భారత క్రికెట్‌కు సంబంధించి ఇవాళ (డిసెంబర్ 8) దుర్దినం అని చెప్పాలి. ఎందుకంటే.. ఈ రోజు భారత క్రికెట్ జట్లకు మూడు పరాభవాలు ఎదురయ్యాయి. అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది.
మహిళల క్రికెట్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో భారత జట్టు 122 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 0-2 తేడాతో కోల్పోయింది.
ఇవాళే జరిగిన అండర్-19 ఆసియా కప్ ఫైనల్లో యంగ్ ఇండియా ఘోర పరాభవం ఎదుర్కొంది. ఫైనల్లో భారత్‌పై బంగ్లాదేశ్ 59 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా బంగ్లాదేశ్ ఆసియా ఛాంపియన్‌గా అవతరించింది.
ఇలా ఒకే రోజు భారత క్రికెట్ జట్లు మూడు పరాభవాలు ఎదుర్కోవడంతో సగటు భారత క్రికెట్ అభిమాని బాధ పడుతున్నాడు. భారత క్రికెట్‌కు ఇవాళ దుర్దినం అని అభిప్రాయపడుతున్నాడు.
ఇదిలా ఉంటే, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భారత్ 1-1తో సమంగా నిలిచింది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో టీమిండియా గెలుపొందగా.. రెండో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. మూడో టెస్ట్ డిసెంబర్ 14 నుంచి బ్రిస్బేన్ వేదికగా జరుగనుంది.
మహిళల క్రికెట్ విషయానికొస్తే.. మూడు మ్యాచ్ వన్డే సిరీస్ కోసం భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియానే విజయం సాధించింది. తద్వారా ఆసీస్ 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో నామమాత్రపు మూడో వన్డే డిసెంబర్ 11న జరుగనుంది.
అండర్-19 ఆసియా కప్ విషయానికొస్తే.. ఇవాళ జరిగిన ఫైనల్లో భారత్‌పై బంగ్లాదేశ్ 59 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 49.1 ఓవర్లలో 198 పరుగులకు ఆలౌటైంది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్.. 35.2 ఓవర్లలో 139 పరుగులకే ఆలౌటైంది.
Comments
Please login to add a commentAdd a comment