బంగ్లాదేశ్‌తో తొలి టీ20.. తెలుగు కుర్రాడికి అవకాశం లేనట్లే..! | Predicted Team India Playing XI Against Bangladesh In First T20I | Sakshi
Sakshi News home page

బంగ్లాదేశ్‌తో తొలి టీ20.. తెలుగు కుర్రాడికి అవకాశం లేనట్లే..!

Published Thu, Oct 3 2024 8:17 PM | Last Updated on Thu, Oct 3 2024 8:55 PM

Predicted Team India Playing XI Against Bangladesh In First T20I

భారత్‌, బంగ్లాదేశ్‌ మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ అక్టోబర్‌ 6 నుంచి ప్రారంభం కానుంది. తొలి టీ20 (అక్టోబర్‌ 6న) గ్వాలియర్‌ వేదికగా జరుగనుండగా.. రెండో టీ20 (అక్టోబర్‌ 9న) ఢిల్లీలో.. మూడో టీ20 (అక్టోబర్‌ 12న) హైదరాబాద్‌లో జరుగనున్నాయి. ఈ సిరీస్‌ కోసం భారత్‌, బంగ్లాదేశ్‌ జట్లను ఇదివరకే ప్రకటించారు. 

తొలి టీ20 ప్రారంభానికి మరో రెండు రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో భారత తుది జట్టులో ఎవరెవరు ఉంటారన్న అంచనాలు ఇప్పటి నుంచే మొదలయ్యాయి.

ఈ సిరీస్‌ కోసం సీనియర్లకు విశ్రాంతినిచ్చిన భారత సెలెక్టర్లు యువ జట్టును ఎంపిక చేశారు. ఈ జట్టుకు సూర్యకుమార్‌ నాయకత్వం వహిస్తుండగా.. అభిషేక్ శర్మ, సంజు శాంసన్, రియాన్ పరాగ్, హార్దిక్ పాండ్య, రింకూ సింగ్, శివమ్ దూబె, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, మయాంక్ యాదవ్, నితీశ్‌ రెడ్డి, జితేశ్‌ శర్మ, వరుణ్‌ చక్రవర్తి, హర్షిత్‌ రాణా మిగతా సభ్యులుగా ఉన్నారు.

ఓపెనర్లుగా సంజూ, అభిషేక్‌
యశస్వి జైస్వాల్‌, శుభ్‌మన్‌ గిల్‌కు విశ్రాంతినిచ్చిన నేపథ్యంలో అభిషేక్‌ శర్మ, సంజూ శాంసన్‌ ఇన్నింగ్స్‌ను ప్రారంభించడం దాదాపుగా ఖరారైంది. వన్‌డౌన్‌లో కెప్టెన్ సూర్య, ఆ తర్వాత రియాన్ పరాగ్, రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్ వరుసగా బరిలోకి దిగే ఛాన్స్‌ ఉంది.

నితీశ్‌కు ఎదురుచూపు తప్పదు..!
పేస్ ఆల్‌రౌండర్లుగా హార్దిక్, దూబే తుది జట్టులో ఉండటం దాదాపుగా ఖరారైన నేపథ్యంలో తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్‌ రెడ్డి ఎదురుచూపు తప్పేలా లేదు. స్పెషలిస్ట్‌ స్పిన్నర్‌ కోటాలో రవి బిష్ణోయ్‌ ఎంపిక దాదాపుగా ఖరారు కాగా.. వరుణ్‌ చక్రవర్తికి నిరాశ తప్పదు. పేసర్ల కోటాలో అర్షదీప్ సింగ్, మయాంక్ యాదవ్ తుది జట్టులో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

బంగ్లాదేశ్‌తో తొలి టీ20‌కు భారత తుది జట్టు (అంచనా):
అభిషేక్ శర్మ, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, రియాన్ పరాగ్, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, మయాంక్ యాదవ్

చదవండి: T20 World Cup 2024: బోణి కొట్టిన బంగ్లాదేశ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement