టీమిండియాతో తొలి టెస్ట్‌.. కీలక వికెట్లు కూల్చిన బంగ్లా యువ పేసర్‌ | IND vs BAN 1st Test: Team India Lost Their Top 3 For Just 34 Runs, Hasan Mahmud Took All The 3 Wickets | Sakshi
Sakshi News home page

టీమిండియాతో తొలి టెస్ట్‌.. కీలక వికెట్లు కూల్చిన బంగ్లా యువ పేసర్‌

Published Thu, Sep 19 2024 10:37 AM | Last Updated on Thu, Sep 19 2024 12:19 PM

IND vs BAN 1st Test: Team India Lost Their Top 3 For Just 34 Runs, Hasan Mahmud Took All The 3 Wickets

చెన్నై వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌ మ్యాచ్‌లో టీమిండియా స్టార్‌ బ్యాటర్లు పూర్తిగా నిరాశపరిచారు. భారత టాప్‌-3 బ్యాటర్లు రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లి విఫలమయ్యారు. ఓపెనర్‌ రోహిత్‌ ఆరు పరుగులే చేయగా.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ గిల్‌ డకౌట్‌ అయ్యాడు.

నాలుగోస్థానంలో వచ్చిన కోహ్లి కూడా ఆరు పరుగులకే వెనుదిరిగాడు. ఈ ముగ్గురిని బంగ్లాదేశ్‌ యువ పేసర్‌ హసన్‌ మహమూద్‌ ఔట్‌ చేశాడు. రోహిత్‌ సెకెండ్‌ స్లిప్‌లో షాంటోకు క్యాచ్‌ ఇచ్చి ఔట్‌ కాగా.. శుభ్‌మన్‌, కోహ్లి వికెట్‌కీపర్‌ లిట్టన్‌ దాస్‌ చేతికి చిక్కారు. 10 ఓవర్ల తర్వాత భారత్‌ స్కోర్‌ 34/3గా ఉంది. యశస్వి జైస్వాల్‌ (17), రిషబ్‌ పంత్‌ (0) క్రీజ్‌లో ఉన్నారు.

కాగా, వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌(డబ్ల్యూటీసీ) 2023-25 భాగంగా భారత్‌- బంగ్లాదేశ్‌ రెండుమ్యాచ్‌లు ఆడనున్నాయి. తొలి టెస్టుకు చెన్నై, రెండో టెస్టుకు కాన్పూర్‌ వేదిక. మొదటి టెస్ట్‌ మ్యాచ్‌లో భారత్‌ ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగింది. బంగ్లాదేశ్‌ కూడా ఇదే ఫార్ములా అప్లై చేసింది. ఎర్రమట్టి పిచ్‌పై మ్యాచ్‌ జరుతుండటంతో ఇరు జట్లు పేసర్లకు ప్రాధాన్యం ఇచ్చాయి.

తుది జట్లు..

టీమిండియా: రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషభ్‌ పంత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్.

బంగ్లాదేశ్‌: షాద్మాన్ ఇస్లాం, జకీర్ హసన్, నజ్ముల్ హుస్సేన్ శాంటో(కెప్టెన్), మొమినుల్ హక్, ముష్ఫికర్ రహీం, షకీబ్ అల్ హసన్, లిటన్ దాస్(వికెట్ కీపర్), మెహిదీ హసన్ మిరాజ్, తస్కిన్ అహ్మద్, హసన్ మహమూద్, నహీద్ రాణా.

చదవండి: 2025 ఐపీఎల్‌కు సంబంధించి కీలక అప్‌డేట్స్‌
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement