
ఫైసలాబాద్: రవిశాస్త్రి, యువరాజ్ సింగ్, హెర్ష్‌లీ గిబ్స్, రవీంద్ర జడేజాలు ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు కొట్టిన వీరులు. ఇందులో యువరాజ్ సింగ్, గిబ్స్‌లు అంతర్జాతీయ మ్యాచ్‌లో ఈ ఘనత సాధిస్తే.. రవిశాస్త్రి, జడేజాలు దేశవాళీ మ్యాచ్‌ల్లో ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు కొట్టారు. ఇదిలా ఉంచితే, ఇటీవల శ్రీలంకకు చెందిన టీనేజ్ క్రికెటర్ ఒకే ఓవర్‌లో(నోబాల్‌తో కలుపుకుని) ఏడు సిక్సర్ల కొట్టి ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. అండర్-15 మురళీ గుడ్‌నెస్ కప్ ఫైనల్లో భాగంగా ఎఫ్‌ఓజీ అకాడమీ తరఫున ఆడిన నవీందు పహసర ఏడు సిక్సర్లు సాధించాడు.
తాజాగా పాకిస్తాన్ వెటరన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు కొట్టిన క్లబ్‌లో చేరిపోయాడు. షాహిద్ ఆఫ్రిది ఫౌండేషన్(ఎస్‌ఏఎఫ్) చారిటీ మ్యాచ్‌లో భాగంగా ఫైసలాబాద్‌లో జరిగిన టీ 10 క్రికెట్‌లో ఎస్‌ఏఎఫ్ రెడ్స్ తరపున ఆడిన మాలిక్ ఈ ఫీట్ సాధించాడు. ఎస్‌ఏఎఫ్ గ్రీన్ బౌలర్ బాబర్ అజమ్ వేసిన ఏడో ఓవర్‌లో మాలిక్ సిక్సర్ల మోత మోగించాడు. దాంతో ఎస్‌ఏఎఫ్ రెడ్స్ పది ఓవర్లలో 201 పరుగులు చేసింది. అయితే ఆ లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో రెడ్స్ ఓటమి పాలైంది. ఆపై భారీ లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన గ్రీన్ జట్టు విజయం సాధించింది. బాబర్ అజమ్ 26 బంతుల్లోనే 11 సిక్సర్లు, 7 బౌండరీలతో సెంచరీ సాధించి ఎస్‌ఏఎఫ్ గ్రీన్‌కు విజయాన్ని అందించాడు.
ఓవర్‌లో ఆరు కొట్టిన సిక్సర్లు షోయబ్