sixers
-
రాకాసి బౌన్సర్.. రోహిత్ కంటే గొప్పగా ఈ షాట్‌ను ఎవరూ ఆడలేరు..!
ధర్మశాల వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్ట్‌లో టీమిండియా పటిష్ట స్థితిలో ఉంది. తొలుత ఇంగ్లండ్‌ను 218 పరుగులకే కట్టడి చేసిన భారత్.. ఆతర్వాత బ్యాటింగ్‌లోనూ చెలరేగి భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తుంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా వికెట్ నష్టానికి 135 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (57) మెరుపు అర్దశతకం చేసి ఔట్ కాగా.. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ (52) హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని క్రీజ్‌లో కొనసాగుతున్నాడు. రోహిత్‌కు జతగా శుభ్‌మన్ గిల్ (26) క్రీజ్‌లో ఉన్నాడు. భారత్.. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు కేవలం 83 పరుగులు మాత్రమే వెనుకపడి ఉంది. అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. కుల్దీప్ యాదవ్ (5/72), అశ్విన్ (4/51), జడేజా (1/17) దెబ్బకు తొలి ఇన్నింగ్స్‌లో 218 పరుగులకే కుప్పకూలింది. 151.2kmph delivery from Mark Wood. But Rohit Sharma says I'll play my favourite shot and send it out of the ground. 🫡pic.twitter.com/cuajTdxVHH — Mufaddal Vohra (@mufaddal_vohra) March 7, 2024 ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జాక్ క్రాలే (79) మినహా ఎవ్వరూ రాణించలేదు. డకెట్ 27, పోప్ 11, రూట్ 26, బెయిర్‌స్టో 29, స్టోక్స్ 0, ఫోక్స్ 24, హార్ట్లీ 6, వుడ్ 0, ఆండర్సన్ 0 పరుగులు చేసి ఔటయ్యారు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను భారత్ ఇదివరకే 3-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా, ఈ ఇన్నింగ్స్‌లో హిట్‌మ్యాన్ ఆడిన ఓ షాట్ రోజు మొత్తానికి హైలైట్‌గా నిలిచింది. మార్క్ వుడ్ సంధించిన ఓ రాకాసి బౌన్సర్‌కు రోహిత్ తగు రీతిలో సమాధానం చెప్పాడు. 151.2 కిమీ వేగంతో నిప్పులు గక్కుతూ వచ్చిన ఆ బౌన్సర్‌కు హిట్‌మ్యాన్ తన ఫేవరెట్ పుల్‌షాట్ ఆడి భారీ సిక్సర్‌గా మలిచాడు. రోహిత్ ఆడిన ఈ సాహసోపేతమైన షాట్‌ను చూసి బౌలర్, ఫీల్డర్లు సహా మైదానంలో ఉన్న వాళ్లంతా నోరెళ్లబెట్టారు. హిట్‌మ్యాన్ అభిమానులు ఈ షాట్‌కు సంబంధించిన వీడియోను సోషల్‌మీడియాలో షేర్ చేస్తూ తమ ఆరాధ్య ఆటగాడిపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఏదిఏమైనా ప్రస్తుత తరం క్రికెటర్లలో రోహిత్ కంటే గొప్పగా ఈ షాట్‌ను ఎవ్వరూ ఆడలేరన్న విషయాన్ని ఒప్పుకోవాలి. -
'చిన్నా.. నేను క్రీజులో ఉన్నానంటే బంతిపై కన్నేసి ఉంచాలి'
మేజర్ క్రికెట్ లీగ్(MLC 2023)లో లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్ ఇప్పటివరకు భోణీ చేయలేకపోయింది. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ పరాజయాలే చవిచూసిన నైట్‌రైడర్స్ జట్టు ఎప్పుడు గెలుపు బాట పడుతుందనేది ఆసక్తికరంగా మారింది. తాజాగా వాషింగ్టన్ ఫ్రీడమ్‌తో జరిగిన మ్యాచ్‌లో లాస్ ఏంజిల్స్ నైట్‌రైడర్స్ ఆరు వికెట్ల తేడాతో ఓటమిపాలయ్యింది. అయితే మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్ మాత్రం సక్సెస్ అయ్యాడు. 37 బంతుల్లో ఆరు ఫోర్లు, ఆరు సిక్సర్లతో 70 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు. తాను విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన బౌలింగ్ వైఫల్యంతో నైట్‌రైడర్స్ ఓటమి పాలైంది. ఈ సంగతి పక్కనబెడితే రసెల్ కొట్టిన సిక్సర్లలో ఒక బంతి పిల్లాడిని గాయపరిచింది. ఇన్నింగ్స్ 13వ ఓవర్లో అకీల్ హొసెన్ వేసిన రెండో బంతిని రసెల్ లాంగాఫ్ మీదుగా భారీ సిక్సర్ బాదాడు. స్టాండ్సలోకి వెళ్లిన బంతి నేరుగా పిల్లాడి తలకు తాకింది. దీంతో పిల్లాడు నొప్పితో విలవిల్లాడిపోయాడు. ఆ తర్వాత పిల్లాడి తండ్రి ఐస్ప్యాక్తో తలకు మర్దన చేస్తూ స్టేడియంలోకి వచ్చాడు. ఇది గమనించిన రసెల్ పిల్లాడి దగ్గరకు వచ్చి ఒక హగ్ ఇచ్చాడు. ఆ తర్వాత అతనికి సిగ్నేచర్ చేసిన బ్యాట్‌తో పాటు టోపీలు గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఈ సందర్భంగా పిల్లాడికి రసెల్ ఒక సలహా కూడా ఇచ్చాడు.. చూడు చిన్న.. రసెల్ బ్యాటింగ్‌లో ఉన్నాడంటే బంతిపై కూడా ఒక కన్నేసి ఉంచు.. ఓకేనా అని తెలిపాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తొలుత బ్యాటింగ్ చేసిన లాస్ ఏంజిల్స్ నైట్‌రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. రసెల్ 70 నాటౌట్, రిలీ రొసౌ 41 పరుగులు మినహా మిగతావారు పెద్దగా ఆకట్టుకోలేదు. ప్రత్యర్థి బౌలర్లలో హెన్రిక్స్ మూడు వికెట్లు పడగొట్టగా.. మార్కో జాన్సెన్ రెండు, నెత్రావల్కర్, అకిల్ హొసెన్‌లు చెరొక వికెట్ తీశారు. 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వాషింగ్టన్ ఫ్రీడమ్ 18.1 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. వాషింగ్టన్ ఇన్నింగ్స్‌లో అందరు బ్యాటర్లు సమిష్టిగా రాణించారు. ఓపెనర్లు మాథ్యూ స్కాట్(43 పరుగులు), ఆండ్రీస్ గౌస్(40 పరుగులు) చేయగా.. గ్లెన్ పిలిప్స్ 29, ఒబెస్ పియనర్ 26 పరుగులు నాటౌట్ జట్టును గెలిపించాడు. Dre Russ made sure to check on the kid who took a blow to his head from one of his sixes in Morrisville 💜 We’re glad the impact wasn’t too bad, and the li’l champ left with a smile and some mementos for a lifetime.#LAKR #LosAngeles #WeAreLAKR #MLC23 #AndreRussell @Russell12A… pic.twitter.com/EtLO5z2avx — Los Angeles Knight Riders (@LA_KnightRiders) July 22, 2023 చదవండి: IND vs WI: అశ్విన్‌తో అట్లుంటది మరి.. విండీస్ కెప్టెన్ ఫ్యూజ్‌లు ఔట్! వీడియో వైరల్ -
ఐపీఎల్లో తొలి సిక్సర్ కొట్టిన అర్జున్ టెండూల్కర్
ముంబై ఇండియన్స్ ఆటగాడు అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్లో తొలి సిక్సర్ బాదాడు. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో తొమ్మిదో నెంబర్ ఆటగాడిగా క్రీజులోకి వచ్చిన అర్జున్ టెండూల్కర్ మోహిత్ శర్మ బౌలింగ్‌లో భారీ సిక్స్ బాదాడు. మోహిత్ షార్ట్ బాల్ వేయగా.. అర్జున్ డీప్‌స్వ్కేర్ దిశగా సిక్సర్ కొట్టడం హైలెట్‌గా నిలిచింది. కాగా అర్జున్‌కు ఇదే తొలి సిక్సర్ కాగా.. తొలి ఐపీఎల్ సీజన్ కూడా. బౌలర్‌గా మంచి ప్రదర్శన కనబరిచిన అర్జున్.. ఇప్పుడు బ్యాటింగ్‌లోనూ సిక్సర్‌తో అలరించడంతో సచిన్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అర్జున్ టెండూల్కర్‌కు బ్యాటింగ్‌లో ప్రమోషన్ ఇవ్వాలని.. అతనికి మంచి టాలెంట్ ఉందని.. ఐదు, ఆరు స్థానాల్లో బ్యాటింగ్‌కు పంపిస్తే ముంబైకి మంచి ప్రయోజనం ఉంటుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ముంబై ఇండియన్స్‌పై గుజరాత్ టైటాన్స్ 55 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 208 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 152 పరుగులు మాత్రమే చేసింది. నెహల్ వదేరా 21 బంతుల్లో 40 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. కామెరాన్ గ్రీన్ 33 పరుగులు, సూర్యకుమార్ 23 పరుగులు చేశాడు. గుజరాత్ బౌలర్లలో నూర్ అహ్మద్ మూడు వికెట్లు తీయగా.. రషీద్ ఖాన్, మోహిత్ శర్మలు చెరో రెండు వికెట్లు తీశారు. అంతకముందు గుజరాత్ నిర్ణీత 20 ఓవరల్లో ఆరు వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. గిల్ 56, మిల్లర్ 46, అభినవ్ మనోహర్ 46 పరుగులతో రాణించారు. Arjun aims BIG 🎯#GTvMI #IPLonJioCinema #TATAIPL #IPL2023 pic.twitter.com/cF4DZVviUm — JioCinema (@JioCinema) April 25, 2023 చదవండి: ముంబై , గుజరాత్ మ్యాచ్.. ట్రెండింగ్‌లో సారా టెండూల్కర్! -
కొట్టిన బంతిని చూసిన పాపాన పోలేదు.!
టీమిండియా మాజీ ఆటగాడు ఎంఎస్ ధోని ప్రస్తుతం ఐపీఎల్ 2023కి సమాయత్తమవుతున్నాడు. సీఎస్కేను ఇప్పటికే నాలుగుసార్లు ఛాంపియన్‌గా నిలిపిన ధోని.. తనకిది చివరి ఐపీఎల్ అని భావిస్తున్న తరుణంలో సీఎస్కే టైటిల్ అందించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇప్పటికే చెన్నైకి చేరుకున్న ధోని తన ప్రాక్టీస్‌పై దృష్టి సారించాడు. జట్టులో ఉన్న ఆటగాళ్ల కంటే ముందే వచ్చిన ధోని క్రమం తప్పకుండా మైదానంలో ప్రాక్టీస్ చేస్తూ ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపిస్తున్నాడు. గత మూడు సీజన్లుగా బ్యాటర్‌గా విఫలమవుతున్న ధోని చివరి సీజన్ అని భావిస్తున్న తరుణంలో ధోని బ్యాట్‌తో మెరవాలని ప్రతీ అభిమాని ఆకాంక్షిస్తున్నాడు. మార్చి 31న మొదలుకానున్న ఐపీఎల్ 16వ సీజన్లో తొలి మ్యాచ్ సీఎస్కే , డిఫెండింగ్ ఛాంపియన్స్ గుజరాత్ టైటాన్స్ మధ్య జరగనుంది. ధోని సిక్స్ కొడితే గ్రౌండ్ అవతల పడడం ఖాయం. ఇప్పటికే ప్రాక్టీస్‌లో భారీ షాట్లతో విరుచుకుపడిన ధోని తాజాగా సిక్స్ కొట్టిన తర్వాత కనీసం బంతిని చూసిన పాపాన పోలేదు. అతను తాను కొట్టిన సిక్సర్‌పై ఎంత నమ్మకంగా ఉన్నాడనేది దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు. మార్చి 14న(మంగళవారం) చెన్నై స్టేడియంలో సాయంత్రం ప్రాక్టీస్ చేసిన ధోని బంతి పడిందే ఆలస్యం.. బ్యాట్ ఎడ్జ్‌ను ఆనించి భారీ షాట్ ఆడాడు. అయితే బంతి పైకి వెళ్లిన తరుణంలో అతని కళ్లు మాత్రం కిందనే ఉన్నాయి. ఆ తర్వాత కాసేపటికి పైకి చూశాడు. అప్పటికే బంతి గ్రౌండ్ బయట పడింది. దీనికి సంబంధించిన వీడియోను సీఎస్కే తన ట్విటర్లో షేర్ చేయగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక గతేడాది ఐపీఎల్లో సీఎస్కే అంతగా ఆకట్టుకోలేకోపోయింది. ఆడిన 14 మ్యాచ్‌ల్లో నాలుగు మాత్రమే గెలిచిన సీఎస్కే పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. అయితే సీజన్ మొదట్లో జడేజా జట్టును నడిపించాడు. అయితే కెప్టెన్సీ ఒత్తిడిని భరించలేని జడ్డూ.. పదవి నుంచి తప్పుకున్నాడు. దీంతో సీఎస్కే మరోసారి ధోనికే బాధ్యతలు అప్పగించింది. అయితే అప్పటికే జట్టుకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈసారి కొత్తగా ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ జట్టులోకి రావడంతో సీఎస్కే బలంగా కనిపిస్తుంది. అయితే ఈసారి ధోని స్థానంలో బెన్ స్టోక్స్ జట్టును నడిపించనున్నాడని వార్తలు వస్తున్నాయి. “Nonchalant!” 🚁💥#WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/glafNLF1gk — Chennai Super Kings (@ChennaiIPL) March 14, 2023 చదవండి: వైరల్‌గా మారిన రిషబ్ పంత్ చర్య వరుస ఓటములు బాధిస్తున్నా.. ఆకట్టుకున్న ఆసీస్ క్రికెటర్ -
ధోని సిక్సర్ల వర్షం.. వీడియో వైరల్
మార్చి 31న ఐపీఎల్ 2023 సీజన్‌కు తెరలేవనుంది. మరో 27 రోజులు మాత్రమే మిగిలిఉన్న నేపథ్యంలో ఐపీఎల్లో పాల్గొనే ఆయా ఫ్రాంచైజీల ఆటగాళ్లు తమ ప్రాక్టీస్‌ను ముమ్మరం చేశారు. సీఎస్కేను నాలుగుసార్లు ఛాంపియన్‌గా నిలిపిన ఎంఎస్ ధోని కూడా తన ప్రాక్టీస్‌లో వేగం పెంచాడు. ఇప్పటికే ఐపీఎల్ ఆడేందుకు చెన్నై చేరుకున్న ధోని ప్రాక్టీస్‌లో భాగంగా సిక్సర్ల వర్షం కురిపించాడు. 'తలా'(ధోని) వచ్చాడని తెలియగానే చేపాక్ స్టేడియం పరిసరిరాలు అభిమానులతో నిండిపోయాయి. తమ ఫెవరెట్ ఆటగాడి ప్రాక్టీస్‌ను కళ్లారా చూడాలని వచ్చిన ఫ్యాన్స్‌ను ధోని ఖుషీ చేశాడు. నెట్స్‌లో తీవ్రంగా చెమటోడ్చిన ధోని సిక్సర్ల వర్షం కురిపించాడు. దీనికి సంబంధించిన వీడియోనూ ధోని అభిమాని ఒకరు సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అయింది. ఇక 2023 ఐపీఎల్ ధోని కెరీర్లో చివరిది కానుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఈసారి ధోని కెప్టెన్సీ బాధ్యతలు తీసుకుంటాడా లేక జట్టులోకి కొత్తగా వచ్చిన ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌కు సారధ్య బాధ్యతలు అప్పగిస్తారా అనేది వేచి చూడాలి. గతేడాది సీజన్లో సీఎస్కే అంతగా ఆకట్టుకోలేదు. 14 మ్యాచ్‌ల్లో 4 విజయాలు మాత్రమే నమోదు చేసిన సీఎస్కే పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. Dhoni smashing the ball 🏏💥@MSDhoni #MSDhoni @ChennaiIPL pic.twitter.com/C4qSIq2UJ3 — DHONI Era™ 🤩 (@TheDhoniEra) March 4, 2023 చదవండి: WPL 2023: క్రికెటర్‌పై వేటు.. ఆరంభంలోనే వివాదం -
ఉమేశ్ యాదవ్.. నీలో ఈ టాలెంట్ కూడా ఉందా..?
చట్టోగ్రామ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియా పైచేయి సాధించింది. 278/6 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్.. మరో 126 పరుగులు జోడించి 404 పరుగుల వద్ద ఆలౌటైంది. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన బంగ్లాదేశ్.. కుల్దీప్ యాదవ్ (4/26), మహ్మద్ సిరాజ్ (3/14), ఉమేశ్ యాదవ్ (1/33) ధాటికి 113 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ప్రస్తుతానికి బంగ్లాదేశ్.. భారత తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 291 పరుగులు వెనుకపడి ఉంది. మెహిది హసన్ (8), ఎబాదత్ హొస్సేన్ (7) క్రీజ్‌లో ఉన్నారు. pic.twitter.com/3B2z3bqfBA — Guess Karo (@KuchNahiUkhada) December 15, 2022 కాగా, పుజరా (90), శ్రేయస్ అయ్యర్ (86), అశ్విన్ (58)లు హాఫ్ సెంచరీలతో రాణించడంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ సాధించింది. పంత్ (46), కుల్దీప్ యాదవ్ (40) పర్వాలేదనిపించారు. ఆఖర్లో ఉమేశ్ యాదవ్ (15 నాటౌట్) సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. 393/9 స్కోర్ వద్ద అశ్విన్ ఔటయ్యాక బరిలోకి దిగిన ఉమేశ్.. మెహిది హసన్ బౌలింగ్‌లో 101 మీటర్ల రెండు భారీ సిక్సర్లు బాదాడు. pic.twitter.com/nv1fuGd4Wh — Guess Karo (@KuchNahiUkhada) December 15, 2022 దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరలవుతున్నాయి. ఇవి చూసిన అభిమానులు.. ఉమేశ్.. నీలో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా, 2019 అక్టోబర్‌లో కూడా ఉమేశ్ ఇదే తరహాలో బ్యాట్‌తో రెచ్చిపోయాడు. నాడు సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో అతను 10 బంతుల్లో 31 పరుగులు పిండుకున్నాడు. -
వికెట్ల ముందే ఆడాలని రూల్ లేదు.. అందుకే వెనకాల
సాధారణంగా క్రికెట్లో ఏ బ్యాటర్ అయినా సరే క్రీజులోకి వస్తే వికెట్ల ముందు నిలబడి స్ట్రైక్ తీసుకోవడం ఆనవాయితీ. అయితే వికెట్ల ముందు నిలబడే ఆడాలని ఎక్కడా రూల్ లేదు. వికెట్ల వెనకాల వెళ్లి కూడా బ్యాటింగ్ చేయొచ్చు. కానీ అలా చేస్తే బాగోదు గనుక ఎవరు ఆ పని చేయరు. అయితే తాజాగా మాత్రం ఇండియన్ క్లబ్ క్రికెట్లో మ్యాచ్‌లో ఒక బ్యాటర్ స్టంప్స్ వెనకాల నిలబడ్డాడు. బౌలర్ బంతి విడుదల చేయగానే వికెట్ల ముందుకొచ్చి ఎక్స్ట్రా కవర్స్ మీదుగా భారీ సిక్సర్ సందించాడు. అతను కొట్టిన సిక్సర్ హైలైట్ అనుకుంటే.. అతను బ్యాటింగ్ చేసిన తీరు ఇంకా హైలైట్‌గా నిలిచింది. అయితే ఇలా బ్యాటింగ్ చేయడంలో ఎలాంటి రూల్స్ లేవు కానీ.. ఒకవేళ ప్రత్యర్థి జట్టు తమ వికెట్ కీపర్‌ను ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నట్లు అంపైర్‌కు అప్పీల్ చేస్తే మాత్రం సదరు బ్యాటర్‌ను ఔట్‌గా పరిగణించే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ప్రత్యర్థి జట్టు ఎలాంటి అప్పీల్ చేయకపోవడంతో పరుగులు రావడంతో పాటు బ్యాటర్ హైలైట్‌గా మారాడు. pic.twitter.com/GQaM7T1Ogh — Out Of Context Cricket (@GemsOfCricket) November 4, 2022 2005లో అక్తర్ బౌలింగ్‌లో బ్రాడ్ హడిన్ ఇలాగే.. ఇక అంతర్జాతీయ క్రికెట్లో ఇలాంటి ఘటన ఇప్పటివరకు పెద్దగా చోటుచేసుకోలేదు. అయితే 2005-06లో పాకిస్తాన్ ఆస్ట్రేలియాలో పర్యటించింది. ఆస్ట్రేలియా-ఏతో పాక్ అడిలైడ్ వేదికగా ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది. ఫ్రీ హిట్‌ను అప్పుడప్పుడే అమల్లోకి తెచ్చారు. ఆ మ్యాచ్‌లో తొలి ఓవర్ పాక్ తరపున రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ వేయగా.. ఆస్ట్రేలియా-ఏ ఇన్నింగ్స్‌ను బ్రాడ్ హడిన్, జేమ్స్ హోప్స్‌లు ప్రారంభించారు. అయితే అక్తర్ నోబాల్ వేయడంతో అంపైర్ ఫ్రీహిట్ ఇచ్చాడు. ఫ్రీహిట్ అంటే కేవలం రనౌట్ తప్ప ఎలా ఔట్ అయినా పరిగణించరు. ఈ రూల్‌ను అడ్వాంటేజ్ తీసుకున్న బ్రాడ్ హడిన్.. అక్తర్ 155 కిమీ వేగంతో వేసిన డెలివరీ ఆడేందుకు వికెట్ల వెనకాలకు వెళ్లి బ్యాటింగ్ చేశాడు. మిడ్ వికెట్ మీదుగా షాట్ ఆడి రెండు పరుగులు సాధించాడు. అయితే అక్తర్ మరోసారి నోబాల్ వేయడంతో ఫ్రీహిట్ అలాగే ఉండిపోయింది. దీంతో తర్వాత బంతిని అక్తర్ స్ట్రెయిట్ స్లో డెలివరీ వేశాడు. ఈసారి కూడా హడిన్ వికెట్ల వెనకాల వెళ్లి బ్యాటింగ్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ బంతి బ్యాట్‌ను తాకడంలో విఫలం కావడంతో వికెట్లను గిరాటేసింది. అయితే ఫ్రీహిట్ అమల్లో ఉండడంతో హడిన్ ఔట్ కాకపోవడంతో బై రూపంలో మరో రన్ వచ్చింది. అప్పట్లో హడిన్ చర్య సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయింది. చదవండి: Aus Vs Afg: అఫ్గన్‌తో కీలక మ్యాచ్.. ఆసీస్ స్కోరు ఎంతంటే మహ్మద్ నవాజ్ రనౌటా లేక ఎల్బీనా? -
'అందుకే అనేది బట్లర్ మామూలోడూ కాదని'
ఇంగ్లండ్ వన్డే వైస్ కెప్టెన్ జాస్ బట్లర్ తన కెరీర్లోనే అత్యున్నత ఫామ్‌ను కనబరుస్తున్నాడు. బంతి దొరికిందే ఆలస్యం అన్నట్లుగా బట్లర్ బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపిస్తున్నాడు. డెడ్ బాల్, వైడ్ బాల్, నో బాల్ అనే లెక్క లేకుండా భీకరమైన ఇన్నింగ్స్‌లు ఆడుతూ ప్రత్యర్థి బౌలర్ల గుండెల్లో దడ పుట్టిస్తున్నాడు. మొన్నటివరకు ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ తరపున వరుస సెంచరీలతో హోరెత్తించి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్న బట్లర్ అదే టెంపోనూ కొనసాగిస్తున్నాడు. నెదర్లాండ్స్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ఇంగ్లండ్ 498 పరుగులు అత్యధిక వన్డే స్కోరును అందుకోవడంలో బట్లర్ పాత్ర కీలకం. 162 పరుగుల సునామీ ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డాడు. తాజాగా మూడో వన్డేలో 86 పరుగుల నాకౌట్ ఇన్నింగ్స్‌తో మెరిసిన బట్లర్ జట్టుకు విజయాన్ని అందించి 3-0తో నెదర్లాండ్స్ క్లీన్‌స్వీప్ అయ్యేలా చేశాడు. 64 బంతుల్లో ఏడు ఫోర్లు, ఐదు సిక్సర్లతో 86 పరుగులు సాధించాడు. కాగా బుధవారం జరిగిన ఈ వన్డే మ్యాచ్‌లో బట్లర్ కొట్టిన ఒక సిక్స్ హైలైట్‌గా నిలిచింది. మాములుగానే అతను కొట్టే సిక్సర్లు హైలైట్ అవుతాయి.. కానీ ఇది అంతకుమించి అనే చెప్పొచ్చు. ఇన్నింగ్స్ 29వ ఓవర్ నెదర్లాండ్స్ బౌలర్ పాల్ వాన్ మీక్రిన్ వేశాడు. అప్పటికే బట్లర్ 65 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఓవర్ ఐదో బంతిని పాల్ వాన్ షార్ట్ పిచ్ వేసే ప్రయత్నంలో విఫలమయ్యాడు. బంతి స్లో అయ్యి క్రీజు పక్కకు పోయింది. బంతిని వదిలేద్దామన్న దయ, జాలీ ఏ కోశానా బట్లర్‌లో కనబడలేదు. ఎందుకు వదలడం అనుకున్నాడో కానీ.. రెండుసార్లు పిచ్‌పై పడిన బంతిని బట్లర్ క్రీజు నుంచి మొత్తం పక్కకు జరిగి భారీ సిక్సర్ కొట్టాడు. అంపైర్ డెడ్ బాల్‌గా పరిగణించడంతో పాటు నో బాల్ ఇచ్చి ఫ్రీ హిట్ సిగ్నల్ ఇచ్చాడు. ఆ తర్వాత ఫ్రీ హిట్‌ను కూడా బట్లర్ సిక్సర్‌గా మలవడం విశేషం. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. నెదర్లాండ్స్ విధించిన 245 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ 30.1 ఓవర్లలోనే రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. ఓపెనర్ జేసన్ రాయ్(86 బంతుల్లో 101 నాటౌట్, 15 ఫోర్లు) సెంచరీతో చెలరేగగా.. బట్లర్ 86 నాటౌట్ జట్టును విజయతీరాలకు చేర్చాడు. అంతకముందు నెదర్లాండ్స్ 49.2 ఓవర్లలో 244 పరుగులకు ఆలౌటైంది. సెంచరీతో మెరిసిన రాయ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు రాగా.. సిరీస్‌లో 248 పరుగులు చేసిన బట్లర్‌కే ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ దక్కింది. 🤣🤣🤣🤣🤣🤣 pic.twitter.com/SYVCmHr2iD — Sachin (@Sachin72342594) June 22, 2022 చదవండి: T20 Blast 2022: విజయానికి 9 పరుగులు.. కనివినీ ఎరుగని హైడ్రామా కొడుకు బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయిన క్రికెటర్.. వీడియో వైరల్ -
నరాలు తెగే ఉత్కంఠ.. అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు
మ్యాచ్ ఆధ్యంతం బ్యాట్స్‌మన్ సిక్సర్ల వర్షం కురిపించడం ఒక ఎత్తు.. కానీ టప్ గేమ్‌ను సిక్సర్లతో ముగించడం మరొక ఎత్తు. ఆ బాధ్యతను విండీస్ క్రికెటర్ ఆండ్రీ ఫ్లెచర్ సమర్థంగా నిర్వహించాడు. 3 బంతుల్లో 16 పరుగులు చేస్తే జట్టు గెలుస్తుంది. ప్రతీ బంతి సిక్సర్ వెళితే గానీ సదరు జట్టు గెలవదు. కానీ ఫ్లెచర్ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. కాగా ఫ్లెచర్‌కు ''స్పైస్మాన్'' అనే బిరుదు కూడా ఉంది. విషయంలోకి వెళితే.. విన్సీ ప్రీమియర్ లీగ్ 2022లో భాగంగా బొటానికల్ గార్డెన్స్ రేంజర్స్, ఫోర్ట్ చార్లెట్ స్ట్రైకర్స్ మధ్య టి10 మ్యాచ్ జరిగింది. నరాల తెగేంత ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో బొటానికల్ గార్డెన్స్ విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఫోర్ట్ చార్లెట్ స్ట్రైకర్స్ నిర్ణీత 10 ఓవర్లలో 107 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన బొటానికల్ గార్డెన్స్‌కు ఆఖరి ఓవర్లో విజయానికి 21 పరుగులు అవసరం అయ్యాయి. కొర్టోన్ లావియా ఆఖరి ఓవర్ వేయగా.. క్రీజులో ఫ్లెచర్ ఉన్నాడు. అప్పటికే 27 బంతుల్లో 39 పరుగులతో ఆడుతున్నాడు. మొదటి బంతికి ఎలాంటి పరుగు రాలేదు. రెండో బంతికి లెగ్‌బైస్, నో బాల్ రూపంలో బౌండరీతో పాటు ఒక రన్ అదనంగా వచ్చింది. మరుసటి రెండు బంతులు డాట్ బాల్స్. దీంతో చివరి మూడు బంతుల్లో 16 పరుగులు కావాలి. లావియా వేసిన ఫుల్‌టాస్‌ను స్వ్కేర్ లెగ్ దిశగా భారీ సిక్సర్ సంధించాడు. ఆ మరుసటి బంతిని మిడ్‌వికెట్ మీదుగా కళ్లు చెదిరే బౌండరీ బాదాడు. అంతే ఆఖరి బంతికి సిక్స్ కొడితే ఫ్లెచర్ జట్టు విజయాన్ని అందుకుంటుంది. అలా చివరి బంతి వేయగానే ఫ్లెచర్ స్ట్రెయిట్ సిక్స్‌ను సంధించాడు. ఫ్లెచర్ 34 బంతుల్లో మెరుపు అర్థశతకంతో పాటు జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. ఆ తర్వాత ఫ్లెచర్‌పై సహచరులు అభినందనల వర్షం కురిపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: Neymar: 'తాగి వచ్చి జట్టును సర్వనాశనం చేస్తున్నాడు'.. స్టార్ ఫుట్‌బాలర్‌పై ఆరోపణలు PAK vs AUS: స్టీవ్ స్మిత్ అరుదైన ఫీట్.. టెస్టు చరిత్రలో ఎవరికీ సాధ్యం కాలేదు! 16 needed off 3 balls and @AndreFletch delivers! 🔥 📺 Watch the captivating innings on #FanCode 👉 https://t.co/Fg9i08WZLv pic.twitter.com/jn3AmZCQPR — FanCode (@FanCode) March 24, 2022 -
మిచెల్ సాంట్నర్ సూపర్ సిక్స్.. అద్దాలు పగిలిపోయాయి
Mitchell Santner Smashes Museum Window Hitting Big Six.. న్యూజిలాండ్‌లో క్రికెట్ మైదానాలు ఎంత చిన్నగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బ్యాట్స్‌మన్ భారీ సిక్స్‌లు కొడితే బంతులన్నీ స్డేడియం బయటే ఉంటాయి. ఇక న్యూజిలాండ్ బ్యాటర్ మిచెల్ సాంట్నర్ సూపర్ సిక్స్ దెబ్బకు స్టేడియంలోని మ్యూజియం అద్దాలు పగిలిపోయాయి. సూపర్ స్మాష్ లీగ్‌లో భాగంగా బేసిన్ రిజర్వ్ పార్క్‌లో వెల్లింగ్టన్, నార్త్రన్ నైట్స్ మధ్య మ్యాచ్ జరిగింది. చదవండి: క్వార్టర్ ఫైనల్స్కే ఇంత రచ్చ.. మరి కప్ గెలిస్తే! మ్యాచ్‌లో సాంట్నర్ 35 బంతుల్లో ఆరు సిక్సర్లు.. నాలుగు ఫోర్లతో 59 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. కాగా సాంట్నర్ కొట్టిన ఒక సిక్స్ స్డేడియంలోని మ్యూజియం అద్దాలను పగలగొట్టింది. అద్దాలు పగలగొట్టి లోపలికి వెళ్లిన బంతిని అంపైర్లు బయటికి తీయలేకపోయారు.. కారణం మ్యూజియానికి తాళం ఉండడమేనట. దీంతో కొత్త బంతి తీసుకొని ఆటను కొనసాంచారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్‌లో నార్త్రన్ నైట్స్ 2 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన వెల్లింగ్టన్ 19.4 ఓవర్లలో 167 పరుగులకు ఆలౌటైంది. ఫిన్ అలెన్ 64, కెప్టెన్ బ్రేస్‌వెల్ 63 పరుగులతో రాణించారు. అనంతరం బ్యాటింగ్ చేసిన నార్త్రన్ నైట్స్ 19.3 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. చదవండి: రాహుల్, పంత్‌కు ప్రమోషన్.. రహానే, పుజారాలకు డిమోషన్! "The ball is stuck in there, next time they go to open it they will find a white Kookaburra in there" 😂 Mitch Santner finds a window in the Museum Stand.#SparkSport #SuperSmashNZ@cricketwgtninc @SuperSmashNZ pic.twitter.com/9e8j5XMdcB — Spark Sport (@sparknzsport) January 24, 2022 -
ధోని సిక్సర్ల వర్షం.. ఇంత కసి దాగుందా
దుబాయ్: ఐపీఎల్ 14వ సీజన్ రెండో అంచె పోటీలకు సిద్ధమవుతున్న ఎంఎస్ ధోని ప్రాక్టీస్‌లో సిక్సర్ల వర్షం కురిపించాడు. యూఏఈ వేదికగా జరగునున్న రెండో దశ పోటీలకు అందరికంటే ముందు సీఎస్కే చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ధోని ప్రాక్టీస్ సమయంలో కసిగా కనిపించాడు. బంతి పడడమే ఆలస్యం.. భారీ సిక్సర్లు సంధించాడు.దీనికి సంబంధించిన వీడియోనూ ఒక అభిమాని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. ధోనీ ఆవాజ్... అంటూ క్యాప్షన్ జత చేశాడు. ఇక ఈ సీజన్ మొదటి ఫేజ్‌లో ధోనికి బ్యాటింగ్ చేసే అవకాశం ఎక్కువగా రాలేదు. అందుకే రెండో అంచె పోటీల్లో అవకాశమొస్తే తన బ్యాటింగ్ పవర్ చూపించడానికి సిద్ధమవుతున్నాడు. కాగా ఐపీఎల్ 2020లో నిరాశజనక ప్రదర్శన కనబరిచిన సీఎస్కే జట్టు ఈసారి మాత్రం దుమ్మురేపింది. ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో 5 విజయాలు.. రెండు పరాజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. సెప్టెంబర్ 19న ముంబై ఇండియన్స్, సీఎస్కే మధ్య జరగనున్న మ్యాచ్‌తో రెండో అంచె పోటీలకు తెరలేవనుందిఘౌ చదవండి: ఐర్లాండ్ ఆటగాడి సిక్సర్ల వర్షం.. సదరన్ బ్రేవ్దే టైటిల్ Mohammed Siraj: సిరాజ్ సెలబ్రేషన్స్ వైరల్; హైదరాబాద్‌లో భారీ కటౌట్ View this post on Instagram A post shared by MS Dhoni / Mahi 7781💛🇮🇳 (@d7f.reels) -
వైరల్: ధోని సిక్సర్ల వర్షం..
చెన్నై: ఎంఎస్ ధోని సిక్సర్ల వర్షం కురిపించాడు. అదేంటి ధోని ఎక్కడ మ్యాచ్‌లు ఆడడం లేదు కదా.. మరి ఈ సిక్సర్లేంటి అనుకుంటున్నారా. అసలు విషయంలోకి వెళితే.. ఐపీఎల్ 14వ సీజన్‌కు సంబంధించి చెన్నై సూపర్ కింగ్స్ అన్ని ఫ్రాంచైజీలకన్నా ముందే సన్నాహకాలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ధోని ప్రాక్టీస్ సమయంలో వరుస బంతుల్లో సిక్సర్ల వర్షం కురిపించాడు. దాదాపు గంట సేపు ప్రాక్టీస్ కొనసాగించిన ధోని ప్రాక్టీస్ ఆరంభంలో డిఫెన్స్‌కు ప్రాధాన్యమిచ్చినా.. ఆ తర్వాత సిక్సర్లు బాదుతూ బంతులను స్టాండ్స్‌లోకి పంపించాడు. ధోని ఆడిన షాట్లలో తన ఫేవరెట్ అయిన హెలికాప్టర్ షాట్‌ను ఎక్కువసార్లు ఆడినట్లుగా తెలుస్తోంది. ధోని ఒక్కో షాట్ కొడుతుంటే ఈసారి అతను ఎంత కసిగా ఉన్నాడో అర్థమవుతుంది. దీనికి సంబంధించిన వీడియోను సీఎస్కే ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా గతేడాది ఐపీఎల్ 13వ సీజన్ యూఏఈ వేదికగా జరిగిన సంగతి తెలిసిందే. ఆ సీజన్లో ధోని కెప్టెన్సీలోని సీఎస్కే ఆరంభంలో వరుస పరాజయాలు చవిచూసి ఆఖరిదశలో వరుస విజయాలు నమోదు చేసినా అప్పటికే జరగాల్సిన నష్టం జరగపోయింది. మొత్తం 14 మ్యాచ్‌ల్లో 6 విజయాలు.. 8 ఓటములతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది. అయితే ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ భారత్‌లో జరగడం సానుకూలాంశం. కాగా ఐపీఎల్ 14వ సీజన్ ఏప్రిల్ 9న ప్రారంభమై.. మే30న ముగియనుంది. చెన్నై, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, అహ్మదాబాద్, ఢిల్లీలో మ్యాచ్‌లు జరుగనున్నాయి. చదవండి: తలైవా.. వెల్కమ్ టూ చెన్నై వారిద్దరితోనే ఓపెనింగ్: కోహ్లి View this post on Instagram A post shared by Chennai Super Kings (@chennaiipl) -
మ్యాక్సీ సిక్సర్ దెబ్బకు విరిగిన కుర్చీ వేళానికి..
వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో ఆసీస్ స్టార్ ఆటగాడు గ్లెన్ మాక్స్వెల్ ప్రత్యర్థి బౌలర్లపై శివాలెత్తాడు. 31 బంతుల్లో 8 ఫోర్లు, 5 భారీ సిక్సర్ల సాయంతో 70 పరుగులు సాధించాడు. కివీస్ బౌలర్ నీషమ్ వేసిన 17వ ఓవర్లో మ్యాక్సీ పరుగుల వరద పారించాడు. ఆ ఓవర్లో వరుసగా 4 6 4 4 4 6 బాది 28 రన్స్‌ను పిండుకున్నాడు. ఈ క్రమంలో మ్యాక్సీ సిక్సర్ల ధాటికి స్టాండ్స్‌లో ఉన్న ఓ సీటు తునాతునకలైంది. సౌథీ వేసిన 18వ ఓవర్లోని నాలుగో బంతి జెట్ వేగంతో స్టాండ్స్‌లోకి దూసుకెళ్లి అక్కడున్న ఓ సీటును బలంగా తాకింది. బంతి వేగానికి ఆ సీటుకు పెద్ద రంధ్రమే పడింది. స్టాండ్స్‌లో ప్రేక్షకులు లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పినట్లయ్యింది. మ్యాక్సీ ధాటికి తునాతునకలైన ఆ సీటును ఓ స్వచ్ఛంద సంస్థ కోసం వేలానికి ఉంచనున్నట్లు తెలుస్తోంది. మ్యాచ్ అనంతరం మాక్సీ ఆ సీటుపై సంతకం కూడా చేశాడు. కాగా, ఈ మ్యాచ్‌లో మ్యాక్సీ ధాటికి ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది. భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కివీస్ 17.1 ఓవర్లలో 144 పరుగులకే ఆలౌటై 64 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. 5 టీ20ల ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు గెలిచిన కివీస్ మూడో టీ20ని కోల్పోవడంతో ఆధిక్యాన్ని 2-1కి తగ్గించుకుంది. 💥 70 runs from 31 balls 💥 Eight fours and five sixes An action-packed knock from Glenn Maxwell 🔥#NZvAUS | https://t.co/SauGpoGf1Fpic.twitter.com/yGseEwdnHd — ICC (@ICC) March 3, 2021 -
మూడేళ్లలో 217 సిక్సర్లు.. అందుకే అలా అనేది!
దూకుడులో వీరేంద్ర సెహ్వాగ్ వారసత్వం.. భారీ ఇన్నింగ్స్‌లు ఆడటంలో యువ ఆటగాళ్లకు స్పూర్తి కలిగిస్తాడు.. సిక్సర్ల సునామీ సృష్టించడంలో అతడికి అతడే సాటి.. బ్యాట్స్‌మన్‌గా ముందుండి నడిపిస్తాడు.. అవకాశం వచ్చిన ప్రతీసారి సారథిగా వెనకుండి ప్రోత్సహిస్తాడు అతడే టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ. ఈ రోజు(ఏప్రిల్ 30)న 33వ జన్మదిన వేడుకులు జరుపుకుంటున్న రోహిత్‌కు సోషల్ మీడియా వేదికగా బర్త్‌డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. అంతేకాకుండా అతడి గురించి తెలుసుకోవాలని అనేకమంది నెటిజన్లు గూగుల్ బాట పట్టారు. ఈ క్రమంలో రోహిత్‌ను హిట్ మ్యాన్ అని ఎందుకు పిలుస్తారో తెలుసుకుంటున్నారు ఈ రికార్డులు చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే! ఇప్పటివరకు 364 అంతర్జాతీయ మ్యాచ్‌లు(అన్ని ఫార్మట్లు కలిపి) ఆడిన రోహిత్ 14,029 పరుగులు సాధించాడు. ఇందులో 39 సెంచరీలు ఉన్నాయి. ఓవరాల్‌గా 423 సిక్సర్లతో టాప్-3లో ఉన్నాడు. ఈ జాబితాలో తొలి రెండు స్థానాల్లో క్రిస్ గేల్(534), షాహిద్ ఆఫ్రిది(476)లు ఉన్నారు. ఇక గత మూడేళ్లలో రోహిత్ తిరుగులేని ఫామ్‌లో ఉన్న విషయం తెలిసిందే. ప్రపంచకప్‌లో వరుస సెంచరీలతో మెస్మరైజ్ చేసిన రోహిత్ గడిచిన ఈ మూడేళ్లలో అంతర్జాతీయ క్రికెట్లో ఏకంగా 217 సిక్సర్లు సాధించి ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. 2017లో 65, 2018లో 74, 2019లో 78 సిక్సర్లు సాధించాడు. ఇక టెస్టుల్లో ఓపెనర్‌గా అవతారమెత్తి దక్షిణాఫ్రికాపై శివతాండవం చేశాడు. విశాఖపట్నం వేదికగా జరిగిన టెస్టులో ఏకంగా 13 సిక్సర్లు సాధించడంతో ఓ టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు సాధించిన తొలి భారత ఓపెనర్‌గా రోహిత్ నిలిచాడు. అంతేకాకుండా ఆ టెస్టు సిరీస్‌లో అత్యధిక(20) సిక్సర్లు సాధించిన తొలి బ్యాట్స్‌మన్‌గా రోహిత్ మరో రికార్డును నెలకొల్పాడు. కేవలం టెస్టుల్లోనే కాదు వన్డే, టీ20 మ్యాచ్‌ల్లో కూడా అత్యధిక సిక్సర్లు సాధించిన ఆటగాడిగా మరెన్నో రికార్డులు రోహిత్ పేరిటే ఉన్నాయి. అందుకే అతడిని సెహ్వాగ్ స్క్వేర్, సిక్సర్ల కింగ్, హిట్‌మ్యాన్ అని అభిమానులు ముద్దుగా పిలుచుకుంటారు. 👕 364 international appearances 🏏 14,029 runs 🙌 39 centuries Happy birthday to Rohit Sharma, a master of the pull shot 👏 pic.twitter.com/ikHjVBApob — ICC (@ICC) April 30, 2020 రోహిత్ శర్మ పేరిట ఉన్న కొన్ని రికార్డులు.. ► ఇంగ్లండ్ గడ్డపై హ్యాట్రిక్ శతకాలు బాదిన ఏకైక బ్యాట్స్‌మన్. 2019 వన్డే వరల్డ్‌కప్‌లో రోహిత్ దీన్ని సాధించాడు. ► వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు రోహిత్(264)ది. ► వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక బ్యాట్స్‌మన్ ► ఒక వన్డే వరల్డ్‌కప్‌లో అత్యధిక సెంచరీలు(5) చేసిన ఆటగాడు రోహిత్ ► ఒక వన్డే వరల్డ్‌కప్‌లో ఛేజింగ్‌లో అత్యధిక శతకాలు(3) ఘనత కూడా రోహిత్‌దే. ► 2019లో 10 శతకాలు బాదాడు. అయితే ఓ క్యాలెండర్ ఏడాదిలో 7 జట్లపై శతకాలు బాదిన తొలి క్రికెటర్‌గా రికార్డు. ► అంతర్జాతీయ క్రికెట్లో ఓపెనర్‌గా అన్ని ఫార్మాట్లలో శతకాలు బాదిన ఏకైక భారత ఆటగాడు రోహిత్ శర్మ చదవండి: హిట్‌మ్యాన్‌కు స్పెషల్ డే..! ‘గాడ్ బ్లెస్ యూ హిట్‌మ్యాన్’ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_461239942.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
రోహిత్ శర్మ కొట్టేస్తాడా?
ఫ్లోరిడా: టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ మరో రికార్డు ముంగిట నిలిచాడు. అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక సిక్సర్ల రికార్డుకు నాలుగు అడుగుల దూరంలో ఉన్నాడు. మరో నాలుగు సిక్సర్లు బాదితే వెస్టిండీస్ విధ్వంసక బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ పేరిట ఉన్న రికార్డు రోహిత్ సొంతమవుతుంది. 105 సిక్సర్లతో గేల్ టాప్‌లో ఉన్నాడు. న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ 103 సిక్సర్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. థర్డ్ ప్లేస్‌లో ఉన్న రోహిత్ ఖాతాలో 102 సిక్సర్లు ఉన్నాయి. శనివారం వెస్టిండీస్‌తో టీమిండియా ఆడబోయే తొలి టి20ల్లో అత్యధిక సిక్సర్ల రికార్డును రోహిత్ సొంతం చేసుకోవాలని టీమిండియా అభిమానులు కోరుకుంటున్నారు. వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచిన రోహిత్ ఈ రికార్డును సాధిస్తాడని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. 94 మ్యాచ్‌ల్లో 86 ఇన్నింగ్స్ ఆడిన రోహిత్ 2,331 పరుగులు సాధించాడు. ఇందులో 4 సెంచరీలు, 16 అర్ధసెంచరీలు ఉన్నాయి. అయితే క్రిస్ గేల్ 58 మ్యాచ్‌ల్లోనే 105 సిక్సర్లు కొట్టడం విశేషం. -
సింగ్ సిక్సర్ల విధ్వంసానికి 11 ఏళ్లు!
హైదరాబాద్ : ఒకే ఓవర్లో ఆరు సిక్స్ లు... ఈ మాట వినగానే ముందు గుర్తొచ్చేది విధ్వంసకర బ్యాట్స్‌మన్ యువరాజ్ సింగ్. 2007 ప్రపంచకప్ సందర్భంగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్ వేస్తున్న వేళ, సిక్సర్ల మోత మోగించిన యువీ పెను సంచలనం సృష్టించాడు. సరిగ్గా 11 ఏళ్ల క్రితం ఇదే రోజు డర్భన్ వేదికగా యువీ బ్రాడ్ బౌలింగ్‌ను చీల్చిచెండాడాడు. ఈ విధ్వంసానికి యావత్ క్రికెట్ ప్రపంచం నివ్వెరపోయింది. అప్పటికే ప్రస్తుత టీమిండియా హెడ్‌కోచ్ రవిశాస్త్రి, హెర్ష్లీ గిబ్స్‌లు ఈ ఘనతను అందుకున్నా.. అంతగా ఆదరణ పొందలేదు. రవిశాస్త్రి దేశవాళి క్రికెట్లో ఈ ఘనత సాధించగా.. గిబ్స్ చిన్నదేశంపై అంతర్జాతీయ మ్యాచ్‌లోనే ఈ ఫీట్‌ను నెలకొల్పాడు. కానీ యువరాజ్ సింగ్ క్రికెట్ పుట్టిన దేశం ఇంగ్లండ్‌పైనే ఈ విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో యువీ కేవలం 16 బంతుల్లోనే 58 పరుగులు చేసి భారత విజయంలో కీలకపాత్ర పోషించాడు. -
ఒకే ఒక్క సిక్స్‌తో హీరో అయ్యాడు!
కొలంబొ: ఒకే ఒక్క మ్యాచ్‌తో టీమిండియా క్రికెటర్ దినేష్ కార్తీక్(డీకే) హీరో అయిపోయాడు. చివరి బంతికి అద్భుతం చేసి అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో తనకంటూ ఒక పేజీని లిఖించుచుకున్నాడు. బంగ్లాదేశ్‌తో ఆదివారం ఉత్కంఠభరింతగా జరిగిన నిదహస్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో అతడు బాదిన సిక్సర్ డీకే క్రీడా జీవితంలో పెద్ద మైలురాయిలా నిలిచింది. అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఆఖరి బంతికి విజయాన్ని అందించిన క్రికెటర్ల జాబితాలో అతడి పేరు చేరిపోయింది. గతంలో జావెద్ మియందాద్(పాకిస్థాన్), రియన్ మెక్లారెన్(దక్షిణాఫ్రికా), నాథన్ మెక్కల్లమ్(న్యూజిలాండ్), లాన్స్ క్లుసెనర్(దక్షిణాఫ్రికా), శివనారాయణ్ చంద్రపాల్(వెస్టిండీస్) అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఆఖరి బంతికి సిక్స్ కొట్టి విజయాన్ని అందించిన ఘనత సాధించారు. ఇప్పుడు వీరి సరసన దినేష్ కార్తీక్ కూడా చేరాడు. జట్టుకు అద్భుత విజయాన్ని అందించిన డీకేపై సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి. -
రబడకు కోహ్లి గుణపాఠం
సెంచూరియన్: ‘కసి’కి ఫ్యాంటు, షర్టు తొడిగితే అది అచ్చుగుద్దినట్టు విరాట్ కోహ్లిలా ఉంటుంది. మైదానంలో అగ్రెసివ్‌గా ఉండటమే కాదు ఆటతోనూ సత్తా చాటుతున్నాడు టీమిండియా కెప్టెన్. అతడిని రెచ్చగొడితే కొదమ సింహంలా విరుచుకుపడతాడు. దీనికి తాజా రుజువు దక్షిణాఫ్రికాతో ఆదివారం జరిగిన రెండో వన్డేలో కనిపించింది. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి టీమిండియాను కట్టడి చేసేందుకు సఫారీ బౌలర్లు పదేపదే బౌన్సర్లు సంధించారు. ఓపెనర్ రోహిత్ శర్మను అవుట్ చేసిన దక్షిణాఫ్రికా బౌలర్ కాజిసొ రబడ.. కోహ్లిపైనా కూడా అదే తరహాలో పెవిలియన్‌కు పంపాలని తెగ ప్రయత్నించాడు. విరాట్ బాడీని టార్గెట్ చేసి బంతులు విసిరాడు. ఈ క్రమంలో ఓ బంతి నేరుగా కోహ్లికి తగిలింది. దీంతో ‘మిస్టర్ ఫైర్’ కాసేపు బాధతో విలవిల్లాడు. నొప్పి తగ్గిన తర్వాత మళ్లీ బ్యాట్ పట్టి అతడికి తగిన గుణపాఠం చెప్పాడు. రబడ మళ్లీ తన స్టైల్లో బంతి వేయగా కోహ్లి అంతకుముందు బాల్‌ను ఆడినట్టుగానే ఆడి సిక్సర్ బాదాడు. అంతే మైదానం ఒక్కసారిగా చప్పట్లతో మారుమ్రోగింది. అతడు కొట్టిన ఒకే ఒక సిక్సర్ రబడ బౌలింగ్‌లో బాదిందే కావడం విశేషం. రెండో వన్డేలో 9 వికెట్లతో దక్షిణాఫ్రికాను భారత్ చిత్తుగా ఓడించింది. -
ఓవర్లో ఆరు కొట్టిన సిక్సర్లు షోయబ్
-
షోయబ్ మాలిక్.. ఓవర్లో ఆరు సిక్సర్లు
ఫైసలాబాద్: రవిశాస్త్రి, యువరాజ్ సింగ్, హెర్ష్లీ గిబ్స్, రవీంద్ర జడేజాలు ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టిన వీరులు. ఇందులో యువరాజ్ సింగ్, గిబ్స్‌లు అంతర్జాతీయ మ్యాచ్‌లో ఈ ఘనత సాధిస్తే.. రవిశాస్త్రి, జడేజాలు దేశవాళీ మ్యాచ్‌ల్లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టారు. ఇదిలా ఉంచితే, ఇటీవల శ్రీలంకకు చెందిన టీనేజ్ క్రికెటర్ ఒకే ఓవర్లో(నోబాల్‌తో కలుపుకుని) ఏడు సిక్సర్ల కొట్టి ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. అండర్-15 మురళీ గుడ్నెస్ కప్ ఫైనల్లో భాగంగా ఎఫ్‌ఓజీ అకాడమీ తరఫున ఆడిన నవీందు పహసర ఏడు సిక్సర్లు సాధించాడు. తాజాగా పాకిస్తాన్ వెటరన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టిన క్లబ్లో చేరిపోయాడు. షాహిద్ ఆఫ్రిది ఫౌండేషన్(ఎస్ఏఎఫ్) చారిటీ మ్యాచ్‌లో భాగంగా ఫైసలాబాద్‌లో జరిగిన టీ 10 క్రికెట్లో ఎస్ఏఎఫ్ రెడ్స్ తరపున ఆడిన మాలిక్ ఈ ఫీట్ సాధించాడు. ఎస్ఏఎఫ్ గ్రీన్ బౌలర్ బాబర్ అజమ్ వేసిన ఏడో ఓవర్లో మాలిక్ సిక్సర్ల మోత మోగించాడు. దాంతో ఎస్ఏఎఫ్ రెడ్స్ పది ఓవర్లలో 201 పరుగులు చేసింది. అయితే ఆ లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో రెడ్స్ ఓటమి పాలైంది. ఆపై భారీ లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన గ్రీన్ జట్టు విజయం సాధించింది. బాబర్ అజమ్ 26 బంతుల్లోనే 11 సిక్సర్లు, 7 బౌండరీలతో సెంచరీ సాధించి ఎస్ఏఎఫ్ గ్రీన్‌కు విజయాన్ని అందించాడు. ఓవర్లో ఆరు కొట్టిన సిక్సర్లు షోయబ్ -
రోహిత్ శర్మ సరికొత్త రికార్డు
కాన్పూర్: భారత క్రికెట్ జట్టు వన్డే వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డే ఫార్మాట్ లో 150 సిక్సర్లను అత్యంత తక్కువ ఇన్నింగ్స్ ల్లో సాధించిన తొలి భారత క్రికెటర్ గా రోహిత్ రికార్డు నెలకొల్పాడు. 17 1 మ్యాచ్ ల్లో 165 ఇన్నింగ్స్ ల్లో రోహిత్ 150వ వన్డే సిక్సర్ ను సాధించాడు. ఇది భారత తరపున వేగవంతమైన మైలురాయి. న్యూజిలాండ్ తో ఇక్కడ ఆదివారం జరిగిన మూడో వన్డేలో రోహిత్ ఈ ఘనత సాధించాడు. ఆ మ్యాచ్ లో రెండు సిక్సర్లు సాధించిన రోహిత్ శర్మ.. 150 సిక్సర్ల క్లబ్ లో చేరిపోయాడు. ఓవరాల్ గా చూస్తే ఈ ఫీట్ ను తక్కువ ఇన్నింగ్స్ ల్లో సాధించిన రెండో క్రికెటర్ రోహిత్ శర్మ. ఇక్కడ పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది తొలి స్థానంలో ఉన్నాడు. 160 ఇన్నింగ్స్ ల్లోనే 150 సిక్సర్ల మార్కును చేరి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇక192 ఇన్నింగ్స్ ల్లో 150 సిక్సర్ల మార్కును చేరిన మహేంద్ర సింగ్ ధోని భారత తరపున రెండో స్థానంలో ఉన్నాడు.ఓవరాల్ గా ఈ ఫీట్ ను తక్కువ ఇన్నింగ్స్ ల్లో సాధించిన ఐదో క్రికెటర్ ధోని. ఇక్కడ ఏబీ డివిలియర్స్ మూడో స్థానంలో, క్రిస్ కెయిన్స్ నాల్గో స్థానంలో ఉన్నారు. వీరిలో ప్రస్తుతం క్రికెట్ ఆడుతున్న ధోని, ఏబీ డివిలియర్స్ లు రెండొందల వన్డే సిక్సర్లను దాటిన ఆటగాళ్లు. సిక్సర పిడుగు.. రోహిత్ శర్మ! -
ఒకే ఓవర్ లో ఆరు సిక్సర్లు
హెడింగ్లీ:ఒకే ఓవర్ లో ఆరు బంతుల్ని సిక్సర్లుగా మలిచి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు ఇంగ్లాండ్ క్రికెటర్ రాస్ వైట్లే. నాట్‌వెస్ట్ టీ 20 లీగ్ లో భాగంగా ఆదివారం యార్క్‌షైర్‌తో జరిగిన మ్యాచ్ లో వోర్స్స్టెర్ షైర్ ఆటగాడు ఆరు బంతుల్ని బౌండరీ దాటించి కొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన యార్క్‌షైర్ జట్టు ఆరు వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన వోర్స్స్టైర్ షైర్ కు ఆశించిన ఆరంభం దక్కలేదు. మరొకవైపు మిగిలి ఉన్న బంతులికి పరుగులికి మధ్య అంతరం భారీగా పెరిగుతూ వచ్చింది. అదే సమయంలో యార్క్‌షైర్ స్పిన్నర్ కార్ల్ కార్వెర్ వేసిన ఇన్నింగ్స్ 16 ఓవర్లో రాస్ వైట్లే ఆరు సిక్సర్లు కొట్టి సత్తాచాటాడు. బంతి వేయడమే తడువు అన్నట్లుగా చెలరేగి ఆడాడు. ఆ ఓవర్ లో ఒక వైడ్ కూడా పడటంతో 37 పరుగుల్ని సమర్పించుకున్నాడు కార్వెర్. అయితే 25 బంతుల్లో ఎనిమిది సిక్సర్లు, 2 ఫోర్లుతో 65 పరుగులు చేసిన వైట్లే ఐదో వికెట్ గా అవుటయ్యాడు. దాంతో వోర్స్స్టెర్ కు ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్ లో యార్క్‌షైర్ 37 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఓవరాల్ గా చూస్తే ఆరు బంతుల్ని ఆరు సిక్సర్లుగా మలిచిన ఆరో క్రికెటర్ గా వైట్లే ఘనత సాధించాడు. అంతకుముందు గ్యారీ సోబర్స్(వెస్టిండీస్), రవిశాస్త్రి( భారత్), గిబ్స్(దక్షిణాఫ్రికా), యువరాజ్ సింగ్(భారత్), జోర్దాన్ క్లార్క్(ఇంగ్లండ్)లు ఒకే ఓవర్ లో ఆరు సిక్సర్లు కొట్టిన ఆటగాళ్లు. -
సిక్సర్లతో చెలరేగిన చిరంజీవి
ఎస్కేయూ : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోని స్టేడియంలో జరుగుతున్న టీ–20 మ్యాచ్‌లో ఎంపీఈడీ విభాగం సెమీ ఫైనల్‌కు అర్హత సాధించింది. ఉదయం జరిగిన మ్యాచ్‌లో ఎంపీఈడీ, ఫార్మసీ విభాగాల జట్ల మధ్య జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఎంపీఈడీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 230 పరుగులు సాధించింది. ఎంపీఈడీ జట్టు కెప్టెన్ చిరంజీవి 38 బంతుల్లో ( 12 సిక్సర్లు, 3 ఫోర్లు ) 108 పరుగులు చేయడంతో భారీ స్కోర్ లక్ష్యాన్ని సాధించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఫార్మసీ జట్టు 13.4 ఓవర్లలో 85 పరుగులకే ఆలౌట్ కావడంతో ఎంపీఈడీ జట్టు ఫైనల్‌కు చేరింది. సెంచరీ సాధించిన ఎం. చిరంజీవికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్ డాక్టర్ భాస్కర్ రెడ్డి అందించారు. మధ్యాహ్నం ఎంబీఏ, బీఈడీ కళాశాల జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌ను వర్సిటీ పాలకమండలి సభ్యులు ఆచార్య ఏ.మల్లిఖార్జునరెడ్డి ప్రారంభించారు. ఎంబీఏ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన బీఈడీ జట్టు లక్ష్యాన్ని సాధించలేక ఆలౌట్ అయ్యారు. కార్యక్రమంలో ఎంపీఈడీ విభాగం ఇన్చార్జ్ డాక్టర్ ఎంవీ శ్రీనివాసన్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ డాక్టర్ కిరణ్ చక్రవర్తి, శివ తదితరులు పాల్గొన్నారు. -
'టూత్ పిక్, ఫోర్క్‌తో కూడా సిక్సర్లు కొట్టగలను'
ఆంటిగ్వా: ఎవ్వరూ ఎన్ని విధాలా ప్రయత్నించినా తాను సిక్సర్లు కొట్టడాన్ని అడ్డుకోలేరని వెస్టిండీస్ స్టార్ ఓపెనర్ క్రిస్ గేల్ స్పష్టం చేశాడు. చివరకు టూత్‌పిక్, ఫోర్క్, చిన్నకత్తి తదితర వాటితో కూడా తనకు సిక్సర్ల కొట్టే సామర్థ్యం ఉందన్నాడు. ప్రస్తుతం మెరిల్బోర్న్ క్రికెట్ కమిటీ(ఎంసీసీ) బ్యాట్ సైజ్‌ను తగ్గించాలనే యోచనపై మాట్లాడిన గేల్ స్పందించాడు. తన వరకూ అయితే బ్యాట్ సైజ్‌తో అస్సలు ఇబ్బందేమీ లేదన్నాడు. వారు బ్యాట్ సైజ్ తగ్గించవచ్చు కానీ, తన సిక్సర్ల వర్షాన్ని కాదని గేల్ వ్యాఖ్యానించాడు. హిందూస్తాన్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో పలు విషయాలను గేల్ పంచుకున్నాడు. ప్రధానంగా విరాట్ కోహ్లిపై గేల్ ప్రశంసల వర్షం కురిపించాడు. వాంఖేడ్ స్టేడియంలో ఇంగ్లండ్‌తో జరిగిన నాల్గో టెస్టులో విరాట్ సాధించిన డబుల్ సెంచరీ అతని అసాధారణ ప్రతిభకు అద్దం పడుతుందన్నాడు. యువ క్రికెటర్లు విరాట్ కోహ్లి అడుగు జాడల్లో నడుస్తారనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు. ఇప్పటికే ఎన్నో ఘనతలను సొంతం చేసుకున్న విరాట్ మరిన్ని గొప్ప ఇన్నింగ్స్ లను నమోదు చేస్తాడన్నాడు. ప్రస్తుతానికి తాను ఒక సూపర్ మ్యాన్‌లా మీలాంటి వారు భావిస్తున్నారని, తన కంటే గొప్పగా విరాట్ ఆడుతున్నాడనే విషయాన్ని మరవద్దని గేల్ తెలిపాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరిగే బిగ్ బాష్ లీగ్(బీబీఎల్)కు దూరంగా ఎందుకు ఉంటున్నారని ప్రశ్నించగా, తన కూతురు బ్లష్ తొలి క్రిస్ట్మస్ వేడుకల్ని జరుపుకుంటున్న కారణంగా ఆ లీగ్ లో పాల్గొనడం లేదన్నాడు. గతంలో ఎప్పుడూ ఇంటి దగ్గర క్రిస్ట్మస్ను కానీ, కొత్త సంవత్పర వేడుకల్ని కానీ జరుపుకునే అవకాశం రాలేదన్నాడు. ప్రస్తుతం ఆ అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని గేల్ పేర్కొన్నాడు. -
200 సిక్సర్లు బాదేశాడు!
బెంగళూరు: 'సిక్సర' పిడుగు క్రిస్ గేల్ మరో ఘనత సాధించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో 200 సిక్సుల మైలురాయిని అందుకున్నాడు. ఐపీఎల్-8లో సోమవారం రాత్రి చినస్వామి స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరుగుతున్న మ్యాచ్ లో అతడీ రికార్డు అందుకున్నాడు. 70 మ్యాచ్ ఆడుతున్న ఈ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు తొలి ఓవర్ లోనే సిక్స్ కొట్టి అరుదైన ఘనత తన పేర లిఖించుకున్నాడు. ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్ కప్ లోనూ అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా గేల్ నిలిచాడు. ఈ మెగాటోర్నిలో మొత్తం 26 సిక్సర్లు బాదాడు. డివిలియర్(21), మెక్ కల్లమ్(17) తర్వాతి స్థానాల్లో నిలిచారు.