భారత్, బంగ్లాదేశ్ మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ చెన్నై వేదికగా సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ కోసం భారత తుది జట్టు ఎలా ఉండతుందో అని ఇప్పటి నుంచే అంచనాలు మొదలయ్యాయి. విశ్లేషకులు, అభిమానులు ఎవరికి తోచిన విధంగా వారు తమ అంచనాలను వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత తుది జట్టు ఎంపికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
కాగా, భారత తుది జట్టు ఇలా ఉండబోతుందంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ తెగ వైరలవుతుంది. ఈ పోస్ట్ ప్రకారం భారత తుది జట్టులో కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్‌లకు చోటు దక్కలేదు. వీరి స్థానాల్లో సర్ఫరాజ్ ఖాన్, కుల్దీప్ యాదవ్ తుది జట్టులో చోటు దక్కించుకున్నారు.
యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ భారత ఇన్నింగ్స్‌ను ఆరంభించనుండగా.. వన్‌డౌన్‌లో శుభ్‌మన్ గిల్, నాలుగో స్థానంలో విరాట్ కోహ్లి, ఐదో ప్లేస్‌లో సర్ఫరాజ్ ఖాన్, ఆరో స్థానంలో రిషబ్ పంత్, ఆల్‌రౌండర్ కోటాలో రవీంద్ర జడేజా, స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, పేసర్లుగా జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్ తుది జట్టులో చోటు దక్కించుకున్నారు.
భారత పూర్తి జట్టు..
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, సర్ఫరాజ్ ఖాన్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, ధృవ్ జురెల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, ఆకాశ్‌దీప్, మొహమ్మద్ సిరాజ్, యశ్ దయాల్
ఇదిలా ఉంటే, భారత్‌తో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లు ఆడేందుకు బంగ్లాదేశ్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. ఈ పర్యటన సెప్టెంబర్ 19న మొదలువుతుంది. ఈ పర్యటనలో తొలుత టెస్ట్ మ్యాచ్‌లు ఆతర్వాత టీ20లు జరుగనున్నాయి. సెప్టెంబర్ 19 నుంచి తొలి టెస్ట్.. సెప్టెంబర్ 27 నుంచి రెండో టెస్ట్ ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 6, 7, 12 తేదీల్లో గ్వాలియర్, ఢిల్లీ, హైదరాబాద్ వేదికలుగా మూడు టీ20లు జరుగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment