first test
-
దక్షిణాఫ్రికా లక్ష్యం 148
సెంచూరియన్: పాకిస్తాన్‌తో జరుగుతున్న ‘బాక్సింగ్ డే’ తొలి టెస్టులో ఆతిథ్య దక్షిణాఫ్రికా గెలుపుబాటలో 121 పరుగుల దూరంలో ఉంది. అయితే కీలకమైన 3 వికెట్లు కోల్పోవడం వల్ల సఫారీకి నాలుగో రోజు ఛేజింగ్ అంత సులభంగా అయితే లేదు. అంతకుముందు శనివారం 88/3 ఓవర్‌నైట్ స్కోరుతో మూడోరోజు రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన పాకిస్తాన్ 59.4 ఓవర్లలో 237 పరుగుల వద్ద ఆలౌటైంది. క్రితం రోజు బ్యాటర్లు బాబర్ ఆజమ్ (85 బంతుల్లో 50; 9 ఫోర్లు), సౌద్ షకీల్ (113 బంతుల్లో 84; 10 ఫోర్లు, 1 సిక్స్) ఇద్దరు అర్ధసెంచరీలతో ఆకట్టుకున్నారు. వీరి జోడి నిలబడినంతవరకు బాగానే ఉన్నా... బాబర్ ఫిఫ్టీ తర్వాత నిష్క్రమించడంతో కథ మొదటికొచ్చిoది. జట్టు స్కోరు 153 పరుగుల వద్ద బాబర్‌ను జాన్సెన్ అవుట్ చేశాడు. దీంతో నాలుగో వికెట్‌కు 79 పరుగుల భాగస్వామ్యం ముగియగా, తర్వాత వచ్చిన రిజ్వాన్ (3), సల్మాన్ ఆఘా (1)లను జాన్సెన్ పెవిలియన్ చేర్చడంతో 176 స్కోరు వద్ద ఆరో వికెట్ పడింది. సఫారీ బౌలర్లు ఇదే జోరు సాగిచండంతో పాక్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. మార్కో జాన్సెన్ 6 వికెట్లు పడగొట్టగా, రబడకు 2 వికెట్లు దక్కాయి. తొలిఇన్నింగ్స్‌లో సఫారీకి 90 పరుగుల ఆధిక్యం దక్కడం వల్ల 148 పరుగుల లక్ష్యమే ఎదురైంది. దీన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా ఆట నిలిచే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 9 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 27 పరుగులు చేసింది. -
‘క్రో–థోర్ప్’ ట్రోఫీ కోసం న్యూజిలాండ్, ఇంగ్లండ్ పోరు
లండన్: భారత్, ఆ్రస్టేలియాల మధ్య జరుగుతున్న ప్రతిష్టాత్మక ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లాగే ఇకపై న్యూజిలాండ్, ఇంగ్లండ్‌ల జట్ల మధ్య ‘క్రో–థోర్ప్ ట్రోఫీ’ నిర్వహించనున్నారు. న్యూజిలాండ్ దివంగత దిగ్గజం మార్టిన్ క్రో, ఇంగ్లండ్ దివంగత లెజెండ్ గ్రాహం థోర్ప్ల పేరిట ఈ ఏడాది నుంచి ద్వైపాక్షిక సిరీస్ అంకురార్పణ జరగనుంది. విజేతకు బహూకరించే ట్రోఫీకి మరో ప్రత్యేకత కూడా ఉంది. ఆ ఇద్దరు దిగ్గజ క్రికెటర్ల బ్యాట్లను ఉపయోగించి ‘క్రో–థోర్ప్ ట్రోఫీ’ని రూపొందించారు. న్యూజిలాండ్‌కు చెందిన ప్రముఖ డిజైనర్ డేవిడ్ ఎన్గవాటి ఈ కలప (బ్యాట్) ట్రోఫీని తయారు చేశారు. ప్రపంచ శ్రేణి కళాకృతులను, వినియోగదారుల అభిరుచులకు తగ్గ ఆకృతులను (కస్టమ్ డిజైన్) తయారు చేయడంలో ‘మహు క్రియేటివ్’ సంస్థకు మంచి పేరుంది. డేవిడ్‌కు చెందిన ఈ సంస్థే గతంలో కివీస్, సఫారీల మధ్య జరిగిన టోర్నీ కోసం ‘తంగివాయ్ షీల్డ్’ను రూపొందించింది. దిగ్గజ క్రికెటర్ల విషయానికొస్తే అసలైన క్రికెట్ ఫార్మాట్ (టెస్టు)లో అటు మారి్టన్ క్రో... ఇటు గ్రాహం థోర్ప్ అంతర్జాతీయ క్రికెట్లో తమదైన ముద్ర వేశారు. తన కెరీర్లో 77 టెస్టులాడిన క్రో 45.36 సగటుతో 5444 పరుగులు చేశాడు. ఇందులో 17 సెంచరీలు, 18 అర్ధసెంచరీలున్నాయి. 143 వన్డేల్లో 38.55 సగటుతో 4704 పరుగులు సాధించాడు. 4 శతకాలు, 34 అర్ధశతకాలు బాదాడు. థోర్ప్ సరిగ్గా 100 టెస్టులాడాడు. 44.66 సగటుతో 6744 పరుగులు చేశాడు. 16 సెంచరీలు, 39 ఫిఫ్టీలున్నాయి. వన్డే కెరీర్లో 82 మ్యాచ్‌ల్లో 37.18 సగటుతో 2380 పరుగులు చేశాడు. 21 అర్ధసెంచరీలున్నాయి. సాధారణంగా క్రికెట్ ట్రోఫీలన్నీ లోహం (మెటల్)తోనే తయారవుతాయి. కానీ ‘కో–థోర్ప్ ట్రోఫీ’ మాత్రం భిన్నమైంది. ఇరు దిగ్గజ క్రికెటర్ల కుటుంబాలు బ్యాట్లు ఇవ్వడంతో డేవిడ్ తన నైపుణ్యంతో కలప ‘టోఫీ’గా మలిచాడు. దీన్ని మారి్టన్ సోదరి డెబ్ క్రో, మాజీ ఇంగ్లండ్ సారథి మైకేల్ అథర్టన్ కలిసి గురువారం క్రైస్ట్‌చర్చ్‌లో మొదలయ్యే తొలి టెస్టు సందర్భంగా జరిగే కార్యక్రమంలో ఆవిష్కరిస్తారు. -
బెంబేలెత్తించిన బుమ్రా.. విజయం వాకిట్లో టీమిండియా
కంగారూలకు పెట్టని కోటలాంటి పెర్త్‌లో టీమిండియా అదరగొడుతోంది. బౌలర్ల స్ఫూర్తికి బ్యాటర్ల జోరు తోడవడంతో ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో భారత్ తొలి విజయానికి చేరువైంది. యశస్వి జైస్వాల్ భారీ సెంచరీకి... కోహ్లి సమయోచిత శతకం తోడవడంతో ఆ్రస్టేలియా ముందు టీమిండియా 534 పరుగుల కొండంత లక్ష్యాన్ని ఉంచింది.మన ఆటగాళ్లు చెడుగుడు ఆడుకున్న పిచ్‌పై ఆసీస్ బ్యాటర్లు తడబడ్డారు. ఫలితంగా 4.2 ఓవర్లలోనే ఆతిథ్య జట్టు 3 వికెట్లు కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో గెలుపు ఆశలు వదులుకున్న ఆసీస్ ఆటగాళ్లు నాలుగో రోజు ఎంత సమయం క్రీజులో నిలుస్తారో వేచి చూడాలి!పెర్త్: ప్రతిష్టాత్మక ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో భారత జట్టు తొలి టెస్టులో విజయానికి చేరువైంది. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా బ్యాటర్లు చెలరేగడంతో ఆ్రస్టేలియా ముందు కొండంత లక్ష్యం నిలిచింది. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (297 బంతుల్లో 161; 15 ఫోర్లు, 3 సిక్స్‌లు) భారీ సెంచరీతో కదంతొక్కగా... విరాట్ కోహ్లి (143 బంతుల్లో 100 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) కళాత్మక శతకంతో విజృంభించాడు. ఓవర్‌నైట్ స్కోరు 172/0తో మూడో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 134.3 ఓవర్లలో 487/6 వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. కేఎల్ రాహుల్ (176 బంతుల్లో 77; 5 ఫోర్లు) ఎక్కువసేపు నిలవలేకపోగా... ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి (27 బంతుల్లో 38 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ధాటిగా ఆడాడు. కోహ్లి సెంచరీ పూర్తి కాగానే భారత కెపె్టన్ బుమ్రా ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు. ఫలితంగా ఆ్రస్టేలియా ముందు 534 పరుగుల లక్ష్యం నిలిచింది. లయన్ 2... స్టార్క్, హాజల్‌వుడ్, కమిన్స్, మార్ష్తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ఆస్ట్రేలియా ఆదివారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 4.2 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 12 పరుగులు చేసింది. బుమ్రా (2/1), సిరాజ్ (1/7) ఆసీస్‌ను దెబ్బ కొట్టారు. మెక్‌స్వీనీ (0), కమిన్స్ (2), లబుషేన్ (3) అవుట్ కాగా... ఉస్మాన్ ఖ్వాజా (9 బంతుల్లో 3 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. చేతిలో 7 వికెట్లు ఉన్న ఆసీస్... విజయానికి ఇంకా 522 పరుగులు చేయాల్సి ఉంది. భారత బౌలర్ల జోరు ఇలాగే సాగితే సోమవారం తొలి సెషన్లోనే ఆసీస్ ఆట ముగిసే అవకాశాలున్నాయి. ‘జై’స్వాల్ గర్జన సుదీర్ఘ ఫార్మాట్లో భారీ సెంచరీలు చేయడాన్ని అలవాటుగా మార్చుకున్న యశస్వి జైస్వాల్... ఆ్రస్టేలియా గడ్డపై ఆడుతున్న తొలి టెస్టులోనే సత్తా చాటాడు. బౌన్సీ పిచ్‌పై రాణించేందుకు ప్రత్యేకంగా సాధన చేసి బరిలోకి దిగిన 22 ఏళ్ల జైస్వాల్... నాణ్యమైన పేసర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలో ఆసీస్ గడ్డపై తొలి వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం నమోదు చేసిన జోడీగా రాహుల్‌తో కలిసి రికార్డుల్లోకెక్కిన జైస్వాల్.. 205 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. స్టార్క్ వేసిన బౌన్సర్‌ను అప్పర్ కట్‌తో జైస్వాల్ సిక్సర్‌గా మలిచిన తీరు హైలైట్. తొలి ఇన్నింగ్స్‌లో చెత్త షాట్‌కు పెవిలియన్ చేరిన జైస్వాల్... ఈసారి ఎలాంటి తప్పిదాలు చేయకుండా ముందుకు సాగాడు. క్లిష్టమైన పిచ్‌పై మెరుగైన డిఫెన్స్‌తో ఆకట్టుకున్న రాహుల్‌ను స్టార్క్ అవుట్ చేయగా... దేవదత్ పడిక్కల్ (71 బంతుల్లో 25; 2 ఫోర్లు) ఎక్కువసేపు నిలవలేకపోయాడు.రెండో కొత్త బంతి తీసుకున్న అనంతరం పడిక్కల్ పెవిలియన్ చేరగా... జైస్వాల్ 275 బంతుల్లో 150 మార్క్ దాటాడు. 23 ఏళ్లలోపు వయసులో నాలుగుసార్లు 150 పైచిలుకు పరుగులు చేసిన తొలి భారత ఆటగాడిగా నిలిచిన జైస్వాల్ చివరకు మార్ష్బౌలింగ్లో వెనుదిరిగాడు. ‘కోహ్లి’నూర్ ఇన్నింగ్స్... చాన్నాళ్లుగా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్న విరాట్ కోహ్లి... ‘క్లాస్ శాశ్వతం, ఫామ్ తాత్కాలికం’ అని నిరూపించాడు. పిచ్ బౌన్స్‌కు సహకరిస్తున్న సమయంలో సంయమనం చూపి... కుదురుకున్నాక ట్రేడ్‌మార్క్ కవర్ డ్రైవ్‌లతో కట్టి పడేశాడు. స్వల్ప వ్యవధిలో జైస్వాల్‌తో పాటు పంత్ (1), జురేల్ (1) అవుట్ అయిన దశలో కోహ్లి వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. వాషింగ్టన్ సుందర్ (29; ఒక సిక్స్)తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. అనూహ్య బౌన్స్‌తో కంగారూలు పరీక్షించినా... కోహ్లి ఏమాత్రం తడబడలేదు. పదే పదే వికెట్ పక్క నుంచి షాట్లు ఆడుతూ చకచకా పరుగులు రాబట్టాడు. సుందర్ వెనుదిరిగాక క్రీజులోకి వచ్చిన ఆంధ్ర క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి టి20ల తరహాలో రెచి్చపోయి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. మరో ఎండ్‌లో బౌండరీతో కోహ్లి టెస్టుల్లో 30వ శతకం పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో క్రికెట్ దిగ్గజం డాన్ బ్రాడ్‌మన్ (29)ను అధిగమించిన కోహ్లి... ఆసీస్ గడ్డపై ఏడో సెంచరీని తన పేరిట లిఖించుకున్నాడు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 150; ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్: 104; భారత్ రెండో ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) స్మిత్ (బి) మార్ష్161; రాహుల్ (సి) కేరీ (బి) స్టార్క్ 77; పడిక్కల్ (సి) స్మిత్ (బి) హాజల్‌వుడ్ 25; కోహ్లి (నాటౌట్) 100; పంత్ (స్టంప్డ్) కేరీ (బి) లయన్ 1; జురేల్ (ఎల్బీ) (బి) కమిన్స్ 1; సుందర్ (బి) లయన్ 29; నితీశ్ కుమార్ రెడ్డి (నాటౌట్) 38; ఎక్స్‌ట్రాలు 55; మొత్తం (134.3 ఓవర్లలో 6 వికెట్లకు డిక్లేర్డ్) 487. వికెట్ల పతనం: 1–201, 2–275, 3–313, 4–320, 5–321, 6–410. బౌలింగ్: స్టార్క్ 26–2–111–1; హాజల్‌వుడ్ 21–9–28–1; కమిన్స్ 25–5–86–1; మార్ష్12–0–65–1; లయన్ 39–5–96–2; లబుషేన్ 6.3–0–38–0; హెడ్ 5–0–26–0. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: మెక్‌స్వీనీ (ఎల్బీ) (బి) బుమ్రా 0; ఖ్వాజా (బ్యాటింగ్) 3; కమిన్స్ (సి) కోహ్లి (బి) సిరాజ్ 2; లబుషేన్ (ఎల్బీ) (బి) బుమ్రా 3; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (4.2 ఓవర్లలో 3 వికెట్లకు ) 12. వికెట్ల పతనం: 1–0, 2–9, 3–12, బౌలింగ్: బుమ్రా 2.2–1–1–2; సిరాజ్ 2–0–7–1.201 ఈ మ్యాచ్‌లో భారత ఓపెనర్లు జైస్వాల్, రాహుల్ తొలి వికెట్‌కు జోడించిన పరుగులు. ఆ్రస్టేలియా గడ్డపై టీమిండియాకు ఇదే అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం. 1986 సిడ్నీ టెస్టులో గావస్కర్–శ్రీకాంత్ నమోదు చేసిన 191 పరుగుల భాగస్వామ్యం రెండో స్థానానికి చేరింది. 3 ఆస్ట్రేలియా గడ్డపై ఆడిన తొలి టెస్టులోనే సెంచరీ చేసిన మూడో భారత ఆటగాడిగా జైస్వాల్ నిలిచాడు. 1968లో జయసింహ, 1977లో గావస్కర్ ఈ ఘనత సాధించారు. -
పెర్త్‌లో బౌన్సీ పిచ్
పెర్త్: అకాల వర్షం కారణంగా పెర్త్ పిచ్‌ను పూర్తిగా సిద్ధం చేయలేకపోయామని ప్రధాన క్యూరేటర్ ఐజాక్ మెక్‌డొనాల్డ్ పేర్కొన్నాడు. ప్రతిష్టాత్మక ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ సిరీస్‌లో భాగంగా శుక్రవారం నుంచి పెర్త్ వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుండగా... బుధవారం అక్కడ అసాధారణ వర్షం కురిసింది. దీంతో పిచ్ ఉపరితలం కాస్త దెబ్బతిందని... సాధారణంగా ఇక్కడ కనిపించే పగుళ్లు ఈసారి ఎక్కువ లేవని పేర్కొన్నాడు. పెర్త్‌లోని ‘వాకా’ పిచ్ అసాధారణ పేస్, అస్థిర బౌన్స్‌కు ప్రసిద్ధి. గతంలో ఇక్కడ జరిగిన మ్యాచ్‌ల్లో పేసర్లు వికెట్ల పండగ చేసుకున్నారు. అయితే ఈసారి పిచ్ దీనికి భిన్నంగా స్పందించే అవకాశం ఉందని ఐజాక్ అన్నాడు. ‘ఇది సంప్రదాయ పెర్త్ టెస్టు పిచ్ మాత్రం కాదు. వర్షం కారణంగా పిచ్‌ను కవర్లతో కప్పి ఉంచడం వల్ల ఒక రోజంతా వృథా అయింది. ఎండ బాగా కాస్తే తిరిగి పేస్‌కు అనుకూలించడం ఖాయమే. సాధారణ సమయానికంటే ముందే పిచ్‌ను సిద్ధం చేసే పని ప్రారంభించాం. ప్రస్తుతానికి పిచ్‌పై తేమ ఉంది. అది పొడిబారితే మార్పు సహజమే. పిచ్‌పై ఉన్న పచ్చిక పేసర్లను ఊరిస్తుంది. మ్యాచ్ రోజు వర్ష సూచన లేదు. అయితే ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువ ఉండవు. రోజంతా ఎండ కాస్తే పిచ్ సంప్రదాయ పద్ధతిలో మారిపోతుంది’ అని ఐజాక్ వివరించాడు. ‘వాకా’ పిచ్‌పై 8 నుంచి 10 మిల్లీమీటర్ల గడ్డి ఉండనుందని క్యూరేటర్ చెప్పాడు. పిచ్‌పై అసాధారణ పగుళ్లు ఏర్పడేందుకు తగిన సమయం లేకపోయినా... అనూహ్య బౌన్స్ మాత్రం తప్పకపోవచ్చని అభిప్రాయపడ్డాడు. -
36 ఏళ్ల తర్వాత...
అంచనాలు తప్పలేదు... అద్భుతాలు జరగలేదు! బుమ్రా ఆరంభ మెరుపులు తప్ప మన బౌలర్లు న్యూజిలాండ్ బ్యాటర్లను నిలువరించడంలో విఫలమయ్యారు. ఫలితంగా తొలి టెస్టులో భారత జట్టు పరాజయం పాలైంది.తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే కుప్పకూలి... ఆ తర్వాత అసమాన పోరాటంతో పోటీలోకి వచ్చిన టీమిండియా చివరి రోజు మ్యాజిక్ కొనసాగించలేకపోయింది. 107 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కివీస్ 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. 36 ఏళ్ల తర్వాత భారత్‌లో టెస్టు విజయం నమోదు చేసుకుంది. బెంగళూరు: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన న్యూజిలాండ్ జట్టు ఎలాంటి సంచలనాలకు తావివ్వకుండా తొలి టెస్టులో ఘనవిజయం సాధించింది. వర్షం అంతరాయం మధ్య సాగిన తొలి టెస్టులో న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో టీమిండియాపై గెలిచింది. భారత గడ్డపై న్యూజిలాండ్‌కు 36 ఏళ్ల తర్వాత ఇదే తొలి టెస్టు విజయం కావడం విశేషం. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో న్యూజిలాండ్ 1–0తో ముందంజ వేసింది. 107 పరుగుల లక్ష్యఛేదనలో ఓవర్‌నైట్ స్కోరు 0/0తో ఆదివారం ఐదో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన న్యూజిలాండ్ 27.4 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసి గెలిచింది. విల్ యంగ్ (76 బంతుల్లో 48 నాటౌట్; 7 ఫోర్లు, ఒక సిక్సర్), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రచిన్ రవీంద్ర (46 బంతుల్లో 39 నాటౌట్; 6 ఫోర్లు) రాణించారు. ఇరు జట్ల మధ్య గురువారం నుంచి పుణెలో రెండో టెస్టు ప్రారంభం కానుంది. ఆడుతూ పాడుతూ! తొలి ఇన్నింగ్స్‌లో భారత స్టార్ ఆటగాళ్లు బ్యాటింగ్ చేసేందుకు ఇబ్బందిపడ్డ చోట... నాలుగో ఇన్నింగ్స్‌లో చేధన అంత సులువు కాదని అంతా భావించారు. అందుకు తగ్గట్లే ఇన్నింగ్స్ ఐదో బంతికే టామ్ లాథమ్ (0)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్న బుమ్రా భారత శిబిరంలో ఆనందం నింపాడు. అయితే ఆ సంబరాలు ఎక్కువసేపు సాగలేదు. బుమ్రా, సిరాజ్ కట్టుదిట్టమైన బంతులు సంధించినా... న్యూజిలాండ్ బ్యాటర్లు సంయమనం కోల్పోలేదు. ఈ క్రమంలో కాన్వే (17) కూడా బుమ్రా బౌలింగ్‌లోనే వెనుదిరగ్గా... క్రీజులోకి వచ్చిరాగానే రచిన్ రవీంద్ర ఎదురుదాడి ప్రారంభించాడు. మరో ఎండ్ నుంచి యంగ్ కూడా ధాటిగా ఆడటంతో లక్ష్యం సులువైపోయింది. మూడో స్పిన్నర్‌గా జట్టులోకి వచ్చిన కుల్దీప్ యాదవ్ ధారాళంగా పరుగులు ఇచ్చుకోగా... అదనపు పేసర్ ఆకాశ్‌దీప్ లోటు స్పష్టంగా కనిపించింది. వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం కాగా... తిరిగి వర్షం వచ్చి మ్యాచ్ నిలిచిపోతే బాగుండు అని సగటు భారత క్రీడాభిమాని ఆశించినా అది సాధ్యపడలేదు. క్లిష్టమైన బంతులను కాచుకుంటూనే వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదిన రచిన్, యంగ్ జోడీ మూడో వికెట్‌కు అజేయంగా 75 పరుగులు జోడించి జట్టును విజయ తీరాలకు చేర్చింది. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్ 46; న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ 402; భారత్ రెండో ఇన్నింగ్స్ 462; న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్: లాథమ్ (ఎల్బీ) బుమ్రా 0; కాన్వే (ఎల్బీ) బుమ్రా 17; యంగ్ (నాటౌట్) 48; రచిన్ రవీంద్ర (నాటౌట్) 39; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (27.4 ఓవర్లలో 2 వికెట్లకు ) 110. వికెట్ల పతనం: 1–0, 2–35. బౌలింగ్: బుమ్రా 8–1–29–2; సిరాజ్ 7–3–16–0; జడేజా 7.4–1–28–0; కుల్దీప్ 3–0–26–0, అశ్విన్ 2–0–6–0. ఈ మ్యాచ్ తొలి మూడు గంటలు తప్ప మేం మంచి ప్రదర్శనే చేశాం. అప్పుడప్పుడు ఇలాంటి ఫలితాలు వస్తుంటాయి. వాటిని దాటి ముందకు వెళ్లాలి. ఈ ఒక్క పరాజయాన్ని బట్టి ప్లేయర్ల సామర్థ్యాన్ని అంచనా వేయకూడదు. తొలి ఇన్నింగ్స్‌లో మా బ్యాటింగ్ బాగా సాగలేదు. రెండో ఇన్నింగ్స్‌లో దాన్ని సరిదిద్దుకున్నాం. ఈ మ్యాచ్‌లో ఓటమి ఎదురైనా చాలా పాఠాలు నేర్చుకున్నాం. శుబ్‌మన్ గిల్ స్థానంలో జట్టులో చోటు దక్కించుకున్న సర్ఫరాజ్ బాధ్యత తీసుకొని భారీ ఇన్నింగ్స్ ఆడాడు. ఇది జట్టుకు శుభసూచకం. ఇంగ్లండ్‌పై ఇలాగే తొలి టెస్టు ఓడిన తర్వాత పుంజుకుని వరుసగా నాలుగు మ్యాచ్‌లు నెగ్గాం. ఒక మ్యాచ్ ఫలితంతోనో ఒక సిరీస్ ఫలితంతోనో జట్టు దృక్పథం మారదు. –రోహిత్ శర్మ, భారత కెప్టెన్ 36 సంవత్సరాల తర్వాత భారత్‌లో టెస్టు మ్యాచ్ గెలవడం ఆనందంగా ఉంది. రెండో టెస్టులో టీమిండియా నుంచి గట్టి పోటీ ఎదురువుతుందని మాకు తెలుసు. రెండో ఇన్నింగ్స్‌లో రెండో కొత్త బంతి తీసుకున్న తర్వాతే తిరిగి పోటీలోకి వచ్చాం. మా పేసర్లు చక్కటి బంతులతో టీమిండియాను కట్టడి చేయడంతో ఛేదన సులువైంది. తొలి ఇన్నింగ్స్‌లో రచిన్ రవీంద్ర, టిమ్ సౌతీ మధ్య భాగస్వామ్యమే జట్టును గెలిపించింది. –టామ్ లాథమ్, న్యూజిలాండ్ కెప్టెన్ -
ఎదురీత!
అనూహ్య తడబాటు నుంచి కోలుకున్న టీమిండియా... న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో ఎదురీదుతోంది. బ్యాటింగ్‌కు అనువుగా మారిన బెంగళూరు పిచ్‌పై ప్రత్యర్థి భారీ స్కోరు చేయగా... మనవాళ్లు కూడా దీటుగా బదులిస్తున్నారు. రచిన్ రవీంద్ర సూపర్ సెంచరీ, టిమ్ సౌతీ సమయోచిత ఇన్నింగ్స్‌తో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరును నమోదు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత టాపార్డర్ రాణించింది. రోహిత్, కోహ్లి, సర్ఫరాజ్ అర్ధ శతకాలతో టీమిండియా ఇన్నింగ్స్ గాడిన పడింది. మూడో రోజు ఇన్నింగ్స్ చివరి బంతికి విరాట్ కోహ్లిను అవుట్ చేసి న్యూజిలాండ్ పైచేయి సాధించగా... కోహ్లి పెవిలియన్ చేరడంతో ఈ మ్యాచ్‌లో భారత్ గట్టెక్కాలంటే మిగిలిన బ్యాటర్లు విశేషంగా రాణించాల్సి ఉంటుంది. బెంగళూరు: తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే కుప్పకూలిన భారత జట్టు... రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం గట్టిగానే పోరాడుతోంది. ప్రత్యర్థికి భారీ ఆధిక్యం దక్కిన ఈ మ్యాచ్‌లో అద్భుతం జరిగితే తప్ప టీమిండియా గట్టెక్కడం కష్టమే అనిపిస్తోంది. 356 పరుగులతో వెనుకబడి శుక్రవారం మూడో రోజు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ ఆట ముగిసే సమయానికి 49 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (70; 8 ఫోర్లు, ఒక సిక్సర్), సర్ఫరాజ్ ఖాన్ (78 బంతుల్లో 70 బ్యాటింగ్; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), కెపె్టన్ రోహిత్ శర్మ (63 బంతుల్లో 52; 8 ఫోర్లు, ఒక సిక్సర్) అర్ధ శతకాలతో ఆకట్టుకోగా... యశస్వి జైస్వాల్ (35; 6 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. చేతిలో 7 వికెట్లున్న టీమిండియా ఇన్నింగ్స్ ఓటమి తప్పించుకోవాలంటే మరో 125 పరుగులు చేయాలి. క్రీజులో ఉన్న సర్ఫరాజ్‌తోపాటు ఇంకా రావాల్సిన కేఎల్ రాహుల్, పంత్, జడేజా, అశ్విన్ భారీ ఇన్నింగ్స్ ఆడితే భారత్ కోలుకోవచ్చు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 180/3తో శుక్రవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన న్యూజిలాండ్ 91.3 ఓవర్లలో 402 పరుగులకు ఆలౌటైంది. రచిన్ రవీంద్ర (157 బంతుల్లో 134; 13 ఫోర్లు, 4 సిక్సర్లు) తన కెరీర్లో రెండో సెంచరీ సాధించాడు. మాజీ కెపె్టన్ టిమ్ సౌతీ (73 బంతుల్లో 65; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో రచిన్‌కు అండగా నిలిచాడు. చివరి బంతికి కోహ్లి అవుట్... తొలి ఇన్నింగ్స్‌లో తడబడ్డ భారత టాపార్డర్ రెండో ఇన్నింగ్స్‌లో మెరుగ్గా ఆడింది. యశస్వి, రోహిత్ బౌలర్లపై సంపూర్ణ ఆధిపత్యం కనబర్చడంతో టీమిండియాకు శుభారంభం దక్కింది. తొలి వికెట్‌కు 72 పరుగులు జోడించాక జైస్వాల్ అవుట్ కాగా... కాసేపటికి అర్ధశతకం పూర్తి చేసుకున్న రోహిత్ కూడా వెనుదిరిగాడు. ఈ రెండు వికెట్లు ఎజాజ్ పటేల్ ఖాతాలోకే వెళ్లాయి. మరోసారి వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన కోహ్లి ఇన్నింగ్స్‌ను నడిపించే బాధ్యత తీసుకున్నాడు. సర్ఫరాజ్ ఖాన్‌తో కలిసి చకచకా పరుగులు చేస్తూ... ప్రత్యర్థి ఆధిక్యాన్ని తగ్గించే పనిలో పడ్డాడు. ఈ క్రమంలో సర్ఫరాజ్ 42 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకోగా... కోహ్లి 70 బంతుల్లో ఆ మార్క్ అందుకున్నాడు. టీమిండియా కోలుకున్నట్లే అనుకుంటున్న దశలో చివరి బంతికి కోహ్లి అవుటవ్వడంతో భారత జట్టుకు నిరాశ తప్పలేదు. ఆ భాగస్వామ్యం లేకుంటే... భారత సంతతి ఆటగాడు రచిన్... కుటుంబ సభ్యుల సమక్షంలో చిన్నస్వామి స్టేడియంలో చెలరేగి ఆడటంతో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేయగలిగింది. మిచెల్ (18), బ్లండెల్ (5), ఫిలిప్స్ (14), హెన్రీ (8) విఫలమవడంతో కివీస్ జట్టు 233/7తో నిలిచింది. కాసేపట్లో కివీస్ ఆలౌట్ కావడం ఖాయమే అనుకుంటే... సౌతీ సహకారంతో రచిన్ రెచ్చిపోయాడు. ఎనిమిదో వికెట్‌కు 137 పరుగులు జోడించి చివరి వికెట్‌గా వెనుదిరిగాడు. 4 టెస్టు క్రికెట్లో 9 వేల పరుగులు పూర్తి చేసుకున్న నాలుగో భారత క్రికెటర్‌గా విరాట్ కోహ్లి నిలిచాడు. సచిన్ టెండూల్కర్ (15,921), రాహుల్ ద్రవిడ్ (13,265), సునీల్ గవాస్కర్ (10,122) ముందున్నారు. ఓవరాల్‌గా ఈ మైలురాయి దాటిన 18వ ప్లేయర్‌గా కోహ్లి ఘనత సాధించాడు.స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 46; న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: లాథమ్ (ఎల్బీ) (బి) కుల్దీప్ 15; కాన్వే (బి) అశి్వన్ 91; యంగ్ (సి) కుల్దీప్ (బి) జడేజా 33; రచిన్ (సి) (సబ్) జురేల్ (బి) కుల్దీప్ 134; మిచెల్ (సి) జైస్వాల్ (బి) సిరాజ్ 18; బ్లండెల్ (సి) రాహుల్ (బి) బుమ్రా 5; ఫిలిప్స్ (బి) జడేజా 14; హెన్రీ (బి) జడేజా 8; సౌతీ (సి) జడేజా (బి) సిరాజ్ 65; ఎజాజ్ (ఎల్బీ) కుల్దీప్ 4; రూర్కే (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (91.3 ఓవర్లలో ఆలౌట్) 402. వికెట్ల పతనం: 1–67, 2–142, 3–154, 4–193, 5–204, 6–223, 7–233, 8–370, 9–384, 10–402. బౌలింగ్: బుమ్రా 19–7–41–1, సిరాజ్ 18–2–84–2, అశ్విన్ 16–1–94–1, కుల్దీప్ 18.3–1–99–3, జడేజా 20–1–72–3.భారత్ రెండో ఇన్నింగ్స్: జైస్వాల్ (స్టంప్డ్) బ్లండెల్ (బి) ఎజాజ్ 35; రోహిత్ (బి) ఎజాజ్ 52; కోహ్లి (సి) బ్లండెల్ (బి) ఫిలిప్స్ 70; సర్ఫరాజ్ (బ్యాటింగ్) 70; ఎక్స్ ట్రాలు 4; మొత్తం (49 ఓవర్లలో 3 వికెట్లకు) 231. వికెట్ల పతనం: 1–72, 2–95, 3–231. బౌలింగ్: సౌతీ 7–1–22–0; హెన్రీ 11–1–52–0; రూర్కే 11–1–48–0; ఎజాజ్ 12–2–70–2; ఫిలిప్స్ 8–1–36–1. -
పాకిస్తాన్‌కు పరీక్ష
ముల్తాన్: స్వదేశంలో పాకిస్తాన్ జట్టు మరో టెస్టు సిరీస్‌కు సిద్ధమైంది. ఇటీవల బంగ్లాదేశ్ చేతిలో వైట్‌వాష్‌కు గురైన పాకిస్తాన్ నేటి నుంచి ఇంగ్లండ్‌తో తలపడనుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా సోమవారం నుంచి ముల్తాన్ వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది. రెగ్యులర్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఈ మ్యాచ్‌కు దూరం కాగా... అతడి స్థానంలో ఒలీ పోప్ ఇంగ్లండ్ జట్టుకు సారథిగా వ్యవహరించనున్నాడు. ఇటీవల శ్రీలంకపై మూడు మ్యాచ్‌ల సిరీస్‌కు కూడా స్టోక్స్ అందుబాటులో లేకపోగా... పోప్ కెప్టెన్సీలో ఇంగ్లండ్ జట్టు సిరీస్ గెలుచుకుంది. రెండేళ్ల క్రితం పాకిస్తాన్లో పర్యటించిన ఇంగ్లండ్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. విపరీతమైన వేడి ఉండే ముల్తాన్‌లో స్పిన్నర్లకు సహకారం లభించే అవకాశం ఉండటంతో జాక్ లీచ్, షోయబ్ బషీర్ రూపంలో ఇద్దరు స్పిన్నర్లకు ఇంగ్లండ్ తుది జట్టులో చోటు కలి్పంచింది. పేస్ బౌలింగ్‌లో మాత్రం అనుభవరాహిత్యం కనిపిస్తోంది. పేస్ బౌలర్ బ్రైడన్ కార్స్ టెస్టు అరంగేట్రం చేయనుండగా.. అతడితో పాటు అట్కిన్సన్, వోక్స్, బ్రూక్ పేస్ విభాగాన్ని నడిపించనున్నారు.మరోవైపు గత నాలుగేళ్లుగా స్వదేశంలో టెస్టు సిరీస్ గెలవలేకపోయిన పాకిస్తాన్ ఈసారి అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతోంది. టెస్టు కెపె్టన్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ జట్టును గెలిపించలేకపోయిన పాక్ సారథి షాన్ మసూద్‌పై తీవ్ర ఒత్తిడి ఉంది. మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్‌తో పాటు వికెట్ కీపర్ రిజ్వాన్, అబ్దుల్లా షఫీఖ్, సౌద్ షకీల్, సల్మాన్ సమష్టిగా సత్తా చాటాలని పాకిస్తాన్ టీమ్ మేనేజ్మెంట్ ఆశిస్తోంది. బౌలింగ్‌లో షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, కీలకం కానున్నారు. అబ్రార్, సల్మాన్ స్పిన్ బాధ్యతలు పంచుకోనున్నారు. -
280 పరుగుల తేడాతో...
సొంతగడ్డపై రవిచంద్రన్ అశ్విన్ అటు బ్యాట్‌తో, ఇటు బంతితో విజృంభించిన వేళ... బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ భారీ విజయం సాధించింది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు చేరడమే లక్ష్యంగా సాగుతున్న రోహిత్ బృందం ముందు బంగ్లాదేశ్ చేతులెత్తేసింది. కొండంత లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో అందులో సగం పరుగులైనా చేయకముందే ఆలౌటైంది. ఈ విజయంతో భారత టెస్టు క్రికెట్ చరిత్రలో తొలిసారి గెలుపోటముల నిష్పత్తిలో పరాజయాల కన్నా ఎక్కువ విజయాలు నమోదు చేసుకుంది. చెన్నై: సమష్టి ప్రదర్శనతో సత్తా చాటిన భారత జట్టు బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో 280 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1–0తో ముందంజ వేసింది. భారత్ నిర్దేశించిన 515 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఓవర్‌నైట్ స్కోరు 158/4తో ఆదివారం నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన బంగ్లాదేశ్ చివరకు 62.1 ఓవర్లలో 234 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ నజ్ముల్ హసన్ (127 బంతుల్లో 82; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేయగా... మిగిలిన వాళ్లు విఫలమయ్యారు. ఐదో వికెట్‌కు షకీబ్ అల్ హసన్ (25)తో కలిసి నజు్మల్ 48 పరుగులు జోడించాడు. ఈ దశలో అశ్విన్ బంతి అందుకోవడంతో పరిస్థితి తలకిందులైంది. ‘లోకల్ బాయ్’ చక్కటి బంతితో షకీబ్‌ను ఔట్ చేయగా... లిటన్ దాస్ (1)ను జడేజా బుట్టలో వేసుకున్నాడు. మిరాజ్ (8) విఫలమయ్యాడు. భారత బౌలర్లలో ఆఫ్‌స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 6 వికెట్లు పడగొట్టగా... రవీంద్ర జడేజా 3 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. చేతిలో ఆరు వికెట్లతో నాలుగో రోజు ఆట కొనసాగించిన బంగ్లాదేశ్ లంచ్ విరామానికి ముందే ఆలౌటైంది. ఈ ఆరు వికెట్లలో అశ్విన్ , జడేజా చెరో 3 పంచుకున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేయడంతో పాటు రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు తీసిన అశ్విన్ కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య శుక్రవారం నుంచి కాన్పూర్‌లో రెండో టెస్టు ప్రారంభం కానుంది. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 376; బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్: 149; భారత్ రెండో ఇన్నింగ్స్: 287/4 డిక్లేర్డ్; బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్: జాకీర్ (సి) యశస్వి (బి) బుమ్రా 33; షాద్మన్ (సి) గిల్ (బి) అశ్విన్ 35; నజు్మల్ (సి) బుమ్రా (బి) జడేజా 82; మోమినుల్ హక్ (బి) అశ్విన్ 13; ముషి్ఫకర్ (సి) రాహుల్ (బి) అశ్విన్ 13; షకీబ్ (సి) యశస్వి (బి) అశ్విన్ 25; లిటన్ దాస్ (సి) రోహిత్ (బి) జడేజా 1; మిరాజ్ (సి) జడేజా (బి) అశ్విన్ 8; తస్కీన్ (సి) సిరాజ్ (బి) అశ్విన్ 5; హసన్ మహమూద్ (బి) జడేజా 7; నాహిద్ రాణా (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (62.1 ఓవర్లలో ఆలౌట్) 234. వికెట్ల పతనం: 1–62, 2–86, 3–124, 4–146, 5–194, 6–205, 7–222, 8–222, 9–228, 10–234. బౌలింగ్: బుమ్రా 10–2–24–1; సిరాజ్ 10–5–32–0; ఆకాశ్‌దీప్ 6–0–20–0; అశ్విన్ 21–0–88–6; జడేజా 15.1–2–58–3. -
India vs Bangladesh 1st Test: పంత్, గిల్ సెంచరీల మోత
దాదాపు రెండేళ్ల తర్వాత టెస్టు మ్యాచ్ ఆడిన రిషభ్ పంత్ అంచనాలను అందుకుంటూ తనదైన శైలిలో సాధించిన శతకం... శుబ్‌మన్ గిల్ ఎప్పటిలాగే ప్రశాంతంగా ఆడుతూ పూర్తి చేసుకున్న సెంచరీ...ఆపై చెపాక్ బాయ్ అశి్వన్ మూడు కీలక వికెట్లతో ప్రత్యర్థి పని పట్టిన తీరు... చెన్నై టెస్టులో మూడో రోజు భారత్ హవానే కొనసాగింది. ముందుగా పంత్, గిల్ సెంచరీల తర్వాత తమ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి భారీ లక్ష్యంతో బంగ్లాదేశ్‌కు భారత్ సవాల్ విసరగా... తడబడుతూ ఆడిన బంగ్లా కుప్పకూలిపోకుండా కాస్త నిలవగలిగింది. వెలుతురులేమితో బంగ్లా ఓటమి ఆలస్యమైనట్లు కనిపించినా... ఆదివారం మిగిలిన ఆరు వికెట్లు తీయడం భారత్‌కు కష్టం కాకపోవచ్చు. చెన్నై: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత జట్టు విజయంపై గురి పెట్టింది. భారత్ విధించిన 515 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన బంగ్లా శనివారం ఆట ముగిసే సమయానికి 37.2 ఓవర్లలో 158 పరుగులు చేసింది. కెపె్టన్ నజ్ముల్ హసన్ (60 బంతుల్లో 51; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), షకీబ్ అల్ హసన్ (5 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. భారత బౌలర్లలో అశి్వన్‌కు మూడు వికెట్లు దక్కాయి. మరో రెండు రోజుల ఆట మిగిలి ఉండగా బంగ్లా మరో 357 పరుగులు చేయాల్సి ఉంది. వెలుతురులేమి కారణంగా ఆటను అంపైర్లు కాస్త ముందుగా నిలిపివేశారు. అంతకు ముందు ఓవర్‌నైట్ స్కోరు 81/3తో మూడో రోజు ఆట కొనసాగించిన భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌ను 64 ఓవర్లలో 4 వికెట్లకు 287 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. శుబ్‌మన్ గిల్ (176 బంతుల్లో 119 నాటౌట్; 10 ఫోర్లు, 4 సిక్స్‌లు) కెరీర్లో ఐదో సెంచరీ... రిషభ్ పంత్ (128 బంతుల్లో 109; 13 ఫోర్లు, 4 సిక్స్‌లు) కెరీర్లో ఆరో సెంచరీ సాధించారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 167 పరుగులు జోడించారు. శనివారం భారత్ మొత్తం 41 ఓవర్లు ఆడి 206 పరుగులు జత చేసింది. శతకాల జోరు... మూడో రోజు ఆటలో పంత్, గిల్‌ను బంగ్లా బౌలర్లు ఏమాత్రం ఇబ్బంది పెట్టలేకపోయారు. ప్రత్యర్థి పేలవ బౌలింగ్‌ను సొమ్ము చేసుకున్న భారత బ్యాటర్లిద్దరూ దూకుడుగా ఆడారు. మిరాజ్ ఓవర్లో రెండు సిక్స్‌లు బాది గిల్ ముందుగా అర్ధసెంచరీ పూర్తి చేసుకోగా, ఆ తర్వాత పంత్ కూడా హాఫ్ సెంచరీని అందుకున్నాడు. 72 పరుగుల వద్ద పంత్ ఇచ్చిన క్యాచ్‌ను కెప్టెన్ నజ్ముల్ వదిలేశాడు. షకీబ్ ఓవర్లో పంత్ రెండు వరుస ఫోర్లు కొట్టడంతో తొలి సెషన్ ముగిసింది. లంచ్ తర్వాత కూడా షకీబ్ ఓవర్లో సిక్స్, ఫోర్ బాది పంత్ దూసుకుపోయాడు. ఎట్టకేలకు అభిమానులు ఎదురు చూసిన క్షణం వచి్చంది. షకీబ్ ఓవర్లో లాంగాఫ్ దిశగా దిశగా ఆడి రెండు పరుగులు తీయడంతో 124 బంతుల్లో పంత్ సెంచరీ పూర్తి కాగా...భారత శిబిరం మొత్తం తమ సహచరుడిని చప్పట్లతో అభినందించింది. తర్వాతి ఓవర్లోనే అతను వెనుదిరిగాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే గిల్ కూడా 161 బంతుల్లో శతకాన్ని అందుకున్నాడు. మరో నాలుగు ఓవర్లకు రోహిత్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు. నజ్ముల్ హాఫ్ సెంచరీ... భారీ లక్ష్యం ముందుండగా బంగ్లా ఇన్నింగ్స్‌ను ఓపెనర్లు జాకీర్ హసన్ (47 బంతుల్లో 33; 5 ఫోర్లు, 1 సిక్స్), షాద్మన్ ఇస్లామ్ (68 బంతుల్లో 35; 3 ఫోర్లు) దూకుడుగా ఆరంభించారు. సిరాజ్ ఓవర్లో జాకీర్ 2 ఫోర్లు, సిక్స్‌తో 14 పరుగులు రాబట్టాడు. దాంతో స్కోరు 62/0కు చేరింది. అయితే టీ విరామం తర్వాత బుమ్రా చక్కటి బంతితో జాకీర్‌ను అవుట్ చేసి తొలి దెబ్బ కొట్టాడు. షాద్మన్ వికెట్ అశి్వన్ ఖాతాలో చేరింది. మరో వైపు నజు్మల్ ధాటిగా ఆడాడు. ఈ క్రమంలో అశ్వి న్ కూడా నాలుగు సిక్స్‌లు సమరి్పంచుకున్నాడు. ఆ తర్వాత అశ్విన్ మరో రెండు వికెట్లు తీయడంతో స్కోరు 86/1 నుంచి 146/4కు చేరింది. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్ 376; బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ 149; భారత్ రెండో ఇన్నింగ్స్: యశస్వి (సి) దాస్ (బి) నాహిద్ 10; రోహిత్ (సి) జాకీర్ (బి) తస్కీన్ 5; గిల్ (నాటౌట్) 119; కోహ్లి (ఎల్బీ) (బి) మిరాజ్ 17; పంత్ (సి) అండ్ (బి) మిరాజ్ 109; రాహుల్ (నాటౌట్) 22; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (64 ఓవర్లలో 4 వికెట్లకు డిక్లేర్డ్) 287. వికెట్ల పతనం: 1–15, 2–28, 3–67, 4–234.బౌలింగ్: తస్కీన్ 7–1–22–1, హసన్ మహమూద్ 11–1–43–0, నాహిద్ రాణా 6–0–21–1, షకీబ్ 13–0–79–0, మెహదీ హసన్ మిరాజ్ 25–3–10–3–2, మోమినుల్ 2–0–15–0. బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్: జాకీర్ (సి) యశస్వి (బి) బుమ్రా 33; షాద్మన్ (సి) గిల్ (బి) అశ్విన్ 35; నజు్మల్ (బ్యాటింగ్) 51; మోమినుల్ (బి) అశ్విన్ 13; ముషి్ఫకర్ (సి) రాహుల్ (బి) అశి్వన్ 13; షకీబ్ (బ్యాటింగ్) 5; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (37.2 ఓవర్లలో 4 వికెట్లకు) 158. వికెట్ల పతనం: 1–62, 2–86, 3–124, 4–146.బౌలింగ్: బుమ్రా 7–2–18–1, సిరాజ్ 3.2–1–20–0, ఆకాశ్ దీప్ 6–0–20–0, అశ్విన్ 15–0–63–3, జడేజా 6–0–29–0. -
రెండో రోజు మనదే జోరు
భారత గడ్డపై టెస్టు మ్యాచ్ అంటే ప్రతీ విదేశీ జట్టుకూ సవాలే... బంగ్లాదేశ్‌కు కూడా అది తొలి టెస్టు తొలి రోజే చాలా వరకు అర్థమైంది. రెండో రోజుకు వచ్చేసరికి బంగ్లా పూర్తిగా చేతులెత్తేసింది. తొలి రోజు ఆట ఆరంభంలో పదునైన బౌలింగ్‌తో భారత్‌ను ఇబ్బంది పెట్టిన బంగ్లా ఆ తర్వాత టీమిండియా జోరుకు తలవంచింది. శుక్రవారం కూడా భారత్ చివరి నాలుగు వికెట్లను త్వరగా తీసిన ఆనందం ముగియక ముందే మన పేసర్ల దెబ్బకు జట్టు కుప్పకూలింది. బంగ్లా పతనంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. ఫాలో ఆన్ ఆడించకుండా మళ్లీ బ్యాటింగ్‌కు దిగిన రోహిత్ బృందం ఆధిక్యం ఇప్పటికే 300 దాటింది... మ్యాచ్ తీరు చూస్తే మూడో రోజే ముగిసినా ఆశ్చర్యం లేదు...రెండో రోజు ఆటలో ఇరు జట్లు కలిపి మొత్తం 17 వికెట్లు కోల్పోవడం చెప్పుకోదగ్గ అంశం. చెన్నై: బంగ్లాదేశ్‌తో తొలి టెస్టుపై భారత్ రెండో రోజే పట్టు బిగించింది. భారత బౌలర్ల ధాటికి బంగ్లాదేశ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 47.1 ఓవర్లలో 149 పరుగులకే ఆలౌటైంది. షకీబ్ అల్ హసన్ (64 బంతుల్లో 32; 5 ఫోర్లు)దే అత్యధిక స్కోరు. జస్ప్రీత్ బుమ్రా 4 వికెట్లతో ప్రధాన పాత్ర పోషించగా...జడేజా, ఆకాశ్‌దీప్, సిరాజ్ తలా 2 వికెట్లతో అండగా నిలిచారు. మొదటి ఇన్నింగ్స్‌లో భారత్‌కు ఏకంగా 227 పరుగుల ఆధిక్యం దక్కింది. అయితే ఫాలో ఆన్ ఇవ్వడంకంటే మళ్లీ బ్యాటింగ్ చేసేందుకే రోహిత్ మొగ్గు చూపించాడు. శుక్రవారం ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 23 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 81 పరుగులు సాధించింది. శుబ్‌మన్ గిల్ (64 బంతుల్లో 33 నాటౌట్; 4 ఫోర్లు), రిషభ్ పంత్ (12 నాటౌట్) ప్రస్తుతం క్రీజ్‌లో ఉన్నారు. అంతకు ముందు ఓవర్‌నైట్ స్కోరు 339/6తో ఆట కొనసాగించిన భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 376 పరుగులకు ఆలౌటైంది. రెండో రోజు 11.2 ఓవర్లు మాత్రమే ఆడగలిగిన జట్టు మరో 37 పరుగులు జోడించగలిగింది. చేతిలో మరో 7 వికెట్లు ఉన్న టీమిండియా ప్రస్తుతం తమ ఓవరాల్ ఆధిక్యాన్ని 308 పరుగులకు పెంచుకుంది. బౌలర్ల జోరు... బుమ్రా వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్ చివరి బంతిని ఆడలేక వదిలేసిన షాద్మన్ ఇస్లామ్ (2) క్లీన్»ౌల్డయ్యాడు. అలా మొదలైన బంగ్లా పతనం వేగంగా సాగింది. ఆకాశ్ దీప్ తన రెండో ఓవర్లో తొలి రెండు బంతుల్లో రెండు వికెట్లతో బంగ్లా పని పట్టాడు. ఆకాశ్ బంతికి జాకీర్ హసన్ (3) స్టంప్ ముక్కలవగా...తర్వాతి బంతికే మోమినుల్ హక్ (0) ప్యాడ్లకు తాకుతా వెళ్లిన బంతి వికెట్లను పడగొట్టింది. బౌల్డ్ కాకపోయినా మోమిన్ ఎల్బీగానైనా వెనుదిరిగేవాడే! రెండో సెషన్లో కూడా భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కోవడంలో బంగ్లా బ్యాటర్లు విఫలమయ్యారు. ఈ సెషన్లో బంగ్లా ఐదు వికెట్లు కోల్పోయింది. నజు్మల్ (20)ను సిరాజ్...ముషి్ఫకర్ రహీమ్ (8)ను బుమ్రా అవుట్ చేయడంతో స్కోరు 40/5 వద్ద నిలిచింది. ఈ దశలో షకీబ్, లిటన్ దాస్ (22) కొద్ది సేపు ప్రతిఘటించారు. కొన్ని చక్కటి షాట్లు ఆడిన వీరిద్దరు ఆరో వికెట్‌కు 51 పరుగులు జోడించారు. అయితే జడేజా వరుస ఓవర్లలో స్వయంకృతంతో వీరిద్దరు పరుగు తేడాతో వెనుదిరగడం బంగ్లా ఆశలు కోల్పోయేలా చేసింది. అనవసరపు భారీ షాట్‌కు ప్రయత్నించి దాస్ అవుట్ కాగా, రివర్స్ స్వీప్‌కు ప్రయత్నించి షకీబ్ వికెట్ ఇచ్చేశాడు. ఆ తర్వాత హసన్ (9) వికెట్ బుమ్రా ఖాతాలో చేరింది. టీ విరామం తర్వాత మిగిలిన రెండు వికెట్లు తీసేందుకు భారత్‌కు ఎక్కువ సమయం పట్టలేదు. కోహ్లి దురదృష్టవశాత్తూ... ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే యశస్వి (10) పది పరుగులు రాబట్టగా...రోహిత్ శర్మ (5) తొలి బంతికే ఫోర్‌తో మొదలు పెట్టాడు. అయితే వీరిద్దరు ఎక్కువ సేపు నిలవలేకపోయారు. మరో వైపు గిల్ కొన్ని చక్కటి షాట్లు ఆడి క్రీజ్‌లో పాతుకుపోయాడు. రెండో రోజు ఆట ముగియడానికి కొద్ది సేపు ముందు మిరాజ్ బౌలింగ్‌లో ఫ్లిక్ చేయబోయి విరాట్ కోహ్లి (17) వికెట్ల ముందు దొరికిపోయాడు. గిల్‌తో మాట్లాడిన అనంతరం కోహ్లి రివ్యూ చేయకుండానే వెళ్లిపోయాడు. తర్వాత రీప్లేలో బంతి ప్యాడ్‌కు తగలక ముందే బ్యాట్‌కు తాకినట్లు తేలింది. రివ్యూ చేసి ఉంటే కోహ్లి నాటౌట్ అయ్యేవాడు. ఆ తర్వాత మరో 3.4 ఓవర్ల పాటు గిల్, పంత్ వికెట్ పడకుండా ఆటను ముగించారు. స్కోరు వివరాలుభారత్ తొలి ఇన్నింగ్స్: యశస్వి (సి) షాద్మన్ (బి) నాహిద్ 56; రోహిత్ (సి) నజ్ముల్ (బి) హసన్ 6; గిల్ (సి) దాస్ (బి) హసన్ 0; కోహ్లి (సి) దాస్ (బి) హసన్ 6; పంత్ (సి) దాస్ (బి) హసన్ 39; రాహుల్ (సి) జాకీర్ (బి) మిరాజ్ 16; జడేజా (సి) దాస్ (బి) తస్కీన్ 86; అశి్వన్ (సి) నజు్మల్ (బి) తస్కీన్ 113; ఆకాశ్ (సి) నజు్మల్ (బి) తస్కీన్ 17; బుమ్రా (సి) జాకీర్ (బి) హసన్ 7; సిరాజ్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 30; మొత్తం (91.2 ఓవర్లలో ఆలౌట్) 376. వికెట్ల పతనం: 1–14, 2–28, 3–34, 4–96, 5–144, 6–144, 7–343, 8–367, 9–374, 10–376. బౌలింగ్: తస్కీన్ 21–4–55–3, హసన్ మహమూద్ 22.2–4– 83–5, నాహిద్ రాణా 18–2– 82–1, మెహదీ హసన్ మిరాజ్ 21–2–77–1, షకీబ్ 8–0–50–0, మోమినుల్ 1–0–4–0. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్: షాద్మన్ (బి) బుమ్రా 2; జాకీర్ (బి) ఆకాశ్ 3; నజు్మల్ (సి) కోహ్లి (బి) సిరాజ్ 20; మోమినుల్ (బి) ఆకాశ్ 0; ముషి్ఫకర్ (సి) రాహుల్ (బి) బుమ్రా 8; షకీబ్ (సి) పంత్ (బి) జడేజా 32; లిటన్ దాస్ (సి) (సబ్) జురేల్ (బి) జడేజా 22; మిరాజ్ (నాటౌట్) 27; హసన్ (సి) కోహ్లి (బి) బుమ్రా 9; తస్కీన్ (బి) బుమ్రా 11; నాహిద్ (బి) సిరాజ్ 11; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (47.1 ఓవర్లలో ఆలౌట్) 149. వికెట్ల పతనం: 1–2, 2–22, 3–22, 4–36, 5–40, 6–91, 7–92, 8–112, 9–130, 10–149. బౌలింగ్: బుమ్రా 11–1–50–4, సిరాజ్ 10.1–1–30–2, ఆకాశ్ దీప్ 5–0–19–2, అశ్విన్ 13–4–29–0, జడేజా 8–2–19–2. భారత్ రెండో ఇన్నింగ్స్: యశస్వి (సి) దాస్ (బి) నాహిద్ 10; రోహిత్ (సి) జాకీర్ (బి) తస్కీన్ 5; గిల్ (బ్యాటింగ్) 33; కోహ్లి (ఎల్బీ) (బి) మిరాజ్ 17; పంత్ (బ్యాటింగ్) 12; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (23 ఓవర్లలో 3 వికెట్లకు) 81. వికెట్ల పతనం: 1–15, 2–28, 3–67. బౌలింగ్: తస్కీన్ 3–0–17–1, హసన్ మహమూద్ 5–1–12–0, నాహిద్ 3–0–12–1, షకీబ్ 6–0–20–0, మిరాజ్ 6–0–16–1. -
టెస్టు సమరానికి సై
సొంతగడ్డపై గత 12 ఏళ్లలో ఒక్క టెస్టు సిరీస్ కూడా చేజార్చుకోని రికార్డు... 51 టెస్టులు ఆడితే 40 విజయాలు, 4 ఓటములు మాత్రమే... ఇదీ భారత జట్టు స్థాయి. మరోవైపు భారత్‌పై ఆడిన 13 టెస్టుల్లో ఒక్క గెలుపు లేకపోగా 11 ఓటములే... వాటిలో భారత గడ్డపై ఆడిన మూడింటిలోనూ చిత్తుగా ఓడిన వైనం... బంగ్లాదేశ్ రికార్డు ఇది! ఇలాంటి నేపథ్యంలో ఇరు జట్ల మధ్య మరో టెస్టు సిరీస్‌కు రంగం సిద్ధమైంది. బలాబలాలను బట్టి చూస్తే మరో మాటకు తావు లేకుండా భారత్‌దే పైచేయి కాగా... ఇటీవల పాకిస్తాన్‌పై సాధించిన గెలుపుతో బంగ్లాదేశ్ ప్రదర్శన కాస్త ఆసక్తి రేపుతోంది. మన స్థాయికి తగినట్లుగా టీమిండియా ప్రత్యర్థిపై చెలరేగుతుందా... లేక బంగ్లాదేశ్ కాస్త పోటీ ఇస్తుందా అనేదే ఆసక్తికరం. చెన్నై: భారత జట్టు ఈ ఏడాది మార్చిలో తమ చివరి టెస్టు మ్యాచ్ ఆడింది. ఇప్పుడు ఆరు నెలల విరామం తర్వాత మళ్లీ టెస్టు మ్యాచ్ బరిలోకి దిగుతోంది. బంగ్లాదేశ్‌తో రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఎంఎ చిదంబరం స్టేడియంలో నేటి నుంచి తొలి టెస్టు జరుగుతుంది. రాబోయే రెండున్నర నెలల వ్యవధిలో టీమిండియా ఆడబోయే 10 టెస్టుల్లో ఇది మొదటిది. తమతో పోలిస్తే బలహీన ప్రత్యర్థితో తలపడుతున్న రోహిత్ శర్మ బృందం సత్తా చాటి వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు అర్హత పొందేందుకు ఇది మంచి అవకాశం. మరోవైపు పాకిస్తాన్లో జరిగిన తరహాలోనే బంగ్లాదేశ్ కూడా ఏ మూలో సంచలనాన్ని ఆశిస్తోంది. పంత్ చాలా కాలం తర్వాత... భారత్ తుది జట్టు ఎంపికకు సంబంధించి ఎలాంటి గందరగోళం లేదు. ఇంగ్లండ్‌పై ధర్మశాలలో టీమిండియా తమ ఆఖరి టెస్టు మ్యాచ్ ఆడింది. ఆ జట్టులో మూడు మార్పులతో ఈసారి టీమ్ బరిలోకి దిగనుంది. వ్యక్తిగత కారణాలతో ఇంగ్లండ్‌తో సిరీస్ ఆడని కోహ్లి జట్టులోకి వచ్చాడు. నాటి మ్యాచ్ ఆడిన పడిక్కల్‌కు ఇప్పుడు చోటు లేదు. వికెట్ కీపర్‌గా ధ్రువ్ జురేల్ స్థానంలో రిషభ్ పంత్, మిడిలార్డర్లో సర్ఫరాజ్‌కు బదులుగా కేఎల్ రాహుల్ ఆడటం ఖాయం. 2022లో బంగ్లాదేశ్పైనే పంత్ తన ఆఖరి టెస్టు ఆడాడు. ఆ తర్వాత కారు ప్రమాదం, ఆపై కోలుకున్న తర్వాత టి20లు వన్డేల్లో జట్టుకు ప్రాతినిధ్యం వహించిన అతనికి ఇదే మొదటి టెస్టు. ఇటీవల దులీప్ ట్రోఫీ తొలి మ్యాచ్‌లో ఆడిన పంత్ 125.4 ఓవర్ల పాటు కీపింగ్ చేసి తన ఫిట్నెస్ను కూడా నిరూపించుకున్నాడు. టెస్టు బ్యాటర్‌గా రాహుల్ ప్రతిభపై సందేహం లేదు. ఈ ఏడాది జనవరి (దక్షిణాఫ్రికాపై) తర్వాత టెస్టు ఆడబోతున్నా... కోహ్లి స్థాయి ప్లేయర్‌గా ఫామ్ అందుకోవడం పెద్ద సమస్య కాదు. టాప్–3లో కూడా రోహిత్, యశస్వి, గిల్‌లతో భారత బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. సాధారణంగా సొంతగడ్డపై భారత్ ఇద్దరు పేసర్లు, ముగ్గురు స్పిన్నర్లతో ఆడుతుంది. ఈసారీ అదే చేస్తే బుమ్రా, సిరాజ్ పేసర్లుగా దిగుతారు. జడేజా, కుల్దీప్లతో పాటు తన సొంత మైదానంలో సీనియర్ ప్లేయర్ అశ్విన్ చెలరేగడానికి సిద్ధంగా ఉన్నాడు. సీనియర్లను నమ్ముకొని... పాకిస్తాన్‌ను వారి సొంతగడ్డపై బంగ్లాదేశ్ ఇటీవల 2–0తో క్లీన్‌స్వీప్ చేసి ఉండవచ్చు. కానీ భారత్‌తో పోలిస్తే టెస్టుల్లో పాక్ చాలా బలహీనమైన జట్టు కాబట్టి ఈ సిరీస్‌తో పోలిక అనవసరం. భారత్‌పై బంగ్లా ఏనాడూ చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోయింది. అయితే ఆ జట్టు కోణంలో చూస్తే పాక్‌పై విజయం వారి ఆత్మవిశ్వాసాన్ని కాస్త పెంచిందనడంలో సందేహం లేదు. ఎప్పటిలాగే సీనియర్ ఆటగాళ్లు షకీబ్ అల్ హసన్, ముషి్ఫకర్ జట్టు బ్యాటింగ్ భారం మోస్తున్నారు. ఇటీవలి కాలంలో ఎంతో మెరుగైన లిటన్ దాస్ కూడా జట్టుకు కీలకం కానున్నాడు. కెప్టెన్ నజ్ముల్ ఫామ్‌లో లేకపోగా... అనుభవం లేని షాద్మన్, జాకీర్ ఎలా రాణిస్తారో చూడాలి. బౌలింగ్‌లో మాత్రం బంగ్లా పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంది. బంగ్లా కూడా ముగ్గురు స్పిన్నర్లు షకీబ్, మిరాజ్, తైజుల్లతో బరిలోకి దిగడం ఖాయం. ఇటీవల మిరాజ్ అద్భుత ఫామ్‌లో ఉండటం జట్టుకు సానుకూలాంశం. బంగ్లాదేశ్ జట్టులో ప్రతిభావంతులైన, సీనియర్ ప్లేయర్లు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా వారి స్పిన్ కూడా పటిష్టంగా ఉంది. అయినా సరే వారిని ఎదుర్కోగల బ్యాటింగ్ మా సొంతం. మొదటి బంతి నుంచే ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తాం. అయితే ప్రత్యర్థిని తక్కువగా అంచనా వేయం. ప్రస్తుత మా బౌలింగ్ బృందం పట్ల చాలా గర్వంగా ఉన్నా. నాతో కలిసి ఆడిన ప్లేయర్లే ఇప్పుడు సీనియర్లుగా ఉన్నారు. వారితో మంచి సంబంధాలు ఉండటం సానుకూలాంశం. కోచింగ్ బృందంలో ఎవరున్నా పరిస్థితులను బట్టి జట్టు ఆట శైలి మారడం ముఖ్యం. లేదంటే ఆ జట్టు అక్కడే ఆగిపోతుంది. పిచ్‌పై చర్చ అనవసరం. ఇక్కడికి వచ్చే జట్లు స్పిన్‌ను ఎలా ఆడాలో నేర్చుకోవాలి తప్ప పిచ్ గురించి మాట్లాడవద్దు. సర్ఫరాజ్, జురేల్ గత సిరీస్‌లో బాగా ఆడినా కొన్ని సార్లు పక్కకు తప్పుకొని తమ అవకాశం కోసం వేచి ఉండక తప్పదు. – గౌతమ్ గంభీర్, భారత కోచ్ పిచ్, వాతావరణంఎర్రమట్టితో తయారు చేసిన పిచ్‌పై మ్యాచ్ జరగనుంది. దాంతో టెస్టు ఆరంభంలో మంచి బౌన్స్ ఉంటుంది. అయితే చెన్నైలో ఎండలు తీవ్రంగా ఉన్నాయి. మ్యాచ్ సాగిన కొద్దీ పిచ్‌పై పగుళ్లు ఖాయం. దాంతో స్పిన్నర్లు ప్రభావం చూపిస్తారు. కాబట్టి టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్‌ను ఎంచుకోవడం ఖాయం.తుది జట్ల వివరాలు (అంచనా)భారత్: రోహిత్ (కెప్టెన్), యశస్వి, గిల్, కోహ్లి, రాహుల్, జడేజా, పంత్, అశి్వన్, కుల్దీప్, బుమ్రా, సిరాజ్. బంగ్లాదేశ్: నజు్మల్ (కెప్టెన్), షాద్మన్, జాకీర్, మోమినుల్, ముష్ఫికర్, దాస్, షకీబ్, మిరాజ్, తస్కీన్, హసన్, తైజుల్. -
India vs Bangladesh: చెన్నైలో జోరుగా సాధన
చెన్నై: ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ)లో భాగంగా జరుగుతున్న భారత్, బంగ్లాదేశ్ సిరీస్ కోసం ఇరు జట్ల ప్లేయర్లు కసరత్తులు ముమ్మరం చేశారు. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా గురువారం నుంచి తొలి టెస్టు ప్రారంభం కానుండగా.. మంగళవారం టీమిండియా ప్లేయర్లు ప్రాక్టీస్‌లో మునిగిపోయారు. ఇటీవల శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీస్‌లో భారత స్టార్ ఆటగాళ్లు సైతం స్పిన్నర్లను ఎదుర్కోవడంలో తడబడ్డ నేపథ్యంలో... ఆ దిశగా మరింత సాధన చేస్తున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లితో పాటు వికెట్ కీపర్ రిషబ్ పంత్, శుబ్‌మన్‌గిల్, యశస్వి జైస్వాల్ నెట్స్‌లో చెమటోడ్చగా... హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో పాటు బీసీసీఐ సెలెక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ ప్రాక్టీస్ సెషన్‌ను పర్యవేక్షించాడు. పలువురు ఆటగాళ్లతో వ్యక్తిగతంగా మాట్లాడిన గౌతమ్ గంభీర్ తగు సూచనలు చేయగా... సహాయక కోచ్‌లు ర్యాన్ టెన్ డస్కటే, అభిõÙక్ నాయర్ ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నారు. ముఖ్యంగా పంత్ బ్యాటింగ్‌పై గంభీర్ ప్రత్యేక దృష్టి పెట్టాడు. 2022 డిసెంబర్లో మిర్పూర్లో బంగ్లాదేశ్‌పై మ్యాచ్ తర్వాత పంత్ టెస్టు మ్యాచ్ ఆడనుండటం ఇదే తొలిసారి. చెన్నై పిచ్ తొలుత బ్యాటింగ్‌కు ఆ తర్వాత స్పిన్‌కు అనుకూలించే అవకాశాలున్నాయి. అందుకే నెట్స్‌లో దాదాపు అందరు ఆటగాళ్లు స్పిన్‌ను ఎదుర్కోవడంపై దృష్టి పెట్టడం కనిపించింది. తొలి టెస్టులో టీమిండియా ఇద్దరు పేసర్లు, ముగ్గురు స్పిన్నర్ల కూర్పుతో బరిలోకి దిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. చెన్నైలో గత రెండు వారాలుగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ప్లేయర్లు ఎర్రమట్టి పిచ్‌తో పాటు నల్లమట్టి పిచ్‌పై ప్రాక్టీస్ సాగిస్తున్నారు. -
‘ప్రతీ టెస్టు మ్యాచ్ కీలకమే’
చెన్నై: బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా...భారత క్రికెట్ జట్టు వచ్చే 15 వారాల వ్యవధిలో ఈ మూడు జట్లతో కలిపి 10 టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పరంగా ఇప్పటికే అగ్ర స్థానంలో ఉండి ఫైనల్‌కు చేరువగా ఉన్న టీమిండియా తుది పోరుకు తమ స్థానాన్ని ఖాయం చేసుకునే అవకాశం ఉంది. అయితే ఈ సుదీర్ఘ సీజన్ నేపథ్యంలో అన్ని మ్యాచ్‌లు ఆడించకుండా కొందరు కీలక ఆటగాళ్లు, ముఖ్యంగా బౌలర్లకు మధ్య మధ్యలో విరామం ఇవ్వాల్సి ఉంటుందని భారత కెపె్టన్ రోహిత్ శర్మ వెల్లడించాడు.గురువారం నుంచి బంగ్లాదేశ్‌తో మొదటి టెస్టు జరగనున్న నేపథ్యంలో రోహిత్ మీడియాతో పలు అంశాలపై మాట్లాడాడు. నెల రోజులకు పైగా విశ్రాంతి తర్వాత టీమిండియా ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్ బరిలోకి దిగబోతున్నారు. ‘సుదీర్ఘ సీజన్లో కొందరికి అప్పుడప్పుడు విశ్రాంతినివ్వక తప్పదు. మీ అత్యుత్తమ ఆటగాళ్లు ప్రతీ మ్యాచ్‌లోనూ ఆడాలని అంతా కోరుకుంటారు. కానీ వాస్తవికంగా చూస్తే అది సాధ్యం కాదు. టెస్టులు మాత్రమే కాదు, మరో వైపు టి20 మ్యాచ్‌లు కూడా ఉన్నాయి. ఇంత ఎక్కువ క్రికెట్ సాగుతుంటే మనం అన్నీ అర్థం చేసుకొని ముందుకెళ్లాలి. ముఖ్యంగా బౌలర్ల విషయంలో మరీ కష్టం. వీరి పని భారాన్ని ఎలా తగ్గించాలనే అంశంపై మాకూ కొన్ని ప్రణాళికలు ఉన్నాయి. మ్యాచ్‌ల మధ్యలో వారి ఫిట్నెస్ ఎలా ఉంటోంది. స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ పరిస్థితి ఏమిటి. ఫిజియో ఇచ్చే నివేదికను కూడా పరిగణలోకి తీసుకోవడంతో పాటు ఏ సమయంలో విశ్రాంతినివ్వాలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం. ఇంగ్లండ్ లాంటి పటిష్టమైన జట్టుపై కూడా ఇది చేయగలిగాం. ఆ సిరీస్‌లో ఒక టెస్టులో బుమ్రాకు, మరో టెస్టులో సిరాజ్‌కు విశ్రాంతినిచ్చాం’ అని రోహిత్ గుర్తు చేశాడు. పేసర్ల కొరత లేదు... దేశవాళీ క్రికెట్లో పెద్ద సంఖ్యలో పేస్ బౌలర్లు వెలుగులోకి వస్తుండటం మంచి పరిణామమని రోహిత్ వ్యాఖ్యానించాడు. ఆ్రస్టేలియాతో సిరీస్‌లో కీలకం అయ్యే అవకాశం ఉందని సెలక్టర్లు భావించడంతో లెఫ్టార్మ్ పేసర్ యశ్ దయాళ్ను కూడా బంగ్లాతో సిరీస్‌కు జట్టులోకి తీసుకొని అతడిని సానపెడుతున్నారు. ‘మనకు చాలా మంది బౌలర్లు అందుబాటులో ఉన్నారు. దులీప్ ట్రోఫీలో కూడా చాలా మందిని నేను చూశాను. అసలు కొత్తగా బౌలర్ల కోసం ఆందోళన చెందాల్సిన అవసరమే లేని పరిస్థితి మనకు ఉంది. ఇది చాలా సానుకూలాశం’ అని కెపె్టన్ అన్నాడు. అందరితో కలిసి పని చేశాను... కొత్త హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నేతృత్వంలో భారత జట్టు తొలిసారిగా టెస్టు సిరీస్ బరిలోకి దిగుతోంది. నెల రోజుల క్రితం ఇదే బృందం శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో కూడా టీమ్‌తో కలిసి పని చేసింది. అయితే పేరుకు వారంతా కొత్తే అయినా తనకు అందరితో మంచి సంబంధాలు ఉన్నాయని రోహిత్ అన్నాడు. ద్రవిడ్ తదితరులతో కూడిన కోచింగ్ స్టాఫ్‌తో పోలిస్తే పనితీరు భిన్నమే అయినా...ఎలాంటి సమస్య లేదని అతను అభిప్రాయ పడ్డాడు. ‘కోచింగ్ బృందం కొత్తదే కావచ్చు. కానీ నాకు గంభీర్, అభిõÙక్ నాయర్ బాగా తెలుసు. వీరిద్దరితో ఇప్పటికే శ్రీలంకతో కలిసి పని చేశాను. మోర్కెల్, డస్కటేలకు ప్రత్యరి్థగా ఆడాను. వారిద్దరితో ఎక్కువగా మాట్లాడలేదు కానీ వారు మా జట్టు గురించి బాగా అర్థం చేసుకోగలగడం నేను గుర్తించాను. ద్రవిడ్, రాథోడ్, మాంబ్రేలతో పోలిస్తే వీరి శైలి భిన్నం. పనితీరులో ఎవరి పద్ధతి వారికుంటుంది. అది పెద్ద సమస్య కాదు. ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బందీ రాలేదు. ఆటగాళ్లందరూ పరిస్థితికి తగినట్లుగా కోచింగ్ బృందంతో సరిగా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లడం ముఖ్యం. అది మేం చేయగలం’ అని రోహిత్ వివరించాడు. రిహార్సల్స్ సిరీస్ కాదు... రాబోయే ఆస్ట్రేలియా వంటి కీలక పర్యటనకు సన్నాహకంగా బంగ్లాదేశ్ సిరీస్‌ను చూడటం లేదని రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. ప్రతీ టెస్టు మ్యాచ్‌కు ప్రాధాన్యత ఉంటుందని, ప్రత్యర్థి బలం గురించి కాకుండా తాము ఏం చేయగలం అనేది చూస్తామని అతను చెప్పాడు. ‘సిరీస్ ఏదైనా దేశం తరఫున ఆడుతున్నామనేది మర్చిపోవద్దు. కాబట్టి ఇక్కడేమీ రిహార్సల్స్ జరగడం లేదు. ప్రతీ టెస్టుకు ప్రాధాన్యత ఉంది. డబ్ల్యూటీసీ కోణంలో చూస్తే ఉదాసీనతకు అవకాశం లేదు. ఎక్కడ ఆడతామనేది విషయం కాదు. గెలవడమే అన్నింటికంటే ప్రధానం. మ్యాచ్‌కు వారం రోజుల ముందే ఇక్కడకు వచ్చాం. సన్నాహకాలు చాలా బాగా సాగాయి. దొరికిన కాస్త సమయాన్ని బాగా వాడుకున్నాం. మేమందరం టెస్టు సిరీస్ కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాం’ అని రోహిత్ శర్మ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. -
బంగ్లాదేశ్‌తో తొలి టెస్ట్.. భారత తుది జట్టు ఇదే..?
భారత్, బంగ్లాదేశ్ మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ చెన్నై వేదికగా సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ కోసం భారత తుది జట్టు ఎలా ఉండతుందో అని ఇప్పటి నుంచే అంచనాలు మొదలయ్యాయి. విశ్లేషకులు, అభిమానులు ఎవరికి తోచిన విధంగా వారు తమ అంచనాలను వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత తుది జట్టు ఎంపికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.కాగా, భారత తుది జట్టు ఇలా ఉండబోతుందంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ తెగ వైరలవుతుంది. ఈ పోస్ట్ ప్రకారం భారత తుది జట్టులో కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్‌లకు చోటు దక్కలేదు. వీరి స్థానాల్లో సర్ఫరాజ్ ఖాన్, కుల్దీప్ యాదవ్ తుది జట్టులో చోటు దక్కించుకున్నారు.యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ భారత ఇన్నింగ్స్‌ను ఆరంభించనుండగా.. వన్‌డౌన్‌లో శుభ్‌మన్ గిల్, నాలుగో స్థానంలో విరాట్ కోహ్లి, ఐదో ప్లేస్‌లో సర్ఫరాజ్ ఖాన్, ఆరో స్థానంలో రిషబ్ పంత్, ఆల్‌రౌండర్ కోటాలో రవీంద్ర జడేజా, స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, పేసర్లుగా జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్ తుది జట్టులో చోటు దక్కించుకున్నారు.భారత పూర్తి జట్టు..రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, సర్ఫరాజ్ ఖాన్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, ధృవ్ జురెల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, ఆకాశ్‌దీప్, మొహమ్మద్ సిరాజ్, యశ్ దయాల్ఇదిలా ఉంటే, భారత్‌తో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లు ఆడేందుకు బంగ్లాదేశ్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. ఈ పర్యటన సెప్టెంబర్ 19న మొదలువుతుంది. ఈ పర్యటనలో తొలుత టెస్ట్ మ్యాచ్‌లు ఆతర్వాత టీ20లు జరుగనున్నాయి. సెప్టెంబర్ 19 నుంచి తొలి టెస్ట్.. సెప్టెంబర్ 27 నుంచి రెండో టెస్ట్ ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 6, 7, 12 తేదీల్లో గ్వాలియర్, ఢిల్లీ, హైదరాబాద్ వేదికలుగా మూడు టీ20లు జరుగనున్నాయి.చదవండి: హిట్‌మ్యాన్ మరో 10 పరుగులు చేస్తే..! -
రెండో రోజూ అదే పరిస్థితి
గ్రేటర్ నోయిడా: అఫ్గానిస్తాన్, న్యూజిలాండ్‌ల మధ్య జరగాల్సిన ఏకైక టెస్టుకు వింత పరిస్థితి ఎదురవుతోంది. ఇరుజట్ల మధ్య సోమవారం నుంచి టెస్టు మ్యాచ్ జరగాలి. కానీ ఆటగాళ్లు మైదానంలో దిగడం లేదు. ఆట ముందుకు సాగడమే లేదు. రెండు రోజులుగా ఇదే జరుగుతోంది. అలాగని ఈ రెండు రోజులుగా వర్షమేమీ కురవడం లేదు. వాన చినుకు జాడ లేకపోయినా... మైదానం మాత్రం ఆడేందుకు సిద్ధంగా లేదు. కొన్ని రోజుల క్రితం కురిసిన కుండపోత వర్షాల వల్ల మైదానం చిత్తడిగా మారింది. గ్రేటర్ నోయిడా స్పోర్ట్స్ కాంప్లెక్స్ గ్రౌండ్లో కురిసిన నీరు బయటకు వెళ్లేందుకు అసలు డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం, మైదానాన్ని సన్నద్ధం చేసే పరికరాలు అందుబాటులో లేకపోవడంతో ఒక అంతర్జాతీయ టెస్టు మ్యాచ్ అపహాస్యం అవుతోంది. కేవలం ప్రతికూల పరిస్థితుల వల్లే మొదలవడం లేదు. మంగళవారం రెండోరోజు ఆట జరిపించేందుకు మైదానంలో పదుల సంఖ్యలో గ్రౌండ్ సిబ్బంది తెగ శ్రమించారు. ల్యాండ్‌స్కేప్ గడ్డి గడుల్ని తెచ్చి మైదానమంతా పరిచేందుకు చెమటోడ్చారు. ఫ్యాన్లు అమర్చి మైదానం ఎండేలా కృషి చేశారు. అయినాకూడా అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం గ్రౌండ్ సిద్ధంగా లేకపోవడంతో ఫీల్డు అంపైర్లు కుమార ధర్మసేన, షర్ఫుద్దౌలా రెండో రోజు ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. -
బంగ్లాతో టెస్టు సిరీస్.. భారత జట్టు ప్రకటన! పంత్ రీ ఎంట్రీ
ముంబై: వికెట్ కీపర్ రిషభ్ పంత్ భారత టెస్టు జట్టులోకి తిరిగొచ్చాడు. 2022 డిసెంబర్లో రోడ్డు ప్రమాదానికి గురైన పంత్ 20 నెలల తర్వాత టెస్టు ఫార్మాట్లో బరిలోకి దిగనున్నాడు. ప్రస్తుతం దులీప్ ట్రోఫీలో భారత్ ‘బి’ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న పంత్ రెండు ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 7, 61 పరుగులు చేశాడు. ఈ నెల 19 నుంచి చెన్నైలో బంగ్లాదేశ్‌తో జరగనున్న తొలి టెస్టు కోసం బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఆదివారం రాత్రి 16 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఈ ఏడాది ఆరంభంలో స్వదేశంలో ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు వ్యక్తిగత కారణాలతో దూరమైన విరాట్ కోహ్లి తిరిగి రాగా... ఉత్తర ప్రదేశ్ పేస్ బౌలర్ యశ్ దయాల్ తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. సీనియర్ పేసర్ షమీ శస్త్రచికిత్స అనంతరం పూర్తిగా కోలుకోకపోవడంతో... సెలెక్టర్లు యశ్ దయాల్‌కు అవకాశం కలి్పంచారు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 24 మ్యాచ్‌లాడిన యశ్ దయాల్ 76 వికెట్లు పడగొట్టాడు. టి20 ప్రపంచకప్ గెలిచినప్పటి నుంచి కెప్టెన్ రోహిత్ శర్మ, కోహ్లి, బుమ్రా విశ్రాంతి తీసుకుంటుండగా... ఇతర ఆటగాళ్లు దులీప్ ట్రోఫీ ఆడుతున్నారు. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ సందర్భంగా గాయపడి జట్టుకు దూరమైన కేఎల్ రాహుల్ కూడా పునరాగమనం చేశాడు. తొలి టెస్టుకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెపె్టన్), యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్, కోహ్లి, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశి్వన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ఆకాశ్‌దీప్, జస్ప్రీత్ బుమ్రా, యశ్ దయాల్. -
బంగ్లా చేతిలో పాక్ ‘పిండి’
రావల్పిండి: సొంతగడ్డపై టెస్టు మ్యాచ్... అటువైపు తమతో పోలిస్తే బలహీన ప్రత్యర్థి... బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌పై నాలుగు రోజుల ఆటలో పరుగుల వరద పారింది... ఇక చివరి రోజు ఆట ఇలాగే సాగి మ్యాచ్ ‘డ్రా’గా ముగియడం లాంఛనమే అనిపించింది. కానీ బంగ్లాదేశ్ అద్భుతం చేసి చూపించింది... తమ స్పిన్ బలగంతో పాకిస్తాన్‌ను పడగొట్టింది... అనిశ్చితికి మారుపేరైన పాకిస్తాన్ రెండో ఇన్నింగ్స్‌లో 55.5 ఓవర్లలో 146 పరుగులకే కుప్పకూలింది.. సంచలన ప్రదర్శన ఫలితంగా బంగ్లాదేశ్ తమ టెస్టు చరిత్రలోనే తొలిసారి పాకిస్తాన్‌ను ఓడించింది. తొలి ఇన్నింగ్స్‌ను భారీ స్కోరు వద్ద డిక్లేర్ చేసిన పాక్ చివరకు పరాజయం పాలైంది. విదేశీ గడ్డపై తొలిసారి జట్టుకు కెపె్టన్‌గా వ్యవహరించిన నజు్మల్ హసన్ షంటో తన పుట్టిన రోజున అరుదైన విజయాన్ని అందుకున్నాడు. ఆదివారం ముగిసిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ 10 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌పై ఘన విజయం సాధించింది. ఓవర్‌నైట్ స్కోరు 23/1తో ఐదో రోజు ఆట కొనసాగించిన పాక్ బ్యాటర్లు బంగ్లా బౌలింగ్ ముందు తేలిపోయారు.ఫలితంగా రెండో ఇన్నింగ్స్‌లో ఆ జట్టు 146 పరుగులకే ఆలౌటైంది. మొహమ్మద్ రిజ్వాన్ (80 బంతుల్లో 51; 6 ఫోర్లు), అబ్దుల్లా షఫీక్ (86 బంతుల్లో 37; 3 ఫోర్లు) మాత్రమే కొద్దిగా పోరాడగలిగారు. తొలి 3 వికెట్లు పేసర్ల ఖాతాలోకి వెళ్లగా... ఆ తర్వాత ఆఫ్‌స్పిన్నర్ మెహదీ హసన్ మిరాజ్ 4, లెఫ్టార్మ్ స్పిన్నర్ షకీబ్ అల్ హసన్ 3 వికెట్లతో పాక్‌ను దెబ్బ తీశారు. తొలి ఇన్నింగ్స్‌లో 117 పరుగుల ఆధిక్యం సాధించిన బంగ్లా ముందు కేవలం 30 పరుగుల లక్ష్యం నిలిచింది. వికెట్ కోల్పోకుండా 6.3 ఓవర్లలో అర గంటలోపే దీనిని అందుకొని బంగ్లాదేశ్ చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. మొదటి ఇన్నింగ్స్‌ను పాక్ 6 వికెట్ల నష్టానికి 448 పరుగుల వద్ద డిక్లేర్ చేయగా... బంగ్లాదేశ్ 565 పరుగులు సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో కీలకమైన 191 పరుగులు చేసిన ముషి్ఫకర్ రహీమ్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. రెండో టెస్టు ఇదే మైదానంలో శుక్రవారం నుంచి జరుగుతుంది. -
ఇన్నింగ్స్ విజయం దిశగా ఇంగ్లండ్
లండన్: వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ విజయం దిశగా సాగుతోంది. మ్యాచ్ రెండో రోజు 250 పరుగులతో వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ ఆట ముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 79 పరుగులు సాధించింది. అండర్సన్, అట్కిన్సన్, స్టోక్స్ రెండు వికెట్ల చొప్పున తీశారు. ఇన్నింగ్స్ ఓటమి తప్పించుకోవాలంటే వెస్టిండీస్ మరో 171 పరుగులు చేయాలి. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 189/3తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ 90 ఓవర్లలో 371 పరుగులకు ఆలౌటైంది. జో రూట్ (68; 7 ఫోర్లు), హ్యారీ బ్రూక్ (50; 5 ఫోర్లు, 1 సిక్స్), తొలి టెస్టు ఆడుతున్న జేమీ స్మిత్ (70; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు చేశారు. విండీస్ బౌలర్లలో జీడెన్ సీల్స్ 4 వికెట్లు పడగొట్టగా... హోల్డర్, గుడకేశ్ మోతీ 2 వికెట్లు చొప్పున తీశారు. -
గెలుపు దిశగా శ్రీలంక
సిల్హెట్: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక జట్టు విజయం దిశగా పయనిస్తోంది. లంక నిర్దేశించిన 511 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన బంగ్లాదేశ్... మూడో రోజు ఆట ముగిసే సమయానికి 47 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 119/5తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన శ్రీలంక 110.4 ఓవర్లలో 418 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీలు చేసిన ధనంజయ డిసిల్వా (108; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), కామిందు మెండిస్ (164; 16 ఫోర్లు, 6 సిక్స్‌లు) అనూహ్యంగా రెండో ఇన్నింగ్స్‌లోనూ శతకాలు బాది చరిత్ర పుటల్లోకి ఎక్కారు. టెస్టు క్రికెట్ చరిత్రలో ఒకే టెస్టులో ఇద్దరు బ్యాటర్లు రెండు ఇన్నింగ్స్‌లలోనూ సెంచరీలు చేయడం ఇది మూడోసారి. గతంలో 1974లో న్యూజిలాండ్‌తో వెల్లింగ్టన్లో జరిగిన టెస్టులో ఆ్రస్టేలియా బ్యాటర్లు ఇయాన్ చాపెల్ (145, 121), గ్రెగ్ చాపెల్ (247 నాటౌట్, 133)...2014లో అబుదాబిలో ఆ్రస్టేలియాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ బ్యాటర్లు మిస్బా ఉల్ హక్ (101, 101 నాటౌట్), అజహర్ అలీ (109, 100 నాటౌట్) ఈ ఘనత సాధించారు. -
పాపం కేన్ మామ.. ఎలా ఔటయ్యాడో చూడండి.. 12 ఏళ్లలో..!
ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్ (0) ఆసక్తికర రీతిలో రనౌటయ్యాడు. కేన్ పరుగు పూర్తి చేసే క్రమంలో మరో ఎండ్ నుంచి వస్తున్న సహచరుడు విల్ యంగ్‌ను గుద్దుకోవడంతో పరుగు పూర్తి చేయలేకపోయాడు. కేన్ క్రీజ్‌కు చేరకునే లోపు లబూషేన్ డైరెక్ట్ త్రోతో వికెట్లకు గిరాటు వేశాడు. కేన్ రనౌట్ కావడానికి ఆసీస్ బౌలర్ మిచెల్ స్టార్క్ కూడా పరోక్ష కారకుడయ్యాడు. కేన్ పరుగు తీస్తుండగా.. స్టార్క్ కూడా అడ్డుతగిలాడు (ఉద్దేశపూర్వకంగా కాదు).12 ఏళ్లలో కేన్ రనౌట్ కావడం ఇదే తొలిసారి. చివరిసారిగా అతను 2012లో రనౌటయ్యాడు. కేన్ రనౌట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది. KANE WILLIAMSON IS RUN OUT IN TEST CRICKET FOR THE FIRST TIME IN 12 YEARS...!!! 🤯pic.twitter.com/KRheTm61sg — Mufaddal Vohra (@mufaddal_vohra) March 1, 2024 కాగా, ఆసీస్ బౌలర్లు మూకుమ్మడగా రాణించడంతో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 179 పరుగులకే కుప్పకూలింది. కేన్‌తో పాటు రచిన్ రవీంద్ర, కుగ్గెలిన్ డకౌట్లయ్యారు. టామ్ లాథమ్ (5), విల్ యంగ్ (9), సౌథీ (1) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం కాగా.. 29 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్‌ను గ్లెన్ ఫిలిప్స్ (71) మెరుపు అర్దసెంచరీతో గట్టెక్కించే ప్రయత్నం చేశాడు. టామ్ బ్లండల్ (33), మ్యాట్ హెన్రీ (42) ఓ మోస్తరు స్కోర్లు చేయగా డారిల్ మిచెల్ 11 పరుగులు చేశాడు. ఆసీస్ బౌలర్లలో నాథన్ లయోన్ 4, హాజిల్‌వుడ్ 2, స్టార్క్, కమిన్స్, మార్ష్ తలో వికెట్ పడగొట్టారు. దీనికి ముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 383 పరుగులకు ఆలౌటైంది. కెమరూన్ గ్రీన్ భారీ శతకం (174) సాధించి అజేయంగా నిలువగా.. స్టీవ్ స్మిత్ 31, ఉస్మాన్ ఖ్వాజా 33, లబూషేన్ 1, హెడ్ 1, మిచెల్ మార్ష్ 40, అలెక్స్ క్యారీ 10, స్టార్క్ 9, కమిన్స్ 16, లయోన్ 5, హాజిల్‌వుడ్ 22 పరుగులు చేశారు. కివీస్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ ఐదు వికెట్ల ప్రదర్శనలతో రాణించగా.. విలియమ్ రూర్కీ, కుగ్గెలిన్ తలో 2 వికెట్లు, రచిన్ రవీంద్ర ఓ వికెట్ పడగొట్టాడు. 204 పరుగుల లీడ్‌తో సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా రెండో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 13 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ డకౌట్ కాగా..లబూషేన్ 2 పరుగులు చేసి ఔటయ్యాడు. ఖ్వాజా (5), నైట్ వాచ్మెన్ లయెన్ (6) క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 217 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. -
Australia v West Indies: విండీస్ సంచలనం
బ్రిస్బేన్: వెస్టిండీస్ యువ పేసర్ షామర్ జోసెఫ్ (7/68) నిప్పులు చెరిగే బంతులతో ఆ్రస్టేలియా బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. 1997 తర్వాత ఆ్రస్టేలియా గడ్డపై వెస్టిండీస్‌కు తొలిసారి టెస్టులో విజయం అందించాడు. ఇప్పటి వరకు ఆడిన 11 డే/నైట్ టెస్టుల్లోనూ గెలిచిన ఆ్రస్టేలియా జట్టు షామర్ దెబ్బకు 12వ డే/నైట్ టెస్టులో తొలిసారి పరాజయం రుచి చూసింది. డే/నైట్‌గా జరిగిన రెండో టెస్టులో ఆట నాలుగో రోజు 216 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించేందుకు ఆ్రస్టేలియా ఓవర్‌నైట్ స్కోరు 60/2తో బరిలోకి దిగింది. ఒకదశలో ఆసీస్ 113/2తో విజయం దిశగా సాగుతున్నట్లు కనిపించింది. అయితే క్రీజులో నిలదొక్కుకున్న కామెరాన్ గ్రీన్ (42; 4 ఫోర్లు)ను, ట్రావిస్ హెడ్ (0)ను షామర్ జోసెఫ్ వరుస బంతుల్లో అవుట్ చేశాడు. ఒకవైపు ఓపెనర్ స్టీవ్ స్మిత్ (91 నాటౌట్; 9 ఫోర్లు, 1 సిక్స్) ఒంటరి పోరాటం చేస్తుండగా.. మరోవైపు ఇతర ఆసీస్ బ్యాటర్లను షామర్ పెవిలియన్‌కు పంపించాడు. చివరకు ఆ్రస్టేలియా 50.5 ఓవర్లలో 206 పరుగులవద్ద ఆలౌట్ కావడంతో వెస్టిండీస్ 8 పరుగుల తేడాతో చిరస్మరణీయ విజయం అందుకుంది. రెండు టెస్టుల సిరీస్‌ను 1–1తో ‘డ్రా’ చేసుకుంది. షామర్ జోసెఫ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’తోపాటు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు దక్కాయి. షామర్ ఈ సిరీస్‌లో 13 వికెట్లు తీయడంతోపాటు 57 పరుగులు చేశాడు. సంక్షిప్త స్కోర్లు వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్: 311; ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్: 289/9 డిక్లేర్డ్; వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్: 193; ఆ్రస్టేలియా రెండో ఇన్నింగ్స్: 206 ఆలౌట్ (50.5 ఓవర్లలో) (స్టీవ్ స్మిత్ 91 నాటౌట్, గ్రీన్ 42, స్టార్క్ 21, షామర్ జోసెఫ్ 7/68). -
Ind vs Eng 1st Test Hyd: మొదటి టెస్టు మన చేతుల్లోకి...
భారత్, ఇంగ్లండ్ తొలి టెస్టు ఊహించిన దిశలోనే సాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో స్వల్ప స్కోరుకే ఇంగ్లండ్‌ను కట్టడి చేసిన టీమిండియా రెండో రోజు తమ బ్యాటింగ్ సత్తా చూపించింది. కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా చక్కటి అర్ధసెంచరీలకు తోడు శ్రేయస్ అయ్యర్, కేఎస్ భరత్, అక్షర్ పటేల్ సమయోచిత సహకారం జట్టును భారీ ఆధిక్యంలో నిలిపాయి. శుక్రవారం 3.47 రన్‌రేట్‌తో 87 ఓవర్లలోనే 302 పరుగులు సాధించిన టీమిండియాకు టెస్టుపై పట్టు చిక్కింది. పేలవ బౌలింగ్‌తో భారత్‌ను నిలువరించడంలో విఫలమైన ఇంగ్లండ్ ఇప్పటికే దాదాపుగా చేతులెత్తేసింది. రెండో రోజు ఒక రనౌట్‌ను మినహాయిస్తే ఆ జట్టు ఐదు వికెట్లే తీయగలిగింది. మరో మూడు వికెట్లతో భారత్ తమ ఆధిక్యాన్ని మరింత పెంచుకునే అవకాశం ఉండగా... ఇంగ్లండ్ ఎంతవరకు పోరాడుతుందనేది చూడాలి. సాక్షి, హైదరాబాద్: బ్యాటింగ్ బలంతో భారత జట్టు ఇంగ్లండ్‌పై తొలి టెస్టులో ఆధిపత్యాన్ని కొనసాగించింది. మ్యాచ్ రెండో రోజు శుక్రవారం ఆట ముగిసే సమయానికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 110 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 421 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (123 బంతుల్లో 86; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), రవీంద్ర జడేజా (155 బంతుల్లో 81 బ్యాటింగ్; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు సాధించగా... కోన శ్రీకర్ భరత్ (81 బంతుల్లో 41; 3 ఫోర్లు), అక్షర్ పటేల్ (62 బంతుల్లో 35 బ్యాటింగ్; 5 ఫోర్లు, 1 సిక్స్), శ్రేయస్ అయ్యర్ (63 బంతుల్లో 35; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ఇప్పటికే భారత్ 175 పరుగుల ఆధిక్యంలో ఉండగా... క్రీజ్‌లో ఉన్న జడేజా, అక్షర్ ఎనిమిదో వికెట్‌కు అభేద్యంగా 63 పరుగులు జోడించారు. ఈ ఇన్నింగ్స్‌లో భారత్ ఐదు అర్ధసెంచరీ భాగస్వామ్యాలు నమోదు చేయగా... మూడింటిలో జడేజా ఉన్నాడు. భారత్ టాప్–5 బ్యాటర్లంతా దూకుడుగా ఆడబోయి అటాకింగ్ షాట్లకే వెనుదిరగడం విశేషం. సమష్టి బ్యాటింగ్‌తో... ఓవర్‌నైట్ స్కోరు 119/1తో ఆట కొనసాగించిన భారత్ తొలి ఓవర్లోనే యశస్వి జైస్వాల్ (74 బంతుల్లో 80; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) వికెట్ కోల్పోయింది. క్రీజ్‌లో ఉన్నంత సేపు ఇబ్బందిగానే కనిపించిన శుబ్‌మన్ గిల్ (66 బంతుల్లో 23; 2 ఫోర్లు) కూడా ఎక్కువసేపు నిలవలేకపోయాడు. అయితే రాహుల్, శ్రేయస్ కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 64 పరుగులు జోడించారు. శ్రేయస్ భారీ స్కోరు చేయడంలో విఫలం కాగా... 72 బంతుల్లో రాహుల్ హాఫ్ సెంచరీ పూర్తయింది. వుడ్ ఓవర్లో అతను కొట్టిన మూడు ఫోర్లు హైలైట్‌గా నిలిచాయి. రేహన్ ఓవర్లో రాహు ల్ రెండు సిక్సర్లు బాదడంతో భారత్ ఆధిక్యంలోకి వచ్చింది. అయితే అతను సెంచరీ చాన్స్‌ను పోగొట్టుకున్నాడు. రాహుల్ పెవిలియన్‌కు చేరిన సమయంలో భారత్ 42 పరుగుల ఆధిక్యంలో మాత్రమే ఉంది. దాంతో చివరి వికెట్ల తీయగల మని ఇంగ్లండ్‌కు ఆశ కలిగింది. కానీ జడేజా వాటిని వమ్ము చేశాడు. ముందుగా భరత్‌తో, ఆ తర్వాత అక్షర్ పటేల్‌తో అతను రెండు కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. కొన్ని చక్కటి షాట్లు ఆడిన ఆంధ్ర ఆటగాడు భరత్ పెద్ద స్కోరు సాధించే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. 84 బంతుల్లో జడేజా అర్ధసెంచరీ చేశాడు. జడేజాతో సమన్వయలోపంతో అశ్విన్ (1) రనౌట్ కావడం ఒక్కటే కాస్త నిరాశపర్చింది. తన బ్యాటింగ్ ప్రతిభను ప్రదర్శిస్తూ అక్షర్ కూడా చెలరేగడంతో ఇంగ్లండ్ బౌలర్లు బేలగా చూస్తుండిపోయారు. హార్లీ వేసిన చివరి ఓవర్లో అక్షర్ వరుసగా 4, 6, 4 బాది రోజును ముగించాడు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 246 ఆలౌట్; భారత్ తొలి ఇన్నింగ్స్: యశస్వి (సి అండ్ బి) రూట్ 80; రోహిత్ (సి) స్టోక్స్ (బి) లీచ్ 24; గిల్ (సి) డకెట్ (బి) హార్లీ 23; రాహుల్ (సి) రేహన్ (బి) హార్లీ 86; శ్రేయస్ (సి) హార్లీ (బి) రేహన్ 35; జడేజా (బ్యాటింగ్) 81; భరత్ (ఎల్బీ) (బి) రూట్ 41; అశ్విన్ (రనౌట్) 1; అక్షర్ పటేల్ (బ్యాటింగ్) 35; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (110 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి) 421. వికెట్ల పతనం: 1–80, 2–123, 3–159, 4–223, 5–288, 6–356, 7–358. బౌలింగ్: వుడ్ 13–0–43–0, హార్లీ 25–0–131–2, లీచ్ 25–6–54–1, రేహన్ 23–3–105–1, రూట్ 24–2–77–2. -
IND VS ENG 1st Test: చరిత్రలో తొలిసారి..!
ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా హైదరాబాద్ వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ జట్టు ఓ వినూత్న ప్రయోగం చేసింది. ఆ జట్టు తొలిసారి ఓ టెస్ట్ మ్యాచ్‌లో ఏకైక స్పెషలిస్ట్ పేసర్‌తో బరిలోకి దిగింది. హైదరాబాద్ టెస్ట్‌లో ఇంగ్లండ్.. రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్ ఒక్కడినే బరిలోకి దించి సరికొత్త ప్రయోగానికి తెరలేపింది. ఈ మ్యాచ్‌లో వుడ్‌ను బరిలోకి దించినా, తొలి రోజు ఆటలో అతనిచే కేవలం రెండు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేయించింది. తొలి రోజు ఇంగ్లండ్ మొత్తంగా 23 ఓవర్లు వేయగా.. అందులో 21 ఓవర్లు స్పిన్నర్లు టామ్ హార్ట్లీ (9), జాక్ లీచ్ (9), రెహాన్ అహ్మద్‌లే (3) షేర్ చేసుకున్నారు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్ ఇలా ముగ్గురు స్పిన్నర్లతో టెస్ట్ మ్యాచ్ బరిలోకి దిగడం కూడా చాలా అరుదు. హైదరాబాద్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉందని భావించి ఇంగ్లండ్ మేనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. తొలి రోజు ఆటను బట్టి చూస్తే ఇంగ్లండ్ అంచనా కరెక్టే అయినప్పటికీ.. భారత్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అత్యంత పొదుపుగా బౌలింగ్ చేసి కీలకమైన స్టోక్స్ వికెట్ సహా రెండు వికెట్లు తీయడం విశేషం. కాగా, భారత్-ఇంగ్లండ్ మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ నిన్న (జనవరి 25) ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది. అయితే భారత స్పిన్నర్లు ధాటికి ఇంగ్లండ్ జట్టు 246 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ స్టోక్స్ (70) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు. జాక్ క్రాలే 20, బెన్ డకెట్ 35, ఓలీ పోప్ 1, జో రూట్ 29, బెయిర్‌స్టో 37, ఫోక్స్ 4, రెహాన్ అహ్మద్ 13, టామ్ హార్ట్లీ 23, మార్క్ వుడ్ 11 పరుగులు చేసి ఔటయ్యారు. జడేజా, అశ్విన్ తలో మూడు వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ పతనాన్ని శాశించగా.. అక్షర్ పటేల్, బుమ్రా తలో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 119 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 24 పరుగులు చేసి జాక్ లీచ్ బౌలింగ్‌లో ఔట్ కాగా.. యశస్వి జైస్వాల్ (76), శుభ్‌మన్ గిల్ (14) క్రీజ్‌లో ఉన్నారు. భారత్.. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 127 పరుగులు వెనుకపడి ఉంది. -
టాస్ ఓడిన భారత్.. కోహ్లి ప్రత్యామ్నాయ ఆటగాడికి నో ప్లేస్
ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఇవాళ (జనవరి 25) తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భారత తుది జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, శ్రీకర్ భరత్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ ఇంగ్లండ్ తుది జట్టు: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఒల్లీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్లీ, మార్క్ వుడ్, జాక్ లీచ్ -
భారత్‌ను ఇంగ్లండ్ ఆపతరమా!
సొంతగడ్డపై భారత జట్టు 2012లో చివరిసారిగా, అదీ ఇంగ్లండ్ చేతిలో ఓడింది... అయితే ఆ తర్వాత ఏ ఒక్క టీమ్ కూడా మన జట్టుతో తలపడి పైచేయి సాధించలేకపోయింది. ఇంకా చెప్పాలంటే టీమిండియా వరుసగా 16 సిరీస్‌లలో విజయం సాధించగా ఇందులో 7 క్లీన్‌స్వీప్‌లు ఉన్నాయి. రెండుసార్లు ఆస్ట్రేలియా మాత్రమే సిరీస్‌ను ‘డ్రా’ చేసేందుకు కాస్త చేరువగా రాగలిగింది. నాటినుంచి ఇక్కడ ఆడిన 44 టెస్టుల్లో భారత్ మూడింటిలో మాత్రమే ఓడిందంటే మన బలం, బలగం ఏమిటో అర్థమవుతుంది. ఇంగ్లండ్ కూడా ఇక్కడ ఆడిన గత రెండు టెస్టు సిరీస్‌లలో భారత్ చేతిలో 0–4, 1–3తో చిత్తుగా ఓడింది... ఇలాంటి స్థితిలో భారత జట్టు మరోసారి ప్రత్యర్థిని పడగొట్టేందుకు సిద్ధమవుతోంది. ఇటీవల మన మేనేజ్మెంట్ వ్యాఖ్యలు చూస్తే పూర్తి స్థాయిలో స్పిన్ పిచ్లే తయారు కావడం ఖాయం. మరోవైపు గత కొంతకాలంగా దూకుడైన ఆటతో ‘బజ్‌బాల్’ అంటూ సిద్ధమైన ఇంగ్లండ్ ఏమాత్రం పోటీనిస్తుందనేది చూడాలి. ఈ నేపథ్యంలో ఐదు టెస్టుల భారీ సిరీస్‌కు రంగం సిద్ధమైంది. గత దశాబ్దకాలంలో మా జట్టుకు ఇక్కడ అద్భుతమైన రికార్డు ఉన్నది వాస్తవమే అయినా అది ఈ సిరీస్ విజయానికి పనికి రాదు. పరిస్థితులకు తగినట్లుగా అత్యుత్తమ క్రికెట్ ఆడాల్సిందే. ఆఖరిసారిగా ఇంగ్లండే మమ్మల్ని ఇక్కడ ఓడించింది. మేం అజేయులం ఏమీ కాదు. అలాంటి భ్రమలేవీ లేవు. కాబట్టి ఏమాత్రం ఉదాసీనత కనబర్చినా ఓటమి ఎదురవుతుంది. ఎదుటివారి బలబలాలకంటే మన జట్టు వ్యూహం గురించి స్పష్టత ఉండాలి. దానిని అమలు చేయాలి కూడా. ఇలాంటి పరిస్థితుల్లో మేమందరం ఆడాం కాబట్టి ఎలా ఆడాలో సొంత ప్రణాళికలు కూడా రూపొందించుకోవాలి. టెస్టుల్లో ఒత్తిడిని అధిగమించడమే పెద్ద సవాల్. బరిలోకి దిగి పూర్తి సత్తాను ప్రదర్శించాలి. ఎప్పటికీ సీనియర్లపైనే ఆధారపడలేం కదా. కొత్త కుర్రాళ్లకు కూడా అవకాశం ఇవ్వాలి. లేదంటే వారు ఎప్పుడు ఆడతారు. అందుకే పటిదార్‌ను ఎంచుకున్నాం. –రోహిత్ శర్మ, భారత కెప్టెన్ సాక్షి, హైదరాబాద్: భారత గడ్డపై మరో పెద్ద జట్టుతో టెస్టు సిరీస్‌కు సమయం ఆసన్నమైంది. నేటి నుంచి భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్ జరగనుంది. ఇందులో భాగంగా గురువారం నుంచి ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో తొలి టెస్టులో ఇరు జట్లు తలపడతాయి. బలాబలాలు, రికార్డుపరంగా చూస్తే అన్ని విధాలా రోహిత్ శర్మ జట్టుదే పైచేయిగా కనిపిస్తుండగా... గత కొంతకాలంగా మార్పులతో కనిపిస్తూ వచ్చిన ఇంగ్లండ్‌ను పూర్తిగా తక్కువ చేయలేం. ఏ జట్టు గెలిచినా సిరీస్‌లో శుభారంభం చేస్తే ఆపై దాని ప్రభావం కనిపించడం ఖాయం. కోహ్లి లేకుండా... భారత్‌కు సంబంధించి తుది జట్టు విషయంలో ఎలాంటి సందిగ్ధత లేదు. దక్షిణాఫ్రికాతో కేప్‌టౌన్‌లో ఆడిన టీమ్ నుంచి సహజంగానే స్వదేశంలో మార్పులు ఖాయం. బౌలింగ్ విభాగంలో ఇద్దరు పేసర్ల స్థానాల్లో ఇద్దరు స్పిన్నర్లు వస్తున్నారు. సీనియర్ ఆటగాడు అఅశ్విన్ న్ బరిలోకి దిగడం ఖాయం. అఅశ్విన్ న్–జడేజాల స్పిన్ జోడీ చెలరేగితే ఇంగ్లండ్ ఏమాత్రం నిలబడగలదనేది ఆసక్తికరం. గత దశాబ్దకాలంలో వీరిద్దరు సొంతగడ్డపై ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టారు. మూడో స్పిన్నర్‌గా అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ మధ్య పోటీ ఉంది. కెప్టెన్ రోహిత్ కూడా దీనిపై స్పష్టత ఇవ్వకపోయినా బ్యాటింగ్‌ను దృష్టిలో పెట్టుకునే అక్షర్‌కే ప్రాధాన్యత ఉంది. ఇద్దరు పేసర్లు బుమ్రా, సిరాజ్ కొత్త బంతిని పంచుకుంటారు. కెరీర్లో 23 టెస్టులు ఆడిన సిరాజ్‌కు తన సొంత మైదానంలో ఇదే తొలి టెస్టు కావడం విశేషం. ఆరంభంలో వీరిద్దరు ప్రభావం చూపించగలరు. స్టార్ బ్యాటర్ కోహ్లి ఈ మ్యాచ్‌కు దూరం కావడం అభిమానులను నిరాశపర్చేదే. అయితే అతను లేకపోవడం వల్ల బ్యాటింగ్‌లో ఎంపిక సమస్య లేకుండా పోయింది. నాలుగో స్థానంలో శ్రేయస్ అయ్యర్, ఐదో స్థానంలో కేఎల్ రాహుల్ ఆడతారు. శుబ్‌మన్ గిల్ టెస్టుల్లో ఇంకా మెరుగైన ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. కోహ్లి స్థానంలో స్పెషలిస్ట్ వికెట్ కీపర్‌గా ఆంధ్ర ఆటగాడు కోన శ్రీకర్ (కేఎస్) భరత్ జట్టులోకి వస్తాడు. రజత్ పటిదార్‌ను ఎంపిక చేసినా... తుది జట్టులో చోటు కష్టమే. మన బ్యాటర్లు భారీ స్కోరు అందిస్తే ఇంగ్లండ్ పని పట్టడం బౌలర్లకు పెద్ద కష్టం కాకపోవచ్చు. ముగ్గురు స్పిన్నర్లతో... మ్యాచ్‌కు ముందు రోజే ఇంగ్లండ్ తమ తుది జట్టును ప్రకటించింది. స్పిన్ పిచ్‌ను దృష్టిలో ఉంచుకొని ముగ్గురు స్పిన్నర్లకు అవకాశమిచ్చి ఒకే ఒక పేసర్‌తో బరిలోకి దిగుతోంది. నాణ్యమైన స్పిన్నర్లు కాకపోయినా... అందుబాటులో ఉన్నవారి నుంచే ఎంచుకోక తప్పలేదు. 35 టెస్టుల అనుభవం ఉన్న లెఫ్టార్మ్ స్పిన్నర్ లీచ్ కొంత వరకు ప్రభావం చూపించవచ్చు. కానీ లెగ్‌స్పిన్నర్ రేహన్ ఒకే ఒక టెస్టు ఆడగా, మరో లెఫ్టార్మ్ స్పిన్నర్ టామ్ హార్లీకి ఇదే తొలి టెస్టు కానుంది. అదనంగా జో రూట్ ఆఫ్ స్పిన్ కూడా వేయగలడు. ఇంగ్లండ్ స్పిన్నర్లు మన బ్యాటింగ్‌ను ఏమాత్రం నిలువరించగలరనేది సందేహమే అయినా... స్పిన్‌తో కనీసం ప్రయత్నమైనా చేసేందుకు ఆ జట్టు సిద్ధమైంది. సీనియర్ అండర్సన్‌ను కాకుండా మార్క్ వుడ్ రూపంలో ఏకైక ఫాస్ట్ బౌలర్‌గా ఎంచుకుంది. బ్యాటింగ్‌లో రూట్, బెయిర్‌స్టోలపై ప్రధానంగా ఆ జట్టు ఆధారపడుతోంది. ఓలీ పోప్ కూడా మెరుగైన బ్యాటరే అయినా... క్రాలీ, డకెట్ ఎలాంటి ఆరంభం ఇస్తారో చూడాలి. స్టోక్స్ బ్యాటింగ్‌లో ధాటిని ప్రదర్శించాలని జట్టు కోరుకుంటోంది. ముఖ్యంగా కోచ్ బ్రెండన్ మెకల్లమ్ ఆధ్వర్యంలో ‘బజ్‌బాల్’ అంటూ దూకుడైన తరహా శైలితోనే టీమ్ సఫలమైంది. అయితే పూర్తి భిన్నమైన భారత పిచ్‌లపై అలాంటి మంత్రం ఎలా పని చేస్తుందో చూడాలి. ఈ జోరులో జట్టు కుప్పకూలిపోయే ప్రమాదమూ ఉంది. పిచ్, వాతావరణం ఉప్పల్ పిచ్ పొడిగా కనిపిస్తోంది. మరో మాటకు తావు లేకుండా స్పిన్‌కు అనుకూలించడం ఖాయం. అయితే అది ఎంత తొందరగా మొదలవుతుందనేదే ఆసక్తికరం. టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్‌కే మొగ్గు చూపుతుంది. తుది జట్లు భారత్ (అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్ ), యశస్వి, గిల్, శ్రేయస్, కేఎల్ రాహుల్, జడేజా, భరత్, అఅశ్విన్ న్, అక్షర్ పటేల్, బుమ్రా, సిరాజ్. ఇంగ్లండ్: స్టోక్స్ (కెప్టెన్ ), క్రాలీ, డకెట్, పోప్, రూట్, బెయిర్‌స్టో, ఫోక్స్, వుడ్, రేహన్, హార్లీ, లీచ్. 4 ఉప్పల్ స్టేడియంలో భారత జట్టు 5 టెస్టులు ఆడింది. న్యూజిలాండ్‌తో 2010లో జరిగిన తొలి టెస్టు ‘డ్రా’గా ముగియగా... తర్వాతి నాలుగు మ్యాచ్‌లలో వరుసగా న్యూజిలాండ్, ఆ్రస్టేలియా, బంగ్లాదేశ్, వెస్టిండీస్‌లపై భారీ విజయాలు సాధించింది. షోయబ్ బషీర్‌కు వీసా మంజూరు లండన్: భారత వీసా లభించకపోవడంతో తొలి టెస్టుకు దూరమైన ఇంగ్లండ్ స్పిన్నర్ షోయబ్ బషీర్‌కు ఊరట లభించింది. వీసా లేకపోవడంతో అతను జట్టుతో పాటు భారత్‌కు ప్రయాణించకుండా యూఏఈ నుంచి ఇంగ్లండ్‌కు వెనక్కి వెళ్లిపోయాడు. అయితే ఇప్పుడు బషీర్‌కు వీసా మంజూరైందని గురువారం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ప్రకటించింది. ‘బషీర్ తన వీసా అందుకున్నాడు. ఈ వారాంతంలో భారత్‌కు వచ్చి అతను జట్టుతో కలుస్తాడు. సమస్య పరిష్కారం కావడంతో సంతోషంగా ఉంది’ అని ఈసీబీ వెల్లడించింది. ఇంగ్లండ్‌లో పుట్టినా... పాకిస్తాన్ మూలాలు ఉన్న కారణంగానే బషీర్ వీసాను భారత ప్రభుత్వం ఆలస్యం చేసిందని గత రెండు రోజులుగా విమర్శలు వచ్చాయి. ఇంగ్లండ్ ప్రభుత్వ అధికారి కూడా ఒకరు దీనిపై అసంతృప్తి వ్యక్తం చేయగా... ఇప్పుడు అంతా సుఖాంతమైంది. 20 ఏళ్ల ఆఫ్ స్పిన్నర్ బషీర్ ఇప్పటి వరకు ఒక్క టెస్టు కూడా ఆడలేదు.