం నానా తంటాలు పడుతోంది. గత యాషెస్ ను గెలిచిన ఆసీస్.. ఈ సీజన్ లో మాత్రం ఘోరమైన ఆటతీరుతో విమర్శకుల నోళ్లకు పనిచెప్పింది. రెండో టెస్టులో ఇంగ్లండ్ ను కంగుతినిపించి దూకుడుగా కనిపించిన ఆసీస్.. ఆ తరువాత ఆకట్టుకోవడంలో విఫలమవుతూనే వస్తోంది. అటు బౌలింగ్ లోనూ.. ఇటు బ్యాటింగ్ లోనూ ఇంగ్లండ్ కు దాసోహమవుతూనే ఉంది. తాజాగా గురువారం ఆరంభమైన నాల్గో టెస్టులో ఆసీస్ చెత్త రికార్డును మూటగట్టుకుంది. తొలి ఇన్నింగ్స్ లో కేవలం 18.3 ఓవర్లలో 60 పరుగులకే చాపచుట్టేసి ఇంగ్లండ్ కు తలవంచింది. దీంతో ఇంగ్లండ్ చేతిలో ఆస్ట్రేలియా తక్కువ స్కోరుకు ఆలౌట్ కావడం ఐదో సారి. కాగా, మొత్తంగా ఒక ఇన్నింగ్స్ లో 60 అంతకన్నా తక్కువ పరుగులకే ఆలౌట్ కావడం ఆస్ట్రేలియాకు ఆరోసారి. దీంతో పాటు తొలి 25 బంతుల్లో ఐదు అంతకంటే ఎక్కువ వికెట్లు కోల్పోవడం 2003 తరువాత ఆసీస్ కు ఇదే తొలిసారి. ఇదిలాఉండగా 2003 నుంచి ఇప్పటివరకూ ఆసీస్ తొలి ఓవర్ లో రెండు లేదా మూడు వికెట్లను నష్టపోవడం మూడోసారి. ఈ రోజే ఆరంభమైన నాల్గో టెస్టులో ఆసీస్ వరుస వికెట్లను కోల్పోయి మరో ఓటమి దిశగా పయనిస్తోంది. లంచ్ లోపే ఒక ఇన్నింగ్స్ ను ముగించిన జట్టుగా ఆసీస్ చరిత్రకెక్కింది. ఆసీస్ ఆటగాళ్లలో తొమ్మిది మంది సింగిల్ డిజిట్ కే పరిమితయ్యారు. మిచెల్ జాన్సన్ చేసిన 13 పరుగుల వ్యక్తిగత స్కోరే అత్యధికం. కాగా, ఆసీస్ కు ఎక్స్ ట్రాల రూపంలో 14 పరుగులు రావడం గమనార్హం. ఇంగ్లండ్ బౌలర్లలో స్టువర్ట్ బ్రాడ్ అద్భుతమైన గణాంకాలను నమోదు చేశాడు. కేవలం 9.3 ఓవర్లలో ఐదు మెయిడెన్లలతో సహా 15 పరుగులు మాత్రమే ఇచ్చిన బ్రాడ్ ఎనిమిది వికెట్లను తీసి ఆసీస్ పతనాన్ని శాసించాడు. తాజాగా ఎనిమిది వికెట్లతో ఆకట్టుకున్న బ్రాడ్ మూడొందల వికెట్ల క్లబ్ లో చేరాడు. జట్టు తరుపున ఈ ఘనత సాధించిన ఐదో బౌలర్ గా రికార్డు సాధించాడు. తన కెరీర్ లో 83 వ టెస్టు మ్యాచ్ ఆడుతున్నబ్రాడ్ 307 వికెట్లు తీశాడు. -
ఆసీస్ దెబ్బకు ఇంగ్లండ్ కుదేల్!
లార్డ్స్:యాషెస్ తొలి టెస్టులో ఓటమికి ఆస్ట్రేలియా ప్రతీకారం తీర్చుకుంది. ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా ఇక్కడ జరిగిన రెండో టెస్టులో ఇంగ్లండ్ ను ఆస్ట్రేలియా చిత్తుచిత్తుగా ఓడించింది. ఆసీస్ విసిరిన 509 పరుగుల విజయలక్ష్యంతో నాల్గో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లండ్ 103 పరుగులకే చాపచుట్టేసి ఘోర ఓటమిని మూటగట్టుకుంది. ఏ ఒక్క ఆటగాడు కనీసం పరుగులు చేయకుండా పెవిలియన్ కు చేరడంతో ఆస్ట్రేలియా 405 పరుగుల భారీ విజయం సాధించింది. తమ మొదటి ఇన్నింగ్స్ లో ఆధిపత్యాన్ని నిలబెట్టుకున్న ఆసీస్.. రెండో ఇన్నింగ్స్ లో మరింత రెచ్చిపోయింది. ఆసీస్ తన రెండో ఇన్నింగ్స్ ను 252/2 డిక్లేర్ చేసి ఇంగ్లండ్ ముందు ఐదు వందల పైచిలుకు పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లండ్ ఆ స్కోరును చూసి ముందుగానే చతికిలబడింది. ఓపెనర్లు లైత్ (7), అలెస్టర్ కుక్ (11) ఆదిలోనే పెవిలియన్ కు చేరడంతో ఇంగ్లండ్ పతనం ప్రారంభమైంది. స్టువర్ట్ బ్రాడ్ (25) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ లలో కలిపి 415 పరుగులు మాత్రమే చేసి ఆసీస్ బౌలింగ్ కు దాసోహమైంది. ఆసీస్ బౌలర్లలో మిచెల్ జాన్సన్ ఆరు వికెట్లు, హజిల్ వుడ్ ఐదు వికెట్లు(రెండు ఇన్నింగ్స్ లలో) తీసి ఇంగ్లండ్ పతనాన్ని శాసించారు. ఈ మ్యాచ్ లో విజయంతో సిరీస్ సమం అయ్యింది. తొలి టెస్టులో ఇంగ్లండ్ గెలిచిన సంగతి తెలిసిందే. -
పటిష్ట స్థితిలో ఆస్ట్రేలియా
రెండో ఇన్నింగ్స్‌లో 108/0 ఇంగ్లండ్‌తో రెండో టెస్టు లార్డ్స్: ‘యాషెస్’ తొలి టెస్టులో ఓడిపోయిన ఆస్ట్రేలియా రెండో టెస్టులో పుంజుకుంది. బౌలింగ్‌లో చెలరేగిన కంగారూలు బ్యాటింగ్‌లోనూ నిలకడగా రాణిస్తుండటంతో శనివారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 26 ఓవర్లలో వికెట్లేమీ నష్టపోకుండా 108 పరుగులు చేసింది. ఓపెనర్లు వార్నర్ (60 బ్యాటింగ్), రోజర్స్ (44 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఓవరాల్‌గా క్లార్క్ సేన 362 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 85/4తో మూడో రోజు ఆట కొనసాగించిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 90.1 ఓవర్లలో 312 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఆసీస్‌కు 254 పరుగుల ఆధిక్యం లభించింది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ కుక్ (96; 13 ఫోర్లు) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. స్టోక్స్ (87; 13 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి ఐదో వికెట్‌కు 145 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను గట్టెక్కించాడు. చివర్లో మొయిన్ అలీ (39), బ్రాడ్ (21) ఫర్వాలేదనిపించారు. ఆసీస్ బౌలర్లలో హాజెల్‌వుడ్, జాన్సన్ చెరో మూడు వికెట్లు తీశారు. -
ఇంగ్లండ్ తడబాటు
తొలి ఇన్నింగ్స్ 85/4 ఆసీస్ 566/8 డిక్లేర్డ్ స్మిత్ డబుల్ సెంచరీ లార్డ్స్: యాషెస్ రెండో టెస్టులో ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి ఇంగ్లండ్ జట్టు తడబడుతోంది. రెండో రోజు శుక్రవారం ఆట ముగిసే సమయానికి తమ తొలి ఇన్నింగ్స్‌లో కుక్ సేన 29 ఓవర్లలో నాలుగు వికెట్లకు 85 పరుగులు చేసింది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌కు ఇంకా 481 పరుగులు వెనుకబడి ఉంది. తమ ఇన్నింగ్స్ రెండో బంతికే ప్రారంభమైన వికెట్ల పతనం 30 పరుగులకే నాలుగు వికెట్లు పడేదాకా సాగింది. అయితే ఈ దశలో జట్టును స్టోక్స్ (50 బంతుల్లో 38 బ్యాటింగ్; 5 ఫోర్లు; 1 సిక్స్), కెప్టెన్ కుక్ (85 బంతుల్లో 21 బ్యాటింగ్; 3 ఫోర్లు) ఆదుకున్నారు. జాన్సన్‌కు రెండు వికెట్లు పడ్డాయి. అంతకుముందు ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 149 ఓవర్లలో 8 వికెట్లకు 566 పరుగుల భారీ స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. స్టీవెన్ స్మిత్ (346 బంతుల్లో 215; 25 ఫోర్లు, 1 సిక్స్) డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. రోజర్స్ (300 బంతుల్లో 173; 28 ఫోర్లు) కీలక పాత్ర పోషించాడు. వీరిద్దరి మధ్య రెండో వికెట్‌కు 284 పరుగుల భారీ భాగస్వామ్యం ఏర్పడింది. ఇదే క్రమంలో తను కెరీర్లో తొలి డబుల్ సెంచరీని సాధించాడు. బ్రాడ్‌కు నాలుగు, రూట్‌కు రెండు వికెట్లు దక్కాయి. -
ఆసీస్ కు ఇంగ్లండ్ షాక్
కార్డిఫ్: యాషెస్ సిరీస్ లో భాగంగా ఆసీస్ తో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ ఘనవిజయం సాధించింది. 412 పరుగుల విజయ లక్ష్యంతో నాల్గో రోజు ఆట ప్రారంభించిన ఆసీస్ బ్యాటింగ్ ను ఇంగ్లండ్ బౌలర్లు కకావికలం చేశారు. ఇంగ్లండ్ బౌలర్లు సమిష్టిగా రాణించి ఆసీస్ రెండో ఇన్నింగ్స్ ను 242 పరుగులకే కుప్పకూల్చారు. దీంతో ఇంగ్లండ్ కు 169 పరుగుల భారీ విజయం చేకూరింది. ఆసీస్ ఆటగాళ్లలో ఆల్ రౌండర్ మిచెల్ జాన్సన్(77), డేవిడ్ వార్నర్(52), స్టీవ్ స్మిత్(33) మినహా ఎవరూ ఆకట్టుకోలేక పోవడంతో ఆసీస్ కు ఓటమి తప్పలేదు. మిగతా ఆటగాళ్లలో రోజర్స్(10), మైకేల్ క్లార్క్ (4), వోజస్ (1) , వాట్సన్(19), మిచెల్ స్టార్క్(17), హజిల్ వుడ్(14) లు విఫలం చెందడంతో ఇంకా రోజు ఆట మిగిలి ఉండగానే ఆసీస్ భారీ ఓటమిని చవిచూసింది. గత యాషెస్ సిరీస్ లో 0-5 తేడాతో ఓడిన ఇంగ్లండ్.. ఈసారి మాత్రం తొలి టెస్టులోనే ఇరగదీసింది. అటు బ్యాటింగ్ లో సత్తా చూపిన ఇంగ్లండ్ .. ఆపై బౌలింగ్ లో కూడా ఆకట్టుకుంది. ఇంగ్లండ్ బౌలర్లలో స్టువర్ట్ బ్రాడ్, మొయిన్ అలీ తలో మూడు వికెట్లు తీసి ఆసీస్ పతనాన్ని శాసించగా, మార్క్ వుడ్, రూట్ లు చెరో రెండు వికెట్లు తీసి విజయంలో తమ వంతు పాత్ర సమర్ధవంతంగా నిర్వర్తించారు. దీంతో ఐదు టెస్టుల సిరీస్ లో ఇంగ్లండ్ 1-0 ఆధిక్యం సంపాదించింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ -430 ఆలౌట్ (102.1 ఓవర్లు), రెండో ఇన్నింగ్స్- 289 ఆలౌట్(70.1 ఓవర్లు) ఆసీస్ తొలి ఇన్నింగ్స్-308 ఆలౌట్ (84.5ఓవర్లు), రెండో ఇన్నింగ్స్ 242 ఆలౌట్(70.3 ఓవర్లు) -
ఇంగ్లండ్‌కు ‘రూట్’ దొరికింది!
సెంచరీతో చెలరేగిన జో రూట్ యాషెస్ తొలి రోజు ఇంగ్లండ్ 343/7 కార్డిఫ్: దాదాపు రెండేళ్ల క్రితం 0-5తో చిత్తుగా ఓడిన యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ తరఫున ఒకే ఒక్క సెంచరీ నమోదయింది. ఈసారి మాత్రం సొంతగడ్డపై యాషెస్ తొలి రోజే ఆ జట్టు ఖాతాలో శతకం చేరింది. ఇటీవల అద్భుత ఫామ్‌లో ఉన్న జో రూట్ (166 బంతుల్లో 134; 17 ఫోర్లు) తన అద్వితీయ ఆటతీరుతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. ఫలితంగా మొదటి టెస్టు తొలి రోజు బుధవారం ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 343 పరుగులు చేసింది. గ్యారీ బ్యాలెన్స్ (149 బంతుల్లో 61; 8 ఫోర్లు), స్టోక్స్ (78 బంతుల్లో 52; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీలు సాధించారు. ప్రస్తుతం మొయిన్ అలీ (26 బ్యాటింగ్), బ్రాడ్ (0 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్‌ను ఆసీస్ బౌలర్లు కట్టడి చేశారు. దాంతో 43 పరుగులకే ఆ జట్టు లిత్ (6), కుక్ (20), బెల్ (1) వికెట్లు కోల్పోయింది. ఈ దశలో రూట్, బ్యాలెన్స్ కలిసి ఆదుకున్నారు. ‘సున్నా’ వద్ద స్టార్క్ బౌలింగ్‌లో కీపర్ హాడిన్ సునాయాస క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన రూట్ ఆ తర్వాత బౌండరీలతో చెలరేగిపోయాడు. తన శైలికి భిన్నంగా దూకుడుగా ఆడిన రూట్ 118 బంతుల్లోనే కెరీర్లో ఏడో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 77 ఏళ్ల తర్వాత యాషెస్ తొలి రోజు ఒక ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ శతకం సాధించడం విశేషం. నాలుగో వికెట్‌కు బ్యాలెన్స్‌తో 153 పరుగులు జోడించిన రూట్, ఐదో వికెట్‌కు స్టోక్స్‌తో 84 పరుగులు జోడించాడు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, హాజల్‌వుడ్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. యాషెస్కూ ఆరంభోత్సవం! సాధారణంగా ఎలాంటి హంగామా లేకుండా నేరుగా మ్యాచ్ మొదలయిపోయే యాషెస్ సిరీస్‌లో ఈ సారి కొత్తగా ప్రారంభోత్సవ వేడుకలు కూడా జరిగాయి. 1882-83 నాటి యాషెస్ వేడుకలను గుర్తు చేస్తూ ఈ సంబరం సాగింది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా దేశాల జాతీయ గీతాలాపన, బ్యాండ్ ట్రూప్ మెడ్లీ, బాణాసంచా...ఇలా అంతా కొత్తగా కనిపించింది. -
కొత్త సరకు
జోలో ప్లే 8ఎక్స్-1100... పెన్‌డ్రై వ్ను నేరుగా కనెక్ట్ చేసుకునేందుకు వీలుకల్పించే సరికొత్త స్మార్ట్‌ఫోన్ ఒకదాన్ని దేశీయ సంస్థ జోలో ఇటీవలే మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. జోలో ప్లే 8ఎక్స్-1100 పేరుతో అందుబాటులోకి వచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్ హైఎండ్ ఫీచర్లు కలిగి ఉంది. ఇందుకు తగ్గట్టుగానే ధర రూ.14,999. ఈ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ఫీచర్ ప్రాసెసర్ వేగం. ఎనిమిది కోర్లతో వచ్చే ప్రాసెసర్ 1.7 గిగాహెర్ట్జ్ క్లాక్‌స్పీడ్‌తో పనిచేస్తుంది. ర్యామ్ కూడా రెండు జీబీలు ఉండటం విశేషం. ప్రధాన కెమెరా 13 మెగాపిక్సెళ్ల సామర్థ్యం ఉండటంతోపాటు, సోనీ ఎక్స్మోర్ ఆర్ఎస్ సెన్సర్ కలిగి ఉండటం విశేషం. ఈ సెన్సర్ ద్వారా ఫొటోల నాణ్యత చాలా మెరుగ్గా ఉంటుంది. సెల్ఫీల కోసం 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఏర్పాటు చేశారు. ఫైల్ షేరింగ్ వేగంగా జరిగేందుకు ‘హాట్‌నాట్’ అనే కొత్త టెక్నాలజీని ఉపయోగించారు. మామూలు స్మార్ట్ఫోన్లతో పోలిస్తే హాట్‌నాట్ ద్వారా అయిదు రెట్లు ఎక్కువ వేగంతో ఫైల్ షేరింగ్ సాధ్యమని అంచనా. జోలో ప్లే ఇంటర్నల్ మెమరీ 16 జీబీ కాగా, ఎస్డీ కార్డు ద్వారా 32 జీబీ వరకూ పెంచుకోవచ్చు. సెల్కాన్ మిలినియం గ్లోరీ క్యూ5... లేటెస్ట్ ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టమ్, 1.3 గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, రెండు త్రీజీ సిమ్‌లకు సపోర్ట్... ఇవీ దేశీ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ సెల్కాన్ తాజాగా విడుదల చేసిన మిలినియం గ్లోరీ క్యూ5లో కనిపించే ప్రముఖమైన ఫీచర్లు. హై ఎండ్ ఫీచర్లు ఉన్నప్పటికీ ధర మాత్రం రూ.7299లు మాత్రమే ఉండటం విశేషం. అంతేకాదు... మొబైల్గేమింగ్ అంటే ఎక్కువ ఆసక్తి ఉన్న వారి కోసం గేమ్‌లాఫ్ట్ సహకారంతో ‘ప్రిన్స్ ఆఫ్ పర్షియా’, ‘ది అవెంజర్స్’, ‘మోడ్రన్ కాంబాట్ -4’ వంటి గేమ్స్‌ను ఇన్‌బిల్ట్‌గా లభిస్తాయి ఈ ఫోన్లో. స్క్రీన్ సైజు ఐదు అంగుళాలు. క్యూహెచ్డీ ఐపీఎస్ ఓజీఎస్ రకం స్క్రీన్ కావడం వల్ల చిత్రాల నాణ్యత మెరుగ్గా ఉంటుంది. భారతీయ భాషలకు సపోర్ట్ ఉండటం, ఒక గిగాబైట్ ర్యామ్, ఎనిమిది జీబీల ఇంటర్నల్ మెమరీ కొన్ని ఇతర ఫీచర్లు. బ్యాటరీ సామర్థ్యం 1800 ఎంఏహెచ్ మాత్రమే అయినప్పటికీ ఆపరేటింగ్ సిస్టమ్ కిట్‌క్యాట్ కాబట్టి మెరుగైన టాక్‌టైమ్, స్టాండ్‌బై టైమ్ లభించే అవకాశముంది. -
కొత్త సరుకు
కిట్‌క్యాట్‌తో శామ్సంగ్ స్టార్-2 లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ కిట్‌క్యాట్‌తో పనిచేసే మరో స్మార్ట్‌ఫోన్‌ను శామ్సంగ్ కంపెనీ భారత్‌లో ప్రవేశపెట్టింది. ‘స్టార్-2’ ప్లస్‌గా పిలుస్తున్న ఈ తాజా స్మార్ట్‌ఫోన్ ధర రూ.7335. గెలాక్సీ స్టార్-2 అప్‌గ్రేడ్ మాదిరిగా లభిస్తున్న ఈ ఫోన్ 4.2 అంగుళాల టీఎఫ్టీ స్క్రీన్ కలిగి ఉంది. ప్రాసెసర్ వేగం 1.2 గిగాహెర్ట్జ్ (డ్యుయెల్‌కోర్) కాగా, ర్యామ్ 512 ఎంబీ. ప్రధాన కెమెరా సామర్థ్యం మూడు మెగాపిక్సెళ్లు. ఎల్ఈడీ ఫ్లాష్ కూడా ఉంది. వీడియో కాలింగ్ కోసం ఫ్రంట్ కెమెరా ఏదీ దీంట్లో లేదు. ఫోన్ మెమరీ నాలుగు జీబీలైనప్పటికీ మైక్రోఎస్డీ కార్డు ద్వారా 32 జీబీల వరకూ పెంచుకోవచ్చు. త్రీజీ, వైఫై, బ్లూటూత్, జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఆప్షన్లు ఉన్నాయి. బ్యాటరీ సామర్థ్యం 1800 ఎంఏహెచ్. సెల్కాన్ మిలీనియం వోగ్.. కేవలం 7.9 మిల్లీమీటర్ల మందం... 1.2 క్వాడ్‌కోర్ ప్రాసెసర్.. లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఓఎస్ కిట్‌క్యాట్.. ఇవీ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సెల్కాన్ కంపెనీ తాజాగా విడుదల చేసిన మిలీనియం వోగ్ క్యూ455 స్మార్ట్‌ఫోన్ విశేషాలు. మోటరోలా ఇటీవల విడుదల చేసిన మోటో-ఈ ఫీచర్లను పోలిన ఈ స్మార్ట్‌ఫోన్‌లో ప్రత్యేక ఆకర్షణ 16 జీబీల ఇంటర్నల్ మెమరీ. ఎస్డీ కార్డు ద్వారా దీన్ని 64 జీబీల వరకూ పెంచుకోగలగడం మరో విశేషం. ఫొటోల కోసం 8 మెగాపిక్సెళ్ల ప్రధాన కెమెరా, సెల్ఫీల కోసం 1.3 ఎంపీ ఫ్రంట్ కెమెరాలు ఉన్నాయి. స్క్రీన్ సైజు 4.5 అంగుళాలు. బ్యాటరీ సామర్థ్యం 2000 ఎంఏహెచ్. ధర రూ.7999. ఓబీ ఆక్టోపస్ ఎస్ 520 ఆపిల్ కంపెనీ మాజీ సీఈవో జాన్ స్కలీ స్థాపించిన కొత్త కంపెనీ ఒబీ తాజాగా భారత మార్కెట్లో అక్టోపస్ ఎస్ 520 పేరుతో ఓ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టమ్, 1.7 గిగాహెర్ట్జ్ అక్టాకోర్ ప్రాసెసర్ దీని ప్రత్యేకతలు. ఇక ఇతర ఫీచర్ల విషయానికొస్తే... ఆక్టోపస్ ఎ520 దాదాపు 5 అంగుళాల స్క్రీన్, 1280 బై 720 పిక్సెల్ రెజల్యూషన్ కలిగి ఉంది. ఒక సాధారణ సిమ్, ఒక మైక్రోసిమ్‌ను సపోర్ట్ చేయగలదు. కిట్‌క్యాట్‌తో నడుస్తున్నప్పటికీ వన్ జీబీ వరకూ ర్యామ్‌ను ఏర్పాటు చేయడం వల్ల మల్టీటాస్కింగ్ మరింత వేగంగా జరుగుతుందని అర్థం చేసుకోవచ్చు. ఎనిమిది గిగాబైట్ల ఇంటర్నర్ మెమరీని ఎస్డీ కార్డు ద్వారా 32 జీబీల వరకూ పెంచుకోవచ్చు. ప్రధాన కెమెరా ఎల్ఈడీ ఫ్లాష్‌తో వస్తుంది. రెజల్యూషన్ 8 ఎంపీ. ఫ్రంట్ కెమెరా 2 ఎంపీ సామర్థ్యం కలిగి ఉంది. ప్రాక్సిమిటీ, ఆక్సెలరోమీటర్ సెన్సర్లు కూడా ఉన్నాయి. బ్యాటరీ సామర్థ్యం 1800 ఎంఏహెచ్. దీంతో నాలుగు గంటల టాక్‌టైమ్, 180 గంటల స్టాండ్‌బై టైమ్ లభిస్తుందని కంపెనీ అంటోంది. -
ఇంగ్లండ్ 226/6
మెల్బోర్న్: ఆస్ట్రేలియాతో గురువారం ప్రారంభమైన యాషెస్ నాలుగో టెస్టులో ఇంగ్లండ్ నిలకడగా ఆడుతోంది. కెవిన్ పీటర్సన్ (67 బ్యాటింగ్) అర్ధసెంచరీ చేయడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 89 ఓవర్లలో 6 వికెట్లకు 226 పరుగులు చేసింది. పీటర్సన్‌తో పాటు బ్రెస్నన్ (10 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఆసీస్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇంగ్లండ్ టాపార్డర్ కుక్ (27), కార్‌బెరీ (38), రూట్ (24) విఫలమయ్యారు. పీటర్సన్, బెల్ (27)తో కలిసి నాలుగో వికెట్‌కు 67 పరుగుల భాగస్వామ్యం నెలకొన్నాక... హారిస్ బౌలింగ్‌లో బెల్ వెనుదిరిగాడు. అయితే రెండుసార్లు అవుటయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డ కెవిన్ ఆ తర్వాత మరింత జాగ్రత్తగా ఆడాడు. రెండో ఎండ్‌లో స్టోక్స్ (14), బెయిర్‌స్టో (10) వెంటవెంటనే అవుటైనా... పీటర్సన్ మాత్రం వికెట్‌ను కాపాడుకునేందుకు ప్రాధాన్యమిచ్చాడు. ఈ క్రమంలో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివరకు బ్రెస్నన్‌తో కలిసి మరో వికెట్ పడకుండా రోజును ముగించాడు. హారిస్, జాన్సన్ చెరో రెండు వికెట్లు తీయగా, సిడిల్, వాట్సన్‌లకు ఒక్కో వికెట్ దక్కింది. రికార్డు స్థాయిలో ప్రేక్షకులు ఇప్పటికే యాషెస్ సిరీస్ ఆస్ట్రేలియా సొంతమైనా.. నాలుగో టెస్టుకు మాత్రం ప్రేక్షకులు పోటెత్తారు. తొలి రోజు ఆటను తిలకించేందుకు రికార్డు స్థాయిలో 91 వేల 092 మంది హాజరయ్యారు. తద్వారా ప్రపంచ రికార్డును సృష్టించారు. టెస్టు మ్యాచ్‌కు ఒక్క రోజు హాజరైన అత్యధిక ప్రేక్షకుల సంఖ్య ఇది. 1961లో ఆసీస్, విండీస్‌ల మధ్య ఇక్కడే జరిగిన మ్యాచ్‌కు 90,800 మంది హాజరయ్యారు. -
మద్యం మత్తులో...
పెర్త్: చిత్తుగా తాగటం...ఆ తర్వాత గొడవలు పెట్టుకోవడమో, నోరు జారడమో ఆస్ట్రేలియా ఆటగాళ్లకు కొత్త కాదు. ఈ సారి పేసర్ ర్యాన్ హారిస్ వంతు. యాషెస్ గెలిచిన ఆనందంలో ఉన్న హారిస్ ట్విట్టర్లో అసభ్య వ్యాఖ్యలు చేశాడు. మ్యాచ్ ముగిసిన రాత్రి ‘స్థానిక క్రౌన్ కేసినో’లో అతడిని సెక్యూరిటీ సిబ్బంది లోపలికి అనుమతించలేదు. హారిస్ బాగా ఎక్కువగా తాగి ఉండటమే అందుకు కారణం. జట్టు గెలుపు అనంతరం ఆసీస్ దిగ్గజం షేన్‌వార్న్ కంగారూ టీమ్‌కు పార్టీ ఇచ్చాడు. పార్టీలో బాగా తాగిన హారిస్, మరో పేసర్ కౌల్టర్ నీల్ అక్కడే ఉన్న కేసినోకి వెళ్లే ప్రయత్నం చేశారు. తమను అనుమతించకపోవడంతో హారిస్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాగి ఉంటే కాసినోలోకి పంపించరా అంటూ ట్విట్టర్లో అసభ్య పదజాలంతో వ్యాఖ్యలు చేశాడు. దీనిపై అన్ని వైపులనుంచి తీవ్ర విమర్శలు రావడంతో అతడు తర్వాత దానిని తొలగించి క్షమాపణలు కూడా చెప్పాడు. ‘ ఆ ట్వీట్ పెట్టడం తప్పే. సెక్యూరిటీ గార్డ్లు సరిగ్గానే వ్యవహరించారు. తాగి ఉన్నప్పుడు ట్వీట్ చేయకూడదని తెలుసుకున్నాను’ అని హారిస్ అన్నాడు. -
సాధించారోచ్..!
పెర్త్: ఎప్పుడో 2009లో ఇంగ్లండ్‌కు ‘యాషెస్’ను కోల్పోయిన ఆస్ట్రేలియా... ఆ తర్వాత మరో రెండుసార్లు విశ్వప్రయత్నాలు చేసినా... తిరిగి విజయాన్ని దక్కించుకోలేకపోయింది. తాజాగా నాలుగు నెలల క్రితం ఇంగ్లండ్‌లో ఘోరమైన ఆటతీరుతో పరాభవాన్ని మూటగట్టుకున్న ఆస్ట్రేలియా... ఎట్టకేలకు జూలు విదిల్చింది. తొలి మూడు టెస్టుల్లోనే ఘన విజయాలు సాధించి... ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో రెండు టెస్టులు మిగిలుండగానే 3-0తో సాధించింది. దీంతో కేవలం నాలుగు నెలల్లోనే కుక్‌సేన మీద ప్రతీకారం తీర్చుకున్నట్లయింది. మంగళవారం వాకాలో ముగిసిన మూడో టెస్టులోనూ ఆసీస్ 150 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై నెగ్గింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 3-0 ఆధిక్యంలో నిలిచింది. 504 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 251/5 ఓవర్‌నైట్ స్కోరుతో ఆఖరి రోజు ఆట కొనసాగించిన ఇంగ్లండ్... రెండో ఇన్నింగ్స్‌లో 103.2 ఓవర్లలో 353 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ స్టోక్స్ (195 బంతుల్లో 120; 18 ఫోర్లు, 1 సిక్సర్) సెంచరీతో చెలరేగినా, ప్రయర్ (26) విఫలమయ్యాడు. వీరిద్దరి మధ్య ఆరో వికెట్‌కు 76 పరుగుల భాగస్వామ్యం నెలకొంది. నిలకడగా ఆడుతున్న ఈ జోడిని జాన్సన్ విడగొట్టడంతో వికెట్లపతనం మొదలైంది. తర్వాత వచ్చిన బ్రెస్నన్ (12) క్రీజులో కుదురుకునేందుకు ప్రాధాన్యమివ్వడంతో 332/6 స్కోరుతో ఇంగ్లండ్ లంచ్‌కు వెళ్లింది. అయితే లంచ్ తర్వాత సెంచరీ పూర్తి చేసిన స్టోక్స్‌ను లియోన్ దెబ్బతీశాడు. బంతిని స్వీప్ చేయబోయి హాడిన్ చేతికి చిక్కాడు. దీంతో బ్రెస్నన్, స్టోక్స్‌ల మధ్య ఏడో వికెట్‌కు నెలకొన్న 40 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. స్వాన్ (4), బ్రెస్నన్, అండర్సన్ (2) వెంటవెంటనే అవుట్ కావడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. జాన్సన్ 4, లియోన్ 3 వికెట్లు పడగొట్టారు. స్టీవ్ స్మిత్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య నాలుగో టెస్టు ఈనెల 26 నుంచి మెల్బోర్న్లో జరుగుతుంది. 3 తొలి మూడు టెస్టుల్లో గెలిచి యాషెస్‌ను దక్కించుకోవడం ఆస్ట్రేలియాకు ఇది మూడోసారి. 32 ప్రస్తుత విజయంతో కలిపి ఆసీస్ ఇప్పటి వరకు 32 సార్లు యాషెస్‌ను గెలుచుకుంది. 68 యాషెస్ సిరీస్‌ల్లో ఇంగ్లండ్ 31సార్లు గెలవగా, ఐదుసార్లు సిరీస్ డ్రా అయ్యింది. -
ఆసీస్ ఘనవిజయం
మాంచెస్టర్: యాషెస్‌ను ఘోరంగా ఓడినప్పటికీ ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్‌ను ఆస్ట్రేలియా జట్టు ఘనంగానే ఆరంభించింది. తొలి వన్డే వర్షార్పణం కాగా కెప్టెన్ మైకేల్ క్లార్క్ (102 బంతుల్లో 105; 14 ఫోర్లు) మెరుపు సెంచరీ సహాయంతో రెండో వన్డేను 88 పరుగుల తేడాతో గెలుచుకుంది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ 50 ఓవర్లలో ఏడు వికెట్లకు 315 పరుగుల భారీ స్కోరు సాధించింది. తొలి ఓవర్లోనే షాన్ మార్ష్ వెనుదిరిగినా ఆసీస్ జోరు ఏమాత్రం తగ్గలేదు. క్లార్క్, జార్జి బెయిలీ (67 బంతుల్లో 82; 5 ఫోర్లు; 4 సిక్స్) తుఫాన్ ఆటతీరుతో స్కోరు బోర్డు ఉరకలెత్తింది. నాలుగో వికెట్‌కు వీరి మధ్య 155 పరుగుల భారీ స్కోరు లభించింది. ఫిన్, రాన్‌కిన్, బొపారాలకు రెండేసి వికెట్లు దక్కాయి. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన ఇంగ్లండ్ 44.2 ఓవర్లలో 227 పరుగులకు ఆలౌట్ అయ్యింది. -
యాషెస్ నెగ్గిన ఇంగ్లండ్
లండన్: ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌ను వరుసగా మూడోసారి ఇంగ్లండ్ జట్టు నిలబెట్టుకుంది. ఆస్ట్రేలియా కెప్టెన్ మైకేల్ క్లార్క్ సాహసోపేతమైన నిర్ణయం ఫలితాన్నివ్వలేక పోయింది. కనీసం చివరి టెస్టునైనా గెలుచుకోవాలనే ఉద్దేశంతో 226 పరుగుల స్వల్ప ఆధిక్యంలో ఉండగానే క్లార్క్ తమ రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ల్ చేశాడు. వీలైనంత త్వరగా ఇంగ్లండ్ వికెట్లను తీద్దామనుకున్నప్పటికీ ఆతిథ్య జట్టు బ్యాట్స్‌మెన్ అంత సులువుగా లొంగలేదు. కెవిన్ పీటర్సన్ (55 బంతుల్లో 62; 10 ఫోర్లు) అద్భుత ఆటతీరుతో చెలరేగడంతో ఓ దశలో ఇంగ్లండ్ సంచలన విజయం వైపు పయనించింది. ఈ జోడి టి20 ఆటతీరును కనబరచడంతో పరుగుల వరద పారింది. చూడముచ్చటైన బౌండరీలతో కెవిన్ అలరించాడు. 36 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. అయితే వరుస ఓవర్లలో పీటర్సన్, ట్రాట్ (87 బంతుల్లో 59; 6 ఫోర్లు) అవుట్ కావడంతో దూకుడు తగ్గింది. వీరిద్దరి మధ్య మూడో వికెట్‌కు 15 ఓవర్లలోనే 77 పరుగులు జత చేరాయి. దీంతో కెన్నింగ్టన్ ఓవల్‌లో జరిగిన చివరిదైన ఐదో టెస్టు డ్రాగా ముగిసింది. 227 పరుగుల టార్గెట్‌తో ఆట చివరి రోజు తమ రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన కుక్ సేన 40 ఓవర్లలో 5 వికెట్లకు 206 పరుగులు చేసింది. మరో నాలుగు ఓవర్లు మిగిలి ఉండగానే వెలుతురు సరిగా లేదని అంపైర్లు ఆటను నిలిపివేశారు. అయితే అంతకుముందే ఒక్కసారిగా క్లార్క్ తమ ఆటగాళ్లను తీసుకుని మైదానం వీడాడు. అంతకుముందు 247/4 ఓవర్‌నైట్ స్కోరుతో చివరి రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 377 పరుగులకు ఆలౌటయ్యింది. ఇయాన్ బెల్ (143 బంతుల్లో 45; 5 ఫోర్లు), ప్రియర్ (57 బంతుల్లో 47; 8 ఫోర్లు) రాణించారు. ఫాల్క్‌నర్‌కు నాలుగు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత తమ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్‌ను ఆరంభంలోనే ఇంగ్లండ్ బౌలర్లు వణికించారు. వికెట్లు త్వరగా పడిపోతుండడంతో 23 ఓవర్లలో 6 వికెట్లకు 111 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్ చేసింది. క్లార్క్ (28 బంతుల్లో 28 నాటౌట్; 3 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అప్పటికి ఆసీస్ 226 పరుగుల ఆధిక్యంలో ఉంది. స్టువర్ట్ బ్రాడ్ నాలుగు వికెట్లు తీశాడు. -
భారీ స్కోరు దిశగా ఆసీస్
లండన్: యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇక్కడ ఇంగ్లండ్‌తో జరుగుతున్న చివరి టెస్టులో ఆస్ట్రేలియా దుమ్ముదులుపుతోంది. షేన్ వాట్సన్ సెంచరీ పైగా పరుగుల నమోదు చేసి అజేయంగా నిలవడంతో ఆసీస్ భారీ పరుగులు చేసే దిశగా పయనిస్తోంది. ఆసీస్ ఓపెనర్లు రోజర్స్(23), వార్నర్(6) లు ఆదిలోనే పెవిలియన్‌కు చేరి ఆసీస్‌ను నిరాశ పరిచారు. అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన వాట్సన్ ఇంగ్లండ్ బౌలర్లకు పని చెబుతున్నాడు. వాట్సన్‌ను అవుట్ చేసేందుకు ఎన్ని ప్రయోగాలు చేసినా ఇంగ్లండ్‌కు ఫలితానివ్వడం లేదు. 206 బంతులను ఎదుర్కొన్న వాట్సన్ 22 ఫోర్లు, 1 సిక్స్‌తో నాటౌట్‌గా నిలిచాడు . ప్రస్తుతం 74.0 ఓవర్ల ముగిసే సరికి ఆసీస్ మూడు వికెట్లు కోల్పోయి 240 పరుగులు చేసింది. వాట్సన్‌కు తోడుగా, స్మిత్ (38) పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో అండర్సన్‌కు రెండు వికెట్లు లభించగా, స్వాన్‌కు ఒక వికెట్టు దక్కింది. ఇప్పటికే ఇంగ్లండ్‌కు 3-0 తేడాతో సిరీస్‌ను అప్పగించిన ఆసీస్..ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని భావిస్తోంది. -
ఇంగ్లండ్‌దే సిరీస్
చెస్టర్ లీ స్ట్రీట్: ఆస్ట్రేలియా జట్టు మరోసారి యాషెస్‌లో తమ పేలవ ప్రదర్శన కొనసాగించింది. 299 పరుగుల లక్ష్యం... రెండు రోజుల సమయం ఉన్నప్పటికీ కంగారెత్తి తగిన మూల్యం చెల్లించుకుంది. 68.3 ఓవర్లలో 224 పరుగులకే ఆలౌట్ అయింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (113 బంతుల్లో 71; 10 ఫోర్లు; 1 సిక్స్), రోజర్స్ (100 బంతుల్లో 49; 8 ఫోర్లు) అందించిన శుభారంభాన్ని మిడి లార్డర్ సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లతో రెచ్చిపోవడంతో ఆసీస్ కోలుకోలేకపోయింది. దీంతో నాలుగో టెస్టును ఇంగ్లండ్ 74 పరుగుల తేడాతో గెలిచి 3-0తో సిరీస్ సాధించింది. ఇరు జట్ల మధ్య మరో టెస్టు మిగిలి ఉంది. వార్నర్, రోజర్స్ సమర్థవంతంగా ఆడడంతో తొలి వికెట్‌కు 109 పరుగులు జత చేరాయి. అప్పటి వరకు పటిష్ట స్థితిలో కనిపించిన ఆసీస్ ఆ తర్వాత పూర్తిగా తడబడింది. 74 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసిన వార్నర్‌ను టీ విరామం తర్వాత బ్రెస్నన్ దెబ్బతీశాడు. ఇక్కడి నుంచి ఆసీస్ పతనం ప్రారంభమైంది. బ్రాడ్ నిప్పులు చెరిగే బంతులతో విరుచుకుపడడంతో ఆసీస్ చివరి ఏడు వికెట్లను 50 పరుగుల తేడాతో కోల్పోయింది. చివర్లో సిడిల్ (48 బంతుల్లో 23; 2 ఫోర్లు) పోరాడినా సహకారం కరువైంది. తొలి ఇన్నింగ్స్‌లోనూ బ్రాడ్ ఐదు వికెట్లు తీయడం విశేషం. బ్రెస్నన్, స్వాన్లకు రెండేసి వికెట్లు దక్కాయి. అంతకుముందు 234/5 ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్‌ను 330 పరుగుల వద్ద ముగించింది. బెల్ (210 బంతుల్లో 113; 11 ఫోర్లు) త్వరగానే అవుటయినప్పటికీ బ్రెస్నన్ (90 బంతుల్లో 45; 6 ఫోర్లు) ఆసీస్ బౌలర్లను ప్రతిఘటించాడు. -
యాషెస్ సిరీస్ మూడో టెస్టు డ్రా
వరుసగా రెండు టెస్టుల్లో ఘోర వైఫల్యం... ఇంటా బయటా విమర్శలు... ఇక యాషెస్ కోసం ప్రతి మ్యాచ్‌లోనూ చావోరేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి... ఈ నేపథ్యంలో మూడో టెస్టులో ఆస్ట్రేలియా జట్టు జూలు విదిల్చింది. విజయం కోసం పోరాడింది. కానీ క్లార్క్సేనకు వరుణుడు అడ్డుగా నిలిచాడు. వర్షం కారణంగా ఇంగ్లండ్‌తో మూడో టెస్టు డ్రాగా ముగిసింది. మిగిలిన రెండు టెస్టుల్లో ఆసీస్ గెలిచి సిరీస్ సమం చేసినా... టైటిల్ దక్కే అవకాశం లేదు. మాంచెస్టర్: వరుసగా రెండు పరాజయాల అనంతరం ఎలాగైనా యాషెస్ మూడో టెస్టును గెలవాలని ప్రయత్నించిన ఆస్ట్రేలియా జట్టు ఆశలు ఆవిరయ్యాయి. ఇంగ్లండ్‌తో జరిగిన ఈ టెస్టు చివరి రోజు ఆటకు వరుణుడు ఆటంకం కలిగించాడు. దీంతో పూర్తి ఆట సాధ్యం కాకపోవడంతో మ్యాచ్‌ను డ్రాగా ప్రకటించారు. ఇప్పటికే ఇంగ్లండ్ 2-0 ఆధిక్యంతో ఉండగా మిగిలిన రెండు టెస్టులు కోల్పోయినా డి ఫెండింగ్ చాంపియన్ హోదాలో యాషెస్‌ను తమ దగ్గరే ఉంచుకున్నట్టవుతుంది. అంతకుముందు ఆతిథ్య ఇంగ్లండ్ జట్టుకు ఆసీస్ 332 పరుగుల లక్ష్యాన్ని విధించింది.సోమవారం చివరి రోజు ఆట వర్షం కారణంగా అరగంట ఆలస్యంగా ప్రారంభమైంది. ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్... ఆట నిరవధికంగా ఆగే సమయానికి 20.3 ఓవర్లలో మూడు వికెట్లకు 37 పరుగులు చేసింది. ప్రారంభం నుంచే ఇంగ్లండ్‌ను ఆసీస్ బౌలర్లు కట్టడి చేశారు. మూడో ఓవర్లోనే కుక్‌ను హారిస్ డకౌట్ చేశాడు. ఆ తర్వాత వరుస విరామాల్లో ట్రాట్ (11), పీటర్సన్ (8) అవుట్ అయ్యారు. లంచ్ విరామానంతరం మూడు బంతులు పడిన తర్వాత భారీ వర్షం కురిసింది. ఏమాత్రం తెరిపిలేకుండా కురుస్తున్న వర్షంతో ఇక ఆసీస్ ఆశలు వదులుకుంది. అటు అంపైర్లు మ్యాచ్‌ను డ్రాగా ప్రకటించారు. మూడు మ్యాచ్‌ల అనంతరం ఇంగ్లండ్ యాషెస్‌ను నిలబెట్టుకోవడం 1928-29 తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం. మైకేల్ క్లార్క్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. ఇరు జట్ల మధ్య నాలుగో టెస్టు ఈనెల 9 నుంచి జరుగుతుంది.