కొత్త సరకు | The new cargo | Sakshi
Sakshi News home page

కొత్త సరకు

Published Wed, Sep 3 2014 11:02 PM | Last Updated on Tue, Nov 6 2018 5:26 PM

The new cargo

జోలో ప్లే 8ఎక్స్-1100...
 
పెన్‌డ్రై వ్‌ను నేరుగా కనెక్ట్ చేసుకునేందుకు వీలుకల్పించే సరికొత్త స్మార్ట్‌ఫోన్ ఒకదాన్ని దేశీయ సంస్థ జోలో ఇటీవలే మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. జోలో ప్లే 8ఎక్స్-1100 పేరుతో అందుబాటులోకి వచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్ హైఎండ్ ఫీచర్లు కలిగి ఉంది. ఇందుకు తగ్గట్టుగానే ధర రూ.14,999. ఈ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ఫీచర్ ప్రాసెసర్ వేగం. ఎనిమిది కోర్లతో వచ్చే ప్రాసెసర్ 1.7 గిగాహెర్ట్జ్ క్లాక్‌స్పీడ్‌తో పనిచేస్తుంది. ర్యామ్ కూడా రెండు జీబీలు ఉండటం విశేషం. ప్రధాన కెమెరా 13 మెగాపిక్సెళ్ల సామర్థ్యం ఉండటంతోపాటు, సోనీ ఎక్స్‌మోర్ ఆర్‌ఎస్ సెన్సర్ కలిగి ఉండటం విశేషం. ఈ సెన్సర్ ద్వారా ఫొటోల నాణ్యత చాలా మెరుగ్గా ఉంటుంది. సెల్ఫీల కోసం 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఏర్పాటు చేశారు. ఫైల్ షేరింగ్ వేగంగా జరిగేందుకు ‘హాట్‌నాట్’ అనే కొత్త టెక్నాలజీని ఉపయోగించారు. మామూలు స్మార్ట్‌ఫోన్లతో పోలిస్తే హాట్‌నాట్ ద్వారా అయిదు రెట్లు ఎక్కువ వేగంతో ఫైల్ షేరింగ్ సాధ్యమని అంచనా. జోలో ప్లే ఇంటర్నల్ మెమరీ 16 జీబీ కాగా, ఎస్‌డీ కార్డు ద్వారా 32 జీబీ వరకూ పెంచుకోవచ్చు.
 
సెల్‌కాన్ మిలినియం గ్లోరీ క్యూ5...
 
లేటెస్ట్ ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టమ్, 1.3 గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, రెండు త్రీజీ సిమ్‌లకు సపోర్ట్... ఇవీ దేశీ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ సెల్‌కాన్ తాజాగా విడుదల చేసిన మిలినియం గ్లోరీ క్యూ5లో కనిపించే ప్రముఖమైన ఫీచర్లు. హై ఎండ్ ఫీచర్లు ఉన్నప్పటికీ ధర మాత్రం రూ.7299లు మాత్రమే ఉండటం విశేషం. అంతేకాదు... మొబైల్‌గేమింగ్ అంటే ఎక్కువ ఆసక్తి ఉన్న వారి కోసం గేమ్‌లాఫ్ట్ సహకారంతో ‘ప్రిన్స్ ఆఫ్ పర్షియా’, ‘ది అవెంజర్స్’, ‘మోడ్రన్ కాంబాట్ -4’ వంటి గేమ్స్‌ను ఇన్‌బిల్ట్‌గా లభిస్తాయి ఈ ఫోన్‌లో. స్క్రీన్ సైజు ఐదు అంగుళాలు. క్యూహెచ్‌డీ ఐపీఎస్ ఓజీఎస్ రకం స్క్రీన్ కావడం వల్ల చిత్రాల నాణ్యత మెరుగ్గా ఉంటుంది. భారతీయ భాషలకు సపోర్ట్ ఉండటం, ఒక గిగాబైట్ ర్యామ్, ఎనిమిది జీబీల ఇంటర్నల్ మెమరీ కొన్ని ఇతర ఫీచర్లు. బ్యాటరీ సామర్థ్యం 1800 ఎంఏహెచ్ మాత్రమే అయినప్పటికీ ఆపరేటింగ్ సిస్టమ్ కిట్‌క్యాట్ కాబట్టి మెరుగైన టాక్‌టైమ్, స్టాండ్‌బై టైమ్ లభించే అవకాశముంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement