నికోలస్‌ పూరన్‌ అరుదైన ఘనత.. గేల్‌ రికార్డు బ్రేక్‌ | Nicholas Pooran Surpasses Chris Gayle To Achieve This Feet | Sakshi
Sakshi News home page

T20 WC: నికోలస్‌ పూరన్‌ అరుదైన ఘనత.. గేల్‌ రికార్డు బ్రేక్‌

Published Thu, Jun 13 2024 2:00 PM | Last Updated on Thu, Jun 13 2024 2:46 PM

Nicholas Pooran Surpasses Chris Gayle To Achieve This Feet

వెస్టిండీస్‌ విధ్వంసకర ఆటగాడు నికోలస్ పూరన్ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో వెస్టిండీస్‌ తరపున అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా పూరన్‌ రికార్డులకెక్కాడు. టీ20 వరల్డ్‌కప్‌-2024లో భాగంగా ట్రినిడాడ్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 17 పరుగులు చేసిన పూరన్‌.. ఈ అరుదైన ఫీట్‌ను తన పేరిట లిఖించుకున్నాడు. 

పూరన్‌ ఇప్పటివరకు విండీస్‌ తరపున 91 టీ20లు ఆడి 1914 పరుగులు చేశాడు. పూరన్‌ కెరీర్‌లో 11 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. ఇంతకుముందు ఈ రికార్డు వెస్టిండీస్‌ దిగ్గజం, యూనివర్సల్‌ బాస్‌ క్రిస్‌ గేల్‌ పేరిట ఉండేది. విండీస్‌ తరపున 79 మ్యాచ్‌లు ఆడిన గేల్‌ 1899 పరుగులు చేశాడు. 

తాజా మ్యాచ్‌తో గేల్‌ అల్‌టైమ్‌ రికార్డును పూరన్‌ బ్రేక్‌ చేశాడు. ఇక ఈ మ్యాచ్‌ విషయానికి వస్తే.. న్యూజిలాండ్‌పై 13 పరుగుల తేడాతో విండీస్‌ విజయం సాధించింది.

దీంతో సూపర్‌-8కు కరేబియన్‌ జట్టు అర్హత సాధించింది. అదే విధంగా విండీస్‌ చేతిలో ఓటమి చవిచూసిన కివీస్‌.. తమ సూపర్‌-8 అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement