IND vs BAN: నాలుగో రోజు ముగిసిన ఆట.. టీమిండియాదే పైచేయి | IND vs BAN 2nd Test Day 4 Updates | Sakshi
Sakshi News home page

IND vs BAN 2nd Test Day 4 Updates: నాలుగో రోజు ముగిసిన ఆట.. టీమిండియాదే పైచేయి

Published Mon, Sep 30 2024 10:27 AM | Last Updated on Mon, Sep 30 2024 5:43 PM

IND vs BAN 2nd Test Day 4 Updates

IND VS BAN 2nd Test Day 4 Updates: 
నాలుగో రోజు ముగిసిన ఆట
టీమిండియా- బంగ్లాదేశ్‌ మధ్య కాన్పూర్‌లో జరుగుతున్న రెండో టెస్టు నాలుగో రోజు ఆట ముగిసింది. సోమవారం నాటి ఆట పూర్తయ్యేసరికి బంగ్లాదేశ్‌ తమ రెండో ఇన్నింగ్స్‌లో 11 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 26 పరుగులు చేసింది. మొమినుల్‌ హక్‌ సున్నా, షాద్‌మన్‌ ఇస్లాం ఏడు పరుగులతో క్రీజులో ఉన్నారు.

కాగా సోమవారం 107/3 ఓవర్ నైట్‌స్కోర్‌తో ఆట మొదలుపెట్టిన బంగ్లాదేశ్‌ 233 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఈ క్రమంలో తమ తొలి ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన టీమిండియా ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో దంచికొట్టింది. 289/9 వద్ద ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది. 

రెండో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్‌
అశూ బౌలింగ్‌లో హసన్‌ మహమూద్‌(4) రెండో వికెట్‌గా వెనుదిరిగాడు. బంగ్లాదేశ్‌స్కోరు- 26/2 (9.4). షాద్‌మన్‌ ఏడు పరుగులతో ఆడుతున్నాడు. 

తొలి వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్‌
రెండో ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన బంగ్లాదేశ్‌కు అశ్విన్‌ ఆదిలోనే షాకిచ్చాడు. అశూ బౌలింగ్‌లో బంగ్లా ఓపెనర్‌ జకీర్‌ హసన్‌(10) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. బంగ్లాదేశ్‌ స్కోరు: 18/1 (7.1). షాద్‌మన్‌ ఇస్లాం 3 పరుగులతో ఆడుతున్నాడు. హసన్‌ మహమూద్‌ క్రీజులోకి వచ్చాడు. 

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ డిక్లేర్‌.. స్కోర్‌ ఎంతంటే?
టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్‌ను 285/9 వద్ద డిక్లేర్‌ చేసింది. దీంతో భారత్‌కు మొదటి ఇన్నింగ్స్‌లో 52 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. బంగ్లాను సెకెండ్ ఇన్నింగ్స్ ఆడించాలన్న ఆలోచనతో టీమిండియా దూకుడుగా ఆడింది. 

వచ్చినవారు వచ్చినట్లగా తమ వంతు పాత్ర పోషించి పెవిలయన్‌కు వెళ్లిపోయారు. భారత బ్యాటర్లలో యశస్వీ జైశ్వాల్‌(72) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. రాహుల్‌(68), కోహ్లి(47), గిల్‌(39) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. బంగ్లా బౌలర్లలో మెహదీ హసన్‌, షకీబ్ అల్ హసన్ తలా నాలుగు వికెట్లు పడగొట్టారు.

34.1: రాహుల్‌ అవుట్‌
మెహదీ హసన్‌ మిరాజ్‌ బౌలింగ్‌లో కేఎల్‌ రాహుల్‌ 68 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. బుమ్రా క్రీజులోకి వచ్చాడు. టీమిండియాస్కోరు: 284/8 (34.1). తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లా కంటే 51 పరుగుల ఆధిక్యంలో టీమిండియా.

33.3: ఏడో వికెట్‌ డౌన్‌
రవిచంద్రన్‌ అశ్విన్‌ రూపంలో టీమిండియా ఏడో వికెట్‌ కోల్పోయింది. షకీబ్‌ బౌలింగ్‌లో అశూ(1) బౌల్డ్‌ అయ్యాడు. ఆకాశ్‌ దీప్‌ క్రీజులోకి వచ్చాడు.

32.2: జడ్డూ అవుట్‌
మెహదీ హసన్‌ మిరాజ్‌ బౌలింగ్‌లో జడేజా(8) షాంటోకు క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు. దీంతో టీమిండియా ఆరో వికెట్‌ కోల్పోయింది. అశ్విన్‌ క్రీజులోకి వచ్చాడు. 
కోహ్లి అవుట్‌.. హాఫ్‌ సెంచరీ మిస్‌
29.1:  విరాట్‌ కో హ్లి రూపంలో టీమిండియా ఐదో వికెట్‌ ల్పోయింది. షకీబ్‌ అల్‌ హసన్‌ బౌలింగ్‌లో 47 పరుగుల వ్యక్తిగతస్కోరు వద్ద బౌల్డ్‌ అయ్యాడు. జడేజాక్రీజులోకి వచ్చాడు. మరోవైపు.. కేఎల్‌ రాహుల్‌ 33 బంతుల్లోనే హా ఫ్‌ సెంచరీ మార్కు దాటేశాడు. స్కోరు: 249/5 (30)

26 ఓవర్లలో టీమిండియాస్కోరు: 219-4
కోహ్లి 41, రాహుల్‌ 30 పరుగులతో ఆడుతున్నారు.

నాలుగో వికెట్‌ డౌన్‌..
రిషబ్ పంత్ రూపంలో టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన పంత్‌.. షకీబ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 20 ఓవర్లకు భారత్‌ స్కోర్‌: 162-4

భారత మూడో వికెట్‌ డౌన్‌..  శుబ్‌మన్‌ గిల్‌ ఔట్‌
టీమిండియా మూడో వికెట్‌ కోల్పోయింది. 39 పరుగులు చేసిన గిల్‌.. భారీ షాట్‌కు ప్రయత్నించి షకీబ్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులో విరాట్‌ కోహ్లి వచ్చాడు. 18 ఓవర్లకు భారత్‌ స్కోర్‌: 144-3

రెండో వికెట్‌ డౌన్‌.. జైశ్వాల్‌ ఔట్‌
యశస్వీ జైశ్వాల్ రూపంలో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. 72 పరుగుల చేసిన జైశ్వాల్‌ను బంగ్లా పేసర్ హసన్ మహమూద్ అద్భుతమైన బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు. క్రీజులోకి రిషబ్ పంత్ వచ్చాడు. 15 ఓవర్లకు భారత్ స్కోర్‌: 130/2

జైశ్వాల్ ఫిప్టీ..
కాన్పూర్ టెస్టులో టీమిండియా ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 31 బంతుల్లో తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ప్రస్తుతం జైశ్వాల్ 72 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. అతడితో శుబ్‌మన్ గిల్‌(30) క్రీజులో ఉన్నాడు. 14 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టానికి 127 పరుగులు చేసింది.

3.6: కాన్పూర్‌లోబ్యాటింగ్‌ మొదలు పెట్టిన టీమిండియా తొలి వికెట్‌ కోల్పోయింది. ఓపెనర్‌, కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(23) మెహదీ హసన్‌ మిరాజ్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌  అయ్యాడు. శుబ్‌మన్‌ గిల్‌ క్రీజులోకి వచ్చాడు. జైస్వాల్‌ 30 పరుగులతో ఆడుతున్నాడు. టీమిండియాస్కోరు: 55-1(4)

233 పరుగులకు ఆలౌటైన బంగ్లాదేశ్‌
74.2వ ఓవర్‌: 233 పరుగుల వద్ద బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌కు తెరపడింది. జడేజా బౌలింగ్‌లో అతనికే క్యాచ్‌ ఇచ్చి ఖలీద్‌ అహ్మద్‌ చివరి వికెట్‌గా వెనుదిరిగాడు. అంతకుముందు సిరాజ్‌ హసన్‌ మహమూద్‌ను ఎల్బీడబ్ల్యూగా ఔట్‌ చేశాడు. ఈ రోజు ఆటలో భారత బౌలర్లు మొత్తం ఏడు వికెట్లు తీశారు. బుమ్రా 3 వికెట్లు పడగొట్టగా.. సిరాజ్‌, అశ్విన్‌, ఆకాశ్‌దీప్‌ తలో 2, జడేజా ఓ వికెట్‌ దక్కించుకున్నారు. మొమినుల్‌ హక్‌ 107 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

బుమ్రా ఖాతాలో మరో వికెట్‌
71.1వ ఓవర్‌: 230 పరుగుల వద్ద బంగ్లాదేశ్‌ ఎనిమిదో వికెట్‌ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్‌లో తైజుల్‌ ఇస్లాం (5) క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. ఈ ఇన్నింగ్స్‌లో బుమ్రాకు ఇది మూడో వికెట్‌. మొమినుల్‌కు జతగా హసన్‌ మహమూద్‌ క్రీజ్‌లోకి వచ్చాడు. 

ఏడో వికెట్‌ కోల్పోయిన బంగ్లాదేశ్‌
69.4వ ఓవర్‌: 226 పరుగుల వద్ద బంగ్లాదేశ్‌ ఏడో వికెట్‌ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్‌లో శుభ్‌మన్‌కు క్యాచ్‌ ఇచ్చి మెహిది హసన్‌ మిరాజ్‌ (20) ఔటయ్యాడు. 70 ఓవర్ల తర్వాత బంగ్లాదేశ్‌ స్కోర్‌ 225/7గా ఉంది. మొమినుల్‌ (106), తైజుల్‌ ఇస్లాం క్రీజ్‌లో ఉన్నారు. 

మొమినుల్‌ హక్‌ సెంచరీ.. బంగ్లాదేశ్‌ 205/6
లంచ్‌ విరామాని​కి ముందు మొమినుల్‌ హక్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. హక్‌ 172 బంతుల్లో సెంచరీ మార్కును తాకాడు. హక్‌ సెంచరీలో 16 బౌండరీలు, ఓ సిక్సర్‌ ఉన్నాయి. 66 ఓవర్ల అనంతరం బంగ్లా స్కోర్‌ 205/6గా ఉంది. హక్‌తో పాటు మెహిది హసన్‌ మిరాజ్‌ (6) క్రీజ్‌లో ఉన్నారు. 

ఆరో వికెట్‌ కోల్పోయిన బంగ్లాదేశ్‌ 
55.6వ ఓవర్‌: 170 పరుగుల వద్ద బంగ్లాదేశ్‌ ఆరో వికెట్‌ కోల్పోయింది. అశ్విన్‌ బౌలింగ్‌లో సిరాజ్‌ సూపర్‌ క్యాచ్‌ పట్టడంతో షకీబ్‌ (9) పెవిలియన్‌ బాట పట్టాడు. 56 ఓవర్ల తర్వాత బంగ్లాదేశ్‌ స్కోర్‌ 170/6గా ఉంది. మొమినుల్‌ హక్‌ (75), మెహిది హసన్‌ క్రీజ్‌లో ఉన్నారు.

ఐదో వికెట్‌ కోల్పోయిన బంగ్లాదేశ్‌ 
49.4వ ఓవర్‌: 148 పరుగుల వద్ద బంగ్లాదేశ్‌ ఐదో వికెట్‌ కోల్పోయింది. సిరాజ్‌ బౌలింగ్‌లో రోహిత్‌ శర్మ అద్భుతమైన క్యాచ్‌ అందుకోవడంతో లిట్టన్‌ దాస్‌ (13) ఔటయ్యాడు. మొమినుల్‌ హక్‌కు (62) జతగా షకీబ్‌ అల్‌ హసన్‌ క్రీజ్‌లోకి వచ్చాడు.

నాలుగో వికెట్‌ కోల్పోయిన బంగ్లాదేశ్‌
రెండు రోజుల విరామానంతరం ఎట్టకేలకు ఆట మొదలైంది. నాలుగో రోజు ఆట ప్రారంభంలో బంగ్లా బ్యాటర్లు నిదానంగా ఆడారు. ఇన్నింగ్స్‌ 41వ ఓవర్‌ రెండో బంతికి బుమ్రా ముష్ఫికర్‌ రహీంను (11) క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. 45 ఓవర్ల తర్వాత బంగ్లా స్కోర్‌ 133/4గా ఉంది. మొమినుల్‌ హక్‌ (48), లిట్టన్‌ దాస్‌ (12) క్రీజ్‌లో ఉన్నారు. 

భారత్‌, బంగ్లాదేశ్‌ మధ్య కాన్పూర్‌ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌ మ్యాచ్‌ నాలుగో రోజు ఆట ప్రారంభమైంది. తొలి రోజు వర్షం ఆటంకం కలిగించే సమయానికి బంగ్లాదేశ్‌ స్కోర్‌ 107/3గా ఉంది. మొమినుల్‌ హక్‌ 40, ముష్ఫికర్‌ రహీం 6 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. వర్షం, వెట్‌ ఔట్‌ ఫీల్డ్‌ కారణంగా ఈ మ్యాచ్‌లో రెండు, మూడు రోజుల ఆట పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. 

ఈ మ్యాచ్‌లో భారత్‌ టాస్‌ గెలిచి బంగ్లాదేశ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.  బంగ్లా ఇన్నింగ్స్‌లో జకీర్‌ హసన్‌ 0, షద్మాన్‌ ఇస్లాం 24, నజ్ముల్‌ హసన్‌ షాంటో 31 పరుగులు చేసి ఔటయ్యారు. భారత బౌలర్లలో ఆకాశ్‌దీప్‌ 2, రవిచంద్రన్‌ అశ్విన్‌ ఓ వికెట్‌ పడగొట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement