'టూత్ పిక్, ఫోర్క్తో కూడా సిక్సర్లు కొట్టగలను' | Cricket’s ‘boss’ Chris Gayle says he can smash a 6 with toothpick, kitchen fork | Sakshi
Sakshi News home page

'టూత్ పిక్, ఫోర్క్తో కూడా సిక్సర్లు కొట్టగలను'

Published Mon, Dec 12 2016 3:22 PM | Last Updated on Mon, Sep 4 2017 10:33 PM

'టూత్ పిక్, ఫోర్క్తో కూడా సిక్సర్లు కొట్టగలను'

'టూత్ పిక్, ఫోర్క్తో కూడా సిక్సర్లు కొట్టగలను'

ఆంటిగ్వా: ఎవ్వరూ ఎన్ని విధాలా ప్రయత్నించినా తాను సిక్సర్లు కొట్టడాన్ని అడ్డుకోలేరని వెస్టిండీస్ స్టార్ ఓపెనర్ క్రిస్ గేల్ స్పష్టం చేశాడు. చివరకు టూత్పిక్, ఫోర్క్, చిన్నకత్తి తదితర వాటితో కూడా తనకు సిక్సర్ల కొట్టే సామర్థ్యం ఉందన్నాడు. ప్రస్తుతం మెరిల్బోర్న్ క్రికెట్ కమిటీ(ఎంసీసీ) బ్యాట్ సైజ్ను తగ్గించాలనే యోచనపై మాట్లాడిన గేల్ స్పందించాడు. తన వరకూ అయితే బ్యాట్ సైజ్తో అస్సలు ఇబ్బందేమీ లేదన్నాడు. వారు బ్యాట్ సైజ్ తగ్గించవచ్చు కానీ, తన సిక్సర్ల వర్షాన్ని కాదని గేల్ వ్యాఖ్యానించాడు.

హిందూస్తాన్ టైమ్స్కు ఇచ్చిన ఇంటర్య్వూలో పలు విషయాలను గేల్ పంచుకున్నాడు. ప్రధానంగా విరాట్ కోహ్లిపై గేల్ ప్రశంసల వర్షం కురిపించాడు. వాంఖేడ్ స్టేడియంలో ఇంగ్లండ్తో జరిగిన నాల్గో టెస్టులో విరాట్ సాధించిన డబుల్ సెంచరీ అతని అసాధారణ ప్రతిభకు అద్దం పడుతుందన్నాడు. యువ క్రికెటర్లు విరాట్ కోహ్లి అడుగు జాడల్లో నడుస్తారనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు. ఇప్పటికే ఎన్నో ఘనతలను సొంతం చేసుకున్న విరాట్  మరిన్ని గొప్ప ఇన్నింగ్స్ లను నమోదు చేస్తాడన్నాడు. ప్రస్తుతానికి తాను ఒక సూపర్ మ్యాన్లా మీలాంటి వారు భావిస్తున్నారని, తన కంటే గొప్పగా విరాట్ ఆడుతున్నాడనే విషయాన్ని మరవద్దని గేల్ తెలిపాడు.

ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరిగే బిగ్ బాష్ లీగ్(బీబీఎల్)కు దూరంగా ఎందుకు ఉంటున్నారని ప్రశ్నించగా, తన కూతురు బ్లష్ తొలి క్రిస్ట్మస్ వేడుకల్ని జరుపుకుంటున్న కారణంగా ఆ లీగ్ లో పాల్గొనడం లేదన్నాడు. గతంలో ఎప్పుడూ ఇంటి దగ్గర క్రిస్ట్మస్ను కానీ, కొత్త సంవత్పర వేడుకల్ని కానీ జరుపుకునే అవకాశం రాలేదన్నాడు. ప్రస్తుతం ఆ అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని గేల్ పేర్కొన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement