
చట్టోగ్రామ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియా పైచేయి సాధించింది. 278/6 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్.. మరో 126 పరుగులు జోడించి 404 పరుగుల వద్ద ఆలౌటైంది.
అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన బంగ్లాదేశ్.. కుల్దీప్ యాదవ్ (4/26), మహ్మద్ సిరాజ్ (3/14), ఉమేశ్ యాదవ్ (1/33) ధాటికి 113 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ప్రస్తుతానికి బంగ్లాదేశ్.. భారత తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 291 పరుగులు వెనుకపడి ఉంది. మెహిది హసన్ (8), ఎబాదత్ హొస్సేన్ (7) క్రీజ్‌లో ఉన్నారు.
— Guess Karo (@KuchNahiUkhada) December 15, 2022
కాగా, పుజరా (90), శ్రేయస్ అయ్యర్ (86), అశ్విన్ (58)లు హాఫ్ సెంచరీలతో రాణించడంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ సాధించింది. పంత్ (46), కుల్దీప్ యాదవ్ (40) పర్వాలేదనిపించారు. ఆఖర్లో ఉమేశ్ యాదవ్ (15 నాటౌట్) సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. 393/9 స్కోర్ వద్ద అశ్విన్ ఔటయ్యాక బరిలోకి దిగిన ఉమేశ్.. మెహిది హసన్ బౌలింగ్‌లో 101 మీటర్ల రెండు భారీ సిక్సర్లు బాదాడు.
— Guess Karo (@KuchNahiUkhada) December 15, 2022
దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరలవుతున్నాయి. ఇవి చూసిన అభిమానులు.. ఉమేశ్.. నీలో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా, 2019 అక్టోబర్‌లో కూడా ఉమేశ్ ఇదే తరహాలో బ్యాట్‌తో రెచ్చిపోయాడు. నాడు సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో అతను 10 బంతుల్లో 31 పరుగులు పిండుకున్నాడు.