Telnagana
-
చిన్నారులను బావిలోకి తోసి తండ్రి ఆత్మహత్య
తాడ్వాయి: ‘డబ్బులు ఇవ్వకపోతే ఇద్దరు పిల్లలను లేకుండా చేసి నీకు మనశ్శాంతి లేకుండా చేస్తా.. ’ అని బెదిరించిన ఆ కసాయి అన్నంత పని చేశాడు. భార్య, అత్తింటి వారిపై కోపం పెంచుకుని కన్న బిడ్డలను బావిలో తోసేసి తనూ ఆత్మహత్య చేసుకున్నా డు. ఈ ఘటనతో మండలంలోని నందివాడలో వి షాదఛాయలు అలుముకున్నాయి. శనివారం దస రా సందర్భంగా గ్రామానికి చెందిన శ్రీనివాస్‌రెడ్డి(30) తన ఇద్దరు కొడుకులు వి ఘ్నేశ్(6), అనిరుధ్‌రెడ్డి(4)కి కొత్త డ్రెస్‌లు వేయించి తన బైక్‌పై శమీ పూజకు తీసుకెళ్లాడు. అతడి భార్య అపర్ణ ఇంటి వద్దే ఉన్నది. రాత్రయినా వారు తిరిగిరాకపోయేసరికి కుటుంబ సభ్యులు, గ్రా మస్తులు చుట్టుపక్కల వెతికారు. ఆదివారం ఉదయం గ్రామ శివారులోని ఓ వ్యవసాయ బావి వద్ద శ్రీనివాస్‌రెడ్డి ఫోన్, చెప్పులు కనిపించడంతో గ్రామస్తులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. బావిలో నుంచి ఇద్దరు చిన్నారుల మృతదేహాలను బయటికి తీయించారు. మోటార్లు వేసి నీటిని ఖాళీ చేయడంతో బావిలో శ్రీనివాస్ రెడ్డి మృతదేహం లభించింది. తండ్రీకొడుకుల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తన కొడుకులు, భర్త మృతదేహాన్ని చూసి అపర్ణ రోదన మిన్నంటింది. తన బిడ్డల మృతదేహాలను గుండెలకు హత్తుకుని ఆమె రోదించడం అక్కడి వారిని కంటతడిపెట్టించింది. శరన్నవరాత్రుల సందర్భంగా చిన్నారులు విఘ్నేశ్, అనిరుధ్‌రెడ్డి ప్రతి రోజూ అమ్మవా రి మండపానికి వచ్చి పూజల్లో పాల్గొన్నారని గ్రామస్తులు రోది స్తూ తెలిపారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా నాయ్‌గావ్‌కు చెందిన శ్రీనివాస్‌రెడ్డి పదేళ్ల క్రితం ఇల్ల రికం వచ్చాడు. మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ గ్రామానికి చేరుకొని బాధిత కుటుంబాన్ని ఓదార్చారు. -
డీఎస్పీగా బాధ్యతలు.. పోలీస్ యూనిఫాంలో సిరాజ్! ఫోటో వైరల్
తెలంగాణ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)గా టీమిండియా పేసర్ మహమ్మద్ సిరాజ్ నియమితులైన విషయం తెలిసిందే. టీ20 ప్రపంచకప్ విజయంతో పాటు భారత జట్టుకు అందించిన సేవలకుగానూ సిరాజ్‌కు రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్-1(డీఎస్పీ) ఉద్యోగంతో పాటు 600 చదరపు గజాల స్థలాన్ని కేటాయించింది. ఈ క్రమంలో తెలంగాణ డీజీపీ జితేందర్ తాజాగా సిరాజ్‌కు నియమాక పత్రాన్ని అందజేశారు. ఈ నేపథ్యంలో పోలీస్ యూనిఫాంలో ఉన్న మహ్మద్ సిరాజ్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాకుండా సిరాజ్..డీజీపీని కలిసిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి. దీంతో ఈ భారత స్టార్ బౌలర్‌కు నెటిజన్లు కంగ్రాట్స్ తెలుపున్నారు.Siraj is finally coming to arrest everyone who made his fake account. pic.twitter.com/zRCIWNc1A4— Silly Point (@FarziCricketer) October 12, 2024 ఇక బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ అనంతరం సిరాజ్ విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆక్టోబర్ 16 నుంచి న్యూజిలాండ్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌తో సిరాజ్ మియా మళ్లీ బీజీ కానున్నాడు. కివీస్‌తో సిరీస్‌కు ఎంపిక చేసిన 15 మంది సభ్యుల భారత జట్టులో సిరాజ్‌కు చోటు దక్కింది. ఈ సిరీస్‌లో సిరాజ్.. జస్ప్రీత్ బుమ్రా, ఆకాష్ దీప్తో వంటి పేసర్లతో కలిసి బంతిని పంచుకోనున్నాడు.న్యూజిలాండ్‌తో జరిగే మూడు టెస్టుల కోసం భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ (డబ్ల్యుకె), ధృవ్ జురెల్ (డబ్ల్యుకె), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్. సిరాజ్, ఆకాష్ దీప్ట్రావెలింగ్ రిజర్వ్స్: హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి, మయాంక్ యాదవ్ ప్రసిద్ధ్ కృష్ణ Congratulations Mohammad Siraj for the post of DSP in Telangana State#MohammadSiraj #MohammedSiraj #Telangana pic.twitter.com/kfKtmebEkG— Rahul (@Rahul64590994) October 12, 2024 -
కాంగ్రెస్ పార్టీలో రాజుకుంటున్న వర్గపోరు
జనగామ: డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి వర్సెస్ సీనియర్ నాయకుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గున మండుతోంది. కొమ్మూరి తనను హత్య చేయించేందుకు సుపారీ ఇచ్చాడని కంచె రాములు చేసిన ఫిర్యాదుతో జిల్లాలో పార్టీ అడ్డంగా చీలిపోయే పరిస్థితి నెలకొంది. అసెంబ్లీ ఎన్నికలు ముగిసే వరకు అంతా కలిసే ఉన్న నాయకత్వం.. లోక్‌సభ ఎన్నికలు వచ్చే సరికి రెండు వర్గాలుగా విడిపోయింది. ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో తన ఓటమికి కారణమయ్యారంటూ కొంతమంది నాయకులపై ప్రతాప్‌రెడ్డి బహిరంగంగానే విమర్శలు గుప్పించడంతో ఇరువురి మధ్య దూరం పెరిగింది. కొమ్మూరి నిర్లక్ష్యం, ఒంటెద్దు పోకడలతోనే ఓడిపోయారే తప్ప.. నాయకులు, కార్యకర్తల తప్పు లేదని మరోవర్గం అంటోంది. ఇద్దరి మధ్య రాజుకున్న వివాదం.. పార్టీ అధిష్టానం వద్దకు చేరింది. రోజుకో ఫిర్యాదుతో రెండు వర్గాల వారు గాంధీభవన్, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, క్రమశిక్షణ సంఘం ప్రతినిధులకు ఫిర్యాదు చేసుకుంటున్నారు. పార్టీ ఇచ్చిన ప్రతీ కార్యక్రమాన్ని వేర్వేరుగా నిర్వహిస్తూ గ్రూపులకు ఆజ్యం పోస్తున్నా రు. దీంతో దిగువ శ్రేణి నాయకత్వం దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది.రెండు వర్గాలుగా విడిపోయి..పార్టీ నాయకులు, శ్రేణులు జనగామ నుంచి కొమురవెల్లి వరకు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ ప్రతిపక్షాన్ని తలపించేలా వ్యవహరిస్తున్నాయి. డీసీసీ అధ్యక్షుడి ఫొటో లేని ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తూ.. చించి వేసుకునే స్థాయికి దిగజారి పోతున్నారు. ప్రతిపక్షంలో పదేళ్లు ఉండి పార్టీని కాపాడుకుంటే.. కొమ్మూరి బాధ్యతలు తీసుకున్న తర్వాత సీనియర్లను పక్కన పెడుతున్నారన్న పంచాయితీ తెలిసిందే. జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నియామకం కొమ్మూరి వర్సెస్ సీనియర్ల మధ్య మరింత దూరం పెంచగా, చినికి చినికి గాలివానలా మారింది. హత్య చేయించేందుకు డీసీసీ అధ్యక్షుడు సుపారీ ఆఫర్ చేశారంటూ ఆ పార్టీ నేత కంచె రాములు పోలీసులకు ఫిర్యా దు చేసుకునే వరకు వెళ్లింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కంచె రాములును హత్య చేయించేందుకు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి రాహుల శ్రీనివాస్‌రెడ్డి అనే వ్యక్తికి రూ.25లక్షలు ఆఫర్ చేసి కుట్ర పన్నారని డీసీపీకి ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ విషయాన్ని పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ చిన్నారెడ్డి దృష్టికి తీసుకువెళ్లినట్లు రాములు చెప్పగా.. తనపై అనవసరంగా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ డీసీసీ అధ్యక్షుడు కొట్టి పారేశారు. ‘అసలు శ్రీనివాస్‌రెడ్డి నా శత్రువు.. సోషల్ మీడియాలో నాకు వ్యతిరేఖంగా పోస్టులు పెడుతున్నాడు. అంభాడాలు వేస్తున్నాడు.. పోలీసులు సమగ్ర విచారణ చేపట్టాలని’ కొమ్మూరి కోరడం గమనార్హం.ఒకరిపై ఒకరు ఫిర్యాదులు..కొద్ది రోజులుగా డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డితోపాటు మరో వర్గానికి చెందిన సీని యర్ నాయకులు వేమెళ్ల సత్యనారాయణరెడ్డి, ఎర్రమల్ల సుధాకర్, కంచె రాములు వర్గీయులు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్, మంత్రులు, సీఎం వద్దకు వెళ్లి జనగామ నియోజకవర్గంలో తాజా రాజకీయ పరిస్థితులపై ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. జనగామ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి ఆశిస్తున్న కంచె రాములును కాదని డీసీసీ అధ్యక్షుడు మరో పేరును సూచించడంతో సీనియర్లు సీరియస్ అయ్యారు. అయినా కొమ్మూరి యువ నాయకు ల వైపే మొగ్గు చూపారు. ఈసారి బీసీ(ఏ) రిజర్వేషన్ ఉంది.. ఆ పదవి తనకే ఇవ్వాలని లోకుంట్ల ప్రవీణ్ పట్టు బడుతున్నాడు. అవసరమైతే కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమంటూ సవాల్ విసురుతుండంతో అధిష్టానం మార్కెట్ చైర్మన్ పదవి విషయాన్ని పెండింగ్‌లో ఉంచింది. ఏది ఏమైనా డీసీసీ అధ్యక్షుడు వర్సెస్ కంచె రాములు వర్గపోరు ఎటుదారి తీస్తుందో వేచిచూడాలి. -
ఓటుకు నోటు కేసు.. కేటీఆర్‌కు బండి సంజయ్ కౌంటర్
సాక్షి, హైదరాబాద్: కేంద్రమంత్రి బండి సంజయ్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు పొలిటికల్ కౌంటరిచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలోనే కదా ఓటుకు నోటు కేసు నమోదు చేసి విచారణ పూర్తి చేయలేకపోయింది. ఇది మీ ప్రభుత్వ వైఫల్యం కాదా? అని ప్రశ్నించారు.కాగా, బండి సంజయ్ ట్విట్టర్ వేదికగా..‘ఓటుకు నోటు కేసు నమోదు చేసి విచారణ పూర్తి చేయలేకపోయింది గత మీ ప్రభుత్వమే కేటీఆర్. 2015 నుంచి కేసును పూర్తి చేయడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైంది. ట్విట్టర్లో స్టార్ డం కోసం కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని లాగుతున్నారు. మీరు నిజంగా న్యాయం జరగాలని కోరుకుంటే ఓటుకు నోటు కేసును సీబీఐకి లేదా ఈడీకి బదిలీ చేసి ఉండాల్సింది. కేటీఆర్ వ్యవహారం రాహుల్ గాంధీ లేని లోటు భర్తీ చేస్తున్నట్లు ఉంది’ అంటూ ఎద్దేవా చేశారు. Welcome Home K T Rama Rao garu..Jet Lag & whatever you had seems to be taking toll on you..ACB registered the Cash for vote case, and your inefficient BRS govt couldn't defend it for years.Since 2015, your incompetent govt has failed to finish the trial. Now, for optics…— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) September 15, 2024ఇదిలా ఉండగా.. అంతకుముందు బండి సంజయ్‌పై కేటీఆర్ కీలక కామెంట్స్ చేశారు. ‘బీజేపీ అధికారంలోకి వచ్చి ఉంటే కేసీఆర్‌ను జైల్లో వేసేవాళ్లం. అంకుశం సినిమాలో రాంరెడ్డి లాగా గుంజుకుపోయేటోళ్లం’ అంటూ బండి సంజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు. ఈ సందర్భంగా కేటీఆర్..‘బీఆర్ఎస్ నాయకులను, ముఖ్యంగా కేసీఆర్ గారిని జైల్లో పెట్టడం పట్ల మీకున్న అత్యుత్సాహాన్ని నేను అర్థం చేసుకోగలను. కానీ ఓటుకు నోటు స్కామ్‌లో కెమెరాకు చిక్కిన వ్యక్తి ఇప్పటికీ స్వేచ్ఛగా ఎలా తిరుగుతున్నాడో చెప్పండి! మీరు ప్రశ్నించలేదు. బహుశా బడే భాయ్ (ప్రధాని మోదీ), ఛోటే భాయ్ (సీఎం రేవంత్) మధ్య సంబంధాన్ని మీరు ఇంకొంచెం ఎక్కువగా దర్యాప్తు చేయాలేమో కదా?. కొన్నేళ్లుగా అన్ని సాక్ష్యాలు స్పష్టంగా బయటకు కనిపిస్తున్నప్పటికీ ఛోటే భాయ్ ఎందుకు జైలులో లేడు!. ఇన్నాళ్లూ కేంద్రంలో అధికారంలో ఉన్నది బీజేపీ కాదా?. మిమ్మల్ని ఆపేది ఏది? ఎవరు? అంటూ ప్రశ్నించారు. ఇది కూడా చదవండి: ఎమ్మెల్యే గాంధీ ఇంటి వద్ద భారీగా పోలీసులు -
ప్రభాస్, అల్లు అర్జున్ భారీ విరాళం.. ఎవరెంత?
తెలుగు రాష్ట్రాల్లో ఊహించని వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే తెలుగు స్టార్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, మహేశ్ బాబు తదితరులు తలో రూ.50 లక్షలు విరాళం ప్రకటించారు. వీళ్లతో పాటు విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ తదితరులు కూడా తోచిన మొత్తం ఇచ్చారు. ఇప్పుడు ఈ లిస్టులోకి ప్రభాస్, అల్లు అర్జున్ కూడా చేరారు.(ఇదీ చదవండి: రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చిన డైరెక్టర్ హరీశ్ శంకర్!)ఇప్పటివరకు ఇచ్చిన వాళ్లకంటే కాస్త ఎక్కువగానే ప్రభాస్ సాయం చేశాడు. రాష్ట్రానికి కోటి రూపాయలు చొప్పిన రూ.2 కోట్లు విరాళం ప్రకటించాడు. అంతకు ముందు రూ.5 కోట్లు అని అన్నారు. అయితే అది కేవలం పుకారు మాత్రమే అని తేలింది.మరోవైపు అల్లు అర్జున్.. మొత్తంగా రూ.కోటి రూపాయలు విరాళం ప్రకటించాడు. అంటే తలో రాష్ట్రానికి రూ.50 లక్షలు. ఈ ఇద్దరి హీరోలు ఇవ్వడంతో అభిమానులకు కూడా తోచినంత సాయం చేయమని చెబితే బాగుండేది. సరే ఇదంతా పక్కనబెడితే మరికొందరు హీరోలు ఇంకా దీనిపై స్పందించి విరాళాలిస్తే బాగుంటుంది.(ఇదీ చదవండి: దయనీయ స్థితిలో నటుడు ఫిష్ వెంకట్.. రెండు కిడ్నీలు ఫెయిల్) -
12 ఏళ్ల క్రితం చనిపోయిన రైతుకు రుణమాఫీ!
నేలకొండపల్లి: ప్రభుత్వం ప్రకటించిన రుణ మాఫీ తమకు అమలు కాలేదని ఒకవైపు అనేక మంది రైతులు ఆందోళనచేస్తుంటే, మరో వైపు ఎప్పుడో మృతి చెందిన రైతు పేరు రుణమాఫీ జాబితాలో వచ్చింది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం గువ్వలగూడెంకు చెందిన తుళ్లూరి వెంకయ్య 12 సంవత్సరాల కిందటే మృతి చెందారు. ఆయనకు టేకులపల్లి ఆంధ్రా బ్యాంక్‌లో ఖాతా ఉండగా.. ఆయన కానీ, ఆయన చనిపోయాక కుటుంబీకులు కానీ రుణం తీసుకోలేదని చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం విడుదల చేసిన రుణ మాఫీ జాబితాలో వెంకయ్య పేరు వచ్చింది. ఈ విషయమై వెంకయ్య కుటుంబ సభ్యులు మాట్లాడుతూ, తమ తండ్రి కానీ, తాము కానీ ఏనాడు బ్యాంక్‌లో రుణం తీసుకోలేదని.. ఇప్పుడు రుణమాఫీ జాబితాలో పేరు ఎలా వచ్చిందో తెలియదని వెల్లడించారు. -
Telangana: డిపాజిట్టూ గోవిందా!
సాక్షి, హైదరాబాద్: మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలోకొచ్చే 24 అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను 16 స్థానాల్లో గెలుపు జెండా ఎగురవేసిన గులాబీ పార్టీ తాజా లోక్‌సభ ఎన్నికల్లో అంతటి విజయాన్ని నమోదు చేయలేకపోవడంతో పాటు ఆ పార్టీ అభ్యర్థులు దారుణంగా ఓడిపోయారు. రాజధాని నగరంతో కలగలసి ఉన్న నాలుగు లోక్‌సభ నియోజకవర్గాల్లోనూ గెలుపు సంగతి అటుంచి కనీసం రెండోస్థానంలో కూడా లేకుండా పోయారు. అంతే కాదు.. డిపాజిట్ తిరిగి పొందడానికి అవసరమైన కనీస ఓట్లను కూడా పొందలేకపోయారు. దీంతో కారు పార్టీ కార్యకర్తలు తీవ్ర నిరాశా నిస్పృహలకు లోనవుతున్నారు. ప్రజలు తమ వెంటే ఉన్నారనుకుని.. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలవకపోయినా గ్రేటర్ నగరంలో తమ పట్టు చెక్కు చెదరలేదని పార్టీ నేతలు భావించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం.. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని గెలిపించనందుకు ప్రజలు ఇప్పుడు చింతిస్తున్నారని, ప్రజలు తమ వెంటే ఉన్నారని, ఎక్కువ లోక్‌సభ సీట్లు సాధించడం ద్వారా ప్రతిపక్షాలకు తగిన బుద్ధి చెబుదామని పిలుపునిచ్చారు. నగరంలో తాము చేసిన అభివృద్ధి పనులతో ప్రజలు గెలిపిస్తారని, ఎక్కువమంది ఎంపీల బలంతో ఢిల్లీలోనూ సత్తా చూపుదామని ఉత్తేజపరిచారు. పార్టీ అభ్యర్థుల ప్రచార సభలకు, కేటీఆర్ రోడ్‌షోలకు హాజరైన ప్రజలను చూసి గెలుపు తమదేనని భావించారు. ఫలితాలను చూసి.. కంగు తిని.. గ్రేటర్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ల బలంతో ఎంపీ సీట్లు కూడా తమకే వస్తాయనుకున్నారు. తీరా ఫలితాలు చూస్తే అసెంబ్లీ నాటి విజయం సంగతి అటుంచి పార్టీ అభ్యర్థులకు కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. మొత్తం పోలైన ఓట్లలో 1/6 (16.66 శాతం) ఓట్లు లభిస్తే అభ్యర్థులు డిపాజిట్‌గా ఉంచిన నగదు మొత్తాన్ని తిరిగి చెల్లిస్తారు. అభ్యర్థులు ఆషామాషాగా పోటీ చేయకుండా ఉండేందుకు డిపాజిట్ జమ చేసుకోవడం తెలిసిందే. డిపాజిట్ పొందడానికి అవసరమైనన్ని ఓట్లు రాకపోవడంతో బీఆర్ఎస్ అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతయ్యాయి. -
TDP.. నామ్‌కే వాస్తేనే!
సాక్షి, హైదరాబాద్: తన శిష్యుడు రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్న తెలంగాణలో తెలుగుదేశం పార్టీని మూసేయడమే మంచిదనే అభిప్రాయంతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఉన్నట్లు టీటీడీపీ వర్గాలే భావిస్తున్నాయి. ఏపీలో అధికారంలోకి వస్తున్నాం అనే మాటలే తప్ప ... తెలంగాణలో పార్టీకి అధ్యక్షుడిని నియమిద్దామనే మాట కూడా బాబు నోట వెలువడలేదు. విదేశీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ వచ్చిన చంద్రబాబు శుక్రవారం సాయంత్రం తన నివాసంలో తెలంగాణ నాయకులతో సమావేశమయ్యారు. తెలంగాణలో శాసనసభ ఎన్నికలు ముగిసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసే నిర్ణయాలు తీసుకుంటారని భావించి వివిధ జిల్లాల నుంచి వచ్చిన టీడీపీ అభిమానులకు నిరాశే ఎదురైంది. అసెంబ్లీ ఎన్నికల ముందు టీటీడీపీ అధ్యక్షుడిగా పార్టీకి రాజీనామా చేసిన కాసాని జ్ఞానేశ్వర్ బీఆర్ఎస్లో చేరగా, అప్పటి నుంచి తెలంగాణ పార్టీకి దిక్కూ దివాణా లేకుండా పోయింది. పార్టీ రద్దయ్యే ప్రమాదం పొంచి ఉన్నా.. ఎన్నికల్లో కనీసం పోటీ చేయకపోవడంతో ప్రాంతీయ పార్టీగా తెలంగాణలో గుర్తింపు కూడా రద్దయ్యే పరిస్థితి నెలకొంది. శాసనసభ ఎన్నికలలో తన శిష్యుడు రేవంత్‌రెడ్డికి మద్దతుగా కాంగ్రెస్‌కు అనుకూలంగా వ్యవహరించిన చంద్రబాబు పార్లమెంటు ఎన్నికల్లో కూడా అభ్యర్థులను పోటీకి పెట్టలేదు. ఇప్పుడు కూడా రేవంత్ సర్కార్‌కు అండగా నిలవాలనే విధంగానే పార్టీ యంత్రాంగానికి ఉద్బోధ చేశారు. జూన్ 2న జరిగే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల్లో పాల్గొనాలని, అదే రోజు పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా ఎగరేసి, ప్రభుత్వానికి మద్దతు తెలపాలని శుక్రవారం తనను కలిసిన పార్టీ వర్గాలకు హితబోధ చేశారు. అక్కడ ఫలితాలొచ్చాక చూద్దాం.. ఏపీలో జరిగిన ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాలని చెప్పిన ఆయన అక్కడ తెలుగుదేశం అధికారంలోకి వస్తుందనే ధీమాను కూడా పార్టీ యంత్రాంగం ముందు వ్యక్తం చేయకపోవడం నాయకులను ఆశ్చర్యానికి గురి చేసింది. జూన్ 4 తరువాత వెలువడే ఏపీ ఎన్నికల ఫలితాల తరువాత తెలంగాణలో పార్టీ గురించి ఆలోచిస్తామని చంద్రబాబు పరోక్షంగా పార్టీ నాయకులకు చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా పార్టీ నేతలతో ఫొటోలు దిగారు. సమావేశంలో పార్టీ నాయకులు బక్కని నర్సింములు, అర్వింద్ కుమార్ గౌడ్, కాట్రగడ్డ ప్రసూన, పి. సాయిబాబా, సాంబశివరావు, కోటేశ్వర్ రావు, నల్లెల్ల కిషోర్ పాల్గొన్నారు. -
Hyderabad: ‘లోకల్’ అంత ఈజీ కాదు
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో జరుగుతాయనే వార్తల నేపథ్యంలో క్షేత్రస్థాయిపై బీజేపీ దృష్టి సారించింది. తొలుత గ్రామపంచాయతీ, ఆ తర్వాత జిల్లా, మండల పరిషత్‌లకు, ఈ ఏడాది చివర్లోగా మున్సిపాలి టీలు, కార్పొరేషన్లకు వరుసగా ఎన్నికలు జరుగు తాయి. అయితే గ్రామస్థాయిలో వార్డు సభ్యులు, మొదలుకొని సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీ సీలు, మున్సిపాలిటీల్లో కౌన్సిలర్లు ఇలా ప్రతి చోట అభ్యర్థి ఎంపికనే కీలకం. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో పార్టీకి పడిన ఓట్లు, ఆయా పోలింగ్ బూత్‌లలో బీజేపీకి పోలైన ఓట్ల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక, టికెట్ల కేటాయింపుపై పూర్తిస్థాయి దృష్టి పెడతారని పార్టీవర్గాల సమాచారం. కొంతకాలంగా పార్టీ కోసం పనిచే స్తుండడంతోపాటు, ప్రజల్లో ఉన్న గుర్తింపు, వివిధ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం ప్రయత్నా లు, ఆయా ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు సాధించిన ఓట్లు ప్రామాణికంగా మారనున్నట్టు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి, వివిధ వర్గాల ఓట్ల సాధనకు ఏ మేరకు సఫలమయ్యా రనే దాని ప్రాతిపదికన స్థానిక సంస్థల టికెట్లు కేటాయిస్తామని పార్టీ నేతలు చెబుతున్నారు. పార్టీలో ఇంతకాలంగా ఉన్నాం.. ఇంత పనిచేశాం..అంత పనిచేశామనే ప్రచారానికి పరిమితం కాకుండా గ్రౌండ్లెవల్లో పార్టీ ఫలితాల సాధన కు ఏ మేరకు వారి కృషి ఉందనే అంశాన్ని నాయ కత్వం బేరీజు వేయనున్నట్టు తెలుస్తోంది. వివిధ స్థాయిల్లో పార్టీ అభ్యర్థులు మంచి ప్రదర్శన కన బరచడంలో స్థానిక నేతల కృషి, సాధించిన ఫలి తాలు కొలమానం చేయడం ద్వారా నాయకులు, కార్యకర్తల్లో మరింత అంకితభావం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. వచ్చే 2,3 నెలల్లో గ్రామీణ, ఆ తర్వాత మున్సిపాలిటీల ఎన్నికలు జరగొచ్చన్న అంచనాల మధ్య పార్టీలో స్థానికంగా వివిధస్థాయిలో అభ్యర్థుల ఎంపిక కసరత్తు అనేది కూడా త్వరలోనే మొదలు మొదలవుతుందని సమాచారం. జూన్ 4న లోక్‌సభ ఎన్నికల ఫలి తాలు వెలువడ్డాక, పార్లమెంట్ పరిధిలోని అసెంబ్మీ సెగ్మెంట్లు, పోలింగ్‌బూత్‌ల వారీగా పార్టీకి పడి న ఓట్ల వివరాలు వెల్లడయ్యాక ఈ ప్రక్రియ వేగం పుంజుకుంటుందని పార్టీనేతలు చెబుతున్నారు. -
భార్య కళ్ల ముందే భవనంపై నుంచి దూకి భర్త ఆత్మహత్య
బంజారాహిల్స్: భార్య కాపురానికి రావడం లేదనే బాధతో ఓ యువకుడు ఆమె కళ్ల ముందే మూడో అంతస్తు నుంచి కిందికి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలివీ... కడప ఎర్రముఖపల్లి సర్కిల్లో నివసించే పసుపులేటి మణికంఠ (33) 2018 మే 10వ తేదీన బంజారాహిల్స్ రోడ్డు నెంబర్–10లోని ఇబ్రహీంనగర్‌కు చెందిన యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఇద్దరూ కలిసి ఏడాది పాటు బంజారాహిల్స్ రోడ్డు నెంబర్–14లో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని కాపురం చేశారు. మణికంఠ పద్ధతులతో విసిగిపోయిన యువతి ఇబ్రహీంనగర్‌లోని తన పుట్టింటికి వెళ్లింది. అప్పటి నుంచి మణికంఠ తీవ్ర నిరాశా నిస్పృహలతో గడపసాగాడు. భార్యను తనతో పాటు రమ్మని పిలవడానికి ఆదివారం రోజు రాత్రి ఆమె ఇంటికి వెళ్లాడు. తనతో పాటు రావాలని కోరాడు. నీ పద్ధతులు నచ్చకనే వేరుగా ఉంటున్నానని, నీవు మారవని రాలేనని భార్య తెగేసి చెప్పడంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తన భార్య ఎప్పటికీ ఇక రాదని, ఈ జీవితం వృథా.. బతికి వేస్ట్ అనుకుంటూ భార్య చూస్తుండగా మూడో అంతస్తు నుంచి కిందికి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అక్కడికక్కడే మణికంఠ మృతి చెందగా ఈ విషయాన్ని బాధిత యువతి మణికంఠ బాబాయి వెంకటరమణకు తెలియజేసింది. వెంకటరమణ ఇచి్చన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు అనుమానాస్పద మృతి కింద నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఫ్యాన్స్‌కు ఇక పండగే.. క్రిస్ గేల్ రీ ఎంట్రీ! తెలంగాణ కెప్టెన్‌గా
వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ మరోసారి మెరుపులు మెరిపించేందుకు సిద్దమయ్యాడు. ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభ ఎడిషన్‌లో తెలంగాణ టైగర్స్ జట్టుకు క్రిస్ గేల్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని క్రిస్ గేల్ స్వయంగా వెల్లడించాడు. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 3 వరకు తొమ్మిది రోజుల పాటు డెహ్రడూన్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ టోర్నీ జరుగనుంది. "నాపై నాకున్న నమ్మకం, అభిమానుల హర్ష ద్వనిలు నన్ను మళ్లీ బ్యాట్ పట్టేలా చేస్తున్నాయి. వెటరన్ ప్రీమియర్ లీగ్ ద్వారా మీ యూనివర్సల్ బాస్ మైదానంలోకి అడుగుపెడుతున్నాడు. దిగ్గజ ఆటగాళ్లలతో మళ్లీ ఆడే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. ఓల్డ్ ఈజ్ గోల్డ్.. ఐవీపీఎల్కు సిద్దమవ్వండి" అంటూ గేల్ ఓ ప్రకటనలో పేర్కొన్నాడు. గేల్‌తో పాటు భారత మాజీ క్రికెటర్లు సుదీప్ త్యాగీ, మన్‌ప్రీత్ గోనీ, వెస్టిండీస్ మాజీ క్రికెటర్ రికార్డో పోవెల్ తెలంగాణ టైగర్స్ తరఫున బరిలోకి దిగనున్నారు. మొత్తం ఎన్ని జట్లు అంటే? ఈ లీగ్‌లో మొత్తం ఆరు జట్లు భాగం కానున్నాయి. వీవీఐపీ ఉత్తర్ ప్రదేశ్, తెలంగాణ టైగర్స్, రాజస్థాన్ లెజెండ్స్, రెడ్ కార్పెట్ ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్ వారియర్స్, ముంబై ఛాంపియన్స్ జట్లు ఈ వెటరన్ లీగ్‌లో అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ టీ20 లీగ్‌ను డీడీ స్పోర్ట్స్‌తో పాటు యూరోస్పోర్టస్ ఛానెల్లో అభిమానులు వీక్షించవచ్చు. కాగా వీరేంద్ర సెహ్వాగ్, మునాఫ్ పటేల్, సురేశ్ రైనా, రజత్ భాటియా, ప్రవీణ్ కుమార్, యూసఫ్ పఠాన్, హెర్షల్ గిబ్స్ వంటి దిగ్గజ ఆటగాళ్లు కూడా ఈ టోర్నీలో భాగం కానున్నట్లు సమాచారం. -
రూ.17.5 కోట్లు డిపాజిట్ చేయండి.. హెచ్‌సీఏకు హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: ఆరువారాల్లో రూ.17.5 కోట్లు వాణిజ్య న్యాయస్థానంలో డిపాజిట్ చేయాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)ను హైకోర్టు ఆదేశించింది. ఉప్పల్ స్టేడియం, హెచ్‌సీఏ బ్యాంక్ అకౌంట్లు సహా ఆస్తులన్నింటినీ అటాచ్ నుంచి విడుదల చేయాలని స్పష్టం చేసింది. స్థిర, చరాస్తులపై థర్డ్ పారీ్టకి ప్రయోజనాలు కల్పించవద్దని హెచ్‌సీఏకు సూచించింది. తదుపరి విచారణ ఆరు వారాలకు వాయిదా వేసింది. ఉప్పల్ స్టేడియం, హెచ్‌సీఏ బ్యాంక్ అకౌంట్లు సహా ఆస్తులన్నింటినీ రంగారెడ్డి జిల్లా కోర్టు గత వారం అటాచ్ చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు నియమించిన హెచ్‌సీఏ అడ్మినిస్టేటర్, జస్టిస్ ఎల్.నాగేశ్వర్రావు హైకోర్టును ఆశ్రయించారు. తమ వాదనలు వినకుండానే చేసిన ఆ అటాచ్మెంట్లు రద్దు చేయాలని కోరారు. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్వీ.శ్రవణ్‌కుమార్ ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. మధ్యవర్తిత్వ తీర్పు ఏకపక్షమని హెచ్‌సీఏ తరఫున సీనియర్ న్యాయవాది రాజాశ్రీపతి వాదనలు వినిపించారు. దీన్ని వాణిజ్య న్యాయస్థానం ముందు సవాలు చేశామని, ఇదే సమయంలో విశాఖ ఇండస్ట్రీస్ వేరొక చోట ఎగ్జిక్యూషన్ పిటిషన్ వేసిందన్నారు. దాని ఫలితంగా అటాచ్మెంట్ ఆర్డర్ వచ్చిందని చెప్పారు. విశాఖ ఇండస్ట్రీస్ తరఫున సీనియర్ న్యాయవాది సునీల్ వాదనలు వినిపిస్తూ.. 2016లో మధ్యవర్తిత్వ తీర్మానం ఆమోదించగా, ఏడేళ్లుగా ఈ తతంగం కొనసాగుతోందని.. విశాఖ ఇండస్ట్రీస్‌కు చెల్లించకుండా ఉండేందుకు హెచ్‌సీఏ ఉద్దేశపూర్వకంగానే విస్మరించిందని చెప్పారు. వాదనలు విన్న ధర్మాసనం.. విశాఖ ఇండస్ట్రీస్‌కు అనుకూలంగా ఇచ్చిన మధ్యవర్తిత్వ తీర్పులో భాగంగా హెచ్‌సీఏ రూ.17.5 కోట్లు డిపాజిట్ చేయాలని ఆదేశిస్తూ, విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది. -
ట్రిపుల్ ఐటీలో హౌసెకీపింగ్ ఉద్యోగుల తొలగింపు వివాదం
-
అమెరికా జట్టు వైస్ కెప్టెన్‌గా అనికా.. మూలాలు మనవే
కీసర: దక్షిణాఫ్రికా వేదికగా వచ్చే నెలలో జరగనున్న అండర్– 19 టీ 20 ప్రపంచకప్ పోటీలకు అగ్రరాజ్యం అమెరికా జట్టు తరఫున తెలంగాణ మూలాలు ఉన్న కొలన్ అనిక వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనుంది. మేడ్చల్– మల్కాజిగిరి జిల్లా నాగారం మున్సిపాలిటీకి చెందిన ముప్పు సత్తిరెడ్డి కూతురు కొలన్ మంజుల, అల్లుడు సురేష్‌రెడ్డి అమెరికాలో పదేళ్ల క్రితమే స్థిరపడ్డారు. మంజుల వైద్యురాలు కాగా.. సురేష్‌రెడ్డి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. 8 ఏళ్ల వయసులోనే క్రికెట్‌పై ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు తమ కూతురు అనికకు శిక్షణ ఇప్పించారు. ఆమె క్రికెట్లో శిక్షణ తీసుకుంటూ వివిధ టోర్నమెంట్లలో సత్తా చాటుకుంది. 17 ఏళ్ల అనిక అమెరికాలో పదో తరగతి చదువుతోంది. అండర్ –19 టీ20 ప్రపంచకప్ క్రికెట్ పోటీలకు అమెరికా జట్టు వైఎస్ కెప్టెన్‌గా తమ కూతురు ఎంపికవ్వడంపై అనిక తల్లిదండ్రులు హర్షం వ్యక్తంచేస్తున్నారని బంధువులు తెలిపారు. కాగా.. అమెరికా రెగ్యులర్ టీమ్‌లో వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్‌గా అనిక రాణిస్తోంది. నాగారంలో ఉంటున్న అనిక తాతయ్య ముప్పు సత్తిరెడ్డి, మేనమామ అశోక్‌రెడ్డిలు మాట్లాడుతూ.. అనిక మూడు నెలల క్రితం అమెరికా నుంచి నాగారానికి వచ్చిందన్నారు. నెల రోజుల పాటు సికింద్రాబ్ సెయింట్ జాన్స్ క్రికెట్ అకాడమీలో శిక్షణ తీసుకుందన్నారు. అమెరికా జట్టు తరఫున అండర్ – 19 టీ 20 ప్రపంచ కప్ పోటీలకు తన మనవరాలు ఎంపికై వైస్‌కెప్టెన్‌గా ప్రాతినిధ్యం వహిస్తుండటంపై సత్తిరెడ్డితో పాటు, కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: IND vs BAN 1st Test: తొలి టెస్టులో టీమిండియా భారీ విజయం -
వెల్కమ్ టు వెంకంపల్లి.. ఒక ఊరి కథ
పట్టణాల్లో నాగరికత రోడ్లై.. వీథిలో లైట్లై.. వాడల్లో లే అవుట్లై..అండర్‌గ్రౌండ్ డ్రైనేజై.. కూడళ్లలో పార్కులై.. కుళాయిలై.. బడులు.. కాలేజీలు.. కాలక్షేపానికి థియేటర్లు.. షాపింగ్ మాల్సై కనపడుతుంది! వానలు.. వంతలు వచ్చినప్పుడు వరదలై ఉప్పొంగుతుంది కూడా! కానీ ఈ పల్లెలో నాగరికత.. ఇళ్లల్లో ఇంకుడు గుంతలై.. కూడళ్లలో పరిశుభ్రతై.. ఆలోచనల్లో విజ్ఞత, విచక్షణై.. నడక, నడతల్లో సంస్కారమై.. కొలుపులు, కొట్లాటలకు నిర్వాసితై.. స్త్రీ, పురుష సమానత్వమై వెల్లివిరుస్తోంది! అదెక్కడో అభివృద్ధి ఆకాశాన్నంటిన.. హ్యాపీ ఇండెక్స్‌లో పైనున్న దేశాల్లో లేదు! తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో.. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు నూరు కిలోమీటర్ల పై దూరంలో ఉంది! పేరు.. వెంకంపల్లి! దాని గురించిన వివరాలను తెలుసుకునేందుకు వెల్కమ్ చెప్తోంది!! భగవంతుడి మీద నమ్మకం.. ఆధ్యాత్మికత.. ఈ రెండూ మనిషిని మనిషిగా నిలబెట్టే ప్రయత్నాలు.. మార్గాలు కూడా! ఈ మార్గాలను అనుసరించే మనిషి .. సమాజం మీద చాలా ప్రభావం చూపిస్తాడు. మాటలతో కాదు చేతలతో! అలా భక్తిని.. ఆధ్యాత్మికతను సరిగ్గా అర్థం చేసుకుని వ్యక్తిగత పరివర్తనతో పాటు పరిసరాల అభివృద్ధికీ పాటుపడ్డ.. పడుతున్న ఊరే వెంకపల్లి! మంజీర ఒడ్డున ఉన్న ఓ చిన్న పల్లెటూరు ఇది. తెలంగాణలోని కామారెడ్డి – మెదక్ జిల్లాల సరిహద్దుల్లోని మారుమూల గ్రామం. చుట్టూరా పచ్చని పంట పొలాలతో ఆహ్లాదంగా ఉంటుంది. ఇదివరకు ఇది తాండూర్ పంచాయతీ పరిధిలో ఉండేది. పంచాయతీల పునర్విభజన జరిగి 2018 ఆగస్టు 2న పంచాయతీగా ఏర్పడింది. 172 కుటుంబాలు నివాసం ఉంటాయిక్కడ. పురుషుల సంఖ్య మూడు వందల యాభై మూడు, మహిళల సంఖ్య మూడు వందల డెబ్భై తొమ్మిది. దీన్ని బట్టే చెప్పొచ్చు ఇది లింగ వివక్ష లేని ఊరని! గ్రామస్థుల ప్రధాన వృత్తి వ్యవసాయం. సూర్యోదయంతోనే పొలాన్ని చూసుకోనిదే వాళ్ల దినచర్య మొదలవదు. ఊళ్లో అందరూ ఎంతో కొంత చదువుకున్నవారే! ఉన్నత చదువులు చదివి వ్యవసాయం చేస్తున్నవారూ ఉన్నారు. మంజీర ముంచేసింది.. 1989లో కురిసిన భారీ వర్షాలకు మంజీర పొంగి వెంకంపల్లిని చుట్టేసింది. ఇళ్లల్లోకి నీరు వచ్చి చేరడంతో గ్రామస్థులంతా ప్రాణాలు అరచేతపట్టుకుని పరుగులు తీశారు. పైభాగన ఉన్న ప్రాంతంలో తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. అప్పట్లో పెద్దగా వ్యవసాయం నడిచేది కాదు. ఇళ్లన్నీ నీట మునగడంతో ఎగువ భాగాన ఇళ్లు నిర్మించుకునేందుకు సిద్ధమయ్యారు. 1990 ప్రాంతంలో ప్రభుత్వం ఇళ్ల నిర్మాణానికి ఒక్కో కుటుంబానికి రూ.6 వేల చొప్పున సాయం అందించిందని గ్రామస్థులు చెప్పారు. అలా ఇళ్లు కట్టుకొని తమ ఊరిని పునర్నిర్మించుకున్నారు. ఏదో పొలం పనులు చేసుకుంటూ మునుపటిలాగే జీవనం సాగించేవారు. పరిసరాల శుభ్రత.. ఊరును ఓ జట్టుగా ఉంచుకునే వంటి వాటి మీద అవగాహన.. ప్రయత్నంలాంటివి లేకుండా! ఆ సమయంలోనే అంటే 1994లో.. వెంకపల్లిని బాన్స్వాడ పట్టణానికి చెందిన తాడ్కొల్ గంగారం, ఆర్ఎంపీ డాక్టర్ నాగభూషణం ఆధ్వర్యంలోని స్వాధ్యాయ బృందం సందర్శించింది. వాళ్లకు ఈ గ్రామంలో.. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక.. ఎక్కడ పడితే అక్కడ మురికి నీటి గుంటలు కనిపించాయి. ఇళ్లు..చుట్టూ పరిసరాలు కూడా దోమలు, ఈగలకు ఆలవాలంగా అనిపించాయి. ఆధ్యాత్మిక వచనాల కన్నా ముందు గ్రామానికి పరిశుభ్రత పాఠాలు అవసరమని గ్రహించింది స్వాధ్యాయ బృందం. వాన నీటి సంరక్షణకే కాదు.. మురికి నీటిని తోలేందుకూ ఇంకుడు గుంతలే పరిష్కారమని బోధించింది. ఆ ఊళ్లో చక్కటి డ్రైనేజీ వ్యవస్థకు రూపకల్పన చేసింది. ఆ సమస్య తీరాక స్వాధ్యాయ కార్యక్రమాల మీద అవగాహన కల్పించడం మొదలుపెట్టింది. ఆ బృందం ఆశించినదాని కంటే గొప్ప ఫలితాలనే చూపించడం మొదలుపెట్టింది ఆ ఊరు. పరిసరాల పరిశుభ్రతలోనే కాదు.. ఊరి అభివృద్ధిలో కూడా! భక్తిని మూఢ విశ్వాసంగా కాకుండా దైనందిన జీవితానికి అన్వయించడం తెలుసుకున్నారు. స్వాధ్యాయ నేర్పిన ఆధ్యాత్మికతను తమ గ్రామ ప్రగతికి సోపానంగా మలచుకున్నారు. క్రమశిక్షణను అలవరచుకున్నారు. కష్టించి పనిచేయడాన్ని మించిన దైవారాధన లేదని నమ్మారు. తోటి వారిని గౌరవించడాన్ని మించిన మతం లేదనే విశ్వాసాన్ని అనుసరించడం మొదలుపెట్టారు. ఒకరికొకరు సాయంగా ఉంటే ఊరంతా బాగుంటుందనే సత్యాన్ని అమలు చేయడం ఆరంభించారు. అదే ఆ ఊరికి నిర్ణయించని కట్టుబాటుగా మారింది. ప్రతిఒక్కరూ వారి ఇళ్ల వద్ద స్వచ్ఛందంగా ఇంకుడుగుంతలను నిర్మించు కున్నారు. దీనివల్ల గ్రామంలో భూగర్భజలాలు పెరగడంతో పాటు మురుగు సమస్య లేకుండా పోయింది. ఇప్పటికీ ఈ గ్రామంలో ఎవరు కొత్తగా ఇల్లు కట్టుకున్నా ఆవరణలో ఇంకుడు గుంతను ఏర్పాటు చేసుకోవాల్సిందే! ఆధ్యాత్మిక చింతనలో భాగంగా సొంతడబ్బులతో గ్రామస్థులు 2001లో అమృతాలయాన్ని కట్టుకున్నారు. దానికి ప్రత్యేకంగా పూజారి అంటూ ఎవరు ఉండరు. ప్రతి 15రోజులపాటు ఉదయం, సాయంత్రం గ్రామానికి చెందిన ఒక జంట(దంపతులు) ఆ ఆలయంలో ప్రార్థనలు చేస్తారు. ఈ 15రోజులూ ఆ దంపతులు మాంసం, మద్యం ముట్టుకోరు. గ్రామానికి చెందిన స్వాధ్యాయ భక్తులు కొందరు తీర్థయాత్రల పేరిట వారంరోజులపాటు ఇతరప్రాంతాలకు వెళ్లి స్వాధ్యాయ కార్యక్రమాలు, అందులో భాగంగా స్వయం సమృద్ధి, స్వావలంబన మీద అవగాహన కల్పిస్తుంటారు. ఇప్పుడు ఆ ఊళ్లో.. .. ఎక్కడా మురికి కాలువలు కనిపించవు. వంట గదిలో వాడిన నీరైనా, బాత్రూమ్లోంచి వెళ్లే మురికి నీరైనా భూమిలోకి ఇంకిపోతాయి. బయట మురికి కాల్వలు లేకపోవడంతో దోమలు, ఈగల బెడద లేదు. ఏ ఇంటికి వెళ్లినా ఇంటి ఆవరణలో కూరగాయలు, ఆకు కూరల మొక్కలు కనిపిస్తాయి. సీజనల్ పండ్ల చెట్లూ పలకరిస్తుంటాయి. టేకు చెట్లు, కొబ్బరి చెట్లను కూడా పెంచుతున్నారు. కరివేపాకు చెట్టు లేని ఇల్లు లేదంటే నమ్మండి! అందరూ ఆర్థికంగా ఎదిగినవారే. పిల్లలంతా ఉన్నత చదువులు చదివిన.. చదువుతున్నవారే. దాదాపు ఇంటికొకరు అన్నట్టుగా దేశ, విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. వారిలో చాలామంది సాఫ్ట్వేర్ ఉద్యోగులే. జర్మనీ, అమెరికా, ఆస్ట్రేలియా, థాయ్‌లాండ్ వంటి దేశాల్లో 15 మంది పనిచేస్తుండగా, మరో 30 మంది హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. మరికొందరు వ్యాపారరీత్యా హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. అలాగే ఇంకొందరు ప్రైవేట్ ఉద్యోగాల్లో ఉన్నారు. గ్రామంలో దాదాపు ఇంటికొకరు అన్నట్టుగా ఉద్యోగాలు, వ్యాపారాల్లో ఉన్నారు. ఇప్పుడు ఉన్నత చదువులు చదువుతున్న వారు మరో నలభై మంది వరకు ఉన్నారు. ఇంజనీరింగ్ వైపే ఎక్కువ మంది వెళ్లారు. ఒకరిద్దరు మెడిసిన్ వైపు వెళ్లినట్టు గ్రామస్థులు పేర్కొన్నారు. మగ పిల్లలతో సమానంగా ఆడపిల్లలను చదివిస్తున్నారు. గ్రామానికి చెందిన పలువురు యువతులు ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్లారు. ప్రస్తుతం ఊళ్లో యాభై ఏళ్లు పైబడిన వాళ్లే కనిపిస్తారు. అంతా కలసిమెలసి ఉంటారు. సాగులో ఆదర్శం.. వెంకంపల్లి అంటేనే వ్యవసాయం. ఇక్కడ ఆదర్శ సేద్యం చేస్తారు. ఈ గ్రామస్థులకు వెంకంపల్లి సహా తాండూర్, లింగంపల్లి కలాన్ గ్రామాలతో కలిపి దాదాపు 780 ఎకరాల వ్యవసాయ భూములున్నాయి. అప్పట్లో చెరకు పంట ఎక్కువగా సాగయ్యేది. రైతులంతా బెల్లం తయారు చేసేవారు. అనకాపల్లి బెల్లం తయారీలో వెంకంపల్లి రైతులు ముందుండేవారు. పుట్లకొద్ది బెల్లం వండి మహారాష్ట్ర, గుజరాత్ తదితర రాష్ట్రాలకు సరఫరా చేసేవారు. ప్రభుత్వం బెల్లంపై ఆంక్షలు విధించిన తరువాత బెల్లం తయారీ నిలిచిపోయింది. గతంలో నాలుగైదు వందల ఎకారల్లో చెరకు సాగయ్యేది. ఇప్పుడు కేవలం వంద ఎకరాల్లోనే సాగవుతోంది. చెరకును గాయత్రీ చక్కెర కర్మాగారానికి తరలిస్తారు. అయితే చెరకు సాగుకు కూలీల సమస్య, గిట్టుబాటు లేకపోవడంతో చాలా మంది రైతులు వరివైపు మొగ్గుచూపారు. ఇప్పుడు గ్రామంలో దాదాపు 550 ఎకరాల్లో వరి, 150 ఎకరాల్లో చెరకును సాగు చేస్తున్నారు. మిగతా భూమిలో ఆరుతడి పంటలు సాగవుతాయి. వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు పాటిస్తారు. అధిక దిగుబడులు సాధిస్తున్నారు ఇక్కడి రైతులు. రెండు చెరకు హార్వెస్టర్లు, పది వరకు వరి కోత మిషన్లు, 30 వరకు ట్రాక్టర్లు ఉన్నాయి. పోలీస్ స్టేషన్ గడప తొక్కరు.. గొడవలు.. గట్టు పంచాయతీలు.. గృహ హింస లేని ఊరుగా వెంకంపల్లిని పేర్కొనవచ్చు. గొడవలకు ఆస్కారమే లేదు కాబట్టి పోలీస్ స్టేషన్ మాటే రాదు ఆ ఊళ్లో. చిన్న చిన్న సమస్యలు ఎదురైతే ఊర్లోనే కూర్చుని మాట్లాడుకుంటారు. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్న సంఘటనలు తక్కువే. ఎన్నికల సమయంలో పోటాపోటీ రాజకీయాలు ఉంటాయి. తరువాత ఎవరి పని వారు చేసుకుంటారు. ఏదైనా సమస్య తలెత్తి పోలీసు స్టేషన్‌కు వెళ్లినా గ్రామ పెద్దలు కూర్చుని సమస్యను పరిష్కరించేస్తారు. కుటుంబాల్లో తగాదాలు కూడా పెద్దగా ఉండవు. కాబట్టే తమ ఊరు వివాదాలు, తగాదాలకు అతీతమైందని చెప్తారు వెంకంపల్లి వాసులు. ఇంతకన్నా గొప్ప ప్రతిష్ఠ ఏం ఉంటుంది!! మా వాళ్లకు హక్కుల కన్నా బాధ్యతలు బాగా తెలుసు. అందుకే మా ఊరు క్రమశిక్షణ, శ్రమ, ఐకమత్యానికి మారుపేరుగా నిలిచింది. ఇంతకన్నా గొప్ప ప్రతిష్ఠ ఏం ఉంటుంది ఏ ఊరికైనా! – శుభాకర్‌రెడ్డి, గ్రామసర్పంచ్ పండగవేళ సందడే సందడి.. గ్రామంలోని దాదాపు అన్ని ఇళ్లూ ఆధునిక సౌకర్యాలతో కట్టినవే. బంధువులు, స్నేహితులు వస్తే పార్టీ చేసుకునేందుకు ప్రత్యేక గదులు ఏర్పాటు చేసుకున్నారు. ఏదేని పరిస్థితుల్లో కరెంటు పోతే ఇన్వర్టర్లు వాడతారు. ఫ్రిజ్‌లు, టీవీలు లేని ఇళ్లు దాదాపు లేవు. గ్రామంలో 45 వరకు కార్లు ఉన్నాయి. వందకు పైగా ద్విచక్ర వాహనాలున్నాయి. పట్టణాల్లో, విదేశాల్లో ఉన్న పిల్లలంతా పండుగల సమయంలో ఊరికి వస్తారు. అప్పుడు వెంకంపల్లి అంతా సందడిగా మారుతుంది. ఇలా ఎప్పుడో జానపద కథల్లో విన్నట్టుగా.. ఊహల్లో కన్నట్టుగా ఉన్న ఈ ఊరు కనిపిస్తున్న సత్యం! ఆల్ ఈజ్ వెల్.. ఫీల్ గుడ్ను భావనల్లోనే కాదు ప్రాక్టికల్‌గా సాక్షాత్కరింపచేసుకుని వెంకంపల్లి ఇతర పల్లెలకే కాదు.. నాగరికతకు చిహ్నంగా భావించే నగరాలకూ స్ఫూర్తి! కులం, మతం పేరుతో మనుషులను దూరం చేస్తున్న సిద్ధాంతాలకు, మూఢభక్తితో నేరప్రవృత్తిని పెంచుతున్న, పెంచుకుంటున్న తత్వాలకు చెంప పెట్టు ఈ పల్లె! ∙సేపూరి వేణుగోపాలచారి సాక్షి, కామారెడ్డి -
Hyderabad: లైంగిక వేధింపుల ఘటన.. బీఎస్‌డీ డీఏవీ స్కూల్ గుర్తింపు రద్దు
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లోని బీఎస్‌డీ డీఏవీ పబ్లిక్ స్కూల్ గుర్తింపును రద్దు చేసింది తెలంగాణ విద్యాశాఖ. ఈ పాఠశాల ప్రిన్సిపాల్‌కు డ్రైవర్‌గా పనిచేసే రజినీకుమార్.. చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడుతన్నాడనే ఆరోపణల నేపథ్యంలో ఈమేరకు నిర్ణయం తీసుకుంది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇందుకు సంబంధించి అధికారిక ఆదేశాలు జారీ చేశారు. ఈ వ్యవహారంపై అధికారులు విచారణ చేపట్టారు. డ్రైవర్ రజినీకుమార్ అరాచకాలను స్కూల్లో పనిచేసే టీచర్లు విద్యాశాఖ అధికారులకు తెలిపారు. అతనిపై ప్రిన్సిపాల్‌కు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని పేర్కొన్నారు. పాఠశాలలో చాలా మంది విద్యార్థినులపై అతడు లైగింక వేధింపులకు పాల్పడినట్లు అధికారులు విచారణలో గుర్తించారు. విద్యార్థులు, టీచర్ల నుంచి స్టేట్మెంట్లు రికార్డు చేశారు. స్కూల్, బయట ఉన్న సీసీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు. వేరే స్కూళ్లలో సర్దుబాటు పాఠశాల గుర్తింపు రద్ధు చేయడంతో విద్యార్థులు నష్టపోకుండా వాళ్లను వేరే స్కూళ్లలో సర్దుబాటు చేసేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. విద్యార్థుల తల్లిదండ్రుల సందేహాలను నివృత్తి చేసే బాధ్యత పూర్తిగా జిల్లా విద్యా శాఖ అధికారిదేనని స్పష్టం చేశారు. కమిటీ ఏర్పాటు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన భద్రతా పరమైన చర్యలను ప్రభుత్వానికి సూచించేందుకు విద్యా శాఖ కార్యదర్శి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి సబిత ప్రకటించారు . ఈ కమిటీలో పాఠశాల విద్యాశాఖ సంచాలకులు, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి, పోలీస్ విభాగంలో మహిళల భద్రతను పర్యవేక్షిస్తున్న డీఐజీ స్థాయి అధికారులు సభ్యులుగా ఉంటారని తెలిపారు. ఈ కమిటీ తన నివేదికను వారం రోజుల్లోగా అందిస్తుందని పేర్కొన్నారు. ఈ నివేదిక ఆధారంగా విద్యార్థుల భద్రతకు సంబంధించి ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసే బాధ్యతపై ఆయా పాఠశాలల యాజమాన్యాల నుంచి హామీపత్రం తీసుకునే విధంగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు. కట్టలుతెంచుకున్న ఆగ్రహం.. ఎల్కేజీ చదువుతున్న బాలికను రజినీకుమార్ గత రెండు నెలలుగా వేధిస్తున్నాడనే ఆరోపణలతో ఆమె తల్లిదండ్రులు మంగళవారం సాయంత్రం పాఠశాలకు చేరుకుని నిలదీశారు. కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో అతనికి దేహశుద్ది చేశారు. ఈ ఘటన తీవ్ర దుమారం రేపడంతో విద్యాశాఖ వెంటనే స్పందించి చర్యలు చేపట్టింది. చదవండి: విద్యార్థినిని వేధిస్తున్న స్కూల్ ప్రిన్సిపాల్ కారు డ్రైవర్.. చితకబాదిన తల్లిదండ్రులు -
కేటీఆర్‌తో అసదుద్దీన్ భేటీ.. ఎందుకంటే?
సాక్షి, హైదరాబాద్: మంత్రి కేటీఆర్‌తో భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదని ఎంఐఎం అధినేత,ఎంపీ అసదుద్దిన్ ఒవైసీ తెలిపారు. హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించినట్లు ఆయన తెలిపారు. కాగా మంత్రి కేటీఆర్‌తో ఎంపీ అసదుద్దీన్ శనివారం అసెంబ్లీలో సమావేశమయ్యారు. అనంతరం అసదుద్దీన్ మీడియాతో మాట్లాడుతూ.. తాను నియోజకవర్గ అభివృద్ధి కోసమే కేటీఆర్‌ను కలిశానని, పదవుల వంటి మరే ఇతర అంశాలు చర్చించలేదన్నారు. ఉత్తర ప్రదేశ్ ఫలితాలపై తనకే నారాజ్ లేదని పేర్కొన్నారు. అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ప్రజల తీర్పని తెలిపారు. యూపీ ఫలితాలు ఆశ్చర్యపరచలేదని, యూపీ ఎన్నికలు.. పశ్చిమ బెంగాల్ ఎన్నికలు వేర్వేరు అన్నారు. యూపీ సీఎం మంచి జోష్‌లో ఉన్నారని పేర్కొన్నారు. ఆయన మంచి మాటకారి అని ఆదిత్యనాథ్ తీరుపై కితాబిచ్చారు. అయితే ఎన్నికల ఫార్ములా ఇక్కడ పనిచేయదన్నారు. యూపీ ఎన్నికల్లో పోటీ చేస్తే హత్య యత్నం చేశారు. అఖిలేష్ యాదవ్ నెల ముందు నుంచి పరీక్షకు సిద్ధమవుతారని. డిస్టింక్షన్ కొట్టాలంటే ముందు నుంచే సిద్ధంగా ఉండాలని హితవు పలికారు. చదవండి: రాజీనామా యోచనలో సోనియా, రాహుల్, ప్రియాంక?.. రేపే ప్రకటన! ‘బీజేపీ తెలంగాణపై దృష్టి సారించినా ఇక్కడ ముఖ్యమంత్రి బలంగా ఉన్నారు. తెలంగాణలో కారు స్పీడ్ మీద ఉంది. గుజరాత్, రాజస్థాన్ ఎన్నికల్లో మజ్లిస్ పోటీ చేస్తుంది. జమ్మూ కశ్మీర్లో మజ్లిస్ పోటీ చేయదు. కాంగ్రెస్ వైఫల్యం వల్లే ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ గెలుస్తోంది. దేశ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీలు కీలకం అవుతాయి. రాజకీయ శూన్యతను ఏదో పార్టీ నింపాల్సి ఉంటుంది. అందుకే ఆప్ ఎదుగుతోంది. పంజాబ్‌లో ఆప్‌కు అధికారాన్ని కాంగ్రెస్ బహుమతిగా ఇచ్చింది. కాంగ్రెస్ లోని జీ23 గ్రూప్ ఏం చేస్తుందో చూద్దాం. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయో... లేదో తెలియదు. చదవండి: పొంగులేటి వ్యాఖ్యలతో పెరిగిన రాజకీయ వేడి.. పోటీకి సై అంటున్న మాజీలు.. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మజ్లిస్ సిద్ధమే.కేసీఆర్ ఫ్రంట్ ఆలోచనల గురించి నాకు తెలియదు. ఒంటరిగా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన కేసీఆర్‌ను తక్కువ అంచనా వేయలేం. కేసీఆర్ చాలా మొండి వ్యక్తి. . కేసీఆర్ ఇంత మందితో మాట్లాడుతున్నారంటే ఏదో ఒకటి ఉంటుంది. #పదవీకాలం ముగిసినా గులాం నబీ ఆజార్‌కు ఢిల్లీలో ఇచ్చిన అధికారిక నివాసాన్ని పీఎంఓ లేఖతో కొనసాగిస్తున్నారు. ఆజాద్‌కు క్వార్టర్ ను కొనసాగించడం వెనక ఉన్న మతలబు ఏమిటి?’ అని ప్రశ్నించారు. -
ఇంజనీరింగ్‌లో అర్హులు.. 82.08%
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ఎంసెట్ ఫలితాలను విద్యామంత్రి సబితా ఇంద్రారెడ్డి బుధవారం విడుదల చేశారు. ఇంజనీరింగ్ విభాగంలో 82.08 శాతం.. అగ్రికల్చర్, మెడికల్ విభాగంలో 92.48 శాతం అర్హత సాధించారు. ఇంజనీరింగ్‌లో మొదటి పది మందిలో 9 మంది.. మెడికల్, అగ్రికల్చర్లో టాప్‌టెన్‌లో 8 మంది బాలురే. ఇంజనీరింగ్ విభాగంలో తొలి 10 ర్యాంకుల్లో ఆరింటిని ఆంధ్రప్రదేశ్ విద్యార్థులే కైవసం చేసుకోవడం విశేషం. అగ్రికల్చర్, మెడికల్ విభాగంలోనూ ఆ రాష్ట్రానికి టాప్ టెన్‌లో నాలుగు దక్కాయి. ఇదిలా ఉండగా, హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు చెందిన విద్యార్థులే ఎంసెట్ మొదటి పది ర్యాంకుల్లో ఎక్కువగా ఉన్నారు. ఇంటర్మీడియేట్ మార్కులను ఈసారీ వెయిటేజ్‌గా తీసుకోలేదు. ఇంటర్ సబ్జెక్టుల్లో కనీస మార్కుల అర్హత నిబంధనను ఎత్తివేశారు. ఎస్సీ, ఎస్టీలు మినహా కటాఫ్ మార్క్ 40గా నిర్ణయించారు. అంతా ఆన్లైన్లోనే.. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆదేశాల మేరకు.. జవహర్లాల్ నెహ్రూ టెక్నికల్ యూనివర్సిటీ హైదరాబాద్ (జేఎన్టీయూహెచ్) సంయుక్త భాగస్వామ్యంతో ఎంసెట్ నిర్వహించారు. బీటెక్ కోర్సు ల్లో ప్రవేశానికి పరీక్ష ఈ నెల 4, 5, 6 తేదీల్లో... వ్యవసాయ, నర్సింగ్ వంటి మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి పరీక్ష 9, 10 తేదీల్లో ఆన్లైన్ పద్ధతిలో జరిగింది. ఇంజనీరింగ్ ఎంసెట్‌కు దరఖాస్తు చేసిన వారిలో 89.71 శాతం, మెడికల్, అగ్రికల్చర్లో 91.19 శాతం విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. ‘సెట్’లో తెలంగాణనే ముందంజ: సబిత కోవిడ్ కష్టకాలంలోనే ఎంసెట్ నిర్వహించి, అన్ని రాష్ట్రాలకన్నా తెలంగాణనే ముందు వరుసలో ఉందని సబితా ఇంద్రారెడ్డి ఫలితాల వెల్లడి సందర్భంగా అన్నారు. గత మూడేళ్ల లెక్కను పరిశీలిస్తే.. ఈసారి ఎంసెట్‌కు 28 వేల మంది విద్యార్థులు అధికంగా హాజరయ్యారని తెలిపారు. విద్యా ప్రమాణాల మెరుగుకు ఇదే నిదర్శనమన్నారు. తెలంగాణ విద్యార్థులు ప్రతిభతో మరింత పురోభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జేఎన్టీయూహెచ్ వీసీ కట్టా నర్సింహారెడ్డి, ఎంసెట్ కన్వీనర్ గోవర్థన్, ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి, మాజీ చైర్మన్ పాపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అర్హత ఇలా... ఇంజనీరింగ్‌లో... ఎంసెట్‌కు దరఖాస్తు చేసుకున్న వారు : 1,64,963 పరీక్షకు హాజరైనవారు : 1,47,991 అర్హత పొందినవారు : 1,21,480 అగ్రికల్చర్, మెడికల్... దరఖాస్తులు చేసుకున్నవారు : 86,641 పరీక్షకు హాజరైనవారు : 79,009 అర్హత సాధించినవారు : 73,070 టాప్ 10 ర్యాంకర్లు వీరే... ఇంజనీరింగ్‌లో... విద్యార్థి జిల్లా మార్కులు సత్తి కార్తికేయ పాలకొల్లు(పశ్చిమగోదావరి) 158 దుగ్గినేని వెంకట ప్రణీత్ రాజంపేట(కడప) 156 మహ్మద్ అబ్దుల్ ముఖీత్ టోలిచౌకి, హైదరాబాద్ 156 రామస్వామి సంతోష్‌రెడ్డి పోచంపల్లి, నల్లగొండ 154 జోష్యుల వెంకట ఆదిత్య హైదర్‌నగర్, హైదరాబాద్ 154 పి. చేతన్ మనోజ్ఞసాయి పీలేరు, చిత్తూరు 154 ఎం. ప్రణయ్ విజయనగరం 153 దేశాయి సాయి ప్రణవ్ నెల్లూరు 152 ఎస్. దివాకర్‌సాయి విజయనగరం 152 ఎస్. సాత్విక రెడ్డి నల్లగొండ 152 అగ్రికల్చర్, మెడికల్... విద్యార్థి జిల్లా మార్కులు మండవ కార్తికేయ బాలానగర్, హైదరాబాద్ 151 ఈమని శ్రీనిజ పెద్దఅంబర్‌పేట, హైదరాబాద్ 150 టీ సాయి కౌశల్ రెడ్డి హైదరాబాద్ 150 రంగు శ్రీనివాస కార్తికేయ అనంతపురం, ఏపీ 150 చందం విష్ణు వివేక్ రాజమండ్రి, ఏపీ 149 కోలా పవన్ రాజు కాకినాడ, ఏపీ 149 కన్నెకంటి లాస్యా చౌదరి ఖమ్మం 149 పల్లి వెంకట కౌశిక్ రెడ్డి విజయవాడ, ఏపీ 148 రవి అభిరాం రంగారెడ్డి 148 బి రామకృష్ణ షాలిగౌరారం, నల్లగొండ 148 ఇంజనీరింగ్ ఫలితాల కోసం క్లిక్ చేయండి అగ్రికల్చర్&మెడికల్ ఫలితాల కోసం క్లిక్ చేయండి చదవండి : ప్లీజ్ వర్క్‌ఫ్రం హోం పెట్టండి! ఐటీ కంపెనీలకు ప్రభుత్వ విజ్ఞప్తి -
జంతర్‌మంతర్ దగ్గర కేసీఆర్ దీక్ష చేయాలి : రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ లేని వివాదాన్ని సృష్టిస్తున్నారని, తద్వారా రాజకీయ, ఆర్థిక లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ మహాజాదూ అని, ఆయన నీళ్ల నుంచి కూడా ఓట్లు సృష్టించగలరని వ్యాఖ్యానించారు. నిజంగా కృష్ణా జలాల వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కృష్ణా జలాల్లో రాష్ట్ర వాటా కోసం సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లు ఢిల్లీలోని జంతర్‌మంతర్ దగ్గర ఆమరణ నిరాహార దీక్ష చేయాలని, ఆ దీక్షకు కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ప్రకటిస్తుందని రేవంత్ చెప్పారు. ఆదివారమిక్కడ తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం తెచ్చిన జీవోలపై తాము ఫిర్యాదు చేసినప్పుడు స్పందించని కేసీఆర్ ఇప్పుడు ఏదో చేస్తానంటూ ప్రగల్భాలు పలుకుతున్నారని మండిపడ్డారు. కేసీ ఆర్ అనుమతి తీసుకున్న తర్వాతే ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రాయలసీమ ప్రాజెక్టును ప్రారంభించారన్నారు. ఈనెల 9న జరగాల్సిన కృష్ణా రివర్‌బోర్డు అపెక్స్ కమిటీ సమావేశాన్ని వాయిదా వేయాలని కోరడం సరైంది కాదన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీ మల్లురవి, మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, టీపీసీసీ నేతలు హర్కర వేణుగోపాల్, సిరిసిల్ల రాజయ్య, మెట్టు సాయికుమార్, చరణ్‌కౌశిక్ యాదవ్ పాల్గొన్నారు. రోశయ్యను కలిసిన రేవంత్ తాను టీపీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత రాష్ట్ర కాంగ్రెస్ నేతలను రేవంత్ రెడ్డి కలుస్తూనే ఉన్నారు. ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ గవర్నర్ రోశయ్య ఇంటికి వెళ్లారు. ఆయనతో మాట్లాడి ఆశీర్వాదం తీసుకున్నారు. అలాగే, పీజేఆర్ కుమారుడు, మాజీ ఎమ్మె ల్యే విష్ణువర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి గడ్డం వినోద్, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్, మాజీ ఎంపీ ఎం.ఎ. ఖాన్ , ఏఐసీసీ కిసాన్ సెల్ వైస్‌చైర్మన్ ఎం.కోదండరెడ్డి తదితరులను వారి నివాసానికి వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా రేవంత్ పలు చోట్ల మాట్లాడుతూ పార్టీ మారిన ఎమ్మెల్యేల గురించి తాను మాట్లాడితే చెప్పుతో కొడతామని కొందరు అంటున్నారని, వాళ్లకు చెప్పుల దండలు వేసి ఊరేగిస్తామని వ్యాఖ్యానించారు. సీఎల్పీ ఎవరబ్బ సొత్త ని టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేస్తారని ప్రశ్నించిన రేవంత్ ఈనెల 7 తర్వాత అందరి సంగతి చెపుతా మని, కార్యకర్తలతో ఉరికిచ్చి కొడతామన్నారు. -
14 నెలలుగా రైతు కుటుంబం గ్రామ బహిష్కరణ..
సాక్షి, వేల్పూరు(నిజామాబాద్): నిజామాబాద్ జిల్లా వేల్పూరు మండలం వాడిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గత 14 నెలలుగా అంకం కిషన్ అనే రైతు కుటుంబానికి గ్రామాభివృద్ధి కమిటీ గ్రామ బహిష్కరణ విధించింది. నిత్యావసరాలు పాలు నీళ్ళు బియ్యము కిరాణా వస్తువులు ఏవీ ఇవ్వకుండా ఆంక్షలు విధించింది. చెంగల్ అనే గ్రామంలో కిషన్ మేనల్లుడు కొనుగోలు చేసిన భూమి విషయంలో కిషన్ సాయం చేశారని గ్రామాభివృద్ధి కమిటీ కక్ష్య కట్టింది. ఈ కమిటీ కిషన్ కుటుంబానికి ఐదు లక్షల 20 వేల రూపాయల జరిమానా వేసింది. కిరాణా షాపుల్లో కనీసం పిల్లలకు పాల ప్యాకెట్లు కూడా ఇవ్వని దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి.. అత్త కోడళ్ళ కు బీడీ కార్ఖానాలలో పని ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారు. కిషన్ దంపతులు, ఇద్దరు కొడుకులు కోడళ్ళు నలుగురు పిల్లలు ఎనలేని కష్టాలు పడుతున్నారు. గ్రామాభివృద్ధి కమిటీ కట్టుబాట్లతో గ్రామస్తులు అందరూ సహాయ నిరాకరణ చేస్తున్నారు.14 నెలలుగా గ్రామంలో సహాయ నిరాకరణ కొనసాగుతోంది. వ్యవసాయంలో కూడా ఇబ్బందులు తలెత్తి ఐదు ఎకరాల జొన్న పంట కూడా నష్టపోయాం అని బాధితుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 14 నెలలుగా తీవ్ర మనస్థాపానికి గురైన బాధితులు…గ్రామ బహిష్కరణ ఎత్తి వేయించి తమకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్‌ను కలిసి వేడుకున్నారు. మరోవైపు వాడి గ్రామాన్ని యాదవ సంఘం జాతీయ అధ్యక్షుడు రాములు సంఘ ప్రతినిదులు సందర్శించి బాధితులను పరామర్శించారు. చదవండి: ఫోన్ సిగ్నల్ కోసం చెట్టెక్కిన పిల్లలు..కానీ ఇంతలోనే -
పీఎస్‌హెచ్‌ఎం పోస్టులు ఇచ్చేదెప్పుడో?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు (పీఎస్‌హెచ్‌ఎం) పోస్టులకు మోక్షం లభించడం లేదు. 10 వేల ప్రాథమిక పాఠశాలల్లో పీఎస్‌హెచ్‌ఎంలను నియమిస్తామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు మూడు నెలల కిందట ప్రకటించిన సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్ ప్రకటన నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రాథమిక పాఠశాలలు, ఆయా స్కూళ్లలో ఇప్పటికే ఉన్న హెడ్ మాస్టర్ పోస్టులు, తాజాగా ఇంకా ఎన్ని పోస్టులు మంజూరు చేయాలన్న అంశాలపై వివరాలను సేకరించింది. దీని ప్రకారం రాష్ట్రంలోని 18,217 ప్రాథమిక పాఠశాలల్లో 4,429 లో–ఫిమేల్ లిటరసీ (ఎల్ఎఫ్ఎల్) హెడ్ మాస్టర్ పోస్టులు ఉన్నట్లు తేల్చింది. సీఎం కేసీఆర్ 10 వేల స్కూళ్లలో హెడ్ మాస్టర్ పోస్టులను ఇస్తామని ప్రకటించిన నేపథ్యంలో మరో 5,571 పోస్టులను మంజూరు చేయాల్సి ఉంటుందని, ఏయే జిల్లాల్లో ఎన్ని పోస్టులను మంజూరు చేయాలన్న ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపింది. రెండు నెలలు గడుస్తున్నా ఇంతవరకు వాటిపై ఎలాంటి నిర్ణయం లేకుండాపోయింది. ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలల్లో ఉన్న 4,429 ప్రధానోపాధ్యాయ పోస్టులు పోగా, మిగతా పోస్టులను మంజూరు చేస్తారా? లేదంటే వాటికి అదనంగా కొత్తగా 10 వేల పోస్టులను మంజూరు చేస్తారా? అన్నది తేలాల్సి ఉంది. జిల్లాల వారీగా పోస్టులు జిల్లా పాత కొత్త మొత్తం పోస్టులు పోస్టులు ఆదిలాబాద్ 484 613 1,097 హైదరాబాద్ 168 205 373 కరీంనగర్ 562 709 1,271 ఖమ్మం 460 581 1,041 మహబూబ్‌నగర్ 580 731 1,311 మెదక్ 426 535 961 నల్లగొండ 500 629 1,129 నిజామాబాద్ 389 485 874 రంగారెడ్డి 369 466 835 వరంగల్ 491 617 1,108 మొత్తం 4,429 5,571 10,000 -
అర్లి(టి)లో చలి.. పొద్దెక్కని పల్లె
ఈ పల్లె కోడి కూయకముందే నిద్రలేస్తది.. రెండువారాలుగా ఉదయం 7 దాటినా.. ముసుగుతన్ని పడుకునే ఉంటోంది.. అర్లి(టి).. రాష్ట్రంలో అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న ప్రాంతం.. ఎప్పుడు చూసినా.. ఇక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు 4 డిగ్రీల లోపే.. మనమేమో 12 డిగ్రీలు ఉన్నా.. గజగజవణుకుతున్నాం.. ఈ నేపథ్యంలో అసలు అక్కడి జనమేం చేస్తున్నారు.. పరిస్థితి ఎలా ఉంది అని తెలుసుకోవడానికి ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలో ఉన్న అర్లి(టి) గ్రామంలో ‘సాక్షి’ బృందం శుక్రవారం ఉదయం నుంచి రాత్రి దాకా ‘ఫీల్డ్ విజిట్’ చేసింది. రాత్రిళ్లు నిద్ర కూడా పట్టడం లేదు పెన్‌గంగా పరీవాహక ప్రాంతం.. పైగా దగ్గరలో అటవీ ప్రాంతం కూడా ఉండటంతో అర్లి(టి)లో చలి బాగా ఉంది.. దారంతా చలిమంటలు.. అందరూ శాలువాలు, దుప్పట్లు, చద్దర్లు కప్పుకొనే కనిపించారు. మనుషులే కాదు.. పశువులు కూడా.. ఉదయం 7 గంటలు దాటాకే.. నెమ్మదిగా ఇళ్లల్లో నుంచి జనం బయటకు రావడం ప్రారంభించారు.. మామూలుగా తెలవారకముందే ఇంటి పనులు మొదలుపెట్టే మహిళలు, రైతన్నలు అప్పుడే పనులకు ఉపక్రమిస్తూ కనిపించారు. ఎలా ఉంది ఇక్కడ అని బిల్లావార్ లక్ష్మిని పలకరించాం.. ‘‘చలి బాగా ఉంది.. పనులు చేసుకోలేకపోతున్నాం.. రాత్రిళ్లు నిద్ర కూడా పట్టడం లేదు.. ఇంటి ముందు చలిమంట వేసుకుంటున్నాం.. ఉదయం లేచి పనులు చేయాలంటే.. చేతులు, కాళ్లు తిమ్మిరిపట్టినట్లు అవుతున్నాయి’’ అని చెప్పింది. ఇక చిన్నపిల్లలు, వృద్ధులు ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు.. చలిగాలులు లోపలికి రాకుండా కిటికీలు, తలుపులను టార్పాలిన్ కవర్ల ద్వారా మూసివేయించారు. పశువులకు గోనెసంచులు, దుప్పట్లు కప్పి ఉంచారు.. రైతులు, కూలీలు అయితే సాయంత్రం 4 అయ్యేసరికే ఇంటికి చేరుకున్నారు. తన జీవితంలోనే ఇంత చలిని ఎప్పుడూ చూడలేదని 90 ఏళ్ల వృద్ధురాలు సంద భూమక్క చెప్పింది. ‘10 రోజులుగా చలి విపరీతంగా పెడుతోంది. ఇంటి నుంచి బయటకు పోతలేను. రోజంతా దుప్పటి కప్పుకొనే ఉంటున్న’ అని తెలిపింది. ఉత్తరాది నుంచి శీతల గాలులు వీయడం వల్ల కూడా ఇక్కడ ఉష్ణోగ్రతలు మరింత పతనమవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. – తాంసి (ఆదిలాబాద్ జిల్లా), ఫొటోలు: చింతల అరుణ్‌రెడ్డి, సాక్షి ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్ -
పోలీసు ఉద్యోగం.. విద్యార్థులకు శుభవార్త
సాక్షి, హైదరాబాద్: పోలీసు శాఖలో ఉద్యోగం సంపాదించాలనుకునే విద్యార్థులకు శుభవార్త. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదివే విద్యార్థులకు ఇంటర్ విద్యాబోధనతో పాటు పోలీసుశాఖలో ఉద్యోగం సంపాధించేందుకు అవసరమైన అంశాల్లోనూ శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు పోలీసుశాఖతో ఇంటర్మీడియట్ బోర్డు ఓ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఇంటర్మీడియట్ ఇతర పోటీ పరీక్షలకు సంబంధించిన పాఠ్యాంశాల బోధనతో పాటు పోటీ పరీక్షలకు అవసరమైన జనరల్ నాలెడ్జ్, రీజనింగ్, ఇతర అంశాలతో పాటు రన్నింగ్, జంపింగ్ వంటి శారీరక ధృడత్వం వంటి అంశాలపై కూడా శిక్షణ ఇవ్వనుంది. ఇందుకు నగరంలోని ఏడు ఇంటర్మీడియట్ కాలేజీలను ఎంపిక చేసింది. ప్రస్తుతం ఇంటర్మీడియట్, డిగ్రీ స్థాయిలో ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ విభాగాల్లో విద్యార్థులను ఎంపిక చేసి, సామాజిక సేవా కార్యక్రమాలు, మానసిక, శారీరక క్రమశిక్షణ అంశాల్లో శిక్షణ ఇస్తున్న విషయం తెలిసిందే. తాజాగా పోలీసు విభాగంపై అవగాహన కల్పించాలని నిర్ణయించింది. తద్వారా విద్యార్థులు చిన్నతనంలో పక్కదారి పట్టకుండా ఉండటంతో పాటు పోలీసు వ్యవస్థపై అవగాహన ఏర్పడి, అటు వైపు ఆకర్షితులవుతారు. అంతేకాదు భవిష్యత్తులో ఆ శాఖలో ఉద్యోగాలు సంపాదించే అవకాశం ఉందని హైదరాబాద్ జిల్లా ఇంటర్మీడియట్ బోర్డు అధికారిని జయప్రదబాయి అభిప్రాయపడ్డారు. అంతేకాదు పోటీ పరీక్షల కోసం ప్రైవేట్ ఇనిస్టిట్యూషన్లను ఆశ్రయించాల్సిన అవసరం కూడా ఆయా విద్యార్థులకు ఉండదని ప్రకటించారు. ఆసక్తిగల అభ్యర్థులు శిక్షణ కోసం ఎంపిక చేసిన ఆయా కాలేజీల్లో సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉందని ఆమె సూ చించారు. (చదవండి: అనాథ బాలురకూ ఆశ్రయం!) శిక్షణ కోసం ఎంపిక చేసిన కాలేజీలు ఇవే... గన్‌ఫౌండ్రీ అలియా ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రభుత్వ మహబూబియా బాలికల కళాశాల మలక్‌పేట్ న్యూ జూనియర్ కాలేజీ నాంపల్లి ఎంఏఎం జూనియర్ కాలేజీ కాచిగూడ ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఫలక్‌నుమా బోయ్స్ జూనియర్ కాలేజీ మారేడ్‌పల్లి ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజీ -
రేపటి నుంచే ఆన్లైన్ పాఠాలు..
సాక్షి, హైదరాబాద్ : ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఆన్లైన్ పద్ధతిలో పాఠాలు బోధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. రేపటి నుంచి(మంగళవారం) తెలంగాణలో ఆన్లైన్ ద్వారా విద్యార్థులకు స్కూల్ పాఠాలు బోధించనున్నారు. టీశాట్, ఆన్లైన్ ద్వారా ఈ విద్యాబోధన కార్యక్రమం జరగనుంది. ఇప్పటికే జూబ్లీహిల్స్ టీ శాట్ టీవీ స్టూడియోలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా టీ శాట్ సీఈఓ శైలేష్ రెడ్డి సాక్షి టీవీతో మాట్లాడుతూ.. రేపటి నుంచి 10 తరగతిలోపు విద్యార్థులకు ఆన్లైన్ , టీవీల ద్వారా పాఠాలు బోధిస్తామని వెల్లడించారు. (ఫస్ట్ నుంచి ఆన్లైన్ పాఠాలు) టీశాట్ తీశాట్, తీశాట్ నిపుణ రెండు చానల్స్, వెబ్ సైట్, ఆన్లైన్ డిజిటల్, మొబైల్ యాప్ ద్వారా పాఠాలు చెప్పనున్నట్లు వెల్లడించారు.విద్యార్థుల సందేహాలు నివృత్తి చేయడానికి పాఠాలను సాయంత్రం వేళల్లో తిరిగి ప్రసారం చేస్తామని తెలిపారు. ఎక్కడ ఇబ్బందులు అనేవి ఉండవని, పవర్ కట్ ప్రాంతాల్లో మళ్ళీ పాఠ్యంశాలను తిరిగి ప్రసారం చేస్తామని, ప్రభుత్వం ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ప్రసారాలు ఉంటాయని శైలేష్ రెడ్డి వెల్లడించారు. -
51వ వారం మేటి చిత్రాలు