బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు ముందు టీమిండియా పేస్ బౌలర్లు నెట్స్‌లో కఠోరంగా శ్రమిస్తున్నారు. భారత స్పీడ్ గన్స్ అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, మయాంక్ యాదవ్, హార్దిక్ పాండ్యా పసికూన బంగ్లాదేశ్‌పై ఫైరింగ్‌కు సిద్దమవుతున్నారు.
బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ పర్యవేక్షణలో భారత పేస్ విభాగం రాటుదేలుతుంది. టీమిండియా పేసర్లు ప్రాక్టీస్‌లో నిమగ్నమైన వీడియోను బీసీసీఐ సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం వైరలవుతుంది.
Bring out the speed guns, the pace battery has arrived! ⚡️⚡️#TeamIndia | #INDvBAN | @IDFCFIRSTBank pic.twitter.com/FM4Sv5E4s3
— BCCI (@BCCI) October 4, 2024
కాగా, బంగ్లాదేశ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ అక్టోబర్ 6 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌కు గ్వాలియర్‌లోని మాధవరావ్ సింథియా స్టేడియం వేదిక కానుంది. అనంతరం రెండో టీ20 అక్టోబర్ 9న న్యూఢిల్లీ వేదికగా.. మూడో టీ20 అక్టోబర్ 12న హైదరాబాద్ వేదికగా జరుగనున్నాయి.
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు..
అభిషేక్ శర్మ, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, రియాన్ పరాగ్, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, మయాంక్ యాదవ్, నితీశ్ కుమార్ రెడ్డి, జితేశ్ శర్మ, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా
చదవండి: వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఆఫ్ఘనిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్
Comments
Please login to add a commentAdd a comment