పటిష్ట స్థితిలో ఆస్ట్రేలియా | Ashes 2015: England v Australia: second Test, day three | Sakshi
Sakshi News home page

పటిష్ట స్థితిలో ఆస్ట్రేలియా

Published Sun, Jul 19 2015 12:47 AM | Last Updated on Sun, Sep 3 2017 5:45 AM

Ashes 2015: England v Australia: second Test, day three

రెండో ఇన్నింగ్స్‌లో 108/0    
 ఇంగ్లండ్‌తో రెండో టెస్టు

 
 లార్డ్స్: ‘యాషెస్’ తొలి టెస్టులో ఓడిపోయిన ఆస్ట్రేలియా రెండో టెస్టులో పుంజుకుంది. బౌలింగ్‌లో చెలరేగిన కంగారూలు బ్యాటింగ్‌లోనూ నిలకడగా రాణిస్తుండటంతో శనివారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 26 ఓవర్లలో వికెట్లేమీ నష్టపోకుండా 108 పరుగులు చేసింది. ఓపెనర్లు వార్నర్ (60 బ్యాటింగ్), రోజర్స్ (44 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఓవరాల్‌గా క్లార్క్ సేన 362 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 85/4తో మూడో రోజు ఆట కొనసాగించిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 90.1 ఓవర్లలో 312 పరుగులకు ఆలౌటైంది.
 
 దీంతో ఆసీస్‌కు 254 పరుగుల ఆధిక్యం లభించింది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ కుక్ (96; 13 ఫోర్లు) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. స్టోక్స్ (87; 13 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి ఐదో వికెట్‌కు 145 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను గట్టెక్కించాడు. చివర్లో మొయిన్ అలీ (39), బ్రాడ్ (21) ఫర్వాలేదనిపించారు. ఆసీస్ బౌలర్లలో హాజెల్‌వుడ్, జాన్సన్ చెరో మూడు వికెట్లు తీశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement