సాక్షి,హైదరాబాద్: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మంగళవారం(అక్టోబర్ 29) రిప్లై ఇచ్చారు. లీగల్ నోటీసుకుగాను కేటీఆర్‌కు కౌంటర్ నోటీసు పంపించారు. తాను చేసిన వ్యాఖ్యల్లో ఎక్కడా తప్పులేదని బండిసంజయ్ తన రిప్లైలో స్పష్టం చేశారు.
రాజకీయ విమర్శలకు లీగల్ నోటీసు ఇవ్వడాన్ని తప్పుబట్టారు. లీగల్ నోటీసు అంటూ బెదిరిస్తే భయపడేది లేదన్నారు. తనపై చేసిన ఆరోపణలను వెనక్కి తీసుకోవాలని కేటీఆర్‌ను కోరారు. కేటీఆర్ తనకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
కాగా, ఇటీవల బండి సంజయ్ గ్రూప్ వన్ అభ్యర్థులతో కలిసి ఆందోళనల్లో పాల్గొని అరెస్టయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి బండి సంజయ్‌ని చర్చలకు పిలిచారు. దీనిపై కేటీఆర్ స్పందిస్తూ చదువులేని బండిసంజయ్‌ని గ్రూప్‌వన్‌పై చర్చలకు పిలిస్తే ఏం లాభం అని విమర్శించారు. రేవంత్, బండి సంజయ్ కలిసి డ్రామా చేస్తున్నారని ఆరోపించారు.
దీనికి ఆగ్రహించిన బండి సంజయ్ కేటీఆర్‌పై వ్యక్తిగతంగా పలు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకుగాను బండిసంజయ్‌కి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. తనపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని లేదంటే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు.
ఇదీ చదవండి: కాంగ్రెస్, బీజేపీ మధ్య క్విడ్ ప్రో కో
Comments
Please login to add a commentAdd a comment