Viral Video: క్రిస్‌ గేల్‌ ఏం చేశాడో చూడండి..! | Universal Boss Chris Gayle Paid Gas Bill Of Some Tress Passers At A Gas Station, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Viral Video Of Chris Gayle: క్రిస్‌ గేల్‌ ఏం చేశాడో చూడండి..!

Published Tue, Jan 16 2024 7:54 AM | Last Updated on Tue, Jan 16 2024 10:24 AM

Viral Video: Universal Boss Chris Gayle Paid Gas Bill Of Some Tress Passers At A Gas Station - Sakshi

విండీస్‌ క్రికెట్‌ యెధుడు, విధ్వంసకర బ్యాటర్‌ క్రిస్‌ గేల్‌ గతకొంతకాలంగా క్రికెట్‌కు దూరంగా ఉన్నా సోషల్‌మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉన్నాడు. యూనివర్సల్‌ బాస్‌ తరుచూ ఏదో ఒక పోస్ట్‌ చేస్తూ ఫ్యాన్స్‌ను అలరిస్తూ ఉంటాడు. తాజాగా గేల్‌కు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట హల్‌చల్‌ చేస్తుంది. 

ఓ గ్యాస్‌ ఫిల్లింగ్‌ స్టేషన్‌లో గేల్‌ వచ్చీపోయే వాహదారుల గ్యాస్‌ బిల్లులు కడుతూ, వారితో సెల్ఫీలు దిగుతూ, సరదాగా కనిపించాడు. అచ్చం గేల్‌లానే ఉన్న ఓ వ్యక్తి ఈ తంతు మొత్తాన్ని వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశాడు.

గేల్‌ లాంటి జాలీ స్పోర్ట్స్‌ పర్సన్‌తో సెల్ఫీ దిగడమే ఎక్కువనుకుంటే, గ్యాస్‌ బిల్లులు కూడా అదనంగా కలిసొచ్చాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కొందరేమో గేల్‌ మైకంలో ఉండి ఇలా చేస్తున్నట్లున్నాడని అంటున్నారు. ఏదిఏమైనా ఏదో ఒక సరదా పని చేసి సోషల్‌మీడియాకెక్కడం గేల్‌కు అలవాటే. అందుకే అతనికి విశ్వవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. 

44 ఏళ్ల గేల్‌ క్రికెట్‌లో ఎన్నో రికార్డులు తన పేరిట లిఖించుకుని రికార్డుల రారాజుగా కీర్తించబడుతున్నాడు. పొట్టి ఫార్మాట్‌లో గేల్‌ ఇప్పటికీ లీడింగ్‌ రన్‌ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. అలాగే సిక్సర్లకు సంబంధించిన పలు రికార్డులు కూడా గేల్‌ ఖాతాలో ఉన్నాయి. గేల్‌ ఐపీఎల్‌లో ఏకంగా 6 సెంచరీలు బాది ఎవరికీ సాధ్యంకాని ఘనతను సొంతం చేసుకున్నాడు.

ప్రపంచంలో జరిగే దాదాపు ప్రతీ లీగ్‌లోనూ గేల్‌ పాల్గొన్నాడు. గేల్‌కు పరిమిత ఓవర్ల ఫార్మాట్‌తో పాటు టెస్ట్‌ ఫార్మాట్‌లో కూడా ఘనమైన రికార్డే ఉంది. ఈ ఫార్మాట్‌లో అతను 103 టెస్ట్‌లు ఆడి రెండు ట్రిపుల్‌ సెంచరీలు సహా 15 సెంచరీలు, 37 హాఫ్‌ సెంచరీలు బాదాడు. గేల్‌ వన్డేల్లో 25, టీ20ల్లో 2 సెంచరీలు చేశాడు. గేల్‌కు క్రికెట్‌ చరిత్రలోనే అత్యంత జాలీ క్రికెటర్‌గా పేరుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement