త్వరలో భారత్‌తో జరుగబోయే టీ20 సిరీస్ కోసం 15 మంది సభ్యుల బంగ్లాదేశ్ జట్టును ఇవాళ (సెప్టెంబర్ 29) ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా నజ్ముల్ హొస్సేన్ శాంటో నియమితుడయ్యాడు. ఆల్‌రౌండర్ మెహిది హసన్ 14 నెలల విరామం తర్వాత తిరిగి జట్టులోకి వచ్చాడు. లెఫ్ట్ హ్యాండ్ ఓపెనింగ్ బ్యాటర్ పర్వేజ్ హొసేన్, లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్ రకీబుల్ హసన్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చారు. సీనియర్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, బంగ్లాతో సిరీస్ కోసం భారత జట్టును నిన్ననే ప్రకటించారు.
భారత్‌తో టీ20 సిరీస్‌కు బంగ్లాదేశ్ జట్టు: నజ్ముల్ హొస్సేన్ శాంటో (కెప్టెన్), తంజిద్ హసన్ తమీమ్, పర్వేజ్ హుస్సేన్ ఎమోన్, తౌహిద్ హృదయ్, మహమూద్ ఉల్లా, లిట్టన్ కుమార్ దాస్, జాకెర్ అలీ అనిక్, మెహిదీ హసన్ మిరాజ్, షక్ మహేదీ హసన్, రిషద్ హొసేన్, ముస్తాఫిజుర్ రహ్మాన్, తస్కిన్ అహ్మద్, షోరిఫుల్ ఇస్లాం, తంజిమ్ హసన్ సాకిబ్, రకీబుల్ హసన్.
భారత టీ20 జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, నితీశ్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, మయాంక్ యాదవ్.
భారత్-బంగ్లాదేశ్ టీ20 సిరీస్ షెడ్యూల్..
అక్టోబర్ 6: తొలి టీ20 (గ్వాలియర్)
అక్టోబర్ 9: రెండో టీ20 (ఢిల్లీ)
అక్టోబర్ 12: మూడో టీ20 (హైదరాబాద్)
Comments
Please login to add a commentAdd a comment