సాక్షి, హైదరాబాద్: కేంద్రమంత్రి బండి సంజయ్ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు పొలిటికల్ కౌంటరిచ్చారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయంలోనే కదా ఓటుకు నోటు కేసు నమోదు చేసి విచారణ పూర్తి చేయలేకపోయింది. ఇది మీ ప్రభుత్వ వైఫల్యం కాదా? అని ప్రశ్నించారు.
కాగా, బండి సంజయ్ ట్విట్టర్ వేదికగా..‘ఓటుకు నోటు కేసు నమోదు చేసి విచారణ పూర్తి చేయలేకపోయింది గత మీ ప్రభుత్వమే కేటీఆర్. 2015 నుంచి కేసును పూర్తి చేయడంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం విఫలమైంది. ట్విట్టర్‌లో స్టార్ డం కోసం కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని లాగుతున్నారు. మీరు నిజంగా న్యాయం జరగాలని కోరుకుంటే ఓటుకు నోటు కేసును సీబీఐకి లేదా ఈడీకి బదిలీ చేసి ఉండాల్సింది. కేటీఆర్ వ్యవహారం రాహుల్ గాంధీ లేని లోటు భర్తీ చేస్తున్నట్లు ఉంది’ అంటూ ఎద్దేవా చేశారు.
Welcome Home K T Rama Rao garu..
Jet Lag & whatever you had seems to be taking toll on you..
ACB registered the Cash for vote case, and your inefficient BRS govt couldn't defend it for years.
Since 2015, your incompetent govt has failed to finish the trial.
Now, for optics…— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) September 15, 2024
ఇదిలా ఉండగా.. అంతకుముందు బండి సంజయ్‌పై కేటీఆర్ కీలక కామెంట్స్ చేశారు. ‘బీజేపీ అధికారంలోకి వచ్చి ఉంటే కేసీఆర్‌ను జైల్లో వేసేవాళ్లం. అంకుశం సినిమాలో రాంరెడ్డి లాగా గుంజుకుపోయేటోళ్లం’ అంటూ బండి సంజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు. ఈ సందర్భంగా కేటీఆర్..‘బీఆర్ఎస్ నాయకులను, ముఖ్యంగా కేసీఆర్ గారిని జైల్లో పెట్టడం పట్ల మీకున్న అత్యుత్సాహాన్ని నేను అర్థం చేసుకోగలను. కానీ ఓటుకు నోటు స్కామ్‌లో కెమెరాకు చిక్కిన వ్యక్తి ఇప్పటికీ స్వేచ్ఛగా ఎలా తిరుగుతున్నాడో చెప్పండి! మీరు ప్రశ్నించలేదు. బహుశా బడే భాయ్ (ప్రధాని మోదీ), ఛోటే భాయ్ (సీఎం రేవంత్) మధ్య సంబంధాన్ని మీరు ఇంకొంచెం ఎక్కువగా దర్యాప్తు చేయాలేమో కదా?. కొన్నేళ్లుగా అన్ని సాక్ష్యాలు స్పష్టంగా బయటకు కనిపిస్తున్నప్పటికీ ఛోటే భాయ్ ఎందుకు జైలులో లేడు!. ఇన్నాళ్లూ కేంద్రంలో అధికారంలో ఉన్నది బీజేపీ కాదా?. మిమ్మల్ని ఆపేది ఏది? ఎవరు? అంటూ ప్రశ్నించారు.
ఇది కూడా చదవండి: ఎమ్మెల్యే గాంధీ ఇంటి వద్ద భారీగా పోలీసులు
Comments
Please login to add a commentAdd a comment