legal notice
-
మరికాసేపట్లో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు అల్లు అర్జున్
-
మహిళా కూలీలకు నోటీసులు
రామచంద్రపురం రూరల్ : వ్యవసాయ కూలీలకు అందులోనూ మహిళలకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ లీగల్ నోటీసులు పంపించారు. ఈ అంశం రామచంద్రపురం నియోజకవర్గంలో తీవ్ర చర్చనీయాంశమైంది. రోజువారీ కూలిపని చేసుకునే మహిళలకు మంత్రి నోటీసులు పంపడంపై ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇది పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా ఉందని.. మంత్రి చేసిన పని సరైంది కాదని వారంటున్నారు. వివరాలివీ..డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలోని తాళ్లపొలెం గ్రామ సర్పంచ్ కట్టా గోవిందుకు, ఆయన ఆడపడుచులకు కొంతకాలంగా 2.40 ఎకరాల పంట భూమి విషయమై కోర్టులో వివాదం నడుస్తోంది. కోర్టులో వివాదం సాగుతున్నప్పటికీ సర్పంచ్ కట్టా గోవిందు స్వాధీనంలోనే భూమి ఉంది. ఆయనే పంటలు పండించుకుంటున్నారు. అదే భూమిలో కొంతభాగం ఇటీవల మంత్రి అనుచరుడు దొంగల శ్రీధర్, అతని భార్య దొంగల సునీత పేరున రిజిస్టర్ అయ్యింది. ఇటీవల సర్పంచ్ గోవిందు పంట కోసుకోగా దానిపై ద్రాక్షారామ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ కేసులో కట్టా గోవిందు, అతని సోదరి జానకమ్మ, మేడిశెట్టి ఇజ్రాయేలుతో పాటు 8 మంది వ్యవసాయ కూలీలు అందులోనూ మహిళలపై అక్రమంగా పంట కోసుకుపోయారని ఒక కేసు నమోదైంది. దీనిపై గతనెల 24న రామచంద్రపురం తహసీల్దార్ కార్యాలయం వద్ద మీడియా సమక్షంలో అక్రమ కేసులు ఎత్తివేయాలని బాధితులు డిమాండ్ చేశారు. ఎవరైతే పోలీసు కేసులో ఉన్నారో అదే వ్యవసాయ కూలీలకు మంత్రి సుభాష్ లీగల్ నోటీసులు పంపారు. వారు మీడియాతో మాట్లాడటంవల్ల తన పరువుకు భంగం కలిగిందని.. వారిపై సివిల్, క్రిమినల్ చర్యలు చేపడతామంటూ ఇచ్చిన ఆ నోటీసులను చూసి కూలీలు లబోదిబోమంటున్నారు. తమను ఇబ్బంది పెట్టవద్దని మంత్రి సుభాష్‌ను వారు కోరుతున్నారు. -
నిమ్మరసం, పచ్చిపసుపుతో క్యాన్సర్‌కు చెక్? సిద్ధూకి రూ. 850 కోట్ల లీగల్ నోటీసు
మాజీ క్రికెటర్, పంజాబ్ కాంగ్రెస్ మాజీ చీఫ్‌కి నవజ్యోత్ సింగ్ సిద్ధూకి భారీ షాక్ తగిలింది. అల్లోపతి మందులు లేకుండానే తన భార్య 4వ దశ క్యాన్సర్ నుంచి అద్భుతంగా కోలుకుందన్న వ్యాఖ్యలపై ఛత్తీస్‌గఢ్ సివిల్ సొసైటీ ఆగ్రహం వ్యక్తం చేసింది.వారం రోజుల్లోగా సిద్ధూ భార్య నవజ్యోత్ కౌర్ సిద్ధూ క్యాన్సర్ చికిత్సకు సంబంధించిన పత్రాలను సమర్పించాలని లీగల్ నోటీసులిచ్చింది. లేనిపక్షంలో రూ.850 కోట్ల పరిహారం చెల్లించాలంటూ నోటీసులిచ్చింది. అంతేకాదు సిద్ధూ వ్యాఖ్యలు క్యాన్సర్ బాధితులను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని, క్షమాపణలు చెప్పాలని కోరింది.డైట్ కంట్రోల్ వల్ల తన భార్య నవజ్యోత్ కౌర్‌కు స్టేజ్-4 క్యాన్సర్ (రొమ్ము క్యాన్సర్) నయమైందంటూ సిద్ధూ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. పాలు, చక్కెర పదార్థాలకు దూరంగా ఉంటూ, నిమ్మరసం, పచ్చిపసుపు, వేప, తులసి లాంటి పదార్థాలతో కేవలం 40 రోజుల్లోనే తన భార్య వైద్యపరంగా క్యాన్సర్‌ను జయించిందని మీడియా సమావేశంలో వెల్లడించారు. తాజాగా దీనిపై సివిల్ సొసైటీ తీవ్రంగా మండిపడింది. సిద్ధూ వాదనలు సందేహాస్పదమైనవి, తప్పుదారి పట్టించేవిగా ఉన్నాయని, ఇది క్యాన్సర్‌తో పోరాడుతున్న ఇతరులకు ప్రమాదకరంగా మారుతుందని సొసైటీ కన్వీనర్ డాక్టర్ కులదీప్ సోలంకి ఒక ప్రకటనలో తెలిపారు.కాగా పలువురు వైద్య నిపుణులు, ఆంకాలజిస్టులు కూడా సిద్ధూ వ్యాఖ్యల్ని ఖండించారు. సిద్ధూ వ్యాఖ్యలకు శాస్త్రీయంగా ఎలాంటి ఆధారాలు లేవని టాటా మెమోరియల్ ఆసుపత్రి కూడా ప్రకటించింది. కేవలం శస్త్రచికిత్స, రేడియేషన్ థెరపీ, కీమోథెరపీ వంటి నిరూపితమైన చికిత్సలతోనే క్యాన్సర్‌ను నయం చేయవచ్చని తెలిపింది. అయితే దీనిపై స్పందించిన నవజ్యోత్ సింగ్ సిద్ధూ డైట్ ప్లాన్‌ను వైద్యులతో సంప్రదించి అమలు చేశామని ,"చికిత్సలో సులభతరం"గా పరిగణించాలని సోమవారం తెలిపాడు. మరి తాజా నోటీసులపై ఎలా స్పందిస్తాడో వేచి చూడాలి. ఇదీ చదవండి: ఐశ్వర్య డ్రెస్సింగ్‌పై దారుణంగా ట్రోలింగ్ : ‘బచ్చన్’ పేరు తీసేసినట్టేనా? -
లీగల్ నోటీసులపై బండి సంజయ్ డిమాండ్
-
కేటీఆర్ లీగల్ నోటీసులకు బండి సంజయ్ కౌంటర్
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మంగళవారం(అక్టోబర్ 29) రిప్లై ఇచ్చారు. లీగల్ నోటీసుకుగాను కేటీఆర్‌కు కౌంటర్ నోటీసు పంపించారు. తాను చేసిన వ్యాఖ్యల్లో ఎక్కడా తప్పులేదని బండిసంజయ్ తన రిప్లైలో స్పష్టం చేశారు.రాజకీయ విమర్శలకు లీగల్ నోటీసు ఇవ్వడాన్ని తప్పుబట్టారు. లీగల్ నోటీసు అంటూ బెదిరిస్తే భయపడేది లేదన్నారు. తనపై చేసిన ఆరోపణలను వెనక్కి తీసుకోవాలని కేటీఆర్‌ను కోరారు. కేటీఆర్ తనకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.కాగా, ఇటీవల బండి సంజయ్ గ్రూప్ వన్ అభ్యర్థులతో కలిసి ఆందోళనల్లో పాల్గొని అరెస్టయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి బండి సంజయ్‌ని చర్చలకు పిలిచారు. దీనిపై కేటీఆర్ స్పందిస్తూ చదువులేని బండిసంజయ్ని గ్రూప్‌వన్‌పై చర్చలకు పిలిస్తే ఏం లాభం అని విమర్శించారు. రేవంత్, బండి సంజయ్ కలిసి డ్రామా చేస్తున్నారని ఆరోపించారు.దీనికి ఆగ్రహించిన బండి సంజయ్ కేటీఆర్‌పై వ్యక్తిగతంగా పలు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకుగాను బండిసంజయ్‌కి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. తనపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని లేదంటే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు.ఇదీ చదవండి: కాంగ్రెస్, బీజేపీ మధ్య క్విడ్ ప్రో కో -
కేటీఆర్ లీగల్ నోటీసుకు బండి సంజయ్ కౌంటర్
-
కేటీఆర్ లీగల్ నోటీసులు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: లీగల్ నోటీసుతో భయపెట్టాలని చూస్తే ఇక్కడ భయపడే వారెవరూ లేరు అంటూ కేటీఆర్‌కు కౌంటరిచ్చారు కేంద్రమంత్రి బండి సంజయ్. ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ కేసు వ్యవహారంలో ఏం జరిగిందో, ఆ కేసులను ఏ విధంగా నీరుగార్చారో తెలుసు అంటూ కామెంట్స్ చేశారు.మాజీ మంత్రి కేటీఆర్ తనకు పంపిన లీగల్ నోటీసులపై బండి సంజయ్ స్పందించారు. ఈ క్రమంలో బండి సంజయ్..‘కేటీఆర్ నాకు లీగల్ నోటీసు పంపినట్లు మీడియాలో చూశాను. లీగల్ నోటీసుతో భయపెట్టాలని చూస్తే ఇక్కడ భయపడే వారెవరూ లేరు. నన్ను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేక లీగల్ నోటీస్ ఇవ్వడం చూస్తుంటే జాలేస్తోంది. తాటాకు చప్పళ్లకు భయపడేది లేదు. నాపై తొలుత వ్యక్తిగత ఆరోపణలు చేసి అవమానించింది కేటీఆరే. అందుకు బదులుగానే నేను మాట్లాడాను. ఆయన మంచి వాడు అనుకుంటన్నాడు. ఆయన భాగోతం ప్రజలకు తెలుసు. ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ కేసు వ్యవహారంలో ఏం జరిగిందో, ఆ కేసులను ఏ విధంగా నీరుగార్చారో తెలుసు. ఇప్పటి వరకు మాటకు మాటతోనే బదులిచ్చాను. లీగల్ నోటీసులకు నోటీసులతోనే బదులిస్తా. మేం చట్టాన్ని, న్యాయాన్ని గౌరవించే వ్యక్తులం. చట్టం, న్యాయం ప్రకారం కూడా ముందుకు వెళ్తాం’ అంటూ కామెంట్స్ చేశారు.అలాగే, కేటీఆర్ నోటీసులపై తెలంగాణ బీజేపీ నేతలు కూడా స్పందించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ.. బండి సంజయ్‌కు కేటీఆర్ లీగల్ నోటీసు ఇవ్వడాన్ని ఖండిస్తున్నాను. లీగల్ నోటీసులతో కేటీఆర్ రాజకీయ జీవితానికి చరమ గీతం పడటం ఖాయం. దద్దమ్మ, సన్యాసి అంటూ కేసీఆర్, కేటీఆర్ కొన్ని వందల సార్లు మాట్లాడారు. బీఆర్ఎస్ నేతలు పారిపోయే రోజులు వచ్చాయి. లీగల్ నోటీసులతో ఆట మీరు మొదలుపెట్టారు. రోజు లీగల్ నోటీసులు అందుకోవడానికి కేటీఆర్ సిద్ధంగా ఉండాలి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.ఇదే సమయంలో బీజేపీ ఎస్సీ మోర్చ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎస్.కుమార్ మాట్లాడుతూ..‘లీగల్ నోటీసులకు బండి సంజయ్ భయపడరు. బండి సంజయ్‌ను ఎన్నో సార్లు కేసీఆర్, కేటీఆర్ అవమానించారు. భాషను మార్చుకోవాలని బీఆర్ఎస్ నేతలకు సూచించారు. కేసులు పెట్టినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం’ అంటూ చెప్పుకొచ్చారు. -
కేటీఆర్‌కు సృజన్ రెడ్డి లీగల్ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: అమృత్ పథకం టెండర్ల విషయంలో తనపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కేటీఆర్‌కు సృజన్ రెడ్డి లీగల్ నోటీసులు ఇచ్చారు. తన పరువుకు భంగం కలిగించేలా వ్యాఖ్యలుచేసినందుకు కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీకి నోటీసులు అందించారు. తప్పుడు వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని సృజన్ రెడ్డి డిమాండ్ చేశారుకాగా రేవంత్ రెడ్డి ఆధీనంలో ఉన్న పురపాలక శాఖ ద్వారా కేంద్రం అమలు చేస్తున్న అమృత్ టెండర్ల విషయంలో భారీగా అక్రమాలకు పాల్పడ్డారని కేటీఆర్ ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డి తన అధికారాన్ని అడ్డుపెట్టుకొని బంధువులకు మోసపూరితంగా వందల కోట్ల రూపాయల కాంట్రాక్టులు దక్కేలా చేశారని ఆయన ఆరోపించారు.రేవంత్ రెడ్డి కుటుంబానికి సంబంధించి అర్హత లేని కంపెనీలకు కాంట్రాక్టుల కేటాయింపులో జరిగాయని ఆరోపించారు. సీఎం బావమరిది సృజన్‌రెడ్డికి చెందిన సంస్థకు ఏకంగా రూ.8,888కోట్ల విలువైన టెండర్‌ను అక్రమంగా కట్టబెట్టారని ఆరోపించారు. అయితే కేటీఆర్ చేసిన ఆరోపణలను కాంగ్రెస్ నేతలతో పాటు, బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి ఖండించారుఅమృత్ టెండర్లపై కేటీఆర్‌కుు ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారని అన్నారు. సృజన్ రెడ్డి రేవంత్ రెడ్డికి సొంత బావమరిది కాదని, తనకు అల్లుడని తెలిపారు. సృజన్ రెడ్డికి రాజకీయాలతో సంబంధం లేదని అన్నారు. వ్యాపారంలో జాయింట్ వెంచర్లు సహజమని, అమృత్ టెండర్లలోనూ అదే జరిగిందని పేర్కొన్నారు. -
సీబీఐ చేతికి బాబు కేసులు?
-
కేసీఆర్ కు సీతక్క లీగల్ నోటీసులు
-
కేసీఆర్‌కు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: మాజీ సీఎం కేసీఆర్‌కు, బీఆర్ఎస్ పార్టీకి మంత్రి సీతక్క లీగల్ నోటీసులు ఇచ్చారు. బీఆర్ఎస్ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారని సీతక్క నోటిసులు జారీ చేశారు. ‘ఇందిరమ్మ రాజ్యం.. ఇసుకాసురుల రాజ్యం’ వీడియో ప్రతిష్టకు భంగం కలిగేలా ఉందని సీతక్క ఆరోపణ.వంద కోట్లకు పరునష్టం దావా వేసిన మంత్రి సీతక్క.. బేషరతుగా లిఖిత పూర్వక క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. జూన్ 24వ తేదీన బీఆర్ఎస్ అధికారిక సోషల్ మీడియా పేజీలో పోస్టులు పెట్టారు. నిరాధార ఆరోపణలు చేశారని, ఇది పద్దతి కాదని ఆమె పేర్కొన్నారు. -
హీరోయిన్ కరీనా కపూర్ పై సీరియస్ !..నోటీసులు జారీ చేసిన కోర్టు..
-
మంత్రి కేటీఆర్‌కు సుకేశ్ లీగల్ నోటీసు
సాక్షి, న్యూఢిల్లీ: ట్విట్టర్ వేదికగా తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలు ఉపసంహరించుకుని బేషరతుగా క్షమాపణలు చెప్పాలంటూ మంత్రి కేటీఆర్‌కు మండోలి జైలులో మనీలాండరింగ్ నిందితుడు సుకేశ్ చంద్రశేఖర్ లీగల్ నోటీసు పంపారు. రోగ్, నోటెడ్ క్రిమినల్, ఫ్రాడ్ అంటూ చేసిన వ్యాఖ్యలు తనను కించపరిచేలా ఉన్నాయంటూ అనంతరం లీగల్ అడ్వొకేట్, సొలిసిటర్స్ ద్వారా నోటీసుఇచ్చారు. రాజకీయ, సినిమా వ్యాపార రంగాల్లో తనకు మంచి పేరుందని, అయితే కేటీఆర్ వ్యాఖ్యలతో తన సర్కిల్లో కీర్తిప్రతిష్టలు దెబ్బతిన్నాయని సుకేశ్ ఆరోపించారు. వారంలోగా తనపై చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకుని క్షమాపణలు చెప్పకుంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఆ నోటీసులో పేర్కొన్నారు. -
కాశ్మీర్ ఫైల్స్‌పై అనుచిత వ్యాఖ్యలు.. సీఎం మమతకు లీగల్ నోటీసులు
ముంబై: ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా దేశంలో రాజకీయంగా ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా అదే కోవలోకి ఇటీవలే విడులైన ది కేరళ స్టోరీ కూడా చేరింది. ఈ నేపథ్యంలో మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టే అవకాశం ఉందని పలు రాష్ట్రాలు ‘ది కేరళ స్టోరీ’ సినిమాను బ్యాన్ చేశాయి. ఇక, పశ్చిమ బెంగాల్లో కూడా ఈ సినిమాను బ్యాన్ చేసింది తృణముల్ కాంగ్రెస్ సర్కార్. ఈ క్రమంలో సీఎం మమతా బెనర్జీ సంచలన కామెంట్స్ చేశారు. ఈ రెండు సినిమాలపై మమత స్పందిస్తూ.. "ది కాశ్మీర్ ఫైల్స్" అంటే ఏమిటి? అది ఒక వర్గాన్ని కించపరచడమే. "ది కేరళ స్టోరీ" అంటే ఏమిటి?.. ఇది వక్రీకరించిన కథ అంటూ సీరియస్ అయ్యారు. అందుకే కేరళ స్టోరీ సినిమాను బ్యాన్ చేసినట్టు తెలిపారు. What is "The Kashmir Files"? it is to humiliate one section. What is "The Kerala Story"?... It is a distorted story: West Bengal CM Mamata Banerjee pic.twitter.com/yRFwhlumum — ANI (@ANI) May 8, 2023 కాగా, మమత బెనర్జీ వ్యాఖ్యలపై బాలీవుడ్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి సీరియస్ అయ్యారు. దీంతో, మమతకు లీగల్ నోటీస్ పంపించారు. తన ‘కశ్మీర్ ఫైల్స్’ సినిమాపై మమతా బెనర్జీ అనుచిత వ్యాఖ్యలు చేశారని, అందుకే తాను ఆమెకు లీగల్ నోటీస్ పంపించానని అగ్నిహోత్రి తెలిపారు. తాను తీసిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాతోపాటు తన రాబోయే మరో సినిమా కూడా పశ్చిమబెంగాల్లో హింసాకాండను ఆధారంగా తీసుకుని తీస్తున్నవేనని సీఎం మమత ఆరోపిస్తున్నారని, కానీ ఆ ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదన్నారు. అంతా తప్పుడు ప్రచారమని అగ్నిహోత్రి విమర్శించారు. తన సినిమాలకు బీజేపీ నిధులు సమకూరుస్తున్నదని కూడా మమత ఆరోపించారని, అది కూడా తప్పుడు ఆరోపణేనని అన్నారు. BREAKING: I have, alongwith @AbhishekOfficl & Pallavi Joshi, sent a LEGAL NOTICE to the Chief Minister, Bengal @MamataOfficial for her false & highly defamatory statements made with malafide intention to defame us & our films #TheKashmirFiles & upcoming 2024 film #TheDelhiFiles. pic.twitter.com/G2SjX67UOB — Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) May 9, 2023 ఇది కూడా చదవండి: The Kerala Story: యోగి ఆదిత్యనాథ్ సర్కార్ కీలక నిర్ణయం -
కేటీఆర్ లీగల్ నోటీసులపై రేవంత్‌రెడ్డి కౌంటర్
సాక్షి, హైదరాబాద్: మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులపై టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి రిప్లై ఇచ్చారు. ఈ సందర్భంగా నోటీసులకు నోటీసులతోనే కౌంటర్ ఇచ్చారు. తనకిచ్చిన లీగల్ నోటీసులు వెనక్కి తీసుకోకపోతే క్రిమినల్ చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమమే ఉద్యోగాల కేంద్రంగా జరిగిందన్నారు. తెలంగాణ ఉద్యమంతో కేటీఆర్‌కు సంబంధం లేదని.. ఆసమయంలో ఆయన దేశంలో లేనందున ఆ బాధ తెలియదని అన్నారు. టీఎస్పీఎస్సీకి టెక్నికల్ సపోర్ట్ అంతా ఐటీశాఖ అందిస్తోందని ఆరోపించారు. అలాంటప్పుడు కేటీఆర్ తనకు సంబంధం లేదని ఎలా చెబుతారని ప్రశ్నించారు. నేరారోపణలు ఎదుర్కొంటున్న రాజశేఖర్ రెడ్డి నియామకం కూడా ఐటీశాఖ ద్వారానే జరిగిందన్నారు. టీఎస్పీఎస్సీ ఉద్యోగాల విషయంలో నిరుద్యోగుల తరపున మాట్లాడానని చెప్పారు. పేపర్ లీకేజీపై హైకోర్టులో పిటిషన్ వేశామని.. ఈడీ, సీబీఐకి ఫిర్యాదు చేశామని తెలిపారు. కాగా తనపై తప్పుడు ఆరోపణలు చేశారని టీపీసీసీ రేవంత్ రెడ్డికి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించిన విషయం తెలిసిందే. తనపై చేసిన ఆరోపణలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని లేకుంటే రూ.100 కోట్ల పరువు నష్టం దావా ఎదుర్కోవాల్సి వస్తుందని కేటీఆర్ తన నోటీసుల్లో పేర్కొన్నారు. చదవండి: బండి సంజయ్ చొరవ.. బీజేపీ కార్యాలయ సిబ్బందిని కలిసిన మోదీ -
క్షమాపణ చెప్పే ప్రసక్తే లే
సాక్షి, హైదరాబాద్: మంత్రి కేటీఆర్‌కు క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని, ఆయన ఇచ్చానని చెబుతున్న నోటీసును లీగల్‌గానే ఎదుర్కొంటామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టంచేశారు. తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించినందుకు క్షమాపణ చెప్పకపోతే రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేస్తానని కేటీఆర్ లీగల్ నోటీస్ ఇచ్చినట్లు తాను కూడా పత్రికల్లోనే చూశానని అన్నారు. ఇలాంటి ఉడుత బెదిరింపులకు బెదిరిపోయేది లేదని లీగల్ నోటీసుపై న్యాయపరంగానే పోరాడతామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు జారీ స్కాం మొదలు పేపర్ లీకేజ్ దాకా ఐటి శాఖ మంత్రే బాధ్యత వహించాలి. నాలాలో పడి పిల్లలు చనిపోయిన దగ్గర నుండి కుక్కల దాడిలో పసిపిల్లల చావు వరకు మున్సిపాలిటీ శాఖ మంత్రే బాధ్యత వహించి రాజీనామా చేయాలి’అని డిమాండ్ చేశారు. నీ పరువు సరే.. వారి భవిష్యత్‌కు మూల్యమేంటి కేటీఆర్ పరువు విలువ రూ.100 కోట్లయితే తెలంగాణలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న 30 లక్షల మంది యువత భవిష్యత్ వారి పాలనలో ప్రశ్నార్థమైందని సంజయ్ ఆందోళన వ్యక్తం చేశారు. మరి వారికెంత మూల్యం చెల్లిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. పరువు నష్టం పేరుతో కూడా డబ్బులు సంపాదించాలనుకోవడం సిగ్గుచేటు అని పేర్కొన్నారు. ‘సిట్ విచారణ అంశాలు అసలు కేటీఆర్‌కి ఎలా లీక్ అవుతున్నాయి. మొదట ఇద్దరు మాత్రమే నిందితులన్న కేటీఆర్ పదుల సంఖ్యలో అరెస్టులు జరుగుతుంటే ఎందుకు నోరు విప్పడం లేదు? ఇద్దరు మాత్రమే దోషులంటూ కేసును నీరుగార్చేందుకు యత్నించిన కేటీఆర్‌పై ఎందుకు క్రిమినల్ కేసులు పెట్టలేదో పోలీసులు సమాధానం చెప్పాలి. ప్రశ్నాపత్రాలు పత్రాల లీకేజీ విచారణను ప్రభావితం చేసే విధంగా మాట్లాడుతున్న ఆయనకు సిట్ ఎందుకు నోటీసులు ఇవ్వలేదో జవాబివ్వకుండా తప్పిదాలను ప్రశ్నిస్తున్న మాపై చర్యలు తీసుకుంటామంటూ బెదిరిస్తారా? సిట్ బెదిరింపులకు బెదిరేది లేదు’అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. చదవండి: రాజకీయ నేతలు, సినీ సెలబ్రిటీల ఫోటోలు మార్ఫింగ్.. 8 మంది అరెస్ట్ కేటీఆర్‌కు వందల కోట్లు ఎలా వచ్చాయ్? తెలంగాణ ఉద్యమానికి ముందు అమెరికాలో ఉద్యోగ స్థాయి నుంచి నేడు వందల కోట్ల ఆస్తులు ఎలా సంపాదించారో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి’అని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ‘పేపర్ లీకేజీతో నష్టపోయిన విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు,. కేటీఆర్ మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తాం. ప్రశ్నాపత్రాల లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించే దాకా, నష్టపోయిన నిరుద్యోగులకు రూ. లక్ష చొప్పన పరిహారం అందించే వరకు బీజేపీ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తాం’అని ప్రభుత్వాన్ని హెచ్చరించారు..‘ప్రధాని స్థాయిని, వయసును కూడా చూడకుండా విమర్శించడం కేసీఆర్ కొడుకు కుసంస్కారానికి నిదర్శనం. ప్రశ్నాపత్రాలు లీకేజీ అంశాన్ని ఒక సాధారణ అంశంగా మలిచేందుకు మంత్రులంతా ప్రయత్నం చేస్తున్నారు’అని మండిపడ్డారు. ‘కేటీఆర్ ఓ ఒక స్వయం ప్రకటిత మేధావి. నాలుగు ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడగానే అపరజ్ఞానిలా భావిస్తున్నాడు. ప్రశ్నిస్తే తట్టుకోలేని మూర్ఖుడు. పాలనలోని తప్పులను ఎత్తిచూపితే సహించలేని అజ్ఞాని’అని సంజయ్ ధ్వజమెత్తారు. -
మాధురి దీక్షిత్‌పై అవమానకర కామెంట్స్.. నెట్‌ఫ్లిక్స్‌కు లీగల్ నోటీసులు
అమెరికన్ సిట్ కామ్ 'ది బిగ్ బ్యాంగ్ థియరీ' సిరీస్ ప్రస్తుతం బి-టౌన్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఇందులోని ఓ ఎపిసోడ్లో బాలీవుడ్ బ్యూటీ మాధురి దీక్షిత్‌ను కించపరిచారంటూ ఇప్పటికే ఎంపీ, బాలీవుడ్ నటి జయబచ్చన్ విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో మరో పొలిటిషియన్ తాజాగా నెట్‌ఫ్లిక్స్‌కు లీగల్ నోటీసులు పంపి షాకిచ్చాడు. ‘ది బిగ్ బ్యాంగ్ థియరీ’లోని ఒక ఎపిసోడ్లో మాధురీ దీక్షిత్‌ను సూచించేందుకు అవమానకరమైన పదాన్ని వినియోగించారని రాజకీయ విశ్లేషకుడు మిథున్ విజయ్ కుమార్ మండపడ్డారు. చదవండి: బిగ్‌బాస్ 7లోకి బుల్లితెర హీరో అమర్దీప్.. క్లారిటీ ఇచ్చిన నటుడు వెంటనే ఆ ఎపిసోడ్‌ను తొలగించాల్సిందిగా నెట్‌ఫ్లిక్స్‌పై దావా వేశారు. ‘ది బిగ్ బ్యాంగ్ థియరీ’ సీజన్ 2 నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో నటించిన రాజ్ షెల్డన్ కూపర్‌గా నటించిన జిమ్ పార్సన్స్ ఐశ్వర్యరాయ్‌ని మాధురి దీక్షిత్‌తో పోలుస్తాడు. ఒక సన్నివేశంలో ఐశ్వర్యను పేదోడి ‘మాధురీ దీక్షిత్’ అని పేర్కొంటాడు. దీనికి మరో పాత్రధారి రాజ్ కూత్రపల్లి క్యారెక్టర్‌ను పోషించిన కునాల్ నయ్యర్.. కుష్టురోగి వంటి మాధురీ దీక్షిత్‌తో పోలిస్తే ఎలా? ఐశ్వర్య ఒక దేవత’ అని అంటాడు. దీనిపై మిథున్ కుమార్ స్పందిస్తూ.. ఈ సిరీస్‌లో స్త్రీ ద్వేషాన్ని ప్రోత్సహిస్తున్నారని.. వ్యక్తులను కించపరిచే భాష వాడుతున్నారని ఆయన ఫైర్ అయ్యారు. అదే విధంగా ఆయన ఓ ప్రకటన ఇచ్చారు. చదవండి: బిగ్‌బాస్ అలీ రేజాతో రొమాంటిక్ సీన్‌పై ప్రశ్న.. నటి సనా షాకింగ్ రియాక్షన్ ‘‘తాము చేసే పనులకు జవాబుదారీగా ఉండడం, స్ట్రీమింగ్‌లో సామాజిక, సాంస్కృతిక విలువలను కించపరచకుండా, ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా చూసుకోవడం నెట్‌ఫ్లిక్స్ వంటి పెద్ద సంస్థలకు ఇది చాలా ముఖ్యం. స్ట్రీమింగ్ సర్వీస్ ప్రొవైడర్లు తమ ప్లాట్‌ఫారమ్‌లలో అందించే కంటెంట్‌ను జాగ్రత్తగా పరిశీలించి ప్రసారం చేయాల్సిన బాధ్యత ఉందని నేను గట్టిగా నమ్ముతున్నాను. అవమానకరమైన, అభ్యంతరకరమైన లేదా పరువు నష్టం కలిగించే కంటెంట్ లేదని నిర్ధారించాకే స్ట్రీమింగ్ చేయాలి. నెట్‌ఫ్లిక్స్ - ‘బిగ్ బ్యాంగ్ థియరీ’లోని షోలలో ఒకదానిలో అవమానకరమైన పదాన్ని ఉపయోగించడం వల్ల నేను చాలా బాధపడ్డాను. ఆ పదాన్ని ప్రజల నుంచి ఎన్నో ప్రశంసలు, భారీగా అభిమానులు ఉన్న నటి మాధురీ దీక్షిత్‌ను ఉద్దేశించి ఉపయోగించారు. ఇది అత్యంత అభ్యంతరకరం, తీవ్రంగా బాధించేది మాత్రమే కాకుండా ఆమె ఆత్మ గౌరవాన్ని, పరువును కించపరిచేలా ఉంది’’ అని ఆయన తన ప్రకటనలో పేర్కొన్నారు. మరి నెట్ ప్లిక్స్ ఎలా స్పందిస్తుందో చూడాలి. -
రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌కు కేటీఆర్ లీగల్ నోటీసులు..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వ్యవహారంపై నిరాధారమైన, అసత్య ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్, బీజేపీ నేతలు రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌లకు మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. టీఎస్పీఎస్సీ వ్యవహారంలో రాజకీయ దురుద్దేశంతోనే తన పేరును అనవసరంగా లాగుతున్నారని వీరిద్దరికి తన న్యాయవాది ద్వారా లీగల్ నోటీసులను పంపించారు. సుదీర్ఘ కాలం పాటు ప్రజా జీవితంలో ఉన్న తన పరువుకు భంగం కలిగించాలన్న దురుద్దేశంతోనే బండి సంజయ్, రేవంత్ రెడ్డిలు పదేపదే అబద్దాలను మాట్లాడుతున్నారన్నారు. కేవలం ప్రజాప్రతినిధిగా ఉన్నంత మాత్రాన ఎదుటి వారిపై అసత్య ప్రేలాపనాలు చేసే హక్కు వీరికి లేదని కేటీఆర్ నోటీసులో పేర్కొన్నారు. ఇండియన్ పీనల్ కోడ్ లోని 499, 500 నిబంధనల ప్రకారం పరువు నష్టం దావా నోటీసులు పంపించారు. ఎలాంటి ఆధారాలు లేని సత్య దూరమైన ఆరోపణలను మానుకోవాలని, ఇప్పటికే చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని నోటీసులో డిమాండ్ చేశారు. వారం రోజుల్లోగా తమ వ్యాఖ్యలను వెనకకు తీసుకొని క్షమాపణ చెప్పకుంటే రూ.100 కోట్ల పరువు నష్టం దావాను ఎదుర్కోవాల్సి వస్తుందని కేటీఆర్ తన నోటీసులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్, రేవంత్ రెడ్డిలు చేసిన నిరాధార ఆరోపణలను సాక్షాలతో సహా తన నోటీసులో కేటీఆర్ ప్రస్తావించారు. చదవండి: కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం.. ఘాటైన లేఖ -
తలైవా సీరియస్ వార్నింగ్.. ఇంకోసారి రిపీట్ అయిందో..!
తమిళ సూపర్ స్టార్, తలైవా రజినీకాంత్‌కు కోపం వచ్చింది. తన ఫొటోలను అనుమతి లేకుండా వినియోగించ వద్దంటూ తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు. సూపర్ స్టార్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఈ మేరకు తలైవా తరపు న్యాయవాది పబ్లిక్ నోటీస్ విడుదల చేశారు. దీంతో కోలీవుడ్‌లో ఈ విషయంపై చర్చ మొదలైంది. ఆ నోటీస్‌లో ఏముందంటే..'రజినీకాంత్ సెలబ్రిటీ హోదాలో ఉన్నారు. బిజినెస్‌పరంగా ఆయన పేరు, ఫొటోలు ఉపయోగించుకునే హక్కు ఆయనకు మాత్రమే ఉంంది. కొందరు ఆయన మాటలను, ఫొటోలను, వ్యంగ్య చిత్రాలను దుర్వినియోగం చేస్తున్నారు. ఇలా ఆయన అనుమతి లేకుండా ప్రజాదరణ పొందుతూ వారి ఉత్పత్తులను మార్కెటింగ్ చేస్తుకుంటున్నారు. సినీ ఇండస్ట్రీలో ఆయన ఓ సూపర్‌స్టార్. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఇండస్ట్రీలో ఆయనకు ఎంతో గౌరవం ఉంది. రజినీకాంత్ ప్రతిష్ఠకు ఏదైనా భంగం కలిగిస్తే దాని వల్ల ఎంతో నష్టం కలుగుతుంది. ఇకపై రజినీకాంత్ అనుమతి లేకుండా ఫోటోలు, వీడియోలు వాడకూడదు.' అని నోటీసుల్లో పేర్కొన్నారు. కాగా.. తలైవా ప్రస్తుతం నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో జైలర్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, కన్నడ హీరో శివరాజ్‌కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. -
చిక్కుల్లో 'కాంతార' టీం.. లీగల్ నోటీసులు! ఎందుకంటే..
కన్నడ హీరో రిషబ్ శెట్టి నటించిన తాజా చిత్రం కాంతార. చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డుని సృష్టిస్తోంది.హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరాంగదుర్ నిర్మించిన కాంతార మూవీ రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబడుతుంది. దేశవ్యాప్తంగా ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. కథ పరంగానే కాదు పాటలకు కూడా మంచి ఆదరణ లభించింది. ముఖ్యంగా ‘వరాహరూపం.. దైవ వరిష్ఠం..’ పాట ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అయితే తాజాగా ఈ పాట బాణీని కాపీ కొట్టారంటూ ‘తైక్కుడం బ్రిడ్జ్’ అనే మ్యూజిక్ బ్యాండ్ ఆరోపణలు చేస్తుంది. అంతేకాకుండా తమకు మద్దతు ఇవ్వాల్సిందిగా నెటిజన్లను విజ్ఞప్తి చేసింది. కాంతారలోని వరాహ రూపం పాట మా సాంగ్ నవసరను కాపీ కొట్టారు. ఈ కాపీకి కారణమైన వాళ్లపై మేం చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి రెడీ అవుతున్నాం అంటూ ఇన్‌స్టాలో పోస్టును షేర్ చేశారు. దీనికి ర్మాత విజయ్ కిరగందూర్, సినిమా హీరో & దర్శకుడు రిషబ్ శెట్టికి కూడా ట్యాగ్ చేశారు. అయితే ఈ ఆరోపణలపై కాంతార టీం ఇంకా స్పందిచలేదు. View this post on Instagram A post shared by Thaikkudam Bridge (@thaikkudambridge) -
జైరాం రమేశ్‌కు కేంద్రమంత్రి స్మృతి ఇరానీ లీగల్ నోటీసులు
న్యూఢిల్లీ: కాంగ్రెస్, ఆ పార్టీ నేతలు జైరాం రమేశ్, పవన్ ఖేరా, నెటా డిసౌజాకు లీగల్ నోటీసులు పంపారు కేంద్రమంత్రి స్మృతి ఇరానీ. గోవాలో తన కూతురు అక్రమంగా బార్ నడుపుతోందని నిరాధార ఆరోపణలు చేసినందుకు క్షమాపణలు చెప్పాలని నోటీసులో పేర్కొన్నారు. తన ప్రతిష్టను మసకబార్చేందుకే కాంగ్రెస్ లేనిపోని ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. 18 ఏళ్ల తన కూతురు గోవాలో రెస్టారెంట్ కోసం, బార్ కోసం ఎలాంటి దరఖాస్తులు చేయలేదని స్మృతి ఇరానీ పేర్కొన్నారు. తన కూతురుకు ఎక్సైజ్ శాఖ నుంచి ఇప్పటివరకు ఎలాంటి నోటీసులు కూడా రాలేదని చెప్పారు. కాంగ్రెస్ కావాలనే దుష్ప్రచారం చేస్తోందన్నారు. స్మృతి ఇరానీ కూతురు జోయిష్ ఇరానీకి గోవాలో రెస్టారెంట్ ఉందని, అందులో అక్రమంగా బార్ కూడా నడుస్తోందని కాంగ్రెస్ నేతలు శనివారం ఆరోపించడం తీవ్ర దుమారం రేపింది. అనంతరం మీడియా సమావేశం నిర్వహించిన స్మృతి ఇరానీ వీటిని కొట్టిపారేశారు. తాను గాంధీలను విమర్శిస్తున్నందుకే తన కూతుర్ని లక్ష్యంగా చేసుకున్నారని ఎమోషనల్ అయ్యారు. మరోవైపు కాంగ్రెస్ మాత్రం జోయిష్ ఇరానీపై చేసిన ఆరోపణలను సమర్థించుకుంది. సాక్ష్యంగా చూపుతూ ట్విట్టర్లో వీడియో కూడా షేర్ చేసింది. అంతేకాదు ఆదివారం గోవాలోని జోయిష్ ఇరానీదే అని ఆరోపిస్తున్న రెస్టారెంట్ ముందు నిరసన కూడా చేపట్టింది. చదవండి: 'ఆ రెస్టారెంట్ స్మృతి ఇరానీ కూతురిదే.. ఇదిగో సాక్ష్యం' -
అల్లు అర్జున్‌కి షాకిచ్చిన సజ్జనార్, లీగల్ నోటీసులు జారీ
TSRTC Sends Legal Notice to Allu Arjun: టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్‌కు తెలంగాణ ఆర్టీసీ లీగల్ నోటీసులు ఇచ్చింది. అల్లు అర్జున్ రాపిడో ప్రకటపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆర్టీసీ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ర్యాపిడో ప్రకటన ఉందంటూ అల్లు అర్జున్‌తో పాటు ర్యాపిడో సంస్థకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ నోటీసులు పంపారు. ఈ మేరకు సజ్జనార్ ప్రకటన విడుదల చేశారు. ‘అల్లు అర్జున్ నటించిన ప్రకటనపై అభ్యంతరాలు వస్తున్నాయి. యూట్యూబ్‌లో ప్రసారం అవుతున్న ఈ ప్రకటనలో ఆర్టీసీ బస్సులు సాధారణ దోసెల మాదిరిగానే ఎక్కువ సమయం తీసుకుంటాయని, ర్యాపిడో చాలా వేగంగా, సురక్షితంగా ఉంటుందని, అదే సమయంలో మసాలా దోసెను సిద్ధం చేస్తుందని నటుడు ప్రజలకు చెప్పడం కనిపిస్తుంది. చదవండి: ఎట్టకేలకు ప్రెగ్నెన్సీ విషయంపై స్పందించిన కాజల్ ఈ ప్రకటనపై ఆర్టీసీ ప్రయాణికులు, అభిమానులు, సంస్థ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులతో సహా అనేక మంది నుంచి విమర్శలు వస్తున్నాయి. ర్యాపిడో సర్వీసులతో పోల్చి ఆర్టీసీ బస్సులను ప్రతికూలంగా చూపించడాన్ని వారు ఖండిస్తున్నారు. టీఎస్ ఆర్టీసీని కించపర్చడాన్ని సంస్థ యాజమాన్యం, ఉద్యోగులు, ప్రయాణికులు సహించరు. ప్రజా రవాణాను ప్రోత్సహించే ప్రకటనల్లో నటులు నటించాలి. టీఎస్ ఆర్టీసీ సామాన్యుల సేవలో ఉంది... అందుకే నటుడికి, ప్రకటనను ప్రచారం చేస్తున్న సంస్థకు లీగల్ నోటీసు ఇచ్చింది. బస్ స్టేషన్లలో స్టిక్కర్లు, కరపత్రాలు అంటించే వారిపై, బస్సుల్లో, బయట పాన్, గుట్కా ఉమ్మేసే వారిపైనా కేసులు నమోదు చేస్తున్నాం’ అని సజ్జనార్ తెలిపారు. -
అనసూయ ఎంట్రీ.. షో నిర్వాహకులకి షాకిచ్చిన తమన్నా!
టాలీవుడ్ పరిశ్రమలో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా తన నటన, గ్లామర్‌తో ఆకట్టుకుని ప్రేక్షకులను కట్టి పడేసింది. ఇటీవల వెబ్ సిరీస్‌లోనూ అడుగుపెట్టి తన హవాని అక్కడ కూడా కొనసాగిస్తోంది ఈ అమ్మడు. తాజాగా టెలివిజన్‌లో ‘మాస్టర్ చెఫ్ తెలుగు’ షోతో ప్రేక్షకుల మందుకు తమన్నా వచ్చింది. అయితే పలు కారణాల వల్ల ఈ షో నుంచి ఆమెను తప్పించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ప్రోగ్రాం విషయంలో తమన్నా కోర్టను ఆశ్రయించి ప్రొడక్షన్ హౌజ్‌కి షాకిచ్చిందట. వివరాల్లోకి వెళితే.. తమన్నా హోస్ట్‌గా టీవీలో ‘మాస్టర్ చెఫ్ తెలుగు’ కార్యక్రమం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ షో రేటింగ్స్ విషయానికి వస్తే.. మొదట్లో బాగానే వచ్చినా, ఇటీవల మాత్రం ఆశించినంతగా రేటింగ్ లేకపోవడంతో తమన్నాను తప్పించి టాప్ యాంకర్ అనసూయను తెరపైకి తీసుకొచ్చింది ఇన్నోవేటివ్ ఫిల్మ్ అకాడమీ. అనసూయ ఎంట్రీతో ఈ షోకి మళ్లీ మంచి రేటింగ్ సాధిస్తుందని ప్రొడక్షన్ హౌస్ నిర్వాహకులు ఆశాభావంతో ఉన్నారు. ఇదిలా ఉండగా తనను తొలగించడంపై అసంతృప్తితో ఉన్న మిల్కీ బ్యూటీ.. ఆమెకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని ప్రొడక్షన్ హౌజ్‌కు లీగల్ నోటీసులు పంపించింది. ఈ అంశంపై తమన్నా తరపు లాయర్ మాట్లాడుతూ.. మాస్టర్ చెఫ్ కార్యక్రమం కోసం తమన్నా పలు ప్రాజెక్టులు వదులుకొన్నారు. ఈ షోకు సంబంధించిన తొలి సీజన్‌ను పూర్తి చేయడానికి కొన్ని ముఖ్యమైన పనులను కూడా ఆమె రద్దు చేసుకోవాల్సి వచ్చింది. తన క్లయింట్‌తో షో నిర్వాహకులు అన్ ప్రొఫెషనల్‌గా వ్యవహరించారు. అంతేకాకుండా తన క్లయింటతో ప్రొడక్షన్ హౌస్ ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా కమ్యునికేషన్ కూడా ఆపివేశారని వెల్లడించారు. చదవండి: తమన్నా ప్లేస్‌లో అనసూయ, బ్లాక్ సూట్, హాట్ లుక్స్‌తో అదుర్స్ -
గౌనులో పేలిన స్మార్ట్‌ఫోన్..! చర్యలకు సిద్దమైన కంపెనీ..!
Oneplus Sends Legal Notice To User: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ కీలక నిర్ణయం తీసుకుంది. వన్‌ప్లస్ నార్డ్ 2 5జీ స్మార్ట్‌ఫోన్ పేలిందని ఆరోపణలు చేసిన సదరు లాయర్‌కు లీగల్ నోటీసులను పంపింది. కంపెనీ ప్రతిష్టదిగజారేలా ఆరోపణలు చేశాడని వన్‌ప్లస్ వెల్లడించింది. చదవండి: Apple Witnesses Record Iphone 13 Pre Orders: ఐఫోన్-13 ప్రీ-బుకింగ్స్‌లో దుమ్మురేపిన ఇండియన్స్..! అసలు ఏం జరిగదంటే..! ఢిల్లీకి చెందిన గౌరవ్ గులాటి ఈ నెల ఎనిమిదో తారీఖున వన్‌ప్లస్ నార్డ్ 2 5జీ స్మార్ట్‌ఫోన్ కోర్టులో ఉండగా తన గౌనులో ఒక్కసారిగా పేలిందని ఆరోపణలు చేశాడు. అంతేకాకుండా స్మార్ట్ ఫోన్ పేలిన చిత్రాలను ట్విటర్లో పోస్ట్చేశాడు. వన్‌ప్లస్ కంపెనీ వినియోగదారులను మోసం చేస్తోందని కోర్టులో పిటిషన్ కూడా వేశాడు. అప్పట్లో ఈ సంఘటన సంచలనంగా మారింది. చర్యలకు సిద్దమైన వన్‌ప్లస్..! లాయర్ కోర్టులో వన్‌ప్లస్ కంపెనీపై పిటిషన్ దాఖలు చేయగా..తాజాగా వన్‌ప్లస్ యాజమాన్యం పిటిషన్ స్పందిస్తూ.. లాయర్‌కు దిమ్మే తిరిగేట్టుగా వన్‌ప్లస్ షాకిచ్చింది. సార్ట్‌ఫోన్‌పేలిందటూ లాయర్ అనవరంగా ఆరోపణలు చేశారని గౌరవ్ గులాటికి వన్‌ప్లస్ లీగల్ నోటీసులను పంపింది. వన్‌ప్లస్ తమ నోటీసుల్లో..కంపెనీపై తప్పడు ఆరోపణలు చేశాడని మండిపడింది. తమ ఫోన్లో ఏలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తలేదని వెల్లడించింది. ట్విటర్లో పబ్లిష్ చేసిన ఫోటోలను వెంటనే డిలీట్ చేయాలంటూ కంపెనీ తమ పిటిషన్లో పేర్కొంది. లాయర్ చేసిన ఆరోపణలతో వన్‌ప్లస్ ప్రతిష్ట దిగజారిందని పిటిషన్లో పేర్కొంటూ..లాయర్‌పై పరువునష్టం దావాను కూడా వేసినట్లు తెలుస్తోంది. చదవండి: Neeraj Chopra: అప్పుడేమో రాహుల్ ద్రావిడ్..ఇప్పుడు నీరజ్ చోప్రా..! సరికొత్త రూపంలో.. -
కోవిషీల్డ్ టీకా: సీరమ్‌కు లీగల్ నోటీస్
సాక్షి,న్యూఢిల్లీ: ఆస్ట్రాజెనెకా సంస్థ తమకు లీగల్ నోటీసు జారీ చేసిందని కరోనా వైరస్ టీకా ‘కోవిషీల్డ్’ను ఉత్పత్తి చేస్తున్న సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ) వెల్లడించింది. ఒప్పందం మేరకు కోవిషీల్డ్‌ను సరఫరా చేయడంలో జరుగుతున్న జాప్యంపై నోటీసులో ప్రశ్నించిందని ఎస్ఐఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అదర్ పూనావాలా బుధవారం తెలిపారు. ఈ విషయం కేంద్రానికి కూడా తెలుసన్నారు. దీనిపై ఇప్పుడే వ్యాఖ్యానించలేనని, వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకునేందుకు మార్గాలను అన్వేషిస్తున్నామన్నారు. (కరోనా ప్రమాద ఘంటికలు: సోనూసూద్ స్పెషల్ డ్రైవ్) భారత్‌లో సరఫరా చేయాల్సిన డోసులకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఆస్ట్రాజెనెకాకు సరఫరా చేయాల్సిన టీకా డోసుల్లో జాప్యం నెలకొన్నదని ‘బిజినెస్ స్టాండర్డ్’ పత్రికకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో పూనావాలా తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా తమ టీకాకు డిమాండ్ ఉందని, భారత దేశ అవసరాలకు ప్రాధాన్యత ఇస్తున్నప్పటికీ.. టీకా అవసరమైన భారతీయులందరికీ దీన్ని అందజేయలేమని ఆయన స్పష్టం చేశారు. విదేశాల్లో టీకా డోసు ధర కూడా ఎక్కువగా ఉందన్నారు. ఎస్ఐఐ నెలకు ఆరు కోట్ల నుంచి ఆరున్నర కోట్ల టీకాలను ఉత్పత్తి చేస్తోందని తెలిపారు. ఇప్పటివరకు 10 కోట్ల డోసులను కేంద్ర ప్రభుత్వానికి సరఫరా చేశామని, మరో 6 కోట్ల డోసులను విదేశాలకు ఎగుమతి చేశామని వివరించారు. ‘భారత ప్రభుత్వ అభ్యర్థనపై భారత్‌కు సబ్సీడీ ధరకు సుమారు రూ. 150 రూ. 160 కే టీకా డోసు అందిస్తున్నాం. లాభాలు రావడం లేదని చెప్పలేం. కానీ గొప్పగా లాభాలేమీ రావడం లేదు’ అని వ్యాఖ్యానించారు. -
నారా లోకేష్‌కు లీగల్ నోటీసు
సాక్షి, ప్రకాశం: తనపై తప్పుడు ప్రచారం చేసిన మీడియా చానళ్లు, టీడీపీ నాయకులకు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి శుక్రవారం లీగల్ నోటిసులు పంపారు. తమిళనాడులో తనకుసంబంధించిన డబ్బు దొరికిందంటూ టీవీ5, న్యూస్18 మీడియాల్లో ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో తనపై లేనిది కల్పించి తప్పుడు వార్తలను ప్రచారం చేయింటారంటూ మంత్రి బాలినేని టీడీపీ నాయకులైన నారా లోకేష్, బొండా ఉమా, కొమ్మరెడ్డి పట్టాభిలతో పాటు టీవీ5, న్యూస్-18 ఛానళ్లకు ఆయన లీగల్ నోటీసులు పంపి చట్టపరమైన చర్యలు ప్రారంభించారు. కాగా, తమిళనాడులో గత నెలలో పోలీసులకు పట్టుబడ్డ 5 కోట్ల రూపాయల నగదు మంత్రి బాలినేనిదేనని టీడీపీ నాయకులు, కొన్ని మీడియా చానళ్లు అసత్య ప్రచారం చేశాయి. పట్టుబడ్డ 5 కోట్ల రూపాయాలు తమవేనని ఒంగోలుకు చెందిన బంగారం వ్యాపారి నల్లమల్లి బాలు ప్రకటించినా పట్టించుకోకుండా పదేపదే టీడీపీ నేతలు ఆరోపణలు చేశారు. దీంతో మంత్రి బాలినేని న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. (ఎవరికీ సంబంధం లేదు.. ఆ 5 కోట్లు మావే) -
ఐఐఎంకు వలస కార్మికుల లీగల్ నోటీసు
అహ్మదాబాద్ : ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనెజ్మెంట్ అహ్మదాబాద్‌కు(ఐఐఎంఏ) వలస కార్మికులు లీగల్ నోటీసులు పంపించారు. ఐఐఎంఏలో ఓ భవన నిర్మాణ పనుల్లో పాల్గొన్న వలస కార్మికులు.. లాక్డౌన్ సమయంలో సంస్థ తమకు రెండు నెలల కాలానికి వేతనం చెల్లించలేదని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలు ఐఐఎంఏ అధికారులు ఖండించారు. వివరాల్లోకి వెళ్తే.. ఐఐఎంఏ నిర్మాణ పనుల్లో పాల్గొన్న దాదాపు 100 మంది వలస కార్మికులు ఇటీవల అక్కడికి సమీపంలోని రద్దీగా ఉండే రోడ్డుపైకి చేరుకుని నిరసన తెలిపారు. పోలీసులపై, అటుగా వెళ్లే వాహనాలపై రాళ్లు రువ్వారు. తమను స్వస్థలాకు పంపేందుకు ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు వలస కార్మికులపై టియర్ గ్యాస్ షెల్స్‌ను ప్రయోగించి.. వారిని అక్కడి నుంచి తరలించారు. వారు చాలా కాలంగా తమను స్వస్థలాకు పంపించాలని స్థానిక అధికారులను కోరినప్పటికీ.. ఫలితం లేకపోవడంతో వలసకూలీలు ఈ విధమైన నిరసన చేపట్టినట్టుగా తెలుస్తోంది. అయితే ఆ మరుసటి రోజు ఐఐఎంఏ డైరెక్టర్, గుజరాత్ చీఫ్ సెక్రటరీ, అడిషనల్ చీఫ్ సెక్రటరీ, డిప్యూటీ లేబర్ కమిషనర్లకు వలస కార్మికులు ఒక లాయర్ ద్వారా లీగల్ నోటీసులు పంపించారు. ‘వలస కార్మికుల్లో పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొందరిని దారుణంగా కొట్టారు. పోలీసులు అదుపులోకి తీసుకున్నవారిలో ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా తేలింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు విరుద్దంగా.. ఇక్కడ వలస కూలీలకు ప్రధాన యజమానిగా ఉన్న ఐఐఎంఏ వారికి రెండు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదు. వలస కూలీల కుటుంబాల్లో దాదాపు 20 మంది చిన్నారులు, 30 మంది మహిళలు ఉన్నారు. వారికి కార్మిక చట్టాల ప్రకారం నిర్మాణం జరిగే ప్రదేశాల్లో వసతి కల్పించడం లేదు’ అని నోటీసుల్లో పేర్కొన్నారు. (చదవండి : కూలీల ఇక్కట్లపై నేడు ప్రతిపక్షాల భేటీ) దీనిపై స్పందించిన ఐఐఎంఏ డైరెక్టర్.. కార్మికుల అందరికి వారి బాకీలను చెల్లించామని తెలిపారు. స్వస్థలాకు వెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం రవాణా సదుపాయం కల్పించాలనే డిమాండ్‌తోనే కార్మికులు నిరసన చేపట్టారని అన్నారు. -
నటుడికి షాకిచ్చిన భార్య.. లీగల్ నోటీసులు
ముంబై: బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ నుంచి విడాకులు కోరుతూ అతడి భార్య అలియా సిద్దిఖీ లీగల్ నోటీసులు పంపించారు. కోవిడ్-19 కారణంగా లాక్డౌన్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఇ-మెయిల్, వాట్సాప్‌ల ద్వారా ఈ మేరకు మే 7న నోటీసులు పంపినట్లు అలియా తరఫు లాయర్ అభయ్ తెలిపారు. విడిపోయిన అనంతరం అలియాకు చెల్లించాల్సిన భరణం గురించి కూడా ఇందులో ప్రస్తావించినట్లు పేర్కొన్నారు. నవాజుద్దీన్, ఆయన కుటుంబంపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయని... లీగల్ నోటీసులకు నవాజుద్దీన్ ఇంతవరకు స్పందించ లేదని తెలిపారు.(రెండు వారాల పాటు క్వారంటైన్లో నటుడు) కాగా పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా మే 12న నవాజుద్దీన్ ముంబై నుంచి స్వస్థలం బుధానా(ఉత్తరప్రదేశ్)కు వెళ్లారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో లాక్డౌన్ నిబంధనల ప్రకారం అతడిని 14 రోజుల పాటు హోం క్వారంటైన్లో ఉండాల్సిందిగా అధికారులు సూచించారు. ఈ విషయం గురించి నవాజుద్దీన్ మాట్లాడుతూ.. నిబంధనల మేరకు తమ కుటుంబమంతా నిర్బంధంలోనే ఉంటామని, ఎవరినీ కలిసే ప్రయత్నం చేయమని స్పష్టం చేశారు. ఇక సొంతింటికి చేరుకున్న అనంతరం.. ‘‘ మా చెల్లి మరణించిన తర్వాత మా అమ్మ అనారోగ్యం పాలైంది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం బుధానాలో మేం హోంక్వారంటైన్లో ఉంటాం’’ అని సోమవారం ట్వీట్ చేశారు. కాగా నవాజుద్దీన్, అలియా 2009లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం. నవాజుద్దీన్ గతంలో షీబాను పెళ్లి చేసుకుని ఆమె నుంచి విడిపోయిన సంగతి తెలిసిందే. (వలస కార్మికుల కోసం సోనూసూద్.. హ్యాట్సాఫ్) -
రణ్వీర్ సింగ్‌కు నోటీసులు..
ముంబై: బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్‌కు లీగల్ నోటీసులు వచ్చాయి. ప్రముఖ డబ్ల్యూడబ్ల్యూఈ ఆటగాడు బ్రాక్ లెస్నర్, అతని లాయర్ పాల్ హేమాన్ ఈ నోటీసులను రణ్‌వీర్‌కి పంపించారు. బ్రాక్ లెస్నర్కి చెందిన ఓ నినాదాన్ని ప్రపంచ కప్‌లో భాగంగా రణ్వీర్ ఉపయోగించింనందుకు వారు ఈ లీగల్ నోటీసులు ఇచ్చారు. గత ఆదివారం ప్రపంచ కప్‌లో భాగంగా భారత్, పాక్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌ను రణ్వీర్ వీక్షించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రణ్వీర్ హార్దిక్ పాండ్యాను అభినందిస్తూ.. తన ట్విట్టర్ ఖాతాలో ‘ ఈట్, స్లీప్, డామినేట్, రిపీట్ ’ అనే మేసేజ్‌తో హార్ధిక్‌తో దిగిన ఫోటోను పోస్ట్ చేశారు. దీనిపై పాల్ హేమాన్ స్పందిస్తూ.. ‘రణ్వీర్ ఉపయోగించిన నినాదం బ్రాక్ లెస్నర్దని.. ఆ నినాదంపై కాపీ రైట్ కూడా అతని వద్ద ఉందన్నారు. రణ్‌వీర్‌కు చట్టపరంగా నోటీసులను పంపుతున్నట్లు వెల్లడించారు. -
‘క్షమాపణలా.. పరువు నష్టమా’
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో బీజేపీ - ఆప్ పార్టీల మధ్య పాంప్లెట్ల వివాదం మరింత ముదిరింది. గంభీర్ తమ పార్టీ అభ్యర్థిని కించపరిచేలా పాంప్లెట్లు పంచాడని ఆప్ ఆరోపిస్తోంది. ఈ క్రమంలో ఆప్ ఆరోపణలపై స్పందించిన గంభీర్ రెండు రోజుల క్రితం కేజ్రీవాల్‌ను ఉద్దేశించి ‘ఇలాంటి సీఎం ఉన్నందుకు సిగ్గుపడాలి’ అంటూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన కేజ్రీవాల్.. శనివారం గంభీర్‌కు లీగల్ నోటిసులు పంపారు. తన వ్యాఖ్యలకు గంభీర్ గంభీర్‌కు నోటీసులు పంపిన కేజ్రీవాల్‌రాతపూర్వకంగా క్షమాపణలు చెప్పాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. అంతేకాక తమ పార్టీపై గంభీనఖ చేసిన ఆరోపణలు తప్పని పేర్కొంటూ.. 24 గంటల్లోపు వాస్తవాలను వార్త పత్రికల్లో ప్రకటించాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. అలా చేయని పక్షంలో గంభీర్ పరువు నష్టం దావాను ఎదుర్కోవాల్సి వస్తుందని కేజ్రీవాల్ హెచ్చరించారు. బీజేపీ ఈస్ట్ ఢిల్లీ అభ్యర్థి గౌతం గంభీర్ తనకు వ్యతిరేకంగా అసభ్యకరమైన పాంప్లెట్లు పంచుతున్నారంటూ ఆప్ నేత ఆతిషి ఆరోపించినప్పటి నుంచి గంభీర్ - ఆప్ నేతల మధ్య వివాదం మొదలైంది. చిన్నగా మొదలైన ఈ వివాదం రోజురోజుకు పెరిగి నోటీసులు పంపుకోవడం వరకు వెళ్లింది. -
జెట్ ఎయిర్వేస్ను కొనేవారే లేరా?
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని విలవిల్లాడుతున్న విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్కు దెబ్బమీద దెబ్బ పడుతూనే ఉంది. ఒక వైపు తమ వేతన బకాయిలు చెల్లించకపోతే విధులను హాజరుకామని తేల్చి చెప్పిన పైలట్లు తాజాగా జెట్ ఎయిర్వేస్కు లీగల్ నోటీసులిచ్చారు. వేతన బకాయిలను ఈనెల 14 లోగా అందించాలని డిమాండ్ చేస్తూ, జెట్ ఎయిర్వేస్ నూతన యాజమాన్యానికి పైలట్ల సంఘం (నేషనల్ ఏవియేటర్స్ గిల్డ్-నాగ్) లీగల్ నోటీస్ జారీ చేసింది. సంస్థ యాజమాన్యం బ్యాంకుల చేతికి వచ్చినా, పరిస్థితిలో మార్పు లేదని ఆందోళన వ్యక్తం చేసిన నాగ్ సంస్థ సీఈవో వివేక్ దుబేకు ఈ నోటీసులు పంపించారు. జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల వేతన బకాయిలు ఈ నెల 14 నాటికి జీతాలుచెల్లించాలని, అలాగే ఇకపై ప్రతినెలా 1వ తేదీ కల్లా వేతనాలు అందించాలని కోరుతూ నూతన యాజమాన్యానికి నాగ్ నోటీసులిచ్చింది. మరోవైపు ప్రభుత్వ రంగ ఇంధన సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ (ఐవోసీ) మరోసారి ఇంధన సరఫరాను నిలిపివేస్తున్నట్టు బుధవారం ప్రకటించింది. బకాయిలు చెల్లించని కారణంగా ఈ నిర్ణయం తీసుకోవడం ఈ వారంలో ఇది రెండవ సారి. అలాగే జెట్ఎయిర్వేస్లోని వాటాలను విక్రయించేందుకు ఎస్‌బ్యాంకు బిడ్లను ఆహ్వానించింది. ఇప్పటివరకు ఈ వాటాలను కొనుగోలు చేసేందుకు ఏ ఒక్కరూ ఆసక్తిని కనబర్చక పోవడంతో గడువును మరో రెండు రోజుల పాటు పొడిగించింది. జెట్ ఎయిర్‌వేస్‌లోని సుమారు 75శాతం వాటాల కొనుగోలుకు బిడ్లను స్వీకరించే గడువును ఏప్రిల్12వ తేదీ శుక్రవారం వరకు పొడిగించామని ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్ ప్రకటించింది. ఇది ఇలా వుంటే నెదర్ల్యాండ్స్ ఆమ్‌స్టర్‌డాంలోని చిపోల్ విమానాశ్రయంలో జెట్ ఎయిర్వేస్ విమానాన్ని నిలిపిశారు. బకాయిలు చెల్లించని కారణంగానే ముంబైకు చెందిన జెట్ విమానాన్ని దాదాపు ఆరు గంటలపాటు ఎయిర్‌పోర్టులో నిలిపివేశారు. ఈ ఘటనపై స్పందించిన జెట్ ఎయిర్వేస్ నిర్వహణా కారణాల వల్ల జెట్ విమానం 9డబ్ల్యు 231 ఆలస్యంమైందని, ప్రయాణీకుల సౌకర్యార్థం సంబంధిత చర్యలు తీసుకున్నామంటూ వివరణ ఇచ్చింది. -
ప్రియా ప్రకాశ్‌కు షాకిచ్చిన బోనీ కపూర్
ఒక్క కన్ను గీటుతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రియా ప్రకాశ్ వారియర్ మరోసారి వార్తల్లోకెక్కారు. బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్, ప్రియా ప్రకాశ్‌కు లీగల్ నోటీసులు పంపారు. విషయం ఏంటంటే.. ప్రియా ప్రకాశ్ ప్రస్తుతం ‘శ్రీదేవి బంగ్లా’ అనే సినిమా ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. మలయాళ దర్శకుడు ప్రశాంత్ మాంబుల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్ కొన్ని రోజుల క్రితం విడుదలైంది. ఈ చిత్రంలో ప్రియ.. శ్రీదేవి అనే టాప్ హీరోయిన్ పాత్రలో నటిస్తున్నారు. అయితే ట్రైలర్, టైటిల్‌ని బట్టి చూస్తే ఇది దివంగత నటి శ్రీదేవి జీవితాధారంగా తెరకెక్కించిన చిత్రమా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. అదీ కాకుండా ట్రైలర్లో శ్రీదేవి బాత్‌టబ్‌లో పడి చనిపోయిన సీన్ కూడా ఉండటంతో అనుమానాలు మరింత ఎక్కువయ్యాయి. దాంతో నిర్మాత బోనీ కపూర్.. ప్రియతో పాటు చిత్రబృందానికి కూడా లీగల్ నోటీసులు పంపించారు. ఈ విషయం గురించి చిత్ర దర్శకుడు ప్రశాంత్ మాంబుల్లి మాట్లాడుతూ.. ‘గత వారం బోనీ కపూర్ నుంచి మాకు నోటీసులు వచ్చాయి. మేం ఈ సమస్యను ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉన్నాము. ఇది సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం. శ్రీదేవి అన్నది సాధారణంగా అమ్మాయిలు పెట్టుకునే పేరేనని బోనీకి నచ్చజెప్పాను. నా సినిమాలో కథానాయిక పాత్ర పేరు శ్రీదేవి. మేం దీన్ని ఎదుర్కొంటాం’ అని తెలిపారు. ఈ విషయం గురించి ప్రియ మాట్లాడుతూ.. ‘ఇది శ్రీదేవి సినిమానా కాదా అనే విషయం తెలుసుకోవాలంటే ముందు మీరు సినిమా చూడాలి. ఇందులో నేను శ్రీదేవి అనే సూపర్‌స్టార్ పాత్రలో నటిస్తున్నాను’ అంటూ అసలు విషయం చెప్పకుండా మాట దాటేశారు. -
మధుయాష్కీకి కవిత హెచ్చరికలు
సాక్షి, నిజామాబాద్ : టీఆర్ఎస్ పార్టీని నేరుగా ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేక కాంగ్రెస్ నేత మధుయాష్కీ పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. తన వ్యక్తిగత ప్రతిష్ట, రాజకీయ పరపతి దెబ్బతినే విధంగా ఆయన మాట్లాడుతున్నారని, తన లాయర్ ద్వారా లీగల్ నోటీసులు పంపిస్తున్నట్లు ఆమె తెలిపారు. సోమవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేని తనపై భర్తపై ఆధారాలు లేని అవాస్తవాలు, ఆరోపణలు చేయడం విచారకరమని అన్నారు. తన పట్ల, తన భర్త పట్ల వాడిన అసభ్య పదజాలాన్ని వాపస్ తీసుకుని క్షమాపణలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కవిత హెచ్చరించారు. -
ఆంజనేయుడు దళితుడన్న సీఎంకు నోటీసు
జైపూర్: హనుమంతుడిని దళితుడన్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు హిందూ సంస్థ ఒకటి లీగల్ నోటీసు ఇచ్చింది. మూడు రోజుల్లోగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. రాజస్తాన్‌లోని ఆల్వార్ జిల్లా మాలాఖేడాలో మంగళవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో సీఎం యోగి మాట్లాడుతూ..‘హనుమంతుడు అడవిలో జీవించేవాడు. ఆయన నిరుపేద దళితుడు. రాముని ఆకాంక్ష మేరకు ఆయన భారత సమాజాన్ని ఏకం చేయటానికి కృషి చేశాడు. ఆయన మాదిరిగానే మనం కూడా రాముని ఆకాంక్షను నెరవేర్చేదాకా విశ్రమించకూడదు. ప్రజలంతా రామభక్తులకే ఓటేయాలి. రావణులకు కాదు’ అని అన్నారు. దీంతో యోగికి రాజస్తాన్ సర్వ్ బ్రాహ్మిణ్ మహాసభ అధ్యక్షుడు సురేష్ మిశ్రా నోటీసులు పంపారు. -
అమితాబ్‌కు బార్ కౌన్సిల్ లీగల్ నోటీసులు
న్యూఢిల్లీ: బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ నటిస్తున్న ప్రచార చిత్రాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. తాజాగా ఆయన నటించిన ఎవరెస్ట్ మసాలా యాడ్‌పై ఢిల్లీ బార్ కౌన్సిల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ యాడ్‌లో ఎటువంటి అనుమతి లేకుండా లాయర్ కోట్‌ను వినియోగించడాన్ని తప్పుపడుతూ బార్ కౌన్సిల్ అమితాబ్‌కు లీగల్ నోటీసులు పంపింది. ఆయనతో పాటు ఎవరెస్ట్ మసాలా, యూట్యూబ్, ఓ మీడియా సంస్థకు కూడా బార్ కౌన్సిల్ నోటీసులు పంపింది. ఈ యాడ్‌ను ఎటువంటి అనుమతి లేకుండా ప్రసారం చేసినందుకు చట్టరీత్యా తీసుకునే చర్యలకు వారు బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆ నోటీసుల్లో పేర్కొంది. అలాగే ఈ యాడ్‌ను తక్షణమే నిలిపివేయాలని కోరింది. నోటీసులు అందుకున్నవారు పది రోజుల్లో స్పందించాల్సిందిగా నోటీసుల్లో పొందుపరిచింది. -
నానా పటేకర్ నుంచి నోటీసులు అందాయ్..
ముంబై : పదేళ్ల కిందట సినిమా సెట్స్‌లో తనను లైంగికంగా వేధించారని ఆరోపణలు చేసినందుకు తనుశ్రీ దత్తాకు నానా పటేకర్, వివేక్ అగ్నిహోత్రిల నుంచి బుధవారం లీగల్ నోటీసులు అందాయి. 2008లో హార్న్ ఓకే ప్లీజ్ అనే సినిమా సెట్లో ఓ డ్యాన్స్ సీక్వెన్స్ షూటింగ్ సందర్భంగా నానా పటేకర్ తనతో అసభ్యంగా వ్యవహరించారని, దీనిపై తాను గొంతెత్తగా తనపై మహారాష్ట్ర నవ్‌నిర్మాణ సేన కార్యకర్తలను ఉసిగొల్పారని తనుశ్రీ ఆరోపించిన సంగతి తెలిసిందే. మరో సందర్భంలో దర్శకుడు వివేక్ తన దుస్తులు తొలగించాలని కోరారని ఆమె ఆరోపించారు. తనకు నానా పటేకర్, వివేక్ అగ్నిహోత్రిల నుంచి లీగల్ నోటీసులు అందాయని దేశంలో వేధింపులు, అణిచివేత, అన్యాయానికి వ్యతిరేకంగా మాట్లాడితే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని తనుశ్రీ దత్తా ఆవేదన వ్యక్తం చేశారు. వారి (నానా పటేకర్, వివేక్) మద్దతుదారులు తనపై పరుష పదజాలంతో విరుచుకుపడుతున్నారని అన్నారు. తన ఇంట్లోకి చొచ్చుకువచ్చేందుకు ఇద్దరు ఆగంతకులు ప్రయత్నించగా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారన్నారు. ఎంఎన్ఎస్ పార్టీ తనకు వ్యతిరేకంగా హెచ్చరికలు జారీ చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయస్ధానాలకు లాగడం ద్వారా వ్యయప్రయాసలకు లోనుచేస్తున్నారని, తప్పుడు సాక్ష్యాలతో కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. కోర్టు కేసులు ఎలాంటి ముగింపు లేకుండా దశాబ్ధాల పాటు సాగుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు తాను తనుశ్రీ దత్తాను ఎలాంటి వేధింపులకు గురిచేయలేదని నానా పటేకర్ తనపై ఆరోపణలను తోసిపుచ్చారు. సెట్‌పై 50 మంది వ్యక్తులున్నారని, ఆమె పట్ల అసభ్యంగా వ్యవహరించే ప్రసక్తే ఉండదని స్పష్టం చేశారు. పరువు నష్టం దావా సహా ఆమెపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని నానా పటేకర్ న్యాయవాది రాజేంద్ర శిరోడ్కర్ చెప్పారు. -
బీజేపీ మాజీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు నోటీసులు
-
జ్యువెలరీ కంపెనీని మోసం చేసిన నటి..?
‘బిగ్ బాస్ 11’ మాజీ కంటెస్టెంట్ హీనా ఖాన్ నిత్యం ఏదో ఒక వార్తతో మీడియాలో హల్చల్ చేస్తుంటారు. ‘బిగ్ బాస్ హౌస్’లో ‘మిస్ రైట్’గా పిలుచుకునే హీనా ఖాన్ గురించి ఇప్పుడు ఒక తప్పుడు వార్త న్యూస్ చానళ్లలో ప్రచారం అవుతుందంట. ఒక బంగారు ఆభరణాల కంపెనీ ప్రకటనలో నటించిన హీనా ఖాన్, ప్రకటన షూటింగ్ అనంతరం బంగారు ఆభరణాలను కంపెనీకి తిరిగి ఇవ్వకుండా తన దగ్గరే అట్టే పెట్టుకుందంట. ఇందుకు గాను సదరు కంపెనీ హీనా ఖాన్‌కు లీగల్ నోటీసులు కూడా పంపారనేది ఆ వార్త సారాంశం. ఈ విషయం గురించి హీనాను అడగ్గా ఆమె దీన్ని ఖండించారు. అనంతరం తన ట్విటర్లో ‘లీగల్ నోటీస్‌లు ముందు నా ఇంటికి రాకుండా మీడియా హౌస్‌కు ఎలా వెళ్లాయనేది నాకు అర్ధం కావడం లేదంటూ’ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. అంతేకాక ‘నా శత్రువులు నన్ను క్షమించాలి. మీ ఈ ఉపాయం పని చేయలేదు. మరి కాస్తా కొత్తగా ట్రై చెయ్యండి’ అంటూ ట్వీట్ చేశారు. అంతేకాకుండా తనకు ఎలాంటి లీగల్ నోటీసులు రాలేదని తెలిపారు. కానీ న్యూస్ చానల్ వారు మాత్రం హీనా ఖాన్ అడ్రస్‌తో ఉన్న లీగల్ నోటీసులను ప్రచారం చేయడం గమనార్హం. ఇదిలా ఉండగా హీనా ఖాన్ మ్యూజిక్ వీడియో ‘భసూది’ సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతోంది. యూట్యూబ్‌లో విడుదలైన ఈ మ్యూజిక్ వీడియోను ఇప్పటికే 8 లక్షల మంది వీక్షించారు. -
ప్రియాంక చోప్రాకు నోటీసులు
బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రాకు ముంబై మున్సిపల్ కార్పోరేషన్ నోటీసులు జారీ చేసింది. ప్రియాంకకు సంబంధించిన వాణిజ్య సముదాయంలో అనధికారిక నిర్మాణాలు చేసినందుకు గాను బీఎంసీ రెండు వేరు వేరు నోటీసులు పంపింది. పశ్చిమ అంథేరిలోని ఒషివారా ప్రాంతంలో ప్రియాంక చోప్రాకు ఓ కమర్షియల్ బిల్డింగ్ ఉంది. వాస్తు కోసం ఈ బిల్డింగ్‌కు సంబంధించి అక్రమ నిర్మాణాలు చేసినందుకుగాను ఈ నోటీసులు పంపారు. అదే బిల్డింగ్ లోని బ్యూటీ స్పాకు వచ్చిన వారి ఫిర్యాదుల మేరకు తనిఖీలు నిర్వహించిన మున్సిపల్ అధికారులు, 2013లో ముంబై మున్సిపల్ అధికారుల మంజూరు చేసిన ప్లాన్‌కు విరుద్ధంగా నిర్మాణాలు జరిగినట్టుగా గుర్తించారు. వెంటనే అక్రమ నిర్మాణాలను తొలగించాలని లేని పక్షంలో చర్చలు తీసుకుంటామని తెలిపారు. -
లీగల్ వార్నింగ్
బజారులో చెత్త ఎందుకు వేశావ్ అనిప్రశ్నించిన అనుష్క శర్మకు, నన్ను లైంగికంగావేధించాడు అని తోటి నటుడు అలీ జఫర్ మీద ఆరోపించిన పాకిస్థాన్ నటి మీషా షఫీకు లీగల్ నోటీసులు సిద్ధంగా ఉన్నాయి. గీతాంజలి ఎలిజబెత్‌కు న్యూమరాలజీ తెలుసు. ... ‘అండ్ గాడ్ స్పోక్ ఇన్ నంబర్స్’ పేరుతో న్యూమరాలజీని వివరిస్తూ ఆమె పుస్తకం కూడా రాశారు. ఆమె పేరులోని ఇంగ్లిష్ స్పెలింగ్ ‘గీతా’లో ‘టీ’లు ఉంటాయి. మరో ‘టీ’ను జత చేయడం వల్ల మంచి జరుగుతుందని న్యూమరలాజికల్గా ఆమె భావించి ఉండవచ్చు. అలాగే ఆమె కుమారుడు అర్హాన్ సింగ్ పేరులో కూడా ఒక హెచ్‌కు బదులు రెండు హెచ్లు కనిపిస్తాయి. అలా చేస్తే కుమారుడి భవిష్యత్తు బాగుంటుందనీ ఆమె అనుకుని ఉండొచ్చు.ఏ నంబరు ప్రవర్తన ఎలా ఉంటుందో గణించే గీతాంజలికి ‘జూన్ 18’వ తేదీ మాత్రం పెద్ద కుదుపునే ఇచ్చిందని చెప్పాలి.ఆ రోజు క్రికెటర్ విరాట్ కోహ్లీ ఒక వీడియో ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. అది గీతాంజలి కుమారుడు అర్హాన్ సింగ్‌కు సంబంధించినది. అందులో కోహ్లీ భార్య, స్టార్ హీరోయిన్ అయిన అనుష్క శర్మ అర్హాన్ సింగ్‌ను మందలించింది.ముంబైలోని ఒక రోడ్డు మీద అర్హాన్ కారును సమీపిస్తూ కారులో ఉన్న అనుష్క అతడిని మందలించింది. ‘రోడ్డు మీద ప్లాస్టిక్ బాటిల్‌ని ఎందుకు పడేశావ్? ఏదైనా పారేయాలనుకుంటే డస్ట్‌బిన్‌ను ఉపయోగించు’ అని ఆమె గట్టిగా అనడం ఆ వీడియోలో ఉంది.విరాట్ కోహ్లీ ఆ వీడియోను పోస్ట్ చేస్తూ ‘లగ్జరీ కార్లలో ప్రయాణిస్తారుగానీ వీళ్ల బుర్రలు ఎలా ఉన్నాయో చూడండి. ఇలాంటివారు దేశాన్ని ఎలా శుభ్రంగా ఉంచుతారు’ అని కామెంట్ చేశాడు.భార్య ఎవరినైతే తిడుతోందో అతని ముఖం, అంటే అర్హాన్ ముఖం బ్లర్ చేయకుండా వీడియోను యథాతథంగా పోస్ట్ చేశాడుఆ రోజు నుంచి ఈ చెత్త గొడవ రాజుకోవడం మొదలైంది.ట్విట్టర్లో విరాట్ వీడియోను సమర్థించినవారూ ఉన్నారు, పెద్ద బడాయి అన్నట్టు చిరాకు పడినవారూ ఉన్నారు. కాని రెండో రోజుకు అనుష్క శర్మకు అర్హాన్ సింగ్ తిరుగు సమాధానం చెప్పడం వార్త అయి కూచుంది. ఏది శుభ్రత? దేశంలో ‘స్వచ్ఛ్ భారత్’ ఉద్యమం నడుస్తోంది. చెత్తను సరిగ్గా వేయడం గురించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రచారం చేస్తున్నాయి. ఇలాంటి నేపథ్యం బుర్ర మీద పని చేస్తుండగా అనుష్క శర్మ తాను ప్రయాణిస్తున్న దారిలో ఒక కారులో నుంచి ఒక వ్యక్తి ప్లాస్టిక్ బాటిల్ పడేస్తే కోపం తెచ్చుకోవడం సహజమైన ప్రతిస్పందన కావచ్చు. గొడవ అంతటితో ముగియాల్సిందే. కాని అనుష్క తిట్లకు గురైన అర్హాన్ సింగ్ ట్విట్టర్లో ఘాటుగా ప్రతిస్పందించాడు.‘శుభ్రత చాలా రకాలుగా ఉంటుంది. అందులో భాష శుభ్రత కూడా ఒకటి. నేను కారులో నుంచి పడేసిన చెత్త కంటే నీ నోటి నుంచి వచ్చిన చెత్త ఎక్కువ’ అని అతను అన్నాడు.ఇక్కడే అర్హాన్ సింగ్ గీతాంజలి కూడా తన కుమారునికి మద్దతునిస్తూ అనుష్కను తప్పు పట్టారు.‘నా కుమారుడు చేసింది తప్పే అవ్వొచ్చు గాక. కాని దానిని చెప్పే పద్ధతి ఇదేనా? కొంచెం మంచి భాషతో చెప్పి ఉంటే తక్కువస్థాయి నటి అయి ఉండేదా? అయినా తీవ్ర మనస్తత్వాలు ఉండే ఆమె లక్షలాది అభిమానుల మధ్య నా కుమారుడి ముఖం కవర్ చేయకుండా అతడి ప్రైవసీని భంగపరిచింది. నా కుమారుడి మాన ప్రాణాలకు ప్రమాదం తెచ్చి పెట్టింది’ అంటూ ఆమె కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో వ్యాఖ్యను పోస్ట్ చేశారు. అంతేకాదు ‘నువ్వు అంత పరుషంగా మాట్లాడినా దేవుడి దయ వల్ల నా కుమారుడు ఏమీ అనలేదు. ఎందుకంటే అతడి పెంపకం మంచిది’ అని కూడా ఆమె అన్నారు. లీగల్ నోటీసులు అయితే దీని తర్వాత అనుష్క లేదా విరాట్ నుంచి ఎటువంటి కవ్వింపు లేకపోయినా ఆ తల్లికొడుకులు మాత్రం వారికి లీగల్ నోటీసులు పంపారు. ‘అందులో ఏముందో ఇప్పుడే నేను బయటకు వెల్లడించదలచుకోలేదు’ అని అర్హాన్ సింగ్ తల్లి గీతాంజలి చెప్పారు. ‘గుట్టుగా బతుకుతున్న మమ్మల్ని... అనుష్కవిరాట్లు వీధిలో పడేశారు’ అన్న కోపం ఆ తల్లికొడుకుల్లో ఉంది. దానికి ప్రతీకారమే ఈ లీగల్ నోటీసులు అనుకోవచ్చు. కాని సమస్య అది కాదు. మంచి చెప్పే ప్రయత్నానికి ఇంత ప్రతిస్పందన అవసరమా అని? ఎలా చెప్పాలి? అర్హాన్ సింగ్‌ను అనుష్క శర్మ మందలిస్తున్న వీడియోను చూస్తే అనుష్క నైతిక ఆధిపత్యం తీసుకున్నట్టు కనిపిస్తుందని నెటిజన్లు అంటున్నారు. బాటిల్ పడేసిన అర్హాన్ అనుష్క ప్రతిస్పందనకు చేష్టలుడిగి కూర్చుని ఉండగా తిట్టే హక్కు తనకు ఉన్నట్టు అనుష్క అతడి పట్ల వ్యవహరించడం కనిపిస్తుంది. భర్త పక్కన ఉండగా ఆమె కొంచెం అతిశయం ఫీలై ఉండవచ్చు. కాని ఎవరినైనా సరిచేసే క్రమంలో స్త్రీలు ముఖ్యంగా తల్లులు గాని భార్యలు గాని ఇంటి ఆడవాళ్లు గాని గట్టిగానే అరవడం మనకు తెలుసు. పిల్లలను సరిచేసే క్రమంలో తల్లి, భర్తను సరి చేసే క్రమంలో భార్య గట్టిగా మాట్లాడటం ఉంది. అనుష్క కోపాన్ని కూడా అలా అర్థం చేసుకోవాలని కొందరు సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తే నిశ్శబ్దంగా ఉండి ఏ పక్షమూ మాట్లాడనివారూ కనిపిస్తున్నారు. ఏకంగా వంద కోట్ల దావా 36 ఏళ్ల పాకిస్థాన్ నటి మీషా షఫీ మన బాలీవుడ్ సినిమాలలో కూడా నటించింది. ఫర్హాన్ అఖ్తర్ ‘భాగ్ మిల్కా భాగ్’లో ఆమెను చూడవచ్చు. ఈమె ఏప్రిల్ 19, 2018న తన సహ నటుడు అలీ జఫర్ మీద ట్విట్టర్లో లైంగిక ఆరోపణలు చేసింది. ఇలాంటి సందర్భాలలో స్త్రీలందరూ కలిసికట్టుగా గొంతెత్తాలని కూడా ఆమె కోరింది. అయితే పాకిస్థాన్‌లో పెద్ద స్టార్ అయిన అలీ జఫర్ ప్రతినిధులు వెంటనే ఆమెను సంప్రదించి ట్విట్టర్లో క్షమాపణలు చెప్పి ఆ పోస్ట్ తీసేయమని, లేకుంటే దావా వేస్తామని చెప్పారు. అయితే మీషా వెనక్కు తగ్గలేదు. ‘ఇలా ఒకటి కంటే ఎక్కువసార్లే అలీ జఫర్ నన్ను ఇబ్బంది పెట్టాడు’ అని మళ్లీ పోస్ట్ చేసింది. ‘నేను నాలా ఆత్మవిశ్వాసంతో లొంగక ఉండటం వల్లే ఇలాంటి దాడి’ అని ఆమె అంది. దాంతో అలీ జఫర్ ఏకంగా వంద కోట్ల రూపాయలకు ఆమె మీద పరువు నష్టం దావా వేశాడు. ఇవన్నీ ఆధారాలు లేని ఆరోపణలు అని అతడి వాదన. దావాలతో నిరోధాలు సాధారణంగా పురుషుల మధ్య గొడవలు లీగల్ సమస్యలుగా మారుతుంటాయి. అయితే ఇటీవలి కాలంలో స్త్రీలను నిరోధించడానికి కూడా లీగల్ వ్యవస్థను ఒక ఆయుధంగా ఉపయోగించడం చూస్తున్నాం. ‘పెళ్లికి ముందు ఆడపిల్లలు సెక్స్‌లో పాల్గొనదలిస్తే సురక్షితంగా పాల్గొనాల్సి ఉంటుంది’ అని ఎయిడ్స్ నేపధ్యంలో ఖుష్బూ అన్న మాటలకు ఆమెపై ఎన్ని కేసులు పెట్టాలో అన్ని కేసులు పెట్టారు. ‘నేను శబరిమలను సందర్శించాను’ అని కన్నడ నటి జయమాల అన్నందుకు ఆమెపై కేసులు నమోదయ్యాయి. ‘అతడు నాకు సన్నిహితుడు’ అని ప్రకటించిన కారణాన తన పరువు బజారులో పడేసిందంటూ కంగనా రనౌత్‌పై హృతిక్ రోషన్, అతడి తండ్రి రాకేష్ రోషన్ లీగల్ నోటీసుల హెచ్చరికలకు దిగారు. డేరా బాబా సన్నిహితురాలు హనిప్రీత్ ఇన్సాన్పై ఆమె ఎన్నో అసాంఘిక కార్యకలాపాలు చేసి ఉండవచ్చు అని వ్యాఖ్యానించిన నటి రాఖీ సావంత్‌పై హనిప్రీత్ తల్లి ఐదు కోట్ల పరువు నష్టం దావా వేస్తానని బెదిరించింది. మలయాళంలో చిన్నపాటతో దేశ గుర్తింపు పొందిన ప్రియా వారియర్‌ను ఆ పాటలో నటించినందుకుగాను చట్టపరమైన చర్యల కోసం ప్రయత్నాలు జరిగాయి. చివరకు ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. ఇటీవల ఇండస్ట్రీ పోకడలపై పదే పదే వ్యాఖ్యానించిన తెలుగు నటి శ్రీరెడ్డికి కూడా లీగల్ నోటీసుల వార్నింగులు అందాయి. తనపై లైంగిక్ ఆరోపణలు చేసిన ఒక జూనియర్ ఆర్టిస్టుపై యాభై లక్షలకు పరువు నష్టం దావా వేస్తానని సినీ విమర్శకుడు కత్తి మహేశ్ హెచ్చరించారు. -
విరాట్, అనుష్కలకు లీగల్ నోటీసులు
ముంబై : గత ఐదు రోజుల క్రితం జరిగిన చెత్త గొడవ విరాట్, అనుష్కలను చిక్కుల్లో పడేసింది. ఇటీవల అనుష్క, విరాట్ కలిసి కారులో వెళుతుండగా పక్కనే లగ్జరీ కారులో వెళ్తున్న అర్హాన్ సింగ్ ప్లాస్టిక్ కవరును రోడ్డుపై పడేయడం... అది గమనించిన అనుష్క కారు ఆపి మరీ అతని ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేయడం... దాన్ని వీడియో తీసిన విరాట్ ట్విటర్లో పోస్టు చేయడం.. ఇదంతా ట్విటర్లో పెద్ద ఇష్యూనే అయింది. తాజాగా విరాట్, అనుష్కలకు వ్యతిరేకంగా అర్హన్ లీగల్ నోటీసులు పంపాడు. అర్హన్ పంపిన ఈ నోటీసులకు ఇంకా అనుష్క, విరాట్లు స్పందించలేదు. మరోవైపు అర్హాన్ సింగ్ ఫేస్బుక్ ద్వారా తాను చేసిన పనికి క్షమాపణలు చెప్పారు. కానీ అనుష్క, విరాట్ తన పట్ల ప్రవర్తించిన తీరును మాత్రం విమర్శించారు. ఈ మేరకే నోటీసులను పంపినట్టు తెలిసింది. ‘నేను రోడ్డుపై పడేసిన చెత్త కంటే అనుష్క నోట్లో నుంచి వచ్చిన చెత్తే ఎక్కువగా ఉంది. సెలబ్రిటీ అయివుండి రోడ్డున పోయే వ్యక్తిలాగా కేకలు వేసింది. ఇది మీకు మర్యాద అనిపించుకోదు’ అని పేర్కొన్నారు. నెటిజన్లు కూడా కొందరు విరుష్కలను తిట్టిపోశారు. ‘మ్యాచ్‌ల్లో నోటికొచ్చినట్లు మాట్లాడుతుంటారు. మీరు బూతులు మాట్లాడినప్పుడలా కెమెరాను స్లోమోషన్లో పెట్టొద్దు అని చెప్తారా? మిమ్మల్ని చూసి చాలా మంది అలా తిట్టడం ఫ్యాషన్ అనుకుంటున్నారు. అప్పుడు మీ విలువలు ఏమైపోయాయి?’ అని ఒకరు అడగ్గా, ‘అనుష్కకు రోడ్డుపై చెత్త పారేస్తున్నారన్న చింత కంటే.. దానిని వెంటనే వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలన్న ఆతృతే ఎక్కువగా ఉన్నట్టుంది. లేకపోతే అనుష్క అంతగా అరుస్తున్నప్పుడు విరాట్‌కు వీడియో తీయాలన్న ఆలోచన ఎలా వస్తుంది?’ అని మరో నెటిజన్ ప్రశ్నించాడు. ఇలా విరుష్కలపై పెద్ద ఎత్తున్న కామెంట్లు వచ్చాయి. -
‘శ్రీరెడ్డి నన్ను కూడా టార్గెట్ చేస్తుందేమో..’
టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్‌పై పోరాటాన్ని కొనసాగిస్తూ సంచలనం సృష్టిస్తున్న నటి శ్రీరెడ్డికి, నేచురల్ స్టార్ నానికి మధ్య జరుగుతున్న వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత కొద్దిరోజులుగా నానిపై శ్రీరెడ్డి పలు ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఆరోపణలపై నాని సైతం స్పందిస్తూ.. సహనానికి కూడా ఓ హద్దు ఉంటుందని ఆమెకు లీగల్ నోటీసులు పంపించారు. అయితే తాజాగా ఈ వివాదంపై హీరో విశాల్ స్పందించాడు. ‘నాని నాకు చాలా కాలంగా తెలుసు. అతను నాకు మంచి స్నేహితుడు. అంత మాత్రాన నేను అతడిని సమర్థించను. తాజాగా నానిపై శ్రీరెడ్డి చేసిన ఆరోపణలు వివాదాస్పదంగా ఉన్నాయి. నాని గురించి తెలిసిన వాళ్లందరికీ అతని ప్రవర్తన ఎలా ఉంటుందో తెలుసు. ఏదో పబ్లిసిటీ కోసం ఆరోపణలు చేయడం కాకుండా, ఆమె వద్ద ఏమైనా ఆధారాలు ఉంటే బయటపెట్టాలి. ఇదంతా చూస్తుంటే ఒకరి తర్వాత ఒకరిపై ఆమె వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. పోనుపోనూ ఆమె నన్ను కూడా టార్గెట్ చేస్తుందేమో. కాబట్టి ఇలాంటి ఆరోపణలు చేసినప్పుడు అందుకు తగిన ఆధారాలు కూడా చూపించాలి. సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఉందనేది వాస్తవం. కానీ దానిని సాకుగా చూపి ప్రముఖులపై ఆరోపణలు చేయడం సరైన పద్దతి కాదు’ అని అన్నారు. ‘అభిమన్యుడు’ విజయోత్సవ యాత్రలో భాగంగా విశాల్ ఈ వ్యాఖ్యలు చేశాడు . విశాల్, సమంత జంటగా నటించిన అభిమన్యుడు సినిమా భారీ విజయాన్ని అందుకుని మంచి కలెక్షన్లతో దూసుకెళ్తోంది. -
నానికి సవాల్ విసిరిన శ్రీరెడ్డి
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్‌పై పోరాటాన్ని కొనసాగిస్తూ సంచలనం సృష్టిస్తున్న శ్రీరెడ్డికి నాచురల్ స్టార్ నాని లీగల్ నోటీసులు పంపించిన విషయం తెలిసిందే. దీనికి శ్రీరెడ్డి స్పందించింది. తన పుట్టిన రోజు సందర్భంగా వేరే ప్రాంతానికి వెళ్తుంటే ఈ విషయం తెలిసిందన్నారు. తనకు కావాల్సింది కూడా ఇదేనని.. నీ రంకు బాగోతం బయటపెట్టడానికి ఓ మంచి అవకాశం తనకు వచ్చిందని నానిని ఉద్దేశించి అన్నారు. తప్పనిసరిగా ఫైట్ చేద్దాం.. గురువారం మళ్లీ హైదరాబాద్‌కు తిరిగి వస్తాను.. అప్పుడు నాని సంగతి చూస్తానని తెలిపారు. ఇక నానిపై చేసే పోరాటం చూసి మిగతా వారందరూ వణికిపోయేలా చేస్తానని ఛాలెంజ్ విసిరారు. అలాగే బాధిత మహిళలు ఎలా ఫైట్ చేయాలో నేను చేసి చూపిస్తాను. నీవ్వు నిజంగా తప్పు చేస్తే, కచ్చితంగా నీ మనఃసాక్షికి తెలుసు.. నీ భార్యకు అన్నీ చెబుతానని చెప్పావు. మన సంగతి చెప్పావో లేదో నాకు తెలియదన్నారు. నువ్వు జనాల్లో పరువు పోతుందని లీగల్ నోటీసులు పంపావు కానీ ఏమి జరిగిందో నీకు తెలుసన్నారు. నువ్వు నిజంగా తప్పు చేసి ఉంటే.. ధర్మానికి నిజంగా బలం ఉంటే.. నువ్వు కచ్చితంగా దోరుకుతావని, దేవుడు నిన్ను శిక్షిస్తాడన్నాడని సవాల్ విసిరారు. -
పవన్ కళ్యాణ్‌కు లీగల్ నోటీసులు
సాక్షి, శ్రీకాకుళం: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు పలాస టీడీపీ ఎమ్మెల్యే గౌతు శివాజీ లీగల్ నోటీసులు పంపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పలాసలో తాను అవినీతికి పాల్పడినట్లు పవన్ చేసిన ఆరోపణలు నిరూపించాలని సవాల్ విసిరారు. వ్యక్తిగతంగా తన కుటుంబంపై పవన్ విమర్శలు చేశారని దానికి సంజాయిషీ చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా కాశీబుగ్గలో మంగళవారం జరిగిన సభలో పవన్ మాట్లాడుతూ పలాస ఎమ్మెల్యే అవినీతికి పాల్పడుతున్నారని, పలాస ప్రజలకు అల్లుడు టాక్స్ పడుతోందని ఆరోపించిన విషయం తెలిసిందే. ‘ఇటీవల జీఎస్టీ విన్నాం.. కాని పలాసలో మాత్రం అదనంగా అల్లుడు టాక్స్ కట్టాలట’ అని పవన్ అన్న మాటలపై శివాజీ మండిపడ్డారు. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలన్నారు. తనపై లేని పోని ఆరోపణలు చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పసుపు నీళ్లతో శుద్ది కాశీబుగ్గలో నిన్న జరిగిన పవన్ కల్యాణ్ బహిరంగ సభా ప్రాంగణాన్ని టీడీపీ కార్యకర్తలు పసుపు నీళ్లతో శుద్దిచేశారు. పవన్ రాకతో సభా ప్రాంగణం అపవిత్రం అయ్యిందని అందుకే పసుపు నీళ్లతో శుద్దిచేశామని టీడీపీ కార్యకర్తలు చెప్పారు. కాగా తెలుగుదేశం పార్టీ నాయకులు అరాచకాలకు, భూ కబ్జాలకు పాల్పడుతున్నారని పవన్ కల్యాణ్ నిన్నటి సభలో ఆరోపించిన సంగతి తెలిసిందే -
నా పాట వాడుకున్నారు.. 7 కోట్లు కట్టండి!
సాక్షి, న్యూఢిల్లీ: కరీనా కపూర్, సోనం కపూర్, స్వర భాస్కర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న తాజా బాలీవుడ్ చిత్రం ‘వీరే ది వెడ్డింగ్’.. శశాంక్ ఘోష్ దర్శకత్వంలో మహిళా ప్రాధాన్య చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా చిక్కుల్లో పడింది. ఈ సినిమాలో ఉపయోగించుకున్న ‘హట్ జా తూ’ పాట వాస్తవానికి తాను రాసి పాడినదని, తన అనుమతి లేకుండా ఈ పాటను వాడుకున్నారని, కాపీరైట్స్ హక్కులను ఇది ఉల్లంఘించడమేనని హరియాణాకు చెందిన సింగర్ వికాస్ కుమార్ చిత్రయూనిట్‌కు లీగల్ నోలీసులు పంపారు. అనుమతి లేకుండా తన పాటను వాడుకున్నందుకు చిత్రయూనిట్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా తన పాటను వాడుకున్నందుకు రూ. 7 కోట్లు నష్టపరిహారం చెల్లించాలని, తన అనుమతితోనే పాటను సినిమాలో వాడుకోవాలని స్పష్టం చేశారు. సింగర్ వికాస్కుమార్ డిమాండ్ల మేరకు చిత్రయూనిట్ నడుచుకోకుంటే వారిపై సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని, కేంద్ర సెన్సార్ బోర్డు చైర్మన్‌కు కూడా ఫిర్యాదు చేస్తామని ఆయన లాయర్ తెలిపారు. -
అజ్ఞాతవాసికి మరిన్ని కష్టాలు..
సాక్షి, సినిమా : పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి చిత్ర కథ ‘కాపీ వివాదం’ మరో మలుపు తీసుకుంది. చిత్ర నిర్మాతలపై న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు మాతృక చిత్రం లార్గో వించ్(ఫ్రెంచ్) దర్శకుడు జెరోమ్ సల్లే సిద్ధమైపోయారు. ఈ మేరకు తన ట్విటర్లో ఆయన సంకేతాలు అందించారు. ‘‘వారం గడిచినా అజ్ఞాతవాసి చిత్ర యూనిట్ మౌనంగా ఉండటం బాగోలేదు. ఇక చర్యలు తీసుకునే సమయం వచ్చింది. మిగిలింది లీగల్ నోటీసులు పంపటం ’’ అంటూ ఆయన పేర్కొన్నారు. ఫ్రెంచ్ మూవీ 'లార్గో వించ్' చిత్రానికి అజ్ఞాతవాసి కాపీ అనే ప్రచారం జరిగిన సమయంలో... ఇండియాలో రీమేక్ హక్కులను దక్కించుకున్న 'టి సిరీస్' సంస్థ అభ్యంతరం వ్యక్తం చేసింది. 'అజ్ఞాతవాసి' చిత్ర దర్శక నిర్మాతలకు నోటీసులు పంపటంతో.. చివరకు టీ సిరీస్ తో సెటిల్ చేసుకుంటున్నారన్న వార్తలు వినిపించాయి. ఆ వెంటనే తెర పైకి వచ్చిన లార్గొ వించే దర్శకుడు జెరోమ్ సల్లే చిత్రాన్ని వీక్షించేందుకు ఆసక్తికనబరిచారు. ఈ క్రమంలో త్రివిక్రమ్ తన కథనాన్ని యాజ్ ఇట్ ఈజ్‌గా దించేశాడని సినిమా చూశాక సల్లే వ్యాఖ్యానించటం విశేషం. కొద్దిరోజుల క్రితం ఆయన మరో ట్వీట్ చేశారు. ‘‘సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది, కేవలం టీ సిరీస్ తో సెటిల్ చేసుకుంటే సరిపోదేమో?’’ అంటూ మరో ట్వీట్ చేసి చర్యలకు సిద్ధమౌతున్నట్లు సంకేతాలు అందించారు. ఈ క్రమంలోనే చిత్ర యూనిట్ నుంచి స్పందన లేకపోవటంతో ఆయన లీగల్ నోటీసులకు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. నెగటివ్ టాక్‌తో ఇప్పటికే ఈ చిత్రానికి భారీ డ్యామేజ్ కాగా, ఇప్పుడు న్యాయపరమైన చిక్కులతో మరో దెబ్బ తగలబోతోంది. Indian cinema has all the necessary talent and creativity for not having to plagiarize. And the silence from #Agnathavaasi team since one week is deafening. So let’s take action now. #LegalNotice — Jérôme Salle (@Jerome_Salle) 18 January 2018 Mood #LargoWinch #Agnathavasi pic.twitter.com/w2uLnwo9kD — Jérôme Salle (@Jerome_Salle) 17 January 2018 -
ఇళయరాజాతో భేదాభిప్రాయాలు లేవు
చెన్నై : సంగీత దర్శకుడు ఇళయరాజాతో తనకెలాంటి బేధాభిప్రాయాలు లేవని ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. గాయకుడిగా 50 వసంతాలను పూర్తి చేసుకున్న ఆయన తన గోల్డెన్ జూబ్లీని పురస్కరించుకుని తన సంగీత కళాకారుల బృందంతో కలిసి విదేశాల్లో సంగీత విభావరి నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే సంగీత కచేరిల్లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తన పాటలను పాడకూడదని ఇళయరాజా అనూహ్యంగా నిషేధం విధించడం, అందుకు నోటీసులు పంపడం వివాదంగా మారడం, సినీ వర్గాల్లో పెను సంచలనంగా మారడం తెలిసిందే. అయితే ఎస్పీబీ కూడా ఇకపై ఇళయరాజా పాటలను తాను పాడనని వెల్లడించారు కూడా. ఇలాంటి పరిస్థితుల్లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఒక చానల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ తనకు ఇళయరాజాకు మధ్య ఎలాంటి బేధాభిప్రాయాలు లేవని పేర్కొన్నారు. అయితే ఆయన చర్యలు తనను చాలానే బాధించాయన్నారు. అయినా తన సంగీత కచేరిలకు ఎలాంటి బాధింపు కలగలేదని పేర్కొన్నారు. అదే విధంగా రారా.. పోరా.. అని మాట్లాడుకునేంత స్నేహమే తమదని, అలాంటిది ప్రస్తుత సమస్యను కాలమే తీర్చాలని పేర్కొన్నారు. ఈ విషయమై ఇళయరాజాతో ఫోన్లో మాట్లాడమని కొందరు హితవు పలికారన్నారు. అయితే తనకూ కొంచెం ఆత్మాభిమానం ఉందని బాలసుబ్రహ్మణ్యం వ్యాఖ్యానించారు. -
మాటల్లేవ్... ఇళయరాజా పాటల్లేవ్!
‘‘అమెరికా టూర్ ప్రారంభానికి ముందు ఇళయరాజా నాతో ఈ అంశాన్ని చర్చిస్తే ఆయనతో మాట్లాడేవాణ్ణి. కానీ, లీగల్ నోటీస్ వచ్చిన తర్వాత నేనూ లీగల్‌గానే స్పందించవలసి (నేనెప్పుడూ అలా చేయాలనుకోను) ఉంటుంది లేదా చట్టాన్ని అంగీకరించాలి. నాకూ ఆత్మగౌరవం ఉంది’’ అని ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం అన్నారు. ‘ఎస్పీబీ50’ పేరుతో ఇటీవల అమెరికాలో నిర్వహించిన మ్యూజిక్ కన్సర్ట్‌లో సింగర్స్ ఇళయరాజా పాటలు ఆలపించారు. తన అనుమతి లేకుండా తన పాటలు పాడడంపై ఎస్పీబీకి ఇళయరాజా లీగల్ నోటీసులు పంపారు. దీనిపై ఎస్పీబీ స్పందిస్తూ –‘‘నాతో పాటు గాయని చిత్ర, చరణ్, మ్యూజిక్ కన్సర్ట్ నిర్వహకులకు లీగల్ నోటీసులు అందాయి. ఇళయరాజా అనుమతి లేకుండా ఆయన పాటలు పాడితే... కాపీరైట్ చట్టాలను ఉల్లంఘించినట్లేననీ, అందుకు భారీ మొత్తంలో ఆర్థిక జరిమానా చెల్లించడంతో పాటు చట్టపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని వాటిలో పేర్కొన్నారు. ఈ చట్టాలపై నాకు అవగాహన లేదు. గతంలో ఇతర దేశాల్లో మ్యూజిక్ కన్సర్ట్లు నిర్వహించినప్పుడు లేనిది, ఇప్పుడీ అమెరికా టూర్ ప్రారంభించిన తర్వాత ఎందుకు నోటీసులు పంపారో అర్థం కావడం లేదు. ముందు చెప్పినట్టు నాకు చట్టాలపై అవగాహన లేదు. ఇదే చట్టమైతే.. నేను పాటిస్తా. ఈ పరిస్థితుల్లో ఇకపై ఇళయరాజా పాటలు పాడలేము. కానీ, షోలు జరుగుతాయి. భగవంతుడి దయ వల్ల ఇతర స్వరకర్తలకు నేను చాలా పాటలు పాడాను. వాటిని ‘ఎస్పీబీ50’లో ఆలపిస్తాం. శ్రోతలు ఎప్పటిలా ప్రేమాభిమానాలు చూపిస్తారని ఆశిస్తున్నా. ఈ అంశంపై ఎవరూ కఠినంగా స్పందించొద్దని విజ్ఞప్తి చేస్తున్నా. ఇదంతా భగవంతుడి లీల అయితే... భక్తిశ్రద్ధలతో శిరసావహిస్తా. సర్వేజనా సుఖినోభవంతు’’ అన్నారు. ‘‘కన్సర్ట్ నిర్వహకులకు నష్టాలు రావాలనీ, స్నేహితుడు ఇళయరాజాకు అసౌకర్యం కలిగించాలానీ అనుకోవడం లేదు. ప్రేక్షకులకు విషయం తెలియజేయాలనే సోషల్ మీడియాలో ఈ పోస్ట్ చేశా’’ అన్నారు ఎస్పీబీ. -
బాలుకు లీగల్ నోటీస్ పంపిన ఇళయరాజా
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా, గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంకు లీగల్ నోటీసులు పంపారన్న వార్త సంగీత అభిమానులను కలవరపెడుతోంది. ప్రస్తుతం సినిమా పాటల పాడటానికి పెద్దగా ఇంట్రస్ట్ చూపించని బాలు.. ఇతర దేశాల్లో మ్యూజిక్ కన్సర్ట్‌లను నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో ఇతర సంగీత దర్శకులు సారధ్యంలో ఆయన పాడిన పాటలను వేదిక మీద పాడి అభిమానులను అలరిస్తుంటారు. అయితే కొంత కాలంగా తను కంపోజ్ చేసిన పాటల రైట్స్ విషయంలో నిక్కచ్చిగా వ్యవహరిస్తున్న ఇళయరాజా, అంతర్జాతీయ వేదికల మీద తన అనుమతి లేకుండా, తాను కంపోజ్ చేసిన పాటలు పాడటంపై సీరియస్ అయ్యారు. అంతేకాదు కాదు ఇలాంటి ఈవెంట్లను తరుచూ నిర్వహిస్తున్న ఎస్ బి బాలసుబ్రమణ్యంతో పాటు గాయని చిత్ర, ఎస్ పి కుమార్ చరణ్‌లకు లీగల్ నోటీసుల పంపిచారు. ఇక మీదట తన అనుమతి లేకుండా తన పాటలను ప్రదర్శనలలో ఆలపిస్తే చట్టపరమైన చర్యలు కుంటామని తెలిపారు. తనకు లీగల్ నోటీసులు వచ్చిన విషయాన్ని బాలు ధృవీకరించారు. ఇటీవల టొరంటో, రష్యా, దుబాయ్‌లలో జరిగిన పలు వేడుకల్లో తాను ఇళయరాజా గీతాలను ఆలపించానని కానీ అమెరికాలో చేసే కన్సర్ట్కు మాత్రమే రాజా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో అర్ధం కావటం లేదన్నారు. అదే సమయంలో తన ట్రూప్ లోని ఇతర గాయకులకు ఇకపై ఇళయారాజా గీతాలను స్టేజ్ పై పర్ఫామ్ చేయవద్దని సూచించినట్టుగా తెలిపారు. -
బాలుకు లీగల్ నోటీస్ పంపిన ఇళయరాజా
-
బాల్య వివాహం.. అది చాలక లీగల్ నోటీసు
తన వయసు కంటే రెట్టింపు వయసున్న వ్యక్తిని పెళ్లి చేసుకుని, అతడి వద్ద నుంచి తిరిగి వచ్చేసిన 16 ఏళ్ల బాలికకు ఆమె 'వైవాహిక విధులను' గుర్తుచేస్తూ లీగల్ నోటీసు పంపారు. ఈ ఘటన సాక్షాత్తు రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోనే జరిగింది. బాల్యవివాహం దానంతట అదే చట్టవిరుద్ధం కాదని, అందువల్ల ఫిర్యాదు ఇస్తే తప్ప తాము చర్యలేవీ తీసుకోలేమని పోలీసులు అంటున్నారు. దాంతో ఏంచేయాలో అర్థం కాని ఆ బాలిక.. సాయం కోసం బాలల హక్కుల కార్యకర్తలను ఆశ్రయించింది. ఆమె గత సంవత్సరం ఫిబ్రవరిలో పదో తరగతి పరీక్షలు రాయడానికి సిద్ధం అవుతుండగా.. బలవంతంగా ఆమెకంటే 20 ఏళ్లు పెద్దవాడైన బంధువుకు ఇచ్చి పెళ్లి చేశారు. అత్త చనిపోతోందని, తన కొడుకు పెళ్లి చూడాలనుకుంటోందని.. అందువల్ల పెళ్లికి ఒప్పుకోవాలని చెప్పి ఒప్పించారు. ఆ పెళ్లంతా హడావుడిగా జరిగిపోయిందని, అతడికి 35 ఏళ్ల వయసున్న విషయం అప్పట్లో తనకు తెలియదని బాధిత బాలిక తెలిపింది. పెళ్లి తర్వాత కూడా తనను చదువుకోనివ్వాలని అప్పట్లో ఆమె షరతు విధించింది. పరీక్షల తర్వాత ఆమెను అత్తవారింటికి పంపారు. అక్కడ దాదాపు ప్రతిరోజూ శారీరకంగా, లైంగికంగా విపరీతంగా హింసించడం మొదలుపెట్టారు. పెళ్లయిన రెండు నెలల తర్వాత ఆ చిత్రహింసలు భరించలేక ఆమె ఇంటికి తిరిగొచ్చేసింది. కట్నంగా ఇచ్చిన లక్ష రూపాయలు, నగలు తిరిగి ఇచ్చేయాలని వియ్యంకులను అడగ్గా, వాళ్లు ఆమెకు లీగల్ నోటీసు పంపారు. అమ్మాయి తల్లిదండ్రులకు డబ్బులు ఇవ్వడం కంటే, ఆడబ్బేదో లాయర్లకే ఇస్తామని అమ్మాయి భర్త అన్నాడు. ప్రస్తుతం జూనియర్ కాలేజీకి వెళ్లి చదువుకుంటున్న ఆ అమ్మాయి.. ఇక తిరిగి భర్త వద్దకు వెళ్లేది లేదని చెబుతోంది. తాను చదువుకుని, సొంత కాళ్ల మీద నిలబడతానని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తోంది. -
రహస్య పత్రాలను 48 గంటల్లో వెనక్కిచ్చేయండి
మిస్త్రీకి టాటా సన్స్ మరో లీగల్ నోటీసు... సమాచారం బయటపెట్టనని హామీ ఇవ్వాలంటూ డిమాండ్ న్యూఢిల్లీ: కంపెనీకి సంబంధించిన రహస్య సమాచార పత్రాలన్నింటినీ తమకు వెంటనే తిరిగి స్వాధీనం చేయాలని టాటా సన్స్... సైరస్ మిస్త్రీని కోరింది. కంపెనీ ఆంతరంగిక సమాచారాన్ని బయటపెట్టడం ద్వారా గోప్యతా నిబంధనల్ని మిస్త్రీ ఉల్లంఘించారంటూ టాటా సన్స్ ఇప్పటికే ఆరోపించిన విషయం తెలిసిందే. తప్పుడు పద్ధతుల్లో, విశ్వాసరహితంగా, తమ అనుమతి లేకుండా కంపెనీ నుంచి ఈ పత్రాలను తీసుకెళ్లినట్టు ఆరోపించింది. చట్ట ప్రకారం శిక్షించదగిన నేరంగా దీన్ని పేర్కొంది. వెంటనే 48 గంటల్లోపు వాటిని తమకు స్వాధీనం చేయాలని, కాపీలను కూడా తన దగ్గర ఉంచుకోవద్దని కోరింది. ఆ సమాచారాన్ని భవిష్యత్తులో ఎప్పుడూ బహిర్గతపరచనని, గోప్యతను కాపాడతానని హామీ పత్రంపై సంతకం చేయాలంటూ గురువారం లీగల్ నోటీసు జారీ చేసింది. మూడు రోజుల్లో మిస్త్రీకి ఇది రెండో లీగల్ నోటీసు కావడం గమనార్హం. ‘‘టాటా సన్స్‌తోపాటు, నిర్వహణ కంపెనీలకు ఎగ్జిక్యూటివ్ చైర్మన్, డైరెక్టర్‌గా వ్యవహరించిన మీ దగ్గర కంపెనీకి సంబంధించిన రహస్య, వాణిజ్యపరంగా సున్నితమైన సమాచారం ఉంది. చట్ట ప్రకారం విధుల్లో భాగంగా ఆ గోప్యతను, డైరెక్టర్‌గా మీకు తెలిసిన రహస్య సమాచారాన్ని కాపాడాల్సి ఉంటుంది. దీన్ని వెల్లడించరాదు. ఈ సమాచారాన్ని దేనికీ వినియోగించరాదు. అలాగే, అనుబంధ సంస్థలు, బంధువులు, కుటుంబ సభ్యులకు కూడా తెలియజేయరాదు’’ అంటూ టాటా సన్స్ తన నోటీసులో మిస్త్రీని కోరింది. చట్టబద్ధమైన ఈ విధులను ఉల్లంఘిస్తే టాటా సన్స్‌కు కోలుకోలేని నష్టం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. టాటా సన్స్, టాటా గ్రూపునకు సంబంధించి ఎంతో విలువైన సమాచారం మిస్త్రీ వద్ద ఉందని పేర్కొంది. అభ్యర్థన మాత్రమే... టాటా సన్స్ పంపిన లీగల్ నోటీసుపై మీడియా విచారణలకు మిస్త్రీ కార్యాలయం స్పందించింది. నోటీసుగా పేర్కొంటున్న టాటా లేఖ... కోర్టులు, ట్రిబ్యునళ్లకు డాక్యుమెంట్లను, రికార్డులను అందించవద్దని, అవి గోప్యంగా ఉంచాల్సినవంటూ చేసిన అభ్యర్థన మాత్రమేనని పేర్కొంది. దీనిపై బహిరంగంగా వ్యాఖ్యానించబోమని, వార్తల కోసం ప్రత్యుత్తరం ఇవ్వబోమని మిస్త్రీ కార్యాలయం స్పష్టం చేసింది. గోప్యత అంటూ వారు తమ లేఖలను మీడియాకు విస్తృతంగా పంపిణీ చేయడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించింది. ఈ విధమైన ప్రవర్తన న్యాయ వ్యవస్థ పరిధిలో జోక్యం చేసుకోవడంగా భావిస్తున్నట్టు మిస్త్రీ కార్యాలయం ప్రకటన జారీ చేసింది. -
రహస్యాల ఉల్లంఘనకు పాల్పడ్డారు!
మిస్త్రీకి టాటా సన్స్ లీగల్ నోటీస్ • ఎన్సీఎల్టీ ముందు సున్నితమైన కంపెనీ పత్రాలను ఉంచారని విమర్శ • ఈ చర్యలకు పాల్పడవద్దని స్పష్టీకరణ ముంబై: ‘‘మీరు అనుసరిస్తున్న విధానాలు, చేస్తున్న పనులు నేరపూరిత విశ్వాస ఘాతుక చర్యల పరిధిలోకి వస్తాయి’’ ఇది తాజాగా బహిష్కృత చైర్మన్ సైరస్ మిస్త్రీపై టాటా సన్స్ విమర్శ. ఈ మేరకు మంగళవారం మిస్త్రీకి టాటా సన్స్ ఒక లీగల్ నోటీస్‌ను జారీ చేసింది. తనను చైర్మన్‌గా తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో దాఖలు చేసిన పిటిషన్లో పలు కీలక సున్నిత కంపెనీ పత్రాలను బహిరంగ పరిచారని టాటా సన్స్ ఈ లీగల్ నోటీసుల్లో పేర్కొంది. ఇందులో బోర్డ్ సమావేశాల మినిట్స్, ఫైనాన్షియల్ అంశాలు, గణాంకాలు ఉన్నాయని పేర్కొన్న టాటా సన్స్, ఇది రహస్యాల ఉల్లంఘనలకు పాల్పడ్డమేనని పేర్కొంది. ‘‘టాటా సన్స్ డైరెక్టర్ హోదాలో మీకు అందిన కీలక, రహస్య, సున్నిత సమాచారాన్ని ఇతరులతో పంచుకోవడాన్ని ఇకముందు మానుకోండి’’ అని టాటా సన్స్ డిమాండ్ చేసింది. నేపథ్యం ఇదీ... టాటా గ్రూపు చైర్మన్‌గా ఉద్వాసనకు గురైన మిస్త్రీ, ఆ తర్వాత గ్రూపు నిర్వహణ లోపాలపై సంచలన ఆరోపణలకు దిగిన విషయం తెలిసిందే. అనూహ్యంగా టాటా గ్రూపు కంపెనీల బోర్డు డైరెక్టర్ పదవులకు రాజీనామా చేసిన మిస్త్రీ మరుసటి రోజే అంటే ఈ నెల 20న కంపెనీ లా ట్రిబ్యునల్‌లో సైరస్ ఇన్వెస్ట్మెంట్స్ తరఫున పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌తోపాటు, మిస్త్రీ కుటుంబానికే చెందిన స్టెర్లింగ్ ఇన్వెస్ట్మెంట్స్ కార్పొరేషన్ లిమిటెడ్ దాఖలు చేసింది. టాటా సన్స్ బోర్డ్ నిర్ణయాలను తోసిపుచ్చాలని, యాజమాన్య లోపాలను సరిదిద్దేలా తగిన చర్యలు తీసుకోవాలని ట్రిబ్యునల్‌ను పిటిషన్ కోరింది. అయితే పిటిషన్లపై జనవరి 31, ఫిబ్రవరి 1తేదీల్లో విచారణ జరిపేందుకు ట్రిబ్యునల్ డివిజన్ బెంచ్ అంగీకరించింది. అప్పటికప్పుడు మధ్యం తర ఉపశమనం కల్పించాలన్న పిటిషనర్ వినతిని పరిశీలించబోమని... అసలు మధ్యంతర చర్యలను అనుమతించబోమని మాత్రం స్పష్టం చేసింది. అయితే ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన ట్రిబ్యునల్, విచారణను వేగంగా పూర్తి చేసి ఓ నెలలో ఆదేశాలు జారీకి అంగీకరించడం మిస్త్రీకి కొంతలో కొంత ఊరట. ఆయా పరిణామాల నేపథ్యంలో తాజాగా మిస్త్రీకి ఈ లీగల్ నోటీసులు జారీ అయ్యాయి. మిస్త్రీకి టాటా సన్స్ తరఫున లా ఫామ్ ష్రాదుల్ అమర్‌చంద్ మంగళ్‌దాస్ అండ్ కంపెనీ జారీ చేసిన తాజా లీగల్ నోటీసులో మరికొన్ని ముఖ్యాంశాలు... ⇔ పిటిషన్లో భాగంగా సైరస్ మిస్త్రీకి సంబంధించి రెండు కంపెనీలు ఉద్దేశపూర్వకంగా పలు కీలక పత్రాలను దాఖలు చేశాయి. వీటిలో టాటా సన్స్, టాటా గ్రూప్ కంపెనీలు, జాయింట్ వెంచర్లకు సంబంధించిన ఆర్థిక సమాచార అంశాలు, వ్యాపార వ్యూహాలు రహస్య గణాంకాలు ఉన్నాయి. ⇔ టాటా కోడ్ ఆఫ్ కాండక్ట్ కింద మీ బాధ్యతలను, టాటా సన్స్ పట్ల మీ విశ్వాస విధులను, రహస్య, కీలక సమాచారాన్ని బహిరంగ పరచకూడదన్న నిబంధనలను అన్నింటినీ మీరు ఉల్లంఘించారు. ⇔ ఒక డైరెక్టర్‌గా ఇది మీ న్యాయపరమైన బాధ్యతలను ఉల్లంఘించడమే కాదు, మా క్లయింట్ల ప్రయోజనాలకు విఘాతం కలిగేలా పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించారు. మీరు చేసిన చర్యలు టాటా సన్స్‌కు, టాటా గ్రూప్ కంపెనీల ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తాయి. ⇔ మీ చర్యలు అన్నీ నిర్వహణారాహిత్య చర్యల కిందకి వస్తాయి. టాటా సన్స్, టాటా గ్రూప్ కంపెనీల శ్రేయస్సును మీరు ఎంతమాత్రం కోరుకోవడం లేదన్న విషయాన్ని మీ చర్యలు స్పష్టం చేస్తున్నాయి. జేఎన్ టాటా సౌశీల్యతలు మీ ప్రవర్తనలో కనిపించడం లేదు. ⇔ మీ లీగల్ పొసీడింగ్స్లో ఇచ్చే సమాచారం, వినియోగించే పత్రాలు టాటా సన్స్, టాటా గ్రూప్ కంపెనీల ప్రయోజనాలకు ఎంతమాత్రం విఘాతం కలిగించరాదని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ⇔ ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే... న్యాయపరమైన చర్యలను ఎదుర్కొనాల్సి ఉంటుంది. -
సైరస్ మిస్త్రీని వెంటాడుతున్న కష్టాలు
ముంబై: టాటా గ్రూప్ చైర్మన్ పదవి నుంచి ఉద్వాసనకు గురైన సైరస్ మిస్త్రీని కష్టాలు వెంటాడుతున్నాయి. కంపెనీకి చెందిన రహస్య విషయాలు వెల్లడించారని ఆరోపిస్తూ టాటా సన్స్ మంగళవారం ఆయనకు లీగల్ నోటీసు పంపించింది. టాటా గ్రూపు నియమావళి, గోప్యతను ఉల్లంఘించారని ఆరోపించింది. టాటా సన్స్ డైరెక్టర్‌గా మిస్త్రీ కీలక, రహస్య సమాచారాన్ని వెల్లడించారని నోటీసులో పేర్కొంది. టాటా గ్రూప్ చైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్త్రీని తొలగించిన సంగతి తెలిసిందే. దిగ్గజ గ్రూప్‌ను ముందుకు నడిపించే విషయంలో సైరస్ మిస్త్రీపైనా, ఆయన సామర్ధ్యంపైనా నమ్మకం కోల్పోయినందునే బోర్డు ఉద్వాసన పలికిందని టాటా సన్స్ తాత్కాలిక చైర్మన్ రతన్ టాటా వ్యాఖ్యానించారు. ఆ తర్వాత టాటా గ్రూప్ సంస్థల బోర్డుల్లో డైరెక్టర్ హోదా నుంచి సైరస్ మిస్త్రీ వైదొలిగారు. టాటా మోటార్స్, ఇండియన్ హోటల్స్ సహా ఆరు లిస్టెడ్‌కంపెనీల బోర్డుల నుంచి వైదొలుగుతున్నట్లు మిస్త్రీ వెల్లడించారు. -
హీరోయిన్‌కు, ఆమె సోదరికి సమన్లు
ముంబై: బాలీవుడ్ స్టార్స్ హృతిక్ రోషన్, కంగనా రనౌత్ లవ్ స్టోరీ ఎపిసోడ్లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ప్రేమకు కటీఫ్ చెప్పాక ఇద్దరూ ఈ మెయిల్స్ విషయంపై పరస్పరం లీగల్ నోటీసులు ఇవ్వగా, తాజాగా హృతిక్ ఎఫ్ఐఆర్లో తొలిసారి కంగనా పేరును చేర్చాడు. హృతిక్ ఫిర్యాదు మేరకు విచారణకు రావాల్సిందిగా ముంబై సైబర్ సెల్ పోలీసులు కంగనాకు సమన్లు జారీ చేశారు. ఈ కేసులో కంగనా సోదరి రంగోలీని సాక్షిగా చేర్చడంతో ఆమెను కూడా విచారణకు పిలిచారు. ముంబైలోని బంద్రా-కుర్లా కాంప్లెక్స్‌లోని సైబర్ సెల్ పోలీస్ స్టేషన్‌కు వారం రోజుల లోపు విచారణకు హాజరు కావాలని కంగనా సిస్టర్స్‌ను పోలీసులు ఆదేశించారు. హృతిక్, కంగనా ప్రేమలో ఉన్నప్పుడు ఈమెయిల్స్ పంపుకున్నారు. ప్రేమ విఫలమయ్యాక పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. 2014 డిసెంబర్లో ఫిర్యాదు చేసినపుడు హృతిక్.. కంగనా పేరును పేర్కొనలేదు. -
ఆ స్టార్ జంట డర్టీ సీక్రెట్స్ బయటపడ్డాయి!
బాలీవుడ్లో ప్రేమలు, ప్రణయాలు, వాటి చుట్టూ వదంతులు కొత్త కాదు. కానీ బాలీవుడ్ స్టార్స్ హృతిక్ రోషన్, కంగనా రనౌత్ మధ్య 'ఎఫైర్' మాత్రం రచ్చకెక్కి హల్చల్ చేస్తోంది. తాజాగా ఈ ఇద్దరు నటులు పరస్పరం లీగల్ నోటీసులు పంపించుకున్నారు. గత జనవరిలో హృతిక్ ను ఉద్దేశించి కంగనా 'సిల్లీ ఎక్స్' (బోయ్‌ఫ్రెండ్) అనడంతో వివాదం మొదలైంది. ఈ వ్యవహారంపై అప్పట్లో గుర్రుగా స్పందించిన హృతిక్ ఇప్పుడు ఏకంగా కంగనాకు లీగల్ నోటీసులు పంపాడు. ఆ వ్యాఖ్యలు చేసినందుకు తనకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాడు. దీనికి దీటుగా కంగనా కూడా లీగల్ నోటీసులతో బదులిచ్చింది. ఈ లీగల్ నోటీసుల్లోని కంటెంట్ మాత్రం ఈ ఇద్దరి మధ్య పెద్ద గూడుపుఠాణి జరిగినట్టు వెల్లడిస్తోంది. కంగనా తనకు రోజుకు 50కిపైగా ఈమెయిల్స్ పంపి.. తనను వెంటాడిందని, ఆమె మొత్తంగా 1,439 ఈమెయిల్స్ పంపిందని తన లీగల్ నోటీసులలో హృత్తిక్ తెలిపాడు. సామాజికంగా సరిగ్గా వ్యవహరించలేని అస్పర్జెర్ అనే మానసిక రుగ్మతతో ఆమె బాధపడుతున్నదని, అందుకే ఈమెయిల్స్‌కు తాను ఎప్పుడూ సమాధానమివ్వలేదని అతను పేర్కొన్నాడు. కంగనా కూడా తన లీగల్ నోటీసులలో దీటుగా సమాధానమిచ్చింది. ఒక సీక్రెట్ ఈమెయిల్ ఐడీతో హృతిక్ తనతో సంభాషణ కొనసాగించాడని, మెయిల్స్ కూడా పంపాడని పేర్కొంది. అయితే హృతిక్ మాత్రం తన పేరిట ఎవరో నకిలీ ఐడీతో ఆమెకు మెయిల్స్ పంపించడంతో తాను ఒరిజినల్ ఐడీని ఆమెకు ఇచ్చానని, అంతేకానీ కంగనాతో తాను మాట్లాడలేదని హృతిక్ అంటున్నాడు. కంగనా మాత్రం తన అకౌంట్‌ను హృత్తిక్ హ్యాక్ చేసి.. అతడు విడాకుల వ్యవహారానికి ఇబ్బంది కలుగకుండా ఆ మెయిల్స్ అన్ని డిలీట్ చేశాడని ఆరోపించింది. తాను ఆయనకు పంపిన ఈమెయిల్స్ బహిర్గత పరిస్తే అతడిపై పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించింది. హృతిక్ తో సత్సంబంధాలు కొనసాగిన సమయంలో ఆ మెయిల్స్ పంపడం జరిగిందని, వాటిని అడ్డం పెట్టుకొని బెదిరించాలని చూస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని, క్రిమినల్ ప్రొసీడింగ్స్ చేపట్టాల్సి ఉంటుందని హెచ్చరించింది. హృతిక్, కంగనా రెండు సినిమాలు 'కైట్', 'క్రిష్-3'లో కలిసి నటించారు. 'కైట్' సందర్భంగా వీరి మధ్య స్నేహం చిగురించగా.. 'క్రిష్-3' సమయంలో వీరి మధ్య సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయనే వదంతులు వచ్చాయి. ఆ సమయంలోనే హృతిక్ భార్య సుసానే ఖాన్ విడాకుల కోసం కోర్టుకు ఎక్కింది. ఈ దంపతులు వీడిపోవడానికి కంగనానే కారణమని అప్పట్లో పుకార్లు షికారు చేశాయి. ఈ వార్తల నేపథ్యంలో కంగనా ...హృతిక్ ను ఎక్స్ బోయ్‌ఫ్రెండ్ అనడం.. చినికిచినికి పెద్ద వివాదంగా మారి లీగల్ నోటీసులకు దారితీసింది. -
బండ్ల గణేష్‌పై చీటింగ్ కేసు పెట్టిన హీరో
హైదరాబాద్ : ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ మరోసారి వివాదంలో ఇరుక్కున్నారు. ఆయనపై చీటింగ్ కేసుతో పాటు చెక్ బౌన్స్ కేసు నమోదు అయింది. 'నీ జతగా నేనుండాలి' సినిమా వివాదంపై బండ్ల గణేష్ లీగల్ నోటీసులు అందుకున్నారు. వైకింగ్ మీడియా సంస్థ బండ్ల గణేష్ కు నోటీసులు పంపింది. హీరో సచిన్ జోషి...వైకింగ్ మీడియా సంస్థకు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. 'ఆషికి 2' చిత్రాన్ని నీ జతగా నేనుండాలి పేరుతో తెలుగులో రీమేక్ చేసిన విషయం తెలిసిందే. సచిన్ జోషి, నజియా జంటగా శివబాబు బండ్ల సమర్పణలో పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై జయ రవీంద్ర దర్శకత్వంలో బండ్ల గణేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే నీ జతగా నేనుండాలి సినిమాకీ గణేష్ ప్రొడ్యూసర్‌గా ఉన్నప్పటికీ ఆ సినిమా నిర్మాణానికి పెట్టుబడి పెట్టింది సచిన్ జోషినే. అయితే ఆ సినిమా విషయంలో గణేష్ తనని మోసం చేశాడని, డిస్ట్రిబ్యూషన్ డబ్బులు కూడా తిరిగి ఇవ్వలేదని వైకింగ్ మీడియా ఫిర్యాదు చేసింది. సినిమా బాగానే ఆడినప్పటికీ లాభాల్లో వాటా ఇస్తానని చెప్పి... చివరికి నష్టాలు వచ్చాయని బండ్ల గణేష్ తప్పుడు లెక్కలు చూపినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
అమీర్‌ఖాన్‌కు నోటీసులు
-
అమీర్‌ఖాన్‌కు నోటీసులు
ముంబై: బాలీవుడ్ హీరో అమీర్‌ఖాన్ ఇపుడు చిక్కుల్లో పడ్డారు. పాపులర్ టీవీ షో సత్యమేవ జయతేలో జాతీయ చిహ్నాన్ని (లోగో), అందులో సత్యమేవ జయతే అనే భాగాన్ని కేంద్ప్రభుత్వ అనుమతి లేకుండా సొంత ప్రయోజనాలకు వాడుకున్నారనే ఆరోపణలపై ఆయనకు నోటీసులు జారీ అయ్యాయి. ముంబైకి చెందిన మనోరంజన్ రాయ్ అనే ఆందోళనకారుడు తన లాయర్ ద్వారా ఈ నోటీసులు పంపించారు. విశేష ప్రజాదరణ పొందిన సత్యమేవ జయతే కార్యక్రమానికి యాంకర్ కమ్ నిర్మాతగా వ్యవహరించిన అమీర్‌ఖాన్, ఆయన భార్య, సహనిర్మాత కిరణ్ రావు, దర్శకుడు సత్యజిత్ భక్తల్ ను ఇందులో దోషులుగా పేర్కొన్నారు. జాతీయ చిహ్నాన్ని గానీ, దాంట్లోని ఏదైనా భాగాన్నిగానీ, వ్యక్తిగత, ఆర్థిక ప్రయోజనాలకు వాడుకోవడానికి ఎవరికీ అధికారం లేదని రాయ్ న్యాయవాది మనోజ్ సింగ్ వాదిస్తున్నారు. ఒకవేళ అనుమతి తీసుకుని ఉంటే దానికి సంబంధించిన పత్రాలను చూపించాలని కోరారు. లేదంటే దీనికి సంబంధించి తన క్లయింటు తరఫున చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే దీనిపై స్పందించడానికి అమీర్ ఖాన్, కిరణ్‌రావు తదితరులెవ్వరూ అందుబాటులో లేరు. -
అన్నపూర్ణ స్టూడియోకి నోటీసులు
హైదరాబాద్ : తీసుకున్న లోన్లు చెల్లించనందుకు రెండు బ్యాంకుల నుంచి అన్నపూర్ణ స్టూడియోకి లీగల్ నోటీసులు అందాయి. వివరాల ప్రకారం... సినీనటుడు నాగార్జునకు చెందిన అన్నపూర్ణ స్టూడియో రెండు బ్యాంకులకు కలిపి దాదాపు రూ.62 కోట్లు బకాయి పడింది. ఆంధ్రా బ్యాంక్‌కు రూ.29.7 కోట్లు బాకీ పడగా, ఇండియన్ బ్యాంక్‌కు రూ.32.3 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆ రెండు బ్యాంకుల అధికారులు సోమవారం అన్నపూర్ణ స్టూడియో యాజమాన్యానికి లీగల్ నోటీసులు అందజేశారు. -
కేజ్రీవాల్‌కు బీజేపీ లీగల్ నోటీసు జారీ
సాక్షి, న్యూఢిల్లీ: ఓటరు జాబితాలో నకిలీ ఓటర్లను చేర్పించి బీజేపీ అవకతవకలకు పాల్పడుతోందని ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్‌కు బీజీపీ లీగల్ నోటీసు జారీ చేసింది. తమపై అసత్యపు ఆరోపణలు చేసినందుకు కేజ్రీవాల్‌కు నోటీసు జారీ చేసిట్లు బీజేపీ ఢిల్లీ శాఖఅధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ చెప్పారు. కేజ్రీవాల్‌పై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు కూడా చేసినట్లు ఆయన తెలిపారు. ఎన్నికల కమిషన్‌కు పిర్యాదు చేసిన ఆయన ఎలాంటి రుజువులు సమర్పించలేదని చెప్పారు. ‘ప్రతి నియోజకవర్గంలో ఓటరు జాబితాలో కనీసం 5,000 వేల మంది నకిలీ ఓటర్లను చేర్పించడంతోపాటు, ఆప్ ఓటర్లను తొలగించేలా చూడాలని బీజేపీ అగ్ర నేత ఆ పార్టీ ఎమ్మెల్యేలను ఆదేశించారని కేజ్రీవాల్ శనివారం ట్వీట్ చేశారు. ఇందుకు బీజేపీ రేట్లు కూడా నిర్ణయించిందని, ఈ పని చేసిన వ్యక్తి తనకు ఈ విషయం చెప్పాడు’ అని కేజ్రీవాల్ ఆరోపించారు. -
ఇది శ్రీదేవి చేసిన పని కాదు..!
‘‘శ్రీదేవి అంటే నాకు ఆరాధన, మర్యాద ఉన్నాయి. తన నుంచి నోటీసు రావడం నన్ను బాధపెట్టింది. ఇది శ్రీదేవి చేసిన పని కాదు. స్వార్థ ప్రయోజనాలకోసం ఇతర వ్యక్తులు చేయించిన పని ఇది. ఆమె పరువు పోయే విధంగా ఈ చిత్రం ఉండదని నా మనసుకు తెలుసు. ఆ విషయాన్ని సినిమా నిరూపిస్తుంది’’ అని చెప్పారు రామ్‌గోపాల్‌వర్మ. ‘సావిత్రి’ పేరుతో సినిమా తీస్తున్నానని ప్రకటించి, ప్రచార చిత్రాల ద్వారా వివాదాలపాలై, ఆ తర్వాత టైటిల్‌ని ‘శ్రీదేవి’గా వర్మ మార్చిన విషయం తెలిసిందే. ఇది అభ్యంతరకర చిత్రం అనిపిస్తోందంటూ వర్మకు శ్రీదేవి లీగల్ నోటీస్ పంపించారు. ఈ నోటీసుకు వర్మ స్పందిస్తూ - ‘‘వివాదాలు రేగిన కారణంగా నేను ‘సావిత్రి’ టైటిల్ మార్చలేదు. వేరే నిర్మాత నమోదు చేసి ఉన్నందున ‘శ్రీదేవి’గా మార్చాను. గత ఐదేళ్లల్లో నటి శ్రీదేవిపై నాకున్న ఇష్టాన్ని నేను బహిరంగంగా చెప్పడాన్ని కామెడీగాను, హెల్దీ స్పిరిట్తోను తీసుకున్నారు. అయితే, ఇప్పుడు ‘శ్రీదేవి’ టైటిల్ ప్రకటించడంతో ఆమె గురించి నేను మాట్లాడిన మాటలకు, ఈ చిత్రానికి సంబంధం ఉంటుందని భావిస్తున్నారు. ఓ 25ఏళ్ల యువతిపై ఆకర్షణ పెంచుకునే టీనేజ్ కుర్రాడి కథతో ఈ చిత్రం ఉంటుంది. టైటిల్ రోల్ చేస్తున్న పాత్రధారి ఈ చిత్రంలో సినిమా నటి కాదు.. ఆ అబ్బాయి దర్శకుడు కాదు. పైగా, ఇద్దరి మధ్య వయసు వ్యత్యాసం చాలా ఉంది. కాబట్టి శ్రీదేవి అనుకుంటున్నట్లు ఇది అభ్యంతర కథ కానే కాదు. ఆంధ్రప్రదేశ్ చలన చిత్ర వాణిజ్య మండలి ఈ టైటిల్‌ని ఆమోదించింది. గత రెండు దశాబ్దాల్లో ఇదే టైటిల్‌తో కనీసం మూడు సినిమాలైనా వచ్చి ఉంటాయి. చలన చిత్ర వాణిజ్య మండలికి ఎలాంటి అభ్యంతరం లేదు. దీని గురించి బోనీకపూర్ ఫోన్ చేసి, వివరణ కోరితే, నేనిదే చెప్పాను. ఆ తర్వాత ప్రెస్‌కి ఇచ్చిన నోట్‌ని మెసేజ్ పంపించాను’’ అన్నారు. -
రేవంత్ రెడ్డికి రూ. 90 కోట్లకు లీగల్ నోటీసులు
హైదరాబాద్ : టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి మై హోం కన్స్ట్రక్షన్స్ రామేశ్వరరావు లీగల్ నోటీసులు ఇచ్చారు. రేవంత్ రెడ్డి తనపై చేసిన ఆరోపణల వల్ల పరువు నష్టం కలిగిందంటూ రూ.90 కోట్లుకు లీగల్ నోటీసులు ఇచ్చారు. మరోవైపు రేవంత్ రెడ్డి లీగల్ నోటీసులపై స్పందిస్తూ తన ఆరోపణలకు ఇంకా కట్టుబడి ఉన్నానన్నారు. లీగల్ నోటీసులపై న్యాయపోరాటం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కాగా మెట్రో రైలు ప్రాజెక్టు భూమిని ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం చేస్తున్నారంటూ రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. మెట్రో భూమిని రామేశ్వరరావు భాగస్వామిగా ఉన్న ఆక్వా స్పేస్ డెవలపర్స్‌కు ఇచ్చారని టీడీపీ ఆరోపించగా... అదేమీ లేదని, తమ భూమి తమ వద్దనే ఉందని ఎల్అండ్టీ వివరణ ఇచ్చింది. అయినా తగ్గని టీడీపీ.. రామేశ్వర్‌రావుకు కేసీఆర్ ప్రభుత్వం లబ్ధి చేకూర్చిందని, బహిరంగ చర్చకు రావాలని సవాళ్లకు దిగింది. దీనికి ప్రతిగా టీడీపీపై టీఆర్ఎస్ నేతలు విమర్శలు చేసుకున్న విషయం తెలిసిందే. -
నా కొడుకును రాహుల్‌కు దత్తత ఇవ్వలేదు: ప్రియాంక
న్యూఢిల్లీ: తన కుమారుణ్ని సోదరుడు రాహుల్ గాంధీకి దత్తత ఇచ్చినట్టుగా వచ్చిన వార్తలను ప్రియాంక గాంధీ ఖండించారు. ఈ వార్తను ప్రచురించిన ఓ వీక్లి, మరికొన్ని మీడియా సంస్థలకు లీగల్ నోటీసులు పంపారు. ఇవన్నీ తప్పుడు కథనాలని, కుమారుడి పరువుకు భంగం కలిగేలా కుటుంబంపై తప్పుడు ఆరోపణలు చేయడాన్ని ప్రియాంక తీవ్రంగా పరిగణిస్తున్నట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. సంబంధిత మీడియాపై క్రిమినల్ చర్యలు తీసుకుంటానని హెచ్చరించినట్టు సమాచారం. రాహుల్ గాంధీ తన సోదరి ప్రియంక గాంధీ, రాబర్ట్ వాద్రా దంపతుల కొడుకు రెహాన్‌ను దత్తత తీసుకున్నట్టు వార్తలు వెలువడ్డాయి. తద్వరా రెహాన్ ఇంటిపేరును గాంధీగా మార్చాలని భావిస్తున్నట్టు కాంగ్రెస్ అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపినట్టు ఆ పత్రికలు కథనాలు ప్రచురించాయి. కాగా ఈ కథనాలను ప్రియాంక తోసిపుచ్చారు. -
పవన్‌కు హరీశ్‌రావు లీగల్ నోటీసు
హైదరాబాద్: సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్యనారాయణతో కలిసి హరీశ్‌రావు కేబుల్ వ్యాపారాలు చేస్తున్నారన్న సినీనటుడు పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై... ఆయనకు టీఆర్ఎస్ నేత హరీశ్‌రావు లీగల్ నోటీసు ఇచ్చారు. పవన్ చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, దీనిపై పవన్ కల్యాణ్ క్షమాపణ చెప్పాలని అందులో పేర్కొన్నారు. ఈ నెల 26న పవన్ వరంగల్ సభలో మాట్లాడుతూ... ‘‘తెలంగాణకు వ్యతిరేకిగా చెప్పే బొత్స సత్యనారాయణతో హరీశ్‌రావుకు ఏం పని. ఆయనతో కలిసి కేబుల్ వ్యాపారాలు ఎందుకు చేస్తున్నారు? మీరు తెలంగాణకు ఏం న్యాయం చేస్తారు?’’ అంటూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలు తన పరువు కు భంగం కలిగించే విధంగా ఉన్నాయని, దీనిపై పవన్ రెండు రోజుల్లో క్షమాపణ చెప్పకపోతే.. సివిల్, క్రిమినల్ చర్యలు చేపడతానని హరీశ్ హెచ్చరించారు. -
పవన్ కళ్యాణ్‌కు హరీష్‌రావు లీగల్ నోటీస్
హైదరాబాద్: సినిమా హీరో, జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు టిఆర్ఎస్ నేత హరీష్ రావు లీగల్ నోటీసు పంపారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో హరీష్ రావుకు వ్యాపార సంబంధాలున్నట్లు రెండు రోజుల క్రితం పవన్ ఆరోపించారు. తనపై చేసిన ఆరోపణలకు 24 గంటల్లో ఆధారాలు చూపకపోతే పరువు నష్టం దావా వేస్తానని హరీష్ నిన్న హెచ్చరించారు.హరీష్ హెచ్చరికకు పవన్ కళ్యాణ్ నుంచి ఎటువంటి సమాధానంలేదు. దాంతో ఆయన ఈరోజు లీగల్ నోటీసు పంపారు. ఇదిలా ఉండగా, నిజామాబాద్ కోర్టు ఆదేశాల మేరకు పవన్ కల్యాణ్‌పై డిచ్పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావుపై పవన్ కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని న్యాయవాది రవి కుమార్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు దర్యాప్తు చేయమని న్యాయస్థానం పోలీసులను ఆదేశించింది. దాంతో ఐపీసీ 153-ఏ, 506 సెక్షన్ల ప్రకారం పవన్ కళ్యాణ్‌పై నిజమాబాద్ జిల్లా డిచ్‌పల్లిలో కేసు నమోదు చేసినట్లు సిఐ వెంకటేశ్వరరావు చెప్పారు. -
సల్మాన్ కు నోటీస్ ఇచిన AR రహ్మాన్