భారత్, బంగ్లాదేశ్ మధ్య కాన్పూర్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు దూకుడు ప్రదర్శించారు. 107/3 స్కోర్ వద్ద నాలుగో రోజు ఆటను ప్రారంభించిన బంగ్లాదేశ్‌ను భారత బౌలర్లు కట్టడి చేశారు. బుమ్రా (3/50), సిరాజ్ (2/57), అశ్విన్ (2/45), ఆకాశ్‌దీప్ (2/43), జడేజా (1/28) ధాటికి బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 233 పరుగులకు ఆలౌటైంది. మొమినుల్ హక్ అజేయ సెంచరీతో (107) బంగ్లాదేశ్‌ను ఆదుకున్నాడు.
బంగ్లా ఇన్నింగ్స్‌లో జకీర్ హసన్ 0, షద్మాన్ ఇస్లాం 24, నజ్ముల్ హసన్ షాంటో 31, ముష్ఫికర్ రహీం 11, లిట్టన్ దాస్ 13, షకీబ్ అల్ హసన్ 9, మెహిది హసన్ మిరాజ్ 20, తైజుల్ ఇస్లాం 5, హసన్ మహమూద్ 1, ఖలీద్ అహ్మద్ 0 పరుగులు చేసి ఔటయ్యారు.
నిప్పులు చెరిగిన బుమ్రా
నాలుగో రోజు ఆటలో బుమ్రా చెలరేగిపోయాడు. ఆట ప్రారంభమైన కొద్ది నిమిషాలకే ముష్ఫికర్ రహీంను అద్భుతమైన బంతితో క్లీన్ బౌల్డ్ చేసిన బుమ్రా, ఆతర్వాత మెహిది హసన్, తైజుల్ ఇస్లాంలను పెవిలియన్‌కు పంపాడు. బుమ్రా ధాటికి బంగ్లా బ్యాటింగ్ లైనప్ విలవిలలాడిపోయింది.
WHAT A BLINDER BY CAPTAIN ROHIT SHARMA. 🔥
- Captain Rohit leads by example for India...!!!! 🙌 pic.twitter.com/XqJORqHvF6— Tanuj Singh (@ImTanujSingh) September 30, 2024
రోహిత్ సూపర్ క్యాచ్
నాలుగో రోజు తొలి సెషన్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ సూపర్ క్యాచ్ పట్టుకున్నాడు. సిరాజ్ బౌలింగ్‌లో రోహిత్ నమ్మశక్యం కాని రీతిలో గాల్లోకి ఎగురుతూ అద్బుతమైన క్యాచ్ పట్టుకున్నాడు. రోహిత్ విన్యాసం చూసి గ్రౌండ్‌లో ఉన్నవారంతా షాక్‌కు గురయ్యారు.
• @fairytaledustt_ pic.twitter.com/yqDDcJcTCq
— V. (@was_fairytale) September 30, 2024
కళ్లు చెదిరే క్యాచ్ పట్టుకున్న సిరాజ్
నాలుగో రోజు ఆటలో భారత ఫీల్డర్లు రెండు అద్భుతమైన క్యాచ్‌లు పట్టుకున్నారు. తొలుత లిట్టన్ దాస్ క్యాచ్‌ను రోహిత్.. ఆతర్వాత షకీబ్ క్యాచ్‌ను సిరాజ్ నమ్మశక్యం కాని రీతిలో అద్భుతమైన క్యాచ్‌లుగా మలిచారు. షకీబ్ క్యాచ్‌ను సిరాజ్ వెనక్కు పరిగెడుతూ సూపర్ మ్యాన్‌లా అందుకున్నాడు. రోహిత్, సిరాజ్ కళ్లు చెదిరే క్యాచ్‌లకు సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి. కాగా, వర్షం కారణంగా ఈ మ్యాచ్‌లో రెండు, మూడు రోజుల ఆట పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన విషయం తెలిసిందే.
చదవండి: IPL 2025: ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకోబోయే ఆటగాళ్లు వీరే..?
Comments
Please login to add a commentAdd a comment