క్రిస్ గేల్(ఫైల్ ఫోటో)
వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ మరోసారి మెరుపులు మెరిపించేందుకు సిద్దమయ్యాడు. ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభ ఎడిషన్‌లో తెలంగాణ టైగర్స్ జట్టుకు క్రిస్ గేల్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని క్రిస్ గేల్ స్వయంగా వెల్లడించాడు. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 3 వరకు తొమ్మిది రోజుల పాటు డెహ్రడూన్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ టోర్నీ జరుగనుంది.
"నాపై నాకున్న నమ్మకం, అభిమానుల హర్ష ద్వనిలు నన్ను మళ్లీ బ్యాట్ పట్టేలా చేస్తున్నాయి. వెటరన్ ప్రీమియర్ లీగ్ ద్వారా మీ యూనివర్సల్ బాస్ మైదానంలోకి అడుగుపెడుతున్నాడు. దిగ్గజ ఆటగాళ్లలతో మళ్లీ ఆడే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. ఓల్డ్ ఈజ్ గోల్డ్.. ఐవీపీఎల్‌కు సిద్దమవ్వండి" అంటూ గేల్ ఓ ప్రకటనలో పేర్కొన్నాడు. గేల్‌తో పాటు భారత మాజీ క్రికెటర్లు సుదీప్ త్యాగీ, మన్‌ప్రీత్ గోనీ, వెస్టిండీస్ మాజీ క్రికెటర్ రికార్డో పోవెల్ తెలంగాణ టైగర్స్ తరఫున బరిలోకి దిగనున్నారు.
మొత్తం ఎన్ని జట్లు అంటే?
ఈ లీగ్‌లో మొత్తం ఆరు జట్లు భాగం కానున్నాయి. వీవీఐపీ ఉత్తర్ ప్రదేశ్, తెలంగాణ టైగర్స్, రాజస్థాన్ లెజెండ్స్, రెడ్ కార్పెట్ ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్ వారియర్స్, ముంబై ఛాంపియన్స్ జట్లు ఈ వెటరన్ లీగ్‌లో అమీతుమీ తెల్చుకోనున్నాయి.
ఈ టీ20 లీగ్‌ను డీడీ స్పోర్ట్స్‌తో పాటు యూరోస్పోర్టస్ ఛానెల్‌లో అభిమానులు వీక్షించవచ్చు. కాగా వీరేంద్ర సెహ్వాగ్, మునాఫ్ పటేల్, సురేశ్ రైనా, రజత్ భాటియా, ప్రవీణ్ కుమార్, యూసఫ్ పఠాన్, హెర్షల్ గిబ్స్ వంటి దిగ్గజ ఆటగాళ్లు కూడా ఈ టోర్నీలో భాగం కానున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment